డెలివరీ అయిన మూడోరోజే అనసూయ అలా చేసింది! | Bezawada Prasanna Kumar About Anasuya Bharadwaj | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: అనసూయ గ్లామర్‌ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి..

Published Wed, Feb 21 2024 5:39 PM | Last Updated on Wed, Feb 21 2024 6:18 PM

Bezawada Prasanna Kumar About Anasuya Bharadwaj - Sakshi

సోషల్‌ మీడియాలో ఎక్కువ ట్రోల్‌ అయ్యే యాంకర్‌.. అనసూయ భరద్వాజ్‌. ఆంటీ అన్న ఒక్క పదంతో నెటిజన్లు ఈమెను ఆటాడుకుంటారు. తన డ్రెస్సింగ్‌ను, మాటల్ని.. అన్నింటినీ విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ప్రతిదాన్ని భూతద్దంలో వెతికి మరీ ఆమెను ట్రోల్‌ చేస్తుంటారు. అయితే ఎవరెన్ని చేసినా ఆమెను దెబ్బతీయలేరంటున్నాడు సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్‌. ఈయన జబర్దస్త్‌ కామెడీ షోకి సైతం స్క్రిప్ట్‌ రైటర్‌గా వ్యవహరించాడు.

అర్ధరాత్రి వరకు..
తాజాగా అతడు అనసూయ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'అలీ టాకీస్‌ అనే షో చేసినప్పుడు అనసూయ ఎపిసోడ్‌ షూట్‌ అవగానే రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రిహార్సల్స్‌ చేసేది. ఆమెకు పనిపట్ల అంతటి అంకితభావం ఉంది. ఓసారి ఓ టీవీ ఛానల్‌ వాళ్లు నా డైరెక్షన్‌లో కొత్త షో చేద్దామన్నారు. అనసూయను యాంకర్‌గా అనుకున్నారు. ఆమె కూడా ఒప్పుకుంది. టెస్ట్‌ షూట్‌ చేద్దామన్నారు.  అందుకోసం డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాం.

డెలివరీ అయిన మూడో రోజే..
సరిగ్గా షూటింగ్‌కు రెండు రోజుల ముందు ఆమె డెలివరీ అయింది. ఒకరోజు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంది. రెండో రోజు జిమ్‌కు వెళ్లింది. మూడో రోజు సెట్‌కు వచ్చింది. అరగంటకోసారి బిడ్డకు పాలు పడుతూ యాంకరింగ్‌ చేసింది. అందరం ఆశ్చర్యపోయాం.. ఆ రోజు షూటింగ్‌కు వచ్చినందుకుగానూ ఇంతవరకు డబ్బులు అడగలేదు. టెస్ట్‌ షూటే కదా నేను రాలేను, ఇంకెవర్నైనా చూసుకో అని మాట వరసకు కూడా అనలేదు. అందరూ ఊరికే తనను విమర్శిస్తుంటారు. కానీ తనంత టఫ్‌ అమ్మాయి ఇండస్ట్రీలో ఎవరూ లేరు. పైకి చూడటానికి గ్లామర్‌గా కనిపిస్తుంది కానీ దాని వెనక ఆ అమ్మాయి పడ్డ కష్టాలు ఎవరికీ తెలియదు' అని చెప్పుకొచ్చాడు ప్రసన్న కుమార్‌.

చదవండి: ప్రియుడిని పెళ్లాడిన రకుల్‌.. మరోసారి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement