కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్‌ సందడి | Tollywood Hero Allu Arjun attended Cousin Marriage pics Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun: కుటుంబ సమేతంగా కజిన్‌ పెళ్లికి హాజరైన అల్లు అర్జున్‌

Published Thu, Apr 24 2025 4:27 PM | Last Updated on Thu, Apr 24 2025 6:16 PM

Tollywood Hero Allu Arjun attended Cousin Marriage pics Goes Viral

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది. సుకుమార్‌- బన్నీ కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం బన్నీ జవాన్ డైరెక్టర్‌ అట్లీతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఓ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి చేశారు. తన కజిన్ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ పెళ్లికి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు.  దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను టీమ్ అల్లు అర్జున్‌ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement