సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, నారాయణదాస్
యాభైఏళ్లుగా 600ల సినిమాలకు ఫైనాన్స్ అందించి, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సంస్థ ఓ చిత్రం నిర్మించనుంది. ఈ లవ్ స్టోరీకి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి నిర్మాతలుగా నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు (తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్) వ్యవహరించనున్నారు. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే ప్రాజెక్ట్‌పై అటు ఇండ్రస్టీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. కంటెంట్‌ని తప్ప క్రేజ్‌ని నమ్ముకోని శేఖర్ కమ్ముల నుంచి రాబోతున్న ఈ ప్రేమకథకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. అమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: విజయ్ భాస్కర్.
Comments
Please login to add a commentAdd a comment