Chakan Plant
-
2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి.. మహీంద్రా అండ్ మహీంద్రా లక్ష్యం
కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా): మహారాష్ట్రలోని చకాన్‌లో నెలకొల్పుతున్న ప్లాంటు నుంచి వార్షికంగా 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని సాధించాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నిర్దేశించుకుంది. 2027–29 మధ్య కాలంలో దీన్ని సాధించగలమని సంస్థ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) వీజే నక్రా తెలిపారు. 2030 నాటికల్లా తమ మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. బీఈ శ్రేణిలో తొలి వాహనాన్ని వచ్చే ఏడాది ఆఖర్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతకన్నా 4–5 నెలల ముందు నుంచే చకాన్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కాగలదని నక్రా వివరించారు. చకాన్‌లో రూ. 10,000 కోట్లతో విద్యుత్ వాహనాల ప్లాంటును నెలకొల్పేందుకు కంపెనీకి ఈ ఏడాది జనవరిలో అనుమతులు లభించాయి. బార్న్ ఎలక్ట్రిక్ (బీఈ) మోడల్స్ తయారీ కోసం ఈ ప్లాంటుపై వచ్చే 7–8 ఏళ్లలో కంపెనీ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఎక్స్‌యూవీ, కేవలం విద్యుత్ వాహనాల కోసమే ఉద్దేశించిన బీఈ బ్రాండ్ల కింద మొత్తం అయిదు ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్స్‌ను ప్రవేశపెట్టడంపై కంపెనీ కసరత్తు చేస్తోంది. -
స్కోడా చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తికి బ్రేక్
న్యూఢిల్లీ: కొత్త ఉత్పత్తుల తయారీకి అనుకూలంగా అప్‌గ్రేడ్ చేసే దిశగా పుణెలోని చకన్ ప్లాంటులో నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వెల్లడించింది. డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య దాకా కార్యకలాపాలు ఆపివేయనున్నట్లు వివరించింది. ఇటీవలే అక్టోబర్–నవంబర్ మధ్యలో కూడా స్కోడా నెల రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేసింది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఇండియా ఈ ఏడాదే తమ మూడు ప్యాసింజర్ కార్ల తయారీ అనుబంధ సంస్థలన్నింటినీ ఒకే సంస్థగా స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కింద మార్చింది. ఇందులో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా ఉన్నాయి. -
త్వరలో మహీంద్రా ఇంపీరియో..
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వచ్చే నెలలో ఇంపీరియో బ్రాండ్ కింద ప్రీమియం పికప్ వాహనాన్ని మార్కెట్లోకి తేనున్నది. తేలిక రకం వాణిజ్య వాహనాల(ఎల్సీవీ) సెగ్మెంట్లో తన అగ్ర స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే చర్యల్లో భాగంగా ఈ ఇంపీరియో వాహనాన్ని మహీంద్రా తెస్తోంది. పుణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో ఈ వాహనాన్ని తయారు చేయనున్నామని మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల అవసరాలకు తగ్గట్లుగా ఈ ఇంపీరియో వాహనాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.