![Vijay Deverakonda Kingdom next schedule in Vizag](/styles/webp/s3/article_images/2025/02/16/Vijay-Devarakonda-Kingdom.jpg.webp?itok=eHJukoz3)
వైజాగ్ వెళ్లారట విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్‌డమ్’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ చిత్రీకరణ ఇప్పటికే 75 శాతానికి పైగా పూర్తయింది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం విజయ్ దేవరకొండ వైజాగ్ వెళ్లారని తెలిసింది.
దాదాపు 20 రోజులకు పైగా వైజాగ్‌లో ‘కింగ్‌డమ్’ చిత్రీకరణ జరుగుతుందని, కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరణ జరిగేలా ఈ చిత్రదర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, రెండు రకాల టైమ్‌లైన్స్‌తో కథ సాగుతుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ ఆల్రెడీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ‘కింగ్‌డమ్’ సినిమాను మే 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ఇక ఈ చిత్రమే కాకుండా దర్శకులు రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలాలతో విజయ్ దేవరకొండ ఆల్రెడీ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment