Anchor anasuya
-
అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
-
స్టార్ హీరో ‘అడిగితే’ నో చెప్పా.. చాలా కోల్పోయా: అనసూయ
ఆడ, మగ జాతల మధ్య అట్రాక్షన్ అనేది కామన్. ఏ రంగంలోనైనా ఇది ఉంటుంది. సినిమా అనేది రంగుల ప్రపంచం కాబట్టి ఇక్కడ స్పెషల్ ఫోకస్ ఉంటుంది. చాన్స్‌ల పేరుతో అమ్మాయిలను లోబర్చుకునే అవకాశం ఇక్కడ ఎక్కువ. అలా కాకుండా కళను నమ్మి అవకాశాలు ఇచ్చే రోజులు రావాలి. ఆ అమ్మాయి మనదగ్గరకు ‘రాకపోతే’ ఏంటి.. క్యారెక్టర్ బాగా చేస్తుంది కదా అని హీరోతో పాటు దర్శకనిర్మాతలు అనుకోవాలి. అప్పుడే చాలా మంది అమ్మాయిలు సినిమా రంగంలో రాణిస్తారు’ అని అంటోది యాంకర్, నటి అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj ). ఎలాంటి విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అనసూయ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రంగంలో అమ్మాయిలపై ఎలాంటి దృష్టికోణం ఉంది? అమ్మాయిలు ఎలా ఉండాలి? తదితర విషయాలపై ఓపెన్‌గా మాట్లాడింది.‘నో’ చెప్పడం కాదు..ఎదుర్కొవాలిచాన్స్ల పేరుతో వాడుకునేందుకు చాలా మంది హీరోలతో పాటు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తారు. నా విషయంలో కూడా అలా జరిగింది. ఓ స్టార్ హీరో ‘అడిగితే’ నో చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్ అడిగితే సున్నితంగా తిరస్కరించాను. దాని వల్ల నాకు సినిమా చాన్స్‌లు పోయాయి. నో చెప్పడం కాదు అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను కూడా ఎదుర్కొనే ధైర్యం అమ్మాయిల్లో ఉండాలి. ప్రపోజల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడే ప్రపోజ్ చేశారు. నో చెప్పాను. అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి ప్రపోజల్స్ వచ్చాయి. అప్పుడు ఎలా నో చెప్పానో ఇప్పుడు అలానే చెప్పాను. వాళ్లు కోరుకునేది ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. దాని కోసం కాకుండా కళను చూసి పాత్రలు ఇస్తే బాగుంటుంది. ‘ఆమె రాకపోతే ఏంటి..ఆ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా’అని అనుకోవాలి. అప్పుడే చాలా మంది అమ్మాయిలు ఈ రంగంలోకి వస్తారు.ఈజీ కాదు.. కరెక్ట్ అనిపించేదే చెయ్చాలా మంది ఎన్నో ఆశలలో సినిమా రంగంలోకి వస్తారు. కానీ ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. చాన్స్‌ల కోసం ఈజీ పద్దతి వెతుకుతారు. అది తప్పు. ఏది కరెక్ట్ అయితే అదే చెయ్. పది మంది తప్పు చేస్తున్నారు కదా..నేను కూడా తప్పు చేస్తా అనడం కరెక్ట్ కాదు. నువ్వు తప్పు చేయకుండా ఉండు. ఈజీ వేలో కాకుండా నీ కష్టాన్ని, కళను నమ్ముకొని ప్రయత్నించు. అలాంటి వారిని ప్రోత్సహించే రోజులు రావాలి.నాపై మీ పెత్తనం ఏంటి?ఇక సోషల్ మీడియాలో అనసూయ పెట్టె పోస్టులు ఎంత వైరల్ అవుతాయో అందరికి తెలిసిందే. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తారు. ఆమె డ్రెస్సింగ్‌పై కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. తాజాగా దీనిపై కూడా అనసూయ స్పందించింది. ‘నన్ను ఇష్టపడేవాళ్ల కోసం నేను ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తుంటాను. నేను ఎలాంటి ఫోటోలు అయినా షేర్ చేస్తా. అది నా ఇష్టం. నేను ఏం డ్రెస్ వేసుకోవాలి? బికినీ వేసుకోవాలా లేదా మొత్తం విప్పి తిరుగాలా’ అనేది నా ఇష్టం. దాన్ని వల్ల నేను ఇవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ నెగెటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా? అయినా నాపై మీ పెత్తనం ఏంటి? అంటూ అనసూయ మరోసారి నెటిజన్స్‌పై మండిపడింది. -
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. అనసూయ ఆసక్తికర పోస్ట్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆ ఊరిలో దాక్కున్న జానీ?)ఇప్పటికే నటి పూనమ్ కౌర్, సింగర్ చిన్మయితో సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ బాధితురాలికి అండగా నిలిచారు. తాజాగా యాంకర్, నటి అనసూయ కూడా ఈ వివాదంపై స్పందించారు. లేడి కొరియోగ్రాఫర్‌కు జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు ఇలాంటి వేధింపులు ఎదురైతే.. వెంటనే భయటపెట్టాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.సానుభూతి అవసరం లేదు‘మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని పశ్నించే తత్వం ఉండాలి. మీకే కాదు మీకు తెలిసిన వాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే బయటపెట్టండి. మీకు అందరూ అండగా ఉంటారు. బాధితురాలితో నేను కూడా కలిసి పని చేశాను. పుష్ప సెట్స్‌లో రెండు మూడు సార్లు ఆ అమ్మాయిని చూశాను. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్‌ను ఏమాత్రం తగ్గించలేవు. (చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!)కానీ, మనసులో దాచుకొని బాధపడడం వల్ల ఎలాంటి లాభం లేదు. నేను పనిచేసే చోట మహిళలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందిస్తాను. ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు ఓడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను’అని అనసూయ రాసుకొచ్చింది. పరారీలో జానీ మాస్టర్!జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు..అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు విషయం తెలియగానే..హైదరబాద్ నుంచి నెల్లూరికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం నార్సింగి పోలీసులకు తెలియడంతో.. నెల్లూరికి ఓ బృందాన్ని పంపించారట. జానీ మాస్టర్‌కి నోటీసులు అందించి, నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. -
కొత్తరకం డ్రెస్‌లో అనసూయ.. ‘ఈజిప్ట్ మమ్మి’ అంటూ ట్రోలింగ్
-
దమ్ముంటే వారిని అనండి.. అనసూయ ట్వీట్ వైరల్
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంందో అందరికి తెలిసిందే. ప్రతి రోజు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలను, సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంది. ఆమె చేసే ట్వీట్లు చాలా సార్లు కాంట్రవర్సీకి దారి తీశాయి. అయినా కూడా అనసూయ ఎక్కడ తగ్గట్లేదు. తనను నచ్చిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఒకటి మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసిందో తెలియదు కానీ..అది కాస్త వైరల్ అయి మళ్లీ అనసూయ వార్తల్లో నిలిచింది.అనసూయ చేసిన ట్వీట్ ఏంటంటే..‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలాగండి? నిజంగా మీకు దమ్ముంటే నా మీద కాదు.. తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగేవారిని అనండి. కానీ మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. (చదవండి: రెండోసారి గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్)కాగా, గతంలో ఓ యంగ్ హీరోని ఉద్దేశించి అనసూయ చేసిన ట్వీట్‌పై ఇప్పటికీ ట్రోల్స్ నడుస్తూనే ఉంటున్నాయి. అనసూయ పెట్టే ప్రతి ప్రెస్ మీట్లోనూ ఆ వివాదం గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అయితే అనసూయ కూడా తప్పించుకోకుండా ఓపిగ్గా సమాధానం చెబుతూనే ఉంటుంది. ఇప్పుడు చేసిన ట్వీట్ కూడా ఆ వివాదం గురించేనని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సింబా సినిమా ఆగస్ట్ 9న విడుదల కానుంది. 😄 Maree inta chaatakaanivaalla laaga unte elagandi.. nijanga meeku kaaltundante naa meeda kaadu.. astamaanam nenu em pani chesina aa topic laage vaallani anandi dammunte.. kaani meeru ala cheyaru kada.. endukante meeku adi chaatakaadu.. mee hero laaga aadavaallani uddesinchi…— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 24, 2024 -
డెలివరీ అయిన మూడోరోజే అనసూయ అలా చేసింది!
సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అయ్యే యాంకర్.. అనసూయ భరద్వాజ్. ఆంటీ అన్న ఒక్క పదంతో నెటిజన్లు ఈమెను ఆటాడుకుంటారు. తన డ్రెస్సింగ్‌ను, మాటల్ని.. అన్నింటినీ విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ప్రతిదాన్ని భూతద్దంలో వెతికి మరీ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అయితే ఎవరెన్ని చేసినా ఆమెను దెబ్బతీయలేరంటున్నాడు సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్. ఈయన జబర్దస్త్ కామెడీ షోకి సైతం స్క్రిప్ట్ రైటర్‌గా వ్యవహరించాడు. అర్ధరాత్రి వరకు.. తాజాగా అతడు అనసూయ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'అలీ టాకీస్ అనే షో చేసినప్పుడు అనసూయ ఎపిసోడ్ షూట్ అవగానే రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రిహార్సల్స్ చేసేది. ఆమెకు పనిపట్ల అంతటి అంకితభావం ఉంది. ఓసారి ఓ టీవీ ఛానల్ వాళ్లు నా డైరెక్షన్లో కొత్త షో చేద్దామన్నారు. అనసూయను యాంకర్‌గా అనుకున్నారు. ఆమె కూడా ఒప్పుకుంది. టెస్ట్ షూట్ చేద్దామన్నారు. అందుకోసం డేట్ ఫిక్స్ చేసుకున్నాం. డెలివరీ అయిన మూడో రోజే.. సరిగ్గా షూటింగ్‌కు రెండు రోజుల ముందు ఆమె డెలివరీ అయింది. ఒకరోజు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంది. రెండో రోజు జిమ్‌కు వెళ్లింది. మూడో రోజు సెట్‌కు వచ్చింది. అరగంటకోసారి బిడ్డకు పాలు పడుతూ యాంకరింగ్ చేసింది. అందరం ఆశ్చర్యపోయాం.. ఆ రోజు షూటింగ్‌కు వచ్చినందుకుగానూ ఇంతవరకు డబ్బులు అడగలేదు. టెస్ట్ షూటే కదా నేను రాలేను, ఇంకెవర్నైనా చూసుకో అని మాట వరసకు కూడా అనలేదు. అందరూ ఊరికే తనను విమర్శిస్తుంటారు. కానీ తనంత టఫ్ అమ్మాయి ఇండస్ట్రీలో ఎవరూ లేరు. పైకి చూడటానికి గ్లామర్‌గా కనిపిస్తుంది కానీ దాని వెనక ఆ అమ్మాయి పడ్డ కష్టాలు ఎవరికీ తెలియదు' అని చెప్పుకొచ్చాడు ప్రసన్న కుమార్. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన రకుల్.. మరోసారి.. -
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు (ఫోటోలు)
-
అలాంటి వాళ్లు ‘ఆంటీ’ అంటే నాకు ఇష్టమే : అనసూయ
అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. వెండితెరపై దూసుకెళ్తోంది. నిడివిని పట్టించుకోకుండా.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ.. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలం’లోని రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయకు మంచి గుర్తింపుని తేవడంతో పాటు వరుస సినిమా అవకాశాలు వచ్చేలా చేసింది. అయితే అనసూయ మాత్రం సినిమా ఎంపిక విషయంలో ఆచుతూచి వ్యవహరిస్తోంది. కేవలం డబ్బు కోసమే కాకుండా..గుర్తింపు వచ్చే పాత్ర ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటుంది. అందుకే మన దర్శకులు అనసూయ కోసం ప్రత్యేక పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పెదకాపు చిత్రంలోనూ.. అనసూయ మంచి పాత్ర పోషించింది. ప్రస్తుతం పుష్ప 2తో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తోంది. కెరీర్ పరంగా ఇలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన సోషల్ మీడియా ఖాతాల్లో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఆమె షేర్ చేసే కొన్ని ఫోటోలు, వీడియోలు కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె పెట్టే పోస్ట్‌లను కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ‘ఆంటీ’అనే పదాన్ని వాడుతూ నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ‘ఆంటీ’ అనే పదం వింటే తనకు ఎందుకు కోపం వస్తుందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది అనసూయ. ఆంటీ అనే పదం తప్పు కాదు కానీ.. ఎదైన అంశంపై నేను స్పందిస్తే చాలు.. ‘ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవచ్చు కదా ఆంటీ ’అని కామెంట్స్ పెడతారు. ‘ఆంటి అనే పదం తప్పు కాదు.. కానీ చాలామంది ఇప్పుడు ఈ పదాన్ని వల్గర్‌గానే వాడుతున్నారు. చిన్న పిల్లలు, తెలిసిన వాళ్ళు వచ్చి ఆంటీ అని ముద్దుగా పిలుస్తారు. అలా వాళ్లు ఆంటీ అని పిలిస్తే నాకు ఇష్టమే. కానీ నా కంటే పెద్దవాళ్లు, తెలియని వాళ్లు ‘ఆంటీ’ అని మరో అర్థం వచ్చేలా పిలిస్తారు. అందుకే నాకు ఆ పదం నచ్చదు. ఆంటీ అంటే ఇంగ్లీష్ లో పిన్ని అని అర్థం. అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి ఈ పదాన్ని వాడతారు. కానీ ఇప్పుడు ఆ పదాన్ని కొంతమంది వల్గర్‌గా వాడుతున్నారు. వాళ్లే భవిష్యత్తులో రేపిస్టులు అవుతారు నేను చిన్నప్పుడు చాలా మందిని ఆంటీ అనే పిలిచాను. ఇప్పటికీ కొంతమంది తెలిసిన వాళ్లను అలానే పిలుస్తాను. ఆంటీ అని పిలవడం వాళ్లకు నచ్చకపోతే.. నేను పిలవడమే మానేస్తాను. అలా పిలిస్తే..వాళ్లు హర్ట్ అవుతారని నేను అర్థం చేసుకోగలను. నాకు ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం లేదని చెప్పిన తర్వాత..మళ్లీ మళ్లీ ఎందుకు అనాలి? పైశాచిక ఆనందం కోసం ఎదుటివాళ్లను హర్ట్ చేయాలా? నా మీద కామెంట్స్ చేసిన వాళ్లను ఈ జన్మలో ఎప్పుడో ఒక్కసారైనా ఎదురెదురుగా చూసే అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు. పైగా నేను ఎలా ఉంటానో అతనికి తెలియదు. ఇలా ఫేస్ టు ఫేస్ పరిచయం లేని వ్యక్తిపైనే ఇంత అయిష్టాన్ని పెంచుకుంటే.. చుట్టుపక్కల ఉన్న మహిళలను ఇంకెలా చూస్తారు? ఇలాంటి వాళ్లే భవిష్యత్తులో రేపిస్టులుగా మారుతారు’అని అనసూయ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rajesh Manne Official (@rajeshmanne1) -
Anchor Anasuya HD Photos: తెల్ల చీరలో యాంకర్ అనసూయ స్టన్నింగ్ లుక్స్
-
ఐదు రోజులుగా ఆ సమస్యతో బాధపడుతున్న అనసూయ!
ఎవరేం అనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ తనకు నచ్చినట్లుగా ముందుకు సాగుతుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. తన మనసులో ఉన్న మాటను నిస్సంకోచంగా బయటపెడుతుంది. ఎటువంటి విమర్శలనైనా లైట్ తీసుకుంటుంది. ఒకవేళ కోపమొస్తే సోషల్ మీడియా వేదికగా కౌంటరిస్తుంది. కానీ ఏ తాటాకు చప్పుళ్లకు ఆమె భయపడదు. అయితే తాజాగా ఆమె అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది. ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నానంటూ అనసూయ ట్విటర్(ఎక్స్)లో చెప్పుకొచ్చింది. 'ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. అందుకే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నాను. ఈ సమయంలో చాలా విషయాలు గుర్తించాను. నిర్దయగా వ్యవహరించడం, సాటి మనుషుల పట్ల జాలి లేకపోవడం.. వేధింపులు.. ఇలా చాలా గమనించాను. అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం..' అని ఆమె ట్వీట్ చేసింది. 'ఇప్పుడు స్టార్స్‌గా వెలుగొందుతున్నవారందరూ తమ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవారే! ఎటువంటి పీఆర్ ప్రమోషన్స్ లేకుండా అద్భుత విజయాలు అందుకుని వారు ఈ స్థాయికి చేరుకున్నారు. వారి ప్రయాణాన్ని గౌరవించండి. అంతేకానీ వారి అభిమానులం అని చెప్పుకుని మరొకర్ని కించపరచొద్దు. విమర్శించడం మంచిదే.. కానీ అది గౌరవప్రదంగా ఉండాలి. బహిరంగంగా బూతుపదాలు, అడ్డగోలుగా మాట్లాడటాన్ని తగ్గించండి. బాధ్యతగా వ్యవహరించండి' అని చెప్పుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. It’s good to see such hard core admiration.. really.. its good to have differences in options.. its okay to criticise.. but it should be done with die respect.. please don’t normalise the horrible uncivilised language.. that too so out in the open.. let it be constructive..🙏🏻 — Anasuya Bharadwaj (@anusuyakhasba) September 16, 2023 View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
అనసూయ బాధని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి!
యాంకర్ అనసూయ ఉన్నట్టుండి ఏడ్చేసింది. తన ఇన్ స్టాలో రీసెంట్గా ఆ వీడియో పోస్ట్ చేసింది. దీంతో అందరూ ఆమెకి ఏమైందా అనుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల బాధపడిందేమో అనుకున్నారు. కానీ కారణం అది కాదని, ఆ నెగిటివిటీకి తాను బాధపడే రకం కాదని చెప్పుకొచ్చింది. అయితే అనసూయ ఏం చెప్పాలనకుందనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆమె మనసు అర్థం చేసుకున్నాడు. ఓ లెటర్ రాశాడు. ఆ వ్యక్తి లెటర్ అనసూయ ఏడుపు వీడియో పోస్ట్ చేయగానే చాలామంది ఆమెపై కౌంటర్స్ వేశారు. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా దీన్ని పోస్ట్ చేయడం ఒకటైతే, ఆ కారణంతో ఏడవలేదు, ట్రోల్స్ రీజన్ కాదని ఏదేదో చెప్పుకొచ్చింది. అయితే ఈమె వీడియో సారాంశాన్ని అర్థం చేసుకున్న ఓ అభిమాని, ఆమెకు ఓ లెటర్ రాశాడు. ఇప్పుడు దాన్ని అనసూయ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తాను చెప్పాలనుకున్నది ఈ మేటరే అని పేర్కొంది. (ఇదీ చదవండి: బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ) లెటర్లో ఏముంది? 'సోషల్ మీడియా మెల్లగా మన జీవితాల్ని ఆక్రమించేసింది, తన గుప్పిట్లోకి మనల్ని లాగేసకుంది. అనసూయ ముఖ్యమైన పాయింట్ లేవనెత్తింది. ఫొటోల్లో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాం. కానీ మనం బాధల్లో బతుకుతున్నాం కదా? హ్యాపీగా ఉన్నామని చూపించుకుంటూ ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాం. సైకియాట్రిస్ట్‌లు ఇదే చెబుతున్నారు. సంతోషంగా ఉండటానికి బదులు అలా చూపించుకునే వరకు వచ్చాం' 'ఆ వీడియోలో మనం ఓ విషయం గమనించొచ్చు. ఫెర్ఫెక్షన్ అనేది బూటకం. ఒత్తిడికి కారణం అదే. అనుభవం అనేది వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, తగిలిన దెబ్బలతో వస్తుంది. అందరి పట్ల దయతో ఉండండి. వారి జీవితాల్లో ఎలాంటి బాధ అనుభవిస్తున్నారో మనకు తెలీదు అని అనసూయ చెప్పింది. ట్రోలింగ్ వల్ల బాధపడతారు. ఓ మాట అనేటప్పుడు ఇవి ఆలోచించాలి. అంటున్నది నిజమేనా? ఎదుటివాళ్లు బాధపడతారా? మనకు జాలి దయ లేవా? అనేవి గుర్తుపెట్టుకోవాలి' అని లెటర్లో రాసుంది. ఇదంతా చూస్తుంటే.. సోషల్ మీడియా ట్రోలింగ్ గురించే అని అనసూయ బాధపడుతుందని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) -
Anasuya Bharadwaj : అనసూయని ఎత్తుకున్న భర్త.. మామిడితోటలో అలా! (ఫోటోలు)
-
భర్తతో బీచ్‌లో మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
బికినీలో అనసూయ రచ్చ.. భర్తతో కలిసి బీచ్‌లో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Anchor Anasuya : స్విమ్మింగ్ పూల్‌లో ఫ్యామిలీతో అనసూయ, మొదటిసారి బికినీలో (ఫొటోలు)
-
Anchor Anasuya: కుటుంబ సభ్యులతో కలిసి యాంకర్ అనసూయ పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
మీ పెంపకం ఎలాంటిదోనన్న అనసూయ.. ఈ లొల్లేందన్న రాహుల్
హీరోలకు అభిమానులు రక్షణ కవచం వంటివారు. తమ అభిమాన హీరోను పల్లెత్తు మాట అన్నా అస్సలు సహించలేరు. అలాంటిది ఏకంగా కించపరిస్తే ఊరుకుంటారా? పట్టపగలే చుక్కలు చూపిస్తారు. యాంకర్, నటి అనసూయ విషయంలో ఇదే జరిగింది. ఎందుకోగానీ ఎప్పటినుంచో అనసూయకు, విజయ్ దేవరకొండ అంటే పడదు. గతంలో ఈ హీరో స్టేజీపైనే బూతు డైలాగ్ చెప్పాడని విమర్శించినందుకు ఫ్యాన్స్ అనసూయనే తిట్టిపోశారు. ఇటీవల డైరెక్ట్‌గా విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ అతడు ఖుషి సినిమా పోస్టర్లో పేరుకు ముందు The అని పెట్టుకోవడంపై సెటైర్లు వేసింది. పైత్యం.. అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్ చేసింది. ఇంకేముంది, ఆ మాట ఎవరిని ఉద్దేశించి అందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు అభిమానులు. మా రౌడీ హీరో మీద నీకెందుకంత ఒళ్లు మంట ఆంటీ.. అంటూ మళ్లీ ఆమెను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అటు అనసూయ కూడా ఎక్కడా తగ్గకుండా వీలు దొరికినప్పుడల్లా రివర్స్ కౌంటర్ ఇస్తూ వస్తోంది. తనపై బూతుల వర్షం కురిపిస్తున్నవారిని ఉద్దేశిస్తూ తాజాగా ఓ ట్వీట్ వేసింది అనసూయ. 'నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనెలా తప్పవుతాను? నా పెంపకం గర్వించదగ్గది.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి' అని రాసుకొచ్చింది. దీనిపై కమెడియన్ రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ 'ఇలా అడుగుతున్నందుకు దయచేసి నన్ను క్షమించగలరు, ఇంతకీ ఇక్కడ జరుగుతున్న లొల్లి ఏంటో తెలుసుకోవచ్చా?' అని అడిగాడు. దీనికి నెటిజన్లు.. 'అనసూయ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ వార్ జరుగుతోంది', 'ఎప్పుడు చూడూ లైమ్ లైట్ కోసం హంగామా అనిపిస్తోంది, బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాయితీలు.. అందరూ ఆమెను ఆంటీ అనడం మేడమ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం', 'విజయ్ The అన్న పదం ఖుషీ పోస్టర్లో వాడినందుకు అనసూయకు కోపమొచ్చింది నోటికొచ్చినట్లు వాగింది, చివరికి ఫ్యాన్స్ చేతిలో చీవాట్లు తింటోంది' అని కామెంట్లతో క్లారిటీ ఇస్తున్నారు. Pardon me for being uninformed but I’m curious to know what this is all about 🧐 — Rahul Ramakrishna (@eyrahul) May 10, 2023 చదవండి: భార్యను దూరం పెట్టిన పూరీ జగన్నాథ్? క్లారిటీ ఇదే! -
మళ్లీ రెచ్చిపోయిన అనసూయ.. విజయ్ను టార్గెట్ చేసిందా?
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అనసూయ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా షేర్ చేస్తుంటుంది. అయితే అవి కొన్నిసార్లు కాంట్రవర్సీలకు కారణం అవుతుంటాయి. తాజాగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ అనసూయ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ను షేర్ చేస్తూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ది విజయ్ దేవరకొండ అని రాసి ఉంది. (సాధారణంగా యూనిక్ విషయాలకు, వస్తువుల గురించి మెన్షన్ చేసేటప్పుడు ది అని వాడుతుంటాం). ఈ పోస్టర్‌పై పరోక్షంగా స్పందించిన అనసూయ ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే ఒకటి చూశాను.. ‘The’నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం" అంటూ ఎవరి పేరు మెన్షన్ చేయకుండానే అనాల్సిందంతా అనేసింది. ఈ క్రమంలో విజయ్ను కావాలనే టార్గెట్ చేసిందంటూ రౌడీ ఫ్యాన్స్ అనసూయపై ఫైర్ అవుతున్నారు. ఆంటీ అంటూ అనసూయను తెగ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై రియాక్ట్ అయిన అనసూయ.. భలే రియాక్ట్ అయ్యారు దొంగ.. ఊప్స్.. బంగారుకొండలంతా నేను అనేది నిజమని నిరూపిస్తున్నారు అంటూ మరో ట్వీట్ చేసింది. గతంలో అర్జున్ రెడ్డి, లైగర్ సినిమాల విషయంలోనూ అనసూయ, విజయ్ ఫ్యాన్స్‌కు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam 🙊 — Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023 Bhale react autunnarra donga..oops.. bangarukondalanta.. ekkado akkada nenu nijam anedi prove chestune unnanduku thanks ra abbailu 🤭😊😇 — Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023 -
'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ్మత్తలా ఉందే!
బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది అనసూయ భరద్వాజ్. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. తాజాగా మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం విమానం. నేడు(సోమవారం)మేడే సందర్భంగా అనసూయ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇది రంగస్థలంలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రను గుర్తుచేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. చదవండి: షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరో.. ట్వీట్ వైరల్ సంతోష్ కట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్,సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఎంగేజ్మెంట్ శారీలో మురిసిపోతున్న అనసూయ.. ఫోటోలు వైరల్
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించిన తెలిసిందే. గ్లామరస్ యాంకర్‌గా అనసూయకు పేరుంది. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.ప్రస్తుతం టీవీ షోలతో పోలిస్తే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వరుస మూవీ ఆఫర్లతో బిజీబిజీగా ఉంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన పెళ్లినాటి మధుర ఙ్ఞాపకాలను షేర్ చేసుకుంది. గులాబీ రంగు చీరలో మెరిసిపోయిన అనసూయ.. ఇది 15ఏళ్ల క్రితం నాటి తన ఎంగేజ్మెంట్ శారీ అంటూ మురిసిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు: యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఆంటీ అంటూ కొందరు నెటిజన్లు ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. అలా ట్రోల్స్ చేసిన వాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అరెస్ట్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఇన్స్టాగ్రామ్ నెటిజన్లతో కాసేపు ముచ్చటించిన అనసూయ వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అక్కా.. మిమ్మల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ..ఎందుకంటే వాళ్ళ అర్దాలు వేరే ఉంటాయి కాబట్టి. అయినా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే కూడా నాకు అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఒక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తానని చెప్పి క్యూరియాసిటీని పెంచింది. -
అనసూయ ఏం చేసినా అలానే పిలుస్తున్నారే
-
నేను అదే మొత్తుకుంటున్నా.. నిజ జీవితంలో అలా కాదు అని!
బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా రాణిస్తోంది అనసూయ భరద్వాజ్. ఇద్దరు పిల్లల తల్లైనా కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది. అయితే ఆమధ్య అనసూయ ఆంటీ వివాదంలో చిక్కుక్కున్న విషయం తెలిసిందే! వీలైనంతవరకు తనను విమర్శించినవారికి గట్టి సమాధానం ఇస్తూ పోయింది అనసూయ. ఇకపోతే కథ నచ్చితే ఎలాంటి పాత్రయినా చేస్తుందీ యాంకర్. లేడీ విలన్ టైప్ క్యారెక్టర్లను కూడా అవలీలగా నటించేస్తుంది. అయితే ఆ పాత్రను చూసి తమ క్యారెక్టర్లు డిసైడ్ చేయకండంటూ షారుక్ మాట్లాడిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది అనసూయ. అందులో పఠాన్ హీరో షారుక్ మాట్లాడుతూ.. 'డర్, బాజీగర్‌లో నేను నెగెటివ్ రోల్స్ చేశాను. జాన్ అబ్రహం కూడా చాలా నెగెటివ్ రోల్స్ చేశాడు. అలా అని మేమంతా చెడ్డవాళ్లం కాదు. కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఆయా పాత్రలు పోషిస్తాము' అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను అనసూయ షేర్ చేస్తూ 'ఎప్పటినుంచో నేనూ అదే చెప్తున్నా.. మేము ప్రతికూల పాత్రల్లో నటిస్తామే తప్ప రియల్ లైఫ్‌లో అలా ఉండము' అని రాసుకొచ్చింది. చదవండి: కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన జాన్వీ కపూర్ కె.విశ్వనాథ్ చివరి క్షణాల్లో జరిగిందిదే.. -
వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా?
టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకుంది. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. రంగస్థలం మూవీలో ఆమె పోషించిన రంగమ్మత్ర పాత్రకు ఎంతటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే క్రేజ్ ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. చదవండి: మహేశ్ సినిమాకు హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నా: రాజమౌళి దీంతో ఆమె వెండితెరపై నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో చిన్న సినిమాలు, భారీ బడ్జెట్లో చిత్రాలతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్‌లో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు మరోసారి జబర్దస్త్ షో వీడటంపై ప్రశ్న ఎదురైందట. ఇక దీనికి ఆమె స్పందిస్తూ ఈ షో నుంచి బయటకు రావడానికి రకరక కారణాలున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. అందులో తన పిల్లలు కూడా ఉన్నారని ఆమె పేర్కొందట. చదవండి: అల్లు అర్జున్‌కు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం ప్రస్తుతం నటిగా తాను ఫుల్ బిజీగా ఉన్నానని, ఇటూ షూటింగ్, అటూ షోలు చేస్తు ఇంట్లో పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే జబర్దస్త్ మానేయాల్సి వచ్చిందని అనసూయ పేర్కొంది. కాగా ప్రస్తుతం అనసూయ పుష్ప2, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలతో పాటు గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ నవల ఆధారంగా తెరెకెక్కితోన్న కన్యాశుల్కం అనే వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది. అలాగే సందీప్ కిషన్ తాజా చిత్రం మైఖేల్‌లో కూడా ఓ కీలక పాత్ర చేసింది. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
మరో పాన్ ఇండియా చిత్రంలో అనసూయ... పోస్టర్ అవుట్
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓవైపు స్టార్ యాంకర్‌గా కొనసాగుతూనే, మరోవైపు వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా మైఖేల్ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనతో పాటు అనసూయ కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మ్యాడ్ ఆఫ్ క్వీన్ అంటూ పవర్ ఫుల్ గెటప్‌లో అనసూయ కనిపిస్తుంది. మరి ఈ సినిమా అనసూయ కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. -
యాంకర్ అనసూయకు బాహుబలి కాజాతో సత్కారం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): టీవీ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్‌కు శనివారం సురుచి పీఆర్వో వర్మ బాహుబలి కాజా అందించి సత్కరించారు. పెద్దాపురంలో షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు కాకినాడలోని ఒక హోటల్లో ఈ కాజా అందించినట్టు ఆయన వివరించారు. జిల్లాకు ప్రముఖులెవ్వరు వచ్చినా బాహుబలి కాజా అందివ్వడం సురుచి సంప్రదాయమన్నారు. కాగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది అనసూయ. రంగస్థలంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాల్లో నటించి సత్తాచాటింది. చివరగా దర్జా చిత్రంలో కనిపించింది. -
శ్రీకాళహస్తిలో యాంకర్ అనసూయ పూజలు.. ఫోటోలు వైరల్
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్ సందడి.. బ్యూటీల తళుకులు-మెరుపులు
► క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కాజల్ సిస్టర్స్ ► యంగ్ లుక్‌తో మెరిసిపోతున్న మీరా జాస్మిన్ ► యాంకర్ నిఖిల్ క్రిస్మస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు ► అందంతో కేక పుట్టిస్తోన్న హీరోయిన్ శ్రీలీల ► భర్తతో కాజల్ క్యూట్ ఫోటో View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Nikhiluuuuuuuuu (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
సుడిగాలి సుధీర్‌పై అనసూయ కాంట్రవర్సీ కామెంట్స్.. ఫ్యాన్స్ ట్రోలింగ్
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించిన తెలిసిందే. తనదైన యాంకరింగ్, అందం, గ్లామర్‌తో హీరోయన్లకు సమానమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం టీవీ షోలతో పోలిస్తే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వరుస మూవీ ఆఫర్లతో బిజీబిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్‌పై అనసూయ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సుధీర్‌తో వర్క్ చేయడం ఎలా ఉంది? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. అనసూయ కాస్త సీరియస్‌గానే ఆన్సర్ ఇచ్చింది. ''సుధీర్ నా జూనియర్. నేను సీనియర్ని అని మర్చిపోయారా? నాతో కలిసి పనిచేయడం ఎలా ఉందో సుధీర్‌ని అడగండి. అతడు నా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. నేను కూడా అతన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడీ కామెంట్స్‌పై అనసూయను ట్రోల్ చేస్తున్నారు సుధీర్ ఫ్యాన్స్. 'రెండు, మూడు సినిమాలు చేసేసరికి ఇంత ఓవర్ యాక్షన్ అవరసరమా? సుధీర్ గురించి అడిగితే ఒక్క మాట చెప్పలేవా? అయినా స్టార్ హీరోలతో కూడా అనసూయతో పనిచేయడం ఎలా ఉంది అని వాళ్లనే అడగండి అని చెప్తావ్ కదా' అంటూ విమర్శిస్తున్నారు. 🙄🙄 ee lekkana pedda hero movies lo mother characters cheysey vallani aa hero tho cheyadam ela undi ani adagoddu annatlu #anasuyabharadwaj #Anasuya #Aunty pic.twitter.com/VmQ1P8ojGr — Idly_Vishwanatham (@Idly_Baba) December 14, 2022 -
మత్తు కళ్లతో మలైక.. మతిపోగొడుతున్న అనసూయ
సోషల్ హల్చల్: ► క్యూట్ లుక్స్‌తో మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి ► మత్తు కళ్లలో ఫిదా చేస్తున్న మలైకా అరోరా ► పరికిణిలో సాంప్రదాయబద్దంగా నటి హిమజ ► వింటర్లో వైన్ గ్లాసుతో డిజైనర్ కోమల్ పాండే ► వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న యాంకర్ అనసూయ ► ప్రియుడిని పెళ్లాడిన కేరింత బ్యూటీ సుకృతి View this post on Instagram A post shared by Khanna Jewellers (@khannajewellerskj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) -
అసభ్యకర ఫోటోలు.. యాంకర్ అనసూయని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాంకర్ అనసూయని సోషల్ మీడియాలో వేదిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ఆమె కంప్లైంట్ చేసింది. అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. నకిలీ అకౌంట్స్‌తో ప్రముఖ హీరోయిన్స్, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ల్యాప్‌టాప్‌లో అనసూయతో పాటు విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలు ఉన్నాయని, వీళ్లతో పాటు మరికొంతమందిని నిందితుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నిందితుడిపై 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. -
అమెరికాలో యాంకర్ అనసూయ.. ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ కొడుతున్న భామ..!
-
అందుకే గాడ్‌ఫాదర్ ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నా: అనసూయ
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్‌ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. దసరా బరిలో దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను వసూళు చేస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే ఆమె నటనను ప్రశంసిస్తూ ఓ నెటిజన్.. గాడ్‌ఫాదర్ మూవీలో మీ రోల్ నాకెంతో నచ్చింది. ఇంత మంచి రోల్ చేసినప్పటికీ మీరెందుకు ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు అని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన అనసూయ.. మీరు ఇది నమ్మాలి. ఒకే సమయంలో చాలా షూటింగుల్లో పాల్గొంటున్నాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే నేనెంతో కష్టపడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. కాగా అనసూయ రియాక్షన్‌పై సోషల్ మీడియాలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగానే షూటింగ్స్‌లో బిజీగా ఉందేమో అని కొందరంటే, కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆమెకు టైం లేదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. Thank you andi! Meeru nammali.. chala shoots okesari jarugutunnai.. I am working hard to entertain y’all 😛🫣 https://t.co/uev9WrKQQX — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 5, 2022 -
'ఆంటీ' అంటూ ట్రోలింగ్.. పోలీస్ కంప్లైట్ ఇచ్చిన అనసూయ
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై హాట్ యాంకర్‌గానూ అలరిస్తున్నారు అనసూయ. అయితే ఇటీవల సోషల్ మీడియాలో అనసూయను ఆంటీ అంటూ టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్లు ఆమెపై అసభ్యకర రీతిలో కామెంట్స్ చేస్తూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మండిపడ్డ యాంకర్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని నెటిజన్లు ఆంటీ అంటూ వేలకొద్దీ ట్వీట్లు చేశారు. తాజాగా తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. ‘యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకున్నాను. కానీ, ఇలా చేయక తప్పలేదు. సపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులకు థ్యాంక్స్. నన్ను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్ మొదలైంది. అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు ఊహించని దానికంటే పెద్దది’ అంటూ కంప్లైట్ తాలుకూ స్క్రీన్‌షాట్‌ని షేర్ చేసింది. కాగా 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమోకానీ, రావడం మాత్రం పక్కా!' అని అంటూ ఈనెల 25న అనసూయ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించే పెట్టిందని అభిప్రాయపడ్డ అతడి అభిమానులు ఆంటీ అంటూ అనసూయను దూషించారు. వేలకొద్ది మీమ్స్, ట్వీట్స్ చేస్తూ ఆంటీ పదాన్ని ట్రెండ్ చేశారు. And the process begins 🙏🏻Took my time to not do this to save the future of a lot of impulsive youth/people..but looks like what has to be done..should be done..thanking the cyber crime officials for being very supportive prompt and promising🙏🏻#SayNoToOnlineAbuse #StopAgeShaming pic.twitter.com/gxBinHkG8X — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 29, 2022 -
'జబర్దస్త్' మానేయడంపై తొలిసారి నోరువిప్పిన అనసూయ
టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకుంది. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే కొన్నేళ్లుగా యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ ఇటీవలె ఓ కామెడీ షోకు గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. లిస్ట్ బయటికొచ్చేసింది! దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఆ షోకు యాంకర్‌గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లుండి ఆ షో నుంచి ఎందుకు బయటకు వచ్చేసిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా తాను ఆ షోను ఎందుకు వీడాల్సి వచ్చిందన్న దానిపై తొలిసారిగా నోరు విప్పింది అనసూయ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'దాదాపు రెండేళ్ల నుంచే షో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. చాలా సందర్భాల్లో నాపై వేసే పంచులు నచ్చక సీరియస్‌గా రియాక్షన్స్ ఇచ్చాను. నాకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు లాంటివి నాకు నచ్చవు. చాలాసార్లు పంచులు నచ్చక ముఖం మాడ్చుకున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవి షోలో వేయరు. క్రియేటివ్ ఫీల్డ్ అన్న తర్వాత ఇవన్నీ తప్పవు కానీ నేను మాత్రం ఆ ఊబిలో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. ఈ విషయంలో నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. మరో విషయం ఏంటంటే నాగబాబు, రోజాగారు వెళ్లిపోయారు కాబట్టే నేను కూడా వెళ్లిపోతున్నాను అనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. వాళ్లు వెళ్లిపోయారు కదా అని వెళ్లిపోవడానికి నేనెం గొర్రెల మంద టైప్ కాదు. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చింది. కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అనంతరం అనసూయ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్ -
కొత్త యాంకర్‌గా అనసూయను మించిన అందాల రాశి!
అనసూయ.. డేరింగ్ అండ్ డాషింగ్ యాంకర్.. అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు బుల్లితెరపైనా పలు షోలతో అలరిస్తోంది. తనకు నచ్చినట్లుగా రెడీ అవుతూ ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్లిందీ ముద్దుగుమ్మ. అయితే కొన్నేళ్లుగా యాంకర్‌గా కొనసాగుతున్న ఓ కామెడీ షోకు అనసూయ ఇటీవలే గుడ్‌బై చెప్పేసింది. ఎంతోమంది ఆమె కొనసాగాలని కోరుకున్నా తను మాత్రం వెళ్లిపోవడానికే మొగ్గుచూపింది. దీంతో ఇప్పుడా కామెడీ షో యాజమాన్యం అనసూయ స్థానాన్ని భర్తీ చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. అనసూయకు ధీటుగా అందాల రాశిని షోలో దించింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసింది. పల్లకిలో తీసుకువచ్చి ఘనస్వాగతం పలికారు. కానీ ఆమె కనబడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో ఆమె ఎవరా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. యాంకర్ రష్మీనే ఈ షోలోనూ అదరగొట్టనుందని కొందరంటుంటే ఆమె యాంకర్ మంజూషా అని మరికొందరు అంటున్నారు. మరి ఆమె ఎవరనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే! చదవండి: మాధవన్, నంబి నారాయణన్‌ను సత్కరించిన రజనీకాంత్ -
అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ..
యాంకర్, నటి అనసూయ ప్రధాన పాత్రలో సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. ఆర్వీ రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టైటిల్ లోగోను హుజూరాబాద్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దక్షిణాది సినిమా హాలీవుడ్‌ను శాసించే స్థాయిలో ఉంది. ‘అరి’ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిజాయితీగా పని చేస్తే సినిమా రంగంలో సక్సెస్ వస్తుంది.. అయితే రావడం ఆలస్యమైనా రావడం మాత్రం పక్కా’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ‘‘అరి’ అనేది సంస్కృత పదం. శత్రువు అని అర్థం. అది ఎవరు? అనేది సినిమాలో చెప్పాను’’ అన్నారు జయశంకర్. ‘‘మనిషి ఎలా బతకకూడదో మా సినిమా చూపిస్తుంది’’ అన్నారు శేషు మారంరెడ్డి. ‘‘మా సినిమా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రామిరెడ్డి. ‘‘అరి’లో మంచి వినోదం కూడా ఉంది’’ అన్నారు అనసూయ. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? -
అఖిల్‌ని టార్గెట్ చేయడమేనా నీ గేమా? బిందుకు అనసూయ సూటి ప్రశ్న
వరుస గెస్టులతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో జిగేలుమంటోంది. మొన్నటిదాకా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేయగా ఆ తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం టీమ్ హౌస్‌ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే నవ్వడానికి, నవ్వించడానికో ఆమె రాలేదు. ప్రేక్షకుల మనసులో మెదులుతున్న ప్రశ్నలను తూటాల్లా వదిలేందుకు వచ్చింది. ఈ సందర్భంగా మొదట అరియానాకు ఆడియన్స్ రాసిన ప్రశ్నను వదిలింది. 'ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుకు క్లోజ్ అయ్యావు. ఎందుకు వుమెన్ కార్డు వాడుతున్నావు? సడన్‌గా ఎందుకిలా మారిపోయావు?' అని ప్రశ్నించింది. దీంతో అరియానా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇందులో ఉమెన్ కార్డు అనిపించిందంటే అది మీకే వదిలేస్తున్నా అని బదులిచ్చింది. అనంతరం బిందును.. ఎప్పుడూ గ్రూప్ గేమ్స్ ఆడుతావు. కానీ అఖిల్ గ్రూప్ గేమ్స్ ఆడతాడని నిందిస్తావు. ఎందుకు? అని అడిగింది. అయితే బిందు మాత్రం ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడలేదని కుండ బద్ధలు కొట్టింది. ఆ తర్వాత అఖిల్ వైపు తిరిగి.. వెకేషన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? గత వారం రోజులుగా బిందు గురించి నెగెటివ్‌గా మాట్లాడమే పనైపోయింది. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత బిందుతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు, ఎందుకు? అని అడిగింది. మరి దీనికి అఖిల్ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి! ఆ తర్వాత శివ వైపు చూసి 'ఎలా అనిపిస్తోంది? అడిగే దగ్గర నుంచి అడిగించుకునే దాకా?' అని సరదాగా అనడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. చదవండి: ముంబైలో కళ్లు చెదిరే ఫ్లాట్ కొన్న బుల్లితెర నటుడు నరకం చూపించారు, బర్త్‌డే రోజే నా కూతుర్ని చంపేశారు: మోడల్ తల్లి -
ఉమెన్స్ డే: యాంకర్ అనసూయ కాంట్రవర్సీ ట్వీట్
యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేకపాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. రీసెంట్గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అటు బుల్లితెర షోస్‌తో పాటు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలోనూ అనసూయ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేసింది. 'ట్రోలర్, మీమర్స్ ఈరోజు మహిళల దినోత్సవం అని గుర్తొచ్చి హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభిస్తారు. అయినా ఈ గౌరవం ఎలాగో 24 గంటల్లో ముగుస్తుందనుకోండి. కాబట్టి మహిళలందరికి హ్యాపీ ఫూల్స్ డే' అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే, మరికొందరేమో ప్రతీసారి కాంట్రవర్సీయేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄 — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022 -
Anchor Anasuya : అదిరే అందాలతో కవ్విస్తోన్న అనసూయ భరద్వాజ్
-
'అనసూయ.. మిమ్మల్ని అక్కా అని పిలవాలా? లేక ఆంటీనా'?
యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తూనే అవకావం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మరింత పాపులర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ అడిగిన కొంటె ప్రశ్నకు ఘాటుగా బదులచ్చింది. మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'ఏదీ వద్దు. అలా పిలిచే అంత స్నేహం మన మధ్య లేదు. ఇలా పిలుస్తామని అనడం మీ పెంపకాన్ని ( అప్ బ్రింగింగ్) ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్ షేమింగ్ చేసినట్లే. గౌరవం ఇవ్వండి' అంటూ అనసూయ పేర్కొంది. అయితే దీనికి కౌంటర్‌గా.. 'ఎవరినైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్ షేమింగ్ అవ్వదు. అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు' అంటూ సదరు నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి అనసూయ బదులిస్తే.. 'అయ్యుండొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారన్నది ముఖ్యం ఇక్కడ. అయినా కాంప్లిమెంట్స్(ప్రశంసలు) తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల ఇష్టం కదా' అంటూ ట్రోలర్ నోరు మూయించింది. -
యూట్యూబ్ ఛానల్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన యాంకర్ అనసూయ
Anasuya Strong Reply To Netizens Body Shaming Trolls On Her, Video Viral: యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ పాత్ర నచ్చితే అది గ్లామరైన, డీగ్లామరైన సై అంటుంది. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో కనిపించింది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో తనపై చేస్తున్న ట్రోలింగ్‌పై అనసూయ ఘాటుగా స్పందించిది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన అనసూయ తనపై యూట్యూబ్‌లో అసభ్యకరంగా థంబ్నెయిల్స పెడుతున్నారంటూ మండిపడింది. ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టే థంబ్ నెయిల్స్ చూశాను. ఎంత లావు అయిపోయిందో చూడండి.. చూస్తే షాక్ అవుతారు అంటూ పెడుతుంటారు. ఇలాంటివి పట్టించుకోవద్దని అనుకుంటాను. కానీ అన్ని సందర్బాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయి. ఇక నేను బరువు పెరగడం లేదా తగ్గడం అన్నది నా ఇష్టం. కానీ మీ దిగజారుడుతనాన్ని ఎలా ఎత్తుకుంటారని నేను ఆ కామెంట్స్ చేసేవాళ్లని అడుగుతున్నా. నేను కూడా మీలా మాట్లాడగలను. హర్ట్ చేయగలను కానీ అది నా వ్యక్తిత్వం కాదు చురకలంటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
'పుష్ప' సినిమా కోసం అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Anasuya Bharadwaj remuneration for Pushpa:రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాంకర్ అనసూయ .. బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో నటించి మరోసారి మెప్పించింది. 'దాక్షాయని' పాత్రలో మంగళం శ్రీను భార్యగా కనిపించింది. అయితే ఈ చిత్రంలో అనసూయ పాత్ర నిడివి తక్కువగా ఉందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నటించేందుకు అనసూయ తీసుకున్న పారితోషికంపై ఎంతన్న దానిపై చర్చ మొదలైంది. ఈ సినిమాలో నటించేందుకు ఒక్కరోజుకే అనసూయ రూ. 1-1.5లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందట. ఇక పుష్ప ఫస్ట్ పార్ట్‌లో అనసూయ రోల్ తక్కువగానే ఉన్నా సెకండ్ పార్ట్‌లో మాత్రం అనసూయ రోల్ కీలకంగా మారనుందని తెలుస్తుంది. ఫాహద్ ఫాజిల్‌తో కలిసి బన్నీపై పగ తీర్చుకునేలా అనసూయ క్యారెక్టర్ ఉండనుందని సమాచారం. -
మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను నాన్న: యాంకర్ అనసూయ ఎమోషనల్
Anchor Anasuya Shares Emotional Post About Her Father: స్టార్ హీరోయిన్లకు సమానమైన క్రేజ్ సంపాదించుకున్న యాంకర్లలో అనసూయ ముందుంటుంది. ఓవైపు బుల్లితెరపై అదరగొడుతూనే, మరోవైపు వెండితెరపై కూడా సత్తా చాటుతున్న అనసూయ తండ్రి సుదర్శన్ రావు ఇటీవలె కన్నుమూశారు. తాజాగా తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది అనసూయ. 'మీరిచ్చిన జీవితానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. మాకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపేలా నేర్పించారు. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండమని నేర్పించారు. మాతో మీరు గడిపిన సమయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అర్థరాత్రులు మీరిచ్చే సర్ప్రైజ్లను ఎప్పటికీ మర్చిపోలేను. అదంతా మాపై మీకున్న అపరిమితమైన ప్రేమ. నాన్నలా ఎంతో గొప్పగా , ఆదర్శంగా నిలిచారు. ఎప్పటికీ మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా నాన్న. మీరు వెళ్లిపోయినా ఎప్పటికీ మాతోనే ఉంటారని బలంగా నమ్ముతున్నాను. మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా' అంటూ అనసూయ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం
Anasuya Bharadwaj Father Sudarshan Rao Passed Away: జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన రావు (63) అనారోగ్యంతో కన్నుమూశారు. తార్నాకలోని తన సొంత ఇంట్లో ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కొద్ది నిముషాల్లోనే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. సుదర్శన రావు గతంలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన హఠాన్మరణంతో అనసూయ, ఆమె తల్లి, తోబుట్టువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సుదర్శన రావు కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఆయన మృతిపట్ల పలువురు సినీ తారలు, అనసూయ అభిమానులు సంతాపం ప్రకటించారు. (చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య.. అసలు కారణాలు ఇవేనా?) -
దానికోసం అవసరమైతే గుండు కొట్టించుకుంటా : అనసూయ
Anasuya Shocking Reply To Netizen Over Comments On Her Future Roles: బుల్లితెరపై స్టార్ యాంకర్స్‌లో అనసూయ భరద్వాజ్ ఒకరు. తన అందచందాలతో ఫ్యాన్స్ మనసులను దోచేసిన ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్‌కు ఉన్నంత క్రేజ్ ఉంది. అయితే అనసూయ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా దూసుకెళ్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ ఫోటోస్ షేర్చేస్తూ నెట్టింట సందడి చేసే ఈ హాట్ యాంకరమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: పుష్ప మూవీలో అనసూయ లుక్ ఎలా ఉందో చూశారా? తాజాగా తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆస్క్‌మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన అనసూయ..అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. పెద్ద సినిమాలో మంచి రోల్ వస్తే.. అవసరం అయితే పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు. దీనికి తప్పకుండా.. క్యారెక్టర్ కోసం అవసరం అయితే గుండు కొట్టించుకుంటా అంటూ అనసూయ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు.. సినిమాలంటే అనసూయకు ఉన్న డెడికేషన్ చూసి ఫిదా అవుతున్నారు. కాగా ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలో దాక్షయణి పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు ప్రభుదేవాతో ఓ సినిమాలో నటిస్తుంది. చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్ శ్రీరామచంద్ర ఇమేజ్ను డామేజ్ చేస్తున్న వాట్సాప్ చాట్ -
పుష్ప మూవీలో అనసూయ లుక్ ఎలా ఉందో చూశారా?
Pushpa Movie Anasuya Dakshayani First Look: నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది యాంకర్ అనసూయ. రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ.. బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సినిమాలో 'దాక్షాయని' అనే కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో అనసూయ లుక్‌ని రివీల్ చేసింది చిత్ర బృందం. చదవండి: భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకొని మాస్ లుక్‌లో అనసూయ దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ ప్రత్యేకంగా నిలిచింది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా అలరించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫష్ట్ పార్ట్ డిసెంబర్17న విడుదల కానుంది. చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్ మళ్లీ తెరమీదకి శ్రీరెడ్డి- శ్రీరామచంద్ర వాట్సాప్ చాట్ She is arrogance and pride personified! Introducing @anusuyakhasba as #Dakshayani.. #PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/ER87UhxXLZ — Mythri Movie Makers (@MythriOfficial) November 10, 2021 -
అనసూయ డ్రెస్సింగ్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు
Kota Srinivasa Rao Comments On Anasuya Dressing : ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెర యాంకర్‌గా రాణిస్తూనే ఇటూ వెండితెరపై అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గ్లామర్ విషయంలో హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోయే అనసూయ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ తనదైన స్టైల్లో అలరిస్తుంది. అంతా బాగానే ఉన్నా ఆమె డ్రెస్సింగ్‌పై మాత్రం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి నేటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి ఆ బట్టలేంటి అంటూ కొందరు నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ను ఇప్పటికీ ఎదుర్కుంటున్నారు. తాజాగా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు వివాదాస్పద కామెంట్స్ చేశారు. అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్ చేశారు. ఇటీవలె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్ నాకు నచ్చదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని అంటున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అనసూయ సీరియస్.. కోర్టుకు వెళ్తానంటూ వార్నింగ్
Maa Elections 2021: నిజాలు తెలుసుకోకుండా తన పేరు వాడితే కోర్టుకు వెళ్తానంటూ యాంకర్ అనసూయ సీరియస్ అయ్యింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందిన 11మంది రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో యాంకర్ అనసూయ సైతం పాల్గొన్నారు.చదవండి: అనసూయకు బిగ్ షాకిచ్చిన 'మా' కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో మా ఎన్నికలపై స్పందించిన అనసూయ తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలకు తన పేరును ఆపాదిస్తే కోర్టుకు వెళ్తానని హెచ్చరించింది. చదవండి: మోహన్ బాబు తిడుతుంటే విష్ణు ఆపాడు: తనీష్ -
హల్చల్ : క్యూట్‌గా నజ్రియా...స్టన్నింగ్ లుక్‌లో కాజల్
► క్యూట్‌గా నజ్రియా... స్టన్నింగ్ లుక్‌లో కాజల్ ► పింక్ శారీలో నాజ్రియా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ► కాజల్ స్టన్నింగ్ లుక్స్ ► పర్పుల్ శారీలో యాంకర్ అనసూయ ► వెకేషన్ మూడ్‌లో అల్లు స్నేహా రెడ్డి ► కత్రినా చేతిలో బ్రేక్‌ఫాస్ట్ కూడా అందంగా.. ►ప్రేమ పంపిస్తున్న రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
అందం అసూయ పడేలా యాంకర్ అనసూయ ఎక్స్ప్రెషన్స్
-
హల్చల్ : పరికిణిలో శ్రీముఖి..జడ్జ్ చేయొద్దన్న అనసూయ
► పసుపు రంగు చీరలో ముస్తాబైన నవ్య స్వామి ► పెళ్లికూతురిలా కృతిసనన్ ► నన్ను జడ్జ్ చేయొద్దన్న యాంకర్ అనసూయ ► పరికిణిలో యాంకర్ శ్రీముఖి ► అందమైన కురులతో అనుపమ క్యూట్ లుక్స్ ► నిశ్చితార్థం చేసుకున్న బుల్లితెర నటి అన్షురెడ్డి ► గులాబీ రంగు కుర్తీలో నటి కృష్ణ ముఖర్జీ View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
హల్చల్ : వెనక్కి వెళ్లనంటోన్న అనసూయ...తప్పు కాదంటోన్న ప్రియమణి
♦ అది ఎప్పటికీ తప్పు కాదంటున్న ప్రియమణి ♦ వెనక్కి వెళ్లనంటున్న అనసూయ ♦ క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న జాస్మీన్ ♦ బ్లూపర్ షేర్ చేసిన భాను ♦ తన అందానికే సీక్రెట్ ఇదేనంటోన్న కత్రినా ♦ ఆ సమస్య లేకపోతే రోజూ అవే తింటానంటున్న కల్పిక ♦ యోగాతో మోటివేషన్ అంటోన్న ఙ్ఞానేశ్వరి View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kanika Mann 🦋 (@officialkanikamann) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Kalpika Ganesh (@iamkalpika) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
హల్చల్ : కొంటెగా చూస్తున్న దివి.. కవ్విస్తోన్న రష్మీ
♦ ఫోజులతో కవ్విస్తోన్న యాంకర్ రష్మీ ♦ ఇంక వెయిట్ చేయలేనంటున్న రకుల్ ♦ తన పవర్ ఏంటో చూపించిన మంచు లక్ష్మీ ♦ ఏం చేయాలో తెలియడం లేదంట తమన్నాకి ♦ చీరకట్టులో నాయని పావని ♦ గిరగిర తిప్పమంటున్న హీనా ఖాన్ ♦ ఎంతో అందంగా ముస్తాబైన మాధురీ దీక్షిత్ ♦ రీల్స్‌తో అదరగొడుతున్న నిధి అగర్వాల్ ♦ బరువులు ఎత్తుతున్న పరిణితీ చోప్రా ♦ లేట్ నైట్ పోస్టును షేర్ చేసిన కోమల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by DP (@dishaparmar) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
Anasuya Bharadwaj: అందుకే ‘అనసూయ’అని పేరు పెట్టారట
Happy Birthday Anausaya: మాటలతోనే కాకుండా అందచందాలతో ప్రేక్షకులను అలరించే తెలుగింటి ముద్దుగుమ్మ యాంకర్ అనసూయ. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో యాంకర్లలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ ఒకవైపు బుల్లితెరపై అలరిస్తూనే.. వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. నేడు(మే 15) యాంకర్ అనసూయ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. పవిత్ర అనుకున్నారు కానీ.. యాంకర్ అనసూయ మే 15,1985లో పుట్టింది. ఆమె సొంతూరు నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు. వాళ్ల అమ్మ ఆమెకు పవిత్ర అని పేరు పెట్టాలనుకుందట. కానీ వాళ్ల నాన్న మాత్రం వాళ్ల అమ్మ అనసూయ పేరునే తనకు పెట్టాడని సందర్భంలో అనసూయ చెప్పింది. కుట్టు మిషన్ డబ్బుతో స్కూల్ ఫీజు అనసూయ కుటుంబం చిన్నప్పుడు ఆర్థికంగా బాగానే ఉండేదట. కానీ వాళ్ల నాన్నాకు ఉన్న గుర్రెపు పందెల వ్యసనం వల్ల ఆస్తులన్ని పోగొట్టుకున్నారు. కొన్నేళ్ల పాటు అద్దె ఇంట్లో ఉన్నారట. వాళ్ల అమ్మ కుట్టు మిషన్ కుడుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేదట. ‘అమ్మ మిషన్ కుట్టి మా స్కూల్ ఫీజ్ కట్టేది. రూ.50 పైసలు మిగులుతుందని రెండు స్టాపులు నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేదాన్ని’అని అనసూయ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తొలి సంపాదన రూ. 5 వేలు అనసూయ ఎంబీఏలో హెచ్ఆర్ చేసింది. తొలుత ఓ బ్యాంకులో టెలీకాలర్‌గా పనిచేసింది. ఆమె తొలి జీతం రూ. 5వేలు మాత్రమే. ఆ తర్వాత ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే కొత్తమంది దర్శకులు ఆమెను చూసి సినిమా అవకాశాలు ఇచ్చారట. కానీ అనసూయ భయంతో వాటిని రిజెక్ట్ చేసిందట. నిశ్చితార్థం అయ్యాక కొన్ని కారణాల వల్ల హెచ్ఆర్ జాబ్ మానేసి ‘సాక్షి’లో న్యూస్ రీడర్‌గా చేరింది. కొన్నాళ్ల తర్వాత ఓ కామెడీ షోకి యాంకర్‌గా అవకాశం రావడంతో అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 9 ఏళ్లు ప్రేమ పోరాటం అనసూయది ప్రేమ వివాహం. ఆమె ఇంటర్లో ఉన్నప్పుడే సుశాంక్ భరద్వాజ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబితే.. అనసూయ వాళ్ల నాన్న ఒప్పుకోలేదట. పైగా వేరే సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టారట. దీంతో అనసూయ తొమ్మిదేళ్ల పాటు ప్రేమ పోరాటం చేసి సుశాంక్‌కు వివాహం చేసుకుంది. ఈ ప్రేమ జంటకు ఇద్దరు పిల్లలు. ఇక ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. ‘క్షణం’తో ఆమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత నాగార్జునతో‘సోగ్గాడే చిన్నినాయనా’లో నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ.. ‘పుష్ప’, ‘ఖిలాడి’, ‘రంగమార్తాండ’ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మమ్ముట్టి నటిస్తున్న ఓ మలయాళం మూవీలో కీలకపాత్ర పోషిస్తుంది. -
అర్ధరాత్రి 2 గంటలకు తాగి ఉన్నా: అనసూయ
ఎవరేమన్నా డోంట్ కేర్ అంటూ తనకు నచ్చిన దారిలో నడుస్తుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. అటు బుల్లితెర మీద యాంకర్‌గా సత్తా చాటుతూనే సెలక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ వెండితెర మీద కూడా రాణిస్తోంది. ఈ మధ్య స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడుతున్న ఈ యాంకర్ గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోని స్పెషల్ సాంగ్ మాత్రం చేయనని తిరస్కరించిందట. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'అత్తారింటికి దారేదీ' సినిమాలో 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ..' పాట కోసం దర్శకనిర్మాతలు అనసూయను సంప్రదించారట. అయితే తను అందులో కనిపించాలంటే మిగతా ఎవరూ ఉండకూడదని, తను ఒక్కదాన్ని అయితే మాత్రమే చేస్తానని కండీషన్ పెట్టింది. అది కుదరకపోవడంతో అనసూయ సాంగ్ నుంచి తప్పుకుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. "కెమెరా ముందు అందంగా ఉండాల్సిందే. లేదంటే ఆంటీ అంటూ హేళన చేస్తారు. బాడీ షేమింగ్ చేస్తుంటారు. కానీ నా శరీరాన్ని, ముఖ్యంగా పొట్టను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే పొట్ట అంత పెద్దగా ఉంది కాబట్టే నా కొడుకు అందులో కంఫర్టబుల్‌గా ఉండగలిగాడు. ఇక ఇప్పుడు కూడా నేనేదైనా ఫొటో పెడితే చాలు.. ఇదంతా నీకవసరమా ఆంటీ, పిల్లలను చూసుకో అని చెప్తుంటారు. అదేదో వాళ్లే నా పిల్లకు ఫుడ్ పెడుతూ, ఫీజు కడుతున్నట్లు మాట్లాడుతుంటారు. ఒకప్పుడు ఆ పిల్లకు పెళ్లైంది, పనికిరాదు అనేట్లుగా మాట్లాడేవారు. కానీ నేను బల్లగుద్ది చెప్పగలను. వాళ్లకంటే కంటే నేను బాగా నటిస్తాను అని. ఇక 'ఇట్స్ టైం టు పార్టీ..' సాంగ్‌కు అడిగారు. కానీ నేను ఒక్కదాన్నైతే మాత్రమే చేస్తానని చెప్పా. దీంతో నువ్వేంటి.. పవన్ కల్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు అని ట్రోల్ చేశారు. తర్వాత నన్ను అవమానించారని ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా వెనక్కు ఇచ్చేశాను" అని అనసూయ తెలిపింది. అలాగే తనకు తాగే అలవాటుందని, ఒక రోజైతే అర్ధరాత్రి 2 గంటలకు తాగేసి ఉన్నానని చెప్పుకొచ్చింది. చదవండి: నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా బాబు: అనసూయ రామజోగయ్య శాస్త్రికి షాకిచ్చిన మెగాస్టార్! -
సిల్క్ స్మిత బయోపిక్ చేయడం లేదు
బుల్లితెర, వెండితెర ఏదైనా అనసూయకు కొట్టిన పిండే. యాంకర్‌గా అలరిస్తూనే నటిగా మెప్పిస్తున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. అలా రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. తాజాగా ఆమె ఓ కొత్త సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. మరో మంచి కథ.. కొత్త ఆరంభం, కోలీవుడ్ అనే క్యాప్షన్‌తో అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఫొటోకు రిఫరెన్స్ సిల్క్ స్మితగారు అని ఆమె పేరును ట్యాగ్ చేశారు. (చదవండి: అనసూయ కోలీవుడ్ చిత్రం.. సిల్క్ స్మిత బయోపిక్!) దీంతో ఆమె కోలీవుడ్‌లో తెరకెక్కనున్న సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ బయోపిక్ షూటింగ్ కోసం ఆమె చెన్నైకు కూడా వెళ్లొచ్చినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లకు అనసూయ చెక్ పెట్టారు. సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించడం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. కాగా అనసూయ ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య', అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ వంశీ సినిమా 'రంగమార్తాండ'లోనూ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అంతేకాక రవితేజ 'ఖిలాడీ' చిత్రంలో ప్రముఖ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాక స్పెషల్ సాంగ్‌లో హీరోతో కలిసి చిందులేయనున్నారట. (చదవండి: వెయ్యి మంది... వంద రోజులు!) -
రవితేజతో రచ్చ చేయనున్న అనసూయ
బుల్లితెర మీద యాంకర్‌గా రాణిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెర మీద కూడా తళుక్కున మెరుస్తోంది అనసూయ భరద్వాజ్. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్, హీరో రామ్‌చరణ్ కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్తగా నటించి అందరినీ బుట్టలో పడేసింది. ఆ పాత్ర అనసూయకు ఎనలేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. వరుస ఆఫర్లు ఆమె తలుపు తట్టాయి. దీంతో ఇటు షోలు చేస్తూ మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ బిజీబిజీగా మారిపోయింది. ఇప్పటికే చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్రకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు కృష్ణవంశీ రంగమార్తాండలో కూడా స్పెషల్ పాత్రలో కనిపించనుంది. (చదవండి: అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ) తాజాగా మాస్ మహారాజు రవితేజ 'ఖిలాడీ'లోని ముఖ్య పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న 'ఖిలాడి' చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవలే విడుదల చేయగా మంచి స్పందన లభించింది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో అనసూయ స్పెషల్ రోల్ చేయడమేకాక ఓ స్పెషల్ సాంగ్‌లో రవితేజతో కలిసి చిందులేయనందుట. కాగా అనసూయ.. సాయిధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాలోని 'సూయ సూయ..' అంటూ వచ్చే ప్రత్యేక పాటలో హీరోతో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను యాంకర్ సుమ పాడటం విశేషం. (చదవండి: షేక్ చేస్తున్న శర్వానంద్ ‘భలేగుంది బాలా’ సాంగ్) -
విలన్‌గా యాంకర్ అనసూయ..!
అనసూయ భరద్వాజ్..ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరపై పలు షో లు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఆ అందాల యాంకరమ్మ. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ పలు సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా అందరిని మెప్పించింది. ఆ సినిమాతో అనసూయ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. వరుస ఆఫర్లు వచ్చాయి. ఒకవైపు బుల్లితెరపై పలు షోలు చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై మెరిసింది. ఇటీవల విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకుమాత్రమే చెప్తా' సినిమాలో కీలకపాత్ర పోషించింది. (చదవండి : యాంకర్ అనసూయకు వేధింపులు) ఈ ఏడాది కూడా పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఓ సినిమాలో విలన్ క్యారెక్టర్లో నటిస్తున్నారని సమాచారం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్న ఓ సినిమాలో అనసూయకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో అనసూయ ప్రతినాయకురాలిగా నటిస్తోందట. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. మరి ఇన్నిరోజులు తన అందంతో ఆకట్టుకున్న ఈ యాంకరమ్మ విలన్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం అనసూయ సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో నటిస్తోంది. పవన్ కల్యాణ్-క్రిష్ తీయబోతున్న సినిమాలోనూ ఈ అమ్మడుకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
యాంకర్ అనసూయకు వేధింపులు
-
యాంకర్ అనసూయకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొందరు వ్యక్తులు శృతిమించుతూ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు స్పందించపోతే సహనానికి అర్థం ఉండదని అనసూయ ట్వీట్ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు తాను సిగ్గు పడడం లేదని సరైన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని ట్వీటర్లో పేర్కొన్నారు. తన ఫిర్యాదు స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ధన్యవాదాలు తెలిపారు. Dear @TwitterSupport .. I urge you to reassess "your rules" .. if this is not violating then what else does.. I won't shy away to blame you guys as major influence by not contemplating the cyber abuse.. @cybercrimecyb1 Sir I request you to help tag the right authorities 🙏 pic.twitter.com/G4I3KRwFQ9 — Anasuya Bharadwaj (@anusuyakhasba) February 9, 2020 -
అనసూయను ట్రోల్ చేసి పడేశారు
యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ట్రాఫిక్ సిగ్నల్‌లో వీడియో చూస్తున్న ఓ వ్యక్తి వీడియోను పోస్ట్ చేసి ఆమె ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అసలు విషయంలోకి వస్తే... బుధవారం సాయంత్రం అనసూయ.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆమె పక్క కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో వీడియో చూస్తున్నాడు. ఆ సన్నివేశాలను అనసూయ తన ఫోన్లో బంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. ఇలాంటి సంఘటనలు నన్ను భయపెట్టిస్తున్నాయి. ఇంతకు ముందు వేరే వారి తప్పిదం వలన నేను ప్రమాదానికి(గతేడాది మే నెలలో గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం జరిగి.. అనసూయకు గాయాలు అయ్యాయి కూడా) గురయ్యాను. దయ చేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్స్‌ని వదలొద్దు.రోడ్లపైకొచ్చి తమకిష్టమొచ్చినట్టు డ్రైవ్ చేసే వారికి.. ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా? అని అనసూయ తన ట్వీట్లో తెలిపారు. అయితే ఆ వీడియో సందేశం తేడా కొట్టేసింది. చీప్ పబ్లిసిటీ స్టంట్ ఆమెను ట్రోల్ చేస్తూ పలువురు రీట్వీట్లు చేశారు. దీంతో అసంతృప్తి వెల్లగక్కిన నెటిజన్లు వరుస ట్వీట్లు చేశారు. ‘మంచి కారణంతో ఓ వీడియో పెడితే ట్రోల్ చేస్తున్నారు. అయినా ఫర్వాలేదు. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది సరైన పనే’ అంటూ మరో ట్వీట్ చేశారు. ఇక అక్కడి నుంచి మరికొందరు సైతం ఆమెపై విరుచుకుపడుతుండగా.. వారికి ఓపికగా వివరణలు ఇస్తూ సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. దిగి చెప్పే యత్నం చేయొచ్చు కదా అన్న ఓ వ్యక్తి ప్రశ్నకు.. అలా చేస్తే తర్వాత యూట్యూబ్‌ల్లో ఎలాంటి హెడ్డింగులు కనిపించేవో అందరికీ తెలుసంటూ అనసూయ బదులిచ్చారు. కొన్నిరోజుల క్రితం విరుష్కలు కూడా ఇదే తరహాలో ఓ వీడియోను పోస్ట్ చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. (అనసూయపై ఫిర్యాదు) -
యాంకర్ అనసూయకు చేదు అనుభవం
-
రాజధానిలో రంగమ్మత్త
రంగస్థలం చిత్రంలో రంగమ్మ అత్తగా అలరించిన నటి అనసూయ శనివారం బెజవాడలో సందడి చేశారు. గురునానక్‌కాలనీలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనసూయ మాట్లాడుతూ రంగస్థలంలో రంగమ్మ పాత్ర తనకు ఎంతోపేరు తీసుకువచ్చిందన్నారు. ఎప్పుడూ ఆనందంగా ఉండడమే తన అందం రహస్యమన్నారు. హీరో శ్రీనివాస రెడ్డితో తాను చేసిన చిత్రం త్వరలో విడుదల కానుందని పేర్కొన్నారు. – సాక్షి, గుణదల -
అంతా అనసూయ గురించే...
సాక్షి, సినిమా : రంగస్థలం ప్రీ రీలీజ్ ఈవెంట్లో తన పాత్ర గురించి యాంకర్ అనసూయ ఎంతో భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. అసలు తనకు ఆ పాత్ర చేయటం అస్సలు ఇష్టం లేదని.. కానీ, సుకుమార్ బలవంతం మేరకు తాను ఆ పాత్ర చేశానని, ఆ తర్వాతే ఆ పాత్ర విలువేంటో తెలిసి ట్రావెల్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అంతలా ఆ పాత్రలో ఏం స్పెషాలిటీ ఉందా? అన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రంగమత్త పాత్రకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటిదాకా క్లాస్, గ్లామర్ రోల్‌ల్లో కనిపించిన అనసూయ.. ఇందులో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనున్నట్లు అర్థమౌతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో ప్రతీ చిన్న పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ లెక్కన్న రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉంటుందనే.. అందుకే అనసూయ ఓకే చేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్, సమంత లుక్కులు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నప్పటికీ అనసూయ పాత్ర విషయంలోనే చిన్నపాటి సస్పెన్స్ మెయింటెన్ చేశారు. దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. -
‘వెయ్యి గన్నుల కన్నా.. పెన్ను గొప్పది’
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ మరో పవర్ ఫుల్ పాత్రలో బిగ్స్క్రీన్పై అలరించనుంది. క్షణం చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో మెప్పించిన ఈ భామ తాజాగా డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకోగా తాజాగా చిత్ర బృందం అనసూయ పాత్ర పరిచయ పోస్టర్‌ను విడుదల చేసింది. అనసూయ ఈ చిత్రంలో శ్రేష్ట జయరాం అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా కనిపించనున్నారు. పోస్టర్‌పై ఆమె తీక్షణ చూపులు పాత్రపై ఆసక్తిని రేపుతోంది. కథలో ప్రాధాన్యత ఉండే పాత్ర అని తెలుస్తోంది. ఈ పోస్టర్ని అనసూయ తన ట్విటర్ పేజిలో ‘వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పది.. ‘గాయత్రి’ మూవీ శ్రేష్ట జయరాం పరిచయం’’ అంటూ పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు.. ‘‘మీరు ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..’’ అని రిప్లైలు ఇస్తుండటంతో.. వారందరికీ అనసూయ రిప్లై ఇస్తూ.. ‘‘మీ ప్రోత్సాహం, ప్రోద్భలం ఉంటే తప్పకుండా’’ అంటూ మరో ట్వీట్ చేశారు. వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పది Introducing Ms.#ShreshtaJayaram from #Gayatri #MB42 pic.twitter.com/hPcSSvZIX4 — Anasuya Bharadwaj (@anusuyakhasba) 23 January 2018 టీజర్లో 'రాయలసీమ రామన్న చౌదరి' తరహాలో మోహన్ బాబు ఓ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. విష్ణు మంచు, శ్రియలు ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ ‘గాయత్రి’ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు. నిఖిల విమల్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. -
సచ్చింది రా గొర్రె అంటున్న అనసూయ
సాక్షి, సినిమా: చాలా గ్యాప్‌తో సెలక్టివ్ సినిమాలు చేసుకుంటూ పోతున్న యాంకర్ కమ్ నటి అనసూయ మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. సచ్చింది రా గొర్రె పేరుతో తెలుగులో తెరకెక్కతున్న ఓ చిత్రంలో లీడ్ రోల్ కోసం అంగీకరించింది. ఈ విషయాన్ని స్వయంగా అనసూయే ప్రకటించింది. ‘ఎన్ని పాత్రలు చేసినా గొప్ప కథలో భాగస్వామిగా మారటమే నాకు ఇష్టం. తెలంగాణకు చెందిన నేను ఒగ్గు కథ స్టైల్ నేరేషన్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో నటించటం ఆనందంగా ఉంది. పూర్తిగా కామెడీతో కూడిన పాత్రను చేయబోతున్నా’ అంటూ అనసూయ వివరించింది. శ్రీనివాసరెడ్డి, రవిబాబు, టిల్లూ వేణు, రాకేష్, శివారెడ్డి, సత్యవతి, కోట శంకర్రావు ముఖ్యతారాగణంగా రూపొందుతోంది. సోహం రాక్‌స్టార్, ఎంటర్టైన్మెంట్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తుండగా.. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హెడ్‌గా వ్యవహ రించిన శ్రీధర్ రెడ్డి యార్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ కామెడీ జోనర్ లో రాబోతున్న సచ్చింది రా గొర్రె డిసెంబర్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
నింద నిజమైతే తప్పక దిద్దుకో..: అనసూయ
సాక్షి, హైదరాబాద్: రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగస్థలం 1985'. ఈచిత్రంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో మెప్పించిన బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఈచిత్ర షూటింగ్లో ఇటీవలే చేరింది. చరణ్ అభిమానులను సంతోష పరచడానికి సినిమాకు సంబంధించిన ఒక ఫొటోను అనసూయ సోషల్ మీడియా ట్విటర్లో పోస్ట్ చేశారు. అందులో గజ్జెలతో ఉన్న మహిళ పాదాలు.. కాలి వేలికి మెట్టెలు ఉన్నాయి. ఆమెకు ఎదరుగా చిన్న మట్టికుండ కూడా ఉంది. ‘నింద నిజమైతే తప్పక దిద్దుకో. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. 1985 కాలంనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సుమారు రూ. 5 కోట్లతో పల్లెటూరు సెట్ కూడా వేశారు. ఇందులో రామ్‌చరణ్, సమంత ప్రత్యేకమైన వేషధారణలో కనిపించబోతున్నారని సమాచారం. 2018 సంక్రాంతికి 'రంగస్థలం' లో నిలపడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. నింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్ధమైతే నవ్వేసి వూరుకో..#Rangasthalam1985 @MythriOfficial 🙏🏻❤️ pic.twitter.com/wME9BzsP4x — Anasuya Bharadwaj (@anusuyakhasba) September 4, 2017 -
యాంకరింగ్‌తోనే గుర్తింపు
= శ్రీశైలంలో సినీనటి అనసూయ శ్రీశైలం: సినిమాలు, సీరియల్స్‌లో నటించినా యాంకరింగ్‌తోనే ప్రేక్షకులకు దగ్గరయ్యానని సినీనటి అనసూయ తెలిపారు. మల్లన్న దర్శనార్థం ఆమె కుటుంబ సభ్యులతో కలసి శనివారం శ్రీశైలం వచ్చారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జబర్దస్త్త్ తనకు టీవీ యాంకర్‌గా బాగా గుర్తింపు తెచ్చిందన్నారు. కొన్ని మంచి సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయని, అయితే టీవీ యాంకరింగ్‌తోనే ఇరు రాష్ట్రాల్లోని అభిమానులకు చేరువైనట్లు తెలిపారు. శ్రీశైలానికి అనసూయ వచ్చినట్లు తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు ఉత్సహం కనబరిచారు. ఆలయం బయట కొందరు ఆమెను కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. దర్శనం ఆమె అనంతరం హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. -
యాంకరింగ్‌తోనే గుర్తింపు
- శ్రీశైలంలో సినీనటి, యాంకర్ అనసూయ - కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం శ్రీశైలం: సినిమాలు, సీరియల్స్‌లో నటించినా యాంకరింగ్‌తోనే ప్రేక్షకులకు దగ్గరయ్యానని అనసూయ తెలిపారు. మల్లన్న దర్శనార్థం ఆమె కుటుంబ సభ్యులతో కలసి శనివారం శ్రీశైలం వచ్చారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనసూయ మాట్లాడుతూ జబర్ధస్త్ తనకు టీవీ యాంకర్‌గా బాగా గుర్తింపు తెచ్చిందన్నారు. కొన్ని మంచి సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయని, అయితే టీవీ యాంకరింగ్‌తోనే ఇరు రాష్ట్రాల్లోని అభిమానులకు చేరువైనట్లు తెలిపారు. శ్రీశైలానికి అనసూచ వచ్చినట్లు తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు ఉత్సహం కనబరిచారు. ఆలయం బయట కొందరుట ఆమెను కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. దర్శనం అనంతరం హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. -
'యాంటీ డ్రగ్స్ వాక్'లో అనసూయ
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ కేసు ఒక్క కుదుపుకు గురిచేసింది. ఏమీడియాలో చూసినా డ్రగ్స్ కేసు గురించే చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. 12 మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ ఆరోపణలు రావడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. మెత్తం 12 మందికి స్సెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నోటీసులు జారీ చేయడం, ఒక్కో రోజు ఒక్కోక్కరిని విచారిస్తుండడం ఇండస్ట్రీలో అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రగ్స్-అనర్థాలపై అవగాహన కలిగించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అవి నిర్వహించే కార్యక్రమాల్లో ప్రముఖ సినీ నటులు పాల్గొని తమ మద్దతు తెలియచేస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కళామందిర్ ఫౌండేషన్, హైదరాబాద్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ‘యాంటీ డ్రగ్ వాక్’ను నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు, ఈకార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చింది. ‘డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి’ అంటూ అనసూయ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. #sayNOtoDrugs pic.twitter.com/08STS7i7wg — Anasuya Bharadwaj (@anusuyakhasba) July 23, 2017 -
మంచు కాంపౌండ్ లోకి క్రేజీ యాంకర్..!
బుల్లితెరపై తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ. జబర్థస్త్ షోతో ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి చేరిపోయిన ఈ భామ తరువాత వెండితెర మీద కూడా సత్తా చాటింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగ్ సరసన చిందులేసి ఆకట్టుకోగా, క్షణం సినిమాతో నెగెటివ్ రోల్ లోనూ మెప్పించింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985లో నటిస్తోంది. అదే జోరులో ఇప్పుడు మరో క్రేజీ సినిమాకు సైన్ చేసింది. సీనియర్ హీరో మోహన్ బాబు లీడ్ రోల్ లో మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మోహన్ బాబు తో పాటు యంగ్ హీరో విష్ణు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. -
బిగ్ బాస్‌లో నేనా..? టైం లేదు: అనసూయ
అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ హోస్ట్‌గా మొదలైన 'బిగ్‌బాస్' రియాల్టీ షోకు ఆదరణ లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. కేవలం ఎన్టీఆర్ శని, ఆదివారల్లో కనిపించడం ఓ కారణం అయితే.. హౌస్‌మేట్స్‌లో ఎవరూ పెద్దగా ఇప్పుడు 'ఫైల్'లో ఉన్నవాళ్ళు కాకపోవడం మరో కారణం. అంతా ఔట్‌డేటెడ్ గ్యాంగ్.. అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అంతేగాకుండా సోషల్ మీడియాలో షో గురించి నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో 'బిగ్‌బాస్' రియాల్టీ షోకి ఊపు తెచ్చేందుకోసం, పలువురు హాట్ సెలబ్రిటీస్‌ని 'వైల్డ్ కార్డ్ ఎంట్రీ' ద్వారా తీసుకొస్తున్నారనే ప్రచారం ఊపందుకొంది. ఈ లిస్ట్‌లో అందరికన్నా ముందు విన్పించిన పేరు హాట్ యాంకర్ అనసూయదే. అయితే, అనసూయ మాత్రం తన చుట్టూ విన్పిస్తోన్న 'బిగ్‌బాస్' గాసిప్స్‌ని కొట్టి పారేసింది. తనకు అంత టైమ్ లేదని తేల్చి చెప్పేసింది. టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నానని అనసూయ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చేసింది. Umm..Laksmi garu..i dont know I dont think I can afford that time to #BigBossTelugu ..i am hands full with prior TV and movie commitments.. -
ఆ వార్తలపై అనసూయ సీరియస్..!
బుల్లితెరపై సత్తా చాటి, ప్రస్తుతం వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యాంకర్ అనసూయ, తనపై సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తలపై సీరియస్ అయ్యింది. కొద్ది రోజులుగా అనసూయ లావు తగ్గేందుకు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఓ అభిమాని అనసూయి దృష్టికి తీసుకురావటంతో ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను షార్ట్ కట్స్ నమ్మనని.. ఎలాంటి సర్జరీ చేయించుకోవటం లేదని తెలిపింది. నా నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండానే ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారని తెలిపింది. 😂😂You know..they aint getting any news from me..so might as well they create😂! But on a serious note..NO!NEVER!!I dont believe in shortcuts. https://t.co/16h9QjiZZr — Anasuya Bharadwaj (@anusuyakhasba) 20 June 2017