s. shankar
-
కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?
సినిమా పరిశ్రమలో కథలను, సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది నేడు సాధారణ విషయంగా మారింది. ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి కూడా. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఇలాంటి హెచ్చరికలనే చేశారు. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్– 2 చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన చాలా ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం 'గేమ్ ఛేంజర్'. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో తెరపైకి రానుందని సమాచారం. ఈ చిత్రం తరువాత రచయిత ఎస్.వెంకటేశన్ రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్‌కు గురయ్యారు. దీనిపై స్పందించిన ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఎస్.వెంకటేశన్ రాసిని ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు చెప్పారు. అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడడం బాధగా ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ చిత్రం ట్రైలర్లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్ అయ్యానన్నారు. దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ, వెబ్ సిరీస్లోగానీ ఉపయోగించరాదన్నారు. దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు. అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలను చిత్రీకరించరాదన్నారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్ హెచ్చరించారు. ఇంతరీ వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ చిత్రంలో వాడారో అన్న విషయాన్ని మాత్రం శంకర్ వెల్లడించలేదు. దేవర గురించే కామెంట్..?దేవర సినిమా గురించే శంకర్ కామెంట్ చేశారని నెట్టింట వైరల్ అవుతుంది. ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దేవర ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్‌గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, వేల్పారి నవలను ఆధారం చేసుకుని శంకర్ ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫామ్ అయ్యిందన్నమాట. -
ఆ సినిమాలో ఛాన్స్ కోసం డైరెక్టర్‌కు బికినీ ఫోటోలు పంపిన హీరోయిన్
అన్నమయ్య,పెద్దరికం, భారతీయుడు సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ హీరోయిన్ కస్తూరి.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో మంచి సినిమాలు చేసిన కస్తూరికి భారీ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇండస్ట్రీలో తనకు నచ్చిన విషయంతో పాటు ఏదైనా నచ్చలేదంటే ఓపెన్‌గానే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే గట్స్ ఆమెకు ఉన్నాయి. అలా ఒక్కోసారి ఆమె కామెంట్లు భారీగానే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆమె 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్లో తులసి పాత్రతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో కస్తూరి తన కెరీర్ ప్రారంభం రోజుల్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శంకర్ లాంటి దర్శకుడితో కలసి పనిచేయడం ఎంత అదృష్టమో నాకు ఆ తర్వాత రోజుల్లో తెలిసింది. 'అప్పుడు నాది చిన్న వయసు. కాబట్టి ఏదో సరదాగా చేసేశాను. కమల్ హాసన్ హిట్ సినిమా భారతీయుడులో మొదట హీరోయిన్ ఛాన్స్ నాకే వచ్చింది. ఆ సినిమా విషయంలో సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని డైరెక్టర్‌కి బికినీ ఫోటోలు కూడా పంపించాను. కానీ.. అదే సమయంలో రంగీలా చిత్రం రిలీజ్ కానుంది. ఆ సమయంలో ఎక్కడ చూసిన ఊర్మిళ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో భారతీయుడు సినిమా మేకర్స్ అటెన్షన్ ఆమె వైపు వెళ్ళింది. చివరికి ఊర్మిళను హీరోయిన్గా ఫైనల్ చేశారు. నాకు మాత్రం కమల్ హాసన్ చెల్లి పాత్ర ఇచ్చి సరిపెట్టేశారు. అలా భారతీయుడికి కుమార్తెగా నటించాను. కొద్దిరోజుల తర్వాత ఏంటి సర్ ఇలా చేశారు..? అని అడిగితే.. సినిమాలో ఇదొక కీలకమైన పాత్ర అని చెప్పడంతో నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను.' అని కస్తూరి తెలిపింది. -
సినిమా ఇండస్ట్రీకే గేమ్ ఛేంజర్.. 30 ఏళ్లుగా టాప్ దర్శకుడిగా..
చిత్ర పరిశ్రమలో అందరూ సినిమాను ప్రేమించే వారే. అయితే సినిమానే శ్వాసగా భావించేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో దర్శకుడు శంకర్ ఒకరు. తొలి చిత్రంతోనే స్టార్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈయన తొలి చిత్రం జెంటిల్మెన్. అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ చిత్రం విడుదలై ఆదివారం (జూలై 30) నాటికి 30 వసంతాలు పూర్తి చేసుకుంది. తొలి ప్రయత్నంలోనే శంకర్ ఒక బలమైన సామాజిక అంశాన్ని తీసుకొని కమర్షియల్ అంశాలు చొప్పించి ప్రయోజనాత్మక, జనరంజక కథా చిత్రంగా జెంటిల్మెన్ను మలిచారు. ఆ తర్వాత కూడా శంకర్ తన చిత్రాల్లో సామాజిక అంచాలను తెరపై ఆవిష్కరించడాన్ని విస్మరించలేదు. ఇక ఒక దర్శకుడిగా 30 ఏళ్ల క్రితం ఉదయించిన శంకర్ ఇప్పటికి 13 చిత్రాలు మాత్రమే చేశారు. ప్రస్తుతం ఈయన తమిళంలో ఇండియన్– 2, తెలుగులో గేమ్ ఛేంజర్ చిత్రాలను చేస్తున్నారు. అలా తక్కువ చిత్రాలు చేసినా నేడు టాప్ 10 దర్శకుల్లో ఒకరిగా రాణించటం శంకర్‌కే చెల్లింది. ఇప్పటి వరకు ముదల్ వన్, బాయ్స్, ఇండియన్, ఎందిరన్, శివాజీ, రోబో –2, నన్బన్ తదితర చిత్రాలు బ్రహ్మాండానికి నిదర్శనంగా నిలిచాయి. అందుకే శంకర్‌ను బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు అని పేర్కొంటారు. కాగా జెంటిల్మెన్ చిత్రం 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శిష్య బృందం (జెంటిల్మెన్ , ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పనిచేసిన సిబ్బంది) ఆదివా రం చైన్నెలోని శంకర్ కార్యాలయంలో ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వేడుకలో శంకర్ పాల్గొని కేకను కట్ చేశారు. A true #GameChanger in Indian Film Industry ❤️🔥 Congratulations @shankarshanmugh sir for completing 30 splendid years. Here's to more exemplary work and accolades that await you.😊 pic.twitter.com/KSWSHa91j6 — Ram Charan (@AlwaysRamCharan) July 30, 2023 చదవండి: ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బాలీవుడ్ జంట -
ఓపక్క పొలిటికల్ ఎంట్రీ.. మరోపక్క సినిమాలు.. విజయ్ దారెటు?
నన్బన్ చిత్ర కాంబో రిపీట్ కానుందా అంటే ? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్, దళపతి విజయ్, శ్రీకాంత్, జీవా, ఇలియానాలో కాంబినేషన్లో ఇంతకుముందు రూపొందిన హిట్ చిత్రం నన్బన్. ఇది హిందీ చిత్రం 3 ఇడియట్స్ చిత్రానికి రీమేక్. కాగా మళ్లీ శంకర్ విజయ్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. విజయ్ త్వరలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని విజయ్ వర్గం ఖండిస్తోంది. విజయ్ నటిస్తూనే రాజకీయాల్లో ఉంటారని ఆయన అభిమాన వర్గాలు పేర్కొంటున్నారు. ఇకపోతే దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్– 2 చిత్రాన్ని, అదేవిధంగా తెలుగులో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత విజయ్ హీరోగా నటించే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. విజయ్ కోసం రాజకీయ థ్రిల్లర్ కథా చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర వన్ లైన్ కథను విజయ్‌కు చెప్పినట్లు, ఇంప్రెస్ అయిన విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం! ఇది విజయ్ నటించే 70వ చిత్రం అవుతుందని, దీనికి ముందు అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించే అవకాశం ఉందని సమాచారం. చదవండి: అచ్చం తండ్రిలానే ఉన్నాడు.. వైరలవుతున్న తారకరత్న ఫోటో -
పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రామ్‌చరణ్!
పాన్ ఇండియా మెగా హీరో రామ్ చరణ్ RRR తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చరణ్ సతీమణి ఉపాసన ప్రెగ్నెంట్, జులై మొదటి వారంలో డెలివరీ ఉంటుందని డాక్టర్లు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వివాహం తర్వాత దాదాపు పది సంవత్సరాలకు తన భార్య తల్లి కాబోతుండడంతో రాంచరణ్ తన పూర్తి సమయాన్ని ఉపాసనకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ సినిమాపై నిషేధం!) బిడ్డ పుట్టబోయే ముందు తన పూర్తి సమయాన్ని ఉపాసనకే కేటాయించాలని, అందుకోసం ఆగస్టు నెల వరకు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఉపాసన పూర్తిగా వైద్యుల వర్యవేక్షణలో ఉన్నారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ ద్వారా మెగా ఫ్యాన్స్ కోసం పలు విషయాలను షేర్ చేస్తున్నారు. అయితే దాదాపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ ఆగస్టు తర్వాత తిరిగి షూటింగ్ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) -
పన్నెండేళ్ల తర్వాత మళ్లీ కాలేజీ బాట పట్టిన రామ్ చరణ్!
రామ్‌చరణ్ ఇటీవల ఓ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారని తెలిసింది. ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ దర్శకుడు శంకర్. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అమృత్‌సర్‌లో జరగనుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. స్టూడెంట్‌గా కనిపించి, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారట. అంతేకాదండోయ్.. ఈ సినిమాలో 1930 సమయంలో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉందని భోగట్టా. ఈ సీన్స్‌లో అంజలి కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి టైమ్‌లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. 2010లో వచ్చిన ‘ఆరెంజ్’లో పూర్తిస్థాయి స్టూడెంట్ పాత్రలో కనిపించారు రామ్‌చరణ్. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం పన్నెండేళ్ల తర్వాత కాలేజీకి వెళ్తున్నారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే.. రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర చేసిన ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
చెర్రీ భారీ యాక్షన్.. ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు. పక్కా స్కెచ్చేసిన శంకర్
దర్శకుడు శంకర్ సినిమాల్లో ట్రైన్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ సీక్వెన్సెస్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. ఆయన గత చిత్రాలు ‘రోబో’, ‘ఐ’లో ఉన్న ట్రైన్ యాక్షన్ సన్నివేశాలే ఇందుకు ఓ నిదర్శనం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. (చదవండి: RC 15: ఒక్క కాన్సెప్ట్ పోస్టర్‌కే అంత ఖర్చు పెట్టించాడా!) ఇందులో ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారట శంకర్. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్‌ను తయారు చేయిస్తున్నారని సమాచారం. ఈ ఫైట్ సీన్స్‌కి దాదాపు ఎనిమిది కోట్లు కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. ఈ సీన్స్‌లో వందలమంది ఫైటర్స్ పాల్గొంటారట. మరి... ఈ వార్త నిజమైతే రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు ఫైట్ ఫీస్ట్ ఖాయమనే చెప్పొచ్చు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. -
ముఖ్యమంత్రిగా చరణ్ ప్రమాణ స్వీకారం చేస్తారా?
శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘ముదల్వన్’ (1999) సినిమా గుర్తుందిగా! అదేనండీ.. తెలుగులో ‘ఒకేఒక్కడు’గా విడుదలైంది కదా.. ఆ సినిమానే. అందులో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా అర్జున్ అదరగొట్టారు. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు హీరో రామ్‌చరణ్‌ని ముఖ్యమంత్రిని చేయనున్నారట శంకర్. చరణ్–శంకర్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఇందులో రామ్‌చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా చరణ్ ప్రమాణ స్వీకారం చేస్తారా? ఒకవేళ చేస్తే.. ‘అనే నేను’ అనేముందు ఏ పేరు చెబుతారో? చరణ్ క్యారెక్టర్‌కి శంకర్ ఏ పేరు పెడతారో చూడాలి. -
శ్రీవారి సేవకు మరో ఇద్దరు
టీటీడీ స్థానిక సలహా మండలిలో నియామకాలు ఎస్ శంకర్, డి. రాధాకృష్ణమూర్తికి స్థానం వారం రోజుల్లో మరికొన్ని పేర్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ, చెన్నై) స్థానిక సలహా మండలి సభ్యుల ని యామకాలు ఎట్టకేలకూ ప్రారంభమయ్యాయి. సలహా మండలి సభ్యుల హోదాలో శ్రీవారికి సేవ చేసేందుకు మరో ఇద్దరికి అవకాశం లభించింది. చెన్నైకి చెందిన తెలుగు ప్రముఖులైన ఎస్ శంకర్, దుగ్గి రాధాకృష్ణమూర్తిలను మండలి సభ్యులుగా నియమిస్తూ దేవస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. చెన్నై టీనగర్ వెంకటనారాయణ్ రోడ్డులో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సమాచార కేంద్రం స్థానిక సలహా మండలి వారు భక్తి ప్రపత్తులతో నిర్వహించే కార్యక్రమాల వల్ల క్రమేణా ఆలయంగా ప్రసిద్ది చెందింది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో జరిగే అన్నిరకాల ప్రత్యేక సేవలు చెన్నైలోని ఆలయంలో ప్రవేశపెట్టారు. ఇది కేవలం సమాచార కేంద్రం అనే సంగతిని ప్రజలు ఏనాడో మరిచిపోయారు. ఇక్కడి శ్రీవారి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అధ్యక్షులు, 16 మంది సభ్యులతో కూడిన సలహా మండలిని రెండేళ్లకు ఒకసారి నియమించడం ఘానవాయితీగా వస్తోంది. బ్రహ్మయ్య అండ్‌కో భాగస్వామి, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీకృష్ణను సలహా మండలి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు ఆరునెలల క్రితం నియమించింది. 16 స్థానాలకు సుమారు 780 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మండలిలో చోటు కోసం ఎవరి పలుకుబడిని వారు ప్రయోగించడంతో రాజకీయ వత్తిడిని భరించలేక సభ్యుల ప్రస్తావన లేకుండా అధ్యక్షుని నియామకంతో ప్రభుత్వం మిన్నకుండిపోయింది. అయితే పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకో లేదా రాజకీయ పెద్దల వత్తిడి తలొగ్గడమో కారణం ఏదైనా ఎట్టకేలకూ సభ్యుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా నియమితులైన శంకర్ భారతీయ జనతా పార్టీ కోటా కింద, దుగ్గి రాధాకృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ కోటా కింద నియమితులైనారు. సలహా మండలిలో సభత్వం ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా కొంతమందిని సంతృప్తిపరచాల్సి ఉండగా, వారం రోజుల్లోగా మరికొంత మంది పేర్లు సలహా మండలి జాబితాలో చల్లగా సర్దుకుపోనున్నాయి.