
సాక్షి, హైదరాబాద్: వరుసకు సోదరి అవుతుందని కూడా ఆలోచించకుండా ఓ తమ్ముడు తన అక్కపైనే వేధింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో తరచూ అసభ్య సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశారు. తమ్ముడి వేధింపులు తాళలేక ఆ యువతి గురువారం సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆ యువకుడిపై ఫిర్యాదు చేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కొన్నాళ్లుగా వరసకు తమ్ముడయ్యే ఓ యువకుడు సదరు యువతికి అసభ్య సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. లైంగిక వాంఛ తీర్చాలని ఆ యువతిని పదేపదే వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు ఆ యువకున్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment