
ఈ సంక్రాంతికి వచ్చిన 'గేమ్ ఛేంజర్' (Game Changer) ఘోరమైన ఫ్లాప్. ఇది అందరికీ తెలుసు. తప్పు ఎవరిదనేది పక్కనబెడితే అక్కడితో టాపిక్ ఎండ్ అయిపోయింటే బాగుండేదేమో! కానీ రిలీజై రెండు నెలలు దాటిపోయినా సరే ఎక్కడో చోట సినిమా టాపిక్ వినిపిస్తూనే ఉంది. తాజాగా నిర్మాత దిల్ రాజు (Dilraju) వల్ల మరోసారి సోషల్ మీడియాలో ఇది చర్చకు కారణమైంది.
ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ విషయానికొస్తే.. మోహన్ లాల్-పృథ్వీరాజ్ 'ఎల్ 2: ఎంపురన్' (L2 Empuran) మూవీ వచ్చే వారం రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. తాము ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదని, లాభాల్లో వాటా తీసుకుంటామని నటుడు పృథ్వీరాజ్ చెప్పారు. అయితే 'గేమ్ ఛేంజర్'కి కూడా తొలుత ఇలానే ఫ్రాపిట్ షేర్ ప్లాన్ అనుకున్నామని.. తర్వాత ప్లాన్ మారిపోయిందని దిల్ రాజు చెప్పారు.
(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్'.. చరణ్ కి కాస్త ఇబ్బందే?)
అంతకు ముందు 'గేమ్ ఛేంజర్' రిలీజైన కొన్నిరోజులకు మీడియాతో మాట్లాడిన దర్శకుడు శంకర్.. 5 గంటల పుటేజీ రావడంతో తాను అనుకున్న మంచి సీన్లు సినిమాలో పెట్టలేకపోయానని, అందుకే ఫ్లాప్ అయిందని చెప్పుకొచ్చాడు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. హుక్ స్టెప్స్ లేకపోవడం వల్లే 'గేమ్ ఛేంజర్' పాటలు ఫెయిల్ అయ్యాయని అన్నాడు. కొరియోగ్రాఫర్, హీరోనే దీనికి కారణమన్నట్లు కామెంట్స్ చేశాడు. ఇలా ఎవరికీ వాళ్లు ఏదో ఒకటి చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈ 'గేమ్ ఛేంజర్' పంచాయితీ ఎప్పుడు ఆగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)
Comments
Please login to add a commentAdd a comment