స్కోడా చకన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తికి బ్రేక్‌ | Production Brake At Skoda Chakan Plant | Sakshi
Sakshi News home page

స్కోడా చకన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తికి బ్రేక్‌

Nov 27 2019 2:13 AM | Updated on Nov 27 2019 2:13 AM

Production Brake At Skoda Chakan Plant - Sakshi

న్యూఢిల్లీ: కొత్త ఉత్పత్తుల తయారీకి అనుకూలంగా అప్‌గ్రేడ్‌ చేసే దిశగా పుణెలోని చకన్‌ ప్లాంటులో నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా వెల్లడించింది. డిసెంబర్‌ మధ్య నుంచి జనవరి మధ్య దాకా కార్యకలాపాలు ఆపివేయనున్నట్లు వివరించింది. ఇటీవలే అక్టోబర్‌–నవంబర్‌ మధ్యలో కూడా స్కోడా నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేసింది. ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ ఇండియా ఈ ఏడాదే తమ మూడు ప్యాసింజర్‌ కార్ల తయారీ అనుబంధ సంస్థలన్నింటినీ ఒకే సంస్థగా స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా కింద మార్చింది. ఇందులో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ సేల్స్‌ ఇండియా, స్కోడా ఆటో ఇండియా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement