సినీనటి పవిత్రా లోకేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 8 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయిన పవిత్రా లోకేశ్ ఇటీవలె సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
నటుడు నరేశ్, తన పట్ల కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు వైరల్ చేస్తున్నారని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియాలో పవిత్ర-నరేష్‌లపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్‌కు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment