ఐదు రోజులుగా ఆ సమస్యతో బాధపడుతున్న అనసూయ! | Anchor Anasuya Bharadwaj Suffering with Viral fever | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: ఐదు రోజులుగా ఇబ్బందిపడుతున్న అనసూయ, ఈ బూతులేంటి అంటూ ట్వీట్‌

Published Sun, Sep 17 2023 12:39 PM | Last Updated on Sun, Sep 17 2023 12:59 PM

Anchor Anasuya Bharadwaj Suffering with Viral fever - Sakshi

ఎవరేం అనుకున్నా ఐ డోంట్‌ కేర్‌ అంటూ తనకు నచ్చినట్లుగా ముందుకు సాగుతుంది యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. తన మనసులో ఉన్న మాటను నిస్సంకోచంగా బయటపెడుతుంది. ఎటువంటి విమర్శలనైనా లైట్‌ తీసుకుంటుంది. ఒకవేళ కోపమొస్తే సోషల్‌ మీడియా వేదికగా కౌంటరిస్తుంది. కానీ ఏ తాటాకు చప్పుళ్లకు ఆమె భయపడదు. అయితే తాజాగా ఆమె అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది. ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నానంటూ అనసూయ ట్విటర్‌(ఎక్స్‌)లో చెప్పుకొచ్చింది.

'ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. అందుకే సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉన్నాను. ఈ సమయంలో చాలా విషయాలు గుర్తించాను. నిర్దయగా వ్యవహరించడం, సాటి మనుషుల పట్ల జాలి లేకపోవడం.. వేధింపులు.. ఇలా చాలా గమనించాను. అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం..' అని ఆమె ట్వీట్‌ చేసింది. 'ఇప్పుడు స్టార్స్‌గా వెలుగొందుతున్నవారందరూ తమ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవారే!

ఎటువంటి పీఆర్‌ ప్రమోషన్స్‌ లేకుండా అద్భుత విజయాలు అందుకుని వారు ఈ స్థాయికి చేరుకున్నారు. వారి ప్రయాణాన్ని గౌరవించండి. అంతేకానీ వారి అభిమానులం అని చెప్పుకుని మరొకర్ని కించపరచొద్దు. విమర్శించడం మంచిదే.. కానీ అది గౌరవప్రదంగా ఉండాలి. బహిరంగంగా బూతుపదాలు, అడ్డగోలుగా మాట్లాడటాన్ని తగ్గించండి. బాధ్యతగా వ్యవహరించండి' అని చెప్పుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement