రన్ వేపై ఓ విమానం రెండు ముక్కలైంది. గురువారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే ఈ ఘటన చోసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జర్మనీకి చెందిన డీచ్‌ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం.. కోస్టారికాలోని సాన్ జోస్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరింది. అయితే కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తిందని పైలెట్.. అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్‌పోర్ట్ పర్మిషన్ కోరాడు. దీంతో అధికారులు అనుమతి ఇచ్చారు. తీరా.. ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చిన ఆ కార్గో విమానం రన్‌వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది.
అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తిందని, అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని ఎయిర్‌పోర్ట్ అధికారులు వివరించారు. అయినప్పటికీ ఈ ఘటనపై హైలెవల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు.
Video footage of the DHL Boeing 757 Freighter just as it skidded off the runway at SJO.
— AviationSource (@AvSourceNews) April 7, 2022
Read more at AviationSource!https://t.co/63ONa6oRCD
Source: Unknown#DHL #JuanSantamariaAirport #AvGeek #Crash #Accident pic.twitter.com/EI9ew6YVXN
Comments
Please login to add a commentAdd a comment