సినిమాలకు బ్రేక్‌ తీసుకున్న శ్రీలీల.. కారణం ఇదేనా? | Actress Sreeleela Will Take A Small Break For Movies, Know Reason Inside - Sakshi
Sakshi News home page

Sreeleela Take Break From Movies: సినిమాలకు బ్రేక్‌ తీసుకున్న శ్రీలీల.. కారణం ఇదేనా?

Published Wed, Aug 23 2023 11:35 AM | Last Updated on Wed, Aug 23 2023 12:08 PM

Sreeleela Take A Small Break For Movies - Sakshi

టాలీవుడ్‌లో శ్రీలీల ట్రెండ్‌ కొనసాగుతుంది.  2019లో 'కిస్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్​గా తెరంగేట్రం చేసిన ఈ యంగ్ బ్యూటీ 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఎనర్జిటిక్ డ్యాన్స్​లతో పాటు గ్లామర్ షోతో యూత్‌కు బాగా దగ్గరైంది. ఇంకేముంది టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టారు.  రవితేజతో కలిసి చేసిన 'ధమాకా' చిత్రం తర్వాత తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అందులో ఆమె చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

(ఇదీ చదవండి: స్టార్‌ హీరోతో నిత్యామీనన్‌ పెళ్లి.!)

ప్రస్తుతం టాలీవుడ్‌లో మీడియం రేంజ్‌ హీరోలతో పాటు స్టార్‌ హీరోలకు కూడా ఈ కన్నడ బ్యూటీనే ఫస్ట్‌ ఛాయిస్‌ అని చెప్పవచ్చు. ప్రిన్స్‌ మహేష్‌ బాబు సినిమాకు కూడా ఆమెను తీసుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఆమెకు ఉన్న క్రేజ్‌నే అని చెప్పవచ్చు.  శ్రీలీల చేతిలో దాదాపు పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా తన కోసం రెడీగా ఉన్నాయి. ఈ బ్యూటీ సిగ్నల్‌ ఇస్తే అవి కూడా ఖారారు అవుతాయి. రాబోయే రెండేళ్ల వరకూ ఆమె డేట్స్​కు భారీ డిమాండ్ ఉంటుందనే చెప్పాలి.

(ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌లోకి ఆ స్టార్‌ హీరో, హీరోయిన్‌.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్‌)

పవన్ కల్యాణ్‌, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇలా పలు భారీ ఆఫర్లతో ఆమె ఫుల్‌ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె రెండు నెలలపాటు సినిమాలకు బ్రేక్‌ ఇవ్వాలని షాకింగ్‌ డెషిషన్‌ తీసుకుందట. నవంబర్‌ నుంచి జనవరి వరకు ఎప్పుడైనా ఈ బ్రేక్‌ తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్‌ (MBBS) చదువుతున్న  విషయం తెలిసిందే.. ఈ ఏడాదితో తన చదువు కూడా పూర్తి అవుతుందట. తాజాగ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ రావడంతో ప్రిపరేషన్‌ కొనసాగించాలని  నిర్ణయానికి శ్రీలీల వచ్చారట. ఆమె సూచన మేరకు టాలీవుడ్‌ హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement