గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie)కు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. అయినా సరే బంపర్ హిట్ అంటూ తొలి రోజే రూ.186 కోట్లు వచ్చాయని ప్రచారం చేశారు. ఓపక్క సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంటే మరోపక్క కలెక్షన్లు భారీగా వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ (Ram Charan) సోషల్ మీడియా వేదికగా గేమ్ ఛేంజర్ సినిమాపై స్పందించాడు.
సినిమా సక్సెస్‌లో వారంతా భాగమయ్యారు
తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అభిమానులకు, ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గేమ్ ఛేంజర్ సినిమా కోసం మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాలో పని చేసిన నటీనటులతో పాటు తెరవెనక పనిచేసిన అందరూ ఈ సినిమా విజయంలో భాగమయ్యారు.
మంచి రివ్యూలు ఇస్తున్నందుకు థ్యాంక్స్
మీ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. గేమ్ ఛేంజర్ సినిమాకు మంచి రివ్యూలు ఇస్తున్న మీడియాకు స్పెషల్ థ్యాంక్స్. మా సినిమా మైల్ స్టోన్ అందుకోవడంలో మీ రివ్యూలు కీలక పాత్ర పోషించాయి. పాజిటివిటీతో ముందుకువెళ్దాం. మున్ముందు కూడా మీరు గర్వపడే పాత్రలు చేస్తానని మాటిస్తున్నాను. గేమ్ ఛేంజర్ సినిమాకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని ఓ లేఖ షేర్ చేశాడు.
గేమ్ ఛేంజర్ సినిమా విశేషాలు
ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటించారు. తమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లలో రిలీజైందో లేదో వెంటనే పైరసీరాయుళ్లు దాన్ని లీక్ చేసి ఆన్‌లైన్‌లో వదిలారు.
దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఓ ముఠా ఉందని చిత్రయూనిట్ ఆరోపిస్తోంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామంటూ బెదిరించిన ముఠా చివరకు అన్నంత పనీ చేసిందట. దీంతో గేమ్ ఛేంజర్ యూనిట్ ఆ 45 మందిపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది.
పాటల కోసమే అన్ని కోట్లు!
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దాదాపు రూ.400-450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాకు వస్తున్న మిక్స్‌డ్ టాక్ చూస్తుంటే మూవీ బ్రేక్ ఈవెన్ అవడం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇకపోతే శంకర్ రేంజ్‌కు తగ్గట్లుగా పాటల కోసం కూడా భారీగా ఖర్చు పెట్టారట. ఈ విషయాన్ని ఓ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజే స్వయంగా వెల్లడించాడు. కేవలం ఐదు పాటల కోసమే రూ.75 కోట్లు పెట్టినట్లు తెలిపాడు. రిహార్సల్స్ కలుపుకుంటే ఇంకా ఎక్కువే అవుతుందన్నాడు.
చదవండి: థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!
Comments
Please login to add a commentAdd a comment