రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి | Ravi Teja's Multiplex ART Opening Ceremony | Sakshi
Sakshi News home page

రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి

Published Tue, Apr 16 2024 8:00 AM | Last Updated on Tue, Apr 16 2024 8:54 AM

Raviteja Multiplex ART Opening Ceremony - Sakshi

మ‌హేష్‌ బాబు, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ రూట్‌లో  మాస్​ మహారాజ రవితేజ అడుగులు వేశారు. ఏషియ‌న్ గ్రూప్స్‌ వారితో థియేట‌ర్ బిజినెస్‌లోకి ఆయన ఎంట్రీ ఇచ్చేశారు. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోల లిస్ట్‌లో రవితేజ పేర్‌ టాప్‌లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భారీ బడ్జెట్‌ సినిమాలో దూసుకుపోతున్న రవితేజ హైద‌రాబాద్‌లోని దిల్‌షుక్‌న‌గ‌ర్‌లో ఆయన పేరుతో మ‌ల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు.

 ఏషియ‌న్ ర‌వితేజ (ART)పేరుతో భారీ మల్టీఫ్లెక్స్‌ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. తాజాగా ఆ బిల్డింగ్​ నిర్మాణానికి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. అందులో రవితేజ కుమార్తె మోక్షద పాల్గొన్నారు. ART సినిమాస్‌ పూజా కార్యక్రమంలో మోక్షద ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అభిమాన హీరో కుమార్తెను చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్‌ అధినేత సునీల్ నారంగ్ కూడా పాల్గొనడం విశేషం.  

మొత్తం ఆరు స్క్రీన్స్‌తో ఈ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ త్వరలో గ్రాండ్‌గా ఓపెన్‌ కాబోతుంది. ఇప్పటికే మ‌హేష్‌ బాబు (AMB), అల్లు అర్జున్‌ (AAA), విజ‌య్ దేవ‌ర‌కొండ (AVD) వంటి స్టార్స్‌తో సంయుక్తంగా ఏషియన్‌ గ్రూప్స్‌ భారీ మల్టీఫ్లెక్స్‌లను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రవితేజ (ART) చేరిపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement