Rammohan Rao
-
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారేరీ?
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. వారి తరువాత జైపాల్‌రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారు. కానీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదు. ఫుల్‌టైం బిజినెస్‌లు చేసేవాళ్లు రాజకీయాల్లోకి పార్ట్‌టైంగా రావడమే ఇందుకు కారణం కావొచ్చు. ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదు’అని సీఎం పేర్కొన్నారు. మాజీ డీజీపీ, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్రావు రచించిన ‘గవర్నర్పేట్ టు గవర్నర్స్ హౌస్’పుస్తకావిష్కరణ ఆదివారం సాయంత్రం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగువారి అంశాల గురించి పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడేందుకు, విజ్ఞప్తి చేసేందుకు ఎవరూ కనపించని పరిస్థితి నెలకొందన్నారు. దేశ పరిపాలనలో మన పాత్ర ఉండాలి.. ‘జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. జాతీయ స్థాయిలో మన భాష రెండో స్థానంలో ఉన్నట్లుగానే దేశ పరిపాలనలో, నిర్ణయాల్లో మన పాత్ర ఉండాలి. గతంలో ప్రధాని పదవి ఉత్తరాది వారికి ఇస్తే రాష్ట్రపతి దక్షిణాది నుంచి అయ్యేవారు. ఇక్కడి వారు ప్రధాని అయితే ఉత్తరాది నేతకు రాష్ట్రపతి అవకాశం దక్కింది. అలాగే కేంద్ర కేబినేట్‌లోనూ గతంలో కనీసం ముగ్గురు కీలక మంత్రులు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేంద్ర కేబినెట్లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి కారణాలు విశ్లేషించి ఏం చర్యలు తీసుకోవాలన్నది అనుభవజు్ఞలైన రిటైర్డ్ అధికారులు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి సూచించాలి. విలువైన సలహాలు, సూచనలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జాతీయ స్థాయిలో మన ప్రాభవం చాటేలా మళ్లీ మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది’అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కీలక అంశాలతో మాజీ గవర్నర్ రామ్మోహన్రావు రాసిన పుస్తకం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారుతుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కీలక పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించా: రామ్మోహన్రావు తాను రచించిన పుస్తకం ఎన్నో వెలుగులోకి రాని చారిత్రక అంశాలకు వేదికగా నిలుస్తుందని తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మెహన్‌రావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కీలక పరిణామాలను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి రంగయ్య నాయుడు ఐపీఎస్ అధికారిగా, రాజకీయనాయకుడిగా తన అనుభవాలు, నాటి పరిస్థితులను పంచుకున్నారు. కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శశాంక్ గోయల్, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో ‘డీ 51’
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీర్వాదంతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నారాయణ్ దాస్ కె. నారంగ్ జయంతి సందర్భంగా గురువారం ‘డీ 51’ చిత్రం అప్డేట్ ఇచ్చారు. ‘‘డీ 51’లో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారు’’ అన్నారు నిర్మాతలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి సమర్పణ: సోనాలీ నారంగ్. -
అభివృద్ధిలో విశాఖ పోర్ట్ కీలకం..
-
కాపు రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు
-
The Ghost: నాగ్ కోసమే కథ రాశా.. రొమాన్స్ ఉంటుంది: ప్రవీణ్ సత్తారు
‘‘నా దృష్టిలో సినిమా తీయడం అంటే సినిమా చరిత్రలో ఓ పేజీ రాయడంలా భావిస్తాను. అలా ఆ చరిత్రలో ‘ది ఘోస్ట్’ ఓ పేజీ. వెయ్యి సంత్సరాల తర్వాతే కాదు.. మనం చనిపోయిన తర్వాత కూడా సినిమా చరిత్రలో ఆ పేజీ ఉంటుంది. అందుకే ఈ పేజీని చాలా జాగ్రత్తగా రాయలన్న భయం, బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది’’ అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. సునీల్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రవీణ్ సత్తారు చెప్పిన విశేషాలు. ► నాగార్జునగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘ది ఘోస్ట్’ కథ రాశాను.. నాగార్జునగారు అద్భుతంగా చేశారు. ఇంటర్‌పోల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన ఆఫీసర్ విక్రమ్ పాత్ర చేశారు నాగార్జునగారు. ఈ చిత్రంలో 12 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సినిమాలోని చెల్లి, మేనకోడలు సెంటిమెంట్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రొమాన్సూ ఉంది. ► నాకు ‘గరుడవేగ’ సినిమా ఫ్లస్ అయ్యిందనే భావిస్తున్నాను. ఈ విషయంలో జీవితా రాజశేఖర్గార్లకు ధన్యవాదాలు. నేను మూడు సినిమాలు నిర్మించాను. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా చేయడం అనేది కొంచెం కష్టమే. నిర్మాతల కష్టాలు నాకు తెలుసు. నా తర్వాతి చిత్రం వరుణ్ తేజ్‌తో ఉంది. ఈ నెల 10న యూకేలో ఆ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. ► పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్‌ను చూసే సినిమా చూడాలా? వద్దా అని ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటున్న రోజులువి. సినిమా స్టాండర్డ్స్ విషయంలో తెలుగు ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అంటే ఎంటర్టైన్ చేయడమే. థియేటర్స్‌లో ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు వారు తమ మొబైల్ ఫోన్స్ మెసేజ్‌లను చెక్ చేసుకోనంత వరకు స్క్రీన్ పై ఏ జానర్ సినిమా ఉన్నా అప్పుడు అది హిట్టే. హిందీలో రిలీజ్ చేస్తాం – సునీల్ నారంగ్ ‘ది ఘోస్ట్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 7న రిలీజ్ అవుతుంది. ముందుగా హిందీ రిలీజ్ ప్లాన్ చేయలేదు. ఆ తర్వాత చేశాం. నాగార్జునగారు చాలా బాగా నటించారు. ప్రవీణ్ సత్తారు భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. కోవిడ్ వల్ల అనుకున్నదాన్ని కన్నా సినిమా బడ్జెట్ కాస్త పెరిగింది. -
క్రైమ్ స్టోరీ: తమ్ముడి హత్య.. అన్న టాక్సీలోనే నిందితులు.. ఊహించని ట్విస్ట్!
‘ఏరా తమ్ముడూ.. ఏంటి విషయం? పొద్దుటే ఫోన్ చేశావు?’ అంటూ హుషారుగా అడిగాడు రాజారావు. ‘సారీ అండి. నేను ఎస్సై అంబరీష్‌ని. కృష్ణ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను’ అన్న సమాధానం వినపడగానే షాక్ అయ్యాడు. ‘ఎస్సై గారా? ఏమయింది మా తమ్ముడికి? వాడి ఫోన్ మీకెలా..?’ అని అడుగుతుండగానే..‘చాలా దారుణం జరిగిపోయింది. కృష్ణను ఎవరో హత్య చేశారు’ అని చెప్పాడు ఎస్సై అంబరీష్. అంతే నెత్తిన పిడుగు పడినట్లయింది రాజారావుకి. కాస్సేపటివరకూ అతని నోటమ్మట మాట రాలేదు. కష్టం మీద గొంతుపెగల్చుకొని నీరసంగా అడిగాడు ‘ఎక్కడ? ఎప్పుడు?’ అంటూ. ‘నిన్న రాత్రి. టోల్‌గేట్‌కి అగనంపూడికి మధ్యలో సైడ్ రూట్లో’ అని సమాధానం ఇచ్చాడు ఎస్సై. ‘నేను స్టీల్‌ప్లాంట్‌లో ఉన్నాను. అరగంటలో వస్తాను’ చెప్పాడు రాజారావు తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ. ∙∙ కత్తిపోటుకి గురైన కృష్ణ్ణ ఒళ్ళంతా నెత్తురుతో తడిసిపోయి ఉంది. చూస్తూనే బిగ్గరగా ఏడుస్తూ మృతదేహంపై పడబోతున్న రాజారావుని ఆపి ‘సారీ.. ఏమీ అనుకోకండి. పంచనామా పూర్తికాలేదు. ఈ లోగా ఎవరూ శవాన్ని ముట్టుకోకూడదు’ అంటూ అపాలజీ చెప్పాడు అంబరీష్. చాలాసేపటి వరకూ తేరుకోలేకపోయాడు రాజారావు. అప్పటివరకూ ఓపిగ్గా వేచిఉన్న అంబరీష్, ‘సారీ.. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. మీ తమ్ముడు ఎలాంటివాడు? అతనికి ఎవరయినా శత్రువులు ఉన్నారా?’ అంటూ రొటీన్ ప్రశ్నలు వేశాడు. ‘చాలా మంచివాడు సార్. చాలా చాలా నెమ్మదస్తుడు. నేనే కాస్త దూకుడుగా ఉంటాను. నాకు కోపం ఎక్కువ. అంత మంచి వాడిని ఇంత క్రూరంగా చంపడానికి, ఆ దుర్మార్గుడికి చేతులెలా వచ్చాయి?’ అని భోరున ఏడ్చాడు రాజారావు. అతనుచెప్పిన వివరాలను బట్టి, అన్నదమ్ములిద్దరూ ఆరేళ్ల క్రితం వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యారని, చెరో టాక్సీ నడుపుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిసింది. అన్నదమ్ముల స్వభావాలు పూర్తిగా భిన్నమని వాళ్ళను.. వాళ్ళ టాక్సీలను చూస్తూనే తెలుస్తోంది. కృష్ణకి శుభ్రత ఎక్కువ. రోజుకి మూడు నాలుగు సార్లయినా టాక్సీని రుద్ది రుద్ది శుభ్రం చేసుకుంటాడు. రాజారావుకి శుభ్రత బాగా తక్కువ. కృష్ణ చక్కగా షేవ్ చేసుకొని మంచి బట్టలు వేసుకుని నీట్‌గా తయారయితే, ఇతను మాత్రం మాసిన గెడ్డంతో, పెరిగిపోయిన చింపిరి జుట్టుతో, మాసిపోయిన చౌకబారు బట్టలు వేసుకొని ఉన్నాడు. అంబరీష్, రాజారావు మాట్లాడుకుంటుండగా సీఐ మహంకాళి అక్కడికి వచ్చాడు. ఎస్సై అతనికి సెల్యూట్ చేసి కేసు వివరాలు తెలియజేశాడు. ఆ తర్వాత కాళి తనదయిన శైలిలో దర్యాప్తు ప్రారంభించాడు. ఏదీ వదలకుండా అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. ఫోరెన్సిక్ టీమ్‌కి సహాయపడడం, శవాన్ని పోస్ట్ మార్టమ్‌కి పంపడం వగైరా బాధ్యతలను ఏఎస్సైకి అప్పజెప్పి స్టేషన్‌కి బయల్దేరారు కాళి, అంబరీష్‌లు. మధ్యాహ్నానికి గానీ కేసు ఒక కొలిక్కి రాలేదు. అప్పుడు చెప్పాడు సీఐ కాళి.. ‘నా అంచనా ప్రకారం సుమారు పదిగంటల ప్రాంతంలో ముగ్గురు పాసింజర్లను ఎక్కించుకొని, వైజాగ్ నుంచి బయల్దేరాడు కృష్ణ. ఒకడు డ్రైవర్ పక్కన సీట్లో, మిగిలిన ఇద్దరూ వెనుక సీట్లో కూర్చున్నారు. వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. నేషనల్ హైవే మీదుగా కారు నడుపుతున్న కృష్ణను బెదిరించి, పక్కదారికి మళ్ళించి ఉంటారు. హత్య.. రాత్రి పదకొండున్నర తర్వాత జరిగింది. హత్యకు ముందు పెద్ద గొడవే జరిగింది. అయితే శాంత స్వభావుడు అయిన కృష్ణను వాళ్లు ఎందుకు చంపవలసి వచ్చింది? ఆవిషయం తేలవలసి ఉంది’ అంటూ అతను ఒక నిమిషం ఆగగానే అందుకున్నాడు అంబరీష్ ‘మరోసారి మీరు గ్రేట్ అని రుజువు చేశారు సార్. హత్యకు ముందు గొడవ జరిగిందన్న విషయం ఊహించగలిగాను. ఎందుకంటే కృష్ణ బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి. శవం పక్కన అతని షర్ట్ బటన్స్ పడి ఉన్నాయి. అతని ఒంటి మీద గాయాలూ ఉన్నాయి. కానీ మిగతా వివరాలు ఎలా తెలుసుకున్నారో నాకు తట్టడం లేదు’ అన్నాడు. ‘దర్యాప్తు చేయడంలో నువ్వు మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఏ ఒక్క క్లూలనూ వదలకుండా తీవ్రంగా గాలించాలి. కృష్ణ.. టాక్సీ లోపల నాకు ఖాళీ గుట్కా పేకెట్, రెండు న్యూస్ పేపర్ ముక్కలు దొరికాయి. వాటిని నువ్వూ చూసే ఉంటావు. కానీ వాటిని పట్టించుకోలేదు. ఆ పేకెట్ తమిళనాడులో తయారయ్యింది. మన రాష్ట్రంలో ఆ పేకెట్లు దొరకవని, మన వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. ఇక న్యూస్ పేపర్ ముక్కలు తమిళ పేపర్‌కి సంబంధించినవి. వాటిని వాసన చూస్తే కరక్కాయ పొడి కలిపిన మందేదో పొట్లం కట్టడానికి వాటిని వాడారని తెలుస్తోంది. అది దగ్గుకు సంబంధించిన మందు కావచ్చు. కేవలం గంట, గంటన్నర ప్రయాణంలో రెండు సార్లు ఆ మందు వేసుకున్నాడంటే ఆ మనిషికి దగ్గు ఎక్కువగా వస్తుందని భావించవచ్చు. అది అల్లోపతీ మందు కాదు, ఇక్కడ దొరక్కపోవచ్చు. కాబట్టి అది వాడుతున్న వాడు సొంత ఊరి నుంచే తెచ్చుకొని ఉండాలి. ఆ సొంత ఊరు తమిళనాడులోనే ఉండాలి. కారులో ఉన్న మేట్ మీద అస్పష్టంగా స్టోన్ క్రషర్ పౌడర్ కనిపిస్తోంది. వాళ్ళ చెప్పులకు అంటిన ఆ పౌడర్ అక్కడ రాలిందన్నమాట. ఆపౌడర్ ఉన్న చోట్లను బట్టి వాళ్ళెక్కడ కూర్చున్నారో ఊహించాను. రాజారావు చెప్పినదాన్ని బట్టి కృష్ణకు శుభ్రత ఎక్కువని తెలిసింది కదా? టాక్సీలో కనిపించిన గుట్కా పేకెట్, పేపర్ ముక్కలు, స్టోన్ క్రషర్ పౌడర్లకు కారణం పాత పాసింజర్లు కాదు. కచ్చితంగా ఆ ముగ్గురే వాటికి కారణం ’ అని చెప్పగానే కాళి సునిశిత పరిశీలనకు అబ్బురపడ్డాడు అంబరీష్. అదేమీ పట్టించుకోకుండా తన ధోరణిలో కొనసాగించాడు కాళి.. ‘కృష్ణ, లీలామహల్ దగ్గరున్న టాక్సీ స్టాండ్‌లో ఉండేవాడని చెప్పావు కదా? తమిళనాడు నుంచి వచ్చిన ముగ్గురు మనుషులు.. అక్కడికి దగ్గరలో ఉన్న ఏ లాడ్జ్లోనయినా దిగారేమో మనవాళ్ళను కనుక్కోమను. ఏదయినా లాడ్జ్ ముందున్న రోడ్డు మీద గుంతలను పూడ్చడానికి స్టోన్ క్రషర్ పౌడర్ వాడారేమో చూడమను. వాళ్ళను సులువుగా పట్టుకోవడానికి అదొక క్లూ. వాళ్ళు తమిళంలో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అది మరో క్లూ. పదకొండు ఇరవైకి కృష్ణ తన భార్యతో మూడు నిమిషాలు మాట్లాడాడని, అతని సెల్ఫోన్లో కాల్ హిస్టరీ చూస్తే తెలిసింది. అతని భార్యతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాను. దాన్ని బట్టే హత్య పదకొండున్నర తర్వాతే జరిగి ఉండాలని ఊహించాను. అయితే కృష్ణ హత్య అనుకోకుండా జరిగి ఉండొచ్చు. అతన్ని చంపాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదని, అతని చరిత్ర చెబుతోంది. అంతేకాక కేవలం అతన్ని హత్య చేయడం కోసం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారని అనుకోను. వాళ్ళ ప్లాన్ వేరే ఏదో ఉంది. మరెవరినయినా హత్య చేయడానికో లేదా బ్యాంక్ కొల్లగొట్టడానికో వచ్చి ఉంటారు. నా ఉద్దేశం ప్రకారం కొన్ని రోజులు, ఎక్కడయినా నక్కి ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమం చూసుకునుంటారు. అప్పటివరకూ వైజాగ్‌లో గానీ, పరిసరాలలోగానీ దాక్కునుంటారు. మనం గట్టిగా ప్రయత్నిస్తే దొరక్కపోరు. తప్పని పరిస్థితిలో వాళ్ళు అనుకున్న నేరం చేయడాన్ని వాయిదా వేసుకొని ఉంటారు. దానికి కారణాలు రెండు. మొదటిది.. చేతిలో వాహనం లేకపోవడం. రెండవది.. అప్పుడే హత్య చేసి తప్పించుకోవడం. హత్య జరిగిన తర్వాత, వాళ్ళు రోడ్డెక్కేసరికి పన్నెండు దాటి ఉంటుంది. తిరిగి వైజాగ్ వెళ్ళడానికి ఆ సమయంలో బస్సులేవీ ఉండవు కనుక ఏ లారీయో పట్టుకొని ఉంటారు. టోల్గేట్ సీసీ ఫుటేజ్ చూస్తే కొన్ని క్లూలు దొరకొచ్చు. ఆ ఫుటేజ్ తెప్పించు’ అని ఆర్డర్ వేసి, ఆ కేసు గురించే ఆలోచిస్తూ వెనక్కి వాలాడు కాళి.. కాస్తరిలాక్స్ అవడానికి. అతను అప్పజెప్పిన పనిని పూర్తి చేయడానికి బయల్దేరాడు అంబరీష్. ∙∙ అంబరీష్ తెచ్చిన సీసీ ఫుటేజ్ చూడగానే కాళి కళ్ళు మెరిశాయి.. ‘నా ఊహ నిజమయింది. ఇక్కడ చూడూ.. సుమారు ఒంటిగంట ప్రాంతంలో రికార్డ్ అయిన సీన్ ఇది. దీని ప్రకారం ముగ్గురు కుర్రాళ్ళు లారీలో ఇరుక్కొని కూర్చున్నారు. వారిలో నల్లగా ఉన్న వాడొకడు నోటికి చేయి అడ్డుపెట్టుకొని దగ్గుతున్నాడు. రెండవ వాడు తెల్లగా ఉన్నాడు. జుట్టు పూర్తిగా ఊడిపోయి దాదాపు గుండులా తయారయ్యింది. మూడో వాడు సన్నగా పొడవుగా ఉన్నాడు. అయితే ఈ ఫుటేజ్ సహాయంతో వాళ్ళను గుర్తుపట్టడం అంత సులువేమీ కాదు. మన ఆర్టిస్టుని పిలిపించి అన్ని ఏంగిల్స్‌లో వాళ్ళ ఊహా చిత్రాలను గీయమని చెప్పు. ఆ బొమ్మలను అన్ని స్టేషన్లకు పంపి, అందరినీ గాలించమని చెప్పు. వాళ్ళు ఎక్కిన లారీని ట్రేస్ చేయండి. ఆ డ్రైవర్‌ను పట్టుకుంటే వాళ్ళ పోలికలు తెలిసిపోతాయి. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొదలయినవి అర్థమైపోతాయి’ అన్నాడు హుషారుగా. అంబరీష్లోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. కేసు త్వరగానే సాల్వ్ అయిపోతుందనే ఆశ కలిగింది. తొందరగానే లారీని ట్రేస్ చేశారు పోలీసులు. డ్రైవర్ ద్వారా ఆ ముగ్గురి వివరాలూ తెలిశాయి. వాళ్ళను వైజాగ్‌లో ఎక్కడ దించాడో కూడా తెలిసింది. ‘ఇంకేముంది? వాళ్ళు దొరికిపోయినట్లే. నేరస్తులను పట్టుకోవడానికి బోలెడు క్లూలు ఉన్నాయి’ అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో గాలింపు మొదలుపెట్టారు పోలీసులు. వాళ్ళను పట్టుకున్నారన్న వార్తను వినడానికి అసహనంగా వెయిట్ చేస్తున్నారు ఇన్స్పెక్టర్లు. కానీ రోజులు గడుస్తున్నా ఏ ప్రోగ్రెస్ కనబడటం లేదు. వాళ్ళు దిగిన లాడ్జ్‌ను కనిపెట్టారు గానీ, అప్పటికే వాళ్ళు గది ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. రాజారావు రోజూ స్టేషన్‌కి వచ్చి కేసు విషయంలో ప్రోగ్రెస్ ఏమీ లేదని తెలుసుకొని బాధ పడుతూ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ∙∙ ఒకరోజు రాత్రి పదిగంటలు దాటిన తర్వాత రాజారావు నుంచి అంబరీష్‌కు ఫోన్ రావడంతో ఒక్కసారిగా కేసు మలుపు తిరిగింది. ‘సర్.. ఆ ముగ్గురూ ఇప్పుడు నా టాక్సీలోనే ఉన్నారు. అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్ళాలని చెప్పి సులభ్ కాంప్లెక్స్‌కి వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. అనకాపల్లి వెళ్లి రావడానికి ఐదువేలిస్తామని నాతో బేరం కుదుర్చుకున్నారు. ఇద్దరు తమిళంలోనే మాట్లాడు కుంటున్నారు. వాళ్ళలో ఒకడు దగ్గుతున్నాడు. మరొకడిది బట్టతల. బేరం ఆడినవాడు సన్నగా పొడవుగా ఉన్నాడు. కచ్చితంగా వాళ్ళే సార్’ అని చెప్పాడు గబగబా. ‘వెరీ గుడ్. మనకి ఇలా కలిసి వచ్చిందన్న మాట. నీ ఫోన్‌ని ట్రాక్ చేస్తూ, వాళ్లకు అనుమానం రాకుండా మిమ్మల్ని ఫాలో అవుతాం. నువ్వేమీ భయపడకు’ అంటూ అభయాన్ని ఇచ్చి ఫోన్ కట్ చేశాడు అంబరీష్. ∙∙ ‘సర్.. నేనిప్పుడు అనకాపల్లిలో ఉన్నాను. లొకేషన్ షేర్ చేశాను. నన్ను ఇక్కడే ఉండమని వాళ్ళు ముందుకు నడిచి వెళ్తున్నారు. ఎడమ వైపు నాలుగవ వీధిలోకి తిరిగారు’ అని వివరం అందించాడు రాజారావు. ‘మేం దగ్గరలోనే ఉన్నాం. రెండు నిమిషాల్లో చేరుకుంటాం’ అని ఫోన్ పెట్టేశాడు అంబరీష్. అన్నట్టుగానే రెండు నిమిషాల్లో పోలీసు జీపు అక్కడికి వచ్చింది. అంబరీష్‌తో సాయుధులయిన ఇద్దరు పోలీసు ఆఫీసర్లు, ఇద్దరు పోలీసులు నాలుగవ వీధి వైపు నడిచారు. రాజారావు అక్కడే ఉండిపోయి ఏం జరగబోతుందోనన్న ఉత్సుకతతో ఎదురుచూడసాగాడు. దాదాపు అరగంట దాటినా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోయేసరికి రాజారావులో టెన్షన్ మొదలయింది. గాభరా పడుతూ అటువైపే చూడసాగాడు. అక్కడికి వెళ్లి చూడ్డానికి అతనికి ధైర్యం సరిపోవడం లేదు. కాస్సేపటికి పోలీసులు తిరిగిరావడం చూసి అతని మనసు కుదుటపడింది. వాళ్ళతో పాటు నడుస్తున్న ముగ్గురు నేరస్తులు, వాళ్ళ చేతికి తగిలించిన బేడీలు చూడగానే ఆనందం పట్టలేకపోయాడు రాజారావు. గబగబా అంబరీష్‌కు ఎదురెళ్ళి..‘ఏమయింది సార్? మా తమ్ముడిని ఎందుకు చంపారు ఈ దుర్మార్గులు?’ అంటూ ఆత్రుతగా ప్రశ్నిస్తున్న రాజారావు వైపు నవ్వుతూ చూస్తూ, ‘అన్ని వివరాలూ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాతే. అంతవరకూ సస్పెన్స్ అని చెప్పాడు అంబరీష్. చేసేదేమీలేక తల ఊపాడు రాజారావు. స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అంబరీష్ చెప్పడం మొదలుపెట్టాడు.. కాళితో సహా అందరూ శ్రద్ధగా వినసాగారు.. ‘సన్నగా పొడవుగా ఉన్నవాడి పేరు రాహుల్.. తెలుగువాడే. వాడే అసలు నేరస్తుడు. రాహుల్‌కి పన్నెండేళ్ల వయసప్పుడు తండ్రి చనిపోతే, తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని కలకత్తా వెళ్ళిపోతూ కొడుకును తన తండ్రి జానకిరామ్‌కు అప్పగించింది. అప్పటినుంచి ఆయనే వీడిని గొప్ప క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశాడు. అదే కొంప ముంచింది. తల్లితండ్రుల ప్రేమకు దూరమయిన రాహుల్.. తాతగారి స్ట్రిక్ట్ డిసిప్లిన్‌తో విసిగిపోయి, తాత అంటే అయిష్టాన్ని పెంచుకున్నాడు. అది కక్షగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. తనకు స్వేచ్ఛను ఇవ్వడం లేదని, కనీస అవసరాలకు కూడా డబ్బు ఇవ్వడం లేదని తల్లికి తరచూ ఫిర్యాదు చేసేవాడు. ‘నీ మంచి కోసమే తాతగారు అలా చేస్తున్నారు’ అంటూ తల్లి.. జానకిరామ్‌ను సమర్థిస్తూ రావడంతో తాత మీద కక్ష ఇంకా పెరిగింది. ఇంటర్ అత్తెసరు మార్కులతో పాస్ అయిన రాహుల్‌ను చెన్నైలో ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేర్చారు భారీ డొనేషన్ కట్టి. అక్కడ మిగిలిన ఇద్దరు నేరస్తులు రామన్, రాఘవన్‌లు పరిచయం అయ్యారు. వాళ్ళ సహవాసంతో రాహుల్‌కు అన్ని వ్యసనాలు అబ్బాయి. ఇంటి దగ్గర నుంచి పంపే డబ్బు సరిపోక అప్పులు పెరిగిపోయి అతని పరిస్థితి దుర్భరం అయింది. తాత దగ్గర తల్లి నగలు, బోలెడంత డబ్బు ఉన్నట్లు రాహుల్ పసిగట్టాడు. తాతను చంపేసి డబ్బు, నగలు పట్టుకుపోవాలని ప్లాన్ వేసి ఇద్దరినీ తోడు తెచ్చుకున్నాడు. హత్య జరిగిన రోజు రాత్రి కృష్ణ టాక్సీలో ఎక్కిన ఆ ముగ్గురు జానకిరామ్‌ను ఎలా చంపాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. తాము మాట్లాడేది తమిళం కాబట్టి వాళ్లు కృష్ణని పట్టించుకోలేదు. కానీ కృష్ణకు తమిళం వచ్చు. వాళ్ళ ప్లాన్ అర్థమైయిపోయింది అతనికి. కారు ఆపి వాళ్ళను దిగిపోమని, పోలీసులకు ఈ విషయం చెప్తానని బెదిరించాడు కృష్ణ. దాంతో రాఘవన్.. కృష్ణ మెడపై కత్తి పెట్టి, కారుని పక్కదారి పట్టించాడు. అక్కడ కారు ఆపించి కృష్ణను దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి చంపేశారు. రెండవ ప్రయత్నంలో వాళ్ళు రాజారావు కారు ఎక్కడం యాదృచ్ఛికం. అలాకలిసొచ్చి వాళ్లు దొరికి నిజాలు బయటపడ్డాయి’ అంటూ ముగించాడు అంబరీష్. (సుమారు నాలుగు దశాబ్దాల కిందట విశాఖ జిల్లాలో జరిగినయదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ) చదవండి👉🏾కథ: ‘నేను’... సుందర్‌ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది? -
సీనియర్ న్యాయవాది ‘కర్నాటి’ మృతి
విజయవాడ లీగల్: సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహనరావు (82) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మెదడులో నరాలు గడ్డకట్టడంతో తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడుకు చెందిన రామ్మోహనరావు విజయవాడలో స్థిరపడ్డారు. వామపక్ష భావాలున్న ఆయన కమ్యూనిస్టు పార్టీ తరఫున నందిగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. నక్సల్ ఉద్యమానికి ఆకర్షితుడై అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివిన ఆయన ఏపీ బార్ కౌన్సిల్లో 1967లో పేరు నమోదు చేసుకుని, బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ)లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. దేశంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినా వెంటనే స్పందించేవారు. వంగవీటి రాధా, రంగా కేసులతో పాటు దేవినేని నెహ్రూ కేసులను కూడా వాదించి వారి మధ్య రాజీ కుదిర్చారు. అలాగే సిటీ కేబుల్ రామకృష్ణ హత్య కేసుతో పాటు దుర్గ గుడిలో జరిగిన చోరీ కేసు, గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో జరిగిన మురళీధర్ లాకప్ డెత్ కేసు, మాజీ సీఎం ఎన్టీ రామారావుపై కత్తితో దాడి చేసిన మల్లెల బాబ్జీ(హైదరాబాద్)కేసు వంటివి వాదించారు. బీబీఏకు రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కుమార్తె సంధ్య లండన్‌లో ఉంటుండగా, కుమారుడు శరత్ వ్యాపారిగా స్థిరపడ్డారు. ఆయన భార్య రాజ్యలక్ష్మి 15 ఏళ్ల కిందట మృతిచెందారు. కర్నాటి మరణవార్త విన్న న్యాయవాదులు సూర్యారావుపేట ప్రకాశం రోడ్డులోని ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. -
ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు
సాక్షి, విశాఖపట్నం: పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్టు రాబోయే మూడేళ్ల కాలంలో సరికొత్త సొబగులు అద్దుకోనుందని ట్రస్టు చైర్మన్ రామ్మోహన్రావు వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీలు, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుందన్నారు. పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచేసి.. దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖ నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. పోర్టు ట్రస్ట్ సమావేశ మందిరంలో శనివారం రామ్మోహన్రావు మీడియాతో మాట్లాడారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పోర్టు ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికల్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ► 2020–21లో కరోనాతో సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ 30.08 మి.టన్నుల దిగుమతులు, 38.73 మి.టన్నుల ఎగుమతులతో, 1.03 ట్రాన్షిప్తో మొత్తం 69.84 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేశాం. దేశంలోని మేజర్ పోర్టుల్లో వరుసగా రెండో ఏడాది మూడో స్థానంలో నిలిచాం. మొత్తం రూ.606 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. అదేవిధంగా పోర్టు చరిత్రలో తొలిసారిగా ల్యాండ్ రెంట్స్ మార్చి నాటికల్లా ఖజానాకు చేరాయి. సుమారు 4 వేల ఎకరాలకు గాను రూ.435 కోట్ల అద్దెలు వసూలయ్యాయి. ► చైనాకు ఎగుమతి చేసిన ఐరన్ ఓర్, ఫినిష్డ్ స్టీల్‌తో పాటు గుజరాత్‌కు ఐరెన్ పెల్లెట్స్ ఎగుమతుల్లో వృద్ధి సాధించగా, స్టీమ్కోల్డ్, కుకింగ్ కోల్ రవాణా గణనీయంగా తగ్గాయి. 2019–20లో 2,099 నౌకలు పోర్టుకు రాగా 2020–21లో 2,040 నౌకలు వచ్చాయి. ► రైల్వే ద్వారా చేసిన కార్గో సరుకు రవాణాలో ఈ ఏడాది ఒక శాతం వృద్ధి సాధించాం. గతేడాది 32.13 మి.టన్నుల సరుకు (9,174 ర్యాక్స్) హ్యాండిల్ చేయగా ఈ ఏడాది అత్యధికంగా 32.35 మి.టన్నులు (9,635 ర్యాక్స్) హ్యాండిల్ చేశాం. ► పోర్టు జెట్టీల సామర్థ్యం పెరిగేలా ఆధునికీకరించడంతో పాటు జెట్టీల యాంత్రీకరణకు రూ.650 కోట్లతో పనులు చేపడుతున్నాం. వెస్ట్‌క్యూ (డబ్ల్యూ.క్యూ)–7, డబ్ల్యూ.క్యూ–8 జెట్టీల సామర్థ్యాన్ని రూ.300 కోట్లతోనూ, రూ.150 కోట్లతో ఈక్యూ–7 జెట్టీ యాంత్రీకరణ పనులు నిర్వహిస్తున్నాం. ► చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఓఆర్–1, ఓఆర్–2 బెర్తుల అభివృద్ధి పనులు కూడా రూ.168కోట్లతో చురుగ్గా సాగుతున్నాయి. ► కాలుష్య రహిత ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించేందుకు రూ.633.11 కోట్లతో కంటైనర్ టెర్మినల్ విస్తరణ పనులు డిసెంబర్ 2021 నాటికి పూర్తవుతాయి. ఇది పూర్తయితే.. 5.4 లక్షల కంటైనర్లు హ్యాండిల్ చేయవచ్చు. ► రూ.103 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నాం. అనుమతులు వచ్చిన ఏడాదిలోపే టెర్మినల్ పనులు పూర్తిచేసి క్రూయిజ్ టూరిజం కార్యకలాపాలు ప్రారంభిస్తాం. దీంతో సముద్ర విహారం విశాఖ వాసులకు చేరువవ్వడమే కాక అంతర్జాతీయ పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. ► ఏడాది కాలంగా అదానీకి కేటాయించిన టెర్మినల్‌లో కార్యకలాపాలు జరగకపోవడంతో పోర్టు ఆదాయం కోల్పోతోంది. ఇది ప్రస్తుతం ఆర్బిట్రేషన్‌లో ఉంది. విచారణ పూర్తయ్యాక ఆ టెర్మినల్‌ను పోర్టు ఆధీనంలోకి తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తాం. -
సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
సాక్షి, విశాఖపట్నం: సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టుట్రస్ట్ నూతన అధ్యాయం నెలకొల్పిందని పోర్టు చైర్మన్ కె.రామ్మోహనరావు, డిప్యూటీ చైర్మన్ పి.ఎల్.హరనాథ్ తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 72.72 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిందని, 86 ఏళ్లలో ఈ స్థాయిలో సరుకు రవాణా చేయడం ఇదే ప్రథమమన్నారు. గత ఏడాది కన్నా ఇది 7.42 మిలియన్ మెట్రిక్ టన్నులు అధికంగా రవాణా చేసి 11.50 శాతం వృద్ధి రేటును సాధించిందని పేర్కొన్నారు. ప్రైవేటు పోర్టుల నుంచి గట్టి పోటీ, ఆర్థిక మాంద్యం, కోవిడ్ 19 విపత్తు వల్ల కలిగిన ఎగుమతి, దిగుమతి ప్రతికూల పరిస్థితులను అధిగమించి రికార్డు స్థాయిలో సరుకు రవాణా జరగడం విశేషమన్నారు. విశాఖ పోర్టు అవలంబిస్తున్న వ్యూహాత్మక వ్యాపార విధానాల వల్ల నేపాల్ ప్రభుత్వం విశాఖ పోర్టును ప్రధాన పోర్టుగా ఎంపిక చేసుకుందని చెప్పారు. గత ఏడాది నేపాల్ 16,292 కంటెయినర్లు హ్యాండిల్ చేయగా, ఈ ఏడాది 161 శాతం వృద్ధి రేటుతో 42,250 కంటెయినర్లను రవాణా చేసిందని వెల్లడించారు. వినియోగదారులకు రాయితీ కల్పించడం, యాంత్రీకరణ, షిప్ టర్న్‌ఎరౌండ్ సమయాన్ని తగ్గించడం వంటి మౌలిక సదుపాయాల కల్పన వల్ల వినియోగదారుల నిర్వహణ వ్యయాన్ని చాలా వరకూ తగ్గించామన్నారు. ఇంతటి చరిత్రాత్మక విజయాన్ని సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాన్ని అంకితమిస్తున్నామని పేర్కొన్నారు. -
నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు
‘‘నిర్మాతల మండలి ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరూ ఒక్కటిగా ప్యానల్‌ని ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంపై తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహనరావు, నిర్మాత సురేశ్‌బాబుతో కూడా మాట్లాడాను. చాలా మంది నిర్మాతల అభిప్రాయం కూడా ఇదే’’ అని తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఎన్నికల విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్‌ని ఎంపిక చేసింది.ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి. అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి బాగా ఉంటున్న క్రమంలో కొందరు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎల్.ఎల్. పి అంటూ చానల్స్ విషయంలో సపరేట్గా ఉండటంతో కౌన్సిల్‌కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను పరిష్కరిస్తామని నిర్మాత సి. కళ్యాణ్‌గారు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేడు ఉపసంహరణ చేసుకుంటే బాగుంటుంది. ఎన్నికల ముందే అందరు పెద్ద వాళ్లతో కూర్చుని నిర్మాతల మండలి ప్యానల్‌ని ఎంపిక చేస్తే బాగుంటుంది. నేడు నేను ఉపసంహరణ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ముందుకు రావాలి’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు శంకర్ గౌడ్, జేవీఆర్, సాయి వెంకట్‌లతో పాటు మరికొందరు నిర్మాతలు పాల్గొన్నారు. -
ఎర్రజొన్న కొనాల్సిందే
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు ఎర్రజొన్న పంటను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ అధికారులు, ఎర్రజొన్న వ్యాపారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులతో నిర్వహించిన సమవేశంలో కలెక్టర్ మాట్లాడారు. రైతుల, వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సాగును మెల్ల మెల్లగా తగ్గించుకోవాలని గతేడాదే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలియజేశామని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే కాల పరిమితి, తక్కువ తడులతో ఈ పంట అనుకూలంగా ఉన్నందున రైతులు దీనినే సాగు చేశారన్నారు. విత్తనాలు సరఫరా చేసే సమయంలో పంటను కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకున్న వ్యాపారులు ఇప్పుడు దిగుబడి పెరగడంతో ధర తక్కువ ఇస్తామని చెప్ప డం సరికాదన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రైతుబంధు, రైతు బీమా తదితర ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంటే.. వ్యాపారులు మాత్రం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. నోటి మాటలైనా, లిఖిత పూర్వక ఒప్పందమైనా పాటించాల్సిందేనని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చూస్తూ ఊరు కోమన్నారు. రైతులు వ్యాపారుల మోసానికి ప్రతిసారి బలికాకుండా ఇతర పంటల సాగుకు ఆలోచించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. పసుపును మార్కెట్‌కు తెచ్చేముందు బాగా ఆరబెట్టుకొని, తేమను తగ్గించి తేవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘కొడ్’ పాటించండి
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎన్నికల నియ మావళికి సంబంధించి ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసినందున, అందుకనుగుణంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సమీక్షి సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా ఖచ్చితత్వంతో, నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల కాలం కాబట్టి ఎన్నికల పనులకు సంబంధించి అధికారులు ప్రతి విషయానికి వెంటనే స్పందించాలని, ప్రధాన కార్యస్థానాల్లోనే ఉండాలని, ఈ సమయం అత్యంత ముఖ్యమైనదన్నారు. అదే విధంగా ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు దరఖాస్తులు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో తీసుకున్నవి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. చనిపోయిన వారు, పూర్తిగా అందుబాటులో లేని వారు, రెండు పేర్లున్న వారికి నోటీసులు జారీ చేసినందున ఈ నెల 30లోగా అనర్హులను జాబితా నుంచి తొలగించాలని సూచించారు. వయసు తప్పుగా నమోదైనవి ఉంటే సరి చేసి అర్హులను జాబితాలో ఉంచాలన్నారు. పేదలకు పంపిణీ చేసిన భూముల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమస్యగా మారిన భూములకు సంబంధించి ఆరు శాఖల అధికారులు సంయుక్త సర్వే జరిపి నివేదికలు అందించాలని, అర్హులకు న్యాయం జరిగేలా, వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వర్తింపజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, గోపిరాం, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్, తహశీల్ధార్లు, రెవెన్యూ ,అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
చిత్ర నిర్మాణ రంగంలోకి ఏషియన్ గ్రూప్
యాభైఏళ్లుగా 600ల సినిమాలకు ఫైనాన్స్ అందించి, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సంస్థ ఓ చిత్రం నిర్మించనుంది. ఈ లవ్ స్టోరీకి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి నిర్మాతలుగా నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు (తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్) వ్యవహరించనున్నారు. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే ప్రాజెక్ట్‌పై అటు ఇండ్రస్టీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. కంటెంట్‌ని తప్ప క్రేజ్‌ని నమ్ముకోని శేఖర్ కమ్ముల నుంచి రాబోతున్న ఈ ప్రేమకథకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. అమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: విజయ్ భాస్కర్. -
బాలిక విద్యకు ప్రాముఖ్యత
నందిపేట్ (ఆర్మూర్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్యకు ప్రాముఖ్యతనిస్తూ, అందుకు కావాల్సిన అన్ని సౌకార్యాలను కల్పిస్తుందని కలెక్టర్ రామ్మోహాన్‌రావు అన్నారు. నందిపేట మండలంలోని అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల తరగతి గదులలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసు రూంలను పరిశీలించారు. చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. బాలికల విద్యకు ప్రాముఖ్యతనిస్తూ ప్రభుత్వ విద్యతో పాటు ఆత్మస్థైర్యం కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ లాంటివాటిలో శిక్షణనిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2822 మంది బడిబయట పిల్లలను బడిలో చేర్పించామన్నారు. మహిళల ప్రాతినిథ్యం పెరుగుతున్న నేపథ్యంలో బాలికలను ఉన్నత విద్యలు చదివించాలని తల్లిదండ్రులను కోరారు. బాలికలు చదివితే గ్రామం చదివినట్టేనన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న సర్పంచు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులను అబినందించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని సౌకార్యలను కల్పిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మంచి విద్యను అందిస్తామని భరోసా ఇచ్చారు. సెజ్ పనుల పరిశీలన మండలంలోని లక్కంపల్లి శివారులో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయాధారిత పరిశ్రమ (సెజ్) పనులను మంగళవారం కలెక్టర్ రామ్మోహాన్‌రావు పరిశీలించారు. సెజ్ కోసం కేటాయించిన భూమి వివరాలను తహసీల్దార్ ఉమాకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెజ్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి, వాటి వివరాలను ఆరా తీశారు. వ్యవసాయాధిరిత పరిశ్రమలలో భాగంగా పశుపుశుద్ధి, విత్తన శుద్ధి కోసం ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే వ్యవసాయ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ, పాలశీతలీకరణ కేంద్రం తదితర కార్యక్రమాల కోసం 78 ఎకరాలను ఉపయోగించుకున్నట్లు, మిగితా భూమి ఇతర పరిశ్రమల కోసం లీజ్‌కు ఇస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు కలెక్టర్‌కు వివిరించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక సర్పంచ్ మీసాల సుదర్శన్, ఎంపీపీ అంకంపల్లి యమున, జడ్పీటీసీ డి.స్వాతి, వైస్ ఎంపీపీ మారంపల్లి గంగాధర్, ఎంపీటీసీ ఎర్రటి సుజాత, ఎంపీడీఓ నాగవర్దన్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ లక్ష్మినారాయణ, హెచ్ఎం గంగాధర్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
శివకాశీపురం ఘనవిజయం సాధించాలి
సాయి హరీశ్వర ప్రొడక్షన్స్బ్యానర్ పై మాస్టర్ హరి సమర్పణలో మోహన్‌బాబు పులిమామిడి నిర్మిస్తూ, హరీష్ వట్టికూటిని దర్శకునిగా పరిచయం చేస్తున్న సినిమా ‘శివకాశీపురం’. స్వర్గీయ స్వరచక్రవర్తి మనవడు, సంగీత దర్శకుడు శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోని మూడవ పాటను తెలంగాణ ఎఫ్డీసీ చెర్మన్ రామ్మోహన్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సినిమాలో ఎక్కువ పోర్షన్‌ను మంచిర్యాలలో తీశారు. చాలా సంతోషం. సినిమా వాళ్ళకు తెలంగాణ లో ఎక్కడైనా సహకారం లభిస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ ఈ పాటను రామ్మోహన్ రావుగారు రిలీజ్ చేయటం ఆనందంగా ఉంది. రిలీజ్ అప్పుడు కూడా ఆయన సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ సినిమాను జనవరి లేదా ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. పవన్ శేష్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు దర్శకుడు. -
తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్రావు పదవీ విరమణ
టీ.నగర్ (చెన్నై) : తమిళనాడు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు గురువారం పదవీ విరమణ చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. 2016 జూన్ 1న జయలలిత హయాంలో సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన నియమితులయ్యారు. అదే నెల 8న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టారు. జయలలిత మృతి అనంతరం గత ఏడాది డిసెంబరు 21న సచివాలయంలోని రామ్మోహన్రావు గదిలో, అన్నానగర్‌లోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ క్రమంలో రామ్మోహన్‌రావును ఆ పదవి నుంచి తొలగించారు. అనంతరం గత మార్చి 31న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. ప్రస్తుతం 60 ఏళ్లు పూర్తి కావడంతో గురువారం ఆయన పదవీ విరమణ చేశారు. 1957 సెప్టెంబరులో జన్మించిన రామ్మోహన్రావు 1985లో ఐఏఎస్ అధికారిగా పదవిలో చేరారు. -
నన్ను అమ్మ పెట్టారు.. ఇప్పటికీ నేనే సీఎస్!
''పురచ్చితలైవి అమ్మ నన్ను నియమించారు.. ఇప్పటికీ నేనే చీఫ్ సెక్రటరీని. నన్ను బదిలీ చేస్తూ ఇంతవరకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. అమ్మే బతికుంటే ఇలా జరిగేదా.. అసలు చీఫ్ సెక్రటరీ ఇంటిమీద, ఆఫీసులో ప్రవేశించడానికి వాళ్లకు ఎంత ధైర్యం'' అంటూ తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహనరావు మండిపడ్డారు. ఈనెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు సీఆర్పీఎఫ్ భద్రతతో ఆదాయపన్ను అధికారులు ఆయన ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లపై దాడిచేసి పెద్దమొత్తంలో నగలు, నగదు, పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాత.. ఇన్నాళ్లకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. శేఖర రెడ్డితో తనకు సంబంధం లేదని, ఆయనతో తాను ఎలాంటి లావాదేవీలు జరపలేదని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చీఫ్ సెక్రటరీ కార్యాలయం మీద రాజ్యాంగ దాడి చేయడమేనని, ఈ ప్రభుత్వానికి తనను బదిలీ చేసే దమ్ములేదని అన్నారు. తనను పురచ్చితలైవి అమ్మ అపాయింట్ చేశారని, ఇప్పటికీ తానే చీఫ్ సెక్రటరీనని గర్జించారు. ఇప్పటివరకు తనకు బదిలీ ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, అందువల్ల ఇప్పుడు ఉన్న ఆమె ఇన్చార్జి అయి ఉంటారని చెప్పారు. తెల్లవారుజామున 5.30 గంటలకు వాళ్లు తన ఇంట్లోకి వచ్చారని, కానీ వాళ్లు చూపించిన సెర్చివారంటులో తన పేరు లేదని రామ్మెహనరావు అన్నారు. తన కొడుకు పేరు ఉందని, అతడేమైనా చీఫ్ సెక్రటరీయా అని ప్రశ్నించారు. తన కొడుకు అమెరికా నుంచి వచ్చిన తర్వాత కేవలం వారం రోజులు మాత్రమే తన ఇంట్లో ఉన్నాడని, తర్వాత ఎప్పుడూ అసలు ఇంట్లోనే లేడని చెప్పారు. ఆదాయపన్ను శాఖ అధికారులకు తన ఇంట్లో కేవలం రూ. 1,12,322 నగదు మాత్రమే దొరికిందని అన్నారు. తన కూతురు, భార్యకు సంబంధించిన 42 కాసుల బంగారం ఉందని, దాంతోపాటు వెండితో చేసిన మహాలక్ష్మి, వెంకటేశ్వరుడు, వినాయకుడి బొమ్మల లాంటివి 25 కిలోలు దొరికాయని తెలిపారు. తన ఇంట్లో సీక్రెట్ చాంబర్ ఉందన్నారని, కానీ అది స్టోర్ రూం మాత్రమేనని, అందులో పాత సామాన్లు, పనికిరాని దుస్తులు ఉన్నాయని రామ్మోహనరావు చెప్పారు. అసలు తన ఇంట్లో, కార్యాలయంలో సోదాలకు వాళ్లు ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారో లేదో తెలియదని ఆయన చెప్పారు. తన కార్యాలయంలో కూడా మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మీద క్రిమినల్ ఆరోపణలు ఏమీ వాళ్లకు దొరకలేదని, కేవలం కొంతమంది ప్రజలిచ్చిన వినతిపత్రాలే ఉన్నాయని అన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఇందులో కేంద్రం పాత్ర ఏంటని ప్రశ్నించారు. జయలలితే బతికుంటే అసలు వాళ్లకు తన ఆఫీసులో ప్రవేశించే ధైర్యం ఉండేదా అని నిలదీశారు. చీఫ్ సెక్రటరీ చాంబర్లోకి వెళ్లడానికి సీఆర్పీఎఫ్ ఎవరి అనుమతి తీసుకుందని.. ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారా అని అడిగారు. ఒక చీఫ్ సెక్రటరీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక అన్నాడీఎంకే కార్యకర్తల గతేంటని అన్నారు. వాళ్లు తన ఇంటిని సోదా చేయాలనుకుంటే ముందు తనను బదిలీ చేయాలని, అందుకు కేవలం రెండు నిమిషాలు చాలని అన్నారు. చీఫ్ సెక్రటరీ స్మగ్లర్, టెర్రరిస్టు అని, ఆయన తమకొద్దని చెప్పి బదిలీ చేయమని కేంద్రానికి చెబితే కేంద్రం రెండు నిమిషాల్లో తనను బదిలీ చేసేదన్నారు. అమ్మ బతికుంటే ఇలా జరిగుండేది కాదని, ఇప్పుడు తమిళనాడు ప్రజల భద్రత మాటేంటని అన్నారు. తను 75 రోజుల పాటు ఆమె ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చానని, ఆమె మరణించిన తర్వాత తుపాను వస్తే, ఆ సమయంలో కూడా తానే బాధ్యతలు చూసుకున్నానని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఎవరికీ భద్రత లేదని చెప్పారు. తమిళనాడులో మిలటరీ, సీఆర్పీఎఫ్ ప్రవేశించి ఏమైనా చేయగలవని, వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవం లేదని అన్నారు. -
నన్ను అమ్మ పెట్టారు.. ఇప్పటికీ నేనే సీఎస్!
-
చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడు
-
చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడు
కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడు నలుగురికి ప్రాణం పోశారు. పట్టణంలోని సప్తగిరి కాలనీకి చెందిన జోగినిపల్లి రామ్మోహన్ రావు(34) రూసో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు పూర్తి చేసుకుని తిరిగివస్తుండగా శ్రీరాములపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ పై వస్తున్న ఆయనను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. చుట్టుపక్కల వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమయం గడిచే కొద్దీ పరిస్ధితి విషమిస్తుడటంతో ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారని డాక్టర్లు ధ్రువీకరించారు. అవయవదానం ద్వారా నలుగురికి ప్రాణదానం చేయవచ్చని అవగాహన కల్పించారు. వారు అందుకు ఒప్పుకోవడంతో జీవన్‌దాన్ సంస్థకు ఆదివారం అవయవ దానం చేశారు. రాంమోహన్‌రావు కాలేయం, కిడ్నీలు, గుండెను అపోలోరీచ్ ఆస్పత్రిలో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య పర్యవేక్షణలో జీవన్‌దాన్ బృందానికి అందించారు. -
15 రోజులు..17 మంది
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో నగర విద్యార్థులు గల్లంతై ఆదివారానికి 15రోజులు పూర్తయ్యింది. ఈ ఘటన నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు కదా..తల్లడిల్లిపోతున్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడి సర్కారు సాయంతో ఇంకా మృతదేహాల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 17 మృతదేహాలు లభ్యంకాగా..ఇంకా 8మంది దొరకాల్సి ఉంది. పక్కాప్రణాళికతో మృతదేహాల కోసం జరుగుతున్న గాలింపు సత్ఫలితాలను ఇస్తోంది. మొదటివారం గాలింపులో కేవలం ఆరు మృతదేహాలే లభ్యంకావడంతో మిగ తా బాధితులు ఆశలు వదులుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం అత్యాధునిక పరికారాలతో గాలింపు చర్యలు చేపట్టడంతో గడిచిన మూడురోజుల్లోనే వరుసగా మృతదేహాలు లభ్యమవుతుండడంతో బాధితుల్లో ఆశమొదలైంది. తమవారి కడచూపు చూసుకునే భాగ్యం కోసం వారు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆదివారం గాలింపుచర్యల్లో నాలుగు మృతదేహాలు లభ్యమైనట్లు అక్కడి అధికారులు మన రాష్ట్రప్రభుత్వానికి సమాచారమందించారు. అందులో నల్లకుంటకు చెందిన రామ్మోహన్రావు కుమారుడు బైరినేని రిత్విక్ మృతదేహం ఉంది. పోస్టుమార్టం అనంతరం సోమవారం రిత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం అక్కడినుంచి నల్లకుంటలోని నివాసానికి చేరుకోనుంది. ఈవిషయం తెలియగానే నల్లకుంటలోని రిత్విక్ ఇంటికి భారీసంఖ్యలో స్నేహితులు,బంధువులు, బస్తీవాసులు చేరుకోవడంతో విషాదచాయలు అలుముకున్నాయి. వారి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సోమవారం సాయంత్రం రిత్విక్ అంత్యక్రియలు జరగనున్నాయి. నగరానికి చెందిన మరో నలుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యంకావాల్సి ఉంది.