Sunil Narang
-
ఏషియన్ గ్రూప్స్‌తో మరో స్టార్ హీరో మల్టీఫ్లెక్స్ ప్లాన్
టాలీవుడ్ హీరో నితిన్ వరుస సినిమాలతో కొద్దిరోజుల్లో సందడి చేయనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే ఆయన పెరిగారు. అందుకే తన సోదరి నిఖితతో కలిసి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌ను స్థాపించి పలు సినిమాలను కూడా నిర్మించారు. తాజాగా నితిన్ మరో అడుగు ముందుకు వేశారు. హైదరాబాద్‌లో మల్టీఫ్లెక్స్ థియేటర్‌ను స్థాపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్ పేజీ నుంచి ఒక ఫోటో విడుదలైంది.మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి స్టార్స్ ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని మల్టీఫ్లెక్స్‌లు నిర్మించారు. త్వరలో బెంగళూరులో AMB ప్రారంభం కానుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో రవితేజ ART కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే, హీరో నితిన్ కూడా సంగారెడ్డి ప్రాంతంలో ఏషియన్ నితిన్ సితార పేరుతో ఒక మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనకు సంబంధించిన ఫ్యాన్ పేజీలలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే థియేటర్ పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఓపెనింగ్ కానున్నట్లు సమాచారం.నితిన్ సినిమాల విషయానికి వస్తే.. తమ్ముడు త్వరలో విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కాంతార ఫేం సప్తమి గౌడ నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ లయ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్' చిత్రంలో కూడా నితిన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by N I T H I I N ✨⚡ (@teamnithiin_) -
మహేశ్ బాబు కొత్త మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమం ఫోటోలు వైరల్
బెంగళూరులో కొన్ని దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరించిన కపాలి సినిమా థియేటర్ 4 సంవత్సరాల క్రితం కూలగొట్టేశారు. గాంధీనగర్‌లో ఉన్న కపాలి థియేటర్ స్థానంలో AMB మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. ఈమేరకు నేడు ఏప్రిల్ 24న పూజా కార్యక్రమం నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అధికారికంగా విడుదల చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తన కుటుంబంతో సహా పాల్గొన్నారు.ప్రిన్స్ మహేశ్ బాబు ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో సంయుక్తంగా హైదరాబాద్‌లో AMB పేరుతో మల్టీప్లెక్స్‌ను నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని బెంగళూరుకు విస్తరించారు. ఇప్పుడు ఐదంతస్తుల భవనంలో అత్యంత అధునాతన టెక్నాలజీతో 5 నుంచి 6 మల్టీప్లెక్స్ స్క్రీన్లను అక్కడ ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌లో ఏఎమ్బి సినిమాస్ సక్సెస్ కావడంతో మహేశ్ బాబు ఆ చైన్‌ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. మూడేళ్ల క్రితమే బెంగళూరులో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. వాస్తవంగా అక్కడి మల్టీప్లెక్స్‌లలో కన్నడ సినిమాలకు తొలి ప్రాధాన్యం లభించదనే ఆరోపణ ఉంది. కానీ మహేశ్ బాబు మాత్రం అక్కడ తొలి ప్రాధాన్యం కన్నడ సినిమాలకు ఇవ్వాలని ఆయన సూచించినట్లు సమచారం. మరో కొద్దిరోజుల్లో బెంగళూరు AMB మల్టీప్లెక్స్‌లో ఫస్ట్ సినిమా పడనుందని యాజమాన్యం ప్రకటించింది. View this post on Instagram A post shared by AMB Cinemas (@amb_cinemas) -
రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి
మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ రూట్లో మాస్ మహారాజ రవితేజ అడుగులు వేశారు. ఏషియన్ గ్రూప్స్ వారితో థియేటర్ బిజినెస్‌లోకి ఆయన ఎంట్రీ ఇచ్చేశారు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోల లిస్ట్‌లో రవితేజ పేర్ టాప్‌లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలో దూసుకుపోతున్న రవితేజ హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఆయన పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఏషియన్ రవితేజ (ART)పేరుతో భారీ మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. తాజాగా ఆ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. అందులో రవితేజ కుమార్తె మోక్షద పాల్గొన్నారు. ART సినిమాస్ పూజా కార్యక్రమంలో మోక్షద ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అభిమాన హీరో కుమార్తెను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ కూడా పాల్గొనడం విశేషం. మొత్తం ఆరు స్క్రీన్స్‌తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలో గ్రాండ్‌గా ఓపెన్ కాబోతుంది. ఇప్పటికే మహేష్ బాబు (AMB), అల్లు అర్జున్ (AAA), విజయ్ దేవరకొండ (AVD) వంటి స్టార్స్‌తో సంయుక్తంగా ఏషియన్ గ్రూప్స్ భారీ మల్టీఫ్లెక్స్‌లను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రవితేజ (ART) చేరిపోయాడు. -
మహేశ్ బాబు నుంచి మరో మల్టీఫ్లెక్స్ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా?
బెంగళూరులో కొన్ని దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరించిన కపాలి సినిమా థియేటర్ 3 సంవత్సరాల క్రితం కూలగొట్టేశారు. గాంధీనగర్‌లో గతంలో కపాలి థియేటర్ ఉన్న స్థలంలో ఇప్పుడు ఒక మాల్‌ను నిర్మిస్తున్నారు. అక్కడ AMB మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. కపాలి సినిమా థియేటర్ స్థానంలో ఇప్పుడు మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ రావడం కన్నడ సినీప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ కన్నడ చిత్రసీమలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలకు సాక్షిగా నిలిచిన 'కపాలి' థియేటర్ నేలమట్టం కావడంతో కొంతమేరకు సినీజనాలను కలిచివేసింది. (ఇదీ చదవండి: అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన తండ్రి) కానీ కపాలి థియేటర్ కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించడంతో దానిని రీమోడల చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అంతిమంగా అక్కడ మల్టీప్లెక్స్‌లు నిర్మించడం జరిగిపోతుంది. ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో పాటు హైదరాబాద్‌లో AMB సినిమాస్ మల్టీప్లెక్స్‌లను నడుపుతున్నాడు. ఇప్పుడు వారు బెంగళూరులో కూడా AMB ప్లాన్ చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ కపాలి 1968లో సుబేదార్ చత్రం రోడ్డులో 44,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో కపాలి సినిమా నిర్మించబడింది. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ సినిమాను ప్రారంభించారు. కపాలి ప్రారంభంలో మొత్తం 1,465 సీట్లతో ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్లలో ఒకటి. కపాలి థియేటర్ యజమానులుగా ఉన్న దాసప్ప సోదరులు 4 సంవత్సరాల క్రితం థియేటర్ స్థలాన్ని బెల్గాం వ్యాపారికి విక్రయించారు. చివరకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జయన్న కపాలి సినిమాను లీజుకు తీసుకున్నారు. 5 సంవత్సరాల లీజు గడువు ముగిసిన తర్వాత థియేటర్ విక్రయించబడింది. కన్నడలోనే కాకుండా హిందీ, ఇంగ్లీషు సినిమాలు కూడా కపాలీ థియేటర్లో విడుదలయ్యాయి. డా. రాజ్‌కుమార్ నటించిన చాలా సినిమాలు ఈ థియేటర్లో విడుదలయ్యాయి. కపాలిలో శతదినోత్సవం జరుపుకున్న తొలి సినిమా 'మణ్ణిన మగ', హాలు జెను. ఈ సినిమాల విడుదల సందర్భంగా భారీ కటౌట్లను థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కటౌట్ ట్రెండ్ మొదలైంది. ఆ సినిమా 30 సార్లు విడుదల శివన్న-ఉపేంద్ర జంటగా నటించిన ‘ఓం’ సినిమా కపాలి థియేటర్లలో 30 సార్లు విడుదలైంది. రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'అపూర్వ రాగంగల్' కూడా ఇదే థియేటర్లో విడుదలైంది. మొదట్లో సీటింగ్ కెపాసిటీ 1,465 ఉండగా, తర్వాత 1,112కి తగ్గించారు. 2017లో విడుదలైన 'హులిరాయ' సినిమానే కపాలి థియేటర్లో చివరిగా ప్రదర్శించబడిన చిత్రం. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల దీనిని విక్రయించేశారు. 49 సంవత్సరాల తర్వాత క్లోజ్ దశాబ్దాల క్రితం గాంధీనగర్‌లో 10కి పైగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు సంతోష్, నర్తకి, త్రివేణి, అనుపమ థియేటర్లు మాత్రమే మిగిలాయి. 49 సంవత్సరాల తర్వాత, కపాలి థియేటర్ దాని తలుపులను శాశ్వతంగా మూసివేశారు. ఆ తర్వాత దానిని నేల మట్టం చేశారు. ఇప్పుడు అక్కడ పెద్ద ఐదంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది AMB సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభమవుతుందని పెద్ద హోర్డింగ్ కూడా నిలబెట్టారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో 5 నుంచి 6 మల్టీప్లెక్స్ స్క్రీన్లు అక్కడ రానున్నాయి. మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాకుండా ఎన్నో వెంచర్లలో పెట్టుబడులు పెట్టాడు. కొన్ని రోజుల క్రితమే సినిమా మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టాడు. కన్నడ సినిమాకు ప్రాధాన్యత హైదరాబాద్‌లో ఏఎమ్బి సినిమాస్ సక్సెస్ కావడంతో మహేష్ బాబు ఆ చైన్‌ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. మూడేళ్ల క్రితమే బెంగళూరులో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి మల్టీప్లెక్స్‌లలో కన్నడ సినిమాలకు తొలి ప్రాధాన్యం లభించకపోవడం బాధాకరం. కానీ మహేశ్ బాబు మాత్రం అక్కడ తొలి ప్రాధాన్యం కన్నడ సినిమాలకు ఇవ్వాలని ఆయన సూచించినట్లు సమచారం. -
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో ‘డీ 51’
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీర్వాదంతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నారాయణ్ దాస్ కె. నారంగ్ జయంతి సందర్భంగా గురువారం ‘డీ 51’ చిత్రం అప్డేట్ ఇచ్చారు. ‘‘డీ 51’లో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారు’’ అన్నారు నిర్మాతలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి సమర్పణ: సోనాలీ నారంగ్. -
'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని!
అక్కినేని అఖిల్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఎందుకో అదృష్టం కలిసి రావట్లేదు. ఏప్రిల్ చివర్లో 'ఏజెంట్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. విడుదలకు ముందు మంచి హైప్ ఏర్పడింది. కానీ మార్నింగ్ షో పడగానే టాక్ బయటకొచ్చేసింది. సినిమా తేలిపోయింది. దీంతో ఘోరంగా నష్టాలొచ్చాయి. ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా అందరూ మెల్లగా మర్చిపోతున్నారు. ఇలాంటి టైంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్.. 'ఏజెంట్'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అఖిల్ ఏజెంట్ చిత్ర హక్కుల్ని మేం తీసుకోవాలనుకున్నాం. నిర్మాతలను అడిగాం. కానీ ఆయనేమో భారీగా డిమాండ్ చేశారు. అంత రేటు వర్కౌట్ కాదులే అని.. మేం తీసుకోవట్లేదు. వేరే వాళ్లకు ఇచ్చేయండి అని చెప్పాం. నిజంగా ఈ విషయంలో దేవుడు మమ్మల్ని కాపాడాడు' అని నిర్మాత సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఈ వీడియో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఒకవేళ 'ఏజెంట్' హక్కుల్ని తీసుకుని ఉంటే భారీ మొత్తంలో ఆయనకు నష్టం వచ్చేదని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు థియేటర్లలోకి వచ్చి 50 రోజులు పైనే అవుతున్నా ఇంకా 'ఏజెంట్' ఓటీటీలోకి రాలేదు. ఎడిటింగ్ చేసిన కొత్త వెర్షన్ ని జూన్ 23 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఫస్ట్‌లుక్.. ఇది గమనించారా?) -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
‘‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఎఫ్సీసీ) అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నవారికి కృతజ్ఞతలు. గత ఏడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ అసోసియేషన్‌కి పూర్తి సమయం కేటాయించలేకపోయాను.. ఈ ఏడాది కచ్చితంగా సమయం కేటాయించి అందరితో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను’’ అని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన ‘తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి’ పాలక మండలిని శనివారం ప్రకటించారు. ‘టీఎస్ఎఫ్సీసీ’ అధ్యక్షునిగా సునీల్ నారంగ్ ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా వీఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి, సెక్రటరీగా కె. అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్ తడ్ల, ట్రెజరర్‌గా చంద్ర శేఖర్ రావు ఎన్నికయ్యారు. అలాగే 15 మంది ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ–‘‘టీఎస్ఎఫ్సీసీ’ పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. అందరూ చిత్ర పరిశ్రమ, కార్మికుల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి’’ అన్నారు. ఇంకా నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడారు. -
మాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తున్న రానా
టాలీవుడ్ హీరో రానా, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రానా, వరుణ్ ధావన్ హీరోలుగా నటించడం లేదట. వరుణ్ ధావన్ హీరోగా రానా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ చిత్రం నిర్మాణంలో రానాతో పాటు సునీల్ నారంగ్ కూడా భాగస్వామ్యులు అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో రానా ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఇలా గతంలోనూ రానా పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు రానా. ప్రస్తుతం హీరోగా రానా చేతిలో ఉన్న చిత్రాల్లో ‘రాక్షసరాజు’ (వర్కింగ్ టైటిల్) ఒకటి. ‘నేనే రాజు నేను మంత్రి’ చిత్రం తర్వాత దర్శకుడు తేజ–రానా కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. -
సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం
హైదరాబాద్‌లోని కాచిగూడ తారకరామ థియేటర్ పున:ప్రారంభానికి సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులు జరుపుకొంటున్న ఈ థియేటర్ కొత్త హంగులతో ముస్తాబైంది. ఏషియన్ తారకరామ పేరుతో డిసెంబర్ 14న ఈ థియేటర్ గ్రాండ్‌గా రీఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై థియేటర్ పున:ప్రారంభించనున్నారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటులు నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ కె దాస్ నారంగ్ ఈ థియేటర్‌కు మరమ్మతులు చేపట్టారు. తాజాగా అవి పూర్తయ్యాయి. నారంగ్ దాస్ తనయుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్‌ను రెనొవేట్ చేయించారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెక్లైనర్, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునః ప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ. భరత్ నారంగ్, సురేశ్ బాబు సదానంద గౌడ్లు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్ పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసినట్టేనా? యామీ గౌతమ్ ఏమన్నదంటే.. -
Sivakarthikeyan: ‘హూ యామ్ ఐ..’
శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రిన్స్’. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హూ యామ్ ఐ..’ (నేనెవరు) అనే పాటని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని డింకర్ కల్వల పాడారు. ‘‘కంప్లీట్ ఎంటర్టైనర్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాత: అరుణ్ విశ్వ. -
మిడిల్‌క్లాస్ వాళ్లకోసమే.. ఘోస్ట్ టికెట్ రేట్లు తగ్గించాం: నిర్మాత
‘‘వందకి ఎనభైశాతం మంది మధ్యతరగతి ప్రేక్షకులే సినిమాలు చూస్తారు. వారు లేకుంటే ఇండస్ట్రీ లేదు.. అందుకే మిడిల్‌క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకునే ‘ది ఘోస్ట్’ టికెట్ ధరలు నిర్ణయించాం’’ అని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సునీల్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘నాన్నగారితో(నారాయణ్ దాస్) ఉన్న అనుబంధంతో నాగార్జునగారు ఈ సినిమా చేసినందుకు థ్యాంక్స్. ప్రవీణ్ సత్తారు అద్భుతంగా తీశాడు. ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు.. రెండు వారాల తర్వాత ఓటీటీలో వస్తుందని అనుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో టికెట్ ధర పెట్టి సినిమా చూసేందుకు ఇష్టపడటం లేదు. సినిమా చాలా బాగుందనే టాక్ వస్తే తప్ప థియేటర్‌కి వెళ్లడం లేదు. అలాగే టికెట్, క్యాంటీన్లో ధరలు కూడా తగ్గితే చిన్న సినిమాకి కూడా ప్రేక్షకులు మునుపటిలా థియేటర్‌కి వస్తారు. ఓటీటీని నియంత్రించాలనే చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. పుస్కూర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ– ‘‘గ్రేట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’. నాగార్జున కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రమిది. సంక్రాంతిలానే దసరా కూడా సినిమా పండగ. రెండు పెద్ద చిత్రాలు (గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్) రావడం ప్రేక్షకులకు సినిమా పండగలా ఉంటుంది. మా సినిమా తొమ్మిదిరోజులు బాగా ఆడితే చాలు.. ఈ నెల 14వ తారీఖు వరకూ.. ఇక నాగార్జునగారి ట్రెండ్ సెట్టర్ ‘శివ’ కూడా అక్టోబర్ 5 విడుదలయింది. ఆ సెంటిమెంట్ ప్రకారం అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం మా బ్యానర్లో రూపొందిన ‘ప్రిన్స్’ దీపావళికి విడుదలవుతుంది. సందీప్ కిషన్‌తో ఓ సినిమా, సుధీర్ బాబుతో ఒక మూవీ, శేఖర్ కమ్ముల– ధనుష్ కాంబోలో ఓ చిత్రం చే స్తున్నాం. అలాగే వెంకటేష్‌గారితో ఒక సినిమా ఉంటుంది’’ అన్నారు. -
The Ghost: నాగ్ కోసమే కథ రాశా.. రొమాన్స్ ఉంటుంది: ప్రవీణ్ సత్తారు
‘‘నా దృష్టిలో సినిమా తీయడం అంటే సినిమా చరిత్రలో ఓ పేజీ రాయడంలా భావిస్తాను. అలా ఆ చరిత్రలో ‘ది ఘోస్ట్’ ఓ పేజీ. వెయ్యి సంత్సరాల తర్వాతే కాదు.. మనం చనిపోయిన తర్వాత కూడా సినిమా చరిత్రలో ఆ పేజీ ఉంటుంది. అందుకే ఈ పేజీని చాలా జాగ్రత్తగా రాయలన్న భయం, బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది’’ అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. సునీల్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రవీణ్ సత్తారు చెప్పిన విశేషాలు. ► నాగార్జునగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘ది ఘోస్ట్’ కథ రాశాను.. నాగార్జునగారు అద్భుతంగా చేశారు. ఇంటర్‌పోల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన ఆఫీసర్ విక్రమ్ పాత్ర చేశారు నాగార్జునగారు. ఈ చిత్రంలో 12 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సినిమాలోని చెల్లి, మేనకోడలు సెంటిమెంట్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రొమాన్సూ ఉంది. ► నాకు ‘గరుడవేగ’ సినిమా ఫ్లస్ అయ్యిందనే భావిస్తున్నాను. ఈ విషయంలో జీవితా రాజశేఖర్గార్లకు ధన్యవాదాలు. నేను మూడు సినిమాలు నిర్మించాను. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా చేయడం అనేది కొంచెం కష్టమే. నిర్మాతల కష్టాలు నాకు తెలుసు. నా తర్వాతి చిత్రం వరుణ్ తేజ్‌తో ఉంది. ఈ నెల 10న యూకేలో ఆ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. ► పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్‌ను చూసే సినిమా చూడాలా? వద్దా అని ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటున్న రోజులువి. సినిమా స్టాండర్డ్స్ విషయంలో తెలుగు ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అంటే ఎంటర్టైన్ చేయడమే. థియేటర్స్‌లో ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు వారు తమ మొబైల్ ఫోన్స్ మెసేజ్‌లను చెక్ చేసుకోనంత వరకు స్క్రీన్ పై ఏ జానర్ సినిమా ఉన్నా అప్పుడు అది హిట్టే. హిందీలో రిలీజ్ చేస్తాం – సునీల్ నారంగ్ ‘ది ఘోస్ట్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 7న రిలీజ్ అవుతుంది. ముందుగా హిందీ రిలీజ్ ప్లాన్ చేయలేదు. ఆ తర్వాత చేశాం. నాగార్జునగారు చాలా బాగా నటించారు. ప్రవీణ్ సత్తారు భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. కోవిడ్ వల్ల అనుకున్నదాన్ని కన్నా సినిమా బడ్జెట్ కాస్త పెరిగింది. -
సునీల్ నారంగ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ నటులు (ఫొటోలు)
-
ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి
ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్ నారంగ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూమార్తె జాన్వి వివాహ వేడుక గురువారం రాత్రి హైదబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధమిత్రుల సమక్షంలో ఆదిత్యతో జాన్వి ఏడడుగులు వేసింది. ఈ వివాహ మహోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్ హీరోలు సందడి చేశారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, దర్శకుడు శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, అనుదీప్, తమిళ హీరో శివకార్తికేయన్‌తో పాటు నిర్మాతలు సురేశ్ బాబు, సి. కల్యాణ్, నాగవంశీ, మిర్యాల రవీందర్‌రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: 10వ తరగతిలో సత్తాచాటిన సూర్య కూతురు, మార్కుల జాబితా వైరల్ అలాగే సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ సైతం ఈ వేడుకకు హజరయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా సునీల్ నారంగ్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఇటీవల ఈ బ్యానర్లో వచ్చిన లవ్‌స్టోరీ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో పలు ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల-ధనుశ్ కాంబినేషన్లోని ఓ చిత్రం కాగా.. అనుదీప్-శివ కార్తికేయ కాంబోలో రూపొందుతున్న ప్రిన్స్ మూవీ. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
ఆ సినిమా చూసి దర్శకుడు స్మోకింగ్ మానేశాడు: సూర్య
‘‘కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. మనుషుల జీవితాల్లోనూ మార్పులొచ్చాయి. జీవితంలో ఏయే అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయాలపై చాలామందికి ఓ క్లారిటీ వచ్చినట్లుంది. ఇంతకుముందు ఫ్యామిలీ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవాళ్లు ఇప్పుడు బాధ్యతగా ఉంటున్నారు. నా బంధువులు, స్నేహితుల్లో చాలామంది ఇప్పుడు ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నారు’’ అని సూర్య అన్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు) ఈ నెల 10న విడుదల కానుంది. సునీల్ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య చెప్పిన విశేషాలు. ► ఒక పుస్తకం పూర్తిగా చదవాలంటే రెండుగంటల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. అయితే రెండు గంటల సమయంలోనే సినిమా ద్వారా ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవచ్చు. అందుకే సినిమా అనేది స్ట్రాంగ్ మీడియమ్ అని నా నమ్మకం. అలాగే సినిమాలు మన జీవితాలను ప్రభావితం చేయగలవని నమ్ముతున్నాను. ‘వారనమ్ ఆయిరం’ (తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’) సినిమా చూసి స్మోకింగ్ మానేసినట్లుగా దర్శకుడు వెట్రిమారన్ ఓ సందర్భంలో చెప్పారు. హిందీ సినిమా ‘గెహరాయియా’ క్లైమాక్స్‌లో వచ్చే ఓ డైలాగ్ నా ఆలోచనల్లో, నా వ్యక్తిగత జీవితంలో మార్పు తీసుకువచ్చింది. అలా ‘ఈటీ: ఎవరికీ తలవంచడు’ చిత్రంలోని అంశాలు కొందరిలో మార్పు తేవడంతో పాటు ప్రతి ఇంట్లోనూ చర్చించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ► ప్రతి నగరంలో జరిగే ఘటనలే ఈ సినిమాలో చూపించాం. మన ఇంట్లోని మహిళల పట్ల మన ప్రవర్తన, వ్యవహారశైలి ఎలా ఉండాలి? అనే విషయాలను చెప్పే ప్రయత్నం చేశాం. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా అమ్మాయిలకే చెబుతాం. అబ్బాయిలకు ఎందుకు చెప్పకూడదు? ఈ బ్యాలెన్స్ ఎక్కడ మిస్ అవుతోంది? భార్యాభర్తలు గొడవ పడితే.. భార్యను కాస్త తగ్గమని ఆమె పుట్టింటివారు కూడా చెబుతుంటారు. ఎందుకలా? ఇలాంటి అంశాలను ప్రస్తావించాం. ► ‘నేను హీరో’ అనే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే ‘సూరరై పోట్రు’, ‘జై భీమ్’ వంటి సినిమాలను చేయగలను. ‘‘ట్రైబల్ బ్యాక్‌డ్రాప్, పెద్దగా సాంగ్స్, ఫైట్స్ లేవు. సెంట్రల్ క్యారెక్టర్ కూడా నీది కాదు. ‘జై భీమ్’ చేయొద్దు’’ అని నాకు చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ చేశాను. ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’!), ‘జై భీమ్’ చిత్రాలు నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. మరిన్ని విభిన్నమైన సినిమాలు చేయాలనే తపనను నాలో కలిగించాయి. ‘ఆకాశం నీ హద్దురా’లో పెద్దగా స్టంట్ సీక్వెన్స్ లేవు. ‘జై భీమ్’ చిత్రంలో లవ్, సాంగ్ సీక్వెన్స్‌లు అవసరం పడలేదు. అయినా ‘జై భీమ్’ చిత్రం చాలామందిలో ఓ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సమాజానికి ఉపయోగపడే సినిమాలు మరిన్ని వచ్చేలా ప్రేరేపించిందని అనుకుంటున్నాను. ప్రతి సినిమా కూడా మన సమాజాన్ని, వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసేలా ఉండాలనే కోరుకుంటాను. ఎప్పుడూ ఫ్యాంటసీ, భారీ కమర్షియల్ చిత్రాలే కాదు.. సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే సినిమాలూ రావాలి. ► ఒకప్పుడు రంగస్థల నటులు వేదికలపై వినోదాన్ని పంచేవారు. ఆ తర్వాత థియేటర్స్ వచ్చాయి. ఆ తర్వాతి తరంలో టెలివిజన్ల ప్రభావం పెరిగింది. ఇప్పుడు ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. ఉదాహరణకు నా పిల్లలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్‌నే చూస్తున్నారు. ఇలాంటి మార్పులను మనం ఆపలేం. జాగ్రత్తగా డీల్ చేయాల్సిందే. కానీ ఎలాంటి కంటెంట్ టీవీల్లో రావాలి? ఏ విధమైన కంటెంట్ థియేటర్స్‌లో ఉండాలి? ఏ రకమైన కంటెంట్ ఓటీటీకి కరెక్ట్ అనే అంశాలపై మరింత అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. మంచి సినిమా అయినా థియేటర్స్‌లో మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అదే ఓటీటీలో అయితే వ్యూయర్స్ వారికి వీలైన టైమ్‌లో ఆ సినిమాను చూడగలిగే వీలుంటుంది. అలాగే కొత్త ఆడియన్స్ వస్తున్నారు. ఓటీటీ వల్ల సినిమాను ఎక్కువమంది చూడగలుగుతున్నారు. ఇండస్ట్రీ కూడా పెరుగుతోంది. ► ‘జై భీమ్’ చిత్రం ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లడం, ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది. ఆస్కార్ బరిలో నిలవడం అనేదానికి ఓ ప్రాసెస్ ఉంటుంది. ఒక సినిమా ఆస్కార్‌కి వెళ్లాలంటే యూఎస్‌లోని ఐదారు రాష్ట్రాల్లో స్క్రీనింగ్ జరగాలి. అక్కడి థియేటర్స్‌లో కనీసం వారం రోజుల ప్రదర్శన ఉండాలి. అయితే కరోనా వల్ల డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను కూడా ఈసారి పరిశీలనలోకి తీసుకున్నారు. నిజానికి మేం స్పెషల్ కేటగిరీలో అప్లై చేయాల్సింది. జనరల్ కేటగిరీలో చేశాం. ► బాలాగారి దర్శక త్వంలో నా తర్వాతి సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ నెక్ట్స్ వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్న ‘వాడివాసల్’ సినిమా షూటింగ్‌ని స్టార్ట్ చేస్తాం ‘ఈటీ’లో యాక్షన్, ఫైట్స్, కామెడీ.. ఇలా అన్నీ ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇంతకుముందు ఎవరూ ప్రస్తావించని, మన ఇంట్లో మనం చర్చించుకోవడానికి సంకోచించే ఓ కొత్త అంశాన్ని చిన్న సందేశంగా చెప్పే ప్రయత్నం చేశాం. మహిళల జీవితాల్లోని అంశాల గురించే ఈ సినిమా ఉంటుంది. -
ఎవరో ఏదో మాట్లాడితే పరిశ్రమకు సంబంధం లేదు: నిర్మాత
-
పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయకండి: దిల్ రాజు
సాక్షి, మచిలీపట్నం: సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని చెప్పారు. చదవండి: పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి అన్నారు: పేర్ని నాని ‘గతంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి సీఎం జగన్‌ను కలిశాం. మా విజ్ఙప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా అనేది చాలా సున్నితమని, ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుంది. అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరుతున్నా. టికెట్లు ఆన్లైన్ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. చదవండి: Tollywood Producers Meet: సినీ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చొరవ అలాగే నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. రాజకీయం వేరు.. సినిమా పరిశ్రమ వేరని స్పష్టం చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే.. తమకు సంబంధం లేదని ప్రకటించారు. థియేటర్లో 100 శాతం ఆక్యూపెన్సీ పెరగాలనేదే తమ ఉద్దేశమని, టికెట్లను ఆన్లైన్ చేయమని అడిగింది తామేనని గుర్తుచేశారు. -
ఆకట్టుకుంటున్న‘అహం బ్రహ్మస్మి’ ట్రైలర్
రజత్ రాఘవ్, మౌనిమ, అభయ్ బేతగంటి, చాందినీరావు, సాయి కేతన్ రావు, కృష్ణతేజ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘అహం బ్రహ్మస్మి’. 11భాగాలుగా రాబోతోన్న ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందింది. లెటర్ బాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సిరీస్ కు సిద్ధార్థ్ పెనుగొండ దర్శకత్వం వహిస్తున్నారు. అహం బ్రహ్మస్మి ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. టీజర్ ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన వై రవికుమార్ గారు చేతుల మీదుగా విడుదలైంది. ఇక ట్రైలర్ ను సీనియర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఏసియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణదాస్ నారంగ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సిరీస్ యూనిట్ సభ్యులు మాట్లాడుతూ..‘సింపుల్ గా చెబితే ఇదో వెబ్ గేమింగ్ నేపథ్యంలో రూపొందిన సిరీస్. ఆడిన ప్రతి ఒక్కరూ ఆ గేమ్ లో విన్ అవ్వాలి. గెలిచిన వారికి భారీ అమౌంట్ వస్తుంది. ఒక వేళ లాస్ అయితే వారికి బాగా నచ్చినవారి ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. మరి ఇంత డేంజరస్ గా ఉన్న ఈ గేమ్ ను ఆపేందుకు లోకల్ డిటెక్టివ్స్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో చోటు చేసుకున్న సంఘటనలు, పరిణామాలూ ఏంటనేది అనూహ్యమైన మలుపులతో.. ఆద్యంతం అద్భుతమనిపించే స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిన సిరీసే ఈ అహం బ్రహ్మస్మి’ అని అన్నారు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 18నుంచి అమెజాన్ ప్రైమ్(యూ.ఎస్), అమెజాన్ ప్రైమ్(యూ. కే), ఎమ్.ఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్, విఐ వంటి పలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి స్ట్రీమ్ కాబోతోంది. -
‘లవ్‌స్టోరీ’కి 10 ఓటీటీ ఆఫర్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Love Story Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘లవ్‌స్టోరీ’ ఒకటి. ఫిదా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.ఇటీవల విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో రాబోతుందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. దీనిపై తాజాగా నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ స్పందించారు. ఈ సినిమాకు ఏకంగా 10 ఓటీటీ ఆఫర్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఐతే తమ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏ ఓటీటీకీ సినిమాను ఇవ్వలేదని ఆయన చెప్పారు. బిగ్ స్క్రీన్లలోనే ఈ సినిమా చూస్తారని నారంగ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. జూలై 30న ‘లవ్‌స్టోరీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
కొత్త నాగశౌర్యను చూస్తారు
నాగశౌర్య హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సోమవారం కొబ్బరికాయ కొట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారాయణదాస్ నారంగ్, శరత్‌మరార్, రామ్మోహన్రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్రావుగార్లతో కలిసి నాగశౌర్యతో సినిమా నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక స్పోర్ట్ బేస్డ్ మూవీ. కథ అద్భుతంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘సునీల్‌గారు, శరత్ మరార్గారి కాంబినేషన్లో నా సినిమా ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్ రెండో చిత్రమిది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘క్రీడా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఒక ఊహాజనిత బయోపిక్‌లా ఉంటుంది. నాకు మంచి మైలేజ్ ఇచ్చే మూవీ అవుతుంది. ఇందులో సరికొత్త నాగశౌర్యని చూస్తారు’’ అన్నారు సంతోష్ జాగర్లపూడి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి. -
నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్
బ్రేక్ లేకుండా నెల పాటు షూటింగ్ చేయనున్నారట నాగచైతన్య. సాయిపల్లవితో కలిసి హైదరాబాద్ పరిసరాలను చుట్టేయనున్నారట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ సినిమా రూపొందనుంది. ప్రేమకథగా తెర కెక్కనున్న ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 14నుంచి ప్రారంభం కానుంది. వరుసగా 30 రోజులపైనే ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ఈ షెడ్యూల్ మొత్తం హైదరాబాద్‌లోనే జరగనుందని తెలిసింది. మధ్యతరగతి ప్రేమకథగా ఈ చిత్ర కథాంశం ఉంటుందని సమాచారం. -
కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోన్న మహేష్..?
టాలీవుడ్లో సూపర్ స్టార్‌గా తిరుగలేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో మహేష్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా నటన మీదే దృష్టి పెట్టిన సూపర్ స్టార్, బిజినెస్‌ల జోలికి పెద్దగా వెళ్లలేదు. కానీ ఇటీవల శ్రీమంతుడు సినిమాతో తొలిసారిగా నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టి ఘనవిజయం సాధించాడు. అదే బాటలో ఇప్పుడు మరో భారీ బిజినెస్‌ను ప్లాన్ చేస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా థియేటర్ల బిజినెస్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏసియన్ సినిమా అధినేత సునీల్ నారంగ్‌తో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. తొలి ప్రయత్నంగా తెలుగు రాష్ట్రాల్లో 25 మల్టీప్లెక్స్‌లను నిర్మించాలని భావిస్తున్నాడు. ప్రొడక్షన్ తరహాలోనే థియేటర్ బిజినెస్‌లోనూ సూపర్ స్టార్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. -
పక్కా ప్రొఫెషనల్ !
యువతకు నచ్చే అంశాలకు వినోదం, సందేశం జోడించి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్... పక్కా ప్రొఫెషనల్’. స్వీయ దర్శకత్వంలో రఫీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. రఫీ మాట్లాడుతూ - ‘‘అన్ని రకాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అంశాలతో పాటు యువతకు నచ్చే రొమాన్స్ ఈ చిత్రంలో ఉంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు మా విన్నపాన్ని మన్నించి సమయానికి చిత్రం రిలీజ్ అయ్యేందుకు థియేటర్ల ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. సునీల్ నారంగ్ నేతృత్వంలో కమిటీ కూడా వేశారు. ఇందుకు ఛాంబర్ అధ్యక్షుడు సురేశ్ బాబు సహా కార్యవర్గమంతటికీ కృతజ్ఞతలు’’ అన్నారు.