కాంబినేషన్‌ కుదిరేనా? | Nani new movie With Sekhar Kammula in tollywood | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ కుదిరేనా?

Published Wed, Jul 3 2024 12:16 AM | Last Updated on Wed, Jul 3 2024 9:32 AM

Nani new movie With Sekhar Kammula in tollywood

హీరో నాని, దర్శకుడు శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ కొత్త కథను సిద్ధం చేశారట. ఈ కథలోని హీరో పాత్రకు నాని అయితే సరిపోతారని ఆయన భావిస్తున్నారట. దీంతో ఈ దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటన అధికారికంగా రావొచ్చనే టాక్‌ వినిపిస్తోంది.

కాగా ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాతో బిజీగా ఉన్నారు నాని. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. మరోవైపు నాగార్జున, ధనుష్‌ హీరోలుగా నటిస్తున్న ‘కుబేర’ సినిమాతో శేఖర్‌ కమ్ముల బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా నాని, శేఖర్‌ల ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత వీరి కాంబినేషన్‌లోని సినిమా గురించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి.. ఈ కాంబి నేషన్‌ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement