
ఈ సంక్రాంతికి రిలీజైన 'గేమ్ ఛేంజర్'.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కర్ణుడు చావుకి వంద కారణాలు అన్నట్లు ఈ మూవీ ఫ్లాప్ కావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. కంటెంట్ దగ్గర పాటల వరకు ప్రతి దానిపై ట్రోల్స్ వచ్చాయి. ఇవన్నీ సంగీత దర్శకుడు తమన్ వరకు చేరినట్లున్నాయి. తాజాగా ఆడియో ఫెయిల్యూర్ పై ఓ ఇంటర్వ్యూలో తానే వివరణ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)
'గేమ్ ఛేంజర్ లో సరైన హుక్ స్టెప్ లేదు. అందుకే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాలేదు. గతంలో నేను మ్యూజిక్ ఇచ్చిన 'అల వైకుంఠపురములో' పాటల్లో ప్రతిదానిలో హుక్ స్టెప్ ఉంటుంది. సంగీత దర్శకుడిగా ఒక్కో పాటకు 25-50 మిలియన్ల వ్యూస్ నేను తీసుకురాగలను. మంచి మెలోడీ అయితే 100 మిలియన్ వ్యూస్ కూడా వస్తాయి. దానికి మించి వ్యూస్ రావాలంటే మాత్రం కొరియోగ్రాఫర్, నటుడిపై ఆధారపడి ఉంటుంది' అని తమన్ చెప్పుకొచ్చాడు.
'గేమ్ ఛేంజర్' పాటల్లో రా మచ్చా, దోప్, జరగండి, నానా హైరానా.. ఇలా సాంగ్స్ అన్నీ పెద్దగా ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఒకవేళ పాటలతో హైప్ క్రియేట్ అయ్యింటే సినిమాపై కాస్తంత బజ్ అయినా పెరిగేదేమో! తమన్ చెప్పినట్లు హుక్ స్టెప్ కూడా లేకపోవడం మైనస్ అయిందేమో!
(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్నిమూల పడేసిన తమన్)
Comments
Please login to add a commentAdd a comment