త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ! | Naga Chaitanya Deletes Last Picture Of Samantha Ruth Prabhu On His Instagram, Goes Viral | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: త్వరలో నాగచైతన్య- శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!

Published Sun, Oct 27 2024 7:57 PM | Last Updated on Mon, Oct 28 2024 10:42 AM

Naga Chaitanya deletes last picture of Samantha Ruth Prabhu on his Instagram

అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న చైతూ ఈ ఏడాది డిసెంబర్‌లో వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు తొలిసారిగా జంటగా కనిపించారు. అంతేకాకుండా ఇటీవలే పెళ్లి పనులు మొదలైన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

‍అయితే గతంలో సమంతను పెళ్లాడిన నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు 2021లో తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆగస్టులో శోభిత-చైతూ ఎంగేజ్‌మెంట్‌ తర్వాత కూడా ఆయన ఇన్‌స్టాలో సమంతతో ఉన్న ఫోటోలను నెటిజన్స్ గుర్తించారు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్, 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన చిత్రం కూడా ఉంది. అందులో  "బ్యాక్ త్రో ...మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్" అని క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చారు.

nagachaiytanya

అయితే తాజాగా ఆ ఫోటోను నాగ చైతన్య తన ఇన్‌స్టా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇటీవల చైతూ నిశ్చితార్థం సమయంలో ఆమెపై గౌరవంతో ఆ పోస్ట్‌ను తొలగించాలంటూ సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో శోభితతో పెళ్లికి ముందే ఆ పోస్ట్ నాగచైతన్య తొలగించినట్లు అర్థమవుతోంది. కాగా.. 2017లో పెళ్లి చేసుకున్న సమంత- చైతూ వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement