Anchor Anasuya Photos Morphed Accused Arrested - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj : హీరోయిన్లే టార్గెట్‌.. నిందితుడి ల్యాప్‌టాప్‌లో రష్మీ, విష్ణుప్రియ ఫోటోలు

Published Sun, Nov 27 2022 12:10 PM | Last Updated on Sun, Nov 27 2022 12:56 PM

Anchor Anasuya Photos Morphed Accused Arrested - Sakshi

యాంకర్‌ అనసూయని సోషల్‌ మీడియాలో వేదిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలుగులో టాప్‌ యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్‌ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్‌తో సోషల్‌ మీడియాలో వేధిస్తున్నారంటూ ఆమె కంప్లైంట్‌ చేసింది. అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిందితుడిని ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. నకిలీ అకౌంట్స్‌తో ప్రముఖ హీరోయిన్స్‌, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అభ్యంతకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడి ల్యాప్‌టాప్‌లో అనసూయతో పాటు విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలు ఉన్నాయని, వీళ్లతో పాటు మరికొంతమందిని నిందితుడు టార్గెట్‌ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నిందితుడిపై 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement