![Anchor Anasuya Bharadwaj Slams Netizen For Age Shamming Her - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/17/Anusuya.jpg.webp?itok=yjtCCwy3)
యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తూనే అవకావం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మరింత పాపులర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
అయితే ఓ నెటిజన్ అడిగిన కొంటె ప్రశ్నకు ఘాటుగా బదులచ్చింది. మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'ఏదీ వద్దు. అలా పిలిచే అంత స్నేహం మన మధ్య లేదు. ఇలా పిలుస్తామని అనడం మీ పెంపకాన్ని ( అప్ బ్రింగింగ్) ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్ షేమింగ్ చేసినట్లే. గౌరవం ఇవ్వండి' అంటూ అనసూయ పేర్కొంది.
అయితే దీనికి కౌంటర్‌గా.. 'ఎవరినైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్ షేమింగ్ అవ్వదు. అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు' అంటూ సదరు నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి అనసూయ బదులిస్తే.. 'అయ్యుండొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారన్నది ముఖ్యం ఇక్కడ. అయినా కాంప్లిమెంట్స్(ప్రశంసలు) తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల ఇష్టం కదా' అంటూ ట్రోలర్ నోరు మూయించింది.
Comments
Please login to add a commentAdd a comment