Cyber crime prolice
-
‘వార్ రూమ్’ కేసులో ప్రధాన నిందితుడికి నోటీసులు.. కానీ ఇక్కడో ట్విస్ట్!
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్ రూమ్ సోదాల కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలుకి నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అయితే, సునీల్ కనుగోలు నోటీసీ కాపీని అందుకున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి సంతకం చేయడం గమనార్హం. తెలంగాణ గళం, భారత యువకుడు పేర్లతో సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న మీమ్స్ వీడియోలు అసభ్యకరంగా ఉండటంతో నగరంలో 5 కేసులు నమోదయ్యాయని గతంలోనే పోలీసులు వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లను కించపరుస్తూ పోస్టులులు పెట్టారని ఆరోపణ వచ్చాయి. దానిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ కనుగోలు టీంలోని ముగ్గురు సభ్యులు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఐపీసి సెక్షన్ 469, 505 కింద సునీల్ కనుగోలు టీం మీద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ‘ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇలా చేస్తారా.. నేను కూడా అదే పోస్ట్ చేస్తా’ పరారీలో సునీల్ కనుగోలు.. ‘మీమ్స్ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు -
అసభ్యకర ఫోటోలు.. యాంకర్ అనసూయని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాంకర్ అనసూయని సోషల్ మీడియాలో వేదిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ఆమె కంప్లైంట్ చేసింది. అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. నకిలీ అకౌంట్స్‌తో ప్రముఖ హీరోయిన్స్, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ల్యాప్‌టాప్‌లో అనసూయతో పాటు విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలు ఉన్నాయని, వీళ్లతో పాటు మరికొంతమందిని నిందితుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నిందితుడిపై 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. -
పవిత్రా లోకేశ్ ఫిర్యాదు.. ఆ వెబ్సైట్లకు నోటీసులు జారీ
సినీనటి పవిత్రా లోకేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 8 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయిన పవిత్రా లోకేశ్ ఇటీవలె సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నటుడు నరేశ్, తన పట్ల కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు వైరల్ చేస్తున్నారని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియాలో పవిత్ర-నరేష్‌లపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్‌కు నోటీసులు జారీ చేసింది. -
ఆన్లైన్ డేటింగ్‌కు బానిసైన డాక్టర్.. పట్టమంటాడు... వదలమంటాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ డేటింగ్ బానిసగా మారిన ఓ వైద్యుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. తనను మోసం చేసిన నిందితులను పట్టుకోవాలని రెండుసార్లు, పట్టుకున్న వారిని వదిలేయాలని ఓసారి ఇప్పటికే ఈ అధికారులను వేధించాడు. తాజాగా సోమవారం మరోసారి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేస్తూ ఇప్పటి వరకు తన నుంచి రూ.1.5 కోట్లు కొట్టేసిన ‘లొకంటో క్రిమినల్స్’ను కటకటాల్లోకి పంపాలని వేడుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పద్మారావ్‌నగర్‌కు చెందిన వ్యక్తి (60) కేంద్ర సర్వీసులో వైద్యుడిగా గుజరాత్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోనే ఉంటున్నాడు. ఇతను 2020లో లొకంటో సైట్లో కనిపించిన ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. సైబర్ నేరగాళ్లు యువతుల ఫొటోలు అందులో పోస్టు చేసి సెల్ నంబరు ఇచ్చారు. డేటింగ్‌పై ఆసక్తి ఉంటే కాల్ చేయాల్సిందిగా సూచించారు. ♦సదరు వైద్యుడు వారికి కాల్ చేయగా... కొందరు వ్యక్తులు మాట్లాడి ఆ ఫొటోలు ఉన్న యువతులు డేటింగ్‌కు సిద్ధమన్నారు. దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకుని, కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. ♦అలా ఆ ఏడాది జూన్ 6 నుంచి అతను ‘చెల్లింపులు’ మొదలెట్టాడు. ఈ కథను వాట్సాప్‌లోకి మార్చిన నేరగాళ్లు ఆ యువతులే చాట్ చేస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు నమ్మించారు. తమను కలుసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని చెప్పించారు. ♦వైద్యుడు నమ్మేయడంతో దఫదఫాలుగా నగదు వేయించుకుంటూ వెళ్లాడు. ప్రతి సందర్భంలోనూ చెల్లించిన మొత్తంలో కొంత రీఫండ్ అన్నారు. ఏ దశలో అయినా డబ్బు చెల్లించడం ఆపేస్తే ఏమాత్రం తిరిగి రాదంటూ బెదిరించారు. ♦దీంతో బాధితుడు 2020 అక్టోబర్ వరకు రూ.41.5 లక్షలు, కొంత విరామం ఇచ్చినా 2021 మార్చి వరకు మరో రూ.30 లక్షలు చెల్లించేశాడు. జీతంలో దాచుకున్న దానితో పాటు అప్పులు చేసి, చివరకు ప్రావిడెంట్ ఫండ్ లోన్లు తీసుకుని డబ్బు చెల్లించాడు. ♦విషయం కుటుంబీకులకు తెలియడంతో రెండుసార్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు గతేడాది ఢిల్లీకి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు. అతడి ఖాతాలో రూ.18 లక్షలు పడినట్లు ఆధారాలు సేకరించారు. ♦నేరం అంగీకరించిన అతగాడు రూ.12 లక్షలు తిరిగివ్వడానికీ ఒప్పుకున్నాడు. నెల అతడు జైల్లో ఉన్న తర్వాత వైద్యుడు అడ్డం తిరిగాడు. తనతో ఫోన్లో మాట్లాడి మోసం చేసిన వ్యక్తి గొంతు, ఇతడి గొంతు వేరుగా ఉన్నాయని, అతడిచ్చే డబ్బు తనకు వద్దన్నాడు. ♦కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసి, నిందితుడిని వదిలి పెట్టే వరకు సైబర్ క్రైమ్ పోలీసులను తనదైన శైలిలో వేధించాడు. ఆపై మళ్లీ ఇతడికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. యువతులు మాట్లాడటం, రీఫండ్ అంటూ చెప్పడంతో డబ్బు చెల్లించడమూ కొనసాగించారు. ♦ఈ కాలంలో మరో రూ.80 లక్షలు వరకు చెల్లించేశాడు. కనీసం ఇంటి ఖర్చులకు డబ్బులేని స్థితికి చేరడంతో సమీప బంధువు విషయం తెలుసుకున్నాడు. ఆయన ద్వారా సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. ♦వైద్యుడితో పాటు అతడి కుటుంబం పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న ఏసీపీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఇన్స్పెక్టర్ ప్రశాంత్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. చదవండి: ఐ లవ్యూ డాడీ.. అమ్మను గొంతుకోసి చంపేశా! క్షమించు -
ముందు సర్వర్లోకి.. తర్వాత నెట్‌వర్క్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో జరిగిన రూ.12.93 కోట్ల సైబర్ నేరం కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కాస్త పురోగతి సాధించారు. హ్యాకింగ్ ఎలా జరిగిందో దర్యాప్తు అధికారులకు స్పష్టత వచ్చింది. గురువారం బంజారాహిల్స్‌లోని సర్వర్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు.. మహేష్ బ్యాంకు అధికారులు, సర్వర్ నిర్వాహకులతో పాటు ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో కలిసి విశ్లేషించారు. సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌లు వాడి తొలుత సర్వర్‌లోకే ప్రవేశించారని, ఆపై బ్యాంక్ నెట్‌వర్క్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారని గుర్తించారు. నగదు బదిలీ అయిన వాటిలో 3 కరెంట్ అకౌంట్లకు సంబంధించిన వారితో సైబర్ నేరగాళ్లకు సంబంధం ఉండకపో వచ్చని భావిస్తున్నారు. లావాదేవీల సమాచారం వీరికి చేరకుండా సైబర్ నేరగాళ్లు వారి ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ నంబర్లను మార్చేశారు. బషీర్‌బాగ్ బ్రాంచ్‌లో షానాజ్ బేగం పేరుతో ఓ మహిళ తెరిచిన సేవింగ్ ఖాతాతో లింకైన నంబర్‌ను మాత్రం నేరగాళ్లు మార్చలేదు. దీంతో ప్రతి లావాదేవీకి సంబంధించిన ఓటీపీ, సమాచారం ఆమె నంబర్‌కు చేరాయి. బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ అందుకున్నప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆ మహిళ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ 4 ఖాతాల నుంచి డబ్బు ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 129 ఖాతాల్లోకి వెళ్లింది. వాటి నుంచి మరికొన్ని ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలుస్తుందని.. ప్రత్యేక బృందాలను ఆ రాష్ట్రాలకు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
‘ఆన్లైన్ ట్రేడింగ్’ పేరుతో రూ.1.2 కోట్లు కొట్టేసిన గ్యాంగ్!!
సాక్షి హైదరాబాద్: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో నగర మహిళకు ఎర వేసి, ఆమె నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో కీలక సూత్రధారితో పాటు అతడికి సహకరించిన వ్యక్తీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రజిత్ పతారియా సూత్రధారిగా ఓ ముఠా ఏర్పడింది. అదే ప్రాంతానికి చెందిన అశ్విన్ ఇతడికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు. ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన వీళ్లు అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపారు. నగరానికి చెందిన మహిళకు వీరి నుంచి సాక్షి మెహతా పేరుతో వచ్చి రిక్వెస్ట్‌ను ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇరువురి మధ్యా చాటింగ్స్ నడిచాయి. అలా ఆమెను ముగ్గులోకి దింపిన నేరగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్, పెట్టుబడులు, భారీ లాభాలంటూ మొత్తం రూ.1.2 కోట్లు తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేశారు. ఈ మేరకు బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ హరిభూషణ్ రావు నేతృత్వంలోని బృందం బ్యాంకు ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా ముందుకు వెళ్లింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలో గాలించిన బృందాలు ఇప్పటికే అజయ్ ఓజా, సుమిత్ వర్మ, రాహుల్, మహేష్, తరుణ్ ప్రజాపతి, బాలు చౌహాన్, సందీప్‌లను అరెస్టు చేశారు. వీరి విచారణ నేపథ్యంలోనే ఈ గ్యాంగ్ మొత్తానికి రజిత్ పతారియా సూత్రధారని, అతడి సహాయకుడు అశ్విన్ సైతం కీలక పాత్ర పోషించాడని తేలింది. దీంతో వీరిని భోపాల్‌లో అరెస్టు చేసిన అధికారులు సిటీకి తీసుకువచ్చారు. వీరిపై ఛత్తీస్‌గడ్‌లోనూ అనేక కేసులు నమోదై ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. -
అమెజాన్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేస్తే..లబోదిబో!!
ఓ వ్యక్తి అమెజాన్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ప్యాక్ ఓపెన్ చేసి చూసి సృహతప్పి పడిపోయాడు!! అందులో ఏముందంటే.. కేరళలోని కొచ్చికి చెందిన నూరుల్ అమీన్ అనే వ్యక్తి రూ. 70,900ల ఖరీదైన ఐఫోన్ 12ను అమెజాన్‌లో అక్టోబర్ 12న ఆర్డర్ చేశాడు. అమెజాన్ పే కార్డ్‌తో బిల్ కూడా కట్టేశాడు. అక్టోబర్ 15న ఆర్డర్ ప్యాక్ వచ్చింది. ఉత్సాహంతో తెరిచాడు.. తీరా చూస్తే లోపల అంట్లు తోమే సోప్, 5 రూపాయల కాయిన్ ఉన్నాయట. దీంతో సదరు ఎన్నారై సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! ఐతే నూరుల్ ఆర్డర్ చేసిన ఐఫోన్‌ను అప్పటికే జార్ఖండ్‌కి చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్ నుంచి వినియోగిస్తున్నాడనే విస్తుపోయే వాస్తవం బయటపడింది. దీంతో సైబర్ పోలీసులు అమెజాన్ అధికారులను సంప్రదించగా.. సెప్టెంబర్ 25 నుండి జార్ఖండ్‌లో ఈ ఫోన్ వాడుకలో ఉందని, నూరుల్ నుంచి అక్టోబర్‌లో ఆర్డర్ వచ్చింది కానీ అప్పటికే స్టాక్ అయిపోయిందని, అతను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని వెల్లడించారట. తనకెదురైన ఈ వింత సంఘటనను నూరుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే అది వైరల్ అయ్యింది. ఐఫోన్ బదులుగా ఆకుపచ్చ రంగు విమ్ డిష్ వాష్ సబ్బు, రూ .5 నాణెం కనిపించే ఒక చిత్రం కూడా సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు ఇటుకలు, సబ్బులు.. ఆర్డర్ ప్యాకుల్లో రావడం మామూలైపోయింది. సో.. కస్టమర్లు ఆన్లైన్ పర్చేజింగ్తో కాస్త జాగ్రత్త మరి. చదవండి: Mystery Case: 5 యేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ.. -
డైరెక్టర్‌నంటూ నటికి ఫ్రెండ్ రిక్వెస్ట్, అసభ్య సందేశాలతో టార్చర్!
Actress Payel Sarkar: ప్రముఖ డైరెక్టర్ పేరిట ఓ వ్యక్తి తనకు అసభ్యకర సందేశాలు పంపుతున్నాడంటూ బెంగాలీ బుల్లితెర నటి పాయల్ సర్కార్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది.ఫేక్ అకౌంట్ ద్వారా సదరు వ్యక్తి తనకు తరచూ నీచమైన మెసేజ్‌లు చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర నటి పాయల్ సర్కార్‌కు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అతడి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడగా ప్రముఖ బెంగాలీ దర్శకుడు రవి కినాగి ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో పాటు అతడి సినిమాలకు సంబంధించిన వివరాలు కూడా ఉండటంతో సదరు వ్యక్తి నిజంగానే దర్శకుడని నటి నమ్మేసింది. దీంతో ఆదివారం ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. అతడు మాట కలుపుతూ.. తను తీయబోయే సినిమాలో ప్రధాన పాత్ర ఇప్పిస్తానని నటికి ఆశ చూపించాడు. అందుకు ఆమె సంతోషించేలోపే నీచమైన మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. దీంతో పాయల్‌కు అది డైరెక్టర్ అకౌంటేనా? లేదా ఫేక్ అకౌంటా? అన్న అనుమానం మొదలైంది. ఆ అనుమానానికి ఆజ్యం పోస్తూ అతడు వరుసగా అసభ్య సందేశాలు పంపాడు. వెంటనే ఆమె ఆ మెసేజ్‌లను స్క్రీన్షాట్లు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అతడి ప్రొఫైల్ చూసిన ఆమె అభిమానులు, స్నేహితులు వాళ్లు దాన్ని ఫేక్ అకౌంట్ అని తేల్చగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. బరక్‌పూర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. కాగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో ఆడవారిని వేధించే ఇలాంటి దుర్మార్గులను శిక్షించాల్సిందేనంటోంది పాయల్. మరోవైపు తన పేరు మీద ఫేక్ ఐడీలు క్రియేట్ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని దర్శకుడు రవి సైబర్ పోలీసులను కోరినట్లు సమాచారం. అంతేకాకుండా సినిమా అవకాశం కావాలంటే తనకు ఫోన్ చేయడమో లేదా కార్యాలయానికి రావాలే తప్ప ఇలా సోషల్ మీడియాలో రిక్వెస్టులు పంపకూడదని సూచించాడు. -
ప్రేమ పేరుతో వంచించి.. నగ్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి..
విజయవాడ స్పోర్ట్స్: నీతో స్నేహం కావాలని వెంటపడితే ఆ యువతి అతడిని నమ్మి స్నేహం చేసింది.. ఆ తర్వాత నిన్ను ప్రేమిస్తున్నానంటే నిజమేనని నమ్మింది. అతడిలోని నయవంచనను గ్రహించలేని యువతి తన నగ్న వీడియోలను కూడా పంపింది. తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తడంతో ఆ వీడియోలను యువకుడు తన స్నేహితుడితో సోషల్ మీడియాలో పోస్టు చేయించాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరు నిందితులను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సైబర్ క్రైమ్ ఏసీపీ బి.రాజారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బిహార్‌కు చెందిన రోహిత్‌కుమార్ మూడేళ్ల క్రితం విజయవాడలో డిగ్రీ చదువుతున్న ఓ యువతి వెంట పడ్డాడు. ఆ యువతి అతడితో స్నేహం చేసింది. ఇదే అదునుగా భావించిన రోహిత్‌కుమార్ ఆమె స్నేహాన్ని ప్రేమగా మార్చాడు. అతడిని పూర్తిగా నమ్మిన యువతి ఆమె నగ్న వీడియోలను అతడికి పంపింది. ఇటీవల ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఎలాగైనా ఆమెను వేధించాలనుకున్న రోహిత్ కృష్ణలంకకు చెందిన తన స్నేహితుడు దండగల గణేష్‌కు యువతి నగ్న వీడియోలను పంపాడు. గణేష్ అదే యువతి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాను తెరిచి.. అందులో ఆమె చిత్రాలను, నగ్న వీడియోలను పోస్టు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి న్యాయం చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి మూడు రోజుల రిమాండ్ విధించారు. -
సైబర్ అలర్ట్: ఓటీపీ.. చెప్పకపోతేనే హ్యాపీ!
శ్రీకాకుళం: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర లేపారు. ఇప్పటివరకు రకరకాలుగా ప్రజలను మోసం చేస్తుండ గా అవి పోలీసుల దృష్టికి రావడం, వాటిపై దృష్టి సారించి దర్యాప్తులు చే స్తుండడంతో జనాలను దోచుకోవడానికి కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారాలకు ఉన్న ఆదరణను చూసి దీనిపై దృష్టి సారించి ప్రజలను మభ్య పెడుతున్నారు. వీటిపై సైబర్ అవేర్నెస్ వీక్‌లో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎలా మోసగిస్తారు..? వినియోగదారులకు ఫోన్ చేసి మీకు అమెజాన్ నుంచి లేదా ఫ్లిప్‌కార్ట్ నుంచి పార్సిల్ వచ్చిందని, దాన్ని ఎక్కడ డెలివరీ చేయాలని అడుగుతారు. తాము ఎలాంటి పార్సిల్‌ను బుక్ చేయలేదని చెబితే.. దాన్ని క్యాన్సిల్ చేస్తామని, అందుకు గాను మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని చెప్పాలని కోరుతున్నారు. దీంతో వినియో గదారుడు ఎలాంటి అనుమానం పడకుండా తమకు వచ్చిన ఓటీపీని చెబుతుండడంతో అప్పటికే ఆ ఫోన్ నంబర్‌కు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి క్షణాల్లో డబ్బు మాయమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండి ఓటీపీలను ఏ ఒక్కరికీ చెప్పకుండా ఉంటే సైబర్ నేరగాళ్ల ఉ చ్చులో పడకుండా ఉండేందుకు వీలవుతుందని పో లీసులు సూచిస్తున్నారు. బ్యాంకులు గానీ, మరే సంస్థలు గానీ నేరుగా ఫోన్ ద్వారా ఓటీపీలు, సీవీవీలు, ఏటీఎం కార్డు నంబర్లు అడగవని వారు చెబుతున్నారు. కేవలం సైబర్ నేరగాళ్లు మాత్రమే ప్రజలను ఏమారుస్తూ నేరాలకు పాల్పడుతున్నారని, ఓసారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే తిరిగి వాటిని రాబట్టడం అంత సులభంగా అయ్యే పని కాదని అంటున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారు ఇతర రా ష్ట్రాల్లోనో, ఇతర దేశాల్లోనో ఉన్నవారు కావడంతో ఈ తరహా కేసులు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసపూరిత ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ఉచ్చులో పడకుండా ఉండాలని సైబర్ అవేర్నెస్ వీక్‌లో చెబుతున్నారు. -
పోర్న్ వీడియోలు చూశావ్.. ఫైన్ కట్టమంటూ రూ.30 లక్షలకు టోకరా
న్యూఢిల్లీ: మీరు ఇంటర్నెట్లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు.. జరిమానా చెల్లించండి అంటూ బోగస్ నోటీసులు పంపుతూ.. డబ్బు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. నిందితులను గ్రాబ్రియేల్ జేమ్స్, రామ్ కుమార్ సెల్వం, బి.ధీనుశాంత్‌గా గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు ఈ ప్రాంతంలో ఒక వారం పాటు క్యాంప్ చేసి, చెన్నై, త్రిచి, కోయంబత్తూర్, ఉధగామండలం(ఊటీ) మధ్య 2 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. చివరికి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ తమ సూత్రధారి బి చందర్‌కాంత్ ఆదేశాల మేరకు ఈ పనిచేశామని.. అతడు కంబోడియాలో ఉంటాడని తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చందర్‌కాంత్.. ధీనుశాంత్ సోదరుడు. ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు.. జరిమానా కట్టండి అంటూ తమకు నోటీసులు వచ్చాయని పలువురు బాధితులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు వచ్చిన బోగస్ పాప్ అప్ నోటీసులను కూడా షేర్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సైబర్ క్రైం బ్రాంచ్ ఈ కేసును సుమోటోగా తీసుకుని.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బాధితులకు వచ్చిన బోగస్ పాప్ అప్ నోటీసులను టెక్నిలక్ టీం పరిశీలించి.. ఇవన్ని చెన్నై నుంచి వచ్చినట్లు తెలిపింది. దాంతో ఓ టీం చెన్నైలో వారం రోజుల పాటు మకాం వేసి.. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. విచారణలో ధీనుశాంత్ బోగస్ పోలీసు నోటీసులు, ఇంటర్నెట్ వినియోగదారులకు వాటిని పంపించడం వంటి మొత్తం ఆపరేషన్‌కు సంబంధించిన సాంకేతిక భాగాన్ని అతని సోదరుడు బి. చందర్‌కాంత్ నిర్వహిస్తున్నారని తెలిపాడు. అతడు కంబోడియా రాజధాని నమ్ పెన్ సమీపంలో ఉన్న వీల్ పోన్ నుంచి వీటన్నింటిని ఆపరేట్ చేసేవాడని తెలిపాడు. "ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో, మోసం చేసిన డబ్బును తరలించడానికి 20 కి పైగా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్లు కనుగొన్నాం’’ అన్నారు పోలీసులు. ‘‘నిందితులు ముగ్గురు ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు గుర్తించబడిన యూపీఐ ఐడీలు, బోగస్ నోటీసులలో ఉపయోగించిన క్యూఆర్ సంకేతాల ద్వారా 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు. ఇలా వచ్చిన డబ్బును సోదరుడు చందర్‌కాంత్ క్రిప్టోకరెన్సీల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తరలిస్తున్నట్లు ధీనుశాంత్ వెల్లడించాడు. డబ్బును దాచడానికి మరిన్ని ఖాతాలను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నందున ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయాలి’’ అని పోలీసులు తెలిపారు. -
కానిస్టేబుల్‌తో ఎఫైర్.. అసభ్యకరమైన మెసేజ్‌లు
సాక్షి, నాగోలు: తనను పెళ్లి చేసుకోలేదని కోపంతో నకిలి ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ఖాతాలను సృష్టించి బాధితుడి భార్యకు, అతని కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్న ఓ మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాగోలు ప్రాంతంలో ఉండే ఎఆర్ కానిస్టేబుల్‌కు బండ్లగూడలో ఉండే అల్లూరి నేహా అలియస్ బ్లెస్సీ (33)తో జిమ్‌కు వెళ్లే సమయంలో పరిచయం అయింది. కొంతకాలం ప్రేమించున్నారు. అప్పటికే ఎఆర్ కానిస్టేబుల్‌కు పెళ్లి అయి భార్య ఉంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఎల్బీనగర్ పోలీసులకు నేహా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి ఉద్యోగి కూడా పోయింది. బెయిల్ మీద బయటకు వచ్చిన అతనిపై, అతని కుటుంబ సభ్యులపై పగ పెంచుకున్న నేహా నకిలీ ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ఖాతాలను సృష్టించి, కొత్త మొబైల్ నంబర్ల ద్వారా అసభ్యకర సందేశాలను పంపడం ప్రారంభించింది. దీంతో బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ సీఐ ప్రకాష్ కేసు నమోదు చేసుకుని నేహాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలు నేహా చదవండి: ‘ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదు’ తిన్నది అరగడం లేదు సార్..అందుకే బయటకు వచ్చా.. -
అక్కకు అసభ్య సందేశాలు పంపిన తమ్ముడు
సాక్షి, హైదరాబాద్: వరుసకు సోదరి అవుతుందని కూడా ఆలోచించకుండా ఓ తమ్ముడు తన అక్కపైనే వేధింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో తరచూ అసభ్య సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశారు. తమ్ముడి వేధింపులు తాళలేక ఆ యువతి గురువారం సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆ యువకుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొన్నాళ్లుగా వరసకు తమ్ముడయ్యే ఓ యువకుడు సదరు యువతికి అసభ్య సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. లైంగిక వాంఛ తీర్చాలని ఆ యువతిని పదేపదే వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు ఆ యువకున్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
చైనాకు పరారైన లోన్‌యాప్ డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : రుణాలు తీర్చినా తీవ్ర వేధింపులకు పాల్పడుతూ ప్రాణాలు తీసుకునేలాగా చేసిన లోన్ యాప్స్ నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే వారు పోలీసులకు చిక్కకుండా స్వదేశం చైనాకు పరారయ్యారు. చైనాకు వెళ్లిన లోన్ యాప్స్ కంపెనీల రెక్టర్లను తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం రెడ్ కార్నర్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో డైరెక్టర్లను పట్టుకునే ప్రయత్నాలు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు. అయితే ఆ కంపెనీ నిర్వాహకులు పక్కా ప్లాన్‌తో ఈ వ్యవహారం నడిపించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసే వారు కూడా భారత్‌కు చెందిన వారిని డైరెక్టర్లుగా నియమించుకున్నారు. నేరం చేసినా తమ మీదకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పడ్డారు. ఆ విధంగా డైరెక్టర్లను నియమించుకున్న చైనా కంపెనీలు ఇప్పుడు వారి నేరాలు బహిర్గతమవడంతో వారు చైనాకు పారిపోయారు. చైనాకు చెందిన కంపెనీలు భారత్‌కు చెందిన వారితో కంపెనీ నడిపిస్తున్న విషయం కేసుల నమోదు అనంతరం బయటపడింది. ఆ కంపెనీల భారీ ఆఫర్లు ఇవ్వడంతో భారత్‌కు చెందిన చాలామంది ఆశ పడి డైరెక్టర్లుగా చేరారు. ఇలాంటి 16 కంపెనీలపై ఇప్పటివరకు దాడులు చేసి పోలీసులు మూసివేశారు. అయితే చైనాకు పారిపోయిన ఈ కంపెనీ డైరెక్టర్లను పట్టుకుంటే అసలు విషయాలు బయటకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా చైనాకు వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రుణాల యాప్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక దాదాపు 5 మంది బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. -
జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు
సాక్షి, సిటీబ్యూరో : సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో పంజా విసురుతున్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా నగరవాసులు అరచేతిలోని సెల్‌ఫోన్ నుంచే అన్ని చెల్లింపులకు వేదికగా ఉన్న పేటీఎం, ఫోన్‌పే తదితర యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సర్వీసులను లక్ష్యం చేసుకుంటున్నారు. గత ఆరు నెలలుగా పేటీఎం, ఇతర యూపీఐల నుంచి నో యువర్ కస్టమర్ (కైవేసీ) వివరాలు అప్డేట్ చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సెల్ఫోన్లకు కాల్ చేస్తూ.. ఇంకోవైపు సంక్షిప్త సమాచారాలు పంపుతూ వల వేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్ల మాయలో పడిన బాధితులకు కేవైసీ అప్డేట్ చేసే సమయంలో యాప్‌లు డెస్క్ యాప్, క్విక్ సపోర్ట్ యాప్, టీమ్ వీవర్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోమని చెబుతారు. అది అయిందా, లేదా అని తనిఖీ చేసేందుకు తొలుత రూ.1, లేదంటే రూ.100లు బదిలీ చేయాలని నమ్మబలుకుతారు. ఈ సమయంలో బాధితుడి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే హ్యాక్ చేసి లక్షల్లో డబ్బులను తమ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. ఇలా గత ఆరు నెలల నుంచి సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 50కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈతరహా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఇవి చేయకండి.. పేటీఎం అకౌంట్లైనా, ఇతర ఖాతాలైన ఆయా సంస్థ ప్రతినిథులు ఫోన్ కాల్ చేసి కేవైసీ వివరాలు అప్డేట్ చేయమని అడగరు. ఎస్ఎంఎస్లు కూడా పంపరు. అకౌంట్ వివరాలను ఎవరికీ చెప్పవద్దు. వివిధ అప్లికేషన్లు అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా డౌన్లోడ్ చేసుకోవద్దు. తనిఖీ కోసం ఇతరుల బ్యాంక్ ఖాతాకు అసలు డబ్బులు బదిలీ చేయవద్దు. మీ నాలెడ్జ్ లేకుండానే, మిమ్మల్ని మోసగించి డౌన్లోడ్ చేయించిన అప్లికేషన్ల ద్వారా మీ బ్యాంక్ ఖాతా వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి లక్షలు కాజేసే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మచ్చుకు ఓ కేసు.. ఇటీవల మాదాపూర్‌కు చెందిన అరుణ్ సెల్‌ఫోన్‌కు మీ పేటీఎం కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ నంబర్ నుంచి సంక్షిప్త సమాచారం వచ్చింది. వెంటనే అరుణ్ సదరు నంబర్‌కు ఫోన్న్కాల్ చేశారు. ఆయన అకౌంట్‌ను అప్డేట్ చేసేందుకు పేటీఎం వివరాలు కావాలనడంతో పాటు ఏనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని రూ.100 నామినీ డబ్బుగా పంపితే అప్డేట్ అవుతుందని నమ్మించాడు. ఇది నమ్మిన అరుణ్ ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. పేటీఎం నుంచి దశల వారీగా రూ.92,345లు డెబిట్ అయ్యాయని సెల్‌కు ఎస్ఎంఎస్లు వచ్చాయి. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నన్ను పెళ్లి చేసుకోకపోతే ఫలితం అనుభవిస్తావ్
కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫోన్ చేసి ‘నువ్వు, నీ భార్య కలిసున్న చిత్రాలు, వీడియోలు అశ్లీల వెబ్సైట్లో ఉంచుతాం’ అంటూ బెదిరించారు. ఆయన స్పందించకపోవడంతో ఆయన భార్య చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సాక్షి, సిటీబ్యూరో: సార్... నా పేరు స్వాతి (పోలీసులు పేరు మార్చారు). పీజీ చదువుకుంటున్నాను. కొద్దిరోజుల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన విందులో పాల్గొని, అందరితో కలిసి ఫొటోలు తీసుకున్నాను. ఇటీవల నాకు నిశ్చితార్థమైంది.నా స్నేహితుడంటూ ఎవరో అపరిచిత వ్యక్తి నాకు కాబోయే భర్తకు ఆ ఫొటోలను పంపించాడు. నా ఫోన్ నంబరుసంపాదించి ‘నన్ను పెళ్లి చేసుకోకపోతే ఫలితం అనుభవిస్తావ్’ అంటూ బెదిరించాడు. అసభ్యకరమైన చిత్రాలకు నా ముఖాన్ని మార్ఫింగ్ చేసి వ్యాఖ్యలు రాశాడు. ఈ కారణంగా నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు. మా అమ్మానాన్న నచ్చజెప్పినా వినడం లేదు. నేను తప్పు చేయలేదని నిరూపించండి. సైబర్ క్రైమ్ పోలీస్ అధికారితో స్వాతి మొర ఇది. ఇలాంటి ఇబ్బందులు ఒక్క స్వాతికే పరిమితం కాదు. ఎంతో మంది విద్యార్థినులు, యువతులు, మహిళలకు ఎదురవుతున్నాయి. తమ చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని విశ్లేషించిన పోలీస్ అధికారులు అపరిచితులు పంపిన చిత్రాలు, పోస్ట్‌లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఈ తరహా కేసులు సైబరాబాద్, రాచకొండలో ఎక్కువవుతున్నాయి. అపరిచితులతో స్నేహం వద్దు... ఫేస్బుక్ ఖాతాలతోనే విద్యార్థినులు, యువతులు, మహిళలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన చిత్రాలు, వ్యాఖలకు ‘లైక్’ కొట్టడం ద్వారా ఇలా జరుగుతోందని వివరిస్తున్నారు. ఎప్పుడో స్నేహితులతో గడిపిన సందర్భాలు, దేవాలయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో చాలామంది విద్యార్థినులు పెళ్లికి ముందు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫేస్బుక్ ఖాతాల్లోకి ప్రవేశిస్తున్న నిందితులు, నేరగాళ్లు... యువతులు, విద్యార్థినులు లక్ష్యంగా చేసుకుని వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిందితుల్లో బాధితులకు తెలిసినవారు, అపరిచితులు ఉంటున్నారు. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్లలో ఖాతాలున్న యువతులు, విద్యార్థినుల వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలను నేరగాళ్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. స్నేహితులు, బంధువులే ఎక్కువ ఫేస్బుక్ ద్వారా వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది బాధితుల స్నేహితులు, బంధువులే ఉంటున్నారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ఈ వివరాలు వెల్లడవుతున్నాయి. ఫేస్బుక్ ఖాతాలున్న యువతులు, విద్యార్థినులు తమ వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. వీటిని నేరగాళ్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెబుతున్నారు. అవతలి వారు ఇష్టం లేదని చెప్పిన రెండు, మూడు రోజుల నుంచి వేధింపులు ప్రారంభిస్తున్నారు. స్నేహితులు.. కదా అనుకొని వారితో ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్లుంటే ఆ ఫొటోలను ఫేస్బుక్లో ఉంచుతున్నారు. తల్లిదండ్రులకు చెబితే కొడతారన్న భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. వేధింపులు తీవ్రంగా మారినప్పుడు మాత్రం తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అపరిచితులు బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బు తీసుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఎంచుకుంటున్నారు. వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు పెట్టొద్దు మాకొస్తున్న ఫిర్యాదుల్లో బాధితులు చాలామంది తమ ఫేస్బుక్, ట్విట్టర్లో పెట్టిన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశారని అంటున్నారు. మేం³రిశీలిస్తే 50శాతం వరకు అలాంటివే. అందుకే విద్యార్థినులు, యువతులు... పార్టీలు, వేడుకలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫొటోలు, వీడియోలు దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని గుర్తించాలి. బంధువులు, స్నేహితులతో గడిపేటప్పుడు హద్దుల్లో ఉండండి. అపరిచితులతో ఫంక్షన్లకు వెళ్లడం, సినిమాలు, పార్టీలకు హాజరుకావడం వంటివి చేస్తే ఇబ్బందుల్లో పడతామనిగ్రహించండి. కళాశాలలు, కార్యాలయాల్లో జరిగే విషయాలను, ఇబ్బందికరంగా అనిపించినవి తల్లిదండ్రులకు తెలిపితే ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే పరిష్కరించుకోవచ్చు. – రోహిణి ప్రియదర్శిని, డీసీపీ,సైబరాబాద్ క్రైమ్స్ -
పోలీసులకు వాట్సాప్ ‘వేధింపులు’
నగరానికి చెందిన ఓ యువతిని ఉద్దేశించి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆవాట్సాప్ ఖాతా పని చేస్తున్న ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దీంతో దర్యాప్తునకు అవసరమైన ఆధారాల కోసం పోలీసులు వాట్సాప్ సంస్థకు ఈ–మెయిల్ పెట్టారు. దాదాపు నెల రోజులుగా ‘ఉత్తర–ప్రత్యుత్తరాలు’ మినహా సదరు సంస్థ ఆధారాలు పంపకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో:కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు పలు వాట్సాప్ ఆధారిత కేసుల దర్యాప్తులో పోలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు సోషల్‌మీడియా ద్వారా బాధితులకు వేధింపులు ఎదుర్కొంటుండగా... ఆ సంస్థ లీగల్ టీమ్ నుంచి పోలీసులూ అవస్థలు పడుతున్నారు. ఈ వ్యవహారంలో తాము ఏమీ చేయలేమని, కేంద్రం హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) స్థాయిలో ఓ పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గణనీయంగా పెరిగిన వినియోగం... సోషల్‌మీడియాలో ఫేస్బుక్ తర్వాత ఆ స్థాయిలో ప్రాచుర్యం వాట్సాప్‌కు మాత్రమే ఉంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపు వాట్సాప్‌ను వాడుతున్నట్లే లెక్క. అయితే దీని వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అదే స్థాయిలో సమస్యలూ ఎదురవుతున్నాయి. పలువురు వ్యక్తులు తాము టార్గెట్ చేసిన వ్యక్తిని వేధిస్తూ దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న కొందరు కేటుగాళ్లు తమ ఫోన్ నంబర్ కాకుండా సుదూర ప్రాంతంలో ఉన్న మరో నంబర్ ఆధారంగా తమ ఫోన్ నుంచే వాట్సాప్‌ను వాడుతున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో వాట్సాప్ హ్యాకింగ్ ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటికి సంబంధించి పోలీసులకు వస్తున్న ఫిర్యాదుల విచారణ, వారు నమోదు చేస్తున్న కేసుల దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే వాట్సాప్ సంస్థ నుంచి సాంకేతిక సహకారం, సమాచారం అనివార్యం. అయితే ఇక్కడే పోలీసులకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. విచారణ/దర్యాప్తునకు అవసరమైన సమాచారం అందించాల్సిందిగా పోలీసులు పంపిస్తున్న ఈ–మెయిల్స్‌పై వాట్సాప్ సంస్థ లీగల్ టీమ్ అవసరమైన స్థాయిలో స్పందించడం లేదు. కొన్నిసార్లు కావాల్సిన సమాచారంపై స్పష్టత కావాలని, మరి కొన్నిసార్లు ఆ వివరాలు అందించలేమని, ఇంకొన్ని సార్లు ఆ సమాచారం తమ వద్ద లేదంటూ ‘జాబులు–జవాబులతో’ కాలం వెళ్లదీస్తోంది. దీంతో తమను ఇబ్బంది పెడుతున్న వారి వివరాలు తెలియక, పోలీసులకూ వారు చిక్కక బాధితులకు వేధింపులు కొనసాగి వారు మనోవేదనకు గురవుతున్నారు. తప్పనిసరి అయినా... సైబర్ నేరాలకు సంబంధించిన కేసులో ఆయా ఆధారాలను కొన్నిసార్లు వ్యక్తులతో పాటు సోషల్‌మీడియా సంస్థల నుంచీ సేకరించాల్సి ఉంటుంది. బాధితులు, నిందితులతో పాటు జీమెయిల్, ఫేస్బుక్ వంటి సంస్థల నుంచి వీటిని సంగ్రహించడంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోయినా వాట్సాప్ విషయంలోనే అవస్థలు పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు కోరినా వారు స్పందించకపోవడం, ఎట్టకేలకు స్పందించినప్పటికీ సమగ్ర సమాచారం ఇవ్వడం లేదన్నారు. దీంతో అనేక కేసులు కొలిక్కిరాకుండా, కొన్ని పూర్తిస్థాయి అభియోగపత్రాలు దాఖలుకు నోచుకోకుండా పెండింగ్‌లో పడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని అధీకృత అధికారికి, నిర్ణీత కాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ఆయా వ్యక్తులు, సంస్థలపై ఉంటుంది. ఐపీసీలోని సెక్షన్ 188 సెక్షన్ దీనిని స్పష్టం చేస్తోంది. ఎవరైనా లేదా ఏ సంస్థ అయినా ఆధారాలు అందించకపోతే ఈ సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణించి తదుపరి చర్యలు తీసుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వాట్సాప్ వంటి అంతర్జాతీయ సంస్థలతో స్థానిక పోలీసులు పోరాడ లేరని, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమని వారు పేర్కొన్నారు. కేవలం ఈ–మెయిల్ సంప్రదింపుల మినహా వాట్సాప్ సహా మరికొన్ని సంస్థల కార్యాలయాలు సైతం ఎక్కడ ఉన్నాయనేది పోలీసులకు తెలియట్లేదు. వాట్సాప్‌ను ప్రస్తుతం ఫేస్బుక్ సంస్థ సొంతం చేసుకుని నిర్వహిస్తున్నా సమాచారం, ఆధారాలు పొందటంలో ఇబ్బందులు తప్పట్లేదని దర్యాప్తు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అంతా మోసం!
సాక్షి, సిటీబ్యూరో: కంటికి కనిపించకుండా అందినకాడికి దోచుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు పంథామార్చుకుంటున్నారు. వివిధ మార్గాల్లో మోసాలకుపాల్పడుతూ ప్రజలను నిలువునా ముంచుతున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకొని సిటీజనులు మోసపోతున్నారు. సెకండ్‌హ్యాండ్ సేల్స్ పేరుతో ఓఎల్ఎక్స్ వేదికగా దగా చేయడం, బ్యాంకు అధికారులఅవతారమెత్తి ఓటీపీ సంగ్రహించి టోకరా వేయడం, జాబ్స్/వీసాల పేరుతో దండుకోవడం, లాటరీ/రుణాల పేరుతో అందినకాడికి దోచుకోవడం, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతూ డిమాండ్ చేయడం... ఇలా వినూత్న మార్గాల్లో సైబర్ నేరగాళ్లు పంజావిసురుతున్నారు. ఈ కేటగిరీ క్రైమ్స్‌లో ఈ ఏడాది ఆగస్టు వరకు సిటీలో 720 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 198 ‘ఓఎల్ఎక్స్’ ఫ్రాడ్స్ ఉన్నాయి. గతంలో ఓటీపీ క్రైమ్ ఎక్కువగా నమోదు కాగా... ఇప్పుడా స్థానంలో ‘ఓఎల్ఎక్స్’ చేరింది. ఈ ఈ–కామర్స్ సైట్లో ఆర్మీ ఉద్యోగుల పేరుతో పోస్టింగ్స్ పెట్టి, సెకండ్‌హ్యాండ్ వస్తువుల్ని అతి తక్కువ ధరకు విక్రయిస్తామంటూ డబ్బులు దండుకొని మోసం చేస్తున్నారు. భరత్పూర్ కేంద్రంగా... రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌లో ఉన్న భరత్పూర్ ఈ ఓఎల్ఎక్స్ నేరగాళ్లకు అడ్డాగా మారిపోయిందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఈ–కామర్స్ సైట్స్‌లో కార్లను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్‌గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకొని మోసం చేసే ముఠాలు అక్కడ అనేకం ఉన్నాయని వివరిస్తున్నారు. ప్రధానంగా ఓఎల్‌ఎక్స్‌తో పాటు మరికొన్ని సైట్స్లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్ పెడుతున్న ఈ కేటుగాళ్లు ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన వారి ఫొటోలతోనే పోస్టింగ్స్ చేస్తున్నారు. వాటిలో బుల్లెట్‌తో పాటు వివిధ రకాలైన కార్ల ఫొటోలను పొందు పరుస్తున్నారు. తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందుకో, రిటైర్డ్ అయిన నేపథ్యంలోనే ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆర్మీ దుస్తుల్లో దిగిన ఫొటోలనూ పోస్ట్ చేసి మరింత నమ్మకం కలిగిస్తున్నారు. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు రేట్లు పొందుపరుస్తున్నారు. ప్రజలు తేలిగ్గా నమ్ముతారనే ఉద్దేశంతోనే ఆర్మీ పేరు వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా వాహనాల యజమానులు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వెహికల్ ఎయిర్పోర్ట్ పార్కింగ్‌లో ఉందంటూ చెబుతున్నారు. ఎవరైనా ఆసక్తి చూపించి వారిచ్చిన నంబర్లలో సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించాలని కోరుతున్నారు. తమ బ్యాంకు ఖాతాలతో పాటు వివిధ వాలెట్స్‌లోకి ఆ నగదు బదిలీ చేయించుకొని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేస్తున్నారు. అదే అదనుగా... విదేశాల్లో విద్యనభ్యసించడం, ఉద్యోగాలు చేయడం అనేక మంది కల. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకునే ముఠాలు పుట్టుకొచ్చాయి. సాధారణంగా విదేశాల్లో విద్య, ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లు ఇంటర్నెట్పై ఆధారపడతారు. అనేక వెబ్సైట్లు, బ్లాగులను సెర్చ్ చేయడంతో పాటు మరికొన్నింటిలో తమ ప్రొఫైల్స్ పొందుపరుస్తూ ఉంటారు. ఇవన్నీ సైబర్ నేరగాళ్లకు కలిసొచ్చే అంశాలుగా మారిపోతున్నాయి. ఆయా వెబ్‌సైట్స్ నుంచి సమాచారం సంగ్రహిస్తున్న నేరగాళ్లు విదేశీ విద్య, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. నేరుగా కాల్స్ చేయడమో, ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్ పంపడమో చేస్తున్నారు. వీటికి ఎదుటివారు స్పందిస్తే తమ ‘పని’ ప్రారంభిస్తున్నారు. ఫలానా వెబ్సైట్లో ప్రొఫైల్ చూశామని, తాము అందించే ఉద్యోగానికి సరిగ్గా సరిపోతుందని చెబుతుంటారు. విద్యార్థులకైతే ఆయా దేశాల్లో ఉన్న ప్రముఖ యూనివర్సిటీలతో తమకు సంబంధాలున్నాయని, ప్రతిఏటా కొన్ని సీట్లు రిజర్వ్ చేసి మరీ వాటిని భర్తీ చేసే అవకాశం నిర్వాహకులు తమకు ఇచ్చారని పేర్కొంటారు. ఆపై అడ్వాన్స్‌లు, వీసా ప్రాసెసింగ్ ఫీజులు, పన్నుల పేర్లు చెప్పి డబ్బు తమ బ్యాంకు ఖాతాల్లోకో, వాలెట్స్లోకో బదిలీ చేయించుకొని మోసం చేస్తుంటారు. ఒకసారి డబ్బు ముట్టిన తర్వాత బాధితులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరిని సంప్రదించడం సాధ్యం కాదు. అపరిచితులతోలావాదేవీలొద్దు... ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం అంత కష్టం. ఈ కేసుల్లో రికవరీలు దాదాపు అసాధ్యంగా మారిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో లావాదేవీలు చేయొద్దు. పరిచయం లేనివారు చెప్పిన మాటలు నమ్మి ఒక్క రూపాయి కూడా కోల్పోవద్దు. ఈ నేరగాళ్లు వినియోగించే సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు, వాలెట్స్ బోగస్ వివరాలతో పొందినవై ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిందితులను పట్టుకోవడం సాధ్యం కాదు. సైబర్ నేరాల విషయంలో ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యార్’ అనే నానుడి కచ్చితంగా పాటించాలి. ఏ వస్తువైనా వాటి విలువ కంటే తక్కువ ధరకు మార్కెట్లో దొరకదని, బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి ఓటీపీలు అడగరని, ఆన్లైన్ ప్రొఫైల్స్ ఆధారంగా ఉద్యోగాలు, విద్యావకాశాలు రావని గుర్తుంచుకోవాలి.– సిటీ సైబర్ కాప్స్ లాటరీలంటూ టోకరా... నగర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో నమోదవుతున్న కేసుల్లో లాటరీ/లోన్ ఫ్రాడ్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఈ నేరాలకు పాల్పడే నిందితులు వివిధ మార్గాల్లో బల్క్‌గా ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్స్ సంపాదిస్తున్నారు. డార్క్ వెబ్‌తో పాటు ఇంటర్నెట్లోనూ నామమాత్రపు ధరకు ఈ డేటాను అందించే సైట్లు అనేకం ఉన్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. ఈ వివరాల ఆధారంగా ప్రముఖ సంస్థల పేర్లతో లాటరీ తగిలిందని, తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామంటూ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్‌తో ‘విరుచుకుపడతారు’. ఎవరైనా స్పందిస్తే వారిలో నమ్మకం కలగడానికి ఆయా సంస్థల పేర్లు, లోగోలతో కూడిన సర్టిఫికెట్లను సైతం ఈ–మెయిల్/వాట్సాప్ ద్వారా బాధితులకు పంపిస్తారు. ఆ మొత్తం మీకు చేరాలంటే జీఎస్టీ మొదలు అనేక పన్నులు చెల్లించాలని చెప్పి తమ ఖాతాలు/వాలెట్స్‌లో వేయించుకొని మోసం చేస్తారు. ఈ నేరగాళ్లు అనేక సందర్భాల్లో మీరు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేసే ప్రతి పైసా లాటరీ మొత్తం లేదా రుణంతో కలిపి తిరిగి వచ్చేస్తుందని నమ్మిస్తారు. ఈ రెండు రకాలైన మోసాలతో పాటు ఇప్పటికీ బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సంగ్రహించి మోసం చేస్తున్న కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలూ అనేకం పోలీసు రికార్డులకు ఎక్కుతున్నాయి. -
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడంపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరో అజ్ఞాతవ్యక్తులు మంత్రికి ఫోన్ చేసి.. చంపుతామని బెదిరించారంటూ కిషన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 20న ఇంటర్నెట్ వాయిస్‌కాల్స్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి ఇంటివద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచి నిఘా పటిష్టం చేశారు. -
నౌహీరా కేసులో.. పోలీసుల దూకుడు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన హీరా గ్రూప్స్ అధినేత నౌహీరా కేసులో సీసీఎస్ పోలీసులు దూకుడుపెంచారు. నౌహీరా షేక్ పై నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం వెయ్యి పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో ఏ1గా నౌహీరా షేక్ పేరును చేర్చారు. ఇప్పటికే నౌహీరా షేక్ చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. నౌ హీరా బ్యాంక్ ఖాతాల్లో జరిగిన లావాదేవీల్లో డిపాజిటర్ల నుండి తీసుకున్న డబ్బుతో పాటు, డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన వివరాలు, నిధులు మళ్లించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది నౌహీరా బారిన పడ్డారు. ఆరేళ్ల క్రితం హీరా గ్రూప్ కంపెనీని నౌ హీరా ప్రారంభించారు. డిపాజిట్లకి అధిక వడ్డీతో తిరిగి చెల్లిస్తానని, చైన్ పద్ధతిలో స్కీం కు నౌహీరా కంపెనీ తెర లేపింది. ప్రారంభంలో 200 కోట్ల రూపాయాలతో డిపాజిట్లు చేయించుకుంటే, ఇప్పుడు కంపెనీ ఖాతాల్లో 23 కోట్లు రూపాయలు మాత్రమే ఉన్నాయి. గతేడాది మే నుండి డిపాజిట్ దారులకు నౌ హీరా చెల్లింపులు ఆపేసింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నౌహీరాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 2018 లో సీసీఎస్ పోలీసులు నౌ హీరా పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2018 లో హీరా షేక్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 28 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేయగా.. మిగతా వారి కోసం గాలింపుచేపట్టారు. -
రవిప్రకాశ్ శివాజీ కుట్ర బట్టబయలు
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు గరుడ పురాణం శివాజీల మధ్య జరిగిన కుట్ర బట్టబయలైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ ఈ మెయిల్స్‌ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్ బయటపడ్డాయి. టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపారని తేటతెల్లమయ్యింది. రవిప్రకాశ్, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్లు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది. ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: (బెజవాడలో రవిప్రకాశ్, శివాజీ!) కుట్రకు సంబంధించిన పలువురు వక్తుల మధ్య బదిలీ అయిన పలు ఈ మెయిల్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు. రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్... వాస్తవానికి ఏప్రిల్13, 2019న తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్‌ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తికి రవిప్రకాశ్ సన్నిహితుడు, న్యాయవాది శక్తి మెయిల్ చేశారు. ఈ మెయిల్‌ను రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపించారు. ఫిబ్రవరి 20, 2018న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:39 గంటల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక శివాజీ ఎన్సీఎల్టీలో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్‌ను విజయవాడకు చెందిన ఓ అడ్వకేట్ రూపొందించారు. ఆ మరుసటి రోజున అంటే, ఏప్రిల్14, 2019న ఉదయం 5:38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం తొమ్మిది గంటల కల్లా, విజయవాడ అడ్వకేట్‌కు పంపించాల్సి ఉంటుందంటూ శక్తి ... రవిప్రకాశ్, ఆయన అనుచరులకు మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్‌పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్టయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రవిప్రకాశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో, ఎన్సీఎల్టీలో జరగబోయే విచారణ మీదే ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు రవిప్రకాశ్ సన్నిహితుడు, న్యాయవాది శక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. -
బెజవాడలో రవిప్రకాశ్, శివాజీ!
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపులు, ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్...సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు పాటు ఆయన గడువు కోరారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని రవిప్రకాశ్ ఈ మెయిల్లో తెలిపారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్‌పై పోలీసులు సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా రవిప్రకాశ్ నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. ప్రస్తుతం రవిప్రకాశ్, శివాజీ విజయవాడలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలో తలదాచుకున్నారన్న సమాచారం మేరకు వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది. -
రుణాల పేరిట 600 మందికి టోకరా..!
సాక్షి, హైదరాబాద్ : తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాల పేరుతో ఎర వేసి అడ్వాన్స్ చెల్లింపుల పేరిట ఓటీపీ సహా బ్యాంకు వివరాలు సంగ్రహించి అందినకాడికి దండుకుంటున్న ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. రాజధానిలోని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాల్సెంటర్లపై దాడులు చేసి మొత్తం 62 మందిని అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా 600 మంది నుంచి దాదాపు రూ.25 కోట్లు స్వాహా చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా... మిగిలిన 54 మందిని సైతం నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌లతో కలసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ పూర్తి వివరాలు వెల్లడించారు. చెన్నైకి చెందిన కొందరు సూత్రధారులు పంజగుట్ట, బంజారాహిల్స్‌లో ఎలైట్ కనెక్ట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నగరంలోని రెండింటికీ ఎ.ఆశాకుమారి, బంజారాహిల్స్ వాసి రంగస్వామి గోపి మేనేజర్లుగా జె.భూపాల్‌రెడ్డి (చందానగర్), బి.సాయిరామ్ (కార్ఖానా), జి.నరేశ్ యాదవ్ (కర్మన్ ఘాట్), మెహజబీన్ ఖాన్ (సోమాజిగూడ), విజయలక్ష్మి (అమీర్‌పేట్), ఆర్.అపూర్వ (శంషాబాద్) టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి వద్ద మరో 60 మంది వరకు టెలీకాలర్లుగా, ఇతర ఉద్యోగులుగా పని చేస్తున్నారు. చెన్నైకి చెందిన సూత్రధారులు కొన్ని కాల్సెంటర్లకు చెందిన ఉద్యోగుల నుంచి అనేక మందికి చెందిన సెల్‌ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఒక్కో నంబర్ కోసం గరిష్టంగా రూ.5 వరకు వెచ్చిస్తున్నారు. ఆ నంబర్ల సిరీస్‌ను బట్టి సీరియల్‌గా రాసుకుంటూ మరికొన్నింటిని రూపొందిస్తున్నారు. వీటి ఆధారంగా టెలీ కాలర్లు వారికి ఫోన్లు చేస్తుంటారు. తాము మహేంద్ర ఫైనాన్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుంటారు. ఆపై గరిష్టంగా రూ.10 లక్షల వరకు కేవలం 6.5 శాతం వార్షిక వడ్డీకి వ్యక్తిగత రుణం అంది స్తామంటూ నమ్మబలుకుతారు. ఆసక్తి చూపిన వారికి తమ వాట్సాప్ నంబర్ ఇచ్చి పాన్ కార్డు, ఆధార్ కార్డు తదితరాలను పంపాలని కోరతారు. వాటిని పరిశీలించి రుణం మంజూరైందంటూ మరోసారి కాల్ చేస్తారు. తమ కంపెనీ నిబంధనల ప్రకారం రుణ మంజూరుకు గాను రెండు నెలసరి వాయిదాలు ముందుగానే చెల్లించాలని చెప్పి, మాటల్లో పెట్టి డెబిట్‌కార్డు వివరాలు, ఓటీపీ తెలుసుకుని ఆ మొత్తాన్ని వారే బాధితుడి ఖాతా నుంచి జస్ట్ డయల్ పే–యూ ఖాతాలోకి మళ్లించుకుంటారు. ఈ ఖాతాలన్నీ చెన్నైకి చెందిన సూత్రధారుల అధీనంలో ఉంటాయి. ఇక్కడి వారికి మాత్రం వారు నెల వారీ జీతాలు చెల్లిస్తూ ఉంటారు. ఈ రకంగా ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా 10 వేల మందికి ఫోన్లు చేశారు. ఈ వివరాలన్నింటినీ తమ వద్ద ఉన్న పుస్తకాల్లో పొందుపరిచారు. వీరిలో 600 మంది వరకు రుణాలకోసం ఆసక్తి చూపటంతో వారి నుంచి రూ.25 కోట్లు స్వాహా చేశారు. ఏడాదిగా సాగుతున్న ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ బాధితుడి ద్వారా సమాచారం అందింది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి వీరి కాల్‌సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది. రూ.5 లక్షల రుణం మంజూరైందని ఆయన నుంచి బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు. ఖాతా నుంచి రూ.32 వేలు కాజేశారు.అప్రమత్తమైన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్, ఎస్సైలు జి.తిమ్మప్ప, పి.సురేశ్‌ల బృందాలు రెండు ప్రాంతాల్లో ఉన్న కాల్ సెంటర్లపై దాడులు చేశాయి. మొత్తం 62 మందిని అదుపులోకి తీసుకుని సీసీఎస్‌కు తరలించాయి. వీరి నుంచి రూ.80 వేల నగదు, ల్యాప్‌టాప్‌లు, రూటర్లు తదితరాలు స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.6 లక్షలు ఫ్రీజ్ చేశాయి. అదుపులోకి తీసుకున్న వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేసి మిగిలిన వారికి నోటీసులు ఇచ్చారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. ఇలాంటి మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. -
రిక‘వర్రీ’!
సాక్షి, సిటీబ్యూరో: లాటరీలు, బహుమతులు, సన్మానాల పేరుతో సంక్షిప్త సందేశాలు, ఈ–మెయిల్స్‌తో ఎరవేసి అందినకాడికి దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు దొరకడం దుర్లభంగా మారింది. ఒకవేళ నిందితులుగా ఉంటున్న నైజీరియన్ల చిక్కుతున్నా... వీరి నుంచి నగదు, సొత్తు రికవరీ చేయడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రజలు సైబర్ నేరాల్లో కోల్పోతున్న మొత్తాల్లో గరిష్టంగా 10 శాతం మాత్రమే రికవరీ చేయగలుగుతున్నామని సైబర్ క్రైమ్ అధికారులు పేర్కొంటున్నారు. మోసాల ద్వారా ఆర్జించిన సొమ్మును నైజీరియన్లు వస్తువులుగా మార్చి తమ దేశానికి తరలిస్తుండటమే ఇందుకు కారణమన్నారు. ‘వివరాల’ సేకరణకు మార్గాలెన్నో... సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలను ఈ–మెయిల్ లేదా ఎస్సెమ్మెస్, ఫోన్‌కాల్‌తో ప్రారంభిస్తారు. అనేక మార్గాల ద్వారా మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. బహుమతులు, క్విజ్‌ల పేరుతో ఆన్లైన్లో చాలా సాధారణమైన ప్రశ్నలను అడుగుతూ వ్యక్తిగత వివరాలు పూరించమంటారు. మరోపక్క ఫ్రీ గిఫ్ట్ ఓచర్ల పేరుతో అనేక వాణిజ్య ప్రాంతాల్లో పేరు, నంబర్, మెయిల్ ఐడీలతో స్లిప్స్ పూరించి బాక్సుల్లో వేయించే విధానాలు ఇటీవల పెరిగాయి. ఇవన్నీ అనేక మార్గాల్లో సైబర్ నేరగాళ్లకు చేరుతున్నాయి. ఆన్లైన్ ద్వారా లక్ష ఫోన్ నెంబర్లు/ఈ–మెయిల్స్ రూ.30 వేలకు విక్రయించే వెబ్సైట్లూ ఉన్నాయి. వీటి ఆధారంగా ముఠాలుగా ఏర్పడి దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు ఏ సందర్భంలోనూ పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలకూ ‘వక్రమార్గాలు’... స్కీములు, పన్నులు, పెట్టుబడులంటూ బాధితుల నుంచి సొమ్ము స్వాహా చేయడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని నైజీరియన్లే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలెక్కువ. దేశం బయట ఉన్న బ్యాంకులవి అయితే కస్టమర్లు అనుమానించే ప్రమాదం ఉంది. ఇందుకోసం వారు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, అందుకోసమే ఖాతాలంటూ వారిని నమ్మిస్తున్నారు. వీరిని సాంకేతిక పరిభాషలో ‘మనీమ్యూల్స్’ గా పేర్కొంటారు. రోజుల్లోనే వస్తువులుగా ‘ఎక్స్పోర్ట్’... దీంతో ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో వారిని పట్టుకోవడం కష్టమవుతోంది. కేవలం ఆయా ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు తీసుకుంటున్న నైజీరియన్లు తమ పని కానిస్తున్నారు. మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును నగదు రూపంలో నైజీరియాకు పంపడం ఇబ్బందికరం కావడంతో దీనిని వస్తురూపంలోకి మార్చి తమ దేశానికి తరలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ముఠాలో కొందరు బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చి ఎక్కువగా వస్త్ర వ్యాపారుల ముసుగులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మొత్తాన్ని తమ వద్ద ఉంచుకుని, మిగిలిన దాంతో ఢిల్లీలో ఉన్న పాలికాబజార్, సరోజినీ మార్కెట్, చాందినీ చౌక్‌ల్లో హోల్‌సేల్‌గా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. వీటిని బిజినెస్ వీసాపై వచ్చిన వారికి అప్పగించడం ద్వారా కన్సైన్మెంట్ రూపంలో ఓడల ద్వారా నైజీరియాకు పంపిస్తున్నారు. ఈ కన్సైన్మెంట్స్ను రిసీవ్ చేసుకునే ముఠా సభ్యులు నైజీరియాలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగానే నైజీరియన్ల నుంచి నగదు రికవరీ చేయడం అసాధ్యంగా మారుతోంది. 24 గంటల్లో ఫిర్యాదు చేయాలి ‘సైబర్ నేరాల్లో నిందితుల నుంచి రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారింది. ఈ కేసుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించడంలో ఆలస్యం చేస్తుండటం మరో ఇబ్బందికర అంశంగా మారుతోంది. బాధితులు 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే కొంత వరకు ఉపయుక్తం. నగదు ఆన్లైన్లో బదిలీ చేసినట్లైతే అది క్లియర్ కావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. ఏటీఎం ద్వారానూ నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఒకేసారి విత్‌డ్రా చేయలేరు. ఈ అవకాశాల్ని వినియోగించుకుని బ్యాంకును సంప్రదించడం ద్వారా విత్‌డ్రా కాకుండా ఆపి, రికవరీ చేయవచ్చు’.– సైబర్‌క్రైమ్ అధికారులు -
షావోమికు ఝలక్ : నకిలీ ఎంఐ స్టోర్లు
సాక్షి, న్యూఢిల్లీ : షావోమి ఇండియాకు నకిలీల బెడద తప్పలేదు. ఏకంగా షావోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్‌కు దేశీయంగా అక్రమార్కులు భారీ ఝలక్ ఇచ్చింది. తప్పుడు సంతకాలతో, నకిలీ పత్రాలతో ఫ్రాంచైజీలను ఓపెన్ చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని స్వయంగా మనుకుమార్ జైన్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఈ స్కాం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. దీనికి సంబంధించి పత్రాలను కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ నకిలీలు స్టోర్లు, మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది రీటైలర్లు తమను మోసం చేశారని స్వయంగా మనుకుమార్ జైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎంఐ స్టోర్లు కొనుగోలుకు సంబంధించిన ఈ స్కాంలో కొంతమంది రీటైలర్ల అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ట్వీట్ చేశారు. దీనిపై విచారణ సాగుతోందని వెల్లడించారు. FRAUD ALERT! I have come across a scam where few retailers have been cheated into buying fake franchises of @XiaomiIndia Mi Stores! Shocking to see forged documents, with my fake signatures. We have filed a case with cyber crime department & police is investigating this matter. pic.twitter.com/AbK6Pvfbei — Manu Kumar Jain (@manukumarjain) February 12, 2019