Britney Spears Announces Takes A Break From Social Media Amid Pregnancy, Deets Inside - Sakshi
Sakshi News home page

Britney Spears: దూరంగా ఉంటానన్న సింగర్‌, కానీ డబ్బుల కోసం మళ్లీ మొదలుపెట్టింది!

Published Tue, Apr 26 2022 1:27 PM | Last Updated on Tue, Apr 26 2022 1:53 PM

Britney Spears Announces Takes A Break From Social Media Amid Pregnancy - Sakshi

Britney Spears Announces Takes A Break From Social Media Amid Pregnancy: పాప్‌ సాంగ్స్‌ వినేవారు బ్రిట్నీ స్పియర్స్‌ అంటే తెలియను వారుండరు. తన అందమైన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకుంది పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌. ఈ ముద్దుగుమ్మ తన అభిమానులు నిరుత్సాహపడేలా తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. ఇక నుంచి కొంత కాలం సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటానంటోంది. సామాజిక మాధ్యమాల నుంచి ఒక చిన్న విరామం తీసుకుంటున్నట్లు తాజాగా పేర్కొంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉండట్లేదు బ్రిట్నీ స్పియర్స్‌. దీంతో తనకు ఏమైందో అని కంగారు పడ్డ అభిమానుల కోసం ఇన్‌స్టా వేదికగా ఆదివారం (ఏప్రిల్‌ 24) ఈ ప్రకటన చేసింది. 

చదవండి: హుషారైన స్టెప్పులతో ప్రణీత డ్యాన్స్‌

ఈ ప్రకటన చేస్తూ సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుని, రోబ్‌, రోలర్‌లను ధరించి కుర్చీలో కూర్చున్న అందమైన శిశువు వీడియోను షేర్ చేసింది. తన ప్రెగ్నెన్సీ కారణంగానే సోషల్ మీడియాకు బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నట్లుగా ఈ వీడియో సూచిస్తోంది. ఆమె ప్రెగ్నెంట్‌ అని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సింగర్‌కు కాబోయే భర్త సామ్‌ అస్గారితో తన మొదటి చైల్డ్‌ను ఆశిస్తోంది. సోషల్ మీడియా నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా బ్రిట్నీ స్పియర్స్‌ పలు పోస్టులు చేసింది. ఆ పోస్టులు పలు బ్రాండ్స్‌కు సంబంధించినవి. సెలబ్రిటీలు పలు కంపెనీల బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ క్యాష్‌ చేసుకుంటారన్న విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement