
సాయి హరీశ్వర ప్రొడక్షన్స్‌బ్యానర్ పై మాస్టర్ హరి సమర్పణలో మోహన్‌బాబు పులిమామిడి నిర్మిస్తూ, హరీష్ వట్టికూటిని దర్శకునిగా పరిచయం చేస్తున్న సినిమా ‘శివకాశీపురం’. స్వర్గీయ స్వరచక్రవర్తి మనవడు, సంగీత దర్శకుడు శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోని మూడవ పాటను తెలంగాణ ఎఫ్‌డీసీ చెర్మన్ రామ్మోహన్ రావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సినిమాలో ఎక్కువ పోర్షన్‌ను మంచిర్యాలలో తీశారు. చాలా సంతోషం. సినిమా వాళ్ళకు తెలంగాణ లో ఎక్కడైనా సహకారం లభిస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ ఈ పాటను రామ్‌మోహన్ రావుగారు రిలీజ్ చేయటం ఆనందంగా ఉంది. రిలీజ్ అప్పుడు కూడా ఆయన సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ సినిమాను జనవరి లేదా ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. పవన్ శేష్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు దర్శకుడు.