
ధనుష్, శేఖర్ కమ్ముల
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీర్వాదంతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నారాయణ్ దాస్ కె. నారంగ్ జయంతి సందర్భంగా గురువారం ‘డీ 51’ చిత్రం అప్‌డేట్ ఇచ్చారు. ‘‘డీ 51’లో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారు’’ అన్నారు నిర్మాతలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి సమర్పణ: సోనాలీ నారంగ్.
Comments
Please login to add a commentAdd a comment