Anasuya Shocking Reply To Netizen Over Comments On Her Future Roles: బుల్లితెరపై స్టార్ యాంకర్స్‌లో అనసూయ భరద్వాజ్ ఒకరు. తన అందచందాలతో ఫ్యాన్స్ మనసులను దోచేసిన ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్‌కు ఉన్నంత క్రేజ్ ఉంది. అయితే అనసూయ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా దూసుకెళ్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ ఫోటోస్ షేర్‌చేస్తూ నెట్టింట సందడి చేసే ఈ హాట్ యాంకరమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: పుష్ప మూవీలో అనసూయ లుక్ ఎలా ఉందో చూశారా?
తాజాగా తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆస్క్‌మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన అనసూయ..అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. పెద్ద సినిమాలో మంచి రోల్ వస్తే.. అవసరం అయితే పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు. దీనికి తప్పకుండా.. క్యారెక్టర్ కోసం అవసరం అయితే గుండు కొట్టించుకుంటా అంటూ అనసూయ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఇది చూసిన నెటిజన్లు.. సినిమాలంటే అనసూయకు ఉన్న డెడికేషన్ చూసి ఫిదా అవుతున్నారు. కాగా ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలో దాక్షయణి పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు ప్రభుదేవాతో ఓ సినిమాలో నటిస్తుంది.
చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్
శ్రీరామచంద్ర ఇమేజ్‌ను డామేజ్ చేస్తున్న వాట్సాప్ చాట్
Comments
Please login to add a commentAdd a comment