cousin
-
వైభవంగా నటుడి రోకా వేడుక, రణబీర్, కరీనా,సైఫ్, సందడి (ఫొటోలు)
-
ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : శభాష్ అంటున్న నెటిజన్లు
ఫ్యాషన్ ప్రపంచంలో బాగా వినిపించే పేరు నటి అనన్య పాండే పేరు. ఇటీవల తన కజిన్ సోదరి నిశ్చితార్థ వేడుకలో మరింత ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే సాంప్రదాయ బద్ధంగా డిజైనర్ చీర లేదా గౌను ధరించడానికి బదులుగా, అనన్య 21 ఏళ్ల నాటి పాత డ్రెస్‌ను ఎంచుకుంది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ఇలా ఎందుకు చేసిందంటే..సన్నిహిత బంధువు దియా ష్రాఫ్ నిశ్చితార్థానికి ఆక్వా బ్లూ కలర్ డ్రెస్ అందంగా కనిపించింది. అయితే ఈ డ్రెస్ ఫ్యాషన్ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రఖ్యాత దివంగత డిజైనర్ రోహిత్ బాల్ తన తల్లి భావనా పాండే కోసం తయారు చేసిన ఆక్వా-బ్లూ గోల్డ్ ఎంబ్రాయిడరీ కుర్తా సూట్‌ను ధరించింది.దీనికి సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది అనన్య పాండే. దీంతో నెటిజన్లు ఘనమైన నివాళి. ఈ డ్రెస్ మీకూ చాలా బావుంది అంటూ ప్రశంసించారు.నిజానికి అమ్మలు, అమ్మమ్మల చీరలు, అందమైన లెహంగాలను కూతుళ్లు అపురూపంగా ధరించడం కొత్తేమీ కాదు. కానీ అనన్య పాండే ఒక డిజైనర్ పట్ల గౌరవ సూచకంగా రెండు దశాబ్దాల క్రితం ఆయన డిజైన్ చేసిన సూట్‌ను ధరించడం విశేషంగా నిలిచింది. 2024 అక్టోబరులో లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా, అనన్య రోహిత్ బాల్ కోసం ర్యాంపవాక్ చేసిన ఘనత అనన్య సొంతం చేసుకుంది. ఇక వర్క్ పరంగా చూస్తే CTRL మూవీతో ఆకట్టుకుంది. అలాగే ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్‌లో అతిధి పాత్ర లో కనిపించింది అనన్యపాండే చిత్రనిర్మాత, కరణ్ జోహార్ సారద్యంలో అనన్య నటించిన రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని భావిస్తున్నారు.కాగా 2023 నుండి గుండె జబ్బుతో బాధపడుతున్న రోహిత్ బాల్, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిని మాత్రం వదల్లేదు. చివరికి ఆరోగ్య విషమించడంతో ఈ నెల ఆరంభంలో (నవంబర్ 1న) కన్నుమూశారు. ఆయన మరణం ఫ్యాషన్ ప్రపంచానికి తీరటి లోటు అని అభిమానులు ,ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. < View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
సోదరుడికి ప్రేమతో.. కంగనా కాస్ట్లీ గిఫ్ట్ అదిరిందిగా! (ఫోటోలు)
-
'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో చాలా కొద్దిమంది మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షిస్తారు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనసు దోచుకుంటారు. అలా ఇప్పుడు శ్రీవిష్ణు 'సామజవరగమన'లో నటించిన రెబా మోనికా జాన్.. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. అయితే తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఓ హీరోయిన్‌కు ఈమె కజిన్(అక్క) అని అంటున్నారు. అసలు ఇంతకీ ఇందులో నిజమెంత? రెబా ఏం చెప్పింది? (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) ఎవరీ భామ? బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టిన రెబా మోనికా జాన్.. మాస్టర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే మోడలింగ్ చేసిన రెబా.. పలు యాడ్స్ లోనూ నటించింది. 2016లో మలయాళంలో నివిన్ పౌలీ హీరోగా నటించిన 'జాకోబింటే స్వర్గరాజ్యం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతో హిట్ కొట్టి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా దాదాపు నాలుగేళ్లపాటు తమిళ, మలయాళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చింది. గతేడాది జీమోన్ జోసెఫ్ అని వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. తెలుగులోకి అలా! దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) సినిమాలో ఓ పాత్రలో నటించింది. యాసిడ్ దాడికి గురైనా సరే పట్టుదలగా మైదానంలో దిగి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జట్టుని గెలిపించే రోల్ లో కనిపించింది ఈమెనే. ఇలా డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మధ్యే నేరుగా ఓటీటీలో రిలీజైన 'బూ'లోనూ ఓ హీరోయిన్ గా చేసింది. అయితే 'సామజవరగమన'.. ఈమెకు తెలుగులో ఫస్ట్ సినిమా. ఇందులో క్యూట్ గా యాక్ట్ చేసి అలరించింది. ఆ హీరోయిన్‌తో బంధుత్వం? రెబా మోనికా జాన్‌కు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. వరసగా అక్క అవుతుందని గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. స్వయంగా ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెబా చెప్పుకొచ్చింది. 2016లో ఒకేసారి మలయాళంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చామని, దాంతో అప్పుడు ఓ వ్యక్తి రూమర్ క్రియేట్ చేశారని, అది అలానే ఇప్పటికే కంటిన్యూ అవుతోందని రెబా చెప్పుకొచ్చింది. వికిపీడియా, గూగుల్ లోనూ అలానే చూపిస్తోందని.. అయితే దీనిపై తమకు ఎలాంటి సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) -
వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు
ఇటీవల కాలంలో మనుషులు చాల ఘోరంగా తయారవుతున్నారు. ఏదో వివాదం తలెత్తితే చాలు హత్యలు దాక వెళ్లిపోతున్నారు. పైగా ఏదో ఘనకార్యం చేసినట్లుగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వినేందుకే జుగుప్పకరంగా ఉంటున్నాయి ఆ ఘటనలు. అచ్చం అలాంటి ఘటనే జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో 20 ఏళ్ల గిరిజన యువకుడు 24 ఏళ్ల తన బంధువుని అతి కిరాతకంగా తల నరికి చంపాడు. ఈ ఘటన ముర్హు ప్రాంతంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల తండ్రి తన కొడుకు కను ముండా డిసెంబర్ 1న ఇంట్లో ఒక్కడే ఉన్నాడనొ, మిగతావాళ్లంతో పొలాలకు వెళ్లారని చెప్పారు. తాము ఇంటికి తిరిగి వచ్చి చూడగా కను కనిపించలేదు. దీంతో మృతుడి తండ్రి కొడుకు కోసం గాలించి విఫలమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో తన మేనల్లుడు సాగర్ ముండా, అతని స్నేహితులే తన కొడుకుని అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలించడం ప్రారంభించారు. విచారణలో... నిందితులు కనుని దారుణంగా నరికి చంపి, తెగిపడిన తలతో నిందితుడు, అతని స్నేహితులు సెల్ఫీలు దిగారని చెప్పారు. మృతుడి మొండం గోప్లా అడవిలోనూ తల 15 కిలో మీటర్ల దూరంలో దుల్వా తుంగ్రీ ప్రాంతంలో కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐతే ఓ భూమి విషయమై మృతుడి కుటుంబానికి, నిందితుల కుటుంబాలకి మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని చెప్పారు. పోలీసులు మృతుడితో సహా నిందితుల దగ్గర ఉన్న ఐదు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, ఎస్యూవీ కారుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితుల తోపాటు ప్రధాన నిందితుడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: భర్త క్రూరత్వం! భార్య అనారోగ్యంతో ఉందని...) -
ములుగు జిల్లాలో దారుణం..సొంత చిన్నాన్న కూతురిపైనే అత్యాచారం
-
ములుగు జిల్లాలో దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి
సాక్షి, ములుగు(వరంగల్): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవులలో దారుణం జరిగింది. వావివరసలు మరిచి ఓ కామాంధుడు సొంత చిన్నాన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. మైనర్ అని చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో బాలిక ఎవరికి చెప్పలేదు. అయితే కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళితే గర్భవతిగా వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: రెండ్రోజుల్లో యువకుడు పెళ్లి.. పత్రికలు పంచుతూ -
కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా..
Delhi Man Shared Cousin Wife, Morphed Photos: వ్యక్తిగత గొడవల కారణంగా బంధువు భార్యను సోషల్ మీడియాలో వేధించిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని జగత్ పూర్ పుస్తా నివాసి హితేన్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జగత్‌పుర్ పుస్తా ఏరియాకు చెందిన హితేన్కు తన బంధువుతో గొడవ జరిగింది. దాంతో హితెన్ కక్షగట్టి ఎలాగైనా తన బంధువుని వేధించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు హితేన్ తన బంధువు భార్య సోషల్‌మీడియా అకౌంట్‌ని టార్గెట్ చేశాడు. అదే పనిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నకిలీ ఖాతాని క్రియేట్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను సామాజిక మాధ్యమంలో నుంచి ఆమె ఫొటోలను డౌన్లోడ్ చేసుకుని, వాటిని అశ్లీల చిత్రాల్లోని యువతుల ఫొటోలతో మార్ఫింగ్ చేసేవాడు. ఆ ఫోటోలను తిరిగి బాధితురాలితో పాటు, ఆమె భర్త స్నేహితులకు కూడా పంపేవాడు. ఈ తంతు గత ఎనిమిది నెలలుగా కొనసాగుతుండంతో విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, ఈ దారుణానికి పాల్పడుతోంది ఆమె బంధువేనని తేలండంతో అతన్ని అరెస్టు చేశారు. కాగా పోలీసులు నిందితుడి కంప్యూటర్ ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించగలిగారు. చదవండి: Vikarabad: ప్రమాదమా.. హత్యా! కారుతో ఢీ: కొట్టి చంపే ప్రయత్నం.. -
మైనర్‌పై ఐదేళ్లుగా అత్యాచారం.. బిడ్డకు జన్మనివ్వడంతో..
చండీగడ్: దేశంలో రోజురోజుకూ బాలికల మీద అత్యచారాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరిచి కూతురు, సొదరి వరసయ్యే చిన్నారులపై తమతమ ప్రకోపం చూపిస్తున్నారు....పంజాబ్‌లోని పాటియాలలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలిక ఐదేళ్లుగా అత్యాచారానికి గురైంది. మైనర్ బాలిక ఒక బిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాధిత బాలిక గత ఐదేళ్లుగా పాటియాలలోని తన కజిన్ ఇంట్లో ఉంటుంది. ఆమె ఆమె తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై పదేపదే అత్యాచారం చేశాడు, నేరాన్ని ఎవరికీ చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని హెచ్చరించాడు. ఈ విషయం గురించి ఎవరికైనా సమాచారం ఇస్తే ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తానని అతడు బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని ఇన్నేళ్లుగా ఆమె బయటకు చెప్పలేదు. అత్యాచారం ఫలితంగా, మైనర్ అమ్మాయి గర్భవతి అయింది. జూన్ 12 న ఆమె రాజీంద్ర ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఈ నేరం గురించి ఆమె తల్లిదండ్రులు తెలిసింది. భాదిత కుటంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 376, 506 సెక్షన్లతో పాటుగా, పోక్సో చట్టంలోని సంబంధిత విభాగాల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. -
బబితా ఫోగాట్ సోదరి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఆటలన్నాక గెలుపు ఓటములు సహజం. ఓడిపోతే.. అంతటితో మన కథ ముగిసినట్లు కాదు. మరింత కసిగా ప్రయత్నించి గెలుపు అంతేంటో చూడాలి. అంతేతప్ప ఓడిపోయామని చెప్పి ప్రాణాలు తీసుకోవడం దారుణం. ఈ విషయం రితికాకు తెలియక కాదు. కానీ ఓడిపోయిన ఆ క్షణం ఆమె మనసు తనను స్థిమితంగా ఉండనివ్వలేదు. దాంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది ప్రముఖ మహిళా రెజ్లర్ బబితా ఫోగాట్ సోదరి (కజిన్ సిస్టర్) రితికా ఫోగాట్. ఈ సంఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఒక్క చిన్న ఓటమికే తనువు చాలించడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. వివరల్లోకి వెళితే.. 17 ఏళ్ల రితికా ఫోగాట్ మహావీర్ ఫోగాట్ అకాడమీలో గత ఐదేళ్లుగా రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో రితికా తాజాగా భరత్‌పూర్‌లోని లోహ్‌ఘర్ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ ఉమెన్, సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొన్నది. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి మంచి ప్రతిభ కనబరిచిన రితికా ఫైనల్‌కు చేరుకుంది. అయితే మార్చి 14న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓటమిని చవి చూసింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన రితికా.. తన సొంత గ్రామమైన బాలాలిలో మార్చి 15న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రితికా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం ఈ నెల 16న రితికా కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా రితికా సోదరుడు హర్వింద్ర మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ఓడిపోవడం పెద్ద విషయమేమి కాదు. అసలు రితికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియట్లేదు. కోచ్ మహావీర్, మా తండ్రి మెన్‌పాల్ కూడా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో రితికాతోనే ఉన్నారు. ఓటమి తర్వాత రితికకు భరోసా కూడా ఇచ్చారు. మరింత కష్టపడితే విజయం సొంతమవుతుందని అందరం తనకు నచ్చ చెప్పాం. కానీ రితికా ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహిచంలేకపోయాం’ అంటూ వాపోయాడు. ఈ క్రమంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి విజయ్ కుమార్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న రితకా ఫోగాట్ మృతి చెందింది అనే భయంకర విషయాన్ని వెల్లడించడానికి ఎంతో చింతిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచం మారిపోయింది. క్రీడాకారలు మునుపెన్నడు లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలి అనే దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడం ఎంతో ముఖ్యం’’ అంటూ ట్వీట్ చేశారు. Terrible news that we lost #RitikaPhogat who had a brilliant career ahead. The world has changed from where it was some decades ago. Athletes are facing pressures which were not there earlier. An essential part of their training should be to deal with these pressures. — Vijay Kumar Singh (@Gen_VKSingh) March 18, 2021 ఇదిలా ఉంటే బబితా ఫోగాట్‌తో పాటు ఆమె సోదరీమణులు కూడా రెజ్లింగ్‌లో మేటి ప్లేయర్స్ అనే విషయం తెలిసిందే. మహావీర్ ఫోగాట్ తన కూతుళ్లను మంచి రెజ్లర్స్‌గా తీర్చిదిద్దాడు. వీరి కథ ఆధారంగానే బాలీవుడ్లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘దంగల్’ అనే సినిమా తెరకెక్కింది. చదవండి: కిమురా ఆకస్మిక మృతి.. షాక్‌లో అభిమానులు -
హైదరాబాద్‌లో దారుణం: సోదరిపై అత్యాచారం
బంజారాహిల్స్: వావీవరుసలు మరిచిన ఓ యువకుడు వరుసకు సోదరి అయిన యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో చిత్రీకరించి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని మహాత్మాగాందీనగర్‌లో నివసించే బాధిత యువతి(22) ఎయిర్‌హోస్టెస్‌గా శిక్షణ పొందుతుంది. తన తల్లి సోదరి కొడుకు నిఖిల్ కర్ణాటకలోని బాలీ్కలో నివసిస్తుంటాడు. ఇటీవల నిఖిల్(27) హైదరాబాద్‌కు వచ్చి మహాత్మాగాందీనగర్‌లో అద్దెకుంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు. అవసరం నిమిత్తం బాధిత యువతి నిఖిల్‌కు రూ.50 వేలు అప్పుగా ఇచ్చింది. నిందితుడు నిఖిల్ ఈ నెల 2వ తేదీన ఆ డబ్బు ఇస్తానని బాధితురాలిని నిఖిల్ తన గదికి పిలిచి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెకు తాగించి మత్తులో నిద్రలోకి జారిన ఆమెపై అత్యాచారం చేసి వాటిని ఫోన్లో చిత్రీకరించాడు. ఈ నెల 4వ తేదీన బాధితురాలు తన డబ్బు ఏమైందని నిఖిల్‌ను నిలదీసింది. ఆ డబ్బు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. అంతేకాదు తాను రెండో తేదీన అత్యాచారం చేశానని ఎవరికైనా చెబితే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో షాక్‌గురై ఆందోళన చెందిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376, 506ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి అదృశ్యం బంజారాహిల్స్: అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.88 ఫిలింనగర్ దుర్గాభవాని నగర్లో నివసించే బి.శివరామ్(29) అమీర్‌పేటలోని బ్యాంక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఈ మేరకు భార్య మీనాక్షి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. చదవండి: దారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య జూలియెట్ ఆత్మహత్య : సోదరుడే ముంచేశాడు -
అక్కకు అసభ్య సందేశాలు పంపిన తమ్ముడు
సాక్షి, హైదరాబాద్: వరుసకు సోదరి అవుతుందని కూడా ఆలోచించకుండా ఓ తమ్ముడు తన అక్కపైనే వేధింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో తరచూ అసభ్య సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశారు. తమ్ముడి వేధింపులు తాళలేక ఆ యువతి గురువారం సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆ యువకుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొన్నాళ్లుగా వరసకు తమ్ముడయ్యే ఓ యువకుడు సదరు యువతికి అసభ్య సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. లైంగిక వాంఛ తీర్చాలని ఆ యువతిని పదేపదే వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు ఆ యువకున్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
కరోనా టెస్ట్ చేయించుకోలేదని కడతేర్చారు..!
లక్నో : కరోనా టెస్ట్ చేయించుకోలేదనే కారణంతో ఓ వ్యక్తిని అతని కజిన్స్ కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బిజ్నూర్లోని మలక్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంజీత్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం ఢిల్లీ నుంచి మలక్‌పూర్‌కు చేరుకున్నాడు. దీంతో అతని కజిన్స్ కపిల్, మనోజ్.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అయితే ఇందుకు మంజీత్ నిరాకరిస్తు వచ్చాడు. ఈ క్రమంలో గురువారం మంజీత్‌కు అతని కజిన్స్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కపిల్, మనోజ్‌లు కర్రలతో మంజీత్‌పై దాడికి దిగారు. (చదవండి : కరోనా.. ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ మృతి) ఈ ఘర్షణలో మంజీత్ తలకు గాయాలు కావడంతో అతను అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. వెంటనే మంజీత్ తల్లిదండ్రులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మంజీత్ చికిత్స పొందుతుండగానే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మంజీత్ తండ్రి కల్యాణ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మంజీత్ కజిన్స్ కపిల్, మనోజ్, వారి తల్లి పుణియా, మనోజ్ భార్య డాలీలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బిజ్నూర్ అడిషనల్ ఎస్పీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. మే 19వ తేదీన బిజ్నూర్కు చేరుకున్న సమయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్టు తెలిపారు. అయితే అక్కడ నెగిటివ్ రావడంతో అతని శాంపిల్స్ తీసుకోలేదని చెప్పారు. -
ఎమ్మెల్యే విడదల రజనీ మరిదిపై రాళ్లదాడి
-
డొనెల్లీకి ఓ ‘అందమైన అనుభవం’
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రజలకు సుపరిచితుడైన డెక్లాన్ డొనెల్లీ టీవీ ప్రెజెంటర్, కమేడియన్, సింగర్, టీవీ ప్రొడ్యూసర్. ఇటీవల ఆయన తన టీవీ మిత్రుడైన ఆంటోని మాక్ పార్టిలిన్తో కలిసి ‘ఆంట్ అండ్ డెక్స్ డీఎన్ఏ జర్నీ’ పేరిట ఐటీవీ కోసం ఓ సీరియల్‌ను తీస్తున్నారు. అందులో భాగంగా వారిద్దరు ఇటీవల డీఎన్ఏ పరిశోధనల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ అనుకోకుండా డెక్లాన్‌కు కజిన్ మెగ్, ఆమె భర్త గ్రెక్ ఉన్నట్లు తెల్సింది. వారు కూడా డెక్లాన్ లాగా అత్యధిక ధనవంతులే వారు ఓ విశాలమైన మైదానంలో నిర్మించిన ఓ పెద్ద భవనంలో నివసిస్తున్నారు. మెగ్, గ్రెక్ దంపతులకు సొంతంగా ఓ హెలికాప్టర్ కూడా ఉంది. డొనెల్లీ మిత్రులను గ్రెక్ తన హెలికాప్టర్లో తిప్పి తన మైదానాన్ని పరిసర ప్రాంతాలను చూపించారు. అంతే కాకుండా మెగ్ దంపతులు అమెరికాలోనే ఉంటున్న మరో 12 మంది డొనెల్లీ కజిన్స్‌ను రప్పించి ఓ రోజున డొనెల్లీకి పరిచయం చేశారు. అనూహ్యంగా అంతమంది కజిన్స్‌ను కలుసుకున్నందుకు డొనెల్లీ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వారిలో ఎక్కువ మంది ధనికులే అవడం మరో విశేషం. డొనెల్లీ తన అందమైన అనుభవం గురించి మీడియాతో షేర్ చేసుకున్నారు. అలా ఒకరికొకరు డీఎన్ఏ సంబంధాలను కనుక్కుంటూ పోగా, డొనెల్లీ నానమ్మ కిట్టీ జన్మతా ఐర్లాండ్ పౌరురాలట. 15వ ఏట ఇంగ్లాండ్‌కు వలసపోయి స్థిరపడ్డారట. ఇలా వంశవృక్షం మూలాలను వెతుక్కుంటూ పోతే ‘అలెక్స్ హాలి’ రాసినంత ‘రూట్స్’ పుస్తకం అవుతుందేమో! తనకు ఎదురైన అనుభవాన్ని డొనెల్లీ తన టీవీ సీరియల్ ఉపయోగించు కోవాలనుకుంటున్నారు. -
బందరులో బాలికపై లైంగికదాడి!
సాక్షి, కోనేరు (మచిలీపట్నం): ఓ ప్రబుద్ధుడి కామవాంఛకు 13 సంవత్సరాల మైనర్ బాలిక గర్భం దాల్చింది. వరుసకు అన్నయ్య అయినా కామంతో కళ్లు మూసుకుపోయి మైనర్ బాలిక పై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడటంతో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, పోలీస్ అధికారులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. ఇనుగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల కథ నం ప్రకారం.. మచిలీపట్నం టౌన్‌లోని ఓగీసుపేటకు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికకు వరుసకు అన్న అయిన మోహన్‌కుమార్ మాయమాటలు చెబుతూ కొంత కాలంగా ఆమెపై లైంగికదాడి చేస్తున్నాడు. బాలిక బుధవారం నీరసంగా ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి బాలి కను నిలదీయగా అసలు విషయం చెప్పింది. తినుబండారాలు కొనిపెడానంటూ నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు చెప్పింది. విష యం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఐసీడీఎస్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు, అధికారులు ఓగీసుపేట చేరుకుని బాలిక నుంచి వివరాలు సేకరించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఐదు నెలల గర్భిణిగా వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ అఖిల్‌జమా తెలిపారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
అత్యాచారం కేసులో బావ, బావమరిది అరెస్టు
గుంటూరు: ఉచ్చులు వేసి పక్షుల వేట కొనసాగిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న బావ, బావమరిదులు ఇద్దరూ ప్రేమికుల జంటను బెదిరించి యువతిని అత్యాచారం చేసి ఆపై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోజుల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేసిన సిబ్బందిని అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయారావు అభినందించారు. ఈసందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాడేపల్లి మండలం పూలకంపాడు గ్రామానికి చెందిన అవివాహిత గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. మేడికొండూరు మండలం మందపాడు కు చెందిన జోసఫ్‌తంబి అనే యువకుడితో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈక్రమంలో గతనెల 29వ తేదీ రాత్రి విధులు ముగించుకున్న అవివాహిత జోసఫ్తంబితో ద్విచక్రవాహనంపై వెళుతూ ఏకాంతంగా గడిపేందుకు ఆత్మకూరు డొంకరోడ్డులోకి వెళ్లారు. ఆ సమయంలో ఆత్మకూరుకు చెందిన బావ, బావమరిదులు అయిన రాసగిరి రాఘవయ్య, ఇండ్ల శ్రీనివాస్ ముందు రోజు పొలాల్లో పెట్టిన ఉచ్చుల్లో ఏవైనా పక్షులు పడ్డాయా అని వెతుకుతూ అటువైపు వెళ్లారు. జోసఫ్తంబిని బెదిరించి పంపించివేసి అవివాహితను మరికొంత దూరం తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె చెవి కమ్మలను తీసుకుని వదిలివేశారు. ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయం గురించి తల్లిదండ్రులకు తెలిపి చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌లో చేరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు ఆమె ఇచ్చిన ఆనవాళ్ల ప్రకారం నిందితులను గుర్తించారు. ఆత్మకూరు జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో బావ, బావమరిదిని అదుపులోకి తీసుకుని విచారించగా, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు అంగీకరించారని వివరించారు. నిందితులపై సస్పెక్టెడ్ షీట్లను కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. సమావేశంలో నార్త్ డీఎస్పీ జి.రామకృష్ణ, సీఐలు ఎం.సుబ్బారావు, బి.హరికృష్ణ, ఎస్ఐ వినోద్ పాల్గొన్నారు. -
పీడబ్ల్యూడీ స్కాంలో కేజ్రీవాల్ బంధువు అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) డ్రెయినేజీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మేనల్లుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వాయవ్య ఢిల్లీ ప్రాంతంలో డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణ బాధ్యతలను రేణు కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ చేపట్టింది. సుమారు రూ.3.1 కోట్ల విలువైన పనులను పీడబ్ల్యూడీ అధికారులతో కుమ్మక్కై ఈ కంపెనీ నాసిరకంగా చేపట్టిందని ఏసీబీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేణు కన్స్ట్రక్షన్స్ కంపెనీలో సీఎం మేనల్లుడు వినయ్ బన్సల్‌కు సగం వాటా ఉంది. వినయ్ బన్సల్‌ను గురువారం అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఢిల్లీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. çఆప్‌ను వేధించడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోపించారు. -
పోలీసు స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం
కొండాపురం: పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోలీసు స్టేషన్లోనే ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న తండ్రి, బంధువు స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు స్టేషన్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మల్కిరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డికి నాలుగు నెలల క్రితం మధుసూదనరెడ్డి అనే వ్యక్తి కడపకు చెందిన మధుభూషన్రెడ్డి కారును రూ.2 లక్షల 66వేలకు ఇప్పించాడు. కారు కొనుగోలు చేసిన సమయంలో కిరణ్కుమార్రెడి్డ కేవలం రూ.60 వేలు మాత్రమే చెల్లించాడు. మిగిలిన సొమ్ముకు మధుసూదన్‌రెడ్డి పూచీకత్తు రాయించాడు. అయితే నెలరోజుల పాటు బాగా నడిచిన కారు కొద్దిరోజుల్లోనే ఇంజన్ సీజ్ అయింది. అయితే మధుసూదన్‌రెడ్డి మాత్రం కారు కొనుగోలు సమయంలో తాను రూ.2 లక్షల 6వేలు పూచీకత్తు పడ్డానని ఆ డబ్బులను ఇప్పించాలంటూ మూడు నెలల క్రితం పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టించాడు. అయితే మల్కిరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తాను ఎవరికీ డబ్బులు బాకీ లేనని పూర్తి డబ్బులు చెల్లించడంతోనే తనపేరుమీద కారు రిజిస్రే్టషన్ చేయించారని, అనవసరంగా తనను వేధించ వద్దంటూ పోలీసుతో గట్టిగా వాదించారు. కాగా దీనికి సంబంధించి ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేవు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. రెండురోజుల క్రితం తాళ్లప్రొద్దుటూరుకు రావడంతో సోమవారం మధుసూదన్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో తిరిగి ఎస్ఐ కృష్ణయ్య కిరణ్‌కుమార్‌రెడ్డిని పట్టుకుని రావాలంటూ కిందిస్థాయి పోలీసులను ఆదేశించారు. ఇంటి వద్ద ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు తాళ్లప్రొద్దుటూరు స్టేషన్‌కు తీసుకొని వచ్చారు. ఎస్ఐ రూ.2 లక్షల6 వేలు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తీసుకొని రావడంతో పాటు పరుషంగా దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు తన వెంట తెచ్చుకున్న వాస్మోల్ తాగి పోలీసు స్టేషన్లోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం గమనించిన పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు ఎలాంటి విషయం తెలియపరచకపోవడంతో తన కుమారుడిని పోలీసులు ఏం చేశారంటూ తండ్రి వెంకట్రామిరెడ్డి, బంధువు శ్రీకాంత్‌రెడ్డి కూడా పోలీసు స్టేషన్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయమై కొండాపురం సీఐ రవిబాబు విలేకరులతో మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డిపై 420 కేసు నమోదై ఉండటంతో అతన్ని విచారించేందుకు పోలీసు స్టేషన్‌కు పిలిపించామన్నారు. అతను తమకు తెలియకుండా ఆత్మహత్యకు యత్నించాడని తెలిపారు. -
వియ్యంకుడిపై గొడ్డలితో దాడి
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి మంగళగిరి : పట్టణంలోని కొప్పురావూరి కాలనీ ఏడోలైనులో ఆదివారం రాత్రి ఓ వ్యక్తిని హత్య చేయడం సంచలనం సృష్టించింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దామర్ల ఆదినారాయణ(65)పై వియ్యంకుడు బిల్లా వేణుగోపాలకృష్ణ గొడ్డలితో తలపై దాడి చేయడంతో తీవ్ర గాయమైన బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆదినారాయణ కుమారుడు సాంబశివరావును ఏడేళ్ల కిందట వేణుగోపాలకృష్ణ కుమార్తెకు ఇచ్చి వివాహం చేశారు. ఆదినారాయణ చేనేత పని చేస్తున్నాడు. సంవత్సరం నుంచి సాంబశివరావు అతని భార్య విభేదాలతో విడిపోయి ఉంటున్నారు. వేణుగోపాలకృష్ణ, సాంబశివరావు మధ్య ఆర్థిక వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకొంది. ఒకరినొకరు చంపుకుంటామంటూ వాదులాడుకున్నారు. రాత్రి ఏడు గంటల సమయంలో మరలా వేణుగోపాలకృష్ణ, సాంబశివరావులు నగదు విషయమై బజారులో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆదినారాయణపై గొడ్డలితో దాడి చేయడంతో తలకు బలమైన గాయంమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుమారుడు సాంబశివరావుతో పాటు స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆదినారాయణ మృతి చెందాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ బ్రహ్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు వేణుగోపాలకృష్ణ లక్ష్మీనృసింహస్వామి కాలనీ వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
దాయాదుల మధ్య ఘర్షణలో వృద్ధుడి మృతి
బండిఆత్మకూరు: దాయాదుల మధ్య స్థలం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పార్నపల్లె గ్రామానికి చెందిన సుందర్రావు(65), ఆయనకు కుమారుడు వరుస అయ్యే మహానంది స్వయాన దాయాదులు. వీరి ఇళ్లకు సమీపంలో ఉన్న రహదారి విషయంలో వివాదం ఉంది. ఈ క్రమంలో వీరి మధ్య ఆదివారం వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి లోనైన మహానంది.. సుందర్రావు తలపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మహానందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చావుకు వెళుతూ మృత్యు ఒడిలోకి
– ఆటో, ద్విచక్ర వాహనం ఢీ – ఒకరి దుర్మరణం, – పది మందికి తీవ్ర గాయాలు – ముగ్గురి పరిస్థితి విషమం చౌడేపల్లె: బందువు చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతుండగా ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మరో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సోమవారం రాత్రి చౌడేపల్లె మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె పంచాయతీ ఎగువ నల్లపగారిపల్లెకు చెందిన వెంకటమ్మ(55), గోవిందు(43), రత్నప్ప(42), వెంకటమ్మ(50), పార్వతమ్మ(47), రమణమ్మ(39), సుగుణమ్మ(41), నరసింహులు(55), నరసింహులు(52) సోమవారం చౌడేపల్లె మండలం పందిళ్లపల్లెలో అనారోగ్యంతో మృతిచెందిన చంద్రప్ప అంత్యక్రియలకు ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో చదళ్ళకు చెందిన రాజా(28), శేఖర్ (20)ద్విచక్ర వాహనంలో చౌడేపల్లె వైపు వస్తున్నారు. 29ఏ చింతమాకులపల్లె వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఆటో అదుపు తప్పి పల్టీకొట్టండంతో అందులో ప్రయాణిస్తున్న వెంకటమ్మ (55) అక్కడికక్కడే మృతిచెందింది. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108లో మదనపల్లెకు తరలించారు. సీఐ రవీంద్ర, ఎస్ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
డబ్బు కోసం అన్నను చంపిన తమ్ముడు
వైఎస్సార్ జిల్లా: కడపలో డబ్బు కోసం వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ఓ యువకుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. కాళ్లు చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కడపలోని చెమ్ముమియాపేటకు చెందిన పగడాల అశోక్(27) రాయంపేటలోని మహేంద్ర ట్రాక్టర్స్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత శనివారం అతని ఇంటికి వచ్చిన పెదనాన్న కుమారుడు నరేష్ పని ఉందని బైక్‌పై తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అశోక్ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు సోమవారం తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా నరేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. తన భార్యతో విడాకులు తీసుకునేందుకు డబ్బు అవసరముండటంతో అశోక్‌ను డబ్బులు అడిగానని.. అందుకు అతను నిరాకరించడంతో.. హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు. -
ప్రేమ పల్లమెరుగు
బాటసారికి చెట్టుతో, దుప్పికి చెలమతో, పిల్లలకు గురువుతో, చెల్లికి పుట్టింటితో బంధం ఉంది. కాని- ఆ బంధువులే ఛీ కొడితే శూన్యాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి? తమ ఏకాంతాలనే ఒక బంధంగా మార్చుకున్న బంగారుతల్లుల కథ ఇది. దేవుడు ఒక బంధాన్ని తెంపేస్తే ఇంకో అనుబంధాన్ని ఇస్తాడు. ఒక కష్టాన్ని కలిగిస్తే ఇంకో ఓదార్పు అందిస్తాడు. ఒక నీడ తీసేస్తే మరో ఆసరా కల్పిస్తాడు. ఆశ ఓడిపోకపోతే, బతుకు పట్ల నిస్పృహ కలగకపోతే, జీవితాన్ని చూసి భయపడకపోతే రేపు అనేది ఒకటి కచ్చితంగా ఉంటుంది. వెలుగు అనేది కచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తు అనేది కచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని ‘దివ్యదిశ’ హోమ్‌ను చూస్తే అదే అనిపిస్తుంది. ఎక్కడెక్కడి వాళ్లో... ఇక్కడ కలిశారు. ఆత్మీయులయ్యారు. చేయీ చేయీ పట్టుకొని నిర్భయంగా ముందుకు నడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. ఆ అయిదుగురు... వీరి పేర్లు- సుజాత, మానస, సుల్తానా, జ్యోతి, అలీఫియా, సమ్రీన్...! అంతా కౌమారంలో ఉన్నవారే! కళకళలాడుతున్న ఈ ఆడపిల్లలందరూ తమ తమ సొంత ఇళ్లల్లో తల్లిదండ్రుల అనురాగంలో ఉండాలి. కాని పరిస్థితి ఇక్కడకు చేర్చింది. ఒక్కొక్కరిది ఒక్కో కథ. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్.. మతాలు వేరైనా కష్టం ఒకటే. చుట్టూ చేరుతారు... పంతొమ్మిదేళ్ల సుజాత ఇంటర్మీయెట్ చదువుతోంది. ఎమ్‌కామ్ చేసి పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలనే కోరికతో ఉంది. హోమ్‌కు వెళ్లినప్పుడు మొదటగా హుషారుగా పలకరించింది ఈ అమ్మాయే. ‘మాది వైజాగ్. నేను ఎనిమిదో తరగతి చదువుతుండగా మా అమ్మానాన్నలు బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. చదువుకోవాలని అనిపించేది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా కాదని ఒకరోజు ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. స్టేషన్‌కు చేరుకుంటే కదులుతున్న రైలు కనిపించింది. భయం భయంగానే ఎక్కేశాను. చివరకు రైలు హైదరాబాద్‌కు చేరింది. కొంచెం ధైర్యం అనిపించింది. అమ్మయ్య... అమ్మనాన్నలు, బంధువుల కంటపడకుండా ఇక్కడ ఉండిపోవచ్చు అనుకున్నాను. రెండుమూడు రోజులు రైల్వేస్టేషన్లో ఉండేసరికి కొందరు వాలంటీర్లు నన్ను చూశారు. నా విషయం తెలుసుకుని ఈ ఫౌండేషన్‌లో ఉండటానికి ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఎప్పుడైనా ఊరు గుర్తుస్తోంది. తమ్ముడు, చెల్లెలు ఎలా ఉన్నారో అని ఏడ్చుకుంటాను. అమ్మనాన్న.. గుర్తుకొస్తారు. కాని మా ఊరికి కానీ ఆ ఇంటికి కానీ వెళ్లాలని అనిపించదు. అయితే ఇంకా బాగా చదువుకొని, ఉద్యోగం వచ్చాక ఒకసారి వెళ్లాలని ఉంది’ అందా అమ్మాయి. ‘దిగులుగా ఉన్నప్పుడు ఏం చేస్తావ్’ అని అడిగితే భయం లేదులే అన్నట్టుగా భరోసాగా నవ్వింది. చుట్టూ ఉన్న స్నేహితులను చూపిస్తూ ‘‘వీరంతా ఉన్నారుగా. నా చెల్లెళ్లే. ఏ కొంచెం దిగులుగా అనిపించినా నా చుట్టూ చేరుతారు. జోక్స్ చెప్పి నవ్విస్తారు. ఒంట్లో బాగోలేకపోతే తెల్లవార్లూ మేలుకొని సేవలు చేస్తారు. ఇంట్లో ఉన్నా ఇంత బాగా చూసుకోరు. నేను ఇంత ఆనందంగా ఉండేదాన్ని కాదేమో’’ అంది సుజాత. అప్పుడు ఆ అమ్మాయి కళ్లు తడిశాయి. కన్నీరా... ఆనందబాష్పాలా తెలియలేదు. భరోసానిచ్చే స్నేహం... మానసది ఇంకో కథ. ఆ అమ్మాయి చెబుతుంటే జరిగిన విషాదాన్ని చెబుతున్నట్టుగా లేదు... గుండెలోని ఏదో బాధను పంచుకుంటున్నట్టుగా అనిపించింది. ‘నాకు ఏడేళ్ల వయసులో అమ్మ చనిపోయింది. నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కొత్త అమ్మ ఏం చెప్పిందో ఏమో నన్ను మా మేనత్త ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత చూడటానికే రాలేదు. అత్త నన్ను ఓ ఇంట్లో పనిలో పెట్టింది. అక్కడ చాలా పని. చేయకపోతే విపరీతంగా కొట్టేవారు. చాలా ఏడుపొచ్చేది. చెప్పుకోవడానికి అమ్మలేదు. నాన్న రాడు. ఓ రోజు తెగించాను. రాత్రిపూట బయటపడి చీకట్లోనే రైల్వేస్టేషన్ చేరుకున్నాను. వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఓ రెలైక్కాశాను. రైలు ఎక్కడో ఓ చోట ఆగితే దిగాను. అదో రైల్వేస్టేషన్. నాలుగురోజులు ఉన్నాను. దొరికింది తిని, నీళ్లు తాగి కడుపు నింపుకునేదాన్ని. ఐదో రోజు ఒక అక్క పరిచయం అయ్యింది. నా గురించి విని, తనతో పాటు తీసుకెళతానంది. ఆమెతో వెళుతుంటే అప్పుడే పోలీసులు వచ్చి, నా గురించి అడిగారు. ఇంటి నుంచి వచ్చేశానని, ఎవరూ లేరని తెలుసుకున్నాక వారు ఆ అక్కను తిట్టి, నన్ను ఈ హోమ్‌లో చేర్చారు. ఆమెతో వెళ్లుంటే ఏమై ఉండేదాన్నో. తలుచుకుంటే భయం వేస్తుంది. ఆరేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. ఎప్పుడైనా అర్ధరాత్రి మెలకువ వచ్చినప్పుడు చాలా భయమేస్తుంది. కానీ వీళ్లను చూడగానే ‘హమ్మయ్య’ అనుకుని మళ్లీ నిద్రపోతాను’ అని చెప్పిన మానస తండ్రి గురించి గానీ, బంధువుల గురించి మరోమాట చెప్పడానికీ ఇష్టపడలేదు. అన్ని పండగల్లోనూ సందడే... పన్నెండేళ్ల అలీఫియా ఈ గ్రూప్‌లో అందరికన్నా చిన్న. ఆరేడేళ్ల వయసులో తల్లిదండ్రులు చనిపోతే సొంత అక్కే ఆమెను వదిలించుకోవడానికి రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లిపోయింది. అలా ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంది అలీఫియా. ‘ఇక్కడకు వచ్చాక ఈ అక్కలే నాకు తెలుగు నేర్పించారు.’ అంది చక్కటి తెలుగులో మాట్లాడుతూ. తనకు డాన్స్ బాగా వచ్చట. ‘మేమంతా ఏ చిన్న పండగ వచ్చినా కలిసి సంబరంగా జరుపుకుంటాం. డ్యాన్సులతో అదర గొట్టేస్తాం. నేనే ఫస్ట్ వస్తాననుకో’ అంది గర్వంగా. కాకినాడ నుంచి వచ్చిన సుల్తానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన సమ్రీన్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే! ఇక తల్లీతండ్రీ లేని జ్యోతికి ఏడేళ్ల వయసుకే లోకం అర్థమైపోయింది. బంధువులు కంటి తుడుపు మాటలు చెప్పగలరేకాని ఆసరా ఇచ్చే సమయానికి ముఖం చాటేస్తారని అర్థమైంది. కాని ఈ హోమ్‌కు చేరుకున్నాక చాలామంది బంధువులు దొరికినట్టనిపించింది. ‘సొంత బంధువుల మధ్య పెరిగినా ఇంత ఆనందంగా ఉండేదాన్ని కాదు’ అందా అమ్మాయి. ఏ దిక్కుకు వెళుతున్నామో తెలియకుండానే ఒంటరి పోరాటం చేయడానికి బయల్దేరిన వీరు ఇప్పుడిప్పుడే ఓ గమ్యం ఏర్పరుచుకుంటున్నారు. అక్కా, చెల్లీ.. అని ఒక జట్టుగా ఉన్న తమలోని వారినే పిలుచుకుంటూ ఆప్యాయతలు పెంచుకుంటున్న వీరు ఏ చిన్న సమస్య వచ్చినా పంచుకోవడానికి వారికి వారే అప్తులు అవుతున్నారు. వీరికి మనం చెప్పాల్సింది సానుభూతి వచనాలు కాదు. ఇవ్వాల్సింది స్నేహం. మనమూ ఉన్నామన్న భరోసా. అంతే. - నిర్మలారెడ్డి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ 1987లో దివ్యదిశ ఫౌండేషన్‌ను ప్రారంభించాం. ముందుగా స్లమ్స్‌లోని పిల్లలను, వీధి పిల్లలను చేరదీసి చదువులు చెప్పించేవాళ్లం. ఆ తర్వాత తప్పిపోయిన పిల్లలు మా దృష్టికి వచ్చారు. దివ్యదిశ హోమ్స్ ఉప్పల్‌లో రెండు, తిరుమలగిరిలో ఒకటి, సంగారెడ్డిలో రెండు ఉన్నాయి. తమవారినే నమ్మకుండా పారిపోయి వచ్చిన పిల్లలకు మా మీద నమ్మకం ఏర్పడేవరకు ఓపికగా ఎదురుచూస్తాం. ఇప్పటి వరకు మా ఫౌండేషన్ కింద వేల మంది పిల్లలు పెరిగి కొత్త జీవితాన్ని ఏర్పరుచుకున్నారు. - ఇసిడోర్ ఫిలిప్స్, డెరైక్టర్ దివ్యదిశ చైల్డ్ లైఫ్ లైన్ ఇల్లు వదిలిన ప్రతీ అమ్మాయి, అబ్బాయికి జీవితంలో ఏదో ఒక కష్టం ఉంటుంది. ఆ కష్టం తీరి జీవితంలో నిలదొక్కుకోవాలంటే ఓ భరోసా కావాలి. అందుకు మనమూ చేయూతనివ్వాలి. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా పిల్లలు తప్పిపోయి, ఒంటరిగా కనిపించినప్పుడు (రోజుల బిడ్డ నుంచి 18 ఏళ్లలోపువారు)ై హెదరాబాద్ నాంపల్లిలో ఉన్న చైల్డ్ లైన్‌కి కాల్ చేయండి... టోల్‌ఫ్రీ నెం. 1098. -
ఆమెకు భర్తే సోదరుడయ్యాడు..!
అహ్మదాబాద్: ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే.. ఆమెకు వరుసకు సోదరుడయ్యాడు. తాము బంధువులమని తెలియక ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది. తన భర్తే ...వరుసకు సోదరుడని పెళ్లయిన తర్వాత నిజం తెలుసుకున్న ఆ యువతి విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్లో ఇటీవల ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. అంబవడికి చెందిన ఓ యువతికి ఓ వివాహ వేడుకలో వస్ట్రాల్కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. అనంతరం వీరిద్దరూ ప్రేమలోపడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. తమ ప్రేమను ఇంట్లో వారు అంగీకరించకపోవచ్చని, వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారని ఆ యువతి భయపడింది. ఆ యువతి, ప్రేమికుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పెళ్లి విషయం ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. పెళ్లయిన తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్లో తన భర్త.. తన బంధువని, వరుసకు సోదరుడవుతాడని ఆ యువతికి తెలిసింది. దీంతో ఈ ప్రేమికుల జంట తమ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించారు. వీరిద్దరూ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వరుసకు అన్నాచెల్లెలు అని తెలియక పెళ్లి చేసుకున్నామని, తమకు విడాకులు ఇప్పించాల్సిందిగా ఆ యువతి పోలీసులను అభ్యర్థించింది. త్వరలో నిపుణులు వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.