Anasuya Bharadwaj: Vijay Deverakonda Publicist Paid Trolls To Abuse Me - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: డబ్బులిచ్చి మరీ నన్ను తిట్టిస్తున్నారు.. విజయ్‌ దేవరకొండ మనిషే చెప్పాడు

Published Fri, Jun 9 2023 12:57 PM | Last Updated on Fri, Jun 9 2023 1:22 PM

Anasuya Bharadwaj: Vijay Deverakonda Publicist Paid Trolls To Abuse Me - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, ఫైర్‌ బ్రాండ్‌ అనసూయ భరద్వాజ్‌ మధ్య ఎంతోకాలంగా సైలెంట్‌ వార్‌ నడుస్తోంది. ఇటీవల ఖుషి సినిమాలో విజయ్‌ పేరు ముందు The అని పెట్టడం, దీనిపై అనసూయ విమర్శలు గుప్పించడం.. ఫలితంగా రౌడీ హీరో ఫ్యాన్స్‌ ఆమెను ఏకిపారేయడం జరిగింది. తాజాగా ఈ పరిణామాలన్నింటిపై స్పందించింది అనసూయ. అలాగే గొడవ ఎక్కడ మొదలైందో కూడా చెప్పుకొచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నిజానికి నేను, విజయ్‌ గతంలో మంచి ఫ్రెండ్స్‌లానే ఉన్నాం. మా మధ్య ఎలాంటి గొడవ లేదు. 2017లో అర్జున్‌ రెడ్డి సినిమా రిలీజైంది. ఈ క్రమంలో విజయ్‌ ఓ థియేటర్‌కు వెళ్లి సినిమాలో ఉన్న బూతు మాటలే అక్కడా మాట్లాడాడు. అభిమానులతో కూడా ఆ బూతు డైలాగులు పలికించాడు. సినిమాలో అలాంటి పాత్ర పోషించాడు సరే, కానీ నిజ జీవితంలో కూడా ఆ వల్గారిటీని ఎందుకు ఎంకరేజ్‌ చేయడం? ఒక అమ్మగా ఆ అసభ్య పదాలు నాకు నచ్చలేదు. ఇదేమాట విజయ్‌కు కూడా చెప్పాను. నిజ జీవితంలో అలా ఉండొద్దని సూచించాను. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం నాపై విపరీతమైన నెగెటివిటీ.. అయినా సరే ముందుకు సాగాను.

2019లో విజయ్‌ దేవరకొండ తండ్రి మీకు మాత్రమే చెప్తా సినిమా తీశాడు. అందులో నాకు ఓ పాత్ర కూడా ఆఫర్‌ చేశాడు. అంతా బానే ఉందనుకున్న సమయంలో నాకు పిడుగులాంటి వార్త తెలిసింది. విజయ్‌ దగ్గర పని చేసే వ్యక్తి డబ్బులిచ్చి మరీ నాపై ట్రోలింగ్‌ చేయిస్తున్నాడని! అతడి టీమ్‌లో పనిచేసే వ్యక్తి ఈ విషయాన్ని చెప్పాడు. ఇది విని నేను షాకయ్యాను. డబ్బులిచ్చి మరీ నాపైకి అభిమానులను ఉసిగొల్పుతున్న వ్యక్తి విజయ్‌కు తెలియకుండానే ఇదంతా చేస్తాడా? అయినా అతడు చెప్పనిదే ఇదంతా చేయాల్సిన అవసరం వీరికేంటి?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది అనసూయ.

చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement