Samantha Ruth Prabhu To Suffer A Whopping Loss Of Rs 12 Crores, Check Reason Inside - Sakshi
Sakshi News home page

Samantha Ruth Prabhu: సినిమాలకు బ్రేక్‌: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?

Published Thu, Jul 20 2023 7:56 PM | Last Updated on Thu, Jul 20 2023 8:09 PM

Samantha Ruth Prabhu To Suffer A Whopping Loss Of Rs 12 Crores Due To Her Break From The Films - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌, పాన్-ఇండియా యాక్టర్‌ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది.  మైయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికే సమంత రూత్ ప్రభు సినిమాలకు దాదాపు ఏడాది పాటు విరామానికి సిద్ధమైందని అంచనా.  ఈ నేపథ్యంలో  ఈ  బ్రేక్‌ వల్ల ఆమె ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని  సమాచారం.

సమంత రూత్ ప్రభు  సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత  ఈ బ్రేక్‌కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్‌లన్నింటినీ  పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్‌లను, సినిమాలు దేనికీ  ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ  ఈ విరామంలో   దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్‌ల ద్వారా  తెలుస్తోంది.  సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్‌మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు  రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్‌: మురిసిపోతున్న కాబోయే కోడలు)

పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం  యూఎస్‌ వెళ్లనుంది.  అయితే బ్రేక్‌  ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం  కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.  ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ కూడా త్వరలోనే  విడుదలకు సిద్ధమవుతోంది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement