సల్వాదార్(బ్రెజిల్): ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో క్వార్టర్స్ పోరుకు తెరపడింది. ఇక నాలుగు ప్రధాన జట్లు సెమీ ఫైనల్లో ఆమీతూమీకి సిద్ధమయ్యాయి. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ ల్లో భాగంగా శనివారం రాత్రి నెదర్లాండ్స్-కోస్టారికాల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో నెదర్లాండ్స్ జట్టు 4-3 తేడాతో కోస్టారికాను ఓడించి సెమీఫైనల్ కు ప్రవేశించింది. దీంతో సెమీస్ ఫైనల్ రేసులో తలపడే జట్లు ఖరారయ్యాయి. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో జర్మనీ-బ్రెజిల్ లు తలపడుతుండగా, బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో అర్జెంటీనా-నెదర్లాండ్స్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి.గత విజేత స్పెయిన్ తొలి రౌండ్ లోని నిష్కమించగా, రన్నరప్ నెదర్లాండ్స్ మాత్రం టోర్నీలో ఆకట్టుకుంటూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.