Rahul Ramakrishna Doubt On Anchor Anasuya Tweet - Sakshi
Sakshi News home page

Rahul Ramakrishna: నన్ను తిడితే నీ కంపు నోరు.. అంటూ అనసూయ ట్వీట్‌.. మధ్యలో దూరిన కమెడియన్‌

Published Wed, May 10 2023 7:07 PM | Last Updated on Thu, May 11 2023 12:04 PM

Rahul Ramakrishna Doubt on Anchor Anasuya Tweet - Sakshi

హీరోలకు అభిమానులు రక్షణ కవచం వంటివారు. తమ అభిమాన హీరోను పల్లెత్తు మాట అన్నా అస్సలు సహించలేరు. అలాంటిది ఏకంగా కించపరిస్తే ఊరుకుంటారా? పట్టపగలే చుక్కలు చూపిస్తారు. యాంకర్‌, నటి అనసూయ విషయంలో ఇదే జరిగింది. ఎందుకోగానీ ఎప్పటినుంచో అనసూయకు, విజయ్‌ దేవరకొండ అంటే పడదు. గతంలో ఈ హీరో స్టేజీపైనే బూతు డైలాగ్‌ చెప్పాడని విమర్శించినందుకు ఫ్యాన్స్‌ అనసూయనే తిట్టిపోశారు.

ఇటీవల డైరెక్ట్‌గా విజయ్‌ దేవరకొండ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ అతడు ఖుషి సినిమా పోస్టర్‌లో పేరుకు ముందు The అని పెట్టుకోవడంపై సెటైర్లు వేసింది. పైత్యం.. అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్‌ చేసింది. ఇంకేముంది, ఆ మాట ఎవరిని ఉద్దేశించి అందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు అభిమానులు. మా రౌడీ హీరో మీద నీకెందుకంత ఒళ్లు మంట ఆంటీ.. అంటూ మళ్లీ ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేశారు.

అటు అనసూయ కూడా ఎక్కడా తగ్గకుండా వీలు దొరికినప్పుడల్లా రివర్స్‌ కౌంటర్‌ ఇస్తూ వస్తోంది. తనపై బూతుల వర్షం కురిపిస్తున్నవారిని ఉద్దేశిస్తూ తాజాగా ఓ ట్వీట్‌ వేసింది అనసూయ. 'నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనెలా తప్పవుతాను? నా పెంపకం గర్వించదగ్గది.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి' అని రాసుకొచ్చింది.

దీనిపై కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ స్పందిస్తూ 'ఇలా అడుగుతున్నందుకు దయచేసి నన్ను క్షమించగలరు, ఇంతకీ ఇక్కడ జరుగుతున్న లొల్లి ఏంటో తెలుసుకోవచ్చా?' అని అడిగాడు. దీనికి నెటిజన్లు.. 'అనసూయ వర్సెస్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ వార్‌ జరుగుతోంది', 'ఎప్పుడు చూడూ లైమ్‌ లైట్‌ కోసం హంగామా అనిపిస్తోంది, బేకార్‌ ముచ్చట్లు బేకార్‌ పంచాయితీలు.. అందరూ ఆమెను ఆంటీ అనడం మేడమ్‌ పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వడం', 'విజయ్‌ The అన్న పదం ఖుషీ పోస్టర్‌లో వాడినందుకు అనసూయకు కోపమొచ్చింది నోటికొచ్చినట్లు వాగింది, చివరికి ఫ్యాన్స్‌ చేతిలో చీవాట్లు తింటోంది' అని కామెంట్లతో క్లారిటీ ఇస్తున్నారు.

చదవండి: భార్యను దూరం పెట్టిన పూరీ జగన్నాథ్‌? క్లారిటీ ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement