Costa Rica
-
అమెరికా కీలక ఒప్పందం.. భారత వలసదారులు ఇక కోస్టారికాకు!
శాన్‌జోస్: భారత అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలించాలని అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అగ్రరాజ్యం తమతో ఒప్పందం చేసుకున్నట్టు కోస్టారికా వెల్లడించింది. అందులో భాగంగా వలసదారుల తొలి విమానం బుధవారం తమ దేశానికి రానున్నట్టు కోస్టారికా అధ్యక్షుడు రొడిగ్రో చావెస్ రోబెల్ కార్యాలయం ప్రకటించింది.ఈ సందర్బంగా రొడిగ్రో మాట్లాడుతూ..‘భారత్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు చెందిన 200 మంది ఆ విమానంలో వస్తున్నారు. అనంతరం వారిని మాతృదేశాలకు పంపేస్తాం. ఈ విషయంలో అమెరికాతో సమన్వయం చేసుకుని పని చేస్తాం. ఇరు దేశాల మధ్య సంధానకర్త పాత్ర పోషిస్తాం’ అని తెలిపారు. అయితే 200 మందిలో భారతీయులు ఎందరన్నది మాత్రం వెల్లడించలేదు.అమెరికా తన సొంత నిధులతో చేపడుతున్న వలసదారుల తరలింపు ప్రక్రియను అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) పర్యవేక్షిస్తోంది. కోస్టారికాలో ఉన్నంతకాలం వలసదారుల సంరక్షణ తదితర బాధ్యతలను ఆ సంస్థే చూసుకోనుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతీయులను స్వదేశానికి పంపించింది. ఇదిలా ఉండగా.. పనామా హోటల్లో భారతీయులతో సహా పలు దేశాల అక్రమ వలసదారులు ఉన్నారు. యూఎస్ ఆదేశాల మేరకు పనామా ప్రభుత్వం వారికి అక్కడ బస ఏర్పాటు చేసింది. వలసదారుల్లో ఇరాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గాన్, చైనా ఇతర దేశాల వలసదారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా దేశాల అధికారులు వారిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేసే వరకు హోటల్లోనే ఉంటారని ఈ మేరకు పనామా వెల్లడించింది. పట్టుబడిన వారిలో 40 శాతం మంది సొంతంగా తమ దేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా లేరని పనామా అధికారులు పేర్కొన్నారు. Costa Rica Will Take Central Asian and Indian Migrants Deported by U.S.Costa Rica is the second Central American nation to accept migrants from distant countries as the Trump administration ramps up deportation flights. pic.twitter.com/AhCqKhiOIt— Deportation Counter (@DeportedNumber) February 18, 2025 -
Water Fasting : 21 రోజుల్లో 13 కిలోలు తగ్గాడు! ఇది సురక్షితమేనా?
బరువు తగ్గించుకోవడంకోసం ఉపవాసాలు, వ్యాయామాలు అంటూ ఊబకాయులు చాలా కష్టపడుతుంటారు. అయితే కోస్టా రికాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రీతిలో బరువు తగ్గాడు. 21 రోజుల్లో కేవలం నీరు మాత్రమే తాగి 13.1 కిలోల దాకా బరువు తగ్గాడు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడిస్ మిల్లర్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా తన వాటర్ఫాస్టింగ్ ప్రయాణాన్ని పంచుకున్నాడు. కోస్టా రికాలో 21 రోజుల పాటు నీటి ఉపవాసం (ఎలాంటి ఆహారం, ఉప్పు లేకుండానే) పాటించి 13.1 కేజీల బరువు తగ్గాడట. 6శాతం కొవ్వు తగ్గిందని అడిస్ వెల్లడించాడు. ఇప్పటికే సన్నగా ఉన్న మనిషి మరింత సన్నగా మారాడు. అయితే ఇది అందరూ ఆచరించవచ్చా? దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?నీటి ఉపవాసం సురక్షితమేనా?“నీటి ఉపవాసంలో కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలి. 24 గంటలమొదలు, కొన్ని రోజులు లేదా వారాల వరకు ముందుగా నిర్ణయించిన వ్యవధిలో ఇతర ద్రవాలు లేదా ఆహారాలు తీసుకోకూడదు. బరువు తగ్గడం, మెరుగైన జీర్ణక్రియ ,మెరుగైన మానసిక స్పష్టత, దీర్ఘాయువుతో సహా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. .నీటి ఉపవాసం సమయంలో, శరీరం కాలేయం , కండరాల కణజాలంలో నిల్వ ఉన్న గ్లైకోజెన్తో సహా నిల్వలపై ఆధారపడుతుంది.నిపుణుల సమక్షంలో మాత్రమేఅయితేఇది అంత సురక్షితం కాదనీ, సరైన వైద్య నిపుణుల సమక్షంలో మాత్రమే చెప్పాలని చెపుతున్నారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు. నీటి ఉపవాసం ప్రమాదాలు:పోషకాహార లోపాలు: విటమిన్లు, మినరల్స్ , ఎలక్ట్రోలైట్స్ వంటి ముఖ్యమైన పోషకాలలో లోపం ఏర్పడుడుతంది. ఫలితంగా బలహీనత, మైకం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.హైడ్రేషన్‌కు నీరు చాలా అవసరం అయితే, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది.జీవక్రియపై ప్రభావం : సుదీర్ఘ ఉపవాసం జీవక్రియను నెమ్మదిస్తుంది. ఉపవాసం ముగిసిన తర్వాత తిరిగి బరువు పెరగడానికి దారితీస్తుంది.మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, ఇతర కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు నీటి ఉపవాసం జోలికి వెళ్లకుండా ఉండాలి. లేదా నిపుణులైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.నీటి ఉపవాసానికి ప్రత్యామ్నాయం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా అడపాదడపా ఉపవాసాలను ఎంచుకోవచ్చు. ఎంత బరువు ఉండాలి అనేది నిర్ధారించుకుని, ఒక ప్రణాళిక ప్రకారం బరువు తగ్గాలి. నిరంతర వ్యాయామం, జీవనశైలి మార్పులు, పిండి పదార్థాలకు దూరంగా ఉంటూ, పీచు పదార్థాలు, చక్కని పోషకాహారం ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం. -
మొసలి దాడిలో ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారుడు మృతి
కోస్టారికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్(29) ప్రమాదవశాత్తు మొసలి దాడిలో ప్రాణాల కోల్పోయాడు. కోస్టారికాలోని కానస్ నదిలో ఈ ఘటన జరిగింది. వ్యాయామం చేస్తూ ఫిషింగ్ బ్రిడ్జ్ నుంచి ఓర్టిజ్.. నదిలో దూకాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నదిలో మొసళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ క్రీడాకారుడు నదిలో దూకినట్లు పేర్కొన్నారు. ఓర్టిజ్ కానస్ నదిలో దూకగానే భారీ పరిమాణంలో ఉన్న మొసలి అతన్ని నీటిలోకి లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కోస్టారికా రాజధాని సాన్ జోసెకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓర్టిజ్ని మొసలి నదిలోకి లాక్కెళ్లిన భయానక దృశ్యాలు తమను ఇంకా వెంటడాతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓర్టిడ్ ప్రముఖ డిపోర్టివో రియో కానాస్ క్లబ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కోస్టారికాకు చెందిన అసెన్సో లీగ్‌లో కూడా ఆయన కనిపించారు. సంబంధిత ఫేస్బుక్ పోస్టు ఆధారంగా ఓర్టిజ్ మరణాన్ని ఈ మేరకు జట్టు నిర్దారించింది. జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్ మరణంతో తమ జట్టు శోకసంద్రంలో మునిగినట్లు పేర్కొంది. ఓర్టిజ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరింది. 'ఆటగాడిగా, కోచ్‌గా నీ సేవలు మరవలేనివి. భౌతికంగా లేకపోయినా.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు' అని జట్టు తమ ఫేస్బుక్ పోస్టులో ఓర్టిజ్‌ను ఉద్దేశించి సంతాపం తెలిపింది. ఓర్టిజ్ శరీరాన్ని వెలికితీయడానికి స్థానిక యంత్రాంగం ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. -
మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట
గ్వాటెమాలాలో విహారయాత్రకు వెళ్లిన అమెరికాకు చెందిన ఓ జంటకు ఉబెర్ చుక్కలు చూపించింది తమరైడ్కు ఏకంగా 24 లక్షలు వసూలు చేయడం చూసి పాపం గుడ్లు తేలేసారు. ఎంతో ఆనందంగా తమ వివాహ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వెళ్లిన జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వివరాలను పరిశీలిస్తే.. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం ఆస్ట్రేలియన్ జంట డగ్లస్ ఆర్డోనెజ్ డొమినిక్ ఆడమ్స్ గ్వాటెమాలాకు తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా సుందరమైన పర్యాటక ప్రాంతం గ్వాటెమాలా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి నిర్దేశిత బిల్లు 55 డాలర్లు (దాదాపు రూ. 4,500) దీనికి దాదాపు 600 శాతం ఎక్కువగా 29,994 డాలర్ల (సుమారు రూ. 24 లక్షలు) వసూలు చేసింది. దీంతో ఏకంగా అకౌంట్మొత్తం ఖాళీ అయిపోయింది. (AI Anchor Lisa: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్) ఈ విషయాన్ని డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నో సఫీషియంట్ ఫండ్స్ అని మెసేజ్ వచ్చినపుడు గానీ గమనించలేదు. అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుని 24 లక్షల రూపాయలు ఖతం కావడంతో లబోదిబోమన్నారు. ఇది తమ ఉత్సాహాన్ని నీరు గార్చేసిందని డగ్లస్ ఆర్డోనెజ్ వాపోయాడు. అయితే కొన్ని రోజుల తరువాత అదృష్టవశాత్తూ మొత్తం రీయింబర్స్మెంట్ అయినప్పటికీ, ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఆందోళనలో మునిగి పోయాయని సంస్థ కస్టమర్ సర్వీస్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆడమ్స్. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) ఈ ఎర్రర్‌ను గుర్తించి, రీయింబర్స్మెంట్ చేశామని ఉబెర్ ప్రతినిధి తెలిపారు. బ్యాంక్ లోపం కారణంగా పొరపాటుగా కాలన్లలో కాకుండా డాలర్లలో ఫీజు వచ్చిందని తెలిపింది. కస్టమర్లు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటామని, స్వీకరించిన, వారి సమస్యను తమ టీం త్వరగా సరిదిద్దిందని వెల్లడించారు. నిర్దిష్ట బ్యాంకుల విధానాల ఆధారంగా రీఫండ్ సమయం మారుతుందని ప్రతినిధి పేర్కొన్నారు. -
FIFA WC: జపాన్ గోల్‌పై వివాదమెందుకు? నిజంగానే జర్మనీ నాకౌట్‌కు చేరేదా?!
FIFA World Cup 2022 Japan Vs Spain: ఫిఫా వరల్డ్‌కప్-2022లో స్పెయిన్‌తో మ్యాచ్‌లో జపాన్ సాధించిన రెండో గోల్ వివాదాస్పదంగా మారింది. రిట్సు కొట్టిన కిక్‌తో బంతి స్పెయిన్ గోల్‌పోస్ట్ ఎడమ వైపునకు వెళ్లింది. అయితే దానిని వెంబడించిన మిటోమా బంతిని నియంత్రణలోకి తెచ్చుకొని వెనక్కి తోశాడు. అక్కడే సిద్ధంగా ఉన్న టనాకా దానిని గోల్‌గా మలిచాడు. అయితే అసిస్టెంట్ రిఫరీ గోల్ చెల్లదని ప్రకటించాడు. బంతి ‘బైలైన్’ను దాటేసిందని, ఆ తర్వాతే మిటోమా వెనక్కి తోశాడు కాబట్టి గోల్‌ను గుర్తించలేదు. అయితే ఇది వీడియో అసిస్టెంట్ రిఫరీ (వార్) వద్దకు వెళ్లింది. ఎన్నో కోణాల్లో రీప్లేలు చూసి తర్జనభర్జనల అనంతరం గోల్ సరైందేనని, బంతి ఇంకా గమనంలోనే ఉందన్న రిఫరీ గోల్‌ను గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇదే వివాదంగా మారింది. రీప్లే తొలి యాంగిల్ నుంచి చూస్తే బంతి లైన్ దాటేసినట్లే స్పష్టంగా కనిపిస్తోంది. కానీ తర్వాతి టాప్ యాంగిల్లో మాత్రం ఇంకా లోపలే ఉన్నట్లుగా ఉంది. భౌతిక శాస్త్రం ప్రకారం చెప్పాలంటే ‘ప్యారలాక్స్ ఎర్రర్’ (వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు వస్తువు యొక్క స్థానంలో కలిగే తేడా–దృష్టి విక్షేపం) ప్రభావమిది. ఇక్కడ సరిగ్గా అదే పని చేసింది. పైనుంచి చూస్తే బంతిలో కొంత భాగం లైన్పైనే ఉన్నట్లుగా ఉంది. ‘ఫిఫా’ నిబంధనలను బట్టి దీనినే చివరకు సరైందిగా నిర్ధారించారు. తద్వారా ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జపాన్ గ్రూప్- ఇ టాపర్‌గా నాకౌట్ దశకు చేరుకుంది. జపాన్ వల్ల.. అలా జర్మనీ కథ ముగిసింది ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు విశ్వ విజేత జర్మనీని చిత్తు చేసిన జపాన్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ అదే దూకుడు కనబర్చి మరో మాజీ చాంపియన్‌ను ఓడించింది. ఫలితంగా వరుసగా రెండో వరల్డ్ కప్‌లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్ ‘ఇ’ మ్యాచ్‌లో జపాన్ 2–1 గోల్స్ తేడాతో 2010 విజేత స్పెయిన్‌ను ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. జపాన్ తరఫున రిట్సు డోన్ (48వ ని.లో), ఆవో టనాకా (51వ ని.లో) గోల్స్ సాధించగా, స్పెయిన్ జట్టు నుంచి మొరాటా (11వ ని.లో) ఏకైక గోల్‌ను నమోదు చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడినా స్పెయిన్‌కు నష్టం జరగలేదు. రెండో స్థానంతో స్పెయిన్ ముందంజ వేసింది. పాయింట్ల సంఖ్యలో జర్మనీతో సమానంగానే నిలిచినా...గోల్స్ అంతరంలో జర్మనీని స్పెయిన్ వెనక్కి తోసింది. బంతి స్పెయిన్ ఆధీనంలోనే ఉన్నా... మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్ దూకుడు కనబర్చింది. 11వ నిమిషంలోనే వచ్చిన అవకాశాన్ని స్పెయిన్ సమర్థంగా ఉపయోగించుకుంది. సీజర్ అజ్పిలిక్యూటా ఇచ్చిన క్రాస్ పాస్‌ను హెడర్ ద్వారా మొరాటా గోల్‌గా మలిచాడు. అయితే రెండో అర్ధ భాగంలో జపాన్ ఒక్కసారిగా చెలరేగింది. 142 సెకన్ల వ్యవధిలో ఆ జట్టు రెండు గోల్స్‌తో ముందంజ వేసింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రిట్సు అనూహ్యంగా స్పెయిన్ ఆటగాళ్లందరినీ తప్పించి కొట్టిన కిక్కు కీపర్ ఉనై సైమన్ వద్ద జవాబు లేకపోయింది. కొద్ది సేపటికే టనాకా కొట్టిన గోల్ స్పెయిన్ నివ్వెరపోయేలా చేసింది. జపాన్ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. మ్యాచ్ మొత్తంలో కేవలం 17.7 శాతం సమయం మాత్రమే బంతి జపాన్ ఆధీనంలో ఉంది. వరల్డ్ కప్ చరిత్రలో అతి తక్కువ సమయం బంతిని ఆధీనంలోకి ఉంచుకొని మ్యాచ్ నెగ్గిన జట్టుగా జపాన్ రికార్డు నెలకొల్పింది. జర్మనీ గెలిచినా... 2018లోనూ గ్రూప్ దశకే పరిమితమైన జర్మనీ వరుసగా రెండోసారి నాకౌట్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. చివరి మ్యాచ్‌లో జర్మనీ 4–2 తో కోస్టారికాపై నెగ్గింది. జర్మనీ తరఫున జ్ఞాబ్రీ (10వ ని.లో), హావెట్జ్ (73వ, 85వ ని.లో), ఫల్రగ్ (89వ ని.లో) గోల్స్ సాధించగా... కోస్టారికా ఆటగాళ్లలో తెజెదా (58వ ని.లో), నూయెర్ (70వ ని.లో) గోల్స్ కొట్టారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో జపాన్ చేతిలో ఓడటంతోనే జర్మనీ అవకాశాలకు గండి పడింది. స్పెయిన్‌తో మ్యాచ్ ‘డ్రా’ చేసుకోవడంతో ఇక్కడ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు 4–2 సరిపోలేదు. చదవండి: IND vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్ బౌలర్.. బీసీసీఐ ప్రకటన FIFA WC 2022: ఘనాపై గెలిచినా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన మాజీ చాంపియన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక ఘట్టం.. ఆ మహిళామణులు ఎవరంటే!
FIFA World Cup 2022 Germany Vs Costa Rica: తొలిసారి మహిళా రిఫరీలు వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా జర్మనీ, కోస్టారికా మ్యాచ్‌కు ముగ్గురు మహిళలే రిఫరీలుగా వ్యవహరించడం విశేషం. పురుషుల ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారి. కాగా... స్టెఫానీ ఫ్రాపర్ట్ (ఫ్రాన్స్) ఫీల్డ్ రిఫరీగా, న్యూజా బ్యాక్ (బ్రెజిల్), కరెన్ డియాజ్ (మెక్సికో) అసిస్టెంట్ రిఫరీలుగా ఈ ఘనతలో భాగమయ్యారు. తదుపరి మ్యాచ్‌ల్లో సలీమా ముకన్సంగా (రువాండా), యోషిమి యామషిటా (జపాన్) కూడా ఫీల్డ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. 38 ఏళ్ల స్టెఫానీ 2019లో లివర్‌పూల్, చెల్సీ జట్ల మధ్య యూరోపియన్ కప్ పురుషుల సూపర్ కప్ ఫైనల్లో, 2020లో చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో, గత సీజన్లో ఫ్రెంచ్ కప్ ఫైనల్లోనూ రిఫరీగా వ్యవహరించింది. చదవండి: FIFA WC 2022: రెండు గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! భారీ షాకిచ్చిన జపాన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA: 2 గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! టోర్నీ నుంచి అవుట్
FIFA World Cup Qatar 2022: ఫిఫా వరల్డ్‌కప్-2022లో జర్మనీకి ఊహించని షాక్ తగిలింది. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఈ మేటి జట్టు ఈసారి కనీసం నాకౌట్ దశకు కూడా చేరలేకపోయింది. కోస్టారికాపై ఘన విజయం సాధించినప్పటికీ... జపాన్ కారణంగా దురదృష్టకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అసలేం జరిగిందంటే.. Germany Vs Costa Rica: గ్రూప్-ఇలో భాగమైన జర్మనీ శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోస్టారికాను 4-2తో ఓడించింది. అయితే, ఈ జట్టు ప్రిక్వార్టర్స్ చేరే క్రమంలో.. ఇదే గ్రూపులో ఉన్న జపాన్- స్పెయిన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అనూహ్య రీతిలో జపాన్, స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. దీంతో జర్మనీ నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి. జర్మనీ అవుట్.. ఎందుకంటే.. Japan Vs Spain: తాజా విజయంతో ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు గెలిచిన జపాన్ ఆరు పాయింట్లతో గ్రూప్- ఇ టాపర్‌గా నిలిచింది. ఇక జర్మనీ, స్పెయిన్ ఒక్కో విజయం సాధించి.. రెండేసి పాయింట్లు సంపాదించినప్పటికీ జర్మనీకి పరాభవం తప్పలేదు. ఈ రెండు జట్ల పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ గోల్స్ విషయంలో జర్మనీ(6 గోల్స్) వెనుకబడింది. తాజాగా జపాన్‌తో ఒక గోల్ చేయగలిగిన స్పెయిన్ మొత్తంగా 9 గోల్స్‌తో జర్మనీని వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. నిజానికి జపాన్ గనుక ఈ మ్యాచ్‌లో ఓడి ఉంటే.. జర్మనీ, స్పెయిన్ రౌండ్ 16కు అర్హత సాధించేవి. స్పెయిన్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన జపాన్ ఖాతాలో మొత్తంగా ఉన్నవి నాలుగు గోల్సే. అయినప్పటికీ గెలుపుతో ఆరు పాయింట్లు కొట్టేసి ముందడుగు వేసింది. కాబట్టి జర్మనీని దురదృష్టం వెంటాడిందని చెప్పొచ్చు. ఇక గ్రూప్-ఇ టాపర్‌గా జపాన్, రెండో స్థానంలో ఉన్న స్పెయిన్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకోగా.. జర్మనీ ఇంటిబాట పట్టింది. ఇక నవంబరు 23 నాటి మ్యాచ్‌లో మొదట జర్మనీని(1-2తో) ఓడించిన జపాన్.. తాజాగా స్పెయిన్ ఓడించింది. దీంతో జర్మనీ పాలిట జపాన్ శాపంగా మారిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి డేట్ ఫిక్స్! సెలవు మంజూరు చేసిన బీసీసీఐ! -
తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..
శాన్ జోస్: అభం శుభం తెలియని ఓ చిన్నారి.. జలరాకాసి నోట చిక్కి దారుణ స్థితిలో ప్రాణం కోల్పోయాడు. అదీ అంతా చూస్తుండగానే!. కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ ఘోరాన్ని చూస్తూ ఉండిపోయి.. కడసారి చూపు కోసం బిడ్డ శవం కూడా దొరక్క తల్లడిల్లిపోయారు ఆ తల్లిదండ్రులు. అయితే తాజాగా ఈ విషాదంలో మరో పరిణామం చోటు చేసుకుంది. కోస్టారికా లిమన్ నగరంలో నెల కిందట ఘోరం జరిగింది. బటినా నది దగ్గర కుటుంబం, బంధువులతో పాటు చేపల వేటకు వెళ్లిన ఓ చిన్నారిని.. 12 అడుగుల భారీ మొసలి నోటి కర్చుకుని నీళ్లలోకి లాక్కెల్లే యత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఆ చిన్నారి తల తెగిపడడంతో.. అక్కడున్నవాళ్లంతా షాక్‌తో కేకలు వేశారు. తలతో పాటు అక్కడి నుంచి నీళ్లలోకి వెళ్లిపోయింది ఆ మొసలి. అక్కడున్నవాళ్లంతా ఆ పరిణామం నుంచి తేరుకునేలోపే.. నిమిషాల వ్యవధిలో మళ్లీ వెనక్కి వచ్చిన మొసలి.. ఈసారి బాలుడి మొండెంను లాక్కెల్లింది. ఈ హఠాత్ పరిణామంతో ఆ పేరెంట్స్ రోదనలు మిన్నంటయ్యాయి. స్థానిక అధికారులు బాలుడి శరీరాన్ని రికవరీ చేసే యత్నం చేసి.. విఫలం అయ్యారు. బాధితుడిని ఎనిమిదేళ్ల జూలియో ఒటేరియో ఫెర్నాండేజ్గా గుర్తించారు. అక్టోబర్ 30వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఇది జరిగి దాదాపు నెల తర్వాత.. మొన్న శనివారం మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ వేటగాడు ఒటినా నదిలో పశువుల మీద దాడికి వచ్చిన ఓ మొసలిని కాల్చి చంపాడు. స్థానికులు దానిని ఒడ్డుకు లాక్కొచ్చి పొట్ట చీల్చి చూడగా.. కడుపులో మనిషి జుట్టుతో పాటు ఎముకల శకలాలు బయటపడ్డాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా.. అవి ఎనిమిదేళ్ల చిన్నారి జూలియోకు చెందినవే అని తేల్చారు. దీంతో ఆ మృత శకలాలను జూలియో తల్లిదండ్రులకు అప్పగించారు. ‘‘ఆరోజు మధ్యాహ్న సమయంలో మోకాళ్ల నీతులో జూలియో ఉన్నాడు. కాస్త దూరంలో అతని అన్నదమ్ములు, ఇతర బంధువులు ఉన్నారు. చూస్తుండగానే ఓ మొసలి వచ్చి వాడ్ని లాక్కెళ్లింది. తల తెగి పడడంతో తల్లి మార్గిని ఫ్లోరెస్ కుప్పకూలిపోయింది. మళ్లీ నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి మొండెం భాగాన్ని తీసుకెళ్లింది. అక్కడ ఉన్న గుహల్లోకి వెళ్లిపోయింది. అక్కడ చాలా మొసళ్లు ఉన్నాయి. అందుకే శవాన్ని రికవరీ చేయలేకపోయాం’’ అని అధికారులు వెల్లడించారు. మొసళ్ల జోన్‌గా ఆ ప్రాంతంలో చేపల వేటను నిషేధించినప్పటికీ.. కొంత మంది జాలర్ల అక్రమ వేటతో అక్కడున్న వార్నింగ్ ఫెన్సింగ్‌లు తొలగించారని, దీంతోనే చిన్నారి ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇదీ చదవండి: లవర్‌పై అనుమానంతో ఏకంగా.. -
FIFA World Cup 2022: జపాన్‌కు షాకిచ్చిన కోస్టారికా
ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా భారతకాలమానం ప్రకారం ఇవాళ (నవంబర్ 27) మధ్యాహ్నం 3:30 గంటలకు అహ్మద్ అలీ బిన్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఈ మ్యాచ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ జపాన్, 31 ర్యాంకర్ కోస్టారికా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కోస్టారికా.. తమ కంటే పటిష్టమైన జపాన్‌కు షాకిచ్చి (1-0) వరల్డ్‌కప్-2022లో బోణీ విజయం సాధించింది. రెండో అర్ధభాగం 81వ నిమిషంలో కీషర్ ఫుల్లర్ గోల్ కొట్టి కోస్టారికాను ఆధిక్యంలోకి తీసుకుకెళ్లాడు. అనంతరం జపాన్ ఎంత ప్రయత్నించినప్పటికీ.. గోల్ చేయలేక ఓటమిపాలైంది. ఈ గెలుపుతో కోస్టారికా గ్రూప్-ఈలో మూడో స్థానానికి ఎగబాకింది. ఇదిలా ఉంటే, మెగా టోర్నీలో నవంబర్ 23న జరిగిన మ్యాచ్‌లో జపాన్.. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ జర్మనీపై 2-1 తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే రోజు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోస్టారికా 0-7 గోల్స్ తేడాతో ఓటమిపాలై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. -
FIFA World Cup Qatar 2022: స్పెయిన్ ‘సెవెన్’ స్టార్ ప్రదర్శన
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టయిన స్పెయిన్ భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 2010 విశ్వవిజేత స్పెయిన్ 7–0 గోల్స్ తేడాతో కోస్టారికా జట్టును చిత్తుగా ఓడించింది. స్పెయిన్ తరఫున ఫెరాన్ టోరెస్ (31వ, 54వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... డానీ ఓల్మో (11వ ని.లో), మార్కో అసెన్సియో (21వ ని.లో), గావి (74వ ని.లో), కార్లోస్ సోలెర్ (90వ ని.లో), అల్వారో మొరాటా (90+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తమ ప్రపంచకప్ చరిత్రలో స్పెయిన్కిదే అతిపెద్ద విజయం. ఆ జట్టు ప్రపంచకప్ మ్యాచ్‌లో ఏడు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. కోస్టారికాతో మ్యాచ్‌లో స్పెయిన్ సంపూర్ ఆధిపత్యం చలాయించింది. 82 శాతం బంతి స్పెయిన్ ఆధీనంలో ఉండటం వారి ఆధిపత్యానికి నిదర్శనం. స్పెయిన్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా ఎనిమిది షాట్లు కొట్టగా... కోస్టారికా ఒక్కసారి కూడా స్పెయిన్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్ కొట్టలేకపోయింది. స్పెయిన్ ఆటగాళ్లు ఏకంగా 1,043 పాస్‌లు పూర్తి చేశారు. ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక మ్యాచ్‌లో ఇన్ని పాస్‌లు పూర్తి చేయలేదు. కోస్టారికా ఆటగాళ్లు 231 పాస్‌లతో సరిపెట్టుకున్నారు. ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ చేయడం 1934 తర్వాత ఇదే తొలిసారి. 1934లో బ్రెజిల్‌పై తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ సాధించింది. క్రొయేషియా 0 మొరాకో 0 గత ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ రన్నరప్ క్రొయేషియాను మొరాకో నిలువరించింది. బుధవారం గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన లీగ్ మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. సీనియర్ స్ట్రయికర్, క్రొయేషియా కెప్టెన్ మోడ్రిచ్ ఖాతా తెరిచేందుకు గట్టి ప్రయత్నాలే చేసిన మొరాకో ఆటగాళ్లు అడ్డుగోడ కట్టేయంతో గోల్ నమోదు కాలేదు. -
ఫిఫా వరల్డ్‌కప్ 2022కు అర్హత సాధించిన చివరి జట్టుగా కోస్టారికా
దోహా: అందివచ్చిన ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోస్టారికా జట్టు ఆరోసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. చివరి బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో కోస్టారికా 1–0తో గెలిచింది. ఆట మూడో నిమిషంలో జోయల్ క్యాంప్‌బెల్ గోల్ చేసి కోస్టారికాను ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న కోస్టారికా జట్టు విజయంతోపాటు బెర్త్‌ను ఖరారు చేసుకొని వరుసగా మూడోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. 50 లక్షల జనాభా కలిగిన కోస్టారికా ఇప్పటివరకు ఐదుసార్లు ప్రపంచకప్‌లో పాల్గొ ని 2014లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కోస్టారికా, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ దశ ముగిసింది. ఈ ఏడాది ఖతర్‌లో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో మొత్తం 32 జట్లు బరిలో ఉన్నాయి. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ జట్టుకు నేరుగా ఎంట్రీ లభించింది. -
రన్‌వే మీద రెండు ముక్కలైన విమానం.. వీడియో
రన్ వేపై ఓ విమానం రెండు ముక్కలైంది. గురువారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే ఈ ఘటన చోసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జర్మనీకి చెందిన డీచ్‌ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం.. కోస్టారికాలోని సాన్ జోస్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరింది. అయితే కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తిందని పైలెట్.. అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ పర్మిషన్ కోరాడు. దీంతో అధికారులు అనుమతి ఇచ్చారు. తీరా.. ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చిన ఆ కార్గో విమానం రన్‌వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది. అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తిందని, అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని ఎయిర్పోర్ట్ అధికారులు వివరించారు. అయినప్పటికీ ఈ ఘటనపై హైలెవల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. Video footage of the DHL Boeing 757 Freighter just as it skidded off the runway at SJO. Read more at AviationSource!https://t.co/63ONa6oRCD Source: Unknown#DHL #JuanSantamariaAirport #AvGeek #Crash #Accident pic.twitter.com/EI9ew6YVXN — AviationSource (@AvSourceNews) April 7, 2022 -
ఇట్స్ హాలీడే టైమ్
జీవితాన్ని ఆస్వాదించడం ఓ కళ. ఆ కళ కొందరికి తెలియదు. త్రిషకు మాత్రం బాగా తెలుసు. అలుపూ సొలుపూ లేకుండా షూటింగ్స్ చేసేయడం, డైరీలో కాస్త ఖాళీ దొరికితే హాలీడే ప్లాన్ చేసుకోవడం.. ఫుల్లుగా ఎంజాయ్ చేయడం. ఇది త్రిష మంత్ర. ప్రతి సంవత్సరం లాంగ్ ట్రిప్, షార్ట్ ట్రిప్.. ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు. వీలు కుదిరితే రెండు ట్రిప్స్ వెళతారు. ముఖ్యంగా ఇయర్ ఎండింగ్లో ఎక్కువగా వెళుతుంటారు. ఇప్పుడు త్రిష హాలీడే మూడ్‌లో ఉన్నారు. ఎక్కడికెళ్లారో తెలుసా? అమెరికాలోని కోస్టా రికాలో వాలిపోయారు. డిసెంబర్లో అక్కడి వాతావరణం చాలా బాగుంటుందట. పచ్చని ప్రదేశాలు, డైట్ పట్టించుకోకుండా లాగించేసేలా రుచికరంగా వడ్డించే రెస్టారెంట్లు... ఇలా రిలాక్స్ అవ్వడానికి బోల్డంత స్కోప్ ఉన్న ప్లేస్ కూడా. అందుకే త్రిష ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఇదిగో ఇక్కడ ఫొటోలో త్రిష ఎంత కూల్‌గా కనిపిస్తున్నారో చూశారా! కోస్టా రికాలో దిగిన ఫొటో ఇది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. త్రిష నటించిన తమిళ చిత్రం ‘96’ ఇటీవల విడుదలై, సూపర్ డూపర్ హిట్టయింది. ఆ ఆనందంలో ఉన్న త్రిషకు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘పేట్టా’లో నటించే అవకాశం దక్కింది. దాంతో డబుల్ హ్యాపీ. ఇంకా తమిళంలో మరో మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. కెరీర్ ఆరంభించి పదిహేనేళ్లయినప్పటికీ త్రిష కెరీర్ స్టడీగా ఉండటం విశేషం. -
కొస్టారికా, పనామా సరిహద్దుల్లో భూకంపం
-
స్విస్ ముందుకెళ్లింది..
నిజ్నీ నోవ్గొరడ్: ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ నాకౌట్‌కు చేరింది. గ్రూప్ ‘ఇ’లో గురువారం స్విట్జర్లాండ్, కోస్టారికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో డ్రా అయింది. దీంతో ఈ గ్రూప్‌లో 5 పాయింట్లతో ఉన్న స్విస్, బ్రెజిల్ (7)తో పాటు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని కోస్టారికా అట్టడుగుకు పడిపోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. స్విస్ తరఫున బ్లెరిమ్ జెమయిలి (31వ ని.), జోసిప్ డ్రిమిక్ (88వ ని.) గోల్ చేయగా, కోస్టారికా జట్టులో కెండల్ వాస్టన్ (56వ ని.) గోల్ సాధించాడు. మరో గోల్‌ను స్విట్జర్లాండ్ గోల్‌కీపర్ యాన్ సొమర్ ఇంజ్యూరీ టైమ్ (90+3వ ని.)లో సెల్ఫ్‌గోల్ చేశాడు. -
బ్రెజిల్...బతుకుజీవుడా!
గెలవకున్నా... నిలువరించేలా కనిపించిన కోస్టారికా నుంచి బతుకు జీవుడా అంటూ బ్రెజిల్ బయటపడింది. మ్యాచ్‌లో ఆధిపత్యం చాటకున్నా... గోల్‌కు అవకాశం ఇవ్వకుండా మాజీ చాంపియన్‌ను కోస్టారికా అసహనానికి గురి చేసింది. పరిస్థితి చూస్తే ఈ ప్రపంచ కప్‌లో తొలిసారిగా స్కోరేమీ లేకుండా మ్యాచ్ ముగిసేలా కనిపించింది. ఇంజ్యూరీ సమయంలో పుంజుకున్న బ్రెజిల్ అనూహ్యంగా రెండు గోల్స్ చేసి విజయాన్ని ఒడిసిపట్టింది. ప్రత్యర్థిని టోర్నీ నుంచి బయటకు పంపించింది. సెయింట్ పీటర్స్బర్గ్: పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఆడుతున్న చిన్న జట్లు... ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్లకు చుక్కలు చూపిస్తున్నాయి. మేటి జట్లను కలవరపాటుకు గురిచేస్తూ... విజయం కోసం చెమటోడ్చేలా చేస్తున్నాయి. గ్రూప్ ‘ఇ’లో భాగంగా శుక్రవారం బ్రెజిల్‌పై కోస్టారికా ఇదే విధంగా ఆడి నిలువరిస్తుందేమో అనిపించింది. అయితే, ఒత్తిడిని తట్టుకుని నిలిచిన బ్రెజిల్... కీలకమైన ఇంజ్యూరీ సమయంలో గోల్స్ చేసి 2–0తో గెలుపొందింది. ఆ జట్టు తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిలిఫ్ కౌటిన్హొ (90+1 నిమిషం), నెమార్ (90+7 నిమిషం) చెరో గోల్ చేశారు. ఈ విజయంతో బ్రెజిల్ ప్రిక్వార్టర్స్ అవకాశాలు సజీవంగా ఉండగా, రెండు ఓటములతో కోస్టారికా కప్ నుంచి నిష్క్రమించింది. ఓ దశలో ఎంత ప్రయత్నించినా గోల్స్ కాకపోవడంతో రెండు జట్ల ఆటగాళ్లు అసహనానికి గురై ఫౌల్స్ చేశారు. దీంతో ఇంజ్యూరీ సమయం పెరిగింది. ఇది కూడా బ్రెజిల్‌కు కలిసొచ్చింది. చివరి క్షణాల్లో నెమార్ గోల్ కొట్టి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. బంతి చిక్కినా... గోల్ దక్కలే... బ్రెజిల్ నైపుణ్యానికి... కోస్టారికా పోరాటానికి పరీక్షలా సాగింది మొదటి భాగం. మ్యాచ్‌లో కోస్టారికా ప్రారంభం చూస్తే... ప్రణాళికతో దిగినట్లు కనిపించింది. బ్రెజిల్ తమ డిఫెన్స్‌ను పదేపదే ఒత్తిడిలోకి నెడుతున్నా, బంతిని దొరకబుచ్చుకోవడానికి యత్నించిన ఆ జట్టు ఆటగాళ్లు ప్రతి దాడులకూ వెరవలేదు. సహజ శైలిలో కనిపించని బ్రెజిల్ జట్టును చికాకు పెట్టారు. ఈ క్రమంలో మార్కొస్ యురేనా, క్రిస్టియన్ గంబోవాకు అవకాశాలు దక్కినా ఫినిషింగ్ లోపంతో చేజారాయి. మరోవైపు బంతిని పూర్తిగా ఆధీనంలో ఉంచుకుంటూ బ్రెజిల్... ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగింది. అయితే డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. దీంతో మొదటి భాగం గోల్సేమీ లేకుండా ముగిసింది. ఈ భాగంలో 70 శాతం బంతి బ్రెజిల్ ఆటగాళ్ల వద్దే ఉండటం గమనార్హం. రెండో భాగంలోనూ శూన్యమే... సబ్స్టిట్యూట్లను దించకుండానే కోస్టారికా రెండో భాగాన్ని ప్రారంభించింది. ఆటలో ఆధిపత్యం కొనసాగిస్తూ వేగం, దూకుడు పెంచిన బ్రెజిల్‌కే అవకాశాలు చిక్కాయి. గ్రాబియెల్ జీసస్ కొట్టిన హెడర్, కౌటిన్హొ షాట్లు కొద్దిలో తప్పిపోయాయి. మరోవైపు కోస్టారికా ఆటగాళ్లు బ్రయాన్ రూయిజ్, సెల్సొ బొర్జెస్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, రెండు, మూడుసార్లు గోల్‌పోస్ట్‌కు దగ్గరగా వచ్చిన బ్రెజిల్ స్టార్ నెమార్... సఫలం కాలేకపోయాడు. గోల్ లేకుండానే నిర్ణీత సమయం పూర్తయింది. కానీ ఇంజ్యూరీ మొదటి నిమిషంలోనే ఈ నిరీక్షణకు కౌటిన్హొ తెరదించాడు. మిడ్ ఫీల్డర్ ఫిర్మినో తలతో అందించిన బంతిని గాబ్రియెల్ జీసస్ సమన్వయం చేసుకోలేకపోయినా కౌటిన్హొ చురుగ్గా స్పందించి కీపర్ నవాస్ను బోల్తాకొట్టిస్తూ గోల్‌గా మలిచాడు. 97వ నిమిషంలో డగ్లస్కోస్టా నుంచి పాస్‌ను అందుకున్న నెమార్... వేగాన్ని అదుపు చేసుకుంటూ మరో గోల్ కొట్టి ఆధిక్యం పెంచాడు. గాయాలతో ఇబ్బంది పడుతూనే ఆడుతున్న అతడికి టోర్నీలో ఇదే మొదటి గోల్ . దీంతో కొంత భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ మొత్తమ్మీద 67శాతం బంతి బ్రెజిల్ ఆధీనంలో ఉండగా, ఆ జట్టు 23 సార్లు దాడులకు దిగింది. రెండు జట్లు చెరో 11 ఫౌల్స్ చేశాయి. -
ఫిఫా ప్రపంచకప్: సెర్బియా విజయానందం
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సమరా ఎరినా మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా జట్టు 1-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆచితూచి ఆడిన ఇరు జట్లు ప్రథమార్థంలో ఒక్క గోల్ నమోదు చేయలేకపోయాయి. ద్వితీయార్థంలో కొంచెం దూకుడు పెంచిన ఇరు జట్లు గోల్ కోసం గట్టిగానే ప్రయత్నించాయి. కానీ మ్యాచ్‌లో తొలి గోల్ నమోదు కావడానికి 56 నిమిషాలు పట్టింది. ఫ్రీకిక్ రూపంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సెర్బియా కెప్టెన్ అలెగ్జాండర్ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. దీంతో సెర్బియా 1-0తో ఆధీనంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్‌లో మరొక గోల్ నమోదు కాకపోవడంతో సెర్బియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రిఫరీ ఇద్దరు సెర్బియా (ఇవనోవిక్, ప్రిజోవిక్), ఇద్దరు కోస్టారికా ఆటగాళ్ల(కాల్వొ, గుజ్మన్)కు ఎల్లో కార్డు చూపించారు. నేటి మ్యాచ్‌లో కోస్టారికా 14 అనవసర తప్పిదాలు చేయగా, సెర్బియా 11 తప్పిదాలు చేసింది. -
సాంబాకు ఎదురుందా!
జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, పోర్చుగల్... ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అంటే ఈ దేశాలు మాత్రమేనా! అప్పుడప్పుడు మెరిసే ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో ఉన్నాయి. సంచలనం సృష్టించేందుకు సదా సిద్ధం అనిపించే కొరియా, కొలంబియా, డెన్మార్క్‌లు కూడా బరిలో నిలిచాయి. 32 దేశాలు పాల్గొనే విశ్వ సమరంలో ఒక్కో జట్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అగ్రశ్రేణి జట్లు అద్భుత ఆటను చూపిస్తాయనడంలో సందేహం లేకున్నా... అనామక టీమ్‌లు కూడా అభిమానులకు వినోదం పంచడంలో ఎక్కడా తగ్గవు. తీవ్ర పోటీ ఉండే క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలిచి ఇక్కడి వరకు వచ్చాయంటే వాటి సత్తాను తక్కువగా అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో ‘ఫిఫా’ వరల్డ్ కప్ బరిలో నిలిచిన జట్ల పరిచయం, వాటి నాకౌట్ అవకాశాల వివరాలు నేటి నుంచి... ముందుగా ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ ఉన్న గ్రూప్ ‘ఇ’పై విశ్లేషణ. బ్రెజిల్... పూర్వ వైభవం కోసం 2014లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్ సెమీస్‌లో జర్మనీ చేతిలో 1–7తో బ్రెజిల్ చిత్తు చిత్తుగా ఓడినప్పుడు ఆ దేశ అభిమానులదే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికుల గుండెలు బద్దలయ్యాయి. ఆ తర్వాత కోలుకొని ఈ నాలుగేళ్లలో బ్రెజిల్ మరోసారి వరల్డ్ కప్ వేటకు సిద్ధమైంది. 2018 వరల్డ్ కప్‌కు అందరికంటే ముందుగా అర్హత సాధించిన దేశం బ్రెజిల్. క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనాను 3–0తో ఓడించడం సహా వరుసగా 9 మ్యాచ్ లు గెలవడం ఆ జట్టు ఫామ్‌ను చూపిస్తోంది. కీలక ఆటగాడు: నెమార్ ప్రస్తుతం 26 ఏళ్ల నెమార్ తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో, ఫిట్నెస్తో ఉన్నాడు. తన ఆటతో చెలరేగి బ్రెజిల్‌ను గెలిపించేందుకు అతనికి ఇది సువర్ణావకాశం. అదే జరిగితే మెస్సీ, రొనాల్డోలను వెనక్కి తోసిన ఘనత నెమార్‌కు దక్కుతుంది. కోచ్: అడెనార్ బాకీ (టిటె). అట్టర్ ఫ్లాప్ జట్టు నుంచి ఇతను బ్రెజిల్‌ను ఫేవరెట్‌గా మలిచాడు. 2016 సెప్టెంబర్‌లో టిటె బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్రెజిల్ 13 మ్యాచ్‌లు గెలిచి, 3 డ్రా చేసుకుంది. వరల్డ్ ర్యాంక్: 2 చరిత్ర: టోర్నీ జరిగిన 20 సార్లూ ఆడింది. 5 సార్లు విజేత (1958, 1962, 1970, 1994, 2002), రెండుసార్లు రన్నరప్ (1950, 1998). ‘స్విస్’ టైమ్ బాగుంటుందా! అప్పుడప్పుడు తమ ఆటతో కొన్ని మెరుపులు ప్రదర్శించిన స్విట్జర్లాండ్ ఈ సారైనా అన్ని రంగాల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కనీసం క్వార్టర్ ఫైనల్ లక్ష్యంగా జట్టు బరిలోకి దిగుతోంది. 2009 అండర్–17 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ సారి వరల్డ్ కప్ జట్టులో ఉండటం తమ బలంగా ఆ జట్టు భావిస్తోంది. ఇన్నేళ్లలో వీరంతా అనుభవంతో కూడా రాటుదేలారు. 1954లో ఆఖరి సారి నాకౌట్ మ్యాచ్ గెలవగలిగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో బలహీనమైన గ్రూప్‌లో వరుసగా 9 మ్యాచ్‌లు నెగ్గి అర్హత సాధించింది. కీలక ఆటగాడు: వలోన్ బెహ్రామి వరుసగా నాలుగో ప్రపంచకప్ ఆడుతున్న సీనియర్. కుర్రాళ్లను మైదానంలో సమన్వయపరుస్తూ ఫలితం సాధించగలడు. క్వాలిఫయింగ్‌లో అతను ఆడని మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ చిత్తయిందంటే వలోన్ విలువేమిటో తెలుస్తుంది. అకాన్జీవంటి అత్యుత్తమ డిఫెండర్ జట్టులో ఉన్నాడు. గత వరల్డ్ కప్ ఆడిన ‘ఆర్సెనల్’ స్టార్ జాకా కూడా జట్టు రాతను మార్చగలడు. కోచ్: వ్లదీమర్ పెట్కోవిక్ మూడేళ్లుగా జట్టును తీర్చిదిద్దాడు. ఇతనికి ఇదే తొలి వరల్డ్ కప్ ప్రపంచ ర్యాంక్: 6 చరిత్ర: 10 సార్లు పాల్గొని 3 సార్లు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. కోస్టారికా... క్వార్టర్స్ చేరేనా! నాలుగేళ్ల క్రితం ఈ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరి షూటౌట్లో నెదర్లాండ్స్ చేతిలో చిత్తయింది. 50 లక్షలకంటే తక్కువ జనాభా ఉన్న కోస్టా రికా ఐదో వరల్డ్ కప్ బరిలోకి దిగుతోంది. కీలక ఆటగాడు: గోల్ కీపర్ నవాస్ లీగ్స్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున ఆడే ఈ గోల్ కీపర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బలహీన జట్టునుంచి ప్రపంచానికి తెలిసిన ఆటగాడు ఇతనొక్కడే. బ్రైన్ రూయిజ్, సెల్సో బోర్జెస్ కూడా సత్తా చాటగలరు. 2014లో క్వార్టర్స్ చేరడంలో రూయిజ్దే ప్రధాన పాత్ర. కోచ్: ఆస్కార్ రమిరెజ్. ఇటలీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రపంచ ర్యాంక్: 25 చరిత్ర: 4 సార్లు పాల్గొంటే 2014లో క్వార్టర్ ఫైనల్స్ చేరడం అత్యుత్తమ ప్రదర్శన. సెర్బియా... సంచలనంపై గురి 2006లో స్వతంత్ర దేశంగా మారిన తర్వాత ఈ దేశం వరల్డ్ కప్ బరిలోకి దిగుతుండటం ఇది రెండోసారి. ఈసారి క్వాలిఫయింగ్‌లో తమ గ్రూప్‌లో సెర్బియా అత్యధికంగా 20 గోల్స్ కొట్టింది. అదే జోరును కనబరిచి లీగ్ దశ దాటాలని పట్టుదలతో ఉంది. కీలక ఆటగాడు: బ్రనిస్లావ్ ఇవనోవిక్ చెల్సీ తరఫున గొప్ప ప్రదర్శన కనబర్చిన డిఫెండర్. క్వాలిఫయింగ్‌లో అన్ని మ్యాచ్‌లూ (10) ఆడాడు. కోచ్: కటాజిక్ తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వరల్డ్ ర్యాంక్: 35 చరిత్ర: 2010లో తొలిసారి బరిలోకి దిగి లీగ్ దశలోనే నిష్క్రమించింది. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉన్నాయి. తమ గ్రూప్‌లోని మిగిలిన మూడు ప్రత్యర్థులతో ఆయా జట్లు తలపడతాయి. పాయింట్ల పరంగా మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్ట్సర్స్కు అర్హత సాధిస్తాయి. పాయింట్లు సమమైతే గోల్స్ ఆధారంగా ఎవరు ముందుకు వెళ్లాలో తేలుస్తారు. తుది అంచనా: గ్రూప్ ‘ఇ’ నుంచి బ్రెజిల్, స్విట్జర్లాండ్ నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. బెహ్రామి, నవాస్, ఇవనోవిక్ -
కోస్టారికాలో కుప్పకూలిన విమానం
శాన్‌జోస్: ఒకే ఇంజిన్ ఉన్న సెస్నా విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలెట్లతో పాటు 10 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన కోస్టారికాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. పుత్నాఇస్లిట నుంచి శాన్‌జోస్‌కు ఆదివారం సాయంత్రం బయలుదేరిన సెస్నా విమానం గ్వాన్క్యాస్ట్లోని అటవీప్రాంతంలో కూలిపోయిందని కోస్టారికా ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రమాదంలో విమానంలోని వారందరూ చనిపోయినట్లు వెల్లడించింది. మంటల్లో కాలిపోతున్న విమాన శకలాల వీడియోను, ఫొటోల్ని విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మృతులకు సంబంధించి ‘నేచుర్ ఎయిర్’ విమానయాన సంస్థ అందించిన వివరాలు మాత్రమే తమవద్ద ఉన్నారనీ.. వీటి అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు కోస్టారికా ప్రభుత్వం తెలిపింది. -
విమాన ప్రమాదంలో 12 మంది మృతి
-
విమాన ప్రమాదంలో 12 మంది మృతి
శాన్ జోస్ : కోస్టారికా దేశం జానాకాస్ట్ ప్రావిన్స్‌లోని పర్వతాల్లో ఓ చిన్న విమానం కూలిపోవడంతో 12 మంది చనిపోయారు. వీరిలో 10 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని స్థానిక అధికారులు తెలిపారు. సెస్నా 208బీ అనే చిన్న విమానం పది మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నాం 12.10 గంటలకు నండయూర్లోని పుంటా ఇస్లిటా ఎయిర్ పోర్టు నుంచి రాజధాని నగరం శాన్ జోస్‌కు బయలుదేరింది. 10 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైనట్లు సివిల్ ఏవియేషన్ అధికారులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అయ్యాకే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోస్టారికా అధ్యక్షుడు సోలిస్ రివేరా సంతాపం తెలిపారు. మృతులకు సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. -
షార్క్ దాడిలో భారత సంతతి మహిళ మృతి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన 49 ఏళ్ల ఓ మహిళ షార్క్ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కోస్టారికా పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్టారికాలోని కోకస్ ద్వీపంలో స్క్యూబా డైవింగ్ చేయడానికి 18 మంది వెళ్లారు. వీరంతా డైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా షార్క్వచ్చి వారిపై దాడిచేసింది. వారిలో రోహినా భండారీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ఆమెకు చికిత్స అందించినా కాళ్లకు అయిన గాయాలు తీవ్రంగా ఉండడంతో ఆమె మరణించారు. రోహినాతోపాటు స్కూబా డైవింగ్ మాస్టర్ కూడా షార్క్ వల్ల స్వల్ప గాయలపాలయ్యారు. అయితే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. షార్క్ మామీద దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి షార్క్ నుంచి దూరంగా ప్రయాణించేందుకు ఎంత ప్రయత్నించినా అది వేగంగా వచ్చి దాడిచేసిందని తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థలో భండారీ ఈక్విటీలో మేనేజరుగా పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. కోకస్ ద్వీపం రకరకాల షార్క్ జాతులకు ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు పొందడంతోపాటు, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో నుంచి కూడా గుర్తింపు పొందింది. -
భార్యను కారు బానెట్‌కు కట్టేసి.....
శాన్ జోస్: షాకింగ్ వీడియో ఒకటి ఆన్లైన్లో చెక్కర్లు కొడుతోంది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు తన భార్యను కారు బానెట్‌కు కట్టేసి కారును అతివేగంగా నడిపిన వీడియో అది. హెల్ప్...హెల్ప్ అని ఆమె అరవడం. అలా అరచినప్పుడు కారును క్షణకాలం ఆపినట్టే ఆపి మళ్లీ వేగంగా పరుగెత్తించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. కోస్టారికాలోని ఓ రోడ్డులో దూసుకుపోయిన ఆ కారు కొంత సేపటికి అదృశ్యమవుతుంది. కారు బానెట్‌పై కట్టేసి ఉన్న నీలి రంగు జీన్స్, ఎర్రటి చొక్కా ధరించిన ఆ యువతి చివరకు ఏమైందో కూడా తెలియదని స్థానిక మీడియా పేర్కొంది. భార్య తనను ఛీట్ చేస్తూ మరో బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతోందనే అనుమానంతోనే ఆ భర్త ఈ అఘాత్యానికి పాల్పడ్డాడట. అంతేకాకుండా ఆ యువతి కారు బానెట్‌పై ప్రాణాలు బిగపట్టి హెల్ప్...హెల్ప్ అని అరచినప్పుడు భర్త పేరు ఉచ్ఛరించకుండా బాయ్ ఫ్రెండ్ పేరే ఉచ్ఛరించిందని స్థానికులు చెబుతున్నారు. -
అనాథ కుక్కలకు అదో శరణాలయం..!
ప్రకృతి సంపదతో పర్యాటకుల్ని పులకరింపజేసే కోస్లారికా ప్రాంతం.. రకరకాల వన్యప్రాణులకు, వృక్షాలకే కాక అనాథ శునకాలకూ ఆశ్రయమిచ్చే శరణాలయం అని మీకు తెలుసా? జంతు ప్రేమికులు, పెంపుడు జంతువుల కోసం ఎదురు చూసే వారికి వందలకొద్దీ శునకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రయం పొందుతున్న ఆ శునకాలు.. వాటిని చేరదీసి ఆశ్రయం ఇచ్చి... పెంచుకునే వారికోసం ఎదురు చూస్తున్నాయి. టెర్రటోరియో డి జెగ్వేట్స్ వీధికుక్కలు హాయిగా జీవించగలిగే ఓ ప్రైవేట్ అభయారణ్యం. సుమారు 900 శునకాలు అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హాయిగా జీవిస్తున్నాయి. జంతు ప్రేమికులు.. ఓ కొత్త నేస్తం కోసం ఎదురు చూసేవారికి కోస్టారికాలోని ఆ ఆశ్రమం అందుబాటులో ఉంది. మరోవైపు పర్యటకులు ఒకేచోట రకరకాల శునకాలను వీక్షించి ఆనందించే అవకాశం ఆ సంస్థ కల్పిస్తోంది. 'వాలంటీర్ రన్' కార్యక్రమంతో కోస్టారికాలోని ఆ విశాలమైన అటవీ ప్రాంతంలో వందలకొద్దీ శునకాలకు ఆహారం, స్నానపానాలు, వసతి సౌకర్యాలు కూడ కల్పిస్తున్నారు. తిండీ తిప్పలూ లేక, బక్క చిక్కి, అనేక వ్యాధులు సోకి వీధుల్లో అనాథలుగా తిరుగుతున్న కుక్కలను చూసిన తర్వాత వాటికో శరణాలయం స్థాపించాలన్న ఆలోచన తనకు వచ్చిందని స్థాపకురాలు ల్యా బ్యాటిల్ చెప్తారు. తాను వెళ్ళే మార్గంలో ప్రతిరోజూ వీధికుక్కలను చూసేదాన్నని, నిస్సహాయంగా ఉన్న వాటిలో కొన్నింటిని చూస్తే వాటికీ ఎంతో జీవితం ఉందని, అది హాయిగా జీవించేందుకు తగ్గ సహాయం అందించడం తప్పనిసరి అనిపించేదని, అదే కర్తవ్యంగా భావించి... అటువంటి అనాథ శునకాలను తెచ్చి ఆరోగ్యసేవలు అందించి, శుభ్రపరచి మంచి కుటుంబాలు తయారయ్యేట్లుగా చేస్తున్నానని ఆమె చెప్తున్నారు. అలాగే వాటికి మంచి లక్షణాలను అలవరచి ఇష్టపడి పెంచుకునే వారికోసం అందుబాటులో ఉంచుతున్నామని ల్యా చెప్తున్నారు. అయితే అదృష్టంకొద్దీ తాను ఆశ్రయం కల్పించిన శునకాల్లో ఎక్కువ శాతం అభిమానంగా, ఆదరణీయంగా ఉండటంతోపాటు... తాను చెప్పినట్లుగా విని, తన సేవలు అందుకుంటున్నాయని, కొన్ని తనను తిరస్కరించి వెళ్ళిపోతున్నాయని ల్యా అంటున్నారు. పెంచుకునేందుకు వచ్చేవారికి ప్రతి కుక్క వివరాలు షెల్టర్ బిల్ బోర్డులో చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. ఇప్పటికే సుదూర ప్రాంతాలనుంచీ సైతం ఇక్కడకు వచ్చి ఈ శునకాలను పెంచుకునేందుకు అనేక మంది స్వీకరిస్తున్నట్లు ల్యా బ్యాటిల్ తెలిపారు. -
ఇలాంటి ఇళ్లు కట్టడం ఎవరివల్ల కాదేమో!
కోస్టారికా: మంచి ఇళ్లు కట్టుకోవాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దానికోసం ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా శ్రమిస్తారు. సాధారణంగా ఎవరైన మంచి ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇళ్లు కట్టుకోవాలనుకుంటారు. కట్టేముందు ఇంటి చుట్టూ రణగొణ ధ్వనులు లేకపోయినా ఆ తర్వాత జమవుతాయి. అప్పుడు అంతకుముందు మనం ఎంతో ఇష్టపడే ఆ ఇంటిపై కొంచెం ప్రేమ తగ్గిపోతుంది. కానీ, ఏ మాత్రం రణగొణ ధ్వనులకు అవకాశం లేకుండా.. ఏ అంశానికి తమను ఇబ్బంది పెట్టే ఛాన్సే ఇవ్వకుండా ఇళ్లు కట్టుకోగలిగితే.. అది కూడా భూమిపైన కాకుండా భూమిలోపల అయితే.. మరీ ముఖ్యంగా ఓ భారీ అగ్నిశిలను తవ్వి నిర్మించుకుంటే.. కోస్టారికాలో ఇదే జరిగింది. మాన్యుయెల్ బారెంట్స్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నేండేళ్లు శ్రమించి 63 అడుగుల లోతు భూగర్భంలో ఓ విశాల నివాస సముదాయాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. మూడు బెడ్ రూములు, ఒక లివింగ్ రూమ్, యోగా చేసుకునే హాల్, ఇతర అవసరాలకు పనికొచ్చేలా పుష్కర కాలం కష్టపడి సొంత నివాసం నిర్మించుకున్నాడు. బయట నుంచి చూసేందుకు అదొక పెద్ద గుహలాగా కనిపించినా ఒక్కసారి లోపలికి అడుగుపెట్టారంటే అబ్బురపడిపోవాల్సిందే. అచ్చం టూరిస్టు ప్రాంతాల్లో ఏర్పాటుచేసినట్లే ఆ నివాసంలో ఏది ఎటువైపు, ఎక్కడ అనే వివరాలతో భాణం గుర్తులతో సూచిస్తూ రాసిపెట్టి ఉంచాడు. అంతేకాదు తన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఓ సీసీటీవీని కూడా ఏర్పాటుచేశాడు. -
ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు
-
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో సెమీస్ బెర్తులు ఖరారు
సల్వాదార్(బ్రెజిల్): ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో క్వార్టర్స్ పోరుకు తెరపడింది. ఇక నాలుగు ప్రధాన జట్లు సెమీ ఫైనల్లో ఆమీతూమీకి సిద్ధమయ్యాయి. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ ల్లో భాగంగా శనివారం రాత్రి నెదర్లాండ్స్-కోస్టారికాల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో నెదర్లాండ్స్ జట్టు 4-3 తేడాతో కోస్టారికాను ఓడించి సెమీఫైనల్ కు ప్రవేశించింది. దీంతో సెమీస్ ఫైనల్ రేసులో తలపడే జట్లు ఖరారయ్యాయి. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో జర్మనీ-బ్రెజిల్ లు తలపడుతుండగా, బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో అర్జెంటీనా-నెదర్లాండ్స్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి.గత విజేత స్పెయిన్ తొలి రౌండ్ లోని నిష్కమించగా, రన్నరప్ నెదర్లాండ్స్ మాత్రం టోర్నీలో ఆకట్టుకుంటూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. -
ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు
సాల్వెడర్(బ్రెజిల్): సాకర్ ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి నెదర్లాండ్స్ దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో కోస్టారికాతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్లో అర్జెంటీనాతో నెదర్లాండ్స్ తలపడనుంది. నెదర్లాండ్స్, కోస్టారికా మధ్య జరిగిన చివరి క్వార్టర్‌ఫైనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. నిర్ణీత 120 నిమిషాల సమయంలో ఇరు జట్లు గోల్ కొట్టకపోవడంతో పెనాల్టీ షూటౌట్ తో ఫలితాన్ని తేల్చారు. కీలకమైన ఈ షూటౌట్స్‌లో డచ్ గోల్‌కీపర్ టిమ్ క్రుల్ రెండు గోల్స్ అడ్డుకొని నెదర్లాండ్స్‌కు విజయం సాధించి పెట్టాడు. ఎక్స్ట్రా టైమ్ చివరి నిమిషంలో గోల్కీపర్ను మార్చడం డచ్ టీమ్‌కు కలిసొచ్చింది. సబ్‌స్టిట్యూట్ గోల్ కీపర్ గా వచ్చి అతడు జట్టుకు విజయాన్ని అందించడం విశేషం. కోస్టారికా ప్లేయర్స్ బ్రియన్ రూయిజ్, మైఖేల్ ఉమానా కొట్టిన రెండు గోల్స్‌ను క్రుల్ అడ్డుకున్నాడు. అదే సమయంలో నెదర్లాండ్స్ తరఫున వాన్పెర్సీ, రాబెన్, స్నైడెర్, కుయ్ట్ గోల్స్ సాధించారు. దీంతో పెనాల్టీ షూటౌట్స్‌లో 4-3 తేడాతో గెలిచి సెమీస్ చేరింది నెదర్లాండ్స్. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్ ట్రా టైమ్‌లో ఎన్నోసార్లు గోల్స్ చేసే అవకాశమొచ్చనా సద్వినియోగం చేసుకోలేని డచ్ టీమ్.. మొత్తానికి షూటౌట్స్‌లో బతికిపోయింది. -
అతడే ఒక ‘సైన్యం’
మధ్య అమెరికాలో కేవలం 45 లక్షల జనాభా ఉన్న దేశం కోస్టారికా. రక్షణ కోసం సైన్యం లేకపోవడం ఈ దేశం ప్రత్యేకత. ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఆ దేశ గోల్‌కీపర్ నవాస్ చూపించిన తెగువ చూస్తే... ఈ దేశానికి సైన్యం అవసరం లేదేమో అనిపిస్తుంది. మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా గ్రీస్ స్ట్రయికర్స్‌ను అడ్డుకున్న నవాస్... పెనాల్టీ షూటౌట్లోనూ ప్రత్యర్థి కిక్‌ను అడ్డుకుని కోస్టారికాను తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చాడు. - కోస్టారికాను క్వార్టర్స్‌కు చేర్చిన నవాస్ - పెనాల్టీ షూటౌట్లో గ్రీస్‌పై గెలుపు రెసిఫె: ఫుట్‌బాల్ ప్రపంచకప్ నాకౌట్ దశలో మరో ఫలితం పెనాల్టీ షూటౌట్ ద్వారానే తేలింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో 5-3 తేడాతో కోస్టారికా జట్టు గ్రీస్‌ను ఓడించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో తొలిసారిగా ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అలాగే ప్రి క్వార్టర్స్ దశలో రెండు మ్యాచ్ ల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం రావడం ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి. బ్రెజిల్, చిలీ జట్ల మధ్య ఫలితం కూడా ఇలాగే రావడం తెలిసిందే. అంతకుముందు మ్యాచ్ నిర్ణీత సమయంలో రెండు జట్లు 1-1 స్కోరుతో సమంగా నిలిచాయి. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోస్టారికా ఇంజ్యూరీ సమయం (90+1)లో గ్రీస్‌కు గోల్‌ను సమర్పించుకుంది. దీంతో ఎక్స్ట్రా సమయం అనివార్యమైంది. ఇక్కడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. ఇందులో కోస్టారికా తరఫున బోర్జెస్, రూయిజ్, గోంజలెజ్, క్యాంప్‌బెల్, ఉమానా గురి తప్పకుండా గోల్స్ సాధించారు. ఇక గ్రీస్ తరఫున మిట్రోగ్లూ, లేజరస్, కోలెవస్ వరుసగా గోల్స్ చేయగా కీలకమైన తరుణంలో గేకాస్ షాట్‌ను గోల్ కీపర్ నవాస్ అడ్డుకున్నాడు. దీంతో పరాజయం ఖాయమైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోస్టారికా గోల్ కీపర్ నవాస్‌కు దక్కింది. క్వార్టర్స్‌లో ఈనెల 5న కోస్టారికా.. నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. - తొలిసారిగా నాకౌట్ దశలో ఆడిన గ్రీస్ ప్రారంభంలో కాస్త పైచేయి సాధించింది. 37వ నిమిషంలో స్ట్రయికర్ దిమిత్రియోస్ సల్పింగిడి అతి సమీపం నుంచి కొట్టిన షాట్‌ను కోస్టారికా గోల్ కీపర్ కీలర్ నవాస్ గాల్లో రెండు కాళ్లు చాపుతూ అద్భుతంగా అడ్డుకున్నాడు. - ఇప్పటిదాకా ప్రపంచకప్‌లో కోస్టారికా సాధించిన 16 గోల్స్‌లో 12 ద్వితీయార్ధంలోనే వచ్చాయి. ఈ ఆనవాయితీ కొనసాగింపుగా అన్నట్టు 52వ నిమిషంలో కోస్టారికా తమ గోల్ ఖాతాను తె రిచింది. - డిఫెన్స్‌ను ఛేదిస్తూ క్రిస్టియన్ బొలనాస్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న స్ట్రయికర్ బ్రియాన్ రూయిజ్ ఎడమ కాలితో నేర్పుగా గోల్ పోస్టు కుడివైపు చివరకు నెట్టి జట్టును ఆనందంలో నింపాడు. - 66వ నిమిషంలో కోస్టారికా ఆటగాడు ఆస్కార్ డుయర్టెకు రెండో సారి ఎల్లో కార్డు చూపడంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఈ జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. - చివర్లో గ్రీస్ తమ గోల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఇంజ్యూరీ సమయం ప్రారంభమైన నిమిషానికే కోస్టారికాకు షాక్ తగిలింది. ముందుగా గెకాస్ కొట్టిన షాట్ కీపర్ నవాస్‌కు తగిలి వెనక్కి వచ్చింది. గోల్ పోస్టుకు ఎదురుగా ఉన్న సోక్రటీస్ దీన్ని మెరుపు వేగంతో అందుకుని నెట్లోకి పంపాడు. దీంతో అప్పటిదాకా సంబరాల్లో మునిగిన కోస్టారికా అభిమానులు ఒక్కసారిగా నిరాశ కు గురయ్యారు. - ఎక్స్ట్రా సమయంలోనూ గ్రీస్ ప్రయత్నాలను కీపర్ నవాస్ వమ్ము చేసి మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. షూటౌట్లో తమ జట్టే గెలవడంతో ఆటగాళ్లతో పాటు కోస్టారికా అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. -
డ్రగ్ పరీక్షకు జట్టు ఆటగాళ్లంతా సిద్దం!
సాంటో(బ్రెజిల్): డ్రగ్ పరీక్షలకు జట్టు మొత్తమంతా హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కోస్టారికా కోచ్ జోర్జ్ లూయిస్ పింటో తెలిపారు. ప్రపంచకప్ పుట్ బాల్ టోర్నిలో ఇటలీపై 1-0 తేడా గోల్స్ తో విజయం సాధించడంతో ఏడుగురు ఆటగాళ్ల డ్రగ్ పరీక్షలకు హాజరుకావాలంటూ ఫిఫా ఆదేశించిన నేపథ్యంలో కోస్టారికా కోచ్ వ్యాఖ్యానించారు. అయితే ఆటగాళ్ల డ్రగ్ పరీక్షలు కేవలం రోటిన్ వ్యవహారంలో భాగమని ఫిఫా ట్వీట్ చేసింది. ఆటపూర్తయ్యాక సాధారణ నిబంధనల్లో భాగంగానే ఇద్దరు ఆటగాళ్లకు డ్రగ్ పరీక్షలు నిర్వహించాం. మరో ఐదుగురు కోస్టారికా ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహిస్తామని ఫిఫా వెల్లడించింది. -
ఇటలీపై కోస్టారికా సంచలన విజయం
రెసిఫై:ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో కోస్టారికా సంచలన విజయం నమోదు చేసింది. ఈ రోజు గ్రూప్ -డిలో భాగంగా ఇక్కడ ఇటలీ తో జరిగిన మ్యాచ్ లో 1-0 తేడాతో విజయం సాధించిన కోస్టారికా తొలిసారి నాకౌట్ చేరుకుంది. బలమైన అటాకింగ్ ఉన్నఇటలీపై కోస్టారికా ఎదురుదాడి చేసి విజయాన్ని తనఖాతాలో వేసుకుంది. ఆట 44 నిమిషంలో బ్రయన్ రూయిజ్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు గెలుపునందించాడు. ఈ తాజా విజయంతో ఇంగ్లండ్ ఆశలకు గండిపడింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కోస్టారికా విజయం ఇటలీ, ఇంగ్లండ్ అభిమానుల్ని షాక్ కు గురి చేసింది. నాలుగుసార్లు ఫుట్ బాల్ చాంపియన్ గా నిలిచిన ఇటలీ చావురేవో తేల్చుకోని నాకౌట్ రేస్ లో ఉండాలంటే కనీసం ఉరుగ్వే తో జరిగే మ్యాచ్ లో డ్రాతో అయినా గట్టెక్కాలి. ఒకవేళ అదే జరిగితే ఇటలీ నాకౌట్ చేరుతుంది. కాని పక్షంలో ఇటలీ కూడా ఇంటి ముఖం పట్టక తప్పదు.