
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, 2022 ప్రపంచకప్ విజయసారథి లయోనల్ మెస్సీ గాయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు దూరమయ్యాడు. వచ్చేనెలలో రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తలపడే అర్జెంటీనా జట్టును కోచ్ లయోనల్ స్కాలొని మంగళవారం ప్రకటించారు. మొత్తం 28 మంది సభ్యులతో క్వాలిఫయింగ్ పోటీలకు అర్జెంటీనా జట్టు సిద్ధమైంది.
అయితే 37 ఏళ్ల మెస్సీ కుడి కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను... సెప్టెంబర్ 5న చిలీతో, 10న కొలంబియాతో జరిగే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన అర్జెంటీనా ఖాతాలో 15 పాయింట్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment