పాన్ ఇండియా మెగా హీరో రామ్ చరణ్ RRR తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చరణ్ సతీమణి ఉపాసన ప్రెగ్నెంట్, జులై మొదటి వారంలో డెలివరీ ఉంటుందని డాక్టర్లు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వివాహం తర్వాత దాదాపు పది సంవత్సరాలకు తన భార్య తల్లి కాబోతుండడంతో రాంచరణ్ తన పూర్తి సమయాన్ని ఉపాసనకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ సినిమాపై నిషేధం!)
బిడ్డ పుట్టబోయే ముందు తన పూర్తి సమయాన్ని ఉపాసనకే కేటాయించాలని, అందుకోసం ఆగస్టు నెల వరకు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఉపాసన పూర్తిగా వైద్యుల వర్యవేక్షణలో ఉన్నారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెగా ఫ్యాన్స్ కోసం పలు విషయాలను షేర్ చేస్తున్నారు. అయితే దాదాపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ ఆగస్టు తర్వాత తిరిగి షూటింగ్ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్)
Comments
Please login to add a commentAdd a comment