ఆ మూడు నెలలు విరామం | three months break | Sakshi
Sakshi News home page

ఆ మూడు నెలలు విరామం

Published Wed, May 24 2017 2:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

ఆ మూడు నెలలు విరామం

ఆ మూడు నెలలు విరామం

ప్రసుత్తం సినిమా వార్తలన్నీ చెన్నై చిన్నది సమంత చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా వార్త ఏమిటంటే ఆ మూడు నెలలు ఆ భామ నటనకు విరామం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంమత తన ప్రేమికుడు, టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్యను మనువాడనున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి అక్టోబర్‌ 6వ తేదీన ముహూర్తం కూడా కుదిరింది. దీంతో ఇప్పటి నుంచే తమ హనీమూన్‌కు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న సమంత సోమవారం తమ వివాహ తంతు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకున్నారు.

పెళ్లి అనంతరం నటనను కొనసాగించాలని నిర్ణయించుకున్న సమంత వివాహానికి ఒక నెల ముందు, ఆ తరువాత మరో రెండు అంటూ మూడు నెలలు నటనకు విరామం ప్రకటించాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో తనకు కాబోయే మామ నాగార్జునతో కలిసి రాజుగారి గది– 2 చిత్రంతో పాటు, రామ్‌చరణ్‌కు జంటగా ఒక చిత్రం, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న మహానటి సావిత్రి జీవిత చరిత్రలోనూ నటించనున్నారు.

అదే విధంగా తమిళంలో విజయ్‌తో ఆయన 61వ చిత్రంలోనూ, శివకార్తికేయన్‌తో మరో చిత్రం, అనీతికథైగళ్‌ అనే ఇంకో చిత్రంలోనూ నటించనున్నారు. వీటిలో విజయ్‌కు జంటగా నటించనున్న చిత్రానికి వచ్చే నెల నుంచి కాల్‌షీట్స్‌ కేటాయించారని సమాచారం. మరి ఆ తరువాత శివకార్తికేయన్, చిత్రం చేస్తారా? అనీతి కథైగళ్‌ చిత్రానికి ముందు ప్రైయారిటీ ఇస్తారా? లేక ఈ రెండు చిత్రాలను పెళ్లి తరువాతే అంటూ వాయదా వేస్తారా?అన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement