యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అనసూయ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా షేర్ చేస్తుంటుంది. అయితే అవి కొన్నిసార్లు కాంట్రవర్సీలకు కారణం అవుతుంటాయి. తాజాగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ అనసూయ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ది విజయ్ దేవరకొండ అని రాసి ఉంది. (సాధారణంగా యూనిక్ విషయాలకు, వస్తువుల గురించి మెన్షన్ చేసేటప్పుడు ది అని వాడుతుంటాం).
ఈ పోస్టర్‌పై పరోక్షంగా స్పందించిన అనసూయ ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే ఒకటి చూశాను.. ‘The’నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం" అంటూ ఎవరి పేరు మెన్షన్ చేయకుండానే అనాల్సిందంతా అనేసింది. ఈ క్రమంలో విజయ్‌ను కావాలనే టార్గెట్ చేసిందంటూ రౌడీ ఫ్యాన్స్ అనసూయపై ఫైర్ అవుతున్నారు. ఆంటీ అంటూ అనసూయను తెగ ట్రోల్ చేస్తున్నారు.
దీనిపై రియాక్ట్ అయిన అనసూయ.. భలే రియాక్ట్ అయ్యారు దొంగ.. ఊప్స్.. బంగారుకొండలంతా నేను అనేది నిజమని నిరూపిస్తున్నారు అంటూ మరో ట్వీట్ చేసింది. గతంలో అర్జున్ రెడ్డి, లైగర్ సినిమాల విషయంలోనూ అనసూయ, విజయ్ ఫ్యాన్స్‌కు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam 🙊
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023
Bhale react autunnarra donga..oops.. bangarukondalanta.. ekkado akkada nenu nijam anedi prove chestune unnanduku thanks ra abbailu 🤭😊😇
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023
Comments
Please login to add a commentAdd a comment