break
-
ఆరు అలవాట్లు.. విజయానికి అడ్డు గోడలు
మనం లోతుగా దృష్టిసారిస్తేగానీ గ్రహించలేని మనలోని కొన్ని అలవాట్లు మన విజయానికి అడ్డుగోడలుగా నిలుస్తుంటాయి. వీటిని గుర్తించి, మన తీరుతెన్నులను మార్చుకున్నప్పడే మనం విజయబావుటా ఎగురవేయగలుగుతాం. ఆ అలవాట్లు ఏమిటో, వాటిని మనలో నుంచి ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.విజయానికి అడ్డుపడే అలవాట్లివే..1. ప్రతీ పనిని వాయిదా వేయడంమనలో చాలామంది తాము చేయాల్సిన ప్రతి పనిని వాయిదా వేస్తుంటారు. ఇటువంటి అలవాటును ప్రొక్రాస్టినేషన్(Procrastination) అని అంటారు. ఇటువంటి అలవాటు ఎవరిలో ఉన్నా, విజయం అనేది వారి దరిదాపులకు కూడా చేరదని మానసిక నిపుణులు చెబుతుంటారు. చేయాల్సిన పనిని తగిన సమయంలో మొదలుపెట్టి, పూర్తిచేయడం వలన విజయానికి చేరువవుతాం.2. నెగిటివ్ ఆలోచనలుమనలోని ఆలోచనలే మన పనులలో ప్రతిబింబిస్తుంటాయి. మనలో మనం, మనతో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మనం ప్రవర్తిస్తుంటాం. నిత్యం నెగిటివ్ విషయాలు (Negative Talks) మాట్లాడుకోవడమనేది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అదే సమయంలో పాజిటివ్‌గా వ్యవహరించడం విజయానికి దోహదపడుతుంది. కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తుంది.3. రిస్క్ తీసుకోకపోవడంఎవరైనా ఏదైనా కొత్త పనిని చేపట్టేందుకు రిస్క్ తీసుకోవడంలో వెనుకాడితే వారికి విజయావకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే రిస్క్ తీసుకునైనా సరే ఏరైనా మంచి పనిని ప్రారంభించాలి. అప్పుడే విజయానికి దగ్గరవుతాం.4. లైఫ్ స్టయిల్లో చెడు అలవాట్లురోజువారీగా తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంపై దృష్టిపెట్టినప్పుడే శరీరం బలిష్టంగా మారుతుంది. అప్పుడే మానసికంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా ఉత్సాహంగా ఉంటూ విజయంవైపు ముందడుగు వేయగలుగుతాం.5. ప్రతీదాన్నీ సమస్యగా చూడటంఎవరైనా ప్రతీ అంశాన్ని సమస్యగా తీసుకుంటే వారు జీవితంలో ముందుకు సాగలేరు. అన్నింటినీ సమస్యలుగా చూడకుండా, వాటికి పరిష్కారాలను కనుగొంటే విజయావకాశాలు దగ్గరవుతాయి.6. ఇతరులను సంతోష పెట్టాలనుకోవడంచాలామంది ఇతరులను సంతోషపెట్టాలని, వారి మెప్పు పొందాలని ప్రయత్నిస్తుంటారు. దీనిని చెడ్డ అలవాటు అని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఈ తరహాలో ప్రవర్తించే వ్యక్తి తన లక్ష్యాన్ని మరిపోతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి అలవాట్లను దూరం చేసుకున్న వ్యక్తి విజయానికి దగ్గరవుతాడని వారు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు -
పాలిటిక్స్‌కు తాత్కాలిక బ్రేక్..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
సాక్షి,హైదరాబాద్:ప్రతిరోజు రాజకీయాలపై ట్వీట్ చేసే కేటీఆర్ శనివారం(నవంబర్ 30) ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు.తాను వెల్నెస్ కోసం కొద్దిరోజుల పాటు రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు.అయితే ఈ బ్రేక్‌తో తన రాజకీయ ప్రత్యర్థులు తనను అంతగా మిస్సవరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ ట్వీట్ వైరల్ అవడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.Off to a wellness retreat for a few days. Hope my political opponents won’t miss me too much 😁— KTR (@KTRBRS) November 30, 2024 -
పరారీకి యత్నం.. 129 మంది ఖైదీలు మృతి
కిన్సాసా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో విషాద ఘటన జరిగింది. జైలులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి 129 మంది ఖైదీలు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగో అంతర్గత వ్యవహారాల మంత్రి షబానిలుకో మంగళవారం(సెప్టెంబర్3) ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.ఖైదీల్లో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. మకాల జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారని, దీంతో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో జైలులో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. తొక్కిసలాటకు తోడు జైలు కిచెన్‌లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని.. తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మరణించారని జైలు అధికారులు చెప్పారు. జైలు నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. -
పేదలపై పిడుగు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో ఎమర్జెన్సీ సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషాతో ఏపీ స్పెషాలిటీ హాస్పటల్ అసోసియేషన్ చర్చలు విఫలమయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా రూ.2500 కోట్ల బకాయిలకు 200 కోట్లు తక్షణమే చెల్లిస్తామన్న ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషా.. మరో రూ.300 కోట్లు సోమవారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం మినహా గత్యంతరం లేదని అసోసియేషన్ తేల్చి చెప్పింది. చర్చలు విఫలం కావడంతో అత్యవసర సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపివేశారు. రేపు(శుక్రవారం) స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌తో మంత్రి సత్యకుమార్ చర్చించనున్నారు.రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పథకం నిర్వహణకు డబ్బులు లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.మరోవైపు పథకం స్థానంలో బీమా ప్రవేశ పెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని, సిబ్బందికి జీతాల చెల్లింపు, మందులు, కన్జుమబుల్స్ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. -
‘కొంత విరామం కావాలి’
పారిస్: భారత్ తరఫున వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు దురదృష్టవశాత్తూ ఆ ఘనతను అందుకోలేకపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు ఆలోచనల గురించి సింధు వెల్లడించింది. తాజా ఓటమితో చాలా బాధపడుతున్నానన్న ఆమె... మరో చర్చకు తావు లేకుండా ఆటలో కొనసాగుతానని స్పష్టం చేసింది. అయితే శారీరకంగా, మానసికంగా కాస్త విరామం కోరుకుంటున్నానని పేర్కొంది. 29 ఏళ్ల సింధు ఒలింపిక్స్ పరాజయం తర్వాత సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియజేసింది. ‘పారిస్ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. కానీ ఓటమి బాధించింది. ఈ పరాజయం నా జీవితంలో చాలా కఠినమైంది. దీని నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. అయితే జీవితం ఆగిపోదు. మళ్లీ కొనసాగాల్సిందే. పారిస్‌కు అర్హత సాధించే క్రమంలో ఎంతో పోరాడాను. గత రెండేళ్లు గాయాలతో ఎక్కువ సమయం ఆటకు దూరమయ్యాను. ఈ సవాళ్లను అధిగమించి నా దేశం తరఫున మూడో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం రావడం గొప్పగా అనిపించింది. ఈ స్థాయిలో ఆడటం, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవగలగడం నా అదృష్టం. నేను విజయం కోసం శాయశక్తులా ప్రయత్నించాను కాబట్టి ఎలాంటి చింత లేదు. ఇప్పుడు అభిమానుల మెసేజ్‌లు నాకు ఊరటనందిస్తున్నాయి. నా భవిష్యత్తు గురించి స్పష్టత ఇవ్వదల్చుకున్నా. ఆటలో ఇంకా కొనసాగుతా. అయితే కొంత విరామం తీసుకుంటాను. నా శరీరానికి, మనసుకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. రాబోయే రోజుల కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకుంటా. ఎందుకంటే నేను అమితంగా ఇష్టపడే ఆటలోనే నాకు ఆనందం దక్కుతుంది’ అని సింధు తన మనసులో భావాన్ని వ్యక్తపర్చింది. -
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
సాక్షి, విజయవాడ: ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారు. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భవితవ్యంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకవేళ పరాజయం పాలైతే రాహుల్‌గాంధీ రాజకీయాల నుంచి కొంత కాలం విరామం తీసుకోవాలని సూచించారు. ‘మీ సొంత వ్యూహాల మీద మీరు ఎన్నికలకు వెళ్లారు. ఇలాంటప్పుడు మీ పార్టీ ఓడిపోతే మీరు విరామం తీసుకోవడం వ్యూహాత్మకంగా, నైతికంగా సరైనది’అని రాహుల్‌ను ఉద్దేశించి పీకే అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్ల దాకా గెలుచుకునే అవకాశాలున్నాయని పీకే చెప్పుకొచ్చారు. -
ఆ పథకాలకు బ్రేక్? దరఖాస్తు వారిలో ఆందోళన..
మంచిర్యాల: రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆ పథకాలతో కొంతమంది లబ్ధి పొందగా, చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు. బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు బీసీబంధు, మైనారిటీ బంధు పథకాలు ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి విడతలో కొందరు లబ్ధి పొందారు. ఇక సొంత ఇంటి కలను తీర్చేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి దరఖాస్తులను తీసుకున్నా అర్హులకు ఎలాంటి సాయం అందించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. పథకాలు కొనసాగుతాయా.. కొనసాగినా తమకు వర్తిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బీసీ, మైనారిటీ బంధు కొందరికే.. జిల్లా వ్యాప్తంగా బీసీబంధు కోసం దరఖాస్తు చేసుకున్న 11,107 మందిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అర్హులుగా 7,734 మందిని గుర్తించారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది చొప్పున మూడు నియోజకవర్గాల నుంచి 900 మందికి రూ. లక్ష సాయం అందించారు. రెండో విడతలో మరో 900 మందిని గుర్తించినా, వారికి అందించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో పథకానికి బ్రేక్ పడింది. ఇక మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 2,709 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 100 మందిని మొదటి విడతలో గుర్తించి, వారికి రూ.లక్ష చొప్పున అందించారు. మిగతావారికి సాయం అందించేందుకు నిధులు విడుదల చేయలేదు. ‘గృహలక్ష్మి’పై సందిగ్ధం.. సొంత ఇంటి స్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 51,764 మంది దరఖాస్తు చేసుకోగా, 40,501 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.3 లక్షల అందించాల్సి ఉంది. నిర్మాణాలకు అనుగుణంగా మూ డు విడతల్లో దీనిని అందించాలని భావించింది. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ, మైనారిటీలకు 50, జనరల్ కేటగిరీలకు 20 శాతం రిజర్వు చేశారు. నియోజకవర్గానికి 3 వేల మందికి ఇవ్వాలని భావించినా గుర్తించడంలో జరిగిన ఆలస్యంతో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదు. -
కేటీఆర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్మూర్/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కె.తారకరామారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచారరథం రెయిలింగ్ విరిగిపోవడంతో వాహనంపైనున్న ఆయన కిందికి జారారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. పట్టణశివారులోని ధోబీఘాట్ నుంచి కిందిబజార్, గోల్‌బంగ్లా మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీ బయలుదేరింది. ప్రచారరథంపై కేటీఆర్, జీవన్‌రెడ్డి, ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో ఓ చోట విద్యుత్ వైర్లు కొద్దిగా కిందికి వేలాడుతుండటంతో అప్రమత్తమైన ప్రచారరథం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వాహనం రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో రెయిలింగ్ పట్టుకొని నిలబడి ఉన్న కేటీఆర్, జీవన్‌రెడ్డి కిందికి జారారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాత్రం అదుపు తప్పి వాహనం పైనుంచి కింద పడిపోయారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండానే కేటీఆర్ కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిపోయారు. నాకేమీ కాలేదు: కేటీఆర్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు చిన్న ప్రమాదం జరిగిందని, తనకేమీ కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’(ట్విట్టర్)లో స్పష్టం చేశారు. ప్రమాదంపై ఆందోళన చెందిన, తన గురించి వాకబు చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. -
ధాన్యం టెండర్లకు ఈసీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం రెండో దఫా పిలిచిన టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. గతేడాది యాసంగికి సంబంధించిన సుమారు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతోపాటు గత వానాకాలం ధాన్యం కూడా మిల్లుల్లో సీఎంఆర్ కింద మిల్లింగ్ జరు గుతోంది. మరోవారంలో కొత్త పంట మళ్లీ మార్కె ట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిల్లుల్లోని ధాన్యా న్ని వదిలించుకునేందుకు ప్రభుత్వం తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. ఆగస్టులో పిలిచిన టెండర్లకు తక్కువ మొత్తంతో బిడ్లు రావడంతో వాటిని రద్దు చేసిన సర్కార్ ఈనెల 7న నిబంధనలు సడలిస్తూ రెండోసారి బిడ్లను ఆహ్వానించింది. ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ 21వ తేదీ వరకు గడువు పెంచారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు, టెండర్ల ప్రక్రియ ఎలా జరుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు టెండర్లను పిలవొద్దని ఆదేశించింది. -
సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రీలీల.. కారణం ఇదేనా?
టాలీవుడ్లో శ్రీలీల ట్రెండ్ కొనసాగుతుంది. 2019లో 'కిస్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఈ యంగ్ బ్యూటీ 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో పాటు గ్లామర్ షోతో యూత్‌కు బాగా దగ్గరైంది. ఇంకేముంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టారు. రవితేజతో కలిసి చేసిన 'ధమాకా' చిత్రం తర్వాత తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అందులో ఆమె చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. (ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.!) ప్రస్తుతం టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు కూడా ఈ కన్నడ బ్యూటీనే ఫస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రిన్స్ మహేష్ బాబు సినిమాకు కూడా ఆమెను తీసుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఆమెకు ఉన్న క్రేజ్‌నే అని చెప్పవచ్చు. శ్రీలీల చేతిలో దాదాపు పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా తన కోసం రెడీగా ఉన్నాయి. ఈ బ్యూటీ సిగ్నల్ ఇస్తే అవి కూడా ఖారారు అవుతాయి. రాబోయే రెండేళ్ల వరకూ ఆమె డేట్స్‌కు భారీ డిమాండ్ ఉంటుందనే చెప్పాలి. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) పవన్ కల్యాణ్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇలా పలు భారీ ఆఫర్లతో ఆమె ఫుల్ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె రెండు నెలలపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని షాకింగ్ డెషిషన్ తీసుకుందట. నవంబర్ నుంచి జనవరి వరకు ఎప్పుడైనా ఈ బ్రేక్ తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాదితో తన చదువు కూడా పూర్తి అవుతుందట. తాజాగ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ రావడంతో ప్రిపరేషన్ కొనసాగించాలని నిర్ణయానికి శ్రీలీల వచ్చారట. ఆమె సూచన మేరకు టాలీవుడ్ హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. -
కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్! ఏంటంటే ఇది..!
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు టీ బ్రేక్, లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్‌లు ఉంటాయి. అది కామన్‌గా అన్ని ఆఫీసుల్లోనూ ఉంటుంది. అందరికీ తెలిసిందే కూడా. కానీ ఇక నుంచి వాటి తోపాటు వై బ్రేక్ ఉంటుందట. ఆ..! ఏంటి ఇది అనుకోకండి. అంటే విరామ సమయాన్ని తగ్గించేందుకు ఇలా యజమాన్యం చేస్తుందా అని డౌట్ పడోద్దు. ఎందుకంటే? ఇది ఉద్యోగుల ఆరోగ్యం కోసమేనట. అసలేం జరిగిందంటే..భారతదేశంలో మిలియన్ మంది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి గురవ్వుతున్నారని ఓ సర్వేలో తేలింది. కొందరూ ఉద్యోగాలు ఆఫీస్‌లో పనిభారాన్ని, మరోవైపు కుటుంబాన్ని లీడ్ చేయలేక వివిధ అనారోగ్య సమస్యలు భారినపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఇంతవరకు అధికారులు సర్వేలు చేయడం, ఆ తర్వాత వాటిని గాలికొదిలేయడమే చేశారు అందరూ. కానీ ఇప్పుడూ సీరియస్‌గా తీసుకుని అందుకోసం చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యాయి పలు సంస్థలు, ప్రభుత్వాలు. ఈ మేరకు గత నెలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజు ఆయుష మంత్రిత్వ శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'వై-బ్రేక్ ఎట్ ఆఫీస్ చైర్' అనే సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఉద్యోగుల దినచర్యలో 'యోగా'ని భాగస్వామ్యం చేసి తద్వారా ఒత్తిడిని దూరం చేసి పని చేయగలిగే సామర్థ్యం పెంచుకునే ఓ సువర్ణావకాశాన్ని ఉద్యోగులు కల్పించేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంగానే ఈ 'వై' బ్రేక్‌ని కార్యాలయాల్లోకి తీసుకురానుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఇక నుంచి మాములుగా తీసుకునే బ్రేక్‌లు మాదిరిగా దీన్ని తీసుకుంటూ.. కాస్త పని ఒత్తిడి దూరం చేసుకోవడమే గాక తమ ఏకాగ్రతను పెంచుకుని షార్ప్‌గా తయారవ్వతారని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు హ్యుమన్ ఎడ్జ్ వ్యవస్థాపకుడు సీఈవో డాక్టర్ మార్కస్ రాన్నీ ఈ విధానాన్ని స్వాగతించారు. ఆయన ఈ విధానం వల్ల ఉద్యోగులు శారీరకంగానూ, మానసికంగానూ పిట్‌గా ఉండేదుకు దోహదపడుతుంది. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా చేయగలుగుతుంది. అలాగే భావోద్వేగ ఒత్తడికి కారణమయ్యే అడ్రినల్ హార్మోన్ల విడుదలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే ఇందులో చేసే '"బ్రీథింగ్ ఎక్స్‌ర్‌సైజ్"లు కారణంగా.. లోతుగా ఆలోచించగల సామర్థ్యం అలవడుతుంది. అలాగే ఉద్యోగుల ధ్యాస వేరేవాటిపైకి పోకుండా ప్రస్తుత పనిపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది యోగా. తమ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యానికి, సమస్యలకు ప్రయారిటీ ఇస్తుంది. ఈ 'వై బ్రేక్'ని కార్యాలయాల్లోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులు ఫిట్‌గా ఉండి పని బాగా చేస్తారు. లీవ్ పెట్టే వాళ్ల సంఖ్య తగ్గిపోయి, పని సామర్థ్యం ఎక్కువ అవుతుంది. తద్వారా సంస్థ మంచి లాభాలను ఆర్జించగలదని అన్నారు. అలాగే జర్నల్ ఆప్ ఆక్యుపేషనల్ హెల్త్‌కి సంబంధించిన ఆరోగ్య నిపుణులు కూడా ఈ యోగా ఒత్తిడిని తగ్గించి శారీరకంగా, మానిసింగ్ స్ట్రాంగ్ చేయగలదన్నారు. తాము జరిపిన అధ్యయనాల్లో ఆ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. దీన్ని క్షేత్ర స్థాయిలో అన్ని కార్యాలయాల్లో వచ్చేలా చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని హుడ్జ్ వ్యవస్థాపకుడు మార్కస్ చెప్పడం గమనార్హం. (చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..) -
సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్, పాన్-ఇండియా యాక్టర్ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది. మైయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికే సమంత రూత్ ప్రభు సినిమాలకు దాదాపు ఏడాది పాటు విరామానికి సిద్ధమైందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ బ్రేక్ వల్ల ఆమె ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని సమాచారం. సమంత రూత్ ప్రభు సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత ఈ బ్రేక్‌కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్‌లన్నింటినీ పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్‌లను, సినిమాలు దేనికీ ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ ఈ విరామంలో దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తోంది. సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. అయితే బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) -
పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రామ్‌చరణ్!
పాన్ ఇండియా మెగా హీరో రామ్ చరణ్ RRR తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చరణ్ సతీమణి ఉపాసన ప్రెగ్నెంట్, జులై మొదటి వారంలో డెలివరీ ఉంటుందని డాక్టర్లు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వివాహం తర్వాత దాదాపు పది సంవత్సరాలకు తన భార్య తల్లి కాబోతుండడంతో రాంచరణ్ తన పూర్తి సమయాన్ని ఉపాసనకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ సినిమాపై నిషేధం!) బిడ్డ పుట్టబోయే ముందు తన పూర్తి సమయాన్ని ఉపాసనకే కేటాయించాలని, అందుకోసం ఆగస్టు నెల వరకు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఉపాసన పూర్తిగా వైద్యుల వర్యవేక్షణలో ఉన్నారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ ద్వారా మెగా ఫ్యాన్స్ కోసం పలు విషయాలను షేర్ చేస్తున్నారు. అయితే దాదాపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ ఆగస్టు తర్వాత తిరిగి షూటింగ్ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) -
'అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నా'.. స్టార్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. షాకింగ్ నిర్ణయం! అయితే తాజాగా కాజోల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది బాలీవుడ్ భామ. 'నా జీవితంలో చాలా కష్టమైన పరీక్షను ఎదుర్కొబోతున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇన్‌స్టాలో తన ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చేసిన పోస్ట్ మాత్రమే తన ఖాతాలో కనిపిస్తోంది. కాగా.. కాజోల్కు దాదాపు 14 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో కారణాలు వెల్లడించలేదు. (ఇది చదవండి: పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో) ప్రచారం కోసమేనా? కానీ కొంతమంది ఫ్యాన్స్ ఆమె రాబోయే వెబ్ సిరీస్ 'ది గుడ్ వైఫ్' కోసం ఇదంతా ప్రచార వ్యూహమని భావిస్తున్నారు. 'ది గుడ్ వైఫ్ - ప్యార్, కానూన్, ధోకా' సిరీస్‌లో కాజోల్ లాయర్ పాత్రను పోషించింది. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. కాగా.. 2016లో అమెరికాలో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో జూలియానా మార్గులీస్ ప్రధాన పాత్రలో నటించారు. కాజోల్కు మద్దతు అయితే కాజోల్ నిర్ణయం పట్ల నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం మీకు మంచి చేస్తుందని భావిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ మీ జీవితంలో ఎదురైన కష్టతరమైన పరీక్ష నుంచి త్వరలో బయటపడాలని కోరుకుంటున్నామంటూ కామెంట్ చేశాడు. ఈ విషయంలో నెటిజన్స్ కాజోల్కు మద్దతుగా నిలుస్తున్నారు. మీ నిర్ణయంతో ఇకపై మీ అందమైన పోస్టులను కోల్పోతామని కొందరు ఫీలవుతుండగా.. మీరు ఇన్ స్టాలో ఉన్నా, లేకున్నా, ఎప్పటికీ మీ మీద ప్రేమ, అభిమానం అలాగే ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అజయ్ నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్) కాగా.. కాజోల్ త్వరలోనే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నెటిఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా, మృణాల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమృతా సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ, తిలోత్తమా షోమే నటించారు. ఈనెల 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్, వాళ్లకు మాత్రమే ఆహ్వానం..!
-
ఆర్టీసీలో బ్రేక్ జర్నీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇప్పటివరకు విమాన ప్రయాణికులకు మాత్రమే పరిమితమైన బ్రేక్ జర్నీ సదుపాయం ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సు మారిన ప్రతిసారి టిక్కెట్టును తీసుకునే వారు. ఇకపై అలాంటి అవసరం లేకుండా మల్టీ సిటీ టిక్కెటింగ్ సౌలభ్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఏదైనా పట్టణం నుంచి దూర ప్రాంతంలో ఉన్న మరో పట్టణానికి లేదా నగరానికి వెళ్లడానికి నేరుగా బస్సు సదుపాయం ఉండడం లేదు. ఇలాంటి వారు తాము వెళ్లేబోయే ప్రాంతానికి ఎక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉందో అక్కడికి చేరుకోవాల్సి ఉండేది. ఇకపై తాము బయలుదేరే చోటునుంచే వెళ్లే గమ్యస్థానానికి ఆన్లైన్ ద్వారా ఒకేసారి నేరుగా టిక్కెట్‌ను పొందవచ్చు. ఉదాహరణకు కడప నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే డైరెక్టర్‌గా ఆర్టీసీ సర్వీసు లేదు. విశాఖపట్టణం ఒక బస్సులో వచ్చి శ్రీకాకుళం వెళ్లాలంటే మరో బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంది. అంతేకాకుండా వీరు ఎక్కిన ప్రతి బస్సులోనూ రిజర్వేషన్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. అయితే ఈ మల్టీ సిటీ టిక్కెటింగ్ విధానంలో తాము వెళ్లే బస్సులో ఒకే రిజర్వేషన్ చార్జితో ప్రయాణించే వీలు కల్పించారు. మారే బస్సులోనూ ముందుగానే సీటు రిజర్వు అయి ఉంటుంది. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానంలో ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు బ్రేక్ జర్నీ సదుపాయాన్ని కల్పించారు. తాము వెళ్లే బస్సుకోసం 2 గంటల నుంచి 22 గంటల వరకు వేచి ఉన్న బ్రేక్ జర్నీలో ఆ టిక్కెట్ చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ముందు వెళ్లే వారి బస్సు మార్గమధ్యలో ఎక్కడైనా మరమ్మతుకు గురైతే ఆ ప్రయాణీకుడిని మరో బస్సులో వెంటనే పంపించి ప్రయాణానికి ఆటంకం లేకుండా చూస్తారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాయలసీమలోని 8 జిల్లాల నుంచి విశాఖ పట్టణం మినహా ఇతర దూర ప్రాంతాలకు నేరుగా ఆర్టీసీ బస్సు సదుపాయాలు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని విశాఖ సహా శ్రీకాకుళం, విజయనగరం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మల్టీ సిటీ టిక్కెటింగ్ (బ్రేక్ జర్నీ) సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. ప్రచారం నిర్వహిస్తున్నాం ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిన మల్టీ సిటీ టిక్కెటింగ్ సదుపాయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నాం. టిక్కెట్ కౌంటర్లలోనూ ఈ విషయం తెలియజేస్తున్నాం. అక్కడక్కడ పోస్టర్లను కూడా ప్రదర్శించనున్నాం. ఈ కొత్త విధానంలో బ్రేక్ జర్నీకి వీలు కల్పిస్తున్నాం. కడప జోన్ వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె. పుట్టపర్తి, అనంతపురం, హిందూపురం డిపోల నుంచి బ్రేక్ జర్నీ సదుపాయం కల్పిస్తున్నాం. – గోపినాథ్‌రెడ్డి, కడపజోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణను నిరుద్యోగులు సవాల్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో 16, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌లో వచ్చిన జీవో 18లను రద్దు కోరుతూ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం రెగ్యులరైజ్ ప్రాసెస్‌ని కంటిన్యూ చేసుకోవచ్చన్న హైకోర్టు.. రెగ్యులర్ పోస్టింగ్ ఆర్డర్స్ ను ఎవరికి ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్ ఏమన్నారంటే? -
షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరో.. ట్వీట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమిళంతో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు మాంచి క్రేజ్ ఉంది. రెమో, డాక్టర్, డాన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్ గతేడాది జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగులో ప్రిన్స్ అనే సినిమాను చేశారు. ప్రస్తుతం మహావీరన్ అనే సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శివ కార్తికేయన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ట్విటర్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 'మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. సినిమా అప్డేట్స్ నా టీమ్ షేర్ చేస్తుంది. త్వరలోనే తిరిగి వచ్చేస్తాను' అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ బ్రేక్ ఎందుకన్నది మాత్రం ఆయన రివీల్ చేయలేదు. చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ My dear brothers and sisters, I am taking a break from twitter for a while. Take care, and i will be back soon 👍😊 P.S: All updates on the films will be shared here by my team. pic.twitter.com/Nf4fdqXRTy — Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 30, 2023 -
సినిమాలకు బ్రేక్.. కిచ్చా సుదీప్ సంచలన నిర్ణయం!
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఈగతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇటీవల కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణతో ప్రేక్షకులను అలరించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రం అభిమానుల అంతగా మెప్పించలేకపోయింది. ఇటీవల సుదీప్ నటించిన కబ్జ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే తాజాగా ఆయన అభిమానులకు ఓ నోట్ విడుదల చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కిచ్చా సుదీప్ నోట్లో రాస్తూ.. ' హాయ్ ఫ్రెండ్స్. కిచ్చా46 గురించి మీ ట్వీట్స్ అండ్ మీమ్స్ చూశా. అలా పిలవడం నాకు కూడా సంతోషంగా ఉంది. దీనిపై మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలచుకున్నా. ప్రస్తుతం నేను స్వల్ప విరామం తీసుకుంటున్నా. ఇది నా మొదటి బ్రేక్. విక్రాంత్ రోణ, బిగ్ బాస్ సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ సమయాన్ని ఆనందంగా ఆస్వాదించాలనుకున్నా. క్రికెట్ కూడా నా లైఫ్‌లో ఓ భాగం. సీసీఎల్‌లో కర్ణాటక బుల్డోజర్స్ తరఫున మ్యాచులు ఆస్వాదించా. నా సినిమాలకు సంబంధించి మూడు స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వాటిని ఓకే చేశా. ప్రతి రోజు వాటిపై వర్క్ జరుగుతూనే ఉంటుంది. త్వరలోనే అప్డేట్స్తో మీ ముందుకు వస్తా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆల్ ద బెస్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. About my Next ❤️🥂 pic.twitter.com/3vkCmS6FBF — Kichcha Sudeepa (@KicchaSudeep) April 2, 2023 -
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన యాంకర్ సుమ
యాంకర్ సుమ కనకాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. 15ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, టాక్ షో అయినా సుమ ఉండాల్సిందే అనేంతగా క్రేజ్ దక్కించుకుంది. ఆమె పంచులు కామెడీ టైమింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది. యాంకరింగ్ నుంచి విరామం తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా సుమ లేని టెలివిజన్ అంటే కాస్త కష్టమేనంటున్నారు ఆమె ఫ్యాన్స్. -
సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సామ్ స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం సామ్ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో సామ్ బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె అక్కడ వరుస ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు తెలుగులోనూ ఆమె ఖుషి చిత్రంతో పాటు తమిళంలోనూ పలు సినిమాకు సంతకం చేసింది. వీటితో పాటు ఓ హాలీవుడ్ మూవీకి కూడా ఒకే చెప్పింది. దీంతో ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు క్యూలో ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ శాకుంతలం అనంతరం సామ్ వరుసగా పలు చిత్రాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే తాను మయోసైటిస్ బారిన పడటంతో ప్రస్తుతం స్వల్ప కాలం పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సామ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. బాలీవుడ్ సినిమాల విషయంలో సామ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖషి సినిమా తర్వాత ఆమె నటనకు, షూటింగ్‌లకు లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటోందట. ఇదే విషయాన్ని తను సంతకం చేసిన మూవీ నిర్మాతలకు చెప్పిందట. సమంత నిర్ణయాన్ని బాలీవుడ్ నిర్మాతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సామ్ సంతకం చేసిన బాలీవుడ్ చిత్రాల నిర్మాతలు సినిమా ఆలస్యం అయితే తమకు నష్టమని, మిగతా నటీనటుల కాల్షిట్ దృష్ట్యా కూడా సమంత నిర్ణయాన్ని వారు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో సామ్ ఆ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నట్లు ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: శివాజీ గణేషన్‌ను ఇండస్ట్రీ పట్టించుకోలేదు: ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు ఫైనలిస్ట్‌గా కీర్తి.. ఆమె 15 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే! -
వొడాఫోన్ ఓసీడీల జారీకి చెక్, ముగిసిన గడువు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా ప్రతిపాదిత ఐచ్చిక మార్పిడిగల డిబెంచర్ల(ఓసీడీలు) జారీకి తాజాగా చెక్ పడింది. మొబైల్ టవర్ల సంస్థ ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీల జారీకి కంపెనీ గతంలో ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఇందుకు గడువు తిరిపోయినట్లు మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. వడ్డీబకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఏటీసీ టెలికంకు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీలను జారీ చేసేందుకు గత నెలలో వొడాఫోన్ ఐడియా వాటాదారులు అనుమతించారు. అయితే వీటిని 15 రోజుల్లోగా జారీ చేయవలసి ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. అంతకంటే ముందు ప్రభుత్వానికి 16వేల రూపాయల కోట్ల వడ్డీ(స్పెక్ట్రమ్, ఏజీఆర్) బకాయిలకుగాను ఈక్వీటీని జారీ చేయవలసి ఉన్నట్లు వివరించింది. దీంతో ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఏటీసీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అవసరానుగుణంగా వాటాదారుల నుంచి మరోసారి అనుమతి తీసుకోనున్నట్లు పేర్కొంది. చెక్ -
బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మరోసారి సబ్స్క్రిప్షన్ ఆధారిత 'బ్లూ వెరిఫికేషన్' ప్లాన్‌ను మరోసారి వాయిదా వేసుకున్నారు. తాజాగా 'బ్లూ వెరిఫైడ్' బ్యాడ్జ్ పునఃప్రారంభించడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మంగళవారం ప్రకటించారు. “బ్లూ వెరిఫికేషన్ రీలాంచ్‌ను ఆపివేయడం వల్ల ఫేక్ అకౌంట్ల తొలగింపుపై పూర్తి విశ్వాసం వచ్చేంత వరకు దీన్ని వాయిదా వేస్తున్నానన్నారు. అలాగే వ్యక్తుల కోసం కాకుండా సంస్థల కోసం వేర్వేరు కలర్స్‌లో వెరిఫికేషన్ ఉంటే బావుంటుందేమో అంటూ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ప్పుడు రీలాంచ్ చేసేదీ ప్రకటించ లేదు. మరోవైపు గత వారంలో 1.6 మిలియన్ల యూజర్లను ట్విటర్ సాధించిందనీ, ఇది "మరో ఆల్ టైమ్ హై" అని మస్క్ ట్వీట్ చేశారు. కాగా నెలకు 8 డాలర్లు బ్లూటిక్‌ను ఫీజును ప్రకటించిన మస్క్ నకిలీ ఖాతాల బెడద కారణంగా దీన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఆ తరువాత నవంబరు 29 నుంచి పునఃప్రారంభించనున్నట్టు తెలిపారు. కానీ దీని మరోసారి బ్రేకులు వేయడం గమనార్హం. Holding off relaunch of Blue Verified until there is high confidence of stopping impersonation. Will probably use different color check for organizations than individuals. — Elon Musk (@elonmusk) November 22, 2022 Twitter added 1.6M daily active users this past week, another all-time high pic.twitter.com/Si3cRYnvyD — Elon Musk (@elonmusk) November 22, 2022 -
షాకింగ్ నిర్ణయం తీసుకున్న వెంకటేశ్.. సినిమాలకు బ్రేక్?
విక్టరీ వెంకటేశ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇటీవలె విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన వెంకటేశ్ ప్రస్తుతం కొత్త కథలు వినేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీయగా.. ఆధ్యాత్మిక సాధన నేపథ్యంలో కొంతకాలం వరకు ఆయన సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారట. మొదటి నుంచి వెంకటేశ్‌కు ఆధ్యాత్మికత ఎక్కువే. ఈ కారణంగానే ఆయన కొన్ని రోజుల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారట. విరామం తర్వాత కొత్త సినిమాలను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. కాగా వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్‌సిరీస్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
భారత్ జోడో యాత్రకు బ్రేక్.. ఢిల్లీకి రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది. రాష్ట్రంలో తొలిరోజు 4 కిలోమీటర్ల పాదయాత్రతో ముగించారు రాహుల్ గాంధీ. ఈనెల 26వ తేదీ వరకు జోడో యాత్రకు విరామం ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఢిల్లీకి పయణమయ్యారు రాహుల్. ఈనెల 27న రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు రాహుల్ గాంధీ. దేశ సమైక్యత కోసమే భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ యత్నిస్తున్నాయని ఆరోపించారు. దీపావళిని కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలు దేరివెళ్లినట్లు పేర్కొన్నాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 26న ఏఐసీసీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి మక్తల్ చేరుకుంటారు. ఈ నెల 27 నుండి రాహుల్ గాంధీ పాదయాత్రను పున: ప్రారంభించనున్నారు. ఇదీ చదవండి: తెలంగాణలోకి రాహుల్ యాత్ర.. జోడో యాత్ర ఇలా కొనసాగుతుంది.. -
అమరావతి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్
సాక్షి, కోనసీమ: అమరావతి పేరిట చేపట్టిన పాదయాత్రకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్రేకులు పడ్డాయి. శనివారం ఉదయం రామచంద్రాపురం వద్ద అమరావతి యాత్ర నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు యాత్రలో పాల్గొన్న వారు.. గుర్తింపు కార్డులు ధరించి యాత్ర చేసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే గుర్తింపు కార్డులు చూపించని నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో.. నాలుగు రోజులపాటు పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇవ్వాలనే నిర్ణయానికి యాత్రికులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమరావతి పాదయాత్ర విషయంలో ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే ఉండాలని, డీజీపీకి అందచేసిన జాబితాలో ఉన్న వ్యక్తులే పాల్గొనాలని స్పష్టం చేసింది. పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకునే వ్యక్తులు ఇరువైపులా ఉండి మద్దతు తెలపవచ్చని, అయితే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదని ఆదేశించింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీనివల్ల అసాంఘిక శక్తులతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారంటూ పిటిషనర్లు వ్యక్తం చేస్తున్న ఆందోళన తొలగిపోతుందని పేర్కొంది. -
చట్టానికి దొరక్కుండా... ఆన్లైన్ గేమింగ్
సాక్షి, హైదరాబాద్: కలర్ ప్రిడెక్షన్ గేమ్.. లోన్ యాప్స్.. నిర్వహణలో ఉన్న లోపాల కారణంగానే విషయం పోలీసు కేసుల వరకు వెళ్లిందని చైనీయులు భావిస్తున్నారా? అంటే అవుననే జవాబు చెబుతున్నారు సైబర్ క్రైమ్ అధికారులు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ విషయంలో చట్టానికి దొరక్కుండా వ్యవహారాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తున్న ఆన్లైన్ గేమ్స్‌లో అత్యధికం చైనీయులకు సంబంధించినవే అని స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ గేమింగ్ యాప్స్‌పై చర్యలకు అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. గెలిపిస్తూ బానిసలుగా మార్చి.. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న వాళ్లు (ప్రధానంగా యువత) వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. మొదట వాటిని ఫ్రీగా ఇచ్చి.. ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన వారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. ఆడే వ్యక్తి వీటికి అలవాటుపడిన తర్వాత యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ సందేశాలు పంపిస్తారు. వాటికి అవసరమైన రుసుం డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లించాలని షరతు పెడతారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న వాళ్లు తప్పనిసరై డబ్బు చెల్లించి ముందుకు వెళ్తున్నారు. ఆ గేమ్ ఉచితం కావడంతో... ఇలా భారీ మొత్తాలు కోల్పోయిన అనేక మంది బాధితులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయిస్తున్నారు. వీరి ఫిర్యాదులతో కేసులు నమోదు చేస్తున్నప్పటికీ చర్యలకు మాత్రం ఆస్కారం ఉండట్లేదు. గేమ్ ఆడటానికి డబ్బు వసూలు చేస్తే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవచ్చు. అందుకే గేమ్‌ను ఉచితంగా అందిస్తున్న చైనా కంపెనీలు యూసీ పాయింట్ల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ గేమ్ ప్రారంభంలో ఎక్కడా ఈ చెల్లంపుల విషయం ఉండదు. ఈ నేపథ్యంలోనే కొన్ని గేమింగ్ యాప్స్‌పై గేమింగ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండట్లేదు. జీపీఎస్ మార్చడంతో ఇబ్బంది ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. దీంతో వీటికి బానిసలుగా మారిన అనేక మంది ఫేజ్ జీపీఎస్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: నష్టాలకు సాకు... బస్సులకు బ్రేక్) -
దొంగలించేందుకు వచ్చి కక్కుర్తిపడి అడ్డంగా బుక్కయ్యారు! వీడియో వైరల్
చెన్నై: ఇద్దరు దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకు మద్యం షాపుకి వెళ్లి పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువెల్లూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకని లిక్కర్ షాపుకి డ్రిల్లింగ్ మిషన్‌తో రంధ్రం చేశారు. ఐతే ఆ దొంగలు షాపులోకి వెళ్లిన తర్వాత ఆ మద్యం బాటిళ్లను చూసి టెంప్ట్ అయ్యి ప్లాన్ మార్చుకున్నారు. కాసేపు ఆ షాపులోనే ఉండి తాగి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అనుకున్నదే తడువుగా ప్లాన్ కూడా అమలు చేశారు. ఆ దొంగలు వక్రబుద్దే వారిని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాలే చేసింది. పోలీసులు వారు ఏ విధంగా లిక్కర్ షాపుకి రంధ్రం చేసి వెళ్లారు అలానే వారిని బయటకు రప్పించి మరీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పోలీసులు సదరు షాపు యజమానితో ఓపెన్ చేయించి మరీ పోలీసులను అదుపులోకి తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా వారు ఎలా షాపుకి ఎంట్రీ ఇచ్చారో అలానే అదుపులో తీసుకోవడం గ్రేట్ అంటూ పోలీసుల పని తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
పెళ్లిళ్లకు బ్రేక్.. అప్పటి దాకా ఆగాల్సిందే.. నో ఛాన్స్
ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): చిన వేంకన్న క్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రావణ మాస పెళ్లిసందడికి తెర పడింది. ఆదివారం ఉదయం 8.39 గంటలదే శ్రావణంలో చివరి ముహూర్తం. ఈ ముహూర్తంలో కొన్ని వివాహాలు జరిగినా.. శనివారం రాత్రి ముహూర్తం శ్రావణ మాసంలో అతి పెద్దది కావడంతో క్షేత్రంలో 300కు పైగా వివాహాలు జరిగాయి. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా? రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఎటు చూసినా పెళ్లివారే కనిపించారు. కొండ పైన, దిగువన ఉన్న కల్యాణ మంటపాలు, తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మంటపం, పాదుకా మంటపం వద్ద ఉన్న స్వామివారి కల్యాణ మంటపంలో, చివరకు ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల మార్గం, తూర్పు రాజగోపుర ప్రాంతంలో నేలపై సైతం వివాహాలు జోరుగా జరిగాయి. స్వామి సన్నిధిలో కాస్త జాగా దొరికితే చాలు.. ఏదోలా పెళ్లి చేసుకుని వెళ్లిపోదామని పెళ్లి బృందాల వారు ఆతృత పడ్డారు. పెళ్లివారి వాహనాలతో ఘాట్ రోడ్లన్నీ కిక్కిరిశాయి. క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్సై టి.సుదీర్ సిబ్బందితో కలసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. మొత్తంగా శ్రావణ మాసంలో శ్రీవారి క్షేత్రంలో సుమారు 2 వేల వివాహాలు జరిగాయి. దేవస్థానానికి కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. స్వామి సన్నిధిన వివాహాలు చేసుకున్నవారే కాకుండా ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. సత్రం గదుల్లో చాలావరకూ పెళ్లిబృందాల వారే రిజర్వ్ చేసుకున్నారు. పెళ్లిళ్లకు మూడు నెలలు బ్రేక్.. శ్రీవారి క్షేతంల్రో వివాహాలు జరగాలంటే మార్గశిర మాసం వరకూ అంటే డిసెంబర్ రెండో తేదీ వరకూ ఆగాల్సిందే. ఆదివారంతో శ్రావణ మాసంలోని వివాహ ముహూర్తాలు ముగిశాయి. 28 నుంచి భాద్రపదం శూన్యమాసం. ఆ తరువాత సెప్టెంబర్ 18 నుంచి శుక్ర మౌఢ్యమి కావడంతో నవంబర్ 27 వరకూ వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్లు జరుపుకొనేందుకు అనేక మంది తొందరపడ్డారు. దీంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. డిసెంబర్ 2 నుంచి 19వ తేదీ వరకూ మళ్లీ పెళ్లి ముహూర్తాలున్నాయి. ఆ తరువాత పుష్యమాసం కావడంతో డిసెంబర్ 24 నుంచి జనవరి 21 వరకూ ముహూర్తాలు లేవు. తిరిగి జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న మాఘమాసంలో, తరువాత ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమవుతున్న ఫాల్గుణంలో వివాహాలు జరగనున్నాయని పండితులు తెలిపారు. కొత్త జంటలతో క్షేత్రం కళకళ కొత్త జంటలతో శ్రీవారి క్షేత్రం కళకళలాడింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా వివాహాలు జరిగాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి కొత్త జంటలు, వారి బంధువులతో కలసి ఆలయానికి తరలి వచ్చారు. ఆలయం వద్ద ఎటు చూసినా నూతన వధువరులే కనిపించారు. దీనికితోడు ఆదివారం సెలవు కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. -
ఫ్యాన్స్‌కి షాక్.. సోషల్ మీడియాకు ‘విక్రమ్’ డైరెక్టర్ బ్రేక్..
మాస్టర్, విక్రమ్ వంటి చిత్రాలతో కోలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ లోకేశ్ కనకరాజు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ఆయన తదుపరి సినిమా ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆయన తాజా నిర్ణయంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘హే గాయ్స్.. నేను అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నేను నా నెక్ట్స్ సినిమా ప్రకటనతో తిరిగి వస్తాను. అప్పటి వరకు అందరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా. లవ్ యూ’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా దాదాపు నాలుగేళ్లుగా సక్సెస్ లేని కమల్ హాసన్‌కు ఈ యంగ్ డైరెక్టర్ విక్రమ్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ అందించాడు. ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళు చేసి సంచలన రికార్డు క్రియేట్ చేసింది. లోకేశ్ ‘విక్రమ్’ తెరకెక్కించిన తీరుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో తెలుగు, తమిళంలో ఆయన పేరు మారిమ్రోగిపోతుంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! ఆయన నేరుగా తెలుగు హీరోతో ఓ సినిమా చేస్తే బాగుండు అని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటుంటే.. విజయ్‌తో చేసే ఆయన నెక్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడేప్పుడా కోలీవుడ్ ఆడియన్స్ వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాక షార్ట్ బ్రేక్ తీసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకు ఆయన సడెన్ నిర్ణయం తీసుకున్నారని, అంటే ఇప్పుట్లో విజయ్ సినిమా రానట్టేనా? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా విజయ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఇటీవల లోకేశ్ కనకరాజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. Hey guys ✨ I'm taking a small break from all social media platforms... I'll be back soon with my next film's announcement 🔥 Till then do take care all of you.. With love Lokesh Kanagaraj 🤜🏼🤛🏼 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 1, 2022 -
16 రోజుల్లో రూ. 300 కోట్లు.. బాహుబలి 2 రికార్డు బద్దలు..
సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి సూపర్ బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'విక్రమ్'. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. అయితే ఈ మూవీ విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లలో సగం అంటే రూ. 150 కోట్లు ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే వచ్చాయట. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఉన్న బాహుబలి 2 సినిమా కలెక్షన్ల రికార్డును విక్రమ్ బద్దలు కొట్టినట్లయింది. వచ్చే రోజుల్లో విక్రమ్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా సక్సెస్ సాధించిన సంతోషంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది మూవీ యూనిట్. మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. చదవండి: 'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే.. చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ కామంతో కళ్లు మూసుకుపోతే.. -
గర్ల్‌ఫ్రెండ్ పై ఉన్న పిచ్చి ఎంత పనిచేసింది...సుమారు రూ.40 కోట్లు..
కొంతమంది కోపం వప్తే మనిషిలా ప్రవర్తించారు. అనుకున్నది జరగకపోయిన, తాను అనుకున్నట్లుగా లేకపోయిన కొంతమందికి భలే కోపం ముంచుకోస్తుంది. దీంతో వాళ్ల చేసే హంగామా ఇంత అంత కాదు. మరికొంతమంది కోపంతో విలువైన వస్తువులు పాడు చేయడం లేక తమకు హాని కలిగించుకోవడమే వంటి పిచ్చి పనులు చేస్తుంటారు. ఒకరి మీద ఉన్న కోపాన్ని వేరే వారిపై చూపించి లేనిపోనీ సమస్యలు తెచ్చుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే అమెరికాకు చెందిన బ్రియాన్ హెర్నాండెజ్. తన ప్రియురాలితో గొడవపడి కోపంతో చేసిన దారుణమైన పనికి ఊచలెక్కపెడుతున్నాడు. అసలేం జరగిందంటే...అమెరికాలోని 21 ఏళ్ల బ్రియాన్ హెర్నాండెజ్ టెక్సాస్‌లోని డల్లాస్ మ్యూజియం ఆప్ ఆర్ట్‌లోకి చొరబడి విలువైన కళాఖండాలను ధ్వంసం చేశాడు. ఆ మ్యూజియంలో ఎంతో విలువ చేసే గొప్ప గొప్ప కళాఖండాలుంటాయి. అతను అత్యంత విలువైన అరుదైన కళాఖండాలన్నింటిని ధ్వంసం చేశాడు. బ్రియాన్ మ్యూజియంలో నష్ట పరిచిన కళాఖండాల విలువ సుమారు రూ. 40 కోట్లు. దీంతో డల్లాస్ పోలీసులు బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పోలీసులు విచారణలో అతన్ని ఎందుకిలా చేశావని ప్రశ్నించిగా...అతను చెప్పింది విని ఒక్కసారిగి షాక్ అయ్యిపోయారు. గర్లఫ్రెండ్ అంటే పిచ్చి ప్రేమ అని ఇటీవలే తనతో గొడపడ్డానని బ్రియాన్ చెప్పుకొచ్చాడు. ఆమె అంటే పిచ్చి అని ఆమెతో గొడవపడటంతో తట్టుకోలేక ఇలా చేశానని చెప్పాడు. ఏదిఏమైన పిచ్చివ్యామోహంతోనూ, కోపంతోనూ చేసే పనులు మిగిల్చే నష్టం ఊహకందనంతా ఘోరంగా ఉంటుంది. (చదవండి: నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ) -
బీపీసీఎల్ ప్రయివేటైజేషన్‌కు బ్రేక్! ముగ్గురిలో ఇద్దరు వెనక్కి
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కంపెనీలో వాటా కొనుగోలుకి బిడ్స్ దాఖలు చేసిన మూడు సంస్థలలో రెండు వెనకడుగు వేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో బిడ్డర్లు రేసు నుంచి తప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. కంపెనీలోగల 52.98% వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానించింది. నవంబర్‌కల్లా కనీసం 3 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం ఒకే సంస్థ రేసులో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
దానికి దూరంగా ఉంటానంది, కానీ పైసల కోసం మళ్లీ..
Britney Spears Announces Takes A Break From Social Media Amid Pregnancy: పాప్ సాంగ్స్ వినేవారు బ్రిట్నీ స్పియర్స్ అంటే తెలియను వారుండరు. తన అందమైన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకుంది పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్. ఈ ముద్దుగుమ్మ తన అభిమానులు నిరుత్సాహపడేలా తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. ఇక నుంచి కొంత కాలం సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటానంటోంది. సామాజిక మాధ్యమాల నుంచి ఒక చిన్న విరామం తీసుకుంటున్నట్లు తాజాగా పేర్కొంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉండట్లేదు బ్రిట్నీ స్పియర్స్. దీంతో తనకు ఏమైందో అని కంగారు పడ్డ అభిమానుల కోసం ఇన్‌స్టా వేదికగా ఆదివారం (ఏప్రిల్ 24) ఈ ప్రకటన చేసింది. చదవండి: హుషారైన స్టెప్పులతో ప్రణీత డ్యాన్స్ ఈ ప్రకటన చేస్తూ సన్ గ్లాసెస్ పెట్టుకుని, రోబ్, రోలర్లను ధరించి కుర్చీలో కూర్చున్న అందమైన శిశువు వీడియోను షేర్ చేసింది. తన ప్రెగ్నెన్సీ కారణంగానే సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా ఈ వీడియో సూచిస్తోంది. ఆమె ప్రెగ్నెంట్ అని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సింగర్‌కు కాబోయే భర్త సామ్ అస్గారితో తన మొదటి చైల్డ్‌ను ఆశిస్తోంది. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా బ్రిట్నీ స్పియర్స్ పలు పోస్టులు చేసింది. ఆ పోస్టులు పలు బ్రాండ్స్‌కు సంబంధించినవి. సెలబ్రిటీలు పలు కంపెనీల బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ క్యాష్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Britney Spears (@britneyspears) View this post on Instagram A post shared by Britney Spears (@britneyspears) View this post on Instagram A post shared by Britney Spears (@britneyspears) -
ఒక్క ప్రమాదం.. ఆరు కార్లు ధ్వంసం
రామవరప్పాడు: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. గన్నవరం నుంచి విజయవాడ వైపుగా వస్తున్న ఓ కారు నిడమానూరు జాతీయ రహదారి వంతెన సమీపంలో వచ్చే సరికి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుకగా వస్తున్న 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కార్లను ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పక్కకు తీయించారు. (చదవండి: భయంకరమైన యాక్సిడెంట్: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు) -
రన్‌వే మీద రెండు ముక్కలైన విమానం.. వీడియో
రన్ వేపై ఓ విమానం రెండు ముక్కలైంది. గురువారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే ఈ ఘటన చోసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జర్మనీకి చెందిన డీచ్‌ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం.. కోస్టారికాలోని సాన్ జోస్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరింది. అయితే కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తిందని పైలెట్.. అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ పర్మిషన్ కోరాడు. దీంతో అధికారులు అనుమతి ఇచ్చారు. తీరా.. ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చిన ఆ కార్గో విమానం రన్‌వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది. అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తిందని, అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని ఎయిర్పోర్ట్ అధికారులు వివరించారు. అయినప్పటికీ ఈ ఘటనపై హైలెవల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. Video footage of the DHL Boeing 757 Freighter just as it skidded off the runway at SJO. Read more at AviationSource!https://t.co/63ONa6oRCD Source: Unknown#DHL #JuanSantamariaAirport #AvGeek #Crash #Accident pic.twitter.com/EI9ew6YVXN — AviationSource (@AvSourceNews) April 7, 2022 -
ఎట్టకేలకు రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్
-
యుద్దానికి బ్రేక్ ఇచ్చిన రష్యా..
-
ఉక్రెయిన్‌లో యుద్ధ విరామం!
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. దీంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 11.30 ని. నుంచి కాల్పులను ఆపేసింది. ఐదున్నర గంటలపాటు ఈ విరమణ ఉంటుందని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించేందుకు ఈ విరామం ఇచ్చింది రష్యా. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యూఎన్హెచ్ఆర్సీకి రష్యా తెలిపింది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పదవ రోజు శనివారం కూడా యుద్ధం మొదలై.. విరామంతో కాసేపు బ్రేక్ పడినట్లయ్యింది. ఈ లోపు విదేశీయులను తరలించే యోచనలో ఉంది ఉక్రెయిన్. -
కారులో చిన్నారి.. అద్దాలు పగులకొట్టిన పోలీసు.. ట్విస్ట్ ఏంటంటే
లండన్: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బొమ్మలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. వాటిని చూస్తుంటూ.. నిజమైనవేవో, టెడ్డీ బొమ్మలేవో గుర్తుపట్టలేనంతగా ఒకేలా ఉంటున్నాయి.. తాజాగా జరిగిన ఒక ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ ఘటన యూకేలోని క్లీవ్ ల్యాండ్ జరిగింది. అమీ క్విల్లెన్ అనే మహిళ.. తన కూతురు డార్సితో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్లింది. డార్సి తాను.. ఆడుకుంటున్న చిన్న బొమ్మను కారు ముందటి సీటులో పెట్టింది. అది అచ్చం చిన్నారిని పోలి ఉంది. అమీ క్విల్లెన్ షాప్‌లోపలికి వెళ్లిపోయారు. అప్పుడు మరోక వ్యక్తి తన కారును పార్క్ చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. అతను కారులో ఒక చిన్నారి ఉండటాన్ని గమనించాడు. దానికి సీటు బెల్టు కూడా ఉంది. వెంటనే ఆశ్చర్యపోయాడు. అతను.. చుట్టుపక్కల ఉన్నవారిని అప్రమత్తం చేశాడు. కారు యజమాని కోసం వెతికారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో చిన్నారిని చూశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కారు అద్దాలను పగులగొట్టారు. అప్పుడు వారు కారు సీటులో ఉన్న చిన్నారిని చూసి షాకింగ్‌కు గురయ్యారు. కారులో ఉన్నది.. నిజమైన చిన్నారి కాదు.. కేవలం బొమ్మమాత్రమే. పాపం.. ఆ బొమ్మ.. అచ్చం చిన్నారిని పోలీ ఉండటం వలన స్థానికులతో పాటు.. పోలీసులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత.. అక్కడికి చేరుకున్న అమీ క్విల్లెన్కు, పోలీసులు జరిగిన విషయం తెలిపారు. ఆ బొమ్మ.. తన కూతురికి ఎంతో ఇష్టమని తెలిపారు. క్రిస్టమస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చామని తెలిపారు. కాగా, దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత , కారు మరమ్మత్తుల కోసం డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు. చదవండి: ‘కొందరు మనుషుల కన్నా.. నోరు లేని జీవాలే నయం’ . వైరల్ వీడియో -
ప్రజా ప్రస్థానం పాదయాత్ర వాయిదా
సాక్షి, నార్కట్‌పల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా ప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కోడ్ ముగిసిన వెంటనే తిరిగి యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 21 రోజుల్లో సాగిన యాత్రలో ఆరు నియోజకవర్గాల్లోని 150 గ్రామాలను సందర్శించినట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం గ్రామంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా తాను హైదరాబాద్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. రాష్టంలో సమస్యలే లేవని పాలకులు చెబుతున్నారని, కానీ తన పాదయాత్రలో ప్రజలు ఎన్నో సమస్యలు వివరించారని, తాను కూడా కళ్లారా చూశానని అన్నారు. ఈ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి సమస్య పరిష్కరించేందుకు దివంగత మహానేత వైఎస్సార్ ప్రాజెక్టులను ప్రారంభిస్తే నేటికీ వాటిని పూర్తి చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయబోమని కేసీఆర్ ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరూ చూడాలని, అప్పుడే అందరి బతుకుల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే రైతులను ఆదుకుంటామని, నచ్చిన పంటలు సాగుచేసుకోవచ్చని, దానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లు చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు, రైతుల బ్యాంక్ రుణాల మాఫీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. -
పాదయాత్రకు విరామం
-
అవునా కాదో మీరే తేల్చండి! మౌనం వీడిన బాలీవుడ్ నటి
సాక్షి, ముంబై: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇటీవల కోర్టు తీర్పుపై బాలీవుడ్ ప్రముఖ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఎట్టకేలకు మౌనం వీడారు. కోర్టు తీర్పు, జరిమానాపై తొలిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పబ్లిసిటీ స్టంట్, కోర్టు సమయం వృధా అంటూ 5జీ టెక్నాలజీ అమలుపై తన పిటిషన్ తిరస్కరించడంపై ఆమె నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు దీనిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని తన పోరాటం ప్రచారం, ప్రాపకం కోసం అవునో కాదో మీరే తేల్చాలని ఆమె పిలుపునిచ్చారు. ఇండియాలో 5 జీ టెక్నాలజీ అమలుకు సంబంధించి రెండు నెలల క్రితం తన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చిన తర్వాత బాలీవుడ్ నటి సోమవారం ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. మనుషులకు, జంతువులు 5జీ టెక్నాలజీ మొబైల్ టవర్ల దుష్పరిణామాలపై ఎంత సురక్షితమో తెలియజేయాలని ఆర్‌టీఐతోపాటు, వివిధ ఏజెన్సీలను కోరామని, ఆ వివరాలను మీరూ పరిశాలించాలని, ఓపికగా తను షేర్ చేసిన వీడియోలోని అంశాలని గమనించాలంటూ తన 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని వీడియోలో వివరించారు. దేశంలో 5జి మొబైల్ టెక్నాలజీ అమలు, రేడియో ఫ్రీకెన్సీ రేడియేషన్ (ఆర్ఎఫ్) దుష్పరిణామాలపై ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోలో ప్రస్తావించారు. 5జీ టెక్నాలజీ వల్ల ఇటు చిన్నా పెద్దా, స్త్రీ పురుషులు, పసివాళ్లు, అటు మూగజీవాలకు కూడా సురక్షితమని సర్టిఫై చేస్తూ, తమ వాదనను బలపరచే అధ్యయనాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జుహీ చావ్లా కృషి చేస్తున్నాననీ, 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఈ కేసులో జుహీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) -
సుకుమార్‌కు అస్వస్థత.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సుకుమార్ ఆరోగ్యం కుదుటపడే వరకు పుష్ప షూటింగ్‌కు వారామం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన కోలుకున్న వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక ఈ ఏడాదిలో పుష్ప మొదటి పార్ట్‌ను రిలీజ్ చేసి రెండో భాగం ఆరు నెలలు గ్యాప్ విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. ఇందులో బన్నీబన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన వీడియో అభిమానుల తెగ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విలన్‌గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
సోనూసూద్‌పై ప్రేమతో టీవీ పగలగొట్టిన బుడ్డోడు.. నటుడి స్పందన
-
సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్ అనిత
ముంబై: బుల్లితెర సెలబ్రిటీ, 'నువ్వు నేను' హీరోయిన్ అనిత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రస్తుతం తన చిన్నారితోనే పూర్తి సమయం గడపాలనుకుంటున్నానని, ఇది చాలా కాలం క్రితమే తీసుకున్న నిర్ణయమని తెలిపింది. 'నేను తల్లినైతే యాక్టింగ్ కెరీర్ నుంచి తప్పుకోవాలని ముందే నిర్ణయించుకున్నాను. ఇది కరోనా పాండమిక్ వల్ల తీసుకున్న నిర్ణయం కాదు. నా దృష్టి మొత్తం నా పిల్లాడి భవిష్యత్తుపైనే. తల్లిగా నా పూర్తి బాధ్యతలు నిర్వహించాలనుకుంటున్నా అందుకే ఇండస్ర్టీ నుంచి తప్పుకుంటున్నా. ప్రస్తుతం నటన అనేది నా చివరి ప్రయారిటీ. తిరిగి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తానో నాకే తెలియదు. ఇక ఇంతకుముందే కొన్ని బ్రాండ్లకు సైన్ చేసినందుకు ఇప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేస్తున్నా.. యాడ్ షూటింగ్స్ అన్నీ మా ఇంట్లోనే జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. షూట్ కోసం వచ్చిన వ్యక్తులకు ముందే కోవిడ్ టెస్ట్ నిర్వహించి నెగిటివ్ వచ్చాకే లోపలికి అనుమతిస్తున్నాం. ఇక నేను మళ్లీ నటిస్తానన్నది నాకే తెలియదు. ఒకవేళ మళ్లీ రీఎంట్రీ ఉంటే తప్పుకుండా చెబుతాను' అని వెల్లడించింది. ఇక 'నువ్వు నేను', 'శ్రీరామ్', 'నేనున్నాను' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న అనితా టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ ''తాళ్, కుచ్ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో'' లాంటి చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత యే హై మొహబ్బతే, నాగిన్ సీరియల్స్‌తో బుల్లితెర బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో రోహిత్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనిత.. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చదవండి : భార్యలకు నచ్చే ట్రిక్ అంటూ భర్తను చాచి కొట్టిన నటి -
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన మంచు చరియలు
గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లో మరోసారి హిమానీనద ఉత్పాతం బీభత్సం సృష్టించింది. చమోలీ జిల్లాలోని సుమ్నా ప్రాంతం నీతి వ్యాలీలో మంచు చరియలు విరిగిపడి ధౌలి గంగ ఉప్పొంగడంతో పది మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఒ) సిబ్బంది మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 31 మంది ఆచూకీ తెలియడం లేదు. భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో పని చేస్తుండగా ఒక్కసారిగా భారీ వరద వారిని ముంచేసిందని అధికారులు వెల్లడించారు. మంచు చరియలు విరిగిపడినప్పుడు బీఆర్ఓకు చెందిన 430 మంది వర్కర్లు సుమ్నా రిమ్ఖుమ్ రహదారి పనుల్లో నిమగ్నమై ఉన్నట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. 430 కార్మికుల్లో ఆర్మీ 400 మందిని రక్షించింది. శుక్రవారం రాత్రి రెండు మృతదేహాలు లభ్యమైతే, ఆదివారం ఉదయం మరో ఆరుగురి మృతదేహాలను సహాయ సిబ్బంది కనుగొన్నారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్ ద్వారా జోషి మఠ్‌లో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరిలో చమోలీలోనే భారీగా మంచు చరియలు విరిగిపడడంతో 80 మంది మరణించారు. మరో 126 మంది గల్లంతైన విషయం తెలిసిందే. చదవండి: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం -
ఇంత పెద్ద బ్రేక్ రాలేదు
‘‘అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అనుకొని బాధపడటం కంటే మన దగ్గరున్న వాటితో సంతృప్తిపడటం గొప్ప ఫిలాసఫీ. నేనదే చేస్తుంటాను. ఈ ఏడాది అందరికీ కష్టంగానే గడిచింది’’ అన్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాది ఎలా సాగిందో చెబుతూ– ‘‘లాక్డౌన్ వల్ల మన గురించి మనం ఆలోచించుకునే అవకాశం దొరికింది. మనల్ని మనం సమీక్షించుకొని మనకున్న వాటిని మరింత అభినందించాలని తెలుసుకున్నాను. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల మా అమ్మానాన్నతో ఎక్కువ రోజులు కలసి ఉండటం కుదర్లేదు. కెరీర్లో ఇంత పెద్ద బ్రేక్ ఎప్పుడూ రాలేదు. మేం విహారయాత్రకు వెళ్లి పదేళ్లు పైనే అయింది. ఈ బ్రేక్‌లో మాల్దీవులు వెళ్లాం. ఇది నా బెస్ట్ హాలిడే’’ అన్నారు. -
అడుగు బయటపెట్టారు
కోవిడ్ వల్ల ఏర్పడ్డ లాక్డౌన్లో అందరూ దాదాపు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఆ సమయంలో స్వీయ సవాల్ విసురుకున్నారు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా ఎన్ని రోజులు ఉండగలనన్నది ఆ చాలెంజ్. ఈ విషయాన్ని ఆయన తనయుడు, నటుడు దుల్కర్ సల్మాన్ కొన్ని రోజుల క్రితం పంచుకున్నారు. ‘ఇప్పటికే నాన్న ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి 150 రోజులయింది’ అని పేర్కొన్నారు దుల్కర్. దాదాపు తొమ్మిది నెలలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు మమ్ముట్టి. సుమారు 275 రోజులు ఇల్లు కదల్లేదు ఆయన. తాజాగా స్వీయ నిర్భంధాన్ని బ్రేక్ చేశారు. శుక్రవారం ఇంటి నుంచి అడుగు బయటపెట్టారు మమ్ముట్టి. స్నేహితులతో కలసి బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారాయన. త్వరలోనే సినిమా షూటింగ్స్‌లోనూ పాల్గొననున్నారట మమ్ముట్టి. -
వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందర పనికిరాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై బయోకాన్ చైర్పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో తొందర పనికి రాదని, త్వరితంగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదని ఆస్ట్రాజెనెకా ప్రయోగాల ఆటంకం ద్వారా తేలిందని పేర్కొన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మాత్రమే ఆమోదం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. క్లినికల్ పరీక్షల్లో సమస్యల కారణంగా బ్రిటన్, భారతదేశంతో పాటు ఇతర దేశాలలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. (ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌కు డీసీజీఐ బ్రేక్) టీకా పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వైద్య, శాస్త్రీయ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న అంశం ఇదేనని మజుందార్ షా పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ప్రతి తీవ్రమైన ప్రతికూలతను పరిశోధించాల్సి ఉంటుందనీ, చాలా అప్రమత్తంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. కాగా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను కొన్ని సమస్యల కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలో పరీక్షలకు అనుమతి పొందిన సీరం సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాజా ఆదేశాల మేరకు పరీక్షలను నిలిపివేసింది. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ రోగుల్లో మోడరేట్ నుండి తీవ్రంగా ఏర్పడే సైటోకిన్ రిలీజ్ సిండ్రోమ్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ చికిత్సకు బయోకాన్ ఐటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను మార్కెట్ చేసుకునేందుకు జులైలో డీసీజీఐ అనుమతిని సాధించిన సంగతి తెలిసిందే. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన) -
ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌కు డీసీజీఐ బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కోవిడ్-19 వ్యాక్సిన్ పై తాజా పరిణామాలు నీళ్లు చల్లాయి.ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరీక్షల్లో సమస్యల కారణంగా కొన్ని దేశాల్లో తుది దశ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. దీంతో మన దేశంలో కూడా క్లినికల్ పరీక్షలకు బ్రేక్ పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా సమస్యల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులకు వరకు పరీక్షలను నిలిపి వేయాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరంను ఆదేశించింది. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలకు డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ తాత్కాలిక బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలవరకు నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షోకాజ్ నోటీసులిచ్చింది. ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ సమస్యలు, నిలిపివేతపై కేంద్ర లైసెన్సింగ్ అథారిటీకి తెలియజేయలేదని వ్యాఖ్యానించింది. ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో దేశంలోని 17 సైట్లలో నిర్వహిస్తున్న దశ 2/3 ట్రయల్స్ నిలిచిపోయాయి. తాజా షో-కాజ్ నోటీసుపై స్పందించిన సీరం ఇప్పటివరకు ట్రయల్స్ పాజ్ చేయమని తమకు చెప్పలేదని పేర్కొంది. అయితే డీసీజీఐ జారీ చేసిన ఆదేశాలను అనుసరిస్తామని తెలిపింది. వారి సూచనలు, ప్రామాణిక ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా తుది దశ పరీక్షలలో భాగంగా బ్రిటన్‌లో ఒక వ్యక్తిపై ప్రయోగం సందర్భంగా సమస్యలు తలెత్తడంతో తాత్కాలికంగా నిలిపి వేసినట్టు బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా నిన్న(బధవారం) వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టిసారించామని, డేటాను విశ్లేషించాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. -
కరోనాతో ఎంపీ నిధులకు బ్రేక్
రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కేంద్ర ప్రభుత్వ సాయం ఉంటేనే మరింత మంచి ఫలితాలు వస్తాయి. చన్నీళ్లకు వేడినీళ్లు తోడన్నట్లు కేంద్రం నిధులు ఇచ్చినపుడే అభివృద్ధి వేగంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కొన్ని రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈప్రభావం జిల్లా అభివృద్ధిపైనా పడుతోంది. విజయనగరం గంటస్తంభం: పట్టణ, గ్రామాలాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనేక పథకాలు అమలు చేస్తుంటాయి. ఇందులో భాగంగా కేంద్రం ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో అనేక పథకాలు కేంద్రం అమలు చేస్తోంది. అయితే వీటిలో కొన్నింటిని కేంద్రం నిలుపుదల చేయడం సమస్యగా మారింది. ఆగిన ఎస్డీపీ.. ఎంపీ లాడ్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా జిల్లాలో కొన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేక అభివృద్ధి పథకం, పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్) ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని విభజన బిల్లులో పొందుపరిచారు. ఇందులో భాగంగా ఏడాదికి ప్రతి జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున రూ.350 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈమేరకు 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు వరుసుగా మూడేళ్లపాటు నిధులు మంజూరు చేసింది. ఒక్కో ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున రూ.150 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.50 కోట్లు విడుదల చేసినా వెంటనే వెనుక్కి తీసుకుంది. ఈనిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోగా 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నిధుల ఊసెత్తలేదు. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా ఆ పథకం ప్రస్తావన లేదు. కేంద్ర ప్రభుత్వం కావాలని ఈ నిధులను ఆపేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా ఈఏడాది నుంచి ఎంపీ లాడ్స్ కూడా ఆగిపోయాయి. ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్లు ఇవ్వాల్సి ఉండగా నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో ఈఏడాదితోపాటు వచ్చే ఏడాది కూడా ఎంపీ లాడ్స్ నిధులు విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఒక్కో ఎంపీకి రెండేళ్లులో రూ.10 కోట్లు నిధులు రావు. దీంతో వారు కేటాయించే పరిస్థితి ఉండదు. అభివృద్ధిపై ప్రభావం ఈరెండు పథకాలు ఆగడంతో జిల్లా అభివృద్ధిపై ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఎస్డీపీ నిధులు ఏడాదికి రూ.50 కోట్లు ఇవ్వడం వల్ల సాగునీటి వనరులు అభివృద్ధి, రోడ్లు, కాలువులు, తాగునీటి పథకాల నిర్మాణం, విద్య, వైద్యం తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వీలుంది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో సుమారు రూ.200 కోట్లు విలవైన పనులు జరిగాయి. దీంతో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. ఈ సమయంలో ఎస్డీపీ పథకం ఉంటే ప్రయోజనం ఉండేది. కనీసం ఎంపీలాడ్స్ ఉన్నా ఎంతోకొంత అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆస్కారం ఉండేది. గతేడాది ఒక్కో ఎంపీకి రూ.5 కోట్లు ఇవ్వడం వల్ల విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రూ.3.93 కోట్లుతో 75 పనులు మంజూరు చేశారు. అలాగే అరుకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి తన రూ.5 కోట్లు నుంచి జిల్లాలో పలు పనులకు సుమారు రూ.1.5 కోట్లు ఇచ్చారు. ఎస్.కోట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ ఎంపీ సత్యనారాయణ రూ.5 లక్షలు ఇచ్చారు. వీటితో అనేక పనులు చేపట్టడం జరిగింది. రెండేళ్లుపాటు వారికి నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు జరిగేందుకు కొంత అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. కరోనాతో ఎంపీ నిధులు ఆగాయి ఈవిషయం జిల్లా ప్రణాళిక శాఖ అధికారి విజయలక్ష్మి వద్ద ప్రస్తావించగా ఎంపీ లాడ్స్ కరోనా నేపథ్యంలో రెండేళ్లు ఉండవని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎస్డీపీ నిధులు 2018–19 నుంచి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుతుంది. వస్తే అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయి. -
కరోనా శాంపిళ్ల సేకరణకు కాస్త విరామం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యేకంగా చేపట్టిన కరోనా శాంపిళ్ల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించారు. ఇప్పటివరకు స్వీకరించిన శాంపిళ్లకు సంబం ధించి అన్ని ఫలితాలు ప్రకటించిన తర్వాతే మళ్లీ నమూనాలు స్వీకరించా లని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందుకోసం రెండు రోజులపాటు కరోనా శాంపిళ్ల స్వీకరణకు విరామం ఇచ్చామని.. అయితే, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను ఎక్కువ మొత్తంలో చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనెల 16 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో భారీగా కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయాలని సూచించారు. పది రోజుల్లో 50వేల పరీక్షలు పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలని స్పష్టంచేశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అనుమానితుల నుంచి నమూనాలు స్వీకరిస్తోంది. అయితే, ప్రభుత్వ ల్యాబ్‌ల సామర్థ్యానికి మంచి శాంపిళ్లను స్వీకరించడంతో వాటి పరీక్షలు పెండింగ్‌లో పడ్డాయి. బుధవారం వరకు దాదాపు 36వేల శాంపిల్స్ సేకరించగా.. 27,747 నమూనాలను పరిశీలించి ఫలితాలు ప్రకటించారు. ఇంకా 8,253 నమూనాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆ శాంపిళ్ల పరీక్షలకు రెండు రోజులు.. ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్‌లలో రోజువారీ పరీక్షల సామర్థ్యం నాలుగు వేలు మాత్రమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న నమూనాలను పరీక్షించడానికి రెండు రోజులు పడుతుంది. పైగా రోజువారీగా నమూనాల సేకరణ కొనసాగిస్తే, వాటిని నిల్వ చేయడం కష్టమవుతుంది. నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య వేల సంఖ్యలో శాంపుల్స్ నిల్వ చేసే సామర్థ్యం వైద్య, ఆరోగ్య శాఖ వద్ద లేదు. అంతేకాకుండా ఎక్కువ రోజులు ఆ శాంపిళ్లను నిల్వ చేస్తే ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే నమూనాల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ సమయంలో శాంపిల్ కలెక్షన్ సెంటర్లను శానిటైజేషన్ చేయనుంది. ఇక కరోనా లక్షణాలు ఉన్నవారికి, ఆ పరీక్షలు అవసరమైన వారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. -
‘కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపడతాం’
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలంలో ఉన్న సారళాసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పెరగడంతో మంగళవారం గండిపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరళాసాగర్ కరకట్టకు గండిపడటంపై సాంకేతిక నిపుణులతో విచారణ చేయిస్తామని ఆయన తెలిపారు. కరకట్టకు గండిపడటం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. రబీలో సాగుకు సన్నద్దమైన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 4, 200 ఎకరాలకు నీరందిస్తామని.. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వెంటనే చేపడతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి -
సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలం సమీపంలో ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టుకు వదర నీరు పోటెత్తటంతో మంగళవారం గండిపడింది. దీంతో కరకట్ట తెగి నీరు వృధాగా పోయింది. కరకట్ట తెగడంతో వరద నీరు రోడ్డు మీదికి చేరింది. దీంతో కొత్తకోట-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వదర నీరు చేరింది. సరళాసాగర్ ప్రాజెక్టు ఆసియాలోనే మొట్టమొదటి సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి కొట్టుకుపోయిన ప్రాజెక్టు గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
యూట్యూబ్ స్టార్ అనూహ్య నిర్ణయం..
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూట్యూబ్ స్టార్ ప్యూడీపీ వీడియో ప్లాట్‌ఫామ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను బాగా అలిసిపోయినందున యూట్యూబ్ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ప్యూడీపీగా పేరొందిన స్వీడన్‌కు చెందిన యూట్యూబ్ స్టార్ ఫెలిక్స్ అర్విడ్ జెల్‌బెర్గ్ యూట్యూబ్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. వచ్చే ఏడాది యూట్యూబ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నానని, అందుకు మానసికంగా సంసిద్ధమయ్యేందుకే దాని గురించి ఇప్పుడే ప్రకటిస్తున్నానని ప్యూడీపీ చెప్పుకొచ్చారు. నేను పూర్తిగా అలిసిపోయా..వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే యూట్యూబ్ నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. యూట్యూబ్‌లోనే ఫెలిక్స్‌కు 102 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు ఉండగా, తొమ్మిదేళ్ల కిందట లాంఛ్ చేసిన తన చానెల్‌కు 24 బిలియన్ వ్యూస్ దక్కడం గమనార్హం. ఇంతటి ప్రజాదరణ పొందడంతో వీడియోలు రూపొందించే ఫెలిక్స్‌కు నెలకు లక్షల పౌండ్ల ఆదాయం సమకూరుతోంది. ఫెలిక్స్‌కు 18 మిలియన్ల ట్విటర్ ఫాలోవర్లు, 20 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్లు ఉండటం గమనార్హం. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోనే వంద మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ స్వీడన్ యూట్యూబర్‌కు చోటు దక్కింది. -
స్కోడా చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తికి బ్రేక్
న్యూఢిల్లీ: కొత్త ఉత్పత్తుల తయారీకి అనుకూలంగా అప్‌గ్రేడ్ చేసే దిశగా పుణెలోని చకన్ ప్లాంటులో నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వెల్లడించింది. డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య దాకా కార్యకలాపాలు ఆపివేయనున్నట్లు వివరించింది. ఇటీవలే అక్టోబర్–నవంబర్ మధ్యలో కూడా స్కోడా నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేసింది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఇండియా ఈ ఏడాదే తమ మూడు ప్యాసింజర్ కార్ల తయారీ అనుబంధ సంస్థలన్నింటినీ ఒకే సంస్థగా స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కింద మార్చింది. ఇందులో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా ఉన్నాయి. -
మ్యాక్స్ అన్ వెల్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా కీలక ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆశ్చర్యకర రీతిలో క్రికెట్‌కు నిరవధిక విరామం ప్రకటించాడు. మానసికపరమైన సమస్యలతో తాను బాధపడుతున్నట్లు, కొంత కాలం ఆటకు దూరం కావాలని భావిస్తున్నట్లు అతను తన నిర్ణయాన్ని వెలువరించాడు. క్రికెట్ ఆ స్ట్రేలియా (సీఏ) ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్ల మంచి చెడులు చూసుకోవడం మా బాధ్యత. మ్యాక్స్‌వెల్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. క్రికెట్ ఆస్ట్రేలియా, అతని దేశవాళీ జట్టు విక్టోరియా కలిసి అతని ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకుంటాయి. మ్యాక్సీ మళ్లీ క్రికెట్లోకి అడుగు పెట్టే విధంగా తగిన వాతావరణం కల్పిస్తాం. ఈ సమయంలో మ్యాక్స్‌వెల్ వ్యక్తిగత జీవితాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టరాదని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అతనో ప్రత్యేకమైన ఆటగాడు. ఆస్ట్రేలియా క్రికెట్ కుటుంబంలో భాగమైన గ్లెన్ తొందరగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ బెన్ ఒలీవర్ ప్రకటన జారీ చేశారు. గత కొంత కాలంగా మ్యాక్స్‌వెల్ మానసికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, దీనిని సరైన సమయంలో గుర్తించిన అతనికి విరామం తప్పనిసరి అని టీమ్ సైకాలజిస్ట్ మైకేల్ లాయిడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి టి20లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగాడు. 28 బంతుల్లోనే 62 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పాటు మైదానంలో కూడా చాలా చురుగ్గా కనిపించి ఒక అద్భుతమైన రనౌట్ కూడా చేశాడు. అతని ఉత్సాహాన్ని చూస్తే ఎవరికీ అతని మానసిక స్థితిపై కనీస సందేహం కూడా రాదు. కానీ నాలుగు రోజులు తిరిగే సరికి తాను క్రికెట్ ఆడలేనని, విరామం కోరుకుంటున్నట్లు చెప్పాడు. మానసికంగా తాను తీవ్రమైన ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నట్లు 31 ఏళ్ల మ్యాక్స్‌వెల్ వెల్లడించడం అనూహ్యం. ఏడాది కాలంగా... అడిలైడ్‌లో జరిగిన తొలి టి20 మ్యాచ్‌కు ముందే తన విరామం గురించి కోచ్ లాంగర్‌తో మ్యాక్స్‌వెల్ చర్చించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టి20లో అతను బ్యాటింగ్ చేయలేదు. అయితే మ్యాక్సీ సమస్యల్లో ఉన్నట్లు తాను చాలా కాలం క్రితమే గుర్తించానని టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. ‘నా పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. ఆటను ఆస్వాదించలేకపోతున్నాను’ అని తనతో చెప్పినట్లు లాంగర్ స్పష్టం చేశాడు. శ్రీలంకతో సిరీస్ సమయంలో మ్యాచ్ ప్రసారకర్తలతో మ్యాక్స్‌వెల్ సరదాగా మాట్లాడటం కూడా ఒక ‘ముసుగు’ మాత్రమేనని కోచ్ అభిప్రాయ పడ్డాడు. తమ ఆటతో ప్రజలకు ఎంతో వినోదం పంచినా...ఆటగాళ్ల అంతరంగాన్ని ఎవరూ గుర్తించలేరని లాంగర్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది కాలంగా మ్యాక్స్‌వెల్ పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటంతో పాటు సుదీర్ఘ ప్రయాణాలు చేశాడు. స్వదేశంలో సిరీస్‌ల తర్వాత భారత్, యూఏఈ పర్యటన, ఆ తర్వాత ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్, దానికి కొనసాగింపుగా కౌంటీల్లో కూడా అతను ఆడాడు. తాను ఎప్పుడు తిరిగి వస్తాననే విషయంలో మ్యాక్స్‌వెల్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతానికి అతని స్థానంలో ఆస్ట్రేలియా జట్టులో డి ఆర్సీ షార్ట్‌ను ఎంపిక చేశారు. మనసంతా కలతే..! మార్కస్ ట్రెస్కోథెక్, ఫ్లింటాఫ్, టెయిట్, హోగార్డ్, ట్రాట్, హార్మిసన్, మాడిసన్, హేల్స్, సారా టేలర్... ఒకరా, ఇద్దరా ఈ జాబితా చాలా పెద్దదే! ఎక్కడో ఒక చోట మ్యాచ్ లేదా సిరీస్ ఆడుతుంటారు. అకస్మాత్తుగా మనసులో ఏదో తెలియని నైరాశ్యం అలముకుంటుంది. ఆడింది చాలు, ఇక నా వల్ల కాదు అంటూ అకస్మాత్తుగా ఇంటికి వెళ్లిపోయేందుకు లేదా ఆటకు దూరమయ్యేందుకు సిద్ధపడిపోతారు. ఆ సమయంలో వారికి ఆటగాడిగా తమ ఘనతలు, కీర్తి కనకాదులు ఏవీ గుర్తుకు రావు. పైన చెప్పిన క్రికెటర్లంతా ఏదో ఒక దశలో మానసిక సమస్యలతో బాధపడినవారే. వీరిలో కొందరు విరామం తర్వాత మళ్లీ కోలుకొని బరిలోకి దిగితే... మరికొందరు ఆట ముగించారు. ఇదే సమస్యతో దాదాపు నెల రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన మహిళా క్రికెటర్ సారా టేలర్ వయసు 30 ఏళ్లే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. యాదృచ్ఛికమో, మరే కారణమో గానీ వీరిలో ఎ క్కువ మంది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లే ఉన్నారు. ఆసీస్ కీలక ఆటగాడైన మ్యాక్స్‌వెల్ తాజా నిర్ణయంతో ఈ ‘మానసిక ఆందోళన’ సమస్య మళ్లీ చర్చను రేకెత్తిస్తోంది. డబ్బుకు లోటుండదు, ఎక్కడకు వెళ్లినా దేవుడి స్థాయిలో నీరాజనాలు లభిస్తాయి. అలాంటి క్రికెటర్లకు కూడా మానసిక సమస్యలు, ఒత్తిడి ఉంటాయా అనేది సగటు అభిమానికి సహజంగానే వచ్చే సందేహం. అయితే సాధారణ రోగాలను, గాయాలను ఏదో ఒక పరీక్ష ద్వారా గుర్తించే తరహాలో మానసిక ఆందోళనను కొలిచే పరికరాలు లేవు. ఇది సదరు వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అంతర్జాతీయ క్రికెటర్ కెరీర్ తీవ్ర ఒత్తిడితో కూడుకున్నదనేది వాస్తవం. సుదీర్ఘ కాలం దేశవాళీలో రాణించిన తర్వాత వచ్చే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ విఫలమైతే ఇక ఆట ముగిసిపోతుందనే ఆందోళన కూడా సహజం. ఎంతగా రాణించినా ఇంకా బాగా ఆడాలనే ఒత్తిడి, వారిపై అంచనాలు ఉంటాయి. ఎంత వద్దనుకున్నా కొన్ని సందర్భాల్లో వాణిజ్యపరమైన అంశాలు కూడా ఆటగాళ్లను నడిపిస్తాయి. క్రికెటర్లు జట్టులో స్థిరపడిన తర్వాత కూడా ఇలాంటి మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు. మ్యాక్స్‌వెల్ విషయంలో ఇలాంటి ఒత్తిడే పెరిగింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన స్థాయికి తగినట్లుగా ఆడలేకపోతున్నానని, ఎంత బాగా ఆడినా టెస్టు జట్టులో స్థానం కోసం తనను పరిగణనలోకి తీసుకోవడం లేదనే నైరాశ్యం అతనిలో ఇటీవల బాగా కనిపించిందని మ్యాక్సీ సన్నిహితులు వెల్లడించారు. టెస్టు జట్టులో స్థానం కోసమే 2019 ఐపీఎల్‌నుంచి తప్పుకొని దేశవాళీ క్రికెట్లో పడిన శ్రమను వారు గుర్తు చేశారు. ప్రస్తుత తరంలో చాలా మంది క్రికెటర్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. వీరిలో కొందరు దీనిని సమర్థంగా ఎదుర్కొంటే, మరికొందరు ఒకసారి బయటపడితే తమ కెరీర్‌పై ఆ ముద్ర ప్రభావం చూపిస్తుందని, కెరీర్ ముగుస్తుందని భయపడుతుంటారని వారు అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో బోర్డునుంచి ఈ తరహా అంశాల్లో సహకారం లభిస్తుంది కాబట్టి వారే స్వేచ్ఛగా బయటపడతారనేది ఒక విశ్లేషణ. 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్ 32.32 సగటు, 123.37 స్ట్రైక్‌రేట్‌తో 2877 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 61 అంతర్జాతీయ టి20ల్లో 35.02 సగటుతో 1576 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్‌రేట్ ఏకంగా 160 ఉండటం విశేషం. ఈ రెండు ఫార్మాట్లలో కలిపి మ్యాక్స్‌వెల్ 76 వికెట్లు తీశాడు. అతను 7 టెస్టులు కూడా ఆడినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. -
భారతీయుడికి బ్రేక్?
ప్రస్తుతం కమల్‌హాసన్ చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్ కూడా సీక్వెల్సే. ఒకటేమో ‘భారతీయుడు’ సీక్వెల్ ‘భారతీయుడు 2’ కాగా, మరోటి ‘దేవర్‌మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) సీక్వెల్ ‘దేవర్‌మగన్ 2’. ఎన్నికల హడావిడి కారణంగా ‘భారతీయుడు’ సినిమాకి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు కమల్. అయితే లేటెస్ట్గా ‘భారతీయుడిని అంతే బ్రేక్‌లో ఉంచి ‘దేవర్ మగన్ 2’ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో కమల్ ఉన్నారని తెలిసింది. ఒకటే షెడ్యూల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత సినిమాల్లో కనిపించను అని కమల్ స్పష్టం చేశారు. మరి ‘భారతీయుడు 2’కు స్మాల్ బ్రేకా? లేకపోతే సినిమా పూర్తిగా ఆగిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది. -
ఇక హాయిగా విశ్రమిస్తా: కోహ్లి
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేస్తుందన్న విశ్వాసాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ గెలవడంతో సంతోషంగా బ్రేక్ తీసుకుంటానని చెప్పాడు. కివీస్‌తో మూడో వన్డే ముగిసిన తర్వాత కోహ్లి మీడియాతో మాట్లాడుతూ... ‘చివరి రెండు వన్డేల్లోనూ మేము విజయం సాధిస్తాం. చాలా రోజుల నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఆస్ట్రేలియా పర్యటనతో ఊపిరి సలపకుండా గడిపాం. అందుకే విరామం తీసుకుంటున్నాను. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో గెలిచాం కాబట్టి సంతోషంగా బ్రేక్ తీసుకుంటా. విరామ సమయాన్ని బాగా గడుపుతాను. ఎవరో ఒకరు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. మనం ఉన్నా లేకున్నా ఆట కొనసాగుతుంద’ని అన్నాడు. సెలెక్టర్లు విశ్రాంతి కల్పించడంతో చివరి రెండు వన్డేలకు కోహ్లి అందుబాటులో ఉండడం లేదు. న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్ గెలవడం పట్ల విరాట్ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నామన్నాడు. మూడో వన్డే చివర్లలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ బాగా బ్యాటింగ్ చేశారని ప్రశంసించాడు. డ్రెసింగ్ రూములో కూర్చుని ప్రతి పరుగుకు కేరింతలు కొట్టామన్నాడు. ఆటగాళ్లు అందరూ తమ ప్రతిభపై నమ్మకం ఉంచి, దాన్ని మైదానంలో ప్రదర్శించడంతో విజయాలు దక్కాయని విశ్లేషించాడు. కాగా, చివరి రెండు వన్డేలకు కోహ్లి స్థానంలో భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. -
ప్రజాసంకల్పయాత్రకు రేపు విరామం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు రేపు(బుధవారం) విరామం ప్రకటించారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎర్రవరం జంక్షన్ వద్ద జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రజలందరూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ జిల్లా వాసులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా బుధవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి గురువారం ఉదయం నుంచి పాదయాత్ర యధావిథిగా ప్రారంభమౌతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన ద్వారా తెలియజేశారు. -
రెపో హైక్ : వరుస రికార్డులకు బ్రేక్
సాక్షి, ముంబై: వరుస రికార్డులకు స్టాక్‌మార్కెట్లు బ్రేక్ వేశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల కారణంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త రికార్డులను అందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్ తరువాత నష్టాల్లోకి జారకున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంపు, అధిక స్థాయిల్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 85 పాయింట్లు క్షీణించి 37,522 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 11,346 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో, మెటల్ బలహీన పడగా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభపడ్డాయి. కోల్ ఇండియా, లుపిన్, ఇన్ఫ్రాటెల్, ఐవోసీ, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. హిందాల్కో, ఐసీఐసీఐ, మారుతీ, వేదాంతా, టాటా స్టీల్, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐషర్, బజాజ్ ఆటో నష్టాల్లోనూ ముగిశాయి. మరోవైపు రెపోరేటు పెంపు బ్యాంకింగ్ సెక్టార్‌ను ప్రభావితం చేయగా, జూలై గణాంకాల తరువాత ఆటో సెక్టార్ నష్టపోయినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో మంగళవారం రూ. 572 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 291 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 234 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా... దేశీ ఫండ్స్ నామమాత్రంగా రూ. 48 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
అమర్నాథ్ యాత్రకు బ్రేక్
-
కశ్మీర్లో మళ్లీ ‘ఆపరేషన్లు’
న్యూఢిల్లీ/శ్రీనగర్: రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటిని పునరుద్ధరించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అన్ని అత్యవసర చర్యలు తీసుకోవాలని, ఉగ్ర దాడులు, హత్యాకాండ వంటి వాటిని నిలువరించాలని భద్రతా దళాలను ఆదేశించామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, హింస లేని వాతావరణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. శాంతి కోరుకునే వారంతా ఏకతాటిపైకి రావాలని, తప్పు దారిలో వెళుతున్న వారిని శాంతి మార్గంలోకి తీసుకురావాలని కోరారు.∙రంజాన్ మాసం సందర్భంగా మే 17 నుంచి కశ్మీర్లో సైనిక ఆపరేషన్లను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. రంజాన్ మాసం ప్రశాంతంగా సాగేందుకు ఆపరేషన్లను నిలుపుదల చేసి సహకరించిన భద్రతా బలగాలను రాజ్‌నాథ్ అభినందించారు. అధికారిక సమాచారం ప్రకారం ఏప్రిల్ 17 నుంచి మే 17 మధ్య 18 ఉగ్ర దాడుల సంఘటనలు నమోదైతే.. ఆపరేషన్ల నిలుపుదల తర్వాత ఆ సంఖ్య 50కిపైగా పెరిగింది. నిరాశ కలిగించింది: రాజకీయ పార్టీలు ‘కేంద్రం ప్రకటన అసంతృప్తి కలిగించింది. ఇది అనూహ్య పరిణామం’ అని ప్రధాన ప్రతిపక్షం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధికార ప్రతినిధి జునైద్ మట్టు అన్నారు. భద్రతా దళాల కార్యకలాపాల విరమణను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. కేంద్రం నిర్ణయం నిరాశ కలిగించిందనీ, ప్రస్తుత పరిస్థితుల్లో విరమణ పొడిగింపు సాధ్యం కాదని అధికార పీడీపీ ప్రధాన కార్యదర్శి పీర్జాదా మన్సూర్ అన్నారు. ‘శాంతి ప్రక్రియ టూ వే ట్రాఫిక్ లాంటిది. మా తరఫున చేయాల్సిందంతా చేశాం. విశ్వాసం కలిగించే చర్యలన్నిటినీ తీసుకున్నాం. కానీ బుఖారీకి ఏం జరిగింది? ఆయన్ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు’ అని పీర్జాదా అన్నారు. కశ్మీర్ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టమైన విధానం లేదని జమ్మూ కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీఏ మిర్ విమర్శించారు. -
రెవెన్యూ బదిలీలకు బ్రేక్?
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూశాఖలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. భూ రికార్డుల ప్రక్షాళన, పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రి య ముగింపు దశలో ఉన్నందున ఆ శాఖ పరిధిలో బదిలీలను నిలిపేయాలని ఉన్నతాధికారులు యోచి స్తున్నట్లు సమాచారం. బదిలీల ప్రక్రియ ఈ నెల 15 లోగా ముగియాల్సి ఉన్నా ఇంతవరకు ఎలాంటి కస రత్తు జరగకపోవడంతో పాటు బదిలీలు చేపట్టవద్దని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడం ఆ శాఖ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 20 లోగా పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తయ్యాక బదిలీలు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గజిబిజి.. గందరగోళం రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వాటి ఆధా రంగా పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియ కొనసాగు తోంది. ఇప్పటివరకు సుమారు 42 లక్షల పాస్పుస్త కాల పంపిణీ పూర్తయింది. మరో 7 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. పంపిణీ చేసిన పుస్తకాల్లో భారీగా తప్పులు దొర్లడం తో వాటిని సరిచేయాల్సి ఉంది. ఈ తరుణంలో సాధారణ బదిలీలు చేస్తే అంతా గందరగోళంగా మారుతుందన్నది ఉన్నతాధికారుల వాదన. గ్రామం పై అవగాహన ఉన్న సిబ్బంది చేస్తేనే కొన్ని ఇబ్బం దులు వచ్చాయని, ఇప్పుడు కొత్త సిబ్బందిని పంపితే పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియ కష్టమవుతుందని వారంటున్నారు. దీంతో పాస్‌పుస్తకాల పంపిణీ పూర్త య్యే దాకా బదిలీలు చేయొద్దని భావిస్తున్నారు. బదిలీలు లేకుంటే మళ్లీ కష్టాలే... రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని విజ యవంతం చేయడం తమ బాధ్యతే కానీ, నాలుగైదేళ్ల తర్వాత సాధారణ బదిలీలకు వచ్చిన అవకాశాన్ని కోల్పోతే మళ్లీ బదిలీలు ఎప్పుడు జరుగుతాయోననే ఆందోళన రెవెన్యూ సిబ్బందిలో వ్యక్తమవుతోంది. బదిలీలు తమ హక్కని, ఏదో కార్యక్రమం పేరు చెప్పి తమ హక్కులకు భంగం కలిగించడం భావ్యం కాదం టున్నారు. ముఖ్యంగా జిల్లాల విభజన సమయంలో ఆర్డర్ టు సర్వ్ పేరుతో ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ బదిలీలు ఎప్పుడు ఉంటాయోనని ఎదురుచూస్తున్నామని, ఇప్పుడు తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. బదిలీలకు అనుమతివ్వకపోతే కనీసం మరో 2–3 ఏళ్లు తాము అవే కష్టాలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. మధ్యేమార్గంగా.. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా మరో ప్రతిపాదనను రెవెన్యూ సంఘాలు తెరపైకి తెస్తున్నాయి. అన్ని శాఖ ల ఉద్యోగులతోపాటు తమకూ సాధారణ బదిలీల్లో అవకాశం కల్పించాలని, పాస్‌పుస్తకాల పంపిణీ అయ్యాకే బదిలీ అయిన సిబ్బందిని కొత్త స్థానాలకు పంపాలని, అప్పటి వరకు రిలీవ్ చేయకుండా పాత స్థానాల్లో పనిచేయించుకోవాలని వారు కోరుతున్నా రు. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిగణిస్తా మని ఉన్నతాధికారులు చెబుతున్నా పాస్‌పుస్తకాల పంపిణీ తర్వాతే బదిలీలు చేయాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ నెల 20 తర్వాతే రెవెన్యూశాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు సచివాలయ స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా బదిలీలపై నేడో, రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. -
పాపికొండల పర్యాటకానికి బ్రేక్
భద్రాచలం: పాపికొండల విహార యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నదిలో లాంచీ మునిగిన ఘటనలో 20 మందికి పైగానే మృత్యువాత పడటం,, ఐదు రోజుల కిందట లాంచీలో పొగలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా పాపికొండల పర్యాటకానికి వెళ్లే లాంచీలను నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు తిప్పాలనే దానిపై తాము స్పష్టత ఇచ్చేంత వరకూ నిర్వాహకులు గోదావరిలో లాంచీలు, పడవలు తిప్పొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో భద్రాచలం వైపు నుంచి పాపికొండల యాత్రకు వెళ్లేందుకు వచ్చిన పర్యాటకులు బుధవారం వెనుదిరిగి వెళ్లారు. -
రామ్‌చరణ్ రంగస్థలంకు బ్రేక్
చెన్నై(తమిళసినిమా) : నటుడు రామ్‌చరణ్, సమంత కలిసి నటించిన రంగస్థలం చిత్రానికి బ్రేక్ పడింది. కంగారు పడకండి ఈ బ్రేక్ అనేది తమిళనాడు వరకేలెండి. వివరాల్లోకి వెళ్లితే.. కోలీవుడ్ ప్రస్తుతం చాలా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఒకపక్క క్యూబ్ సంస్థల మంకు పట్టు, మరోవైపు థియేటర్ల యాజమాన్యం పంతంతో కోలీవుడ్ కష్టాల్లో పడింది. నిర్మాతల మండలికి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య మొదలైన సమస్య ఆ తరువాత నిర్మాతలమండలికి, థియేటర్ల సంఘం వరకూ పాకింది. ఈ సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త చిత్రాల ప్రదర్శనల నిలిపివేత, మార్చి 16వ తేదీ నుంచి షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలను రద్దు చేస్తూ నిర్మాతలమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అటు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, థియేటర్ల యాజమాన్యం దిగివస్తుందని భావించిన నిర్మాతల మండలి నిర్వాహకులకు అది జరగలేదు. థియేటర్ల మాజమాన్యం పాత చిత్రాలను, ఇతర భాషా చిత్రాలను ప్రదర్శించుకుంటున్నారు.దీంతో నిర్మాతల మండలి తీసుకున్న కొత్త చిత్రాల విడుదల రద్దు నిర్ణయం పెద్దగా వారిపై ప్రభావం చూపడం లేదు. కాగా ఇటీవల విడుదలైన రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన తెలుగు చిత్రం రంగస్థలం తమిళ స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా తమిళనాడులో అత్యధిక థియేటర్లలో ప్రదర్శంపబడుతోంది. ఇది తమిళ నిర్మాతలకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో సమ్మె సమయంలో ఇతర భాషా చిత్రాల విడుదలను అడ్డుకోవాలన్న ఒత్తిడి నిర్మాతల మండలిపై పడింది. దీంతో రంగంలోకి దిగిన ఆ మండలి అధ్యక్షుడు విశాల్ తెలుగు చిత్ర నిర్మాతల మండలితో మాట్లాడి తెలుగు చిత్రాలను తమిళనాట విడుదల చేయకుండా తమ సమ్మెకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విశాల్ ప్రయత్నం ఫలించింది. తెలుగు నిర్మాతలమండలి ఈ నెల 8వ తేదీ నుంచి తెలుగు చిత్రాలను తమిళనాడులో విడుదల చేయబోమని ప్రకటించారు. ఐపీఎల్ దెబ్బ.. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. తాజాగా తమిళ నిర్మాతలకు ఐపీఎల్ క్రికెట్ రూపంలో మరో ముంపు ముంచుకొస్తోంది. అవును తమిళ నిర్మాతల మండలి కొత్త చిత్రాలను విడుదల చేయరాదని నిర్ణయం తీసుకోవడంతో ఇతర భాషా చిత్రాలను, పాత తమిళ చిత్రాలను ప్రదర్శించుకుంటున్న థియేటర్ల యాజమాన్యం నష్టాలనే ఎదుర్కొంటోందన్నది వాస్తవం. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో కార్మికుల జీతాలు, ఇతరత్రా నిర్వహణ భారం పెరుగుతోంది. నిర్మాతల మండలితో సయోధ్య కుదిరే పరిస్థితి కానరావడం లేదు. ఇలాంటి సమయంలో థియేటర్ల మాజయాన్యానికి ఐపీఎల్ క్రికెట్ పోటీలు అదృష్టంగా మారాయి. ఆ పోటీలను నేరుగా థియేటర్లలో ప్రదర్శించాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు నగర పోలీసు కమిషనర్ అనుమతి కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. అందులో కోలీవుడ్‌లో సమ్మె కారణంగా కొత్త చిత్రాల విడుదల నిలిచిపోయిందని, దీంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిపోయి నష్టాలను చవిచూస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వానికి జీఎస్టీ పన్ను రావడం లేదని పేర్కొన్నారు. కాబట్టి ఐపీఎల్ క్రికెట్ పోటీలను థియేటర్లలో ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇస్తే, ప్రభుత్వానికి, థియేటర్ల యాజమాన్యానికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల ప్రదర్శనకు కనుక అనుమతి లభిస్తే మరో 51 రోజులు థియేటర్ల యాజమాన్యానికి తమిళ చిత్రాల అవసరం ఉండదు. మరి తెలుగు చిత్రాలను నిలువరించినట్లు నిర్మాతల మండలి ఐపీఎల్ క్రికెట్ పోటీల ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? ఏం జరుగుతుందో చూడాలి. -
నియామకాలకు బ్రేక్..!
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో అధ్యాపక నియామకాలకు సంబంధించిన ప్రక్రియకు బ్రేక్ పడింది. యూజీసీ నిబంధనలు, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి విరుద్దంగా నియామకాలు చేపడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కొందరు అధ్యాపకులు, విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పలు విశ్వవిద్యాలయాల్లో నియామక ప్రక్రియకు ఇప్పటికే బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అదే విధంగా వైవీయూలో నియామక ప్రక్రియ, రోస్టర్ విధానంలో తప్పులతడకపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో వైవీయూకు చెందిన పరిశోధక విద్యార్థులు బి.బాలాజీనాయక్, వి.శ్రీనివాసులు, ఎం. నాగేంద్రనాయక్లు కోర్టును ఆశ్రయించారు. రిట్‌పిటీషన్ నంబర్ 12500/2018ను కోర్టు స్వీకరించడంతో పాటు ఈ నియామక ప్రక్రియపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్టే ఇస్తూ గురువారం తీర్పునిచ్చింది. రోస్టర్ విధానం, జీఓనం.117, ఎస్టీ రిజర్వేషన్లో నిబంధనలు పాటించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్టే ఇవ్వడం గమనార్హం. దీంతో వైవీయూలో 2017 అక్టోబర్ 18న విడుదల చేసిన బ్యాక్లాగ్ నోటిఫికేషన్‌తో పాటు 2018 జనవరి 3,4 తేదీల్లో వేర్వేరుగా ఇచ్చిన జనరల్ నోటిఫికేషన్లు సైతం నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే దాదాపు 3వేలకు పైగా దరఖాస్తులు విశ్వవిద్యాలయానికి చేరుకోగా వాటిని స్క్రూటినీ చేసే పనిలో అధికారులు ఉండగానే.. నియామక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. యూజీసీ నిబంధనలు, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగినవి. ఈ నిబంధనల ప్రకారం ఒక విభాగం ఏర్పాటు కావాలంటే అందులో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలన్న నిబంధన ఉంది. అదే విధంగా 12బీ, 2ఎఫ్ కలిగిన విద్యాలయాలకు యూజీసీ గ్రాంట్స్, ఇతరత్రా నిధులు లభిస్తాయి. ఇందులో ఏవైనా కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలన్నా, నూతన పోస్టులు మంజూరు చేయాలన్నా విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 390 జీఓను జారీ చేసి హైపవర్ కమిటీ పేరుతో రేషనలైజేషన్ ప్రక్రియ, పోస్టులను కన్వర్ట్ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా కొన్ని కోర్సులు కనుమరుగు కావడంతో పాటు పోస్టులు కూడా గల్లంతు అయ్యే పరిస్థితి తలెత్తింది. మరికొన్ని చోట్ల అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా తలకిందులయ్యాయి. దీంతో కేవలం ఒక్క వైవీయూలోనే 43 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు వాటిని 18 పోస్టులకు కుదించారు. ఈ 18 పోస్టుల్లో సైతం మళ్లీ 12 పోస్టులను బ్యాక్లాగ్ కింద కేటాయించారు. వీటితో పాటు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నప్పటికీ 5 విభాగాలను హేతుబద్దీకరణ పేరుతో మూసివేతకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఈ 2017 జనవరిలో రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల నుంచి కొందరు అధ్యాపకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైవీయూ నుంచి ఫిజిక్స్ అధ్యాపకుడు వై.పి. వెంకటసుబ్బయ్య కోర్టును ఆశ్రయించడంతో దీనిపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు వెలువరిచింది. దీంతో ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వారీగా నియామకాలు చేపట్టేందుకు వేర్వేరు జీఓలను విడుదల చేసింది. దీంతో ఒక్కో విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేశాయి. నియామక ప్రక్రియకు సంబంధించి వైవీయూకు 2017 జూన్ 30వ తేదీన జీ.ఓ ఎంఎస్ నెం.28ను విడుదల చేసింది. 2017 అక్టోబర్‌లో వైవీయూ జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో ఈ నియామక ప్రక్రియ కోసం జారీ అయిన జీఓనెం. 28పై స్టే విధించింది. దీనిపై ప్రభుత్వం మళ్లీ కోర్టును ఆశ్రయించగా నియామక ప్రక్రియ నిర్వహించి ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పరిశోధక విద్యార్థులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కడంతో నియామక ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడినట్లయింది. -
భారత మహిళల జట్టుకు చుక్కెదురు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టి20 సిరీస్ దక్కించుకోవాలనుకున్న భారత మహిళల జట్టు జోరుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు టి20ల్లో గెలుపొందిన హర్మన్‌ప్రీత్ బృందం మూడో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్ వైఫల్యంతో టీమిండియా 5 వికెట్లతో ఓడింది. తొలుత టీమిండియా 17.5 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. మిథాలీ రాజ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరినా... మరో ఓపెనర్ స్మృతి మంధాన (37; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), వేద కృష్ణమూర్తి (23; 4 ఫోర్లు) ధాటిగా ఆడారు. ఒకదశలో 91/2తో పటిష్టంగా కనిపించిన భారత్‌ను సఫారీ పేసర్ షబ్నమ్ 5 వికెట్లతో దెబ్బతీసింది. అనంతరం సఫారీలు ల్యూస్ ( 41; 5 ఫోర్లు), కెప్టెన్ నికెర్క్ (20 బంతుల్లో 26; 5 ఫోర్లు), ట్రియాన్ (34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో మరో ఓవర్ మిగిలుండగానే విజయం సాధించారు. నాలుగో మ్యాచ్ బుధవారం సెంచూరియన్‌లో జరుగనుంది. -
చిన్న బ్రేక్ తీసుకుంటా!
తమిళసినిమా: చిన్న బ్రేక్ తీసుకుంటున్నా అంటోంది నటి నివేదాథామస్. ఈ మలయాళ కుట్టి బాల తారగానే సినీరంగప్రవేశం చేసింది. అదేవిధంగా మాతృభాష మలయాళంతో పాటు, తమిళం, తెలుగులోనూ వరుసగా నటించేస్తోంది. తమిళంలో కొన్ని చిత్రాల్లో కథానాయికగా నటించినా, ఆ మధ్య పాపనాశం చిత్రంలో కమలహాసన్ కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇకపోతే తెలుగులో మాత్రం హిట్ చిత్రాల నాయకిగా ఎదుగుతోంది. నానీకి జంటగా జెంటిల్మెన్ చిత్రంతో టాలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన నివేదాథామస్, నిన్నుకోరి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం జూలియట్ అవర్ ఆఫ్ ఇడియట్ చిత్రంలో నటిస్తోంది. మరిన్ని అవకాశాలు అమ్మడి తలుపులు తడుతున్నా నో చెబుతోందట. కారణం తనకు చిన్న గ్యాప్ కావాలి అంటోందట. ఎవరైనా కథానాయకిగా ఎదుగుతున్న సమయంలో వచ్చే అవకాశాలను వద్దంటారా? తాను అంటానంటోంది నివేదాథామస్. కారణం ఏమంటంటే ఈ మలయాళీ కుట్టి మనసు చదువు మీదకు మళ్లిందట. ఆర్కిటిక్ విద్యలో ఉత్తీర్ణత సాధించిన తరువాత మళ్లీ నటనపై దృష్టి సారిస్తానని అంత వరకూ తాను నటనలో చిన్న గ్యాప్ తీసుకుంటున్నానని నివేదాథామస్ అంటోంది. అంతా బాగానే ఉంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత ఈ అమ్మడికి తెలియదేమో. ఇంతకు ముందు లక్ష్మీమీనన్ కూడా నటిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో మధ్యలో నిలిపేసిన చదువును పూర్తి చేయాలని నటనకు గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె పరిస్థితి ఏలా మారిందో తెలుసు కథా! అవకాశాల కోసం ఇప్పుడు ఎదురు చూస్తోంది. అలాంటి పరిస్థితి రాకుండా నివేదాథామస్ జాగ్రత్త పడితే ఆమెకే మంచిదంటున్నారు సినీ విజ్ఞులు. చూద్దాం నటిగా ఈ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో. -
ఈ నెలలో సబ్సిడీ గ్యాస్ ధర ఎంత పెరిగింది?
న్యూఢిల్లీ: గత 17 నెలలుగా వంటగ్యాస్ సిలిండర్ ధరలను ప్రతినెలా పెంచుతూ వచ్చిన చమురు సంస్థలు డిసెంబర్లో తాత్కాలిక విరామం ఇచ్చాయి. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ గుజరాత్ ఎన్నికలే దీనికి కారణమనీ, ప్రభుత్వమే ఆ మేరకు చమురు సంస్థలను కోరిందని తెలుస్తోంది. వంటగ్యాస్ సిలిండర్లపై అన్ని రాయితీలను 2018 మార్చికల్లా ఎత్తివేయాలనీ, అందుకోసం ప్రతినెలా ధర పెంచుతూ పోవాలని కేంద్రం గతేడాది చమురు సంస్థలను ఆదేశించింది. దీంతో గతేడాది జూలై నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ప్రతి నెలా రూ.2 తో మొదలుకొని రూ.4.50 వరకు చమురు సంస్థలు సిలిండర్ల ధర పెంచుతూ వచ్చాయి. ఏడాదిన్నరలో రాయితీ సిలిండర్ ధర రూ.76.50 పెరిగింది. డిసెంబర్లో రాయితీ సిలిండర్ ధరను పెంచలేదని ఓ అధికారి చెప్పారు. రాయితీయేతర సిలిండర్ ధరను మాత్రం డిసెంబర్ 1న రూ.5 పెంచాయి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్ ప్రకారం 14.2 కేజీల రాయితీ సిలిండర్ ధర రూ.496, రాయితీయేతర సిలిండర్ ధర రూ.747గా ఉంది. దేశంలో 18.11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాటిలో 3 కోట్లు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అత్యంత పేద మహిళలకు మంజూరైనవి. -
అరకు టూర్‌కు బ్రేక్..!
-
నెల్లూరు జిల్లాలో పడకేసిన 108 సేవలు
-
ఇంగ్లీష్ కాలువ ఈదిన అమెరికా బామ్మ
-
ఇప్పుడు కేరళ రికార్డ్ కూడా!
ఈ రికార్డు, ఆ రికార్డు అని లేకుండా ‘బాహుబలి 2’ ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేస్తోన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్.. 50రోజులకు దగ్గరపడుతున్నా, కలెక్షన్ల వర్షం మాత్రం ఎక్కడా తగ్గించలేదు. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో హిట్‌గా నిలిచింది. సోమవారం వరకూ ఒక్క కేరళ మినహా అంతటా ‘బాహుబలి’దే రికార్డు కాగా, నిన్నటితో అక్కడ కూడా ఈ ఫీట్ సాధించింది. మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘పులి మురుగన్’ 70 కోట్ల మేర గ్రాస్ వసూళ్లతో ఇంతకుముందు కేరళలో టాప్ కలెక్షన్స్ పరంగా ఆ రికార్డును ‘బాహుబలి–2’ బ్రేక్ చేసింది. -
ఆ మూడు నెలలు విరామం
ప్రసుత్తం సినిమా వార్తలన్నీ చెన్నై చిన్నది సమంత చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా వార్త ఏమిటంటే ఆ మూడు నెలలు ఆ భామ నటనకు విరామం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంమత తన ప్రేమికుడు, టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యను మనువాడనున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి అక్టోబర్ 6వ తేదీన ముహూర్తం కూడా కుదిరింది. దీంతో ఇప్పటి నుంచే తమ హనీమూన్‌కు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న సమంత సోమవారం తమ వివాహ తంతు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకున్నారు. పెళ్లి అనంతరం నటనను కొనసాగించాలని నిర్ణయించుకున్న సమంత వివాహానికి ఒక నెల ముందు, ఆ తరువాత మరో రెండు అంటూ మూడు నెలలు నటనకు విరామం ప్రకటించాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో తనకు కాబోయే మామ నాగార్జునతో కలిసి రాజుగారి గది– 2 చిత్రంతో పాటు, రామ్‌చరణ్‌కు జంటగా ఒక చిత్రం, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న మహానటి సావిత్రి జీవిత చరిత్రలోనూ నటించనున్నారు. అదే విధంగా తమిళంలో విజయ్‌తో ఆయన 61వ చిత్రంలోనూ, శివకార్తికేయన్‌తో మరో చిత్రం, అనీతికథైగళ్ అనే ఇంకో చిత్రంలోనూ నటించనున్నారు. వీటిలో విజయ్‌కు జంటగా నటించనున్న చిత్రానికి వచ్చే నెల నుంచి కాల్షీట్స్ కేటాయించారని సమాచారం. మరి ఆ తరువాత శివకార్తికేయన్, చిత్రం చేస్తారా? అనీతి కథైగళ్ చిత్రానికి ముందు ప్రైయారిటీ ఇస్తారా? లేక ఈ రెండు చిత్రాలను పెళ్లి తరువాతే అంటూ వాయదా వేస్తారా?అన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపునకు బ్రేక్
–రైతులు ,ఉద్యోగుల పక్షాన పోరాడిన వైఎస్సార్ సీపీ –జీవోపై సమీక్ష అనంతరం నిర్ణయం ధవళేశ్వరం: సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరం నుంచి అమలాపురానికి తరలించే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖా మంత్రి నుంచి మౌఖిక అదేశాలు అందినట్లు సమాచారం. కాటన్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ వందేళ్ళ పైబడి చరిత్ర కలిగిన సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. సోమ, మంగళవారాలు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాలను బంద్ చేయించి కార్యాలయ తరలింపుతో వచ్చే నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. సెంట్రల్ డివిజన్ కార్యాలయం అమలాపురం తరలిస్తే మైనర్ ఇరిగేషన్ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతారని, ఉద్యోగులు పీఏవో, సీఈఎస్ఈ కార్యాలయాలకు తరచూ ధవళేశ్వరం రావాల్సి ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వందేళ్ళ పైబడి ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాలను ప్రజాప్రతినిధుల మెప్పు కోసం ఏకపక్షంగా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులు, ఉద్యోగుల పక్షాన నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు, బంద్ నిర్వహించారు. తరలింపు ప్రక్రియ నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. –ఇరిగేషన్ మంత్రిని కలిసిన ఎన్జీవో నాయకులు సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపు ప్రతిపాదనను విరమించాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఆధ్వర్యంలో ఎన్జీవో నాయకులు ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిశారు. కార్యాలయ తరలింపు వల్ల కలిగే నష్టాలను మంత్రికి వివరించారు. 1988 జీవోపై పూర్తిగా సమీక్షించిన అనంతరం కార్యాలయాన్ని మార్పుపై నిర్ణయం తీసుకుందామని అప్పటివరకు సెంట్రల్ డివిజన్ కార్యాలయం తరలింపు ప్రతిపాదనను నిలిపివేయాలని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులకు అదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో త్వరలో అప్పటి జీవోలో పేర్కొన్న వాటిపై సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అదేశించినట్లు తెలుస్తోంది. -
చేపల వేటకు బ్రేక్
-
పసిడి పరుగుకు బ్రేక్!
డాలర్ బలోపేతం, లాభాల స్వీకరణ... న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయంగా మార్చి 31 శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి పరుగుకు కొంత బ్రేక్ పడింది. డాలర్ ఇండెక్స్ వారంలో 99.59 స్థాయి నుంచి తిరిగి 100.42 స్థాయికి చేరడం, గడచిన నెల రోజుల్లో ఔన్స్ కు దాదాపు 50 డాలర్ల పెరుగుదల కారణంగా ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించటం దీనికి ప్రధాన కారణం. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా) వారం వారీగా కేవలం 3 డాలర్లు పెరిగి 1,247 డాలర్లకు చేరింది. మార్చి 15న అమెరికా ఫెడ్– ఫండ్ రేటును 0.25 శాతం (0.75 శాతం – 1 శాతం శ్రేణికి) పెంచిన తరువాత, అనూహ్య రీతిలో డాలర్ బలహీనత– బంగారం బలోపేతం అయిన విషయం తెలిసిందే. కేవలం మూడు వారాల్లో పసిడి 30 డాలర్లకుపైగా పెరిగింది. డాలర్ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే ఆయన అనుసరించే ‘డాలర్ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడ్డాయి. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా డౌన్.. అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 31వ తేదీతో ముగిసిన వారంలో రూ.330 తగ్గి రూ.28,463కి చేరింది. అంతక్రితం రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.400 పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.120 తగ్గి రూ.28,775కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,625కి దిగింది. అంతక్రితం రెండు వారాల్లో స్పాట్ మార్కెట్లో ధర దాదాపు రూ.500 పెరిగింది. ఇక వెండి పెరుగుదల కొనసాగుతోంది. వారంలో కేజీ ధర రూ. 705 పెరిగి రూ.42,365కు పెరిగింది. అంతక్రితం గడచిన రెండు వారాల్లో ధర రూ.550కి పైగా ఎగిసింది. -
ట్రంప్ మెక్సికో గోడ అలోచనకు బీటలు
-
హ్యుందాయ్ ఐ10 కార్ల తయారీకి బ్రేక్
-
హ్యుందాయ్ ఐ10 కార్ల తయారీకి బ్రేక్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ఐ10 కార్ల తయారీని ఆపేసింది. ధర అధికంగా ఉన్న, అధునాతన కార్ల మోడళ్లపై దృష్టి సారిస్తున్నందున ఐ10 కార్లను ఇక తయారు చేయబోమని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఈ చిన్న కారును హ్యుందాయ్ కంపెనీ 2007లో మార్కెట్లోకి తెచ్చింది. దేశీయంగానూ, విదేశాల్లోనూ ఇప్పటిదాకా 16.95 లక్షల హ్యుందాయ్ ఐ10 కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో హ్యుందాయ్ స్థానాన్ని సుస్థిరం చేయడంలో ఐ10 కారుది కీలకపాత్ర. -
నిరుద్యోగుల ర్యాలీకి పోలీసుల అడ్డుకట్ట
-
నగదు రహితానికి బ్రేకులు
- ఆర్టీసీలో ‘స్వైప్’ టికెట్లకు చిక్కులు - ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భరం - లావాదేవీల్లో జాప్యంతో కార్డులను తిరస్కరిస్తున్న ఆర్టీసీ కర్నూలు (రాజ్‌విహార్): పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారు. ఆర్టీసీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలులోని బస్‌స్టేషన్‌కు ఎంతో పేరుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 24 గంటలు ప్రయాణికుల తాకిడి ఉన్న ఐదు బస్స్టేషన్లలో ఇదోకటి. ఈ బస్టాండ్ మీదుగా రోజుకు వెయ్యికి పైగా బస్సులు దూర ప్రాంతాలకు రాకపోకాలు సాగిస్తున్నాయి. 2003కు ముందు మ్యానువల్ (చేతి రాత పద్దతిలో) టికెట్లు ఇచ్చేవారు. ప్రయాణికుల సౌకర్యార్థం కర్నూలులో 2003 మార్చిలో ఓపీఆర్ఎస్ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కర్నూలుతోపాటు మంత్రాలయం, శ్రీశైలం, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, బనగానపల్లెలో రిజర్వేషన్ కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రతిరోజు హైదరాబాదుతోపాటు బెంగళూరు, తిరుపతి, చెన్నై, నెల్లూరు, విజయవాడ, ఒంగోలు, వేలూరు తదితర దూర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు 500 మంది వరకు ప్రయాణికులు టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అయితే నగదు సమస్య కారణంగా ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలకు ప్రజలు ముందుకు వస్తున్న సమయంలో ఆర్టీసీ టికెట్ల వద్ద నెలకొన్న సమస్యలు చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులపై స్వైప్ చార్జీల భారం స్వైపింగ్ ద్వారా ఆర్టీసీ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులపై భారం వేస్తోంది. టికెట్ ధరలపై ఒక శాతం మేరకు స్వైప్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటోంది. స్వైప్ చేసే ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భారం వేసి ఖజానా నింపుకుంటోంది. ఇటు వివిధ రకాల బ్యాంకుల కార్డులను స్వైపింగ్‌కు వినియోగించడం ద్వారా ప్రయాణికుల ఖాతాల నుంచి టికెట్ సొమ్ము ఆర్టీసీ/ అధికృత ఏజెంట్ల ఖాతాలోకి వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోందనే కారణంతో కార్డుల స్వైపింగ్‌ను నిరాకరిస్తున్నారు. ‘స్వైప్ మిషన్ పనిచేయడం లేదు’ అని చెప్పి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ రెండు సమస్యలతో ఆర్టీసీలో నగదు రహితానికి బ్రేకులు పడుతున్నాయి. ప్రోత్సహించాలి : ఎస్. షేక్షావలి, శరీఫ్ నగర్ ఇటీవలే బెంగళూరు వెళ్లేందుకు టికెట్ రిజర్వు చేసుకునేందుకు ఏటీఎం కార్డును స్వైప్ చేశాను. అయితే టికెట్ ధర కంటే రూ.7 అదనంగా బ్యాలెన్స్‌లో కట్ అయింది. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రయాణికులను ప్రోత్సహించకుండా భారం వేస్తే ఎలా. మిషన్ పని చేయడం లేదన్నారు : ఉమేష్, కర్నూలు చెన్నై వెళ్లేందుకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కోసం వచ్చా. డెబిట్ కార్డు ఉన్న కారణంగా నగదు తీసుకురాలేదు. అయితే రిజర్వేషన్ కౌంటరులో ఉన్న స్వైపింగ్ మిషన్ పనిచేయడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు మరోసారి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. లావాదేవీలకు సమయం పడుతోంది : పి. ప్రసాద్, ఏటీఎం, కర్నూలు బస్‌స్టేషన్. కర్నూలు బస్‌స్టేషన్‌లో ఉన్న స్వైప్ మిషన్ యాక్సిస్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అధీకృత ఏజెంట్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా ఉంది. ఈ బ్యాంకులు కాక ఇతర కార్డులు స్వైప్ చేస్తే ప్రయాణికుడి ఖాతా నుంచి ఏజెంట్‌కు వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోంది. డబ్బులు ఎక్కువగా కట్ అవుతున్నట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పైఅధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం. -
నగదు రహితానికి బ్రేకులు
- ఆర్టీసీలో ‘స్వైప్’ టికెట్లకు చిక్కులు - ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భరం - లావాదేవీల్లో జాప్యంతో కార్డులను తిరస్కరిస్తున్న ఆర్టీసీ కర్నూలు (రాజ్‌విహార్): పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారు. ఆర్టీసీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలులోని బస్‌స్టేషన్‌కు ఎంతో పేరుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 24 గంటలు ప్రయాణికుల తాకిడి ఉన్న ఐదు బస్స్టేషన్లలో ఇదోకటి. ఈ బస్టాండ్ మీదుగా రోజుకు వెయ్యికి పైగా బస్సులు దూర ప్రాంతాలకు రాకపోకాలు సాగిస్తున్నాయి. 2003కు ముందు మ్యానువల్ (చేతి రాత పద్దతిలో) టికెట్లు ఇచ్చేవారు. ప్రయాణికుల సౌకర్యార్థం కర్నూలులో 2003 మార్చిలో ఓపీఆర్ఎస్ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కర్నూలుతోపాటు మంత్రాలయం, శ్రీశైలం, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, బనగానపల్లెలో రిజర్వేషన్ కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రతిరోజు హైదరాబాదుతోపాటు బెంగళూరు, తిరుపతి, చెన్నై, నెల్లూరు, విజయవాడ, ఒంగోలు, వేలూరు తదితర దూర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు 500 మంది వరకు ప్రయాణికులు టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అయితే నగదు సమస్య కారణంగా ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలకు ప్రజలు ముందుకు వస్తున్న సమయంలో ఆర్టీసీ టికెట్ల వద్ద నెలకొన్న సమస్యలు చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులపై స్వైప్ చార్జీల భారం స్వైపింగ్ ద్వారా ఆర్టీసీ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులపై భారం వేస్తోంది. టికెట్ ధరలపై ఒక శాతం మేరకు స్వైప్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటోంది. స్వైప్ చేసే ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భారం వేసి ఖజానా నింపుకుంటోంది. ఇటు వివిధ రకాల బ్యాంకుల కార్డులను స్వైపింగ్‌కు వినియోగించడం ద్వారా ప్రయాణికుల ఖాతాల నుంచి టికెట్ సొమ్ము ఆర్టీసీ/ అధికృత ఏజెంట్ల ఖాతాలోకి వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోందనే కారణంతో కార్డుల స్వైపింగ్‌ను నిరాకరిస్తున్నారు. ‘స్వైప్ మిషన్ పనిచేయడం లేదు’ అని చెప్పి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ రెండు సమస్యలతో ఆర్టీసీలో నగదు రహితానికి బ్రేకులు పడుతున్నాయి. ప్రోత్సహించాలి : ఎస్. షేక్షావలి, శరీఫ్ నగర్ ఇటీవలే బెంగళూరు వెళ్లేందుకు టికెట్ రిజర్వు చేసుకునేందుకు ఏటీఎం కార్డును స్వైప్ చేశాను. అయితే టికెట్ ధర కంటే రూ.7 అదనంగా బ్యాలెన్స్‌లో కట్ అయింది. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రయాణికులను ప్రోత్సహించకుండా భారం వేస్తే ఎలా. మిషన్ పని చేయడం లేదన్నారు : ఉమేష్, కర్నూలు చెన్నై వెళ్లేందుకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కోసం వచ్చా. డెబిట్ కార్డు ఉన్న కారణంగా నగదు తీసుకురాలేదు. అయితే రిజర్వేషన్ కౌంటరులో ఉన్న స్వైపింగ్ మిషన్ పనిచేయడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు మరోసారి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. లావాదేవీలకు సమయం పడుతోంది : పి. ప్రసాద్, ఏటీఎం, కర్నూలు బస్‌స్టేషన్. కర్నూలు బస్‌స్టేషన్‌లో ఉన్న స్వైప్ మిషన్ యాక్సిస్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అధీకృత ఏజెంట్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా ఉంది. ఈ బ్యాంకులు కాక ఇతర కార్డులు స్వైప్ చేస్తే ప్రయాణికుడి ఖాతా నుంచి ఏజెంట్‌కు వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోంది. డబ్బులు ఎక్కువగా కట్ అవుతున్నట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పైఅధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం. -
ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్యానికి బ్రేక్
-
సీఐల బదిలీలు ఇప్పట్లో లేనట్టే!
సంవత్సరాంతం, సంక్రాంతి సంబరాలు, కోడిపందాల నేపథ్యంలో విరామం ∙ డిమాండ్ ఉన్న కీలక స్టేషన్లలో పోస్టింగులకు ముమ్మరంగా పైరవీలు కాకినాడ క్రైం : శాంతి, అంతర్గత భద్రత పరిరక్షణలో కీలకమైన పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్ల (సీఐ)ల బదిలీలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో సుమారు 40 మంది సీఐలు ఉన్నారు. వీరిలో 18 మంది పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, మరో 22 మంది దాకా స్పెషల్ బ్రాంచి, ఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్, ఏఆర్ సీఐలుగా పనిచేస్తున్నారు. వీరిలో సగం మందికి పైగా రెండేళ్లకు పైబడి సంబంధిత సర్కిల్ స్టేషన్లలో పనిచేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో డిసెంబర్ నెల్లో సీఐల బదిలీలు జరిగాయి. మరో వారం పదిరోజుల్లో బదిలీల సమయం దాటిపోవడంతో ఇప్పట్లో బదిలీలు జరిగే అవకాశం లేదని పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. డిసెంబర్లో బదిలీలైతే పిల్లల చదువుకు ఆటంకమని భావించి ఈ ప్రక్రియకు ఏలూరు రేంజ్ డీఐజీ వాయిదాకు అంగీకరించినట్లు సమాచారం. నూతన సంవత్సరం, సంక్రాంతి రోజులు రానుండడంతో పండుగకు ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు, జూదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాత వారిని బదిలీ చేసి కొత్తవారికి పోస్టింగ్‌లు ఇస్తే వారికి అయోమయంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఆశలపై నీళ్లు డిసెంబర్ నెల్లో బదిలీలు జరుగుతాయనే ఉద్దేశంతో కీలకమైన పోలీస్ స్టేషన్లలో పోస్టింగులు వేయించుకునేందుకు పలువురు సీఐలు ముమ్మర ప్రయత్నాలు చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు నిర్ణీత మార్గదర్శకాలకు లోబడి జరుగుతుంటాయి. పోలీస్ శాఖలో బదిలీలు అధికారుల పనితీరు, నేరపరిశోధన, లక్ష్యసాధన,ప్రవర్తన వంటి వాటిని ప్రామాణికంగా చేసుకుని ఉన్నతాధికారులు చేస్తూంటారు, దాంతో పాటూ ఇంటిలిజె¯Œ్స అందించే నివేదికలను బట్టి కూడా బదిలీలు జరుగుతూ ఉంటాయి. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఎన్నడూ లేని రీతిలో పోలీసు అధికారుల బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కీలక ప్రాధాన్యం ఏర్పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ సిఫారసు లేఖల కోసం ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. దాంతో ప్రతిభ, సామర్థ్యం ఉన్నా, ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖ కోరుకున్న స్టేషన్లలో పోస్టింగ్ సాధించుకోలేకపోతున్నామని వాపోతున్నట్లు తెలిసింది. సర్పవరం, కాకినాడ ఒకటో, రెండో పట్టణ పోలీస్ స్టేషన్లకు మంచి గిరాకీ ఉండడంతో ఇక్కడ పోస్టింగ్ కోసం నెలరోజులుగా పలువురు సీఐలు సిఫారసు లేఖల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పవరం ఎ¯ŒSహెచ్‌వో గా పనిచేస్తున్న సీఐ వీఆర్‌లోకి వెళ్లడంతో ఇక్కడ పోస్టు ఖాళీ ఏర్పడింది. దాంతో ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టు కోసం ముగ్గురు సీఐలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పోస్టింగ్ కోసం ఓ సీఐ ముందంజలో ఉన్నట్లు తెలిసింది. ఓ సీఐ ప్రత్యేక జీవో ద్వారా డీవో ఆర్డర్ తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన తర్వాత సదరు సీఐ సర్పవరం ఎస్‌హెచ్‌వోగా చేరతారనే ప్రచారం డిపార్టుమెంట్లో జోరుగా సాగుతోంది. -
కోల్ ఇండియా విభజనకు రంగం సిద్ధం?
-
కోల్ ఇండియా విభజనకు రంగం సిద్ధం?
న్యూఢిల్లీ: దేశీయ బొగ్గురంగంలో నెలకొన్నగుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇంధన భద్రత సమీక్షించి కోల్ ఇండియా మోనో పలికి చెక్ పెట్టే బాధ్యతను సీనియర్ భారత ప్రభుత్వ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై ఒక సంవత్సరంలోగా ఈ సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద కోల్ మైనర్ కోల్ఇండియా లిమిటెడ్‌ను విభజించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈ రంగంలో మోనోపలీ పెరిగిపోయిందని.. దీన్ని తగ్గించేందుకే ఈ చర్య తీసుకోనున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పినట్టు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ఇండియాను.. కేంద్రం ఏడు కంపెనీలుగా విభజించాలని భావిస్తోంది. ఈ రంగంలో మరింత పోటీ పెరగాలన్నా, ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్నా ఇది తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు నవంబరు 30 న ప్రధాని ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ప్రధాని నిర్ణయం ఆధారంగా మంత్రిత్వ శాఖ తన వైఖరిని సమీక్షించనుందని బొగ్గు మంత్రి పియూష్ గోయల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కోల్ ఇండియా విభజనను కార్మిక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధమైనా.. కోల్ఇండియా లాంటి అతి పెద్ద సంస్థను విడదీయడం అంత సులభం కాదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు కుదింపు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రాధాన్యత లాంటి అంశాలు కార్మికులకు ఆందోళనకరంగా మారనున్నాయన్నారు. అయితే ఈ అంచనాలపై ఆల్ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. చిన్న కంపెనీల నిర్వహణ సులభం అవుతుందని ఫెడరేషన్ ప్రతినిధి డీడీ రామానందన్ వ్యాఖ్యానించారు. కాగా కోల్ఇండియా విభజనపై ప్రధాని పగ్గాలు చేపట్టగానే మోడీ ఆరా తీశారని తెలుస్తోంది. ఈ చర్య ద్వారా మరింత సమర్ధవంతమైన మెరుగైన పని తీరును రాబట్టవచ్చని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 2014 లో కోల్ ఇండియా విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే కార్మిక సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గింది. ఈ తాజా ప్రతిపాదన 28 బిలియన్ డాలర్ల స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కోల్ ఇండియా చీలికకు దారి తీస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. మరోవైపు ఉత్పత్తిని పెంచేందుకు కోల్ ఇండియా కొత్త సాంకేతిక మెషినరీ కొనుగోలుకు బిలియన్ల డాలర్ల రూపాయలను వెచ్చిస్తోంది. -
చిత్రాడలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
పిఠాపురం రూరల్ : చిత్రాడ ఎస్సీ కాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గురువారం దళిత సంఘ నేతలు ఆందోళనకు దిగారు.నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం–కాకినాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వారితో సీఐ ఉమర్, ఎస్.ఐ. కోటేశ్వరరావు చర్చించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి నుంచి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌తో ఫో¯ŒSలో మాట్లాడారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే అరెస్టు చేయకుంటే దళితులకు మద్దతుగా ఆందోళనకు దిగుతానని దొరబాబు హెచ్చరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు పరిస్థితిని సమీక్షించారు. చిత్రాడ అంబేడ్కర్ యువజన సంఘ సభ్యుల ఫిర్యాదు మేరకు పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మాలమహానాడు సంఘ నేతలు ఆర్ఎస్ దయాకర్, దానం లాజర్‌బాబు, వర్థనపు కృష్ణవంశీ, దారా వెంకట్రావు, ఉలవల భూషణం, బోను దేవ, పచ్చిమళ్ల అప్పలరాజు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి గండేపల్లి బాబీ, సంయుక్త కార్యదర్శి కర్రి ప్రసాద్, నేతలు బొజ్జా రామయ్య, బత్తిన ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీరేట్లు ఇంతకన్నా తగ్గవా..?
• రెండున్నర ఏళ్లలో ఆర్బీఐ తగ్గించింది 1.75 శాతం • బ్యాంకులు తగ్గించింది కేవలం 0.8 శాతం లోపే • డిపాజిట్ రేట్లు తగ్గింపు 1.50 శాతం • ఇంతకంటే తగ్గే అవకాశం తక్కువే అంటున్న నిపుణులు సాక్షి, అమరావతి: వడ్డీరేట్ల తగ్గింపునకు ఇక బ్రేక్ పడనుందా? ఇంతకంటే వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు సన్నగిల్లుతున్నాయా? ఇప్పటికే డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇంతకంటే వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఆర్బీఐ తగ్గించిన వడ్డీరేట్లలో రుణ గ్రహీతలకు ఎంత మేరకు ప్రయోజనం లభించింది, డిపాజిట్ల రేట్లు ఇంకా తగ్గే అవకాశాలున్నాయా అన్న అంశాలను పరిశీలిస్తే... ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తున్నా ఆ మేరకు రుణాలకు చెల్లించే ఈఎంఐ భారం తగ్గడం లేదు. కానీ ఇదే సమయంలో డిపాజిట్ల రేట్లు మాత్రం భారీగా తగ్గిపోతున్నాయి. దీంతో రుణ భారం తగ్గకపోగా దాచుకుందామంటే సరైన వడ్డీ రాక రెండింటికీ చెడ్డ రేవడిలా మారింది సామాన్యుని పరిస్థితి. గడిచిన రెండున్నర ఏళ్లలో ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 1.75 శాతం వరకు తగ్గించింది. దీంతో వడ్డీరేట్లు తగ్గి ఈఎంఐల భారం తగ్గుతుందనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆర్బీఐ తగ్గించిన స్థాయిలో బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లును తగ్గించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 0.65 శాతం నుంచి 0.80 శాతమే బ్యాంకులు బేస్ రేటును తగ్గించాయి. అంటే ఆర్బీఐ తగ్గించిన దాంట్లో కనీసం 50 శాతం కూడా బ్యాంకులు అందించలేదన్నమాట. కానీ ఇదే సమయంలో డిపాజిట్ల రేట్లను మాత్రం బ్యాంకులు తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు చాలా బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను ఏడు శాతం మించి ఇవ్వడం లేదు. 2015లో మూడు నుంచి 10 ఏళ్ల కాలానికి డిపాజిట్ చేస్తే ఎస్బీఐ 8.5 శాతం వడ్డీరేటు ఇచ్చేది. కానీ ఇప్పుడు 7 శాతం మించి ఇవ్వడం లేదు. అంటే ఈ ఏడాదిన్నరలో డిపాజిట్లపై వడ్డీరేట్లు 1.50 శాతం తగ్గాయి. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే 1.8 శాతం వరకు డిపాజిట్ రేట్లను తగ్గించింది. ఎంసీఎల్ఆర్తో ఆలస్యం.. ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించినా ఖాతాదారులకు ఆ ప్రయోజనం తక్షణం ఇవ్వలేమని బ్యాంకులు పేర్కొంటున్నాయి. కొత్త డిపాజిట్లపై రేట్లు తగ్గినా గతంలో అధిక వడ్డీరేట్లకు ఇచ్చిన డిపాజిట్ల వల్ల ఆర్బీఐ తగ్గింపు ప్రయోజనం వెంటనే అందించలేమంటున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) విధానంలో ఈ ప్రయోజనం పూర్తిస్థాయిలో బదలాయించడానికి కనీసం ఆరు నెలలు పడుతుందన్నది బ్యాంకుల వాదన. ఆర్బీఐ తగ్గించిన వడ్డీరేట్ల ప్రయోజనాన్ని ఖాతాదారులకు పూర్తిగా అందించకుండా ఎన్పీఏలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాయన్నది విశ్లేషకుల వాదన. పీఎస్‌యూ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు ఏడాది కాలంలో 5.3 శాతం నుంచి 10.4 శాతానికి చేరడం, కేంద్రం తగినంత మూలధన నిధులు ఇవ్వకపోతుండటంతో ఆర్బీఐ తగ్గింపు ప్రయోజనాన్ని ఎన్పీఏలు తగ్గించుకోవడానికి వినియోగించుకుంటున్నాయని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు. అధిక వడ్డీ మార్జిన్‌తో పాటు, వడ్డీరేట్లు తగ్గడం వల్ల బాండ్స్ ఈల్డ్స్ పెరగడం ద్వారా క్యాపిటల్ గెయిన్ లాభాలను బ్యాంకులు పొందుతున్నాయన్నారు. ఇక తగ్గడం కష్టమే.. ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి చేరడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లు మరింతగా తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం ఇంతకంటే దిగువకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని, దీంతో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు కె.నరసింహమూర్తి తెలిపారు. వచ్చే 12 నెలల కాలంలో మహా అయితే పావు శాతం మించి తగ్గే అవకాశం లేదని సతీష్ కంతేటి అభిప్రాయపడ్డారు. కేవలం డిపాజిట్లనే ప్రధాన ఆదాయవనరుగా ఎంచుకునే పెన్షనర్స్ వంటి వారిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రముఖ బ్యాంకరు కె.వి.కామత్ పేర్కొంటున్నారు. కానీ రానున్న కాలంలో డిపాజిట్ల రేట్లు మరింత తగ్గకపోయినా రుణాలపై ఈఎంఐ భారం మరింకొంత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఆర్బీఐ తగ్గించిన మొత్తం ప్రయోజనాన్ని అందించలేకపోయినా ఇంకో 0.25 శాతం నుంచి 0.5 శాతం వరకు బ్యాంకులు క్రమేపీ తగ్గించే అవకాశాలున్నాయని సతీష్ అంచనా వేస్తున్నారు. యుద్ధ వాతావరణం వంటి అనుకోని సంఘటనలు వస్తే తప్ప వడ్డీరేట్లు పెరిగే అవకాశం లేదని, మరికొంత కాలం దిగువస్థాయిలోనే వడ్డీరేట్లు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. -
టోకు ద్రవ్యోల్బణం @3.57 శాతం
• వరుసగా ఏడు నెలల పెరుగుదలకు బ్రేక్ • ఆహారోత్పత్తుల ధరలు తగ్గడమే కారణం • ద్రవ్యోల్బణం తగ్గుతోంది.. రేట్లలో కోత విధించండి • పారిశ్రామిక వర్గాల డిమాండ్ న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం గత నెలలో 3.57 శాతానికి తగ్గింది. గత ఏడు నెలలుగా పెరుగుతూ వచ్చిన టోకుధరల(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది సెప్టెంబర్‌లో తగ్గింది. వర్షాలు బాగా కురవడం వల్ల ఆహారోత్పత్తుల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. ఈ ఏడాది ఆగస్టులో 3.74 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్‌లో 3.57 శాతానికి తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇది మైనస్ 4.59 శాతంగా ఉంది. కాగా గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్టానికి తగ్గి 4.31 శాతానికి చేరింది. రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణాలు తగ్గడంతో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి పెరుగుతోంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉన్నందున బ్యాంక్‌లు వడ్డీరేట్లను తగ్గించాలని, ఫలితంగా నిరాశజనకంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి జోరు పెరుగుతుందని ఫిక్కీ కోరుతోంది. ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే సరఫరా సంబంధిత చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం విజయవంతం అయిందని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చిందని సీఐఐ పేర్కొంది. ⇔ టోకు ధరల ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెరుగుతూ వస్తోంది. గత నెలలో పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలోనే, 23.99 శాతంగా ఉంది. ఇక కూరగాయల ఆధారిత డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మైనస్ 10.91 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో ఇది గరిష్ట స్థాయిలో 28.45 శాతంగా ఉంది. మొత్తం మీద ఆహార ద్రవ్యోల్బణం 5.75 శాతానికి తగ్గింది. ఆగస్టులో ఇది 8.23 శాతంగా ఉంది. ఆహార పదార్ధాల ధరలు తగ్గడం వల్ల రిటైల్, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణాలు తగ్గాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. వచ్చే నెలలో కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
పోలవరం నిర్మాణ పనులకు బ్రేక్
-
కలెక్టరేట్ పనులకు అడ్డంకి
కార్యాలయం ఖాళీ చేయని పంచాయతీరాజ్ మరమ్మతులకు అడ్డంకిగా మారిన వైనం జగిత్యాల అర్బన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా జగిత్యాల జిల్లా దసరాకు ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు కార్యాలయాల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. జగిత్యాలలోని పంచాయతీరాజ్ శాఖ భవనాన్ని కలెక్టరేట్ కోసం, గెస్ట్‌హౌస్‌ను కలెక్టరేట్ సిబ్బంది కోసం కేటాయించారు. వీటి మరమ్మతులకు రూ.11 లక్షలు మంజూరు కాగా కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులను మొదలుపెట్టారు. పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం కోసం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను అప్పగించారు. అయితే పంచాయతీరాజ్ అధికారులు తమ కార్యాలయాన్ని ఖాళీ చేయకపోవడంతో మరమ్మతులకు అడ్డంకిగా మారింది. పంచాయతీరాజ్ శాఖ భవనం జీ ప్లస్ వన్ కలిగి ఉంది. పైన కలెక్టర్ చాంబర్‌తో పాటు కాన్ఫరెన్స్‌హాల్, ఇతర సిబ్బందికి కేటాయించారు. ఈ పనులన్నీ వేగవంతంగా చేస్తున్నారు. కలెక్టర్ చాంబర్ కోసం నూతన కిటికీలు, తలుపులు ఏర్పాటు చే స్తున్నారు. పైన చకచకా పనులు జరుగుతున్నప్పటికీ... కింది ఫ్లోర్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం ఖాళీ చేయలేదు. ఆ శాఖ అధికారులు మాత్రం తమకు షిఫ్టింగ్ ఆర్డర్స్ రాలేదని, ఆర్డర్స్ వస్తేనే ఖాళీ చేస్తామని పేర్కొంటున్నారు. ఇంతవరకు కలెక్టరేట్ కార్యాలయం నుంచి షిఫ్టింగ్‌కు సంబంధించి నోటీసులు రాలేదని తెలిసింది. దీంతో ప్రహారీతోపాటు గేట్లు తదితర మరమ్మతులు చేపడుతున్నారు. గోడలకు రంగులు వేస్తున్నారు. సోమవారం సబ్‌కలెక్టర్ శశాంక పంచాయతీరాజ్ శాఖ అధికారులను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించినా స్పందన కనిపించలేదు. దసరాకు ఇంకా ఐదు రోజులు రోజుల సమయమే ఉంది. ఒకవైపు గడువు ముంచుకొస్తుంటే మరమ్మతులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎలాంటి మరమ్మతులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ ఈఈ చాంబర్‌ను డీఆర్వోకు కేటాయించనున్నట్లు తెలిసింది. మిగతా గదులను కలెక్టరేట్ సిబ్బంది కోసం కేటాయించనున్నారు. అన్ని శాఖలు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లోనే.. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి కేటాయించిన ఆర్‌అంబీ గెస్ట్‌హౌస్‌లోనే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఆయూష్, పబ్లిక్ హెల్త్, ఏడీ గ్రౌండ్‌వాటర్, ఏడీ ఇండస్ట్రీస్, ఏడీ మైన్స్ అండ్ జియోలజీ, ఎస్ఈ రూరల్ వాటర్ సపై ్ల కార్యాలయాలకు సైతం కేటాయించారు. ఇటీవల ఏడీ గ్రౌండ్‌వాటర్ శాఖ వారు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు తాళం వేసుకుని వచ్చారు. ఇన్ని శాఖలు ఇందులోనే ఉండటంతో ఈ కార్యాలయం మాదంటే మాదని లొల్లి జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ అధికారులు అక్కడికి షిఫ్ట్ కావడం లేదని తెలిసింది. -
ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్‌మానేరుకు గండి
నిర్వాసితులపై సమస్యలపై ఆందోళన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి బోయినపల్లి : ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్టకు గండి పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం మిడ్‌మానేరు రిజర్వాయర్ గండిని పరిశీలించారు. బోయినపల్లి మండలం మాన్వాడ, సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామాల్లోని ముంపు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంబంధిత కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేసినా కమీషన్ల కక్కుర్తితో పాలకులు పట్టించుకోలేదన్నారు. దీంతో కట్ట నిర్మాణంలో నాణ్యత లోపించి గండి పడిందన్నారు. నాలుగు టీఎంసీల నీరు వథాగా పోయిందని, వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో ముంపు గ్రామాల్లోకి నీళ్లు వచ్చాన్నారు. ఒక్కో కుటుంబం రూ.10వేలు ఖర్చు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయన్నారు. ప్రభుత్వం వెంటనే మిడ్‌మానేరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు వరద బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పదిరోజుల్లో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే సీపీఐ ఆధ్వర్యంలో కలక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్‌రెడ్డి, గుండా మల్లేశ్ తదితరులున్నారు. -
డీబీఎం13 ఉపకాలువకు గండి
పరిశీలించిన డీఈ శంకరపట్నం : మండలంలోని మొలంగూర్ గ్రామశివారులో డీబీఎం13 ఉపకాలువకు బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు గండి పెట్టారు. ఈ విషయంలో గ్రామస్తులు ఫిర్యాదు చేయగా ఎస్సారెస్పీ డీఈ కవిత కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. మొలంగూర్ గ్రామపంచాయతీ పరిధిలో గుడాటిపల్లె చెరువును నింపేందుకు గండిపెట్టి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలువలకు గండిపెట్టడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందే అవకాశం ఉండదని స్థానికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు. కాలువకు మరమ్మతులు చేస్తామని డీఈ తెలిపారు. గండిపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజాపూర్ సర్పంచ్ రెడ్డి గట్టుస్వామి, ఉపసర్పంచ్ లింగారెడ్డి అధికారులను కోరారు. -
మిషన్ చెరువుకు గండి
‘మిషన్ కాకతీయ’లో నాణ్యతకు పాతర గంటల్లో వెళ్లిపోయిన నీరు విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు ధ్వంసం కొట్టుకుపోయిన గంగమ్మ ఆలయం ఆందోళన చెందుతున్న రైతులు ముస్తాబాద్: ముస్తాబాద్ పెద్దచెరువుకు మంగళవారం గండిపడింది. గంటల వ్యవధిలో చెరువులోని నీరంతా ఖాళీ అయింది. పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. సుమారు 200 ఎకరాల్లోని వరిపొలాలు నీటిపాలయ్యాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, పోత్గల్‌లోని గంగమ్మ ఆలయం కొట్టుకుపోయాయి. సిద్దిపేట–ముస్తాబాద్ వంతెన తెగిపోయింది. కట్టకవింద నిర్మిస్తున్న శ్మశానవాటిక ధ్వంసమైంది. గ్రామానికి చెందిన రాగం భిక్షపతి, నిమ్మ ప్రవీణ్‌కు చెందిన రెండు గేదెలు గల్లంతయ్యాయి. చెరువు అడుగున బండరాళ్లు ఉండడంతో కట్ట బలహీనంగా మారి గండిపడిందని ఈఈ చిరంజీవులు తెలిపారు. అన్నదాతల ఆశలకు గండి అన్నదాతల ఆశలు అడియాసలయ్యాయి. 24 ఏళ్ల తర్వాత నిండిన చెరువు చూస్తుండగానే ఖాళీ అయ్యింది. చాలా రోజుల తర్వాత జలకళ సంతరించుకున్న చెరువును చూసి మండలవాసులు ఆనందపడ్డారు. సాగు, తాగునీటికి ఢోకాలేదని నిశ్చింతంగా ఉన్నారు. కానీ.. వారి ఆనందం ఎంతో కాలం నిల్వలేదు. నిజాం కాలంనాటి చెరువు ఏనాడు చెక్కుచెరదలేదు. ఇటీవల మిషన్ కాకతీయ పథకంలో ఈ చెరువును చేర్చి మరమ్మతులు అంటూ పనులు చేపట్టారు. పనులు ఎలా చేపట్టారో దేవుడెరుగు. ఏళ్లతరబడి చెక్కుచెదరని చెరువు అలా నిండి ఇలా ఖాళీ అయింది. రబీకు ఇబ్బంది లేదనుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. రైతులు, నాయకుల ఆందోళన మిషన్ కాకతీయలో భాగంగా రూ.47 లక్షలు వెచ్చించి చేపట్టిన పనులు నాసిరకంగా ఉండడంతోనే పెద్దచెరువుకు గండిపడిందని రైతులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ కక్కుర్తితో ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కట్టకు ఉన్న రివిట్మెంట్ను తొలగించారని.. కనీసం కట్టపై మట్టిపోసి రోలర్లతో తొక్కించలేదని ఆరోపించారు. ‘మిషన్ కాకతీయ’ కమీషన్ల పథకంగా మారిందని ఆరోపించారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రావు, ఎంపీటీసీ గజ్జెల రాజు, అఖిలపక్షం నాయకులు తిరుపతి, రాములు, రాంగోపాల్, చాకలి రమేశ్, చింతోజు బాలయ్య, కార్తీక్, మహేశ్‌రెడ్డి, రాజిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఉపేంద్ర, రైతులు పాల్గొన్నారు. ఎవరిదీ పాపం? రెండు దశాబ్దాల తర్వాత నిండిన చెరువును చూసి ముస్తాబాద్ వాసులు మురిసిపోయారు. మూడు రోజుల క్రితమే పెద్ద చెరువుకు పలుచోట్ల లీకేజీలు ఉన్నాయని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. చెరవుకు గండిపడేవరకు చూశారు. రైతులను నిండా ముంచారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేదికాదని పలువురు పేర్కొంటున్నారు. -
కాకతీయ కాల్వకు గండి
-
కాకతీయ కాల్వకు గండి
మల్యాల/పెగడపల్లి/గొల్లపల్లి: కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాకతీయ కాల్వకు మంగళవారం ఉదయం భారీ గండిపడింది. దీంతో మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో గల చెరువులు నిండి, గండ్లు పడటంతోపాటు సుమారు 1,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పలుచోట్ల రోడ్లపై నీళ్లు రావటంతో రాకపోకలు స్తంభించాయి. మానాల గ్రామం దమ్మక్క చెరువులోకి నీళ్లు వెళ్లే తూము డీ-65 వద్ద కాకతీయ ప్రధాన కాల్వకు ఈ గండిపడింది. దీంతో దమ్మక్క చెరువు నిండి సమీప పొలాలు నీటమునిగాయి. మానాల, మ్యాడంపల్లిల్లో వెయ్యి ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దమ్మక్క చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి చేరాయి. ఈ కాలనీకి చెందిన 300 కుటుంబాలను అధికారులు తక్కళ్లపల్లిలో ఏర్పాటు చేసి న శిబిరానికి తరలించారు. ఎమ్మెల్యే బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సారెస్పీ గేట్లు మూసివేయడంతోపాటు నీటి ఉధృతి తగ్గించేందుకు పలుచోట్ల తూముగేట్లు తెరిచారు. సాయంత్రం మ్యాడంపల్లిలోని కల్వర్టు తెగి.. గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు గండి పూడ్చే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. పెగడపల్లి మండలం సుద్దపల్లి కోయ చెరువు నిండి గండి పడింది. ఆదుకుంటాం: ఈటల, చీఫ్‌విప్ కొప్పుల ఎస్సారెస్పీ కాల్వకు గండి పడటంతో పంటలు నష్టపోరుున రైతులతోపాటు ఇతరత్రా నష్టపోరుున బాధితులను ఆదుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఎస్సారెస్పీ కాలువ డీ-65 తూము గండిని ఆయన పరిశీలించారు. మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలో నీళ్లు చేరిన ఇళ్లను పరిశీలించారు. పునరావాస శిబిరంలో ఉన్న బాధితులను పరామర్శించారు. చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో పరిస్థితిని సమీక్షించి, అధికారులను అప్రమత్తం చేశారు. రైతులను ఆదుకుంటామన్నారు. -
స్మార్ట్‌సిటీకి ‘బ్రేక్’
కన్సల్టెన్సీ నియామకంపై హైకోర్టు స్టే కాకినాడలో ఎక్కడిపనులు అక్కడే కాకినాడ: స్మార్ట్‌సిటీ పనులకు బ్రేక్ పడింది. కన్సల్టెన్సీ నియామకంలో ఎదురైన అభ్యంతరాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో కాకినాడ స్మార్ట్‌సిటీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముంబాయికి చెందిన వాడియా టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. రానున్న నాలుగేళ్ళలో రూ.1500 కోట్ల విలువైన పనులకు సంబంధించి అన్ని ప్రక్రియలకు అవాంతరం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే... స్మార్ట్‌సిటీ నిధులతో జరిగే పనులకు సంబంధించి పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టు, అంచనాల తయారీ, పనుల్లో లోటుపాట్లు, సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు కావాల్సి ఉంది. ఇందుకు ఆర్థిక, సాంకేతిక పరమైన అంశాల్లో అనుభవం కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ కొద్ది రోజుల క్రితం స్మార్ట్‌సిటీ పేరిట టెండర్ పిలిచారు. సుమారు ఏడు సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయి. వీటిలో ఆరు సంస్థలు అర్హత కలిగినవిగా గుర్తించి ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థను పరిగణనలోకి తీసుకోవాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం కలెక్టర్ అధ్యక్షతన కార్పొరేషన్ కమిషనర్‌తోపాటు వివిధశాఖలకు చెందిన తొమ్మిది మంది సీనియర్ అధికారులతో కూడిన కమిటీ ముందు ప్రతిపాదనలు ఉంచారు. కన్సల్టెన్సీ నియామకంపై తుది నిర్ణయం తీసుకునేలోపు వాడియా సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం కన్సల్టెన్సీ నియామకానికి ఖరారవుతున్న ఆర్వీ అసోసియేట్స్‌పై సాంకేతికపరమైన అభ్యంతరాలను లేవనెత్తింది. దీంతో కన్సల్టెన్సీ నియామకంపై స్టే ఇస్తూ రాష్ట్ర హైకోర్టు కాకినాడ నగరపాలక సంస్థకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తొలి విడతగా విడుదలైన రూ.382 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న తరుణంలో కోర్టు ఉత్తర్వులు అందడంతో ప్రస్తుతం స్మార్ట్‌సిటీ పనులకు బ్రేక్ పడింది. స్మార్ట్‌సిటీ పనులు ముందుకు సాగాలంటే ప్రతిపాదిత పనులన్నీ కన్సల్టెన్సీ ద్వారా మాత్రమే జరగాల్సి ఉంది. ఈ నియామకానికి బ్రేక్ పడడంతో స్మార్ట్‌సిటీ పనులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే దీనిపై నగరపాలక సంస్థ రాష్ట్ర హైకోర్టుకు తన వాదనను వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇవన్నీ క్లియర్ అయితే తప్ప స్మార్ట్‌సిటీ పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడంలేదు. -
లాహిరి లాహిరికి.. బ్రేక్
నిలిచిన పాపికొండల విహారం నిబంధనల ప్రకారం లేని బోట్లు రోజుకు రూ.3 లక్షల నష్టం సాక్షి, రాజమహేంద్రవరం : నిబంధనల ప్రకారం లేవని పాపికొండల పర్యాటక బోట్లను అధికారులు కొద్ది రోజులుగా నిలిపివేశారు. దీంతో పాపికొండలు పర్యాటక ప్రాంతానికి వెళ్లేవారి ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టయింది. పక్షం రోజుల క్రితం దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద ఓ లగ్జరీ బోటుకు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో బోటుకు కన్నం పడి అందులోకి నీరు చేరింది. నది ఒడ్డుకు చేరువలోనే ఈ ప్రమాదం జరగడంతో పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనతో గోదావరిలో పాపికొండల పర్యటనకు వెళ్లే లగ్జరీ ఏసీ బోట్లు, లాంచీలను అధికారులు నిలిపివేశారు. నిబంధనల ప్రకారం బోటులో పర్యాటకుల రక్షణకు సంబంధించి అన్ని ప్రమాణాలూ ఉంటేనే అనుమతివ్వాలని నిర్ణయించారు. ప్రతి బోటులో రెండు ఇంజన్లు, లైఫ్ జాకెట్లు, బోటు, పర్యాటకులకు బీమా, నది లోతును కొలిచే యంత్రం, మత్స్యశాఖ ఇచ్చే సర్టిఫికెట్ ఉన్న డ్రైవర్ ఉండి తీరాలని అధికారులు నిబంధనలు విధించారు. ఈ నేపథ్యంలో పర్యాటక బోట్లకు బ్రేక్ పడింది. ఆర్థిక స్తోమతనుబట్టి బోట్ల నిర్మాణం పాపికొండల పర్యాటకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ నిర్దిష్టమైన నిబంధనలేవీ లేకుండానే పలువురు తమ ఆర్థిక స్తోమతనుబట్టి లగ్జరీ బోట్లను నిర్మించుకున్నారు. ప్రస్తుతం గోదావరిలో 53 బోట్లు పాపికొండల పర్యాటకానికి వెళుతున్నాయి. ఇందులో మూడు మాత్రమే రెండు ఇంజన్లు ఉన్న బోట్లు ఉన్నాయి. మిగతా వాటికి రెండో ఇంజన్ ఏర్పాటు చేసుకోవడం, ఇతర అనుమతులు లభించాలంటే మరో 20 రోజులు సమయం పట్టనుంది. పర్యాటకంపై ప్రభావం.. పర్యాటకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిబంధనలు విధించడం హర్షించదగ్గ పరిణామమే అయినా.. అన్ని బోట్లనూ నిలిపివేయడంతో పర్యాటకం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో ప్రతి రోజూ సుమారు 500 మంది పర్యాటకులు పాపికొండల పర్యాటకానికి వెళుతున్నారు. బోట్లను నిలిపివేయడంతో తమకు ప్రతి రోజూ రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లుతోందని బోట్ల యజమానులు వాపోతున్నారు. ఇదే సీజన్లో అయితే నాలుగు రెట్లు ఉంటుందని అంటున్నారు. బోట్లు నిలిచిపోవడంతో వాటిల్లో పని చేస్తున్న సిబ్బందికి, పర్యాటకులను రాజమహేంద్రవరం నుంచి పట్టిసీమ, పోలవరం, పురుషోత్తపట్నం తరలించే వాహనదారుల ఉపాధికి కూడా గండిపడింది. పాపికొండల విహారానికి వచ్చే పర్యాటకులు బోట్లు అందుబాటులో లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. బోట్లను రద్దు చేసిన అధికారులు ప్రత్యామ్నాయంగా ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్న పెద్ద బోటును ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. డైలమాలో లాంచీల యజమానులు పాపికొండల పర్యటనకు వెళ్లే లాంచీలకు, బోట్లకు ఒకే విధానం ప్రకటించడంతో లాంచీల యజమానులు డైలమాలో పడిపోయారు. అసలే చిన్న లాంచీలు కావడం వాటిలో రెండో ఇంజను ఏర్పాటు చేయడంలో సాధ్యసాధ్యాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. నిబంధనల ప్రకారం బోటును సిద్ధం చేయాలంటే ఒక్కోదానికి రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు. పర్యాటకుల భద్రత కోసమే.. ఉభయ గోదావరి జిల్లాల్లో పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లు 53 ఉన్నాయి. ఇందులో మూడు బోట్లు మాత్రమే నిబంధనల ప్రకారం ఉన్నాయి. రెండో ఇంజన్ బోటు బయటవైపు ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. పర్యాటకుల భద్రత కోసమే ఈ నిబంధనలు పెట్టాం. ప్రధాన ఇంజన్ మరమ్మతులకు గురై నది మధ్యలో బోటు ఆగిపోతే రెండో ఇంజన్ ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో నిర్మించే బోట్లకు రెండు ఇంజన్లు ఉంటేనే అనుమతిస్తాం. ఎస్కార్ట్ పెట్టుకుంటామని బోట్ల యజమానాలు విన్నవిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – జి.భీమశంకరరావు, ప్రత్యేక అధికారి, అఖండ గోదావరి ప్రాజెక్టు === 08ఆర్జేసీ1001 : పర్యాటక బోటు -
బ్రేక్ఇన్స్పెక్టర్ అరెస్టు
కాకినాడ రూరల్ : ఏసీబీ దాడుల్లో పట్టుబడిన బ్రేక్ఇన్స్పెక్టర్ రావు అప్పారావును అరెస్టు చేశారు. కాకినాడ డీటీసీ కార్యాలయంలో బ్రేక్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న రావు అప్పారావు ఇంటిపైన, అతని స్నేహితులు, బంధువుల ఇళ్లపైన గురువారం రెండోరోజు కూడా ఏసీబీ అధికారులు దాడులు కొనసాగాయి. అతని డ్రైవర్ శ్రీనివాస్, బినామీగా ఉన్న బొడ్డు రామారావు, సత్యనారాయణలను వారి వారి ఇళ్ల వద్దే ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఈ దాడుల్లో పట్టుబడిన పలు పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు, బంగారు, డబ్బు సీజ్ చేసి అప్పారావును అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. అప్పారావును విజయవాడ కోర్టుకు తరలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో తాము పరిశీలించిన వడ్డీలకు ఇచ్చిన అప్పులు రూ. 2 కోట్లు పైబడి ఉన్నాయన్నారు. -
మాచినేనిపల్లి పెద్దచెరువుకు గండి
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండలం మాచినేనిపల్లి పెద్దచెరువుకు మంగళవారం గండిపడింది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా చెరువు నిండింది. మంగళవారం మధ్యాహ్నం చెరువు వద్దకు వెళ్లిన రైతులు గండిపడిన విషయాన్ని గమనించారు. సమాచారాన్ని నీటిపారుగల శాఖ అధికారులకు తెలిపి గండి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అబ్బిరెడ్డిగూడెం మేజర్‌కు గండి
గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం మేజర్ కాలువకు గండి పడింది. దీంతో సమీప పంట పొలాల్లోకి భారీగా నీరు చేరుతోంది. స్థానిక రావిచెట్టు దగ్గర మేజర్‌కు సోమవారం తెల్లవారుజామున గండిపడింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఎస్ఆర్ఎస్సీ కాలువకు గండి
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామం వద్ద ఎస్ఆర్ఎస్సీ కాలువకు ఆదివారం ఉదయం గండి పడింది. ఫలితంగా నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. గమనించిన స్థానికులు గండి పూడ్చేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. దీంతో స్థానికులు సమాచారాన్ని నీటిపారుదల అధికారులకు తెలియజేశారు. -
నాగావళి ఎడమ కాలువకు గండి
వీరఘట్టం: శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నర్సీపురం దగ్గర నాగావళి ఎడమ కాల్వకు గురువారం ఉదయం భారీ గండి పడింది. సైపూన్ వద్ద కాలువకు గండి పడటంతో.. నీరు పంటపోలాల్లోకి వెళ్తోంది. దీంతో సుమారు 50 వేల ఎకరాలకు అందాల్సిన సాగు నీరు వృథాగా పోతోంది. విషయం అధికారులు దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్సారెస్పీ కెనాల్‌కు అడ్డుగోడ?
సింగరేణి..ఎస్సారెస్పీ అధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుతో కుంగిన కాలువ నీటి ప్రవాహంతో ప్రమాదమని భావిస్తున్న సింగరేణి ఎల్–6 పరిధిలోని 12 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం మంథని(కరీంనగర్) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్–6 కెనాల్‌కు అడ్డుగోడ నిర్మించేందుకు సింగరేణి, ఎస్సారెస్పీ అధికారులు పరస్పరం ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే విషయం బయటకు పొక్కితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని సింగరేణి అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారి వెంట ముత్తారం మండలం రాజాపూర్ నుంచి మంథని మండలంలోకి ఎల్–6 కెనాల్ ప్రవేశిస్తుంది. ఈ కెనాల్ ద్వారా 10 గ్రామాల్లోని సుమారు 12 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. కాలువకు సమీపంలోనే అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఉంది. సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా రూ.1250 కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టుకు సమీపం నుంచే కాలువ ఉండడం ప్రమాదమని గుర్తించిన సింగరేణి ప్రత్యామ్నాయంగా కాలువను మళ్లించేందుకు సిద్ధమై ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలివేసింది. ఐతే అడ్రియాల గ్రామ శివారులోని పెద్ద మోరీ నుంచి సుమారు 1.5 కిటోమీటర్ మేర కాలువ కుంగిపోవడంతో నీరు ముందు సాగడంలేదు. కాలువకు నీరు వదిలితే ముందున్న పంటలకు నీరు పారే పరిస్థితి లేదు. నీరంతా అడ్రియాల సమీపంలోని కల్వర్టు వద్ద వృథాగా పోతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో లోతుగా బొగ్గును వెలికితీయడంతో కాలువ కుంగిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువ ద్వారా నీరు పారితే ప్రాజెక్టులోకి నీటి ఊట వచ్చి ప్రమాదముందని సింగరేణి సైతం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎల్–6 కెనాల్ ప్రారంభంలోనే అడ్డుగోడ నిర్మించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సీజన్లో కాలువ కింద పంట పొలాలకు క్రాప్ హలీడే ప్రకటించి కొంతమేర నష్టపరిహారం చెల్లించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
ఎస్సారెస్పీకాలువకు గండి
కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలం నగునూరుశివారులో డి–89 ఎస్సారెస్పీ కాలువకు కొందరు రైతులు గండికొట్టడం వివాదస్పదంగా మారింది. గ్రామ సమీపంలోని కాలువకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన రైతులు గురువారం తెల్లవారు జామున గండికొట్టారు. కాలువ వద్దే రైతులు పెద్దసంఖ్యలో మోహరించి చెరువుకు నీటిని తరలించడంతో చివరి ఆయకట్టు గ్రామాలకు నీళ్లందని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులకు అక్రమ నీటితరలింపుపై ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. -
పడవ ప్రయాణానికి బ్రేకులు
కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల్లో భాగంగా సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి పడప ప్రయాణానికి బ్రేక్ పడినట్లు సమాచారం. భద్రతా కారాణాలతో ఇప్పటికే శ్రీశైలంలో రోప్‌వే, బోటింగ్‌ను నిలుపుదల చేశారు. సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి బోటింగ్ సదుపాయం లేకపోవడం, శ్రీశైలంలో రోప్‌వే, బోటింగ్ సదుపాయం బంద్ కావడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి ఆశాజనకంగా నీరు రావడంతో సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి రెండు మర పడవలను నడుపుతున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఇందు కోసం 50 సీట్ల సామర్థ్యం ఉన్న రెండు పడవలను కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు పర్యాటక సంస్థ అధికారులు రాజమండ్రి నుంచి 10 సీట్ల సామర్థ్యం ఉన్న పడవను తెప్పించి సిద్ధం చేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పడవ ప్రయాణానికి బ్రేకులు వేసినట్లు పర్యాటక శాఖ అధికారలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. సంగమేశ్వరంలో పుడ్ కోర్టు పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికి సా..గుతూనే ఉన్నాయి. -
కాలువ గండిపై విచారణ జరిపించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి సీతారామపురం(నూజివీడు) : పోలవరం కుడి కాలువకు పడిన గండి విషయంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. పోలవరం కుడి కాలువ అండర్‌టన్నెల్‌కు గండి పడిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. కాలువ ఎస్ఈ వై.శ్రీనివాసయాదవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్థసారథి మాట్లాడుతూ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, వాస్తవాన్ని వదిలేసి విద్రోహులు చేశారంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి పడి ఆరురోజులవుతున్నా ఇప్పటి వరకు శాఖాపరమైన విచారణ చేయించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. విద్రోహుల పనే అయితే ఈ గండి ద్వారా నీళ్లు ఎక్కడికి వెళ్లాయి, ఎవరికి లబ్ధిచేకూరిందనే దానినైనా గుర్తించారా అని ప్రశ్నించారు. నీళ్లతో రెండు వేల ఎకరాల్లోని చేపల చెరువులను నింపుకున్నారని, దీనిని ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాలువకు గండి పడినప్పుడు ప్రాథమిక నివేదికను అధికారులు ఇవ్వాలని, ఇది ఎవరి వైఫల్యమో తేల్చి చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం ఈ గండి పై నోరుమెదపక పోవడాన్ని బట్టే దీని వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. ప్రజలసొమ్ము అంటే ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని, ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. పార్థసారథి వెంట గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు, బాపులపాడు జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కోడెబోయిన బాబి, జిల్లా కార్యదర్శి నక్కా గాంధీ, ఎంపీటీసీలు బేతాల ప్రమీలారాణి, కొనకళ్ల వెంకటేశ్వరరావు ఉన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు పోలవరం కుడికాలువపై రామిలేరుపై ఉన్న యూటీకి పడిన గండిని పూడ్చేందుకు గాను యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గండి పూడ్చివేత పనులను శనివారం పరిశీలించారు. అండర్‌టన్నెల్ స్లాబ్‌ను ఆనుకుని చేస్తున్న ఆఫ్రాన్ త్వరితగతిన పూర్తిచేయాలని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ రమేష్‌బాబులను ఆదేశించారు. పనులన్నీ పూర్తయిన తరువాత మరల పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసి కృష్ణాడెల్టాకు గోదావరి జలాలను అందించనున్నట్లు చెప్పారు. ఉమాతో పాటు పోలవరం కాలువ ఎస్ఈ వై.శ్రీనివాస్ యాదవ్, జల వనరులశాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, కృష్ణా తూర్పుడెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ ఉన్నారు. -
గండి పూడ్చివేతకు మరో రెండు రోజులు!
సీతారామపురం(నూజివీడు) : మండలంలోని సీతారామపురం సమీపంలోని రామిలేరుపై ఉన్న పోలవరం అండర్‌టన్నెల్‌కు పడిన గండి పనులు ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల ఒకటోతేదీ తెల్లవారుజామున గండి పడినప్పటి నుంచి గండిని పూడ్చటానికి ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు అక్కడే మకాం వేశారు. గోదావరి జలాల ప్రవాహం తగ్గడానికి రెండు రోజులు పట్టిన తరువాత గండి వద్ద రింగ్‌బండ్ ఏర్పాటు చేయడానికే మరో రెండు రోజులు సమయం తీసుకోవడంతో ఇప్పటివరకు గండిపూడ్చివేత పనులు ప్రారంభమవ్వలేదు. కాంక్రీట్ వేసే యంత్రాలు గురువారం సాయంత్రానికి గండి పడిన ప్రదేశానికి చేరుకోగా శుక్రవారం నుంచి కాంక్రీట్ పనులను చేపట్టారు. ముందుగా కాలువ లోపలిభాగంలో అండర్ టన్నెల్ స్లాబుతో పాటు ఉన్న అప్రాన్‌లో కాంక్రీటు నింపుతున్నారు. ఇది పూర్తయిన వెంటనే గండిని కూడా కాంక్రీట్‌తో పూడ్చుతామని ఇంజనీర్లు చెప్పారు. ఈ పనులు ఏడో తేదీ నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. పనులను జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ పరిశీలించి వెళ్ళారు. నాణ్యతలో రాజీవద్దు: మంత్రి ఉమా గండి పూడ్చివేత పనుల్లో రాజీపడకూడదని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అప్రాన్, గండి పూడ్చివేత పనులను ఎలాంటి హడావుడి లేకుండా పూర్తిచేయాలన్నారు. మంత్రితో పాటు జలవనరులశాఖ అపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ, తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు తదితరులున్నారు. -
‘డెమో’కు బ్రేక్
– నంద్యాల– ఎర్రగుంట్ల మార్గం ప్రారంభంలో జాప్యం – భారీ ఏర్పాట్ల పేరుతో ఆలస్యం – రైల్వేస్టేషన్లలో పూర్తికాని సిగ్నల్ పనులు కోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో డెమో రైలు ప్రారంభానికి బ్రేక్ పడింది. ఆగస్టు 2వ తేదీ నుంచి డెమో రైలు తిరగాల్సి ఉండగా రైలు మార్గం ప్రారంభోత్సవం పేరుతో జాప్యం కానుండటంతో కర్నూలు, కడప జిల్లాల ప్రజలు ఈ మార్గంలో రైలు కూత కోసం మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. కడప జిల్లా యర్రగుంట్ల నుంచి నంద్యాల సమీపంలోని 20 కి.మీ. వరకు 123కిలో మీటర్లు ఉన్న ఈ లైన్లో ఐదేళ్ల క్రితమే మొదటి విడతలో ఎర్రగుంట్ల నుంచి సంజామల మండలం నొస్సం వరకు రైల్వే ట్రాక్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన రెండు విడతల్లో సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె మద్దూరు వరకు ట్రాక్, ఆయా ప్రాంతాల్లో స్టేష్టన్లు, క్రాసింగ్ నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఫేస్–1లో సంజామల మండలంలోని నొస్సం వరకు, ఫేస్ –2లో అక్కడి నుంచి పాణ్యం మండలం మద్దూరు వరకు ట్రయల్ రన్, ఈ ఏడాదిలో రెండు పర్యాయాలు రైల్వే సేఫ్టీ కమిషనర్ డీకే సింగ్ ట్రాక్ నాణ్యతను పరిశీలించి రైళ్ల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గత నెలలో ఈ మార్గాన్ని గుంటూరు– గుంతకల్లు రైల్వే లైన్లతో అనుసంధానం చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి నంద్యాల– ప్రొద్దుటూరు మధ్య వారంలో రెండు పర్యాయాలు డెమో రైలు తిరగేలా టైంబుల్ రూపొందించారు. డెమో రైలు తర్వాత ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు కొనసాగాల్సి ఉంది. అయితే వివిధ కారణాల దష్ట్యా డెమో రైలు తిప్పడం రద్దు అయినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రూ. 950 కోట్లతో రైల్వేలైన్ ఏర్పాటు చేయడంతో రైల్వేలైన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న ఉద్ధేశంతో డెమోరైలు ప్రారంభానికి మరింత ఆలస్యం చేస్తున్నటు సమాచారం. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. ఈ సమస్యల కారణంగా డెమో రైలు తిరగకపోవడంతో కర్నూలు, కడప జిల్లాల ప్రజలు నిరాశ చెందుతున్నారు. -
మంగపట్నం చెరువుకు గండి
ముద్దనూరు: మంగపట్నం గ్రామంలో చెరువుకు గండి పడింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం ధాటికి చెరువు కింద భాగంలో స్వల్పంగా గండి పడింది. దీంతో చెరవులోని నీరు క్రమక్రమంగా గండి పడిన రంధ్రం ద్వారా బయటకు ప్రవహిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారమిచ్చారు. అలాగే చెరువు ప్రధాన కట్టపై రంధ్రాలు ఏర్పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 6 నెలల క్రితమే లక్షలాది రూపాయల వ్యయంతో ఈ చెరువు కట్ట తదితర నిర్మాణ పనులు చేపట్టారు. పనులను నాణ్యతా లోపంగా చేపట్టడంతోనే గండి పడడమే గాకుండా, కట్ట బలహీనంగా తయారై రంధ్రాలు పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువును ఆర్డీవో వినాయకం, తహసీల్దారు రమ, ఎంపీడీవో మనోహర్‌రాజు, నీటి పారుదల శాఖ అధికారులు రాజగోపాల్, నాయక్ తదితరులు పరిశీలించారు. -
ఏపీలో మెడికల్ వెబ్ ఆప్షన్లకు బ్రేక్
తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ప్రభావం.. తెలంగాణ ఎంసెట్-2పై స్పష్టత వచ్చాకే నిర్ణయానికి అవకాశం విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. వాస్తవానికి ఈ నెల 29, 30 తేదీల్లో వెబ్ఆప్షన్లు నిర్వహించి 31వ తేదీలోగా సీట్లు కేటాయించి.. ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు వాయిదా వేశారు. స్థానికేతర కోటా విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్న దృష్ట్యా వారీ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇబ్బంది రాకూడదనే..: రాష్ట్రం విడిపోయినప్పటికీ.. విభజన చట్టం ప్రకారం నాన్‌లోకల్ అన్‌రిజర్వుడ్(15శాతం) మెరిట్ సీట్లకోసం తెలంగాణకు చెందిన విద్యార్థులు ఏపీలో పోటీపడవచ్చు. అలాగే ఏపీ అభ్యర్థులు తెలంగాణలో పోటీ పడవచ్చు. అయితే లీకేజీ నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్-2ను రద్దు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా తెలంగాణలో మళ్లీ పరీక్ష నిర్వహించి.. ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతటినీ యుద్ధప్రాతిపదికన నిర్వహించడానికైనా ఎంత కాదన్నా 20 రోజులకు తక్కువ కాదని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో వెబ్ఆప్షన్ల ప్రక్రియను నిర్వహిస్తే.. సాధారణంగా తెలంగాణ అభ్యర్థులు అన్‌రిజర్వుడ్ సీట్లకు ఆప్షన్లు పెట్టి బ్లాక్ చేస్తారు. తరువాత కొన్నిరోజులకు తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే అన్‌రిజర్వుడ్ కింద ఆప్షన్లు పెట్టుకున్న ఈ అభ్యర్థులు తెలంగాణలో లోకల్(85శాతం) కోటా కింద ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందేందుకు మొగ్గుచూపుతారు. ఈ క్రమంలో ఏపీలో తెలంగాణ అభ్యర్థులు సీట్లు బ్లాక్ చేయడంవల్ల గందరగోళ పరిస్థితి ఎదురవుతుందని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు ఆలోచనలో పడ్డారు. దీంతో కొద్దిరోజులపాటు వేచిచూడాలనే అభిప్రాయానికి వారు వచ్చారు. తెలంగాణ ఎంసెట్-2పై స్పష్టత వచ్చాకే ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియపై వారు నిర్ణయం తీసుకునే వీలుంది. -
పాస్ బుక్కులకు బ్రేక్!
♦ వెబ్‌ల్యాండ్ అప్డేషన్ తర్వాతే పంపిణీ ♦ ఈ -పాస్‌బుక్కులపై సర్కారు కసరత్తు ♦ రెవెన్యూ రికార్డులను సరిదిద్దకుండా జారీచేస్తే కొత్త సమస్యలు రాష్ర్టం ఏర్పడిన తర్వాత జిల్లాలో 60వేల పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ యంత్రాంగం ముద్రించింది. వీటిలో ఇప్పటివరకు దాదాపు 35వేల మంది రైతులకు అందజేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11,12,029 సర్వేనంబర్లకు సంబంధించి ఆరు లక్షల క్లెరుుమ్‌లు అధికారుల దృష్టికి వచ్చారుు. వీటిన్నింటిని సవరించి కంప్యూటరీకరించడమే సవాలుగా మారింది. పట్టాదారు పాస్‌పుస్తకాల జారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ నేపథ్యంలో పాస్‌పుస్తకాల జారీని నిలిపివేసింది. త్వరలోనే ఈ-పాస్ బుక్కులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న సర్కారు.. ప్రస్తుతం జారీచేస్తున్న వాటికి మంగళం పాడాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ రేమాండ్‌పీటర్ ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీ ఆగిపోరుుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దాదాపు ఏడాదిపాటు కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం జారీ చేయలేదు. ప్రభుత్వ చిహ్నం మార్పు తదితర కారణాల వల్ల పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. దీంతో భూ క్రయవిక్రయాలు జరిగినా యాజమాన్య హక్కుల్లో కీలకంగా భావించే పాసు పుస్తకాలను ఇవ్వకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పట్లో కష్టమే! తప్పులతడకగా ఉన్న రెవెన్యూ రికార్డులను సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకనుగుణంగా ప్రతి భూమి చరిత్ర, పట్టాదారు, అనుభవదారులు, పహనీల్లో నమోదైన పేర్లను కంప్యూటరీకరించాలని భావించింది. ఈ మేరకు వెబ్‌ల్యాండ్ అప్డేషన్ పేరిట సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీనికి అనుగుణంగా క్షేత్రస్థారుులో సర్వే చేసిన రెవెన్యూ సిబ్బంది ప్రతి సర్వే నంబర్ భూమి పుట్టుపుర్వోత్తరాలను సేకరించారు. అదేసమయంలో రికార్డుల్లో మార్పులు, చేర్పులను కూడా నమోదు చేసుకున్నారు. ఇవేకాకుండా అభ్యంతరాలను కూడా తెలుసుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 11,12,029 సర్వేనంబర్లకు సంబంధించి ఆరు లక్షల క్లెరుుమ్‌లు అధికారుల దృష్టికి వచ్చారుు. వీటిన్నింటిని సవరించి కంప్యూటరీకరించడం ద్వారా రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా తయారు చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఇంతవరకు ప్రక్రియ సజావుగానే సాగినా.. సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరించడం రెవెన్యూ అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఆరు లక్షల క్లెరుుమ్‌లు జిల్లావ్యాప్తంగా ఆరు లక్షల సవరణలు రావడం, వీటన్నింటిని కంప్యూటర్లలో అప్లోడ్ చేయడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్ అప్డేషన్ లో జిల్లా వెనుకబడింది. ఈ ప్రక్రియంతా పూర్తరుుతేనే.. ఈ -పాస్‌పుస్తకాల జారీకి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థారుులో వెలుగులోకి వచ్చిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సవరించిన వాటినీ కంప్యూటరీకరించకుండా ఈ- పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇవ్వాలనుకుంటే మాత్రం సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ -పుస్తకాల్లోనే సమగ్ర సమాచారాన్ని పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పట్టాదారుకు సంబంధించిన పహనీల్లో సదరు భూమిపై ఏమైనా రుణాలు తీసుకున్నారా? బ్యాంకుల్లో ఏమైనా కుదవ పెట్టారా? తదితర సమాచారాన్ని కూడా ఆ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ లో ఎవరైనా పరిశీలించుకునే వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు, ఇతరులు కూడా సంబంధిత సర్వే నంబర్ భూమి వివరాలను ఆన్ లైన్ లో పరిశీలించుకోవచ్చు. రికార్డులన్నీ సవరించిన తర్వాత ఈ -పాస్ పుస్తకాలను జారీచేస్తే బాగుంటుంది తప్ప.. వాటిని గాలికొదిలేసి.. ప్రస్తుతం మాన్యువల్‌గా ఇస్తున్న పీటీ బుక్కులను నిలిపివేయాలనే నిర్ణయం సరికాదని రైతులు అంటున్నారు. -
అమర్ నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్
జమ్మూ: అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన వారికి తిరిగి అవే కష్టాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే యాత్రకు బ్రేక్ ల మీద బ్రేక్ లు పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా యాత్రను నిలిపివేస్తున్నట్లు యాత్ర నిర్వాహక అధికారులు చెప్పారు. ’ జమ్మూనగరంలోని భగవతి నగర్ వద్ద నుంచి ఎవ్వరినీ అమర్ నాథ్ యాత్రకు అనుమతించడంలేదు. శాంతిభద్రతల పరిస్థితులు మెరుగవకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఓ సీనియర్ అధికారి చెప్పాడు. ప్రస్తుతం కూడా జమ్మూకశ్మీర్ లో కర్ఫ్యూ పరిస్థితి కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఈ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు కూడా అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని సురక్షితంగా పటిష్ట భద్రత మధ్య బాల్ తాల్ బేస్ క్యాంపు నుంచి జమ్మూకు తరలించారు. మధ్యాహ్నం వారు ఢిల్లీకి బయలుదేరుతారు. -
తలుపులు పగలగొట్టిన పోలీసులు షాక్..!
ఆమ్స్టర్డ్యామ్: డచ్ పోలీసులకు ఇటీవల వింత అనుభవం ఎదురైంది. ఓ ఇంట్లో మహిళ ఉరేసుకుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి మరీ ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. అయితే ఆ తరువాతే తెలిసింది వారికి అసలు విషయం. తూర్పు ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు ఓ ఫ్లాట్‌లో మహిళ ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. కిటికీలోంచి స్పష్టంగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ మహిళ కొన్ని గంటలుగా అలా కదలకుండా ఉండటంతో.. వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సైతం ఇదే దృశ్యాన్ని చూసి మహిళ ఉరేసుకుందని భావించారు. కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ స్పందించకపోవటంతో చివరికి తలుపులు పగలగొట్టి.. ఇంట్లోకి ప్రవేశించారు. ఆ మహిళను దగ్గరగా పరిక్షించి చూస్తేగానీ తెలియలేదు.. అది గాలితో నింపిన ఒట్టి బొమ్మ అని. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ అనుభవాన్నంతా మీడియాకు వెల్లడించిన పోలీసులు.. అది బొమ్మ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో సెక్స్ వర్క్‌కు చట్టబద్ధత ఉంది. అక్కడ సెక్స్ షాపుల్లో ఇలాంటి సెక్స్ టాయ్స్ విరివిగా లభిస్తాయి. అయితే బొమ్మకు ఎందుకు ఉరివేశారు అనే విషయం మాత్రం తెలియరాలేదు. -
నిండుడు.. అలుగు పోసుడు..
1,207 చెరువులకు జలకళ ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వర్షపు నీరు ‘మిషన్’ పనులకు తాత్కాలిక బ్రేక్ ఖమ్మం అర్బన్ : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి కొత్త నీరు చేరుతోంది. కొన్ని చెరువులు నిండుతుండగా.. మరికొన్ని అలుగు పోస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 4,517 చెరువులు ఉండగా.. బుధవారం నాటికి అధికారిక లెక్కల ప్రకారం 1,207 చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. 1,846 చెరువుల్లోకి 25 శాతం మేర నీరు చేరింది. 25 శాతం నుంచి 50 శాతం వరకు చేరిన చెరువులు 435, 50 నుంచి 75 శాతం మేర నీరు చేరిన చెరువులు 455, 75 శాతం నుంచి 100 శాతం 574 చెరువుల్లోకి నీరు చేరింది. వర్షాల వల్ల మిషన్ కాకతీయ రెండో విడత పనులకు బ్రేక్ పడింది. రూ.29792.30లక్షల అంచనాతో మొత్తం 962 చెరువులకు ప్రభుత్వం ఈ ఏడాది అనుమతులు ఇచ్చింది. వాటిలో 916 చెరువుల్లో పనులు మొదలుపెట్టగా.. వాటిలో 166 చెరువుల పనులు పూర్తయినట్లు, 750 చెరువుల్లో పనులు తుది దశకు చేరుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువు అలుగు స్థాయిలోకి నీరు చేరితే ఇక ఈ ఏడాది పునరుద్ధరణ పనులు నిలిచినట్లే. -
చెరువుకు గండి.. ఇళ్లు నేలమట్టం
రామాపురం: వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం సురకావాండ్లపల్లె గ్రామ చెరువుకు మంగళవారం గండిపడింది. వరద నీరు ఒక్కసారిగా సమీపంలోని ఇళ్లను ముచ్చెత్తాయి. సుమారు పది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇంకా కొన్ని ఇళ్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రైతులు ఇళ్లలో ఉంచుకున్న ధాన్యం తదితర సామగ్రి అంతా నీటిపాలైంది. సుమారు రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. -
సీపీఎంలో భగ్గుమన్న విభేదాలు
న్యూఢిల్లీ: మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం) లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పార్టీ మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశాల్లో పార్టీ అగ్రనాయకత్వం మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. ప్రధానంగా బెంగాల్ పార్టీ నాయకత్వంపై మాజీలు, అనుభవజ్ఞులైన సీపీఎం నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధమే నడిచింది. ఒక దశలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో శని , ఆదివారం సమావేశాల్లో బెంగాల్ పార్టీ నేత, సూర్జ్యకాంత మిశ్రాపై బెంగాల్ ఓటమికి బాధ్యుడిగా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఓటమి, కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు అంశాలపై నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ముఖ్యంగా బెంగాల్ లో ఘోరమైన ఓటిమికి నేతలు మిశ్రా, బోస్ బాధ్యత వహించాలంటూ త్రిపుర, కేరళ, అసోం ప్రతినిధులు పట్టుబట్టడంతో రగడ మొదలైంది. పార్టీకి తీర్మానానికి వ్యతిరేకంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడంపై ప్రశ్నించాయి. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటును తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్టీ రాష్ట్ర కమిటీకి విరద్ధంగా వ్యవహరించిన బెంగాల్ బ్రిగేడ్ పై మండిపడ్డాయి. బీజీపీ, కాంగ్రెస్ ఇరుపార్టీలు పార్టీకి సమాన శత్రవులని వాదించాయి. ఇది కింది కేడర్ లో తప్పుడు సంకేతాలు పంపుతుందని త్రిపుర, కేరళ సభ్యులు వాదించారు. కాంగ్రెస్ తో పొత్తును వ్యతిరేకించిన వారిలో మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఉన్నారు. బెంగాల్ లో బిమన్ బోస్, మిశ్రా మూలంగా భారీ మూల్యాన్ని చెల్లుంచుకున్నామని వ్యాఖ్యానించారు. మిశ్రా, బోస్ వంటి నాయకులు కాంగ్రెస్‌తో పొత్తును జస్టిఫై చేయలేని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడమే పార్టీ ఏకైక లక్ష్యంగా ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలపై సీపీఎం నేత, మహిళా నేత జగమతి సంగ్వాన్ ను కేంద్ర కమిటీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఒకవైపు విభేదాలు చెలరేగుతుండగా, మరో కీలక నిర్ణయాన్ని సీపీఎం కేంద్ర కమిటీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. జగమతి సంగ్వాన్ తొలగింపు హర్యానా సీపీఎం నేత, ఐద్వా ప్రధానకార్యదర్శి జగమతి సంగ్వాన్ బెంగాల్ కమిటీపై మండిపడ్డారు. పొలిట్ బ్యూరో బెంగాల్ కమిటీ కి వత్తాసుపలుకుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాటి కేంద్ర సమావేశాలను బాయ్ కాట్ చేసినట్టు ప్రకటించిన జగమతి మీడియా ముందు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే జగమతిని కేంద్ర కమిటీ నుంచి తొలగించినట్టు ప్రకటించడం విశేషం. -
మండ్లెం చెరువుకు గండి
జూపాడుబంగ్ల(కర్నూలు): జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. సోమవారం ఉదయం జూపాడుబంగ్ల మండలంలోని మండ్లెం చెరువుకు గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతోంది. ఇది గుర్తించిన రైతులు గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతోపాటు గండి అలుగు సమీపంలో పడటంతో.. రైతుల ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. -
ఉద్యానశాఖలో పోస్టుల భర్తీకి బ్రేక్
హైదరాబాద్: ఉద్యానశాఖలో పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. ఆ శాఖ ప్రతిపాదించిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ తోసిపుచ్చినట్లు సమాచారం. ‘ఇప్పుడున్న వారితో సరిగా పనిచేయించుకోండి. వారిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నాక అవసరమైతే అప్పుడు చూద్దాం’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో ఉద్యానశాఖలో పోస్టుల భర్తీ జరుగుతుందని భావించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఉద్యానశాఖను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావించింది. సర్కారు ఆదేశంతోనే ఉద్యానశాఖ కూడా పోస్టుల భర్తీపై ప్రతిపాదనలు పంపింది. వాస్తవంగా 521 పోస్టులు అవసరమని గతంలో ప్రతిపాదించింది. చివరకు 208 హెచ్‌ఈవో పోస్టులు నింపాలని సర్కారు ప్రాథమికంగా అంగీకరించింది. ఎందుకోగానీ సీఎం వాటిని తిరస్కరించినట్లు తెలియడంతో అధికారులు నిరాశకు లోనయ్యారు. -
బాహుబ్రేక్!
బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, బిజ్జలదేవ, దేవసేన, అవంతిక... వీళ్లందరూ ఎండలకు భయపడిపోయారా? అందుకే ఇంటి గుమ్మం దాటనన్నారా? చేసేదేం లేక షూటింగ్‌కి సెలవులిచ్చేశారా?... ప్రస్తుతం ‘బాహుబలి- 2’ గురించి ఫిలిమ్నగర్లో జరుగుతున్న చర్చ ఇది. పైన చెప్పిన పాత్రలన్నీ ఆ సినిమాలోవే అని పిల్లలకు కూడా తెలుసు. ఎండల్లో ఈ పాత్రధారులు పడుతున్న కష్టం చూడలేక దర్శకుడు రాజమౌళి వేసవి సెలవులిచ్చి పంపించేశారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ ప్రచారానికి కారణం ‘బాహుబలి-2’ షూటింగ్‌కి కొన్ని రోజులు విరామం ఇవ్వడమే. మామూలుగా ఏదైనా షూటింగ్‌కి గ్యాప్ ఇస్తే, రకారకాల కథనాలు వస్తుంటాయ్ కదా. ఆ విధంగా ‘బాహుబలి-2’ బ్రేక్‌కి ఎండలు కారణమని చాలామంది ఫిక్స్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే... ఎండల కారణంగా ఈ షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వలేదట. ‘‘ఇది ముందే నిర్ణయించిన బ్రేక్. ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు. ఎప్పుడో అనుకున్నది’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ గ్యాప్‌లో ఈ యూనిట్ అంతా ఏ విహార యాత్రలకు వెళతారేమో అనుకుంటే పొరపాటే. అదేం కుదరదు. బ్రేక్ తర్వాత జూన్‌లో ఆరంభించే షెడ్యూల్ కోసం దాదాపు యూనిట్ అంతా ట్రైనింగ్‌లో పాల్గొంటారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతాయనీ, అలాగే సెట్ వర్క్ కూడా జరుగుతోందనీ శోభు తెలిపారు. ఇక, ఇటీవల జరిపిన షెడ్యూల్ వివరాల్లోకి వస్తే.. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లా విట్టేకర్ ఆధ్వర్యంలో భారీ పోరాట దృశ్యాలు చిత్రీకరించారు. అక్టోబర్‌కల్లా సెకండ్‌పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ సమయం పడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
గుమ్మసముద్రం చెరువుకు గండి
బి.కొత్తకోట: చిత్తూరు జిల్లా బి.త్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువుకు శుక్రవారం ఉదయం గండి పడింది. దీంతో నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి. గండిని పూడ్చేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెరువుకు గండి విషయాన్ని అధికారులకు తెలియ జేశారు. -
'కోడి పందాలకు బ్రేక్ వేస్తున్నాం'
-
'కోడి పందాలకు బ్రేక్ వేస్తున్నాం'
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల నిర్వహణ అంశంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కోడి పందాలు నిర్వహించకుండా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కోడి పందాల నిర్వహణకు ఎవ్వరికీ అనుమతినిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు గత విచారణలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలను నిర్వహించినా, జూదం ఆడినా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పెందాలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అదే జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా, కోడి పందాల నిర్వహణకు తాము ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, పందాలు నిర్వహించినా, జూదం ఆడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిని రికార్డ్ చేసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ వ్యాజ్యంలో పిటిషనర్ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి సందర్భంగా మళ్లీ కోడి పందాల నిర్వహణకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదని పిటిషనర్ వివరించారు. ఈ నేపథ్యంలో కోడి పందాలు నిర్వహించకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. -
కోడిపందాల నిర్వహణకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల నిర్వహణకు ఎవ్వరికీ అనుమతినిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలను నిర్వహించినా, జూదం ఆడినా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బొసాలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పెందాలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అదే జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా, కోడి పందాల నిర్వహణకు తాము ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, పందాలు నిర్వహించినా, జూదం ఆడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిని రికార్డ్ చేసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ వ్యాజ్యంలో పిటిషనర్ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి సందర్భంగా మళ్లీ కోడి పందాల నిర్వహణకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదని పిటిషనర్ వివరించారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం కోడి. -
ఎయిర్కోస్టా నిధుల సేకరణకు బ్రేక్!
మంచి ధర కోసం బ్రాండ్ బిల్డింగ్‌పైనే దృష్టి కొత్త ఎయిర్‌లైన్ విధానం వచ్చాకే నిధుల సమీకరణ ఇండిగో ఐపీవో విజయవంతంతో పెరిగిన నమ్మకం దేశవ్యాప్త కార్యకలాపాలపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ విమానయాన సర్వీసుల సంస్థ ఎయిర్కోస్టా నిధుల సమీకరణ ప్రక్రియను తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా విడుదల చేసిన పౌర విమానయాన విధాన ముసాయిదా విదేశీ పెట్టుబడులను స్వీకరించడానికి అనుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా వాటాలను విక్రయించడం ద్వారా వ్యాపార విస్తరణకు నిధులు సేకరించాలని ఎయిర్కోస్టా చూస్తోంది. ఇప్పటికే చాలా దేశీ, విదేశీ సంస్థలతో చర్చలు జరిపినప్పటికీ ఆయా సంస్థలు ఆఫర్ చేస్తున్న ధర చాలా తక్కువగా ఉండటంతో ఈ చర్చలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే ఎయిర్కోస్టా ప్రాంతీయ విమానయాన సంస్థ నుంచి నేషనల్ కారియర్‌గా మారనుండటంతో తమ బ్రాండ్ విలువ కూడా పెరుగుతుందని, అప్పుడు అధిక ధర వస్తుందన్నది కంపెనీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో నేషనల్ కారియర్ అనుమతులు లభిస్తే, జనవరి నెలాఖరుకు ఢిల్లీ, భువనేశ్వర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రస్తుతం ఉన్న 67 సీటర్ల ఈ-170 విమానాల స్థానంలో 112 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ-190 విమానాలను తీసుకురానున్నారు. దీనివల్ల కంపెనీ నిర్వహణ లాభం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రాండ్ బిల్డింగ్‌పైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, వచ్చే ఏప్రిల్, మే తర్వాతనే నిధుల సేకరణ జరపాలని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉన్న కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా బ్రాండ్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, మార్చిలోగా మొబైల్ యాప్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. -
రక్తమోడిన రహదారులు
{బాండెక్స్ బస్సు, ఆటో ఢీ 28 మందికి తీవ్ర గాయాలు చిన్నారి పరిస్థితి విషమం కె.కోటపాడు : బత్తివానిపాలెం కూడలిలోని ప్రమాదకర మలుపు వద్ద సోమవారం ఉదయం 4గంటల సమయంలో బ్రాం డెక్స్ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో బ్రాండెక్స్ బస్సులో ప్రయాణిస్తున్న 24 మం ది మహిళా ఉద్యోగులు, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గా యాలయ్యాయి. దాలివలస, కింతా డ, కె.కోటపాడు గ్రామాల నుంచి అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ కంపెనీలో ఉదయం ఆరు గంటల డ్యూటీకి తెల్లవారుజామున 4గంటలకు 31 మంది మహిళా ఉద్యోగులు కంపెనీ బస్సులో బయలుదేరారు. బత్తివానిపాలెం కూడలి సమీపంలో మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న బైక్‌ను తప్పించేక్రమంలో బస్సును డ్రైవర్ పక్కకు మళ్లించాడు. ఇంతలో గొండుపాలెం నుంచి కె.కోటపాడు వైపునకు ఎదురుగా వస్తున్న ఆటోను బస్సు డ్రైవర్ గుర్తించి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు ఒక్కసారిగా బోల్తాకొట్టి సమీపంలోని తాటిచెట్లను ఢీకొంది. బోల్తాకొట్టిన బస్సును ఆటో బలంగా ఢీకొనడంతో ఆటోడ్రైవర్ మడకనాయుడు, ఆటోలో ప్రయాణిస్తున్న జె.రామదాసు, జె.సత్యవతి దంపతులతోపాటు వారి రెండేళ్ల చిన్నారి వైష్ణవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వైష్ణవి కోమాలోకి వెళ్లిపోయింది. ఆటో డ్రైవర్ నాయుడుకు రెండు కాళ్లూ విరగడంతోపాటు తలకు తీవ్ర గాయమయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ మజ్జి రాముతో పాటు చుక్క పార్వతి, వాసిరెడ్డి రమణమ్మ, ఈర్లె వరలక్ష్మి, ఒబ్బిలిశెట్టి నాగమణి, ఇమంది కృష్ణవేణి, కొత్తుర్తి కనకమహాలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఈర్లె దేవి, బోకం జ్యోతి, దమ్ము ముత్యాలమ్మ, భూమిరెడ్డి వరలక్ష్మి, వి.మౌనిక, ఆదిరెడ్డి లక్ష్మి, పెదగాడి దేవి, పి.నాగమణి, కిర్లంపల్లి నాగమణి, బి.రాధ, కన్నూరు దేవి, వి.వెంకటలక్ష్మి, కె.అప్పలనర్స, శ్రీశైలపు దేవి, చీపురుపల్లి గౌరిలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక 30 పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న క్షతగాత్రుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని రోదిస్తున్నారు. బస్సు డ్రైవర్ మజ్జి రాము మద్యం సేవించి ఉండడం వల్లే ప్రమాదం సంభవించిందని మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ మహిళలను బ్రాండెక్స్ యాజమాన్యం మెరుగైన వైద్యం అందించేందుకు గాజువాక తరలించారు. ప్రమాద ఘటనపై కె.కోటపాడు ఎస్ఐ తాళ్లపూడి శ్రీను కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. క్షతగాత్రులకు ఎమ్మెల్యే బూడి ఓదార్పు ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు హుటాహుటిన తెల్లవారి ఆరు గంటలకు స్థానిక 30 పడకల ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను ఓదార్చారు. ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన వారిని విశాఖపట్నంకు 108లో తరలించేందుకు చర్యలు చేపట్టారు. విధులకు వెళ్తూ మహిళలు గాయపడడం విచారకరమని ఆయన అన్నారు. క్షతగాత్రులను కె.కోటపాడు మాజీ సర్పంచ్ రెడ్డి జగన్మోహన్, శ్రీకాంత్ శ్రీను, బోకం సత్యనారాయణ పరామర్శించారు. -
బీసీ రుణాలకు బ్రేక్
మంజూరు దశలో ఉన్న బీసీ కార్పొరేషన్ రుణాలకు బ్రేక్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ రుణాలను ఉన్నపళంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలోని లబ్దిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రొసీడింగ్స్ సైతం తీసుకొని, డబ్బుల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులు సర్కారు ఇచ్చిన షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. నిధుల్లో కోత విధించడంతో పాటు యూనిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. దీంతో లబ్దిదారులను ఎలా కుదిస్తారనే విషయంపై అయోమయం నెలకొంది. పాత లబ్దిదారులకు రుణాలు వస్తాయా? లేక కొత్తగా ఎంపిక చేపడుతారా? మొత్తం ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలకు మార్గదర్శకాలు రావాల్సి ఉంది. కరీంనగర్ సిటీ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు చెందిన నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణం గా నిధులు విడుదల చేసి జిల్లాల వారీగా యూనిట్ల లక్ష్యాలను నిర్దేశించింది. యూనిట్లకు అనుగుణంగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు ల గడువు గత నెలలోనే ముగిసింది. జిల్లావ్యాప్తంగా బ్యాంకర్లు, ఎంపీడీఓలు కలిసి లబ్దిదారులను ఎంపిక చేశారు. చాలా మంది లబ్దిదారులు రుణ మంజూరీకి సంబంధించి ప్రొసీడింగ్స్ సైతం అందుకున్నారు. ఈ దశలో రుణాల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేయడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. 1783కు తగ్గిన యూనిట్లు బీసీ కార్పొరేషన్ రుణాలకు కేటాయించిన నిధుల్లో ప్రభుత్వం భారీగా కోత విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్‌ను రూ.115 కోట్ల నుంచి రూ.30 కోట్లకు కుదించినట్లు సమాచారం. దీనికి అనుగుణంగానే ఆయా జిల్లాలకు కేటాయించిన యూనిట్లలోనూ కోత పడింది. జిల్లాకు సంబంధించి గతంలో అర్బన్, రూరల్ కేటగిరీల్లో 5922 యూనిట్లు కేటాయించారు. రూరల్‌లో 4335లక్ష్యం కాగా 3050, అర్బన్‌లో 1587 లక్ష్యానికి 1053, మొత్తంగా 5922 యూనిట్లకు 4103 దరఖాస్తులు వచ్చాయి. అరుుతే జిల్లాకు కేటారుుంచి న 5922 యూనిట్ల నుంచి 1783 యూనిట్లకు కుదిం చారు. దీంతో ఇప్పటికే ఎంపిక చేసిన లబ్దిదారులను యూనిట్ల సంఖ్యకు అనుగుణంగా ఎలా కుదించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆందోళనల్లో లబ్దిదారులు ‘రూ.2లక్షల రుణం మంజూరైంది. ఆ డబ్బుతో యూనిట్ పెట్టుకొని ఉపాధి పొందొచ్చని సంబరపడ్డ. మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ చేతికంది గంటలు కూడా గడవకముందే రుణాలు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఇస్తారో లేదో కూడా చెప్పడం లేదు. నోటి కాడి బుక్కను సర్కారు లాక్కున్నట్లయింది’ అంటూ కరీంనగర్ రాంనగర్‌కు చెందిన మల్లేశం అనే లబ్దిదారుడు వాపోయాడు. బ్యాంకర్ల నుంచి కాన్సెంట్ తీసుకొని, అధికారులు చుట్టూ తిరిగి, నానా కష్టాలు పడి రుణాలకు ఎంపికైతే చివరిక్షణంలో షాక్ ఇవ్వడాన్ని లబ్దిదారులు తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ రుణాలు వస్తాయో రావో కూడా అధికారులు చెప్పలేకపోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. నిధుల్లో కోత వద్దు ఏ శాఖలోనూ లేనివిధంగా బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన నిధుల్లో కోత విధించడం పట్ల బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రొసీడింగ్స్ దశలో రుణాలు నిలిపివేయడంపై మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బీసీ బడ్జెట్ సరిపోవడం లేదని, మరింత పెంచాలని డిమాండ్ చేస్తుంటే, ఉన్న నిధుల్లో కోత విధించడమేమిటని ప్రశ్నిస్తున్నారుు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నా, బీసీ కార్పొరేషన్‌కు సంబంధించిన యూనిట్లను మాత్రమే కుదించడం పట్ల బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. నిధుల్లో కోత లేకుండా, యూనిట్లను కుదించకుండా పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. -
కొట్టకుండానే పగులుతున్న కొబ్బరికాయలు
నల్గొండ: ఎండలు భగ్గుమంటున్నాయనడానికి ప్రత్యేక్ష నిదర్శనమే ఇది. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన కొబ్బరికాయలు ఎండ వేడికి కొట్టకుండానే పగలిపోతున్నాయి. వివరాలు.. సిరిపురం గ్రామంలోని కుక్కడపు నాగేశ్వరరావు కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ షాపులో విక్రయ నిమిత్తం ఉంచిన కొబ్బరికాయలు బుధవారం మధ్యాహ్నం పగిలిపోయాయి. ఎండ వేడిమికి "మనుషులే తట్టుకోలేకుంటే.. కొబ్బరికాయలెంత" అని స్థానికులు వాపోతున్నారు. -
కో ఆపరేషన్ కరువు
వనపర్తి ఆస్పత్రిలో ప్రసవ వేదన ‘ నేను ఎంతో ఉదారంగా.. సేవా ధృక్పథంతో ఆపరేషన్లు చేద్దామని ముందుకొచ్చాను. కానీ, ఇక్కడ ఎవరూ సహకరించడం లేదు. అటెండర్ నుంచి నర్సు వరకు ఇదే పరిస్థితి. ఆపరేషన్లు చేయించుకునే వారున్నా.. చేసేందుకు తాను ముందుకు వచ్చినా.. సహకార లోపం వెంటాడుతోంది. బాలింతలకు ఇవ్వాల్సిన పారితోషికం, రక్తం, మందుల బిల్లుల చెల్లింపులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ఇక్కడ వృత్తి నిబద్ధత లోపించిందని గ్రహించాను. అందుకే పనిచేయలేక పోతున్నా..’ ఇది ఎస్పీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు ఆవేదన. ఒక వైద్యాధికారే తనకు సహకరించడం లేదని చెబుతున్నారంటే ఈ ఆస్పత్రిలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. వనపర్తి టౌన్ : ప్రభుత్వ ఆసుప్పత్రులోనే ప్రసవాలు, శస్త్రచికిత్సలు చేయించుకోవాలని సర్కార్ సైతం ప్రకటనలు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వనపర్తిలో ఏర్పాటు చేసిన వంద పకడల ఏరియా ఆస్పత్రికి వనపర్తి నియోజకవర్గంతో పాటు కొల్లాపూర్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి ప్రసవాలు చేయించుకునేందుకు మహిళలు వస్తుంటారు. కానీ, ఇక్కడ ఆపరేషన్లు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆస్పత్రి ప్రారంభం నుంచి గైనకాలజిస్ట్ పోస్టును భర్తీ చేయకపోవడంతో ఏడాదికి ఎప్పుడో ఒక్కమారు డిప్యూటేషన్‌పై వచ్చే డాక్టరే దిక్కుగా మారింది. ఐదు నెలల కిందట ఆపరేషన్లు, కాన్పులు చేసేందుకు నిర్ణయించారు. ఆ మేరకు కొంత విజయవంతమయ్యారు. కానీ, ఇప్పుడు వైద్యాధికారులు ఆ ఊసే పట్టించుకోవడం లేదు. దీంతో ఏరియా ఆస్పత్రిలో ప్రసవాలు, ఆపరేషన్లు జరిగినట్టే జరిగి ఒక్కసారిగా బ్రేక్ పడడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం పీజీ విద్యార్థిని (8నెలల ట్రైనింగ్‌లో ఉన్న వైద్యురాలు) ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే, ఆమె ఆపరేషన్లు చేయడానికి వెనుకాడుతోంది. దీంతో ఆస్పత్రి పరిస్థితిని అర్ధం చేసుకున్న వనపర్తి క్లస్టర్ అధికారి శ్రీనివాసులు ఇక్కడ ప్రసవాలు, ఆపరేషన్లు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కొంతకాలం పాటు శ్రీనివాసులు, ట్రైనింగ్‌లో ఉన్న వైద్యురాలు స్వాతి ఇద్దరు కలిసి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ తరుణంలో ఆపరేషన్లు చేయించుకున్న వారికి, బాలింతలకు ఇచ్చే పారితోషికం, మందుల బిల్లుల చెల్లింపు విషయంలో ఆస్పత్రి సూపరింటెండ్, ఎస్పీహెచ్‌ఓకు మధ్య విభేధాలు పొడచూపినట్టు ప్రచారం సాగింది. ఇదే సమయంలో ఎస్పీహెచ్ఓ కూడా ఆపరేషన్లు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఇక్కడ కాన్పుకోసం వచ్చిన మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. వైద్యసేవలు అందినట్టే అంది.. మళ్లీ దూరం కావడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రిలో మళ్లీ ఆపరేషన్లు జరిగేలా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఎస్పీహెచ్‌ఓకు ఎప్పటికీ వెల్కం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో కాన్పులు, ఆపరేషన్లు చేసేందుకు ఎస్పీహెచ్ఓ ముందుకు రావడం మాకు.. ప్రజలకు ధై ర్యాన్ని చ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల.. పీహెచ్‌సీల పర్యవేక్షణ మూలంగా ఎస్పీహెచ్ఓ శ్రీనివాసులు ఆస్పత్రికి రావడం లేదనుకుంటున్నాం. ప్రజలకు మంచి జరగడానికి తనకు బేషజాలు లేవు. ఎస్పీహెచ్ఓ ఎప్పుడొచ్చినా ఆయనకు వెల్కం చెబుతాం. - భాస్కర్‌ప్రభాత్, సూపరింటెండెంట్, వనపర్తి. -
బాల్య వివాహానికి బ్రేక్
కె.కోటపాడు : బాల్య వివాహానికి సోమవారం అధికారులు అడ్డుకట్టవేశారు. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం గవరపాలెం గ్రామానికి చెందిన బాలిక (14) తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని ప్రేమ చైల్డ్‌కేర్ డెవలప్ సెంటర్లో 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం తలపెట్టి, చదువు మధ్యలోనే ఆపించి ఇంటికి తీసుకువచ్చారు. దగ్గరి బంధువైన యువకుడితో బుధవారం నిశ్చితార్థం చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు, ఇంటిగ్రేడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ సభ్యులు బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తగిన వయసు రాకుండా వివాహం చేయడం అనర్థదాయకమన్నారు. వివాహ వయసు వచ్చిన తరువాతే కుమార్తెకు వివాహం చేస్తామని వారు అధికారులకు అంగీకార పత్రాన్ని రాసి ఇచ్చారు. ఐసీడీఎస్ పీఓ ఎం.ఎన్.రాణి, ఇంటిగ్రేడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ లీగల్ అధికారులు భారతి, ప్రమీల పాల్గొన్నారు. -
‘విశ్రాంతి' మంత్రం!
సాధన మనిషిని విజయంవైపు నడిపిస్తుందంటారు. కానీ భారత క్రికెటర్లు మాత్రం విశ్రాంతే తమ విజయమంత్రం అంటున్నారు. తీరికలేని షెడ్యూల్‌తో 365 రోజులు గడిపే భారత స్టార్స్... ఈసారి ప్రపంచకప్‌లో దొరికిన విరామం తమలో ఉత్సాహాన్ని పెంచుతోందని చెబుతున్నారు. సాక్షి క్రీడావిభాగం ఈసారి ప్రపంచకప్‌లో భారత్‌కు మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య విరామం చాలా ఎక్కువగా వచ్చింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 15న ఆడిన ధోనిసేన... మార్చి 6న నాలుగో మ్యాచ్ ఆడనుంది. అంటే 20 రోజుల వ్యవధిలో భారత్ మ్యాచ్‌లు కేవలం నాలుగే. బిజీ షెడ్యూల్‌తో ఎప్పుడూ ప్రయాణాలతో హడావుడిగా ఉండే ధోని అండ్ కో తొలిసారి తీరుబడిగా మ్యాచ్‌లు ఆడుతోంది. దీనివల్ల భారత క్రికెటర్లకు అదనంగా ‘విశ్రాంతి’ దొరుకుతోంది. ఇది టానిక్‌లా పని చేస్తోందని ధోని బృందం భావిస్తోంది. చాలా అరుదు సాధారణంగా మ్యాచ్‌ల మధ్య సుదీర్ఘ విరామం దొరకడం చాలా అరుదు. ఐపీఎల్ లాంటి టోర్నీలో అయితే ఉదయం విమానం దిగి సాయంత్రం మ్యాచ్ ఆడే సందర్భాలు కూడా ఉంటాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కో మ్యాచ్‌కు మధ్య రెండు రోజుల విరామం ఉంటుంది. ఒక రోజు ప్రయాణానికి, ఒక రోజు ప్రాక్టీస్‌కు సరిపోతుంది. కాబట్టి క్రికెటర్లకు సాధారణంగా ఖాళీ దొరకదు. ముఖ్యంగా భారత జట్టుకు ఈ తీరిక అసలే ఉండదు. ఈసారి ప్రపంచకప్ సందర్భంగా లభించిన విరామాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. రోజు విడిచి రోజు ఈసారి భారత్ ప్రాక్టీస్ సెషన్లలో కూడా ఎక్కువగా పాల్గొనడం లేదు. ముక్కోణపు వన్డే సిరీస్ తర్వాత తొలిసారి భారత క్రికెటర్లకు టీమ్ మేనేజ్మెంట్ మూడు రోజులు సెలవు ఇచ్చింది. స్నేహితులతో, బంధువులతో గడపడం... షికార్లకు వెళ్లడానికీ అనుమతి ఇచ్చారు. ఈ సెలవు తమలో కొత్త ఉత్సాహాన్ని పెంచిందని క్రికెటర్లంతా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ప్రపంచకప్‌లో ఒక్కసారిగా పుంజుకుని చెలరేగి ఆడారు. ఇలా ఆటతీరు మెరుగవడానికి అనేక కారణాలున్నా... విశ్రాంతి మంత్రం కూడా అందులో భాగమేనని ధోని అభిప్రాయం. ఇప్పుడు టోర్నీ సందర్భంగా కూడా భారత క్రికెటర్లు అదే కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు ఆరు రోజులు ఖాళీ దొరికింది. ఇందులో కేవలం మూడు రోజులు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. అందులో ఒక రోజు కేవలం ఫీల్డింగ్‌కే పరిమితమయ్యారు. అయినా కానీ ఆటతీరులో మార్పు రాలేదు. ఆ తర్వాత అఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు ముందూ ఇదే తీరు. ఈసారి వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు ఐదు రోజులు విరామం లభిస్తే... అందులో కేవలం రెండు రోజులు మాత్రమే ప్రాక్టీస్‌కు కేటాయించి... మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. వేదికలు అలవాటు... ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు నవంబర్ నుంచి పర్యటిస్తున్నారు. కాబట్టి అక్కడి వాతావరణ పరిస్థితులు పూర్తిగా అలవాటు అయ్యాయి. అదే విధంగా వారాల వ్యవధిలో పిచ్‌లలో మార్పులు రావు. అన్ని వేదికల్లోనూ టెస్టులు, వన్డేలు ఆడటం వల్ల దాదాపుగా అన్ని చోట్లా పరిస్థితులపై భారత జట్టుకు పూర్తి అవగాహన ఉంది. ఇది భారత్‌కు బాగా కలిసొస్తుందనే అనుకోవాలి. మెల్‌బోర్న్‌లాంటి పెద్ద మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడంలో ధోని మిగిలిన కెప్టెన్ల కంటే తెలివిగా వ్యవహరించాడు. దీనికి కారణం అక్కడి పరిస్థితులపై అవగాహన ఉండటమే. భిన్నాభిప్రాయాలు విరామం వచ్చినా ప్రాక్టీస్ సెషన్లకు విరామం ఇవ్వడం మంచిదా? కాదా?... అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఆటగాళ్లకు ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. అయితే జిమ్‌కు రోజూ వెళ్లడం వల్ల ప్రాక్టీస్‌కు వెళ్లకపోయినా ఫిట్నెస్ను కాపాడుకోవచ్చని ధోని చెబుతున్నాడు. ఈ విశ్రాంతి మూలంగా ఆటగాళ్ల మీద పని ఒత్తిడి తగ్గుతుందనేది వాస్తవం. అయితే ఇంత విరామం వస్తే ఫామ్ కోల్పోయే ప్రమాదం ఉందనేది ఓ అభిప్రాయం. మొత్తం మీద ఇతర జట్లతో పోలిస్తే భారత క్రికెటర్లు విశ్రాంతి కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నారు. గెలిచినంత కాలం ఎవరూ పట్టించుకోకపోవచ్చు. కానీ ఒకవేళ ఏదైనా కీలక మ్యాచ్‌లో ఓడిపోతే... ప్రాక్టీస్ చేయకుండా పడుకున్నారనే విమర్శనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. టెన్నిస్... స్విమ్మింగ్ ప్రపంచకప్ సందర్భంగా కుటుంబ సభ్యులనో, స్నేహితులనో కలిసే అవకాశం లేదు. కాబట్టి షికార్లు కుదరవు. దీంతో దాదాపుగా అందరూ హోటల్‌కే పరిమితమవుతున్నారు. ఓ రెండు గంటల పాటు జిమ్‌లో, స్విమ్మింగ్‌పూల్‌లో గడుపుతున్నారు. నీళ్లలో ఆడే ఆటలతో టైమ్ పాస్ చేస్తున్నారు. దీనికి అదనంగా టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడలు ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఫిట్నెస్ను కాపాడుకోవడంలో భాగం. అలాగే మిగిలిన సమయాల్లో వీడియో గేమ్స్ ఆడటం, అడపాదడపా షాపింగ్, ఇండియన్ రెస్టారెంట్లకు వెళ్లి భోజనం... ఇలా టైమ్ పాస్ చేస్తున్నారు. ‘మేం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన దగ్గర్నించి ప్రపంచకప్ ముగిసేవరకు లెక్క తీసుకుంటే దాదాపు ఐదు నెలలు ఈ పర్యటన సాగుతోంది. ఇంత సుదీర్ఘ పర్యటనలో నెట్ ప్రాక్టీస్ కంటే విశ్రాంతి చాలా ముఖ్యం. మానసికంగా ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం అవసరం’ - ధోని -
అర్హులను ముంచారు
సాక్షి ప్రతినిధి, కడప: బదిలీపై వెళ్తున్న ఓ ఎస్ఈ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ నియామకాలకు తెరలేపారు. ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పట్లో బ్రేకులు పడ్డాయి. మరోమారు అనర్హులకు అవకాశం కల్పించేందుకు సిబ్బంది రెడీ అయ్యారు. ఉద్యోగాల కోసం ఎంతకాలంగానో ఓ వైపు అర్హులు ఎదురుచూస్తుంటే మరోవైపు అనర్హుల కోసం చేతివాటం ప్రదర్శించారు. ఇదివరకే లబ్ధిపొందిన వారి కుటుంబాలకు చెందిన మరో ముగ్గురికి అవకాశం కల్పించేం దుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగుగంగ ముంపు బాధితులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. పదేళ్ల కాలంగా ఇప్పటికే సుమారు 250 మందికి వివిధ ఉద్యోగాలు దక్కాయి. మరో ఐదువేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారంత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దళారుల చేతి వాటం కారణంగా అనర్హులకు అవకాశం దక్కుతోంది. తెలుగుగంగ ఎస్ఈ కార్యాలయం అందుకు వేదికైంది. ఇటీవల టెక్నికల్ అసిస్టెంట్లను నియమించేం దుకు రంగం సిద్ధమైంది. అప్పట్లో రెండు కుటుంబాలకు మరోమారు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని సాక్షి బహిర్గతం చేయడంతో అప్పట్లో అవకాశం లేకపోయింది. తిరిగి మరోమారు అనర్హులను అందలం ఎక్కించేందుకు యంత్రాంగం చేతి వాటం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం మరో 30 మంది టెక్నికల్ అసిస్టెంట్లను నియమించనున్నారు. దాంతో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరిస్తు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం. చక్రం తిప్పుతున్న కార్యాలయ వర్గాలు.. ప్రభుత్వ నిబంధనల మేరకు ముంపువాసులకు సీనియారిటీ, అర్హత ప్రకారం ఉద్యోగాలు కేటాయించాలి. ప్రభుత్వం చేపట్టిన నియామకాలను అవకాశంగా మలుచుకొని యంత్రాంగం డబ్బులు దండుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. జీఓ నెంబర్ 98 ప్రకారం మునకలో అవార్డు పొందిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే ఒకే అవార్డుపైన ఒకరికి మాత్రమే ఉద్యోగం ఇవ్వాలి. కానీ ఇదివరకే ఉద్యోగం కేటాయించిన కుటుంబాలకు చెందిన ముగ్గురికి తిరిగి తెలుగుగంగ యంత్రాంగం ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకొని అనర్హులైనా, అర్హుల జాబితాలోకి చేరుస్తున్నట్లు సమాచారం. చాపాడు మండలం చీపాడులో ఒకరు, మైదుకూరు మండలం జీవీసత్రంలో మరొకరు, బి.మఠం మండలం జడ్.కొత్తపల్లెలో స్థిరపడిన ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఆ మూడు కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఇది వరకే ఉద్యోగాలు దక్కాయి. నకిలీ సర్టిఫికెట్లతో సైతం.. టెక్నికల్ అసిస్టెంట్ల ఎంపికకు ఐటీఐ సివిల్ లేదా పాలిటెక్నిక్ సివిల్ కనీస అర్హత. అయితే సివిల్ చేయకపోయినా నకిలీ సర్టిఫికెట్లతో ఇదివరకే కొంతమంది ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. మరోమారు అలాంటి పరిస్థితి పునరావృతం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఆయా యూనివర్సిటీలకు పరిశీలనకు పంపకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. కాగాఈ విషయాల గురించి తెలుగుగంగ ఎస్ఈ కోటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. -
సగం భూమిని చుట్టేశారు!
దేశం కోసం సైన్యంలో పనిచేశారు... ఆ సేవల నుంచి విరామం తీసుకొని విదేశం వెళ్లారు. అక్కడి స్థిరనివాసి అయ్యారు. ఇక శేష జీవితాన్ని గడిపేయడమే తరువాయి అనుకొంటున్న సమయంలో ఆయన ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టారు. 70 యేళ్ల వయసు దాటాకా సగం భూమిని చుట్టేసిన ఘనత ప్రవాసాంధ్రులు మాధవపెద్ది శివరామ్ గారిది... మిలటరీ టు అమెరికా... 1944లో కృష్జా జిల్లా కంకిపాడు సమీపంలోని పామర్రులో జన్మించాను. తెనాలిలో విద్యాభ్యాసం ముగించాను. 1965లో డిగ్రీ పూర్తి చేశాను. 1966లో ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్‌గా చేశాను. 1972లో కెప్టన్‌గా పనిచేసి రాజీనామా చేశాను. 1972-88 మధ్య హైదరాబాద్‌లో ఓ పరిశ్రమ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత కొంత కాలానికి అమెరికా వెళ్లాను. అక్కడ వివిధ రకాల పెద్ద ఉద్యోగాలు చేశాను. 1988లో గ్రీన్‌కార్డు వచ్చింది. 2007లో నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. భూమి చుట్టూ తిరగాలని... గుండ్రంగా ఉన్న భూమి చుట్టూ తిరగాలని, కాశీలో తొమ్మిది రాత్రులు నిద్రించాలని కోరికలు ఉండేవి. 70 ఏళ్ల వయస్సులో ఇప్పుడు అవి సాధ్యమా అంటారు కొందరు. కానీ పట్టుదల.. కోరిక.. తపన.. ఉంటే చాలు దేనినైనా సాధించవచ్చు. ఆకాశ మార్గం సగభాగం భూమి చుట్టూ ప్రయాణించాను. కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేశాను. విహార యాత్రలతో విజ్ఞానం.. ఎంత ఎక్కువగా విహారయాత్రలు చేస్తే అన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. 70 సంవత్సరాల వయస్సులో కూడా భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నా. తుది శ్వాస వరకు ఎన్ని వీలైతే అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాను. - కోన సుధాకర్ రెడ్డి -
‘గౌతమి’ గుర్తుకొచ్చింది..
తాళ్లపూసపల్లి వద్ద హౌరా ఎక్స్‌ప్రెస్ చక్రాల నుంచి మంటలు బ్రేక్ పట్టేయడంతో ఘటన పొగతో ఆందోళన చెందిన ప్రయాణికులు రైలు దిగి దూరంగా పరుగులు కాజీపేట రూరల్ : 2008 జూలై 31.. అంటే ఆరేళ్ల క్రితం జిల్లాలోని కేసముద్రం-తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల నడుమ సికింద్రాబాద్-కాకినా డ గౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్నికి ఆహుతైంది. సరిగ్గా అదే ప్రాంతంలో హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18645)కు ఆదివా రం అలాంటి ప్రమాదమే త్రుటిలో తప్పింది. మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధిం చిన వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మానుకోట నుంచి బయలుదేరిన పది నిమిషాలకే రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లి వస్తున్న మహిళ లు, అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుని తిరుగుముఖం పట్టిన వారితో ఆదివారం మధ్యాహ్నం హౌరా ఎక్స్‌ప్రెస్ కిక్కిరిసింది. ఈ రైలు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు వరంగల్ వైపు అప్‌లైన్‌లో బయలుదేరింది. ఆ వెంటనే వేగం పుంజు కో గా.. తాళ్లపూసపల్లి స్టేషన్ నుంచి రైలు మొత్తం బయటకు వెళ్లకముందే ఎస్-4 బోగీ చక్రాల నుంచి పొగలు వెలువడ్డాయి. రైలులో ఉన్న ఖ మ్మం వాసి, సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ కమ్యూనికేషన్ విభాగం ఉద్యోగి టి.ప్రశాంత్‌కుమార్ ఏం జరిగిందోనని రెండు బోగీల మధ్య ఉన్న ఖాళీ స్థలం నుంచి గమనించాడు. చక్రాన్ని పట్టే బ్రేక్ పట్టీ వద్ద నుంచి చిన్నగా మంటలు వస్తుండడాన్ని చూసి న ఆయన తోటి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే పొగలు కమ్ముకుంటుం డగా, కొందరు చైన్ లాగడంతో తాళ్లపూసపల్లి స్టేషన్ చివరలో రైలు నిలిచిపోయింది. మంటలు వస్తున్నాయని చెప్పడం, పొగలు విపరీతంగా రావడంతో రైలులోని చంటి పిల్లలతో ఉన్న మహిళ లు, వృద్ధులు.. ఇలా అందరూ ఒక్కసారి కంగారుకు లోనై రైలు నుంచి కిందకు దూకారు. పక్క నే కంకర కుప్పలు ఉండడంతో కొందరు కింద పడ్డారు. ఇంతలోనే రైలులో ఉన్న తాళ్లపూసపల్లి గ్యాంగ్మన్ నాగరాజు, మరికొందరు బాటిళ్లతో నీరు చల్లి నిప్పు ఆర్పారు. మంటలు ఆరిపోయి నా పొగలు మాత్రం ఆగకపోగా ఇంకా దట్టం కావడంతో ప్రయాణికులు దూరంగా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైలు గార్డ్ కూ డా అక్కడకు చేరుకుని చక్రాన్ని బ్రేక్ పట్టివేయడంతో పొగలు వచ్చాయని తెలిపారు. అయినా పొగలు ఆగకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆ తర్వాత పది నిమిషాలకు పొగలు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులందరూ కంగారుగానే రైలు ఎక్కారు. కిక్కిరిసిన జనరల్ బోగీలు రాఖీ పండుగకు వచ్చి తిరుగు ప్రయాణమైన వారితో హౌరా ఎక్స్‌ప్రెస్‌లోని రైలు జనరల్ బోగీలు కిక్కిరిసిపోగా చాలా మంది రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కారు. కానీ కొందరు ఎస్-4 లోకి కాకుండా వేరే బోగీల్లోకి ఎక్కారు. ఇందులోకి కొందరు రిజర్వేషన్ ఉన్న వారు కూడా ఆ బోగీ ఎక్కాలంటే భయపడ్డారు. ఈ సందర్భంగా ఆరేళ్ల క్రితం నాటి గౌతమి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఇప్పుడు హౌరా రైలు చక్రాల నుంచి నుంచి మంటలు రావడాన్ని పో ల్చుకుని ఆందోళన చెందారు. అలాగే, విష యం టీవీల్లో స్క్రోలింగ్ వస్తుండగా చూసిన ప్రయాణికుల బంధువులు ఫోన్ చేయడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్ది చెప్పడం కనిపించింది. -
వేసవి సెలవులు..!
ఒకవైపు ‘బాహుబలి’, మరోవైపు ‘రుద్రమదేవి’లాంటి భారీ చిత్రాల్లో నటిస్తూ గత కొన్ని నెలలుగా రానా బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఆషామాషీవి కావు. శారీరక శ్రమకు ఆస్కారమున్న పాత్రలు అవి. గత కొన్ని నెలల్లో అడపా దడపా షూటింగ్‌కి కొంత గ్యాప్ వచ్చినా, రానాకి సుదీర్ఘ విరామం అంటూ దొరకలేదు. అది ఇప్పటికి లభించింది. కొన్ని రోజులుగా ‘బాహుబలి’కి సంబంధించిన షెడ్యూల్లో పాల్గొన్నారు రానా. ఈ షెడ్యూల్ ముగిసిందని, ఇంకొన్ని నెలల తర్వాతే తదుపరి షెడ్యూల్లో పాల్గొననున్నానని రానా చెప్పారు. తను అంగీకరించిన కొత్త చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది. సో... దాదాపు నెల రోజుల పాటు రానాకి వేసవి సెలవులు దొరికినట్లే.