Mass Maharaja: Ravi Teja Ramarao On Duty Shooting In Maredumilli Forest - Sakshi
Sakshi News home page

మారేడుమిల్లి అడవుల్లో రామారావు..ఆన్‌ యాక్షన్‌

Published Mon, Nov 8 2021 8:08 AM | Last Updated on Mon, Nov 8 2021 8:38 AM

Ravi Tejas Ramarao On Duty Shoting In Maredumilli Forest - Sakshi

అడవిలో ఫైట్స్‌ చేస్తున్నారు రామారావు. మరి.. రామారావు పోరాటం ఎందుకు అనేది తెలియాలంటే కొంత కాలం వేచి ఉండక తప్పదు. రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’. ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మారేడుమిల్లి అటవీ పాంత్రాల్లో జరుగుతోంది.

థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం విదేశాలకు వెళుతుంది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: సామ్‌ సీఎస్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement