ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో ప్రపంచ సినీ ప్రేమికులను మెప్పించాడు రామ్‌చరణ్ (Ram Charan). ఈ సినిమా తర్వాత ఆచార్య సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్‌లోని ఏంటమ్మా పాటలో అతిథిగా మెరిశాడు. మోడ్రన్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి అనే డాక్యుమెంటరీ చిత్రంలోనూ కనిపించాడు. కానీ హీరోగా చరణ్ నుంచి సినిమా వచ్చి మూడేళ్లవుతోంది. ఇంతకాలం గ్యాప్ తర్వాత గేమ్ ఛేంజర్ (Game Changer Movie)తో ప్రేక్షకుల్ని పలకరించాడు చరణ్. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే సినిమా చూసేసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఎలా ఉందన్న సాక్షి.కామ్ పోల్‌కు పలువురూ ఈ కింది విధంగా స్పందించారు.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న తీరును గూర్చి అద్బుతమైన కథనం
- సైదుల యాదవ్
ఔట్‌డేటెడ్ డైరెక్షన్
- రవికుమార్
శంకర్ చెత్త డైరెక్షన్. హీరో, శ్రీకాంత్ తప్ప ఎవరికి స్కోప్ లేదు. చెత్త స్ర్క్రీన్ ప్లే
- సురేశ్ రాజ్
అవుట్ డేటెడ్ డైరెక్టర్, అవుట్ డేటెడ్ స్టోరీ, శంకర్ ని డైరెక్టర్ గా తీసుకుని దిల్ రాజు చాలా తప్పు చేశాడు 🙏🏻🙏🏻. చరణ్ పెర్ఫార్మన్స్ కి ఒక్కసారి చూడొచ్చు 🙏🏻🙏🏻మిగతా సినిమా అంత అస్సాం ఏ, పోయారు మోసం.
- అమలశేఖర్ గౌడ్
ఈ పండక్కి ఓటీటీలో వేసేస్తే ఫ్యామిలీ మొత్తం చూస్తాం.. వేసేయండి దిల్ రాజు గారు పండగ పూట మీ పేరు చెప్పుకుంటాం
- భాస్కర్ కుమార్
ప్రొడ్యూసర్ బతుకు చేంజ్ అయిపోయింది అంటా
-మహమ్మద్ నూర్
మనకు సోషల్ మెసేజ్‌లు నచ్చవు, పుష్ప లాంటి సినిమాలు కావాలి
- మల్యాద్రి రెడ్డి బాలసాని
ఎక్సలెంట్ మూవీ
-ముబీన్
సినిమా మధ్యలో వచ్చేశా
- గిరి
గతేడాది గుంటూరు కారం బ్లాక్‌బస్టర్ అయితే ఈసారి గేమ్ ఛేంజర్ కూడా బ్లాక్‌బస్టర్ అయినట్లే!
- పవన్
ఇలా సినిమా బాగుందని కొందరు కామెంట్లు చేయగా అస్సలు బాగోలేదని ఎక్కువమంది రియాక్ట్ అవుతున్నారు. అసలైన సంక్రాంతి పోటీ మొదలు కాకముందే గేమ్ ఛేంజర్ గేమ్ ఓవర్ అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. అటు సాక్షి వాట్సప్ ఛానల్‌లో పెట్టిన పోలింగ్‌లోనూ మెజారిటీ జనాలు సినిమా బాలేదని అభిప్రాయపడుతున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment