యాంకర్ అనసూయ ఉన్నట్టుండి ఏడ్చేసింది. తన ఇన్ స్టాలో రీసెంట్‌గా ఆ వీడియో పోస్ట్ చేసింది. దీంతో అందరూ ఆమెకి ఏమైందా అనుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల బాధపడిందేమో అనుకున్నారు. కానీ కారణం అది కాదని, ఆ నెగిటివిటీకి తాను బాధపడే రకం కాదని చెప్పుకొచ్చింది. అయితే అనసూయ ఏం చెప్పాలనకుందనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆమె మనసు అర్థం చేసుకున్నాడు. ఓ లెటర్ రాశాడు.
ఆ వ్యక్తి లెటర్
అనసూయ ఏడుపు వీడియో పోస్ట్ చేయగానే చాలామంది ఆమెపై కౌంటర్స్ వేశారు. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా దీన్ని పోస్ట్ చేయడం ఒకటైతే, ఆ కారణంతో ఏడవలేదు, ట్రోల్స్ రీజన్ కాదని ఏదేదో చెప్పుకొచ్చింది. అయితే ఈమె వీడియో సారాంశాన్ని అర్థం చేసుకున్న ఓ అభిమాని, ఆమెకు ఓ లెటర్ రాశాడు. ఇప్పుడు దాన్ని అనసూయ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తాను చెప్పాలనుకున్నది ఈ మేటరే అని పేర్కొంది.
(ఇదీ చదవండి: బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ)
లెటర్‌లో ఏముంది?
'సోషల్ మీడియా మెల్లగా మన జీవితాల్ని ఆక్రమించేసింది, తన గుప్పిట్లోకి మనల్ని లాగేసకుంది. అనసూయ ముఖ్యమైన పాయింట్ లేవనెత్తింది. ఫొటోల్లో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాం. కానీ మనం బాధల్లో బతుకుతున్నాం కదా? హ్యాపీగా ఉన్నామని చూపించుకుంటూ ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాం. సైకియాట్రిస్ట్‌లు ఇదే చెబుతున్నారు. సంతోషంగా ఉండటానికి బదులు అలా చూపించుకునే వరకు వచ్చాం'
'ఆ వీడియోలో మనం ఓ విషయం గమనించొచ్చు. ఫెర్ఫెక్షన్ అనేది బూటకం. ఒత్తిడికి కారణం అదే. అనుభవం అనేది వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, తగిలిన దెబ్బలతో వస్తుంది. అందరి పట్ల దయతో ఉండండి. వారి జీవితాల్లో ఎలాంటి బాధ అనుభవిస్తున్నారో మనకు తెలీదు అని అనసూయ చెప్పింది. ట్రోలింగ్ వల్ల బాధపడతారు. ఓ మాట అనేటప్పుడు ఇవి ఆలోచించాలి. అంటున్నది నిజమేనా? ఎదుటివాళ్లు బాధపడతారా? మనకు జాలి దయ లేవా? అనేవి గుర్తుపెట్టుకోవాలి' అని లెటర్‌లో రాసుంది. ఇదంతా చూస్తుంటే.. సోషల్ మీడియా ట్రోలింగ్ గురించే అని అనసూయ బాధపడుతుందని అర్థమవుతోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment