RC15: Ram Charan Turns A Student For Shankar Movie, Details Check Inside - Sakshi
Sakshi News home page

Ram Charan: పన్నెండేళ్ల తర్వాత మళ్లీ కాలేజీ బాట పట్టిన రామ్‌ చరణ్‌!

Published Tue, Apr 5 2022 9:04 AM | Last Updated on Tue, Apr 5 2022 10:58 AM

RC15: Ram charan turns A Student For Shankar Movie - Sakshi

రామ్‌చరణ్‌ ఇటీవల ఓ కాలేజీలో అడ్మిషన్‌ తీసుకున్నారని తెలిసింది. ఈ కాలేజీకి ప్రిన్సిపాల్‌ దర్శకుడు శంకర్‌. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ అమృత్‌సర్‌లో జరగనుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ రెండు షేడ్స్‌ ఉన్న పాత్ర చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. స్టూడెంట్‌గా కనిపించి, ఆ తర్వాత ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారట.

అంతేకాదండోయ్‌.. ఈ సినిమాలో 1930 సమయంలో ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉందని భోగట్టా. ఈ సీన్స్‌లో అంజలి కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి టైమ్‌లో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్‌. ఇదిలా ఉంటే..  2010లో వచ్చిన ‘ఆరెంజ్‌’లో పూర్తిస్థాయి స్టూడెంట్‌ పాత్రలో కనిపించారు రామ్‌చరణ్‌. ఇప్పుడు శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం పన్నెండేళ్ల తర్వాత కాలేజీకి వెళ్తున్నారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే.. రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర చేసిన ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement