![Skoda First e SUV Set to launch in September 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/skoda.jpg.webp?itok=lFqtzLBh)
వాహన తయారీ సంస్థ స్కోడా ఇండియా (Skoda) నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ ఏడాదే వస్తోంది. సెప్టెంబర్ కల్లా భారతీయ రోడ్లపై స్కోడా ఎన్యాక్ (Skoda Enyaq) పరుగు తీయనుంది. తొలుత పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు. 63, 82 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్స్‌తో రూపుదిద్దుకుంది.
పర్ఫార్మెన్స్, రేంజ్
ఎన్యాక్ అధునాతన ఎలక్ట్రిక్ మోటార్లతో థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు తక్షణ టార్క్‌ను అందిస్తాయి. ఎన్యాక్ ఆకట్టుకునే రేంజ్ కలిగి ఉంది. ఒకసారి చార్జింగ్‌తో బ్యాటరీని బట్టి 439–597 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. గంటకు 100 కి.మీ. వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుంది. 30 ని. చార్జింగ్ 10 నుంచి 80 శాతానికి చేరుతుంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_440.jpg)
డిజైన్, స్టైల్
ఎన్యాక్ దృఢమైన లైన్లు, ఉల్లాసమైన ఆకారాలను కలిగి ఉంటుంది. సిగ్నేచర్ స్కోడా గ్రిల్, ఎలక్ట్రిక్ ఓరియెంటెడ్ రీమేక్ అయినప్పటికీ, ఇప్పటికీ దాని ఐకానిక్ ఫీచర్‌ను కలిగి ఉంది. సొగసైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, వంపులు ఆధునిక లుక్ అందిస్తాయి.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/2_165.jpg)
Comments
Please login to add a commentAdd a comment