ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఓ పెళ్లిలో సందడి చేశారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ఓ వివాహా వేడుకలో తన భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ ఈ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.
అయితే ఈ పెళ్లి వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కనిపించడం మరో విశేషం. వధూవరులను మెగాస్టార్ ఆశీర్విదిస్తున్న ఫోటో తెగ వైరలవుతోంది. ఓకే పెళ్లికి అల్లు, మెగా ఫ్యామిలీ సభ్యులు హాజరవడంతో టాలీవుడ్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇటీవల ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వస్తున్నాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా అల్లు అరవింద్ ఫ్యామిలీ, మెగాస్టార్ చిరంజీవి ఓకే పెళ్లిలో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
మరోవైపు అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.621 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా సాధించని విధంగా ఆల్ టైమ్ రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
Comments
Please login to add a commentAdd a comment