chile
-
రిత్విక్... మళ్లీ సాధించాడు
సాక్షి, హైదరాబాద్: అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి... అంచనాలకు మించి రాణించి... హైదరాబాద్ టెన్నిస్ యువతార బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ అద్భుతం చేశాడు. చిలీ దేశ రాజధాని సాంటియాగోలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. లాటిన్ అమెరికాలో క్లే కోర్టులపై ఏటీపీ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా రిత్విక్ గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బరియెంతోస్ (కొలంబియా) ద్వయం 6–3, 6–2తో టాప్ సీడ్ మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మొల్తాని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకుంది. విజేతగా నిలిచిన రిత్విక్–బరియెంతోస్లకు 35,980 డాలర్ల (రూ. 31 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 24 ఏళ్ల రిత్విక్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ –250 డబుల్స్ టైటిల్. గత ఏడాది అక్టోబర్‌లో కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేతో కలిసి రిత్విక్ తొలి డబుల్స్ టైటిల్ గెలిచాడు. తాజా టైటిల్‌తో రిత్విక్ సోమవారం విడదలయ్యే ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 66వ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. 11 ఏస్‌లతో మెరిసి... 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బరియెంతోస్ ద్వయం పూర్తి ఆధిపత్యం చలాయించింది. 11 ఏస్‌లు సంధించిన ఈ జోడీ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. ఫస్ట్ సర్వ్లోని 30 పాయింట్లకుగాను 26 పాయింట్లు... సెకండ్ సర్వ్‌లో 13 పాయింట్లకుగాను 10 పాయింట్లు ఈ జంట గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వని ఈ ఇండో–కొలంబియన్ జంట ప్రత్యర్థి ద్వయం సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఈ టోర్నిలో అన్‌సీడెడ్ గా పోటీపడ్డ రిత్విక్–బరియెంతోస్ తొలి రౌండ్లో 7–6 (7/5), 7–6 (9/7)తో ద్రెజెవ్స్కీ–పీటర్ మత్సుజెవ్‌స్కీ (పోలాండ్)లపై, క్వార్టర్ ఫైనల్లో 3–6, 7–6 (7/2), 10–8తో మార్సెలో డెమోలైనర్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్)లపై, సెమీఫైనల్లో 4–6, 7–6 (9/7), 10–5తో మూడో సీడ్ గిడో ఆంద్రెజీ (అర్జెంటీనా)–థియో అరిబెజ్ (ఫ్రాన్స్)లపై గెలుపొందారు. -
40 ఏళ్ల తరువాత తల్లిని చేరిన కూతురు
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా! ఈ అంతులేని సంతోషానికి ఇటీవల వేదికయ్యింది చిలీలోని శాన్ ఆంటోనియో. వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్లకిందట.. శాన్ అంటోనియాకు చెందిన 24 ఏళ్ల ఎడిటా బిజామాకు అప్పటికే ఇద్దరమ్మాయిలు. మూడో సారి కుమార్తె పుట్టింది. పిల్లల్లో పేదరికాన్ని తగ్గించడానికి అప్పటి అగస్టో పినోచెట్ నాయకత్వంలోని సైనిక నియంతృత్వ ప్రభుత్వం అంతర్జాతీయ దత్తతలే మార్గమని భావించింది. అట్లా దాదాపు 20వేల మంది పిల్లలను బలవంతపు దత్తత ఇచ్చింది. బిడ్డ కడుపులో ఉండగా.. బిజామా సైతం దత్తతకు అంగీకరించింది. కానీ.. పాప పుట్టిన తరువాత పంపించడానికామె ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, స్థిరత్వం లేదు. పిల్లలను ఎలా పెంచుతావ్’అంటూ ప్రశ్నించిన ప్రభుత్వాధికారులు ఆమె ఐదు రోజుల కూతురిని తీసుకెళ్లిపోయారు. బిజామా కుటుంబంలోని చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. కానీ పేగు తెంచుకు పుట్టింది కదా.. బిజామా బిడ్డకోసం రోదిస్తూనే ఉంది. వెదకడానికి కనీసం పేరు తెలియదు. మార్గం కూడా లేదు. మరోవైపు.. ఆమె కూతురు అడామరీ గార్సియా ఫ్లోరిడాలో పెరిగింది. ఇప్పుడు ప్యూర్టో రికోలో నివసిస్తోంది. తనను దత్తత తీసుకున్నారని చిన్నతనం నుంచే తెలుసు. కానీ కన్న తల్లిదండ్రులను కలుసుకోవడమెలాగో తెలియదు. అలాంటి సమయంలో ఆమె ఫ్రెండ్ ఒకరు.. శిశువుగా దత్తతకు వచ్చి.. చిలీలోని తన సొంత కుటుంబాన్ని కలుసుకున్న టెక్సాస్ అగ్నిమాపక అధికారి టేలర్ గ్రాఫ్ గురించి చెప్పారు. అలాంటివారికోసం సాయం చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన ‘కనెక్టింగ్ రూట్స్’స్వచ్ఛంద సంస్థ గురించి వివరించారు. వెంటనే ఆ సంస్థను కలిసింది గార్సియా. కుటుంబం గురించి తెలుసుకోవడానికి గార్సియా తపన చూసి.. ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహమందించారు. సోదరి బర్త్ సరి్టఫికెట్ ద్వారా కుటుంబ వివరాలు తెలిసాయి. అయినా.. డీఎన్ఏ పరీక్షతో బిజామానే గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ నిర్ధారించింది. వెంటనే మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడుకున్నారు. గార్సియాది ప్యూర్టో రికన్ స్పానిష్, మయామీ యాస. కానీ తల్లి, అక్కలది విలక్షణమైన చిలీ యాస. మొదటిసారి సంభాషణ కష్టమే అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గతవారం కుటుంబం చెంతకు చేరుకుంది గార్సియా. 41 ఏళ్ల గార్సియాకు తల్లికి, ఇద్దరు అక్కలకు దగ్గరకు పోలికలున్నాయి. అంతేకాదు.. పెద్దక్కకు ఇష్టమున్నట్టే ఆమెకూ కుక్కలంటే చాలా ఇష్టం. ఇప్పుడు గార్సియా చిలీయాస, వంటకాలు, సంగీతం అన్నింటినీ నేర్చుకుంటోంది. అక్కలతో ఎక్కువకాలం గడపాలని నిర్ణయించుకుంది. కనెక్టింగ్ రూట్స్ ఈ ఏడాది చిలీకి తీసుకువచి్చన ఐదుగురు దత్తతదారుల్లో గార్సియా ఒకరు. ఇది ఆ ఎన్జీవో చేసిన నాలుగవ పునరేకీకరణ. ఎన్జీవో చర్యలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 40 ఏళ్ల కిందట దత్తతకు పోవడంతో ఇప్పుడు తల్లులు పెద్దవారవుతున్నారు. కొందరు చనిపోయారు. అందుకే ఆలస్యం కాకముందే సాధ్యమైనన్ని ఎక్కువ కుటుంబాలను తిరిగి కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టింగ్ రూట్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిలీలో భూకంపం..6.2 తీవ్రత నమోదు
శాంటియాగో:చిలీలో భారీ భూకంపం వచ్చింది. కలమాకు 84 కిలోమీటర్ల దూరంలోని అంటోఫగాస్టాలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. 104 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్(ఈఎమ్ఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది.Another video of the M6.1 earthquake that hit Chile earlier....pic.twitter.com/w4FyDegf4n— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025భూకంపం కారణంగా జరిగిన ప్రాణ,ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల్లో నమోదైన భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపం ధాటికి భవనాలు కొద్ది సేపు అటు ఇటు ఊగుతుండడం ఆ వీడియోల్లో కనిపించింది. CCTV of the M6.1 earthquake in Chile a short while ago. That was a long one 👀pic.twitter.com/SvyBLoZZhU— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025 -
పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి
భూగోళంపై ఎన్ని రకాల జీవులున్నాయో లెక్కేలేదు. ఎన్నో రకాల జీవులు ఇప్పటికే అంతరించిపోయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. మరోవైపు కొత్తరకం జీవుల ఉనికి బయటపడుతూనే ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, చిలీ దేశాల సముద్ర తీరంలో ఒక జీవిని గుర్తించారు. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన అటకామా ట్రెంచ్ అట్టడుగున ఈ ప్రాణి నివసిస్తున్నట్లు కనిపెట్టారు. యాంఫీపాడ్ పాడ్ వర్గానికి చెందిన ఈ జీవికి డుల్సిబెల్లా కమాంచక అని పేరుపెట్టారు. కమాంచక అంటే స్థానిక భాషలో చీకటి అని అర్థం. ఈ చీకటి జీవి మాంసాహారి. ఇతర జీవులే దీని ఆహారం. ఇవి ఇక్కడ పెద్దగా కనిపించలేదు కాబట్టి అంతరించేపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. ఇంటిగ్రేటెడ్ డీప్–ఓషియన్ అబ్జర్వింగ్ సిస్టమ్(ఐడీఓఓఎస్)లో భాగంగా గత ఏడాది సముద్రం అడుగు భాగంలో శోధించారు. ఉపరితలం నుంచి 7,902 మీటర్ల లోతులో కొత్త రకం జీవి ఉన్నట్లు బయటపడింది. అంటే దాదాపు 8 కిలోమీటర్ల లోతున ఇది సంచరిస్తుండడం గమనార్హం. వాస్తవానికి అక్కడ అత్యధిక నీటి ఒత్తిడి ఉంటుంది. జలాంతర్గాములు సైతం అంత లోతుకి చేరుకోవడం కష్టం. మానవుడు ఇప్పటికీ చూడని సముద్రాల అడుగు భాగంలో జీవ వైవిధ్యానికి కొదవ లేదు. మనకు తెలియని ఎన్నో ప్రాణులు అక్కడ ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అటకామా ట్రెంచ్ అనేది భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం. ఇక్కడ సముద్రం లోతు 6,000 మీటర్ల నుంచి 11,000 మీటర్ల దాకా ఉంటుంది. ఎన్నో విశిష్టమైన జీవులకు అటకామా ట్రెంచ్ నెలవుగా మారింది. అరుదైన యాంఫీపాడ్స్, స్నెయిల్ ఫిష్, మడ్ డ్రాగన్స్ ఇక్కడ కనిపిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా శాంతి బహుమతి
న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రముఖ మానవ హక్కుల నేత, చిలీ మాజీ దేశాధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ అందుకోనున్నారు. ఇందిరా గాంధీ శాంతి బహుమతి అంతర్జాతీయ జ్యూరీ చైర్మన్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఈ అవార్డుతో గౌరవిస్తారు. ఐరాస మహిళా విభాగం వ్యవస్థాపక డైరెక్టర్‌గా, ఐరాస మానవ హక్కుల హై కమిషనర్‌గా, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం స్వదేశంలో, అంతర్జాతీయంగా మిచెల్ ఎంతగానో కృషి చేశారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ పేర్కొంది. -
ప్రపంచంలోనే పే....ద్ద కెమెరా!
ఏకంగా 3,200 మెగాపిక్సెల్స్. సామర్థ్యం. 5.5 అడుగుల ఎత్తు, ఏకంగా 12.25 అడుగల పొడవుతో పెద్ద సైజు కారును తలపించే పరిమాణం. దాదాపు 2,800 కిలోల బరువు! 320–1,050 ఎన్ఎం వేవ్‌లెంగ్త్ రేంజ్. ఒక్కో ఇమేజ్ కవరేజీ పరిధిలోకి కనీసం 40 పూర్ణ చంద్రులు పట్టేంత ఏరియా! ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా తాలూకు విశేషాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంతకీ ఇది ఎక్కడుందంటారా? చిలీలో రూపుదిద్దుకుంటున్న వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేస్తున్న సరికొత్త టెలిస్కోప్‌లో. రాజధాని శాంటియాగోకు 500 కి.మీ. దూరంలోని సెరో పాచ్న్ పర్వత శిఖరంపై 2015 నుంచీ నిర్మాణంలో ఉన్న ఈ అబ్జర్వేటరీ త్వరలో ప్రారంభం కానుంది. అందులోని ఈ అతి పెద్ద కెమెరా ప్రతి మూడు రోజులకోసారి రాత్రివేళ దాని కంటికి కని్పంచినంత మేరకూ ఆకాశాన్ని ఫొటోల్లో బంధించనుంది. అలా అంతరిక్ష శాస్త్రవేత్తలకు పదేళ్లపాటు రోజుకు కనీసం వెయ్యి చొప్పున ఫొటోలను అందుబాటులోకి తెస్తుంది! అంటే రోజుకు 20 టెరాబైట్ల డేటాను అందజేస్తుంది. ఇది ఒక యూజర్ నెట్‌ఫ్లిక్స్‌లో సగటున మూడేళ్లపాటు చూసే ప్రోగ్సామ్స్, లేదా స్పాటిఫైలో ఏకంగా 50 ఏళ్ల పాటు వినే పాటల డేటాకు సమానం! ఈ క్రమంలో మనకిప్పటిదాకా తెలియని ఏకంగా 1,700 కోట్ల కొత్త నక్షత్రాలను, 2,000 కోట్ల నక్షత్ర మండలాలను ఈ కెమెరా వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు. దీన్ని లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్ఎస్ఎస్టీ) కెమెరాగా పిలుస్తున్నారు. అంతేగాక అంతరిక్షంలో సంభవించే చిన్నా పెద్దా మార్పులకు సంబంధించి ప్రతి రాత్రీ ఏకంగా కోటి అలెర్టులను కూడా ఈ టెలిస్కోప్ పంపనుందట కూడా! ‘‘ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. వెరా రూబిన్ అబ్జర్వేటరీ మున్ముందు మరెన్నో ఘనకార్యాలు చేయనుంది’’ అని ఆ సంస్థ ఆస్ట్రానమిస్టు క్లేర్ హిగ్స్ చెబుతున్నారు. కృష్ణపదార్థం (డార్క్ మ్యా టర్), కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) వంటి పలు మిస్టరీలను ఛేదించడంలో కూడా కీలకపాత్ర పోషించే చాన్సుందన్నారు. ఈ టెలిస్కోప్‌కు 2016లో మరణించిన అమెరికా అంతరిక్ష శాస్త్రజు్ఞడు వెరా రూబిన్ పేరు పెట్టారు. ఇది ఏడాది లోపులో అందుబాటులోకి వస్తుందని అంచనా.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మెస్సీ లేకుండానే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ బరిలో ఆర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, 2022 ప్రపంచకప్ విజయసారథి లయోనల్ మెస్సీ గాయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు దూరమయ్యాడు. వచ్చేనెలలో రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తలపడే అర్జెంటీనా జట్టును కోచ్ లయోనల్ స్కాలొని మంగళవారం ప్రకటించారు. మొత్తం 28 మంది సభ్యులతో క్వాలిఫయింగ్ పోటీలకు అర్జెంటీనా జట్టు సిద్ధమైంది. అయితే 37 ఏళ్ల మెస్సీ కుడి కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను... సెప్టెంబర్ 5న చిలీతో, 10న కొలంబియాతో జరిగే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ రౌండ్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన అర్జెంటీనా ఖాతాలో 15 పాయింట్లున్నాయి. -
58 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ: ఓ దేశంలో పుట్టి మరో దేశానికి ప్రాతినిథ్యం
పారిస్ ఒలింపిక్స్ 2024లో చిలీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జియింగ్ జెంగ్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యధిక వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. జియింగ్ జెంగ్ 58 ఏళ్ల లేటు వయసులో ఒలింపిక్స్ బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్నది జెంగ్ చిరకాల కోరిక. తన కోరికను జెంగ్ లేటు వయసులో సాకారం చేసుకుంది. సాధించాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డు కాదని జెంగ్ నిరూపించింది. చైనాలో జన్మించిన జియింగ్ జెంగ్ ప్రస్తుతం చిలీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. జియింగ్ జెంగ్ ఒలింపిక్స్ ప్రస్తానం అంత సులువుగా సాగలేదు.18 సంవత్సరాల వయస్సులో జెంగ్ తన జన్మ దేశమైన చైనా తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఆశించింది. అయితే టేబుల్ టెన్నిస్ ఒలింపిక్స్ అరంగేట్రానికి ముందే ఆమె కెరీర్‌కు బ్రేక్ పడింది. వివిధ కారణాల చేత జెంగ్ తనకెంతో ఇష్టమైన ఆటకు దూరమైంది. 20 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించింది. కొంతకాలం తర్వాత ఆమె చిలీకి వెళ్లి వివిధ టేబుల్ టెన్నిస్ జట్లకు శిక్షణ ఇచ్చింది.2000లో జెంగ్ ఉద్యోగరిత్యా టేబుల్ టెన్నిస్‌కు పూర్తిగా దూరమైంది. అనంతరం 20 సంవత్సరాల పాటు ఆటతో సంబంధం లేకుండా ఉండింది. కోవిడ్ సమయంలో జెంగ్ తిరిగి టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. 2024 ఒలింపిక్స్‌లో చిలీకి ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టకేలకు ఆమె 58 సంవత్సరాల వయస్సులో తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. -
హెలికాప్టర్ క్రాష్.. చిలీ మాజీ అధ్యక్షుడి మృతి
సాంటియాగో: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగినపుడు హెలికాప్టర్లో పినేరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదంలో పినేరా ఒక్కరే మృతిచెందగా మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌ను పినేరానే స్వయంగా నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. చిలీ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా తొలిసారి 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు దేశాధ్యక్షుడిగా పదవిలో ఉన్నారు. బిలియనీర్ అయిన పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు పలువురు ఇతర దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇదీ.. చదవండి..పాక్ ఎన్నికల బరిలో ఆమె అంతంతే -
చిలీలో కార్చిచ్చు ఎఫెక్ట్.. 46 మంది మృతి, వేలాది మందికి..
చిలీ: చిలీలో కార్చిచ్చు కారణంగా 46 మంది మృతి చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న కారణంగా మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వివరాల ప్రకారం.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిలీలో చెలరేగిన కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు కనీసం 46 మంది మృతిచెందినట్లు అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ శనివారం వెల్లడించారు. వేలాది మంది గాయపడినట్లు తెలిపారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు. Dramatic rescue amid raging wildfires 🔥 Moment when firefighters realised that there were people trapped inside burning vehicles as they crossed a highway in #Valparaiso in #Chile Salute 🙏🏽 #bomberos #IncendiosForestal #wildfire #fire #incendio #bushfire #emergency #viral… pic.twitter.com/HSe8SPKSuv — Earth42morrow (@Earth42morrow) February 4, 2024 ఇక, వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. కార్చిచ్చు కారణంగా మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ కారణంగా మంటలు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలీ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. ఇక మంటల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు. Wildfires kill at least 46 people in central Chile, more than 1500 homes destroyed.#IncendioForestal #ruta68 #incendioruta68 #incendio #Valparaíso #VinaDelMar #Chile #Incendios #BREAKING #Wildfire #Fire pic.twitter.com/MzZw3UXkNl — Chaudhary Parvez (@ChaudharyParvez) February 4, 2024 Chile declares state of emergency due to massive forest fires, more than 1000 houses destroyed, 46 fatalities reported.#IncendioForestal #ruta68 #incendioruta68 #incendio #Valparaíso #VinaDelMar pic.twitter.com/ORtQAUP2ls — Chaudhary Parvez (@ChaudharyParvez) February 4, 2024 Şili’de meydana gelen yangın sonrası#Chile pic.twitter.com/uEvyDevcu7 — Reptilian Planet (@reptilianplanet) February 4, 2024 -
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం.. 400కు పైగా స్కోర్ నమోదు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. అర్జెంటీనా మహిళల జట్టు టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసింది. చిలీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా రికార్డు స్థాయిలో 427 పరుగులు (వికెట్ నష్టానికి) చేసింది. పొట్టి క్రికెట్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా (పురుషులు, మహిళలు) చరిత్రకెక్కింది. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు బెహ్రయిన్ మహిళల జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు 2022లో సౌదీ అరేబియాపై 318 పరుగులు చేసింది. తాజాగా ఈ రికార్డును అర్జెంటీనా బద్దలుకొట్టింది. పురుషుల క్రికెట్ విషయానికొస్తే.. అత్యధిక స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. తాజాగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ టీమ్ 314 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇద్దరు భారీ సెంచరీలు.. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి ఓ రేర్ ఫీట్ నమోదైంది. ఓ ఇన్నింగ్స్‌లో తొలిసారి రెండు సెంచరీలు నమోదయ్యాయి. చిలీతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళా క్రికెటర్లు లూసియా టేలర్ (84 బంతుల్లో 169; 27 ఫోర్లు), అల్బెర్టీనా గలాన్ (84 బంతుల్లో 145 నాటౌట్; 23 ఫోర్లు) భారీ శతకాలు బాదారు. వీరితో పాటు మరియా (16 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) కూడా రాణించడంతో అర్జెంటీనా వికెట్ నష్టానికి 427 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోర్ చేసినా అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం. Argentina Women have registered the highest total in T20Is (Men's or Women's) with 427/1 against Chile Women and also secured an easy win against them. This surpasses the previous record of 318/1 set by Bahrain Women against Saudi Arabia Women. pic.twitter.com/BjxwpW3V9x — CricTracker (@Cricketracker) October 14, 2023 టీ20ల్లో ఐదుసార్లు.. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో 2 సెంచరీలు నమోదవ్వడం ఇదే తొలిసారి అయితే టీ20ల్లో మాత్రం ఈ ఫీట్ ఐదుసార్లు నమోదైంది. 2011లో మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు తొలిసారి నమోదయ్యాయి. ఆతర్వాత 2016 ఐపీఎల్లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి సెంచరీలు చేశారు. ఆతర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, 2019 ఐపీఎల్లో (సన్‌రైజర్స్ ఆటగాళ్లు బెయిర్‌స్టో (114), డేవిడ్ వార్నర్ (100 నాటౌట్)), 2022లో బల్గేరియాపై ఇద్దరు చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. ఎక్స్‌ట్రాలు 73 పరుగులు.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో చిలీ బౌలర్లు రికార్డు స్థాయిలో 73 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్స్‌ట్రాల రూపంలో ఇన్ని పరుగులు రావడం ఇదే తొలిసారి. టీ20ల్లో అతి భారీ విజయం.. అర్జెంటీనా మహిళల జట్టు అంతర్జాతీయ టీ20ల్లో అతి భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన చిలీ 63 పరుగులకే ఆలౌటై, 364 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. ఇద్దరు సున్నా స్కోర్లకే పరిమితమయ్యారు. కేవలం ఒక్కరు (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. చిలీ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలే (29) అత్యధిక స్కోర్ కావడం విశేషం. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు రనౌట్లు కావడం మరో విశేషం. -
ఆకులు మార్చి.. ఏమార్చే.. ఊసరవెల్లి చెట్టు!
పరిసరాలను బట్టి రంగులు మార్చేసే ఊసరవెల్లులు తెలుసు! అక్కడ ఉన్నాయా లేవా అన్నట్టుగా పరిసరాల్లో కలిసిపోయే కీటకాలు, జంతువులూ మనకు తెలుసు! కానీ తాను పాకే చెట్టును బట్టి ఆకుల ఆకృతిని మార్చేసుకునే తీగ చెట్టు తెలుసా? ప్రకృతి వింతల్లోనే వింతైనదిగా శాస్త్రవేత్తలు చెప్తున్న ఆ తీగ చెట్టు ఏమిటి? ఆకుల ఆకృతిని మార్చుకోవడం ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ చెట్టు వేరు.. ఆకులు ఒకటే.. చిలీలోని దట్టమైన అడవులు.. ఎర్నెస్టో గియనోలి అనే వృక్ష శాస్త్రవేత్త చెట్లు, మొక్కలపై పరిశోధన చేస్తున్నారు. నడు స్తూ వెళ్తున్న ఆయన ఓ చోట పడి ఉన్న ఆకులను చూసి ఆశ్చర్యంతో ఆగిపోయారు. అక్కడున్న చెట్టు ఆకులు ఒక ఆకారంలో ఉంటే.. కిందపడి ఉన్న ఆకులు భిన్నమైన ఆకారాల్లో ఉండటమే దానికి కారణం. ఇదేమిటా అని పరిశోధన చేసిన ఎర్నెస్టో.. తానున్న చెట్టును బట్టి ఆకుల ఆకృతిని మార్చేసే తీగ చెట్టును గుర్తించారు. ఆ తీగ చెట్టుకు ‘బోక్విలా ట్రైఫోలోలిటా’గా పేరు పెట్టారు. చెట్టులో చెట్టు.. తీగలో తీగ.. ఏ చెట్టు, మొక్క అయినా దాని ఆకుల న్నీ ఒకేలా ఉంటాయి. ఆకారం నుంచి రంగు దాకా పెద్దగా తేడా ఉండదు. కానీ ‘బోక్విలా ట్రైఫోలోలిటా’తీగ చెట్టు మాత్రం.. తాను పాకుతూ పెరిగే ఇతర చెట్లు, మొక్కల ఆకులను పోలినట్టుగా తన ఆకులను మార్చుకుంటుంది. ఒక్క ఆకారమే కాదు, పరిమాణం, రంగు కూడా మార్చుకోగలగడం విచిత్రం. పలు దక్షిణ అమెరికా దేశాల్లోని అడవుల్లో ఈ తీగ చెట్లు పెరుగుతాయని చెప్తున్నారు. ఒకే తీగపై.. వేర్వేరు ఆకులతో.. ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగ తన ఆకులను గుండ్రంగా, చతురస్రాకారంగా, సన్నగా, పొడవుగా భిన్నమైన ఆకారాలు, పరిమాణాల్లోకి.. రంగుల్లోకి మార్చుకుంటున్నట్టు గుర్తించారు. అంతేకాదు ఒకే తీగ చెట్టు ఎక్కడైనా రెండు వేర్వేరు రకాల చెట్లపైకి పాకి ఉంటే.. ఏ చెట్టుపై పాకి ఉన్న భాగంలో ఆ చెట్టు తరహాలోకి ఆకులను మార్చేసుకుంటున్నట్టు తేల్చారు. అంటే ఒకే తీగచెట్టుకు వేర్వేరు ఆకారాలు, రంగులు, పరిమాణాల్లో ఆకులు ఉండటం గమనార్హం. మార్చేసుకోవడం ఎందుకు? చెట్లు, మొక్కలను తినే జంతువులు, కీటకాల నుంచి రక్షణ కోసమే ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ ఆకుల ఆకా రాలను మార్చుకుంటున్న ట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నా రు. జంతువులు, కీటకాలు పెద్దగా ఇష్టపడని, తినని చెట్లు/మొక్కల ఆకుల రూపంలోకి తీగచెట్టు తన ఆకులను మార్చేసుకోవడం దీనికి ఉదాహరణ అని వివరిస్తున్నారు. ఎలా మార్చేసుకుంటోంది? ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగకు ఇతర చెట్లు/మొక్కలతో భౌతికంగా ఎలాంటి అనుసంధానం లేదని.. అయినా ఆకుల రూపాన్ని ఎలా మార్చుకుంటోందన్నది పెద్ద ప్రశ్నగా మారిందని శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్, కరాస్కో చెప్తున్నారు. అయితే చెట్లు/మొక్కల నుంచి వెలువడే కొన్ని రసాయన సంకేతాల సాయంతో ‘బోక్విలా ట్రైఫోలోలిటా’తన ఆకుల ఆకారాన్ని మార్చుకుంటూ ఉండొచ్చని ప్రతిపాదించారు. అలాకాకుండా కీటకాలు, సూక్ష్మజీవుల ద్వారా చెట్ల జన్యువులు తీగ చెట్టుకు చేరడం.. అనుకరణకు మార్గం వేస్తుండవచ్చని మరో ప్రతిపాదన కూడా చేశారు. తీగ చెట్టుకు కళ్లున్నాయా? శాస్త్రవేత్తలు అలంకరణ కోసం వాడే ఓ ప్లాస్టిక్ చెట్టును తీసుకుని.. దానిపైకి ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగ పెరిగేలా చేశారు. ఆ ప్లాస్టిక్ ఆకుల రూపంలోకి కూడా ఈ తీగ చెట్టు ఆకులను మార్చుకుంది. దీనితో జన్యువుల మార్పిడి, రసాయన సంకేతాల వంటి ప్రతిపాదనలు తేలిపోయాయి. ఈ క్రమంలో ‘బోక్విలా ట్రైఫోలోలిటా’లో కాంతిని గ్రహించే కణాలు ఉన్నాయని.. వాటి సాయంతో ఇతర చెట్లు/ మొక్కల ఆకులను గమనించి (చూసి) మార్చుకుంటోందని కొత్త ప్రతిపాదన వచ్చింది. అయితే చెట్లు చూడటమనే ప్రతిపాదనే అసంబద్ధమని శాస్త్రవేత్త ఎర్నెస్ట్ స్పష్టం చేస్తున్నారు. మరి ఆకులు ఎలా మార్చుకుంటోంది?.. ఇది ఇప్పటికీ మిస్టరీయే.. -
Chile Quake: కుదిపేసిన భారీ భూకంపం
శాంటియాగో: దక్షిణ అమెరికా దేశం చిలీ తీర ప్రాంతం.. భారీ భూకంపంతో Earthquake in Chile చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి. అయితే శక్తివంతమైన ప్రకంపనల తర్వాత.. ఎలాంటి నష్టం వాటిల్లిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం రాత్రి ఉత్తర చిలీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని.. భూకంపం కేంద్రం కోక్వింబోలో నలబై కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ మాత్రం.. 6.5 తీవ్రతతో మధ్య చిలీ రీజియన్‌లో భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణామెరికా దేశమైన చిలీ.. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 526 మంది మృతి చెందారు. ప్రకంపనల ధాటికి ప్రజలు వణికిపోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. Strong 6.2-magnitude earthquake hits central Chile, close to La Serena pic.twitter.com/1RrnyAe3Uq — BNO News (@BNONews) September 7, 2023 #Chile 🇨🇱 Reacciones al sismo Magnitud 6.3. pic.twitter.com/hZq7ruWuo4 — InfoSismologic (@EarthquakeChil1) September 7, 2023 Tremors felt and can be seen… Coquimbo in San Juan #Sismo #Temblor #temblor #terremoto #Chile #LaSerena pic.twitter.com/LJEd2dY0a9 — Shadab Javed (@JShadab1) September 7, 2023 #Chile #Chilenos Momento del Sismo M6.6 Percibido en La Serena, #Chile. (Septiembre 06, 2023). #Temblor #Earthquake #Climagram #Coquimbo pic.twitter.com/xZRi7sR437 — 𝔸𝕝𝕖𝕛𝕒𝕟𝕕𝕣𝕠 𝔽𝕣𝕚𝕒𝕤 ♚ ✖️ (@FriasAlejandro_) September 7, 2023 -
42 ఏళ్లకు అమ్మను చూశాడు!
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం చిలీలో నెలలు నిండకుండానే జన్మించిన ఓ శిశువు అపహరణకు గురయ్యాడు. కిడ్నాపర్లు ఆ శిశువును అమెరికాకు చెందిన దంపతులకు దత్తతకిచ్చేశారు. ఇది జరిగి 42 ఏళ్లయింది. ప్రస్తుతం అతడి పేరు జిమ్మీ లిపర్ట్ థైడెన్. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆష్‌బర్న్‌లో ఉంటూ లాయర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, 1970, 80ల్లో నియంత ఫినోచెట్ హయాంలో చిలీలో వందలాదిగా శిశువులు అపహరణకు గురయ్యారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో వారిలో కొందరు తిరిగి కన్నవారి చెంతకు చేరుతున్నారనే వార్తను మొన్న ఏప్రిల్‌లో థైడెన్ చూశాడు. ఆ సంస్థను సంప్రదించి తన డీఎన్ఏ వివరాల సాయంతో కన్న తల్లి జాడ కనుక్కున్నాడు. తోబుట్టువులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంకేముంది? భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని చిలీలోని వల్దీవియాలో ఉండే తల్లి మరియా అంజెలికా గొంజాలెజ్ వద్దకు వెళ్లాడు. ‘హాస్పిటల్ సిబ్బంది నెలలు నిండని నా కొడుకు చనిపోయాడని చెప్పగా విని, గుండెలవిసేలా రోదించాను. నా చిన్నారి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నా. నా ప్రార్థన ఫలించింది’అంటూ ఆమె కొడుకును హత్తుకుంది. తల్లి, కొడుకు కలుసుకున్న వేళ ఆ ఊరంతా పండగ చేసుకుంది. -
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో కుప్పకూలి చనిపోయిన పైలట్
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందౌర్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే కో పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ల బృందం ఇవాన్‌ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్లో వసతి కల్పించారు. ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్లో తమ ఎయిర్‌లైన్స్‌కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..! -
చిలీని వణికిస్తున్న వింత వైరస్! అల్లాడుతున్న జనం, లక్షణాలివే
శాంటియాగో: గిలాన్ బరే (జీబీఎస్) అని పిలిచే అరుదైన సిండ్రోమ్ ఒకటి దక్షిణ అమెరికా దేశం చిలీని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. అసలేం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఏమిటీ జీబీ సిండ్రోమ్? ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తే నరాల వ్యవస్థను శత్రువుగా భావించి దాడికి దిగే అత్యంత అరుదైన (ఆటో ఇమ్యూన్) సిండ్రోమ్ ఇది. నరాలపై ఈ దాడి చివరికి ఒంట్లోని కండరాల వ్యవస్థ మొత్తాన్నీ పూర్తిగా నిర్విర్యం చేస్తుంది. దాంతో విపరీతమైన నిస్సత్తువ, అవయవాలు మొద్దుబారడం వంటి దుర్లక్షణాలు వేధిస్తాయి. ఇది సాధారణంగా కాళ్లలో మొదలై నెమ్మదిగా పైకి పాకుతూ ఒళ్లంతా ఆక్రమిస్తుంది. జీబీఎస్ బాగా ముదిరితే పక్షావాతానికి కూడా దారి తీస్తుందని జిన్ హువా వార్తా సంస్థ పేర్కొంది. పెద్దవాళ్లకు, ముఖ్యంగా మగవాళ్లకు ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది. అయితే అన్ని వయసులవారికీ దీనితో రిస్కే! కరోనాతోనూ వస్తుంది...! జీబీ సిండ్రోమ్ ఎందుకు వస్తుందన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. తరచూ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా కాంపిలోబాక్టర్ జెజునీ బ్యాక్టీరియా ఈ సిండ్రోమ్‌కు కారణంగా మారుతున్నట్టు మాత్రం తేలింది. అయితే ఇన్ఫ్లుయెంజా, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్ బర్తో పాటు కోవిడ్ వైరస్ కూడా జీబీఎస్‌కు దారి తీసే ప్రమాదం పుష్కలంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం కలవరానికి గురి చేస్తోంది! గుర్తించడమెలా? ప్రధానంగా రోగ లక్షణాలు, నరాల పరీక్ష ద్వారా జీబీఎస్ ఉనికి బయట పడుతుంది. ముఖ్యంగా స్పైనల్ టాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటివి దీన్ని కచి్చతంగా పట్టిస్తాయి. ఇవీ లక్షణాలు... జీబీఎస్ తాలూకు అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరొలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు. తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఎంతలా అంటే, మెషీన్ సాయంతో ఊపిరి తీసుకోవాల్సి కూడా రావచ్చు! ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుకుంటాడు! నరాలు బాగా దెబ్బ తింటాయి గనుక నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మం లోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ సలుపుతుంటుంది. ఇతర లక్షణాలు ♦ చూపు తగ్గడం, కంటి కండరాలు దెబ్బ తినడం..మాట్లాడటం, నమలడం, మింగడం కష్టంగా మారడం ♦ చేతులు, అరికాళ్లలో సూదులతో గుచ్చుతున్నట్టు విపరీతమైన బాధ ♦ విపరీతమైన ఒళ్లు నొప్పులు, ముఖ్యంగా రాత్రిపూట ♦ శారీరక, మానసిక సమన్వయ లోపం, నిలకడలేమి ♦ హృదయస్పందన, రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడం ♦ జీర్ణాశయ, పిత్తాశయ సంబంధిత సమస్యలు చికిత్స ఉందా? జీబీఎస్‌కు ఇప్పటికైతే ఇదమిత్థంగా చికిత్స అంటూ ఏమీ లేదు. సమస్య తీవ్రతను తగ్గించి, త్వరగా కోలుకునేందుకు సాయపడే మార్గాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. దీనికి ప్రధానంగా వాడుతున్న చికిత్స ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ). నరాలపై దాడికి దిగకుండా రోగ నిరోధక శక్తిని ఇది నియంత్రిస్తుంది. - సాక్షి, నేషనల్ డెస్క్ -
Nature Astronomy: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు!
ఆధునిక సాంకేతిక యుగంలో మనషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాల (శాటిలైట్లు)పై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లోనూ వీటి అవసరం పెరిగిపోతోంది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్ బల్బుల వెలుగుతో పుడమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. అధ్యయనం వివరాలను ‘నేచర్ అస్ట్రానమీ’ పత్రికలో ప్రచురించారు. రానున్న రోజుల్లో విపరిణామాలే: భూగోళం చుట్టూ ప్రస్తుతం 8,000కు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూమిపై ప్రతి అంగుళాన్ని కవర్ చేస్తున్నాయి. స్పేక్‌ఎక్స్ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. వన్‌వెబ్ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వీటి సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు విద్యుత్ లైట్ల అవసరం పెరుగుతూనే ఉంది. శాటిలైట్ల నుంచి వెలువడే కాంతి, కరెంటు దీపాల నుంచి కాంతి వల్ల భూమిపై ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటివల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. ‘‘అంతేగాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకూ ఆటంకం కలుగుతోంది. అస్ట్రానామికల్ అబ్జర్వేటరీల పనితీరు మందగిస్తున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రివేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతోంది. అంతేగాక భూమిపై జీవుల అలవాట్లలో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి’’ అని వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకొనే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. పరిష్కారం ఏమిటి? కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. దాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టడం మేలు. ‘‘శాటిలైట్లలో బ్రైట్నెస్ తగ్గించాలి. టెలిస్కోప్ పరికరాల్లోని షట్టర్లను కాసేపు మూసేయడం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చు’’ అని సూచిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే గాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటినుంచి ప్రమాదకర విష వాయవులు వెలువడుతుంటాయి. ఆర్బిటాల్ ట్రాఫిక్ మరో పెను సమస్య. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం
శాంటియాగో: చిలీ రాజధాని శాంటియాగోలో వందల కోట్ల నగదును దోచుకునేందుకు సాయుధ దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అమెరికాలోని మియామి నుంచి శాంటియాగో విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న విమానంలో 32 మిలియన్ డాలర్ల (రూ.262 కోట్ల) నగదు ఉంది. బ్యాంకుల్లో పంపిణీ చేయాల్సిన ఆ నగదును ట్రక్కులోకి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, 10 మంది సాయుధ దుండగులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న దుండగులు నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో కొద్దిసేపు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు, ఒక దుండగుడు చనిపోయారు. దుండగులు వెంటనే తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన మరో రెండు వాహనాలు కనిపించాయి. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఈ భారీ దోపిడీని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నగదును తీసుకువచ్చిన లాతమ్ విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి అపాయం కలగలేదన్నారు. ఇదే శాంటియాగో ఎయిర్‌పోర్టులో గతంలో రెండుసార్లు దోపిడీ దొంగలు తెగబడి మొత్తం 25 మిలియన్ డాలర్ల నగదును ఎత్తుకెళ్లారు. -
బృహస్పతి... ఉపగ్రహాల రాజు.. డజను చంద్రుల గుర్తింపు
కేప్ కెనవెరాల్ (యూఎస్): సౌరకుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం (బృహస్పతి) చుట్టూ మరో 12 ఉపగ్రహాలను సైంటిస్టులు కనిపెట్టారు. దీంతో దాని ఉపగ్రహాల సంఖ్య ఏకంగా 92కు పెరిగింది. తద్వారా 83 ఉపగ్రహాలున్న శని గ్రహాన్ని వెనక్కు నెట్టి సౌరమండలంలో అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహంగా నిలిచింది. హవాయి, చిలిల్లోని టెలిస్కోప్‌ల సాయంతో 2021, 2022ల్లోనే గురు గ్రహపు కొత్త ఉపగ్రహాలను గుర్తించినా ఇంతకాలం పాటు నిశితంగా గమనించిన వాటి ఉనికిని తాజాగా నిర్ధారించారు. ఏకంగా 92 ఉపగ్రహాలతో గురు గ్రహం ఓ మినీ సౌరకుటుంబంగా భాసిల్లుతోందని వీటిని కనిపెట్టిన సైంటిస్టు స్కాట్ షెపర్డ్ చమత్కరించారు. ‘‘అయితే ఇవన్నీ బుల్లి ఉపగ్రహాలే. ఒక్కోటీ కేవలం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉన్నాయి’’ అని వివరించారు. పూర్తి వాయుమయమైన గురు గ్రహాన్ని, మంచుతో కూడిన దాని అతి పెద్ద ఉపగ్రహాలను అధ్యయనం చేసేందుకు ఏప్రిల్‌లో ఒక అంతరిక్ష నౌకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపనుంది. వీటిలో యూరోపా క్లిపర్ అనే ఉపగ్రహం ఉపరితలంపై పేరుకున్న అపారమైన మంచు కింద భారీ సముద్రం దాగుందని నాసా భావిస్తోంది. దాని అధ్యయనం కోసం 2024లో యూరోపా క్లిపర్ మిషన్‌ను ప్లాన్ చేస్తోంది. అది వాసయోగ్యమేనా అన్న అంశాన్ని పరిశోధించనుంది. బృహస్పతి, శని చుట్టూ ఉన్న భారీ ఉపగ్రహాలు బహుశా పరస్పరం ఢీకొని ఉంటాయని, ఇన్నేసి బుల్లి ఉపగ్రహాలుగా విడిపోయాయని షెపర్డ్ పేర్కొన్నారు. ‘‘యురేనస్, నెప్ట్యూన్లదీ ఇదే పరిస్థితి. కానీ అవి మరీ సుదూరాల్లో ఉన్న కారణంగా వాటి ఉపగ్రహాలను గుర్తించడం చాలా కష్టం’’ అని వివరించారు. యురేనస్‌కు 27, నెప్ట్యూన్‌కు 14, అంగారకునికి రెండు ఉపగ్రహాలున్నాయి. బుధ, శుక్ర గ్రహాలకు ఒక్కటి కూడా లేదు. -
Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..
శాన్టియాగో: చీలి దేశంలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వేసవిలో వేడిగాలులకు అగ్గి రాజుకొని అడువులు తగలబడిపోతున్నాయి మొత్తం 151 చోట్ల కార్చిచ్చు ఘటనలు వెలుగుచూశాయి. వాటిలో 65 చోట్ల మంటలను అదపుచేశారు. బుధవారం నుంచి వ్యాపిస్తున్న కార్చిచ్చు కారణంగా 35 వేల ఎకరాలు బూడిదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో 13 మంది మరణించినట్లు వివరించారు. మృతుల్లో ఓ హెలికాప్టర్ పైలట్‌తో పాటు మెకానిక్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరు ఓ ప్రాంతంలో మంటలను అదుపు చేసేందుకు వెళ్లి హెలికాఫ్టర్ క్రాష్ అయి చనిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. హెలికాఫ్టర్ ట్యాంకర్లతో సహాయక చర్యలు చేపట్టింది. కార్చిచ్చు నేపథ్యంలో చీలి అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తన వెకేషన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ అత్యవసర పరిస్థితిలో 24 గంటలు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కార్చిచ్చును విపత్తుగా ప్రకటించారు. దీంతో సైన్యం కూడా రంగంలోకి సహాయక చర్యలు చేపట్టింది. 2017లో కూడా చీలిలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అప్పుడు 11 మంది వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. 1500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,15,000 ఎకరాల అటవీప్రాంతం కాలిబూడిదైంది. చదవండి: సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు.. -
WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి
FIH Men’s Hockey World Cup- భువనేశ్వర్: ప్రపంచ కప్ హకీ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టును అత్యధిక గోల్స్ తేడాతో ఓడించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఒడిశా వేదికగా గురవారం నాటి పూల్ సి మ్యాచ్‌లో భాగంగా చిలీని 14-0తో చిత్తు చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును డచ్ జట్టు బద్దలు కొట్టింది. 2010 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 12-0తో ఓడించింది. కాగా భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. నెదర్లాండ్స్ ఆటగాళ్లు హ్యాట్రిక్ వీరడు జిప్ జాన్సెస్, డెర్క్ డి విల్డర్, తిజ్స్ వాన్ డ్యామ్, కెప్టెన్ తెర్రీ బ్రింక్‌మన్, టెరెన్స్ పీటర్స్, కొయెన్ బీజెన్, జస్టెన్ బ్లాక్, ట్యూన్ బీన్స్ గోల్స్ సాధించారు. ఇక చిలీపై విజయంతో ఈ ఎడిషన్‌లో క్వార్టర్స్ చేరిన తొలి జట్టుగా నెదర్లాండ్స్ నిలిచింది. The Netherlands are the first team to be qualified for the quarterfinals of the FIH Odisha Hockey Men's World Cup 2023 in Bhubaneswar-Rourkela. Here are some moments from the game. 🇳🇱NED 14-0 CHI🇨🇱 pic.twitter.com/WISn5Vnhqh — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 క్రాస్ ఓవర్’కు భారత్.. ఇక ప్రపంచ కప్ హాకీ టోర్నీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకునే లక్ష్యంతో గురువారం వేల్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత్... కనీసం 8 గోల్స్ తేడాతో గెలిస్తే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్ అవసరం లేకుండా నేరుగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టే అవకాశం. కానీ భారత జట్టు అంతటి అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. బలహీన జట్టే అయినా వేల్స్ బాగా పోటీ ఇచ్చింది. భారత హాకీ జట్టు PC: Hockeyindia Twitter చివరకు 4–2తో గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్ (21వ నిమిషం), ఆకాశ్‌దీప్ సింగ్ (32వ నిమిషం, 45వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించగా...వేల్స్ ఆటగాళ్లలో ఫర్లాంగ్ గ్యారెత్ (42వ నిమిషం), డ్రేపర్ జాకబ్ (44వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. గ్రూప్ ‘డి’లో ఇంగ్లండ్‌తో సమానంగా 7 పాయింట్లతో నిలిచినా...ఆడిన 2 మ్యాచ్‌లలో కలిపి మెరుగైన గోల్స్ ప్రదర్శన ఆధారంగా (ఇంగ్లండ్ 9, భారత్ 6) మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే.. నిజానికి బలమైన ప్రత్యర్థి కాకపోయినా వేల్స్ ఒక దశలో భారత్‌ను బెంబేలెత్తించింది. మన టీమ్ కూడా అంది వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. 7 పెనాల్టీ కార్నర్లతో పాటు ఆరు సార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా మనవాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్లో గోల్స్ నమోదు కాకపోగా, రెండో క్వార్టర్లో ఒక గోల్‌తో భారత్ ముందంజ వేసింది. మూడో క్వార్టర్లో రెండు నిమిషాల వ్యవధిలో పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచి వేల్స్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్ తొలి నిమిషంలోనే భారత్‌కు పెనాల్టీ లభించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ దానిని ఉపయోగించుకోలేకపోయాడు. అనంతరం హర్మన్‌ప్రీత్ డ్రాగ్ ఫ్లిక్ డిఫెండర్ స్టిక్కు తగిలి రీబౌండ్ అయి రాగా, ఈ సారి షంషేర్ దానిని గోల్ పోస్ట్‌లోకి పంపించగలిగాడు. మేం సంతృప్తిగా లేము అమిత్ రోహిదాస్ కూడా సరైన సమయంలో స్పందించడంలో విఫలమయ్యాడు. మూడో క్వార్టర్ 11వ నిమిషంలో లభించిన పెనాల్టీని అత ను కూడా విఫలం చేశాడు. చివర్లో కాస్త దూకుడు పెంచిన భారత్ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఊపిరి పీల్చుకుంది. ‘ఈ విజయంతో మేం సంతృప్తిగా లేము. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. మరింత బాగా ఆడాల్సింది’ అని మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వ్యాఖ్యానించాడు. ఇక ఆదివారం జరిగే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడే భారత్ ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్ చేరుకుంటుంది. ఇతర మ్యాచ్‌లలో మలేసియా 3–2తో న్యూజిలాండ్‌పై, ఇంగ్లండ్ 4–0తో స్పెయిన్‌పై విజయం సాధించాయి. చదవండి: Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే! సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్! కిషన్‌తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా.. It’s time to celebrate the victory. 🤩🕺🏻#IndiaKaGame #HockeyIndia #HWC2023 #StarsBecomeLegends #HockeyWorldCup #INDvsWAL @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/c1ZqtXbR0Q — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 -
హంతక శకలం
శాంటియాగో: గ్రహాల పాలిట ప్రాణాంతకమైనదిగా భావిస్తున్న గ్రహశకలం ఒకటి మన సౌరవ్యవస్థలో చక్కర్లు కొడుతోంది. దాదాపు మైలు వెడల్పున్న దీన్ని 2022 ఏపీ7గా పిలుస్తున్నారు. ఈ గ్రహశకలం ఏదో ఒక రోజు భూమిని ఢీకొట్టొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని కక్ష్య ఏదో దాన్ని ఒకనాడు భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయట. ఇది దీర్ఘవృత్తాకారంగా భ్రమిస్తున్నందువల్ల భూమికి ఏకంగా 30 లక్షల కిలోమీటర్ల సమీపానికి కూడా రాగలదట! అంతరిక్షంలో పెద్దగా లెక్కలోకే రాని దూరమిది. గత మార్చిలో 2022 ఏపీ7 భూమికి 1.3 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. మరో ఐదేళ్లపాటు ఇంతకంటే సమీపానికి వచ్చే అవకాశమైతే లేదంటున్నారు. గత ఎనిమిదేళ్లలో మన కంటబడ్డ ప్రమాదకర శకలాల్లో ఇదే అతి పెద్దది. అంతేకాదు, చిలీలోని అబ్జర్వేటరీ నుంచి సౌరవ్యవస్థలో తాజాగా కనిపెట్టిన మూడు గ్రహశకలాల్లో ఇదే పెద్దది. మిగతా రెండు అర మైలు, పావు మైలు వెడల్పున్నాయి. వీటి గురించి ఆస్ట్రనామికల్ జర్నల్‌లో వ్యాసం ప్రచురితమైంది. భూమికి 1.3 ఆస్ట్రనామికల్ యూనిట్స్, అంటే 12.1 కోట్ల మైళ్ల కంటే సమీపానికి వస్తే వాటిని నియర్ ఎర్త్ ఆస్టిరాయిడ్స్ అంటాం. -
హైవేపై కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడిన జనం!
సాంటియాగో: రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే ఎవరైనా వద్దనుకుంటారా? మరో ఆలోచన లేకుండా తీసుకుని అక్కడి నుంచి జారుకుంటారు. అలాంటిది కరెన్సీ నోట్ల వర్షం కురిస్తే.. ఎవరైనా ఊరుకుంటారా? ఎంత పని ఉన్నా.. వాటిని పట్టుకునేందుకే ఎగబడతారు. చిలీ దేశంలో కూడా అలాగే జరిగింది. హైవేపై నోట్ల వర్షం కురవటంతో జనం ఎగబడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినా పట్టించుకోలేదు. అయితే, ఈ కరెన్సీ నోట్లు వర్షం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ్యాంబ్లింగ్ హాల్లో రాబరి చేసి వెళ్తుండగా నోట్ల కట్టలు ఇలా రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. పుడహుయెల్లోని క్యాసినోపై శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో దుండగులు దాడికి పాల్పడి భారీగా నగదు దోచుకున్నారని పోలీసులు తెలిపారు. గ్యాంబ్లింగ్ హాల్లోని సిబ్బందిని, అక్కడున్న వారిని ఆయుధాలతో బెదిరించి పరారైనట్లు కోఆపరేటివా మీడియా పేర్కొంది. దుండగులు కారులో పరారవుతుండగా.. వారిని పోలీసులు వెంబడించారు. దీంతో వారు ఉత్తర తీర ప్రాంతానికి వెళ్లే హైవేపైకి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకోవడానికి దొంగలు కరెన్సీ నోట్లను హైవేపై వెదజల్లుతూ వెళ్లినట్లు మీడియా పేర్కొంది. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. కారును అడ్డగించి వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన ఆరుగురిలో మొత్తం మంది విదేశీయులేనని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పారు. అయితే, వారు ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని బయటకు తెలపలేదు. మరోవైపు.. గ్యాంబ్లింగ్ హాల్లో, హైవేపై ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. A violent robbery at a store ended in a police car chase, money raining down on a highway and six suspects getting arrested in Santiago, Chile#chile #santiago #chase #anews pic.twitter.com/KeHtPTQugh — ANews (@anews) October 21, 2022 ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్ -
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే?
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు అమెరికా ఇంజనీర్లు. ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ లేబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఎల్ఎస్ఎస్టీ డిజిటల్ కెమెరా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ అన్ని భాగాలను అమర్చారు. ఆపరేట్ చేసి ఫోటోలు తీసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఎల్ఎస్ఎస్టీ కెమెరా అంటే? ఎల్ఎస్ఎస్టీ అంటే 'లార్జెస్ట్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్' డిజిటల్ కెమెరా. ఉత్తర చీలిలోని 2,682 మీటర్ల ఎత్తయిన పర్వతం సెర్రో పచోన్ అంచున 2023లో ఏఫ్రిల్‌లో దీన్ని అమర్చనున్నారు. భూమిపై పరిశోధలనకు ఈ ప్రాంతం అత్యంత అనువైంది. జెమినీ సౌత్, సౌథర్న్ ఆస్ట్రోఫిజికల్ రీసెర్చ్ టెలిస్కోప్‌లు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ డిజిటల్ కెమెరాలోని సెన్సార్లు అత్యాధునిక ఐఫోన్ 14 ప్రోతో పోల్చితే చాలా రెట్లు అధికం. దీని ఓవరాల్ రిజొల్యూషన్ 3.2 గిగాపెక్సెల్స్ లేదా 3200 మెగా పిక్సెళ్లు. అంటే 266 ఐఫోన్ 14ప్రో ఫోన్లతో ఇది సమానం. ఈ కెమెరాతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్‌గా చూడవచ్చు. ఇది చిన్న కారు సైజు పరిమాణం, మూడు టన్నుల బరువుంటుంది. చదవండి: బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు! -
అద్భుతం..అత్యంత పొడి వాతావరణం కలిగిన ఎడారిలో పూల నందనమా!
అవును మరి.. ఇది అద్భుతమే.. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పొడి వాతావరణం కలిగిన ఎడారిగా పేరొందిన అటకామా. చూశారుగా.. నిజంగానే ఎడారా అని అనుమానం కలిగేలా.. పూలతో నందనవనాన్ని తలపిస్తోంది. ఇక్కడ వర్షం అరుదు. ఏడాదికి సగటు వర్షపాతం 15 మిల్లీమీటర్లు.. చాలా ప్రాంతాల్లో అది కూడా పడదు. అయితే, ఎప్పుడూ లేనంతగా కుండపోత వర్షం కురిసినప్పుడు.. ఎడారి మురిసిపోతుంది.. విరులతో ఇలా మెరిసిపోతుంది. ఈ చిత్రాలను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో షేర్ చేశారు. 5–7 ఏళ్లకోసారి అటకామాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంటుందట. చదవండి: ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో తెలుసా? -
ఉద్యోగులకు పండగే: వావ్..ఆ దేశంలో తగ్గనున్న పని గంటలు!
చిలీ ఉద్యోగులకు ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ శుభవార్త చెప్పారు. దేశంలో పని గంటలను తగ్గించే బిల్లును అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ఈ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. 2017లో నాటి చిలీ ప్రభుత్వం ఐదేళ్లలోపు వీక్లీ వర్కింగ్ అవర్స్‌ను 45 నుండి 40 గంటలకు తగ్గించాలని అప్పటి చట్ట సభ సభ్యులు, ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధి కమీలా వల్లేజో బిల్లును ప్రవేశ పెట్టారు. కానీ ఆ బిల్లు అమలులో కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ పనిగంటల్ని తగ్గిస్తూ 'అత్యవసర' బిల్లుగా పరిగణలోకి తీసుకున్నారు. చిలీ రాజ్యాంగ నిబంధన ప్రకారం..దేశ ప్రెసిడెంట్ ఏదైనా బిల్లు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే చట్టసభ సభ్యులు సైతం ఆ బిల్లును పరిశీలించాల్సి ఉంటుంది. సభ్యులు అంగీకారంతో ఆ బిల్లు అమలు కానుంది. చట్టసభ సభ్యులు బోరిక్ ఆదేశాలతో పనిగంటల్ని తగ్గించడంతో పాటు అదనంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే కార్మికులకు సైతం పనిగంటల్ని తగ్గించే అంశంపై చర్చిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తప్పదు మరి చిలీ ప్రపంచంలోనే అతిపెద్ద రాగిని ఉత్పత్తి చేస్తున్న దేశంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా చిలీ ఆర్ధికంగా దెబ్బతిన్నది. ఇప్పుడు మహమ్మారి తగ్గి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణంతో దెబ్బతిన్న ఎకానమీని తిరిగి గాడిలో పెట్టేందుకు చిలీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ తగ్గించే అంశంపై ఆ దేశానికి చెందిన సంస్థల ప్రతినిధులతో పాటు యూనియన్ సంఘాలు,వర్కర్ ఫెడరేషన్లతో సంప్రదింపులు జరుపుతుంది. చర్చలు కొనసాగుతుండగా.. తమ ప్రభుత్వం వర్కింగ్ అవర్స్‌ను తగ్గించే బిల్లును వెంటనే అమలు చేసేలా ఉభయ సభల సభ్యులకు విజ్ఞప్తి చేసినట్లు చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ చెప్పారు. చదవండి👉 వారానికి 4 రోజులే పని, కొత్త లేబర్ చట్టం అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే! -
ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి.. వీడిన మిస్టరీ!
శాంటియాగో: భారీగా, ఎంతలా అంటే ఊళ్లకు ఊళ్లనే మింగేసేంతగా ఆ గొయ్యి.. అంతకంతకు పెరుగుతూ చిలీ దేశాన్ని.. అక్కడి నుంచి ప్రపంచాన్నే వణికించింది. ఏదో వినాశనం తప్పదంటూ ప్రచారమూ ఊపందుకుంది. ఈ ఊదరగొట్టుడు హెడ్‌లైన్స్ వెనుక అతిశయోక్తి మాత్రమే ఉందని చెబుతూ.. అసలు విషయాన్ని వెల్లడించారు అధికారులు. చిలీ రాజధాని శాంటియాగోకు 800 కిలోమీటర్ల దూరంలోని, అటకామా రీజియన్‌లో టియెర్రా అమరిల్లా దగ్గర ఈ నెల మొదట్లో ఈ భారీ గుంత ఏర్పడి.. క్రమక్రమంగా పెరుగుకుంటూ పోతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. వెడల్పు అంతకు అంతకు పెరుగుతూ.. సుమారు 200 మీటర్ల లోతైన ఈ గుంత.. మన శాట్చ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని(198 మీటర్లు) మింగేసేంత సామర్థ్యం ఉంటుందన్న మాట. అయితే.. ప్రాథమిక దర్యాప్తులో ఈ భారీ గొయ్యి ఎలా ఏర్పడిందన్న దానిపై ఎలాంటి అంచనాకు రాలేకపోయారు అక్కడి అధికారులు.. ఇప్పుడు ఆ మిస్టరీని దాదాపుగా చేధించారు. మానవ కార్యకలాపాల వల్లే ఆ భారీ గొయ్యి ఏర్పడిందని నిర్ధారణకు వచ్చేశారు. ఆ ప్రాంతంలో భారీ మైనింగ్ కార్యకలాపాల వల్ల ఆ గుంత ఏర్పడి ఉంటుందని అంచనాకి వచ్చి.. దానిని పూడ్చేసే ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారు. Tierra Amarilla.. ప్రపంచంలోనే ఎక్కువగా కాపర్‌ను ఉత్పత్తి చేసే హబ్. కెనడాకు చెందిన ఓ కంపెనీ కార్యకలాపాల వల్లే ఈ భారీ గొయ్యి ఏర్పడి ఉంటుందని ఒక అంచనాకి వచ్చారు అక్కడి అధికారులు. ఈ విషయంపై మైనింగ్ మినిస్టర్ మార్సెలా హెర్నాండో స్పందిస్తూ.. మితిమీరిన మైనింగ్ కార్యకలాపాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ భారీ గొయ్యి ఏర్పడిన సమీప ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. -
క్రేన్ చివర భారీ సముద్రపు జీవి.. చెడుకి సంకేతమా?
వైరల్: మనిషి నమ్మకం ఒక బలం. మూఢనమ్మకం మనిషిలోని బలహీనత. అయితే.. కొన్ని విషయాలను నమ్మితీరాలని వాదిస్తుంటారు పెద్దలు. అందుకు గతంలోని కొన్ని విషయాలను తెరపైకి తెస్తుంటారు. ఓ భారీ సముద్ర జీవి విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. భారీ చేపను కొందరు ముచ్చటగా ఫోన్లలో చిత్రీకరిస్తుంటే.. చాలామంది మాత్రం అటువైపు చూడకుండానే వెళ్లిపోతున్నారు. చిలీలో స్థానికులు ఈ మధ్యే పదహారు అడుగుల పొడవున మాన్స్టర్ చేపను పట్టుకున్నారు. అరికా నగరంలో.. ఈ కోలోసాల్ ఓర్ఫిష్(రోయింగ్ ఫిష్) దర్శనమిచ్చింది. సాధారణంగా అవి సముద్రపు లోతుల్లో ఉంటాయి. కానీ, ఇలా పైకి రావడం మంచిది కాదని నమ్ముతున్నారు అక్కడి జనాలు. ఈ మేరకు క్రేన్‌కు వేలాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చెడుకి సంకేతమని, సునామీ, భూకంపాలు వస్తాయని భయంతో వణికిపోతున్నారు. డిజాస్టర్ ఫిష్.. ఈ తెడ్డు చేపకు విపత్తుల చేప అని పేరు ఒకటి ముద్ర పడింది. ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే ఈ రాకాసి చేప.. నీటిలోని భూగర్భ కదలికల తర్వాతే పైకి వస్తాయట. ఆ తర్వాత భారీ భూకంపం, సునామీ ముంచుకొస్తుందని నమ్ముతున్నారు వాళ్లు. అంతేకాదు పట్టుకున్న వాళ్లకు శాపం తగులుతుందనే నమ్మకం ఉంది. చిలీలోనే కాదు.. జపాన్, సముద్రపు తీరం ఉన్న దేశాల్లోనూ ఇలాంటి కథలు జోరుగానే ప్రచారం అయ్యాయి. అంతెందుకు అలా కనిపించిన తర్వాతే.. ఫుకుషిమాలో భూకంపం సంభవించిందని, 20 వేల మందిని బలి తీసుకుందని నమ్ముతున్నారు. పాపం.. చేప వీటిని సముద్రపు భారీ పాములు, సముద్ర రాక్షసి చేప అనే కథలు ఈ ఓర్ఫిష్ మీద ప్రచారం అవుతుంటాయి. కానీ, సైంటిఫిక్ కోణంలో పాపం అవి ప్రమాదకరమైనవి అసలే కావు. ఏనాడూ అవి మనుషులపైగానీ, పడవలపైగానీ దాడి చేసిన దాఖలాలు లేవు. జబ్బు పడినప్పుడు, చనిపోయినప్పుడు, పిల్లలను కనేటప్పుడు మాత్రమే నీటి అడుగు నుంచి పైకి వస్తాయి. ఒక్కోసారి తుఫానులు, బలమైన అలల ధాటికి కూడా కొట్టుకు వస్తాయి. ఓర్ఫిష్ చేపలు నాచు, పాచిని తింటాయి. అంతెందుకు వాటికి నిజమైన దంతాలు కూడా లేవు. బదులుగా.. చిన్న చిన్న చేపలను మింగడానికి గిల్ రేకర్స్ అని పిలువబడే వ్యవస్థ ఉంటుంది. వాటి జీర్ణవ్యవస్థకు చిన్న ద్వారం మాత్రమే ఉంటుంది. పైకి నీటిని చిమ్ముతుంటే.. చూడడానికి మాత్రమే అదొక భయంకరమైన జీవిగా కనిపిస్తుంది అంతే. -
ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే?
అంతరిక్షం గురించి మనకి తెలిసింది తక్కువ తెలియాల్సిందే ఎక్కువే ఉందని, ఈ విశ్వంలో మనకు తెలయని అద్భుతాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అందులో కొన్ని మాత్రం అప్పుడుప్పుడు ఆకాశంలో తళుక్కున మెరుస్తూ మనకి దర్శనమిస్తుంటాయి. ఇటీవల ఓ నగరాన ఆకాశంలో అలాంటి అద్భుతమే ఆవిష్కృతమైంది. ఈ ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూలై 7న శాంటియాగో నగరం ఉదయం 5 గంటల సమయంలో .. అకస్మాత్తుగా అంతరిక్షం నుంచి భూ వాతావారణంలోకి ఓ ఉల్క వచ్చింది. ఇంకేముంది అది అలా ప్రవేశించిందో లేదో భగ్గున మండి ముక్కలై ఆ విస్పోటం చెందింది. దీంతో చీకటిగా ఉన్న ఆ ప్రాంతమంతా తెల్లారకుండానే పట్టపగలులా మారింది. ఇలా ఉల్క పేలినప్పుడు ఏదో పెద్ద మెరుపు మెరిసినట్లు చప్పుడు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనను కన్సెప్షన్ యూనివర్సిటీ స్కాలర్ ధ్రువీకరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటన జరిగిన రోజే న్యూజిల్యాండ్ రాజధాని వెల్లింగ్టన్ ఆకాశంలో ఏదో వస్తువు భగ్గున మండిపోయింది. ఒకే రోజు రెండు దేశాల్లో ఇలా జరగడంతో కొందరు భయబాంత్రులకు గురికాగా మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఏదైమైనా శాస్త్రవేత్తలు ఈ వేర్వేరు వింత ఘటనలకు గల కారణాలపై అధ్యయనాలు మొదలుపెట్టారు. -
ఆ పట్టణంలో వర్షం కురిసిన దాఖలాలే లేవు..!
భూమిపై వర్షం కురువని ప్రదేశం ఒకటి ఉందన్న విషయం నమ్మశక్యంగా లేదా..? నమ్మశక్యంగా లేనప్పటికీ తప్పక నమ్మి తీరాల్సిందే. చిలీలోని అటకామా ఎడారిలో కలామా అనే పట్టణంలో ఇప్పటి వరకు చినుకు కురిసిన దాఖలాలే లేవు. ఆ ఊరిలో లక్షా ఇరవై వేల సంవత్సరాలుగా నదులన్నీ ఎండిపోయి ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మూడు మిలియన్ సంవత్సరాల కంటే ముందు నుంచే అటకామా ప్రాంతం ఎడారిగా ఉంది. ఈ ప్రాంతం భూమిపై అత్యంత పురాతన ఎడారిగా గుర్తింపు పొందింది. -
జీతం రూ.50 వేలు.. అకౌంట్లో పడింది రూ.1.42 కోట్లు !
జీతాలు చెల్లించే విషయంలో కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించకుంటే ఇక్కట్లు తప్పవు అనేందుకు తాజాగా ఉదాహారణ మరొకటి వెలుగులోకి వచ్చింది. శ్రమ దోపిడి లేకుండా పనికి తగ్గ జీతం ఇవ్వడం ఎంత ముఖ్యమో.. నిర్లక్ష్యంగా అధిక మొత్తంలో చెల్లించడమూ కంపెనీలకు ప్రమాదమే. కావాలంటే చిలీ ఏం జరిగిందో మీరే ఓసారి చూడండి. దక్షిణ అమెరికా ఖండంలో చిలీ దేశం ఖనిజ సంపదకు ప్రసిద్ధి. అక్కడ కన్సార్సియో ఇండస్ట్రియల్ డే అలిమెంటోస్ అనే ప్రముఖ మైనింగ్ సంస్థ ఉంది. ఈ కంపెనీలో వేలాది మంది కార్మికులు వందలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల వేతనాల చెల్లింపు సందర్భంగా ఓ ఉద్యోగికి 500,000 పేసోలు (రూ.50 వేలు) చెల్లించాల్సి ఉంది. అయితే అకౌంట్స్ విభాగం చేసిన తప్పుల కారణంగా ఏకంగా 165,398,851 పేసోలు (రూ.1.42 కోట్లు) జీతంగా ఆ ఉద్యోగి ఖాతాలో పడ్డాయి. తప్పు చేశారు ప్రతీ నెల తనకు వచ్చే జీతం కంటే అనేక రెట్లు ఎక్కువగా వేతనం జమ కావడంతో ఒక్కసారిగా ఆ ఉద్యోగి పరేషాన్ అయ్యాడు. వెంటనే అకౌంట్స్ విభాగాన్ని సంప్రదించి తనకు 286 రెట్లు అధికంగా జీత పడిందంటూ తెలిపాడు. వెంటనే రికార్డులు పరిశీలించిన అకౌంట్స్ విభాగం తప్పును గుర్తించింది. అధికంగా జమ అయిన సొమ్మును వెంటనే కంపెనీ ఖాతాకు పంపాలంటూ కోరింది. రాజీనామా మరుసటి రోజు మైనింగ్ కంపెనీ అధికారులు ఉద్యోగికి ఫోన్ చేసి అధికంగా పడిన సొమ్ము గురించి వాకాబు చేశారు. ఎక్కువ సమయం నిద్ర పోవడం వల్ల బ్యాంకుకి వెళ్లడం వీలు పడలేదని. కాసేపట్లో బ్యాంకుకు వెళ్తానంటూ వారికి సమాధానం ఇచ్చాడు. కానీ అదే రోజు అతను బ్యాంకుకు వెళ్లకుండా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్లి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గాయబ్ రెండు రోజులైన ఉద్యోగికి చెల్లించిన అధిక మొత్తం డబ్బులు తిరిగి కంపెనీ ఖాతాలో జమ కాకపోవడంతో మరోసారి సదరు ఉద్యోగితో టచ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అకౌంట్స్ సిబ్బంది. కానీ ఫోన్, మెసేజ్‌లకు అతను అందుబాటులోకి రాలేదు. ఇంటికి వెళ్లి చూడగా అతను అక్కడ లేడు. మరోవైపు ఆఫీసులు రిజైన్ లెటర్ ఇచ్చినట్టు తెలిసింది. నిర్లక్ష్యానికి మూల్యం యాభై వేల రూపాయల బదులు ఒక కోటి నలభైమూడు లక్షల రూపాయల సొమ్మును అందుకున్న సదరు వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనాయాసంగా తనకు దక్కిన సొమ్ముతో ఊరొదిలి రహస్య ప్రాంతాలకు చేరుకున్నాడు. మరోవైపు అధికంగా సొమ్ము చెల్లించడమే కాకుండా రికవరీలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైనింగ్ కంపెనీ ఖజానాకు సుమారు ఒక కోటి నలభై ఒక్క లక్ష రూపాయల మేర చిల్లు పడింది. చదవండి: రూ.3.5 కోట్ల జీతం బాగుంది కానీ జాబ్ బోరుకొడుతోంది! -
Mystery: 35 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన విమానం.. పైలట్ సీటులో అస్థిపంజరం!
టైమ్ ట్రావెల్ అంటేనే ఒక రకమైన ఆసక్తి. తిరిగిరాని గతానికి తిరిగి వెళ్లడం, తెలియని భవిష్యత్‌ను ముందుగానే చూడటం.. టైమ్ ట్రావెల్ అద్భుతం. అయితే కొన్ని సరైన ఆధారాలు లేక ఆశ్చర్యకరమైన ఉదంతాలుగా, జవాబులు లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. అలాంటిదే శాంటియాగో ఫ్లైట్ నం. 513 రిటర్న్స్ స్టోరీ. అది 1989, నవంబర్ 15. బ్రెజిల్‌లోని పార్టో అలెగ్రే విమానాశ్రయం ముందు ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు.. ‘గత నెల 12న ఇక్కడేం జరిగింది? ఎందుకు ఈ ప్రభుత్వం 513 ఫ్లైట్ వివరాలు చెప్పడం లేదు?’ అంటూ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. 1954 నాటి శాంటియాగో ఫ్లైట్‌లోని ప్రయాణికుల వివరాలను తక్షణమే బయటపెట్టాలనేది వారి పోరాటం. ‘నిరాధారమైన ప్రశ్నలకు మేమెలా సమాధానం ఇవ్వగలం?’ అనేది విమానాశ్రయ అధికారుల వాదన. అసలేం జరిగింది? 35 ఏళ్ల కిందట జర్మనీలో మిస్సైన ‘శాంటియాగో ఫ్లైట్ నం. 513’ విమానం (1989,అక్టోబర్ 12) బ్రెజిల్‌లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండయ్యింది. ఫ్లైట్ 513 రికార్డులను పరిశీలించగా.. ఆ విమానం 1954, సెప్టెంబరు 4న పశ్చిమ జర్మనీలోని ఆచెన్ విమానాశ్రయం నుంచి బయల్దేరినట్లు ఆధారాలు ఉన్నాయి. నిజానికి అది 18 గంటల తర్వాత గమ్యస్థానానికి చేరాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. కొన్ని రోజుల పాటు వెతికిన తర్వాత ఆ ఫ్లైట్ అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని అక్కడి అధికారులు తేల్చేశారు. అందులోని కెప్టెన్ మిగ్యూల్ విక్టర్ క్యూతో సహా అంతా చనిపోయినట్లు ప్రకటించారు. అయితే నాడు మిస్ అయ్యిందనుకున్న విమానం.. 1989లో అలెగ్రే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యింది. దీనిపై పారానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్సో అటెల్లో స్పందిస్తూ.. ‘ఆ విమానం 35 ఏళ్ల క్రితం టైమ్ ట్రావెల్లోకి ప్రవేశించి.. 1989లో బయటపడింది’ అని తెలిపారు. ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించింది. కానీ వివరాలను తెలిపేందుకు నిరాకరించింది. బ్రెజిల్ విమానాశ్రయవర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తిమంతమైన టర్బోప్రాప్ ఇంజిన్లు ఉన్నాయని బ్రెజిల్ అధికారులు నిర్ధారించారు. విచిత్రం ఏమిటంటే.. ఆ విమానంలో 88 మంది ప్రయాణికులతో పాటు, ముగ్గురు విమాన సిబ్బంది, విమానం నడిపిన పైలట్ కూడా అస్థిపంజరాల్లా మారిపోయారు. మొత్తం కలిపి 92 మంది అస్థిపంజరాలుగా మిగిలారు. దీనిపై విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీయగా.. ‘ఈ విమాన పైలట్.. కెప్టెన్ విక్టర్ క్యూ.. కాక్‌పీట్‌లో విమానం నడుపుతున్న పొజిషన్ లో మాకు కనిపించారు. ల్యాండింగ్‌కు ముందు ఆ ఫ్లైట్.. ఈ విమానాశ్రయం చుట్టూ చాలా సేపు చక్కర్లు కొట్టింది. దాని గురించి మాకు ముందుగానే ఎలాంటి సమాచారం లేకపోవడంతో మేము కాస్త అయోమయంలో పడ్డాం. ఆ తర్వాత విమానం దానంతట అదే ల్యాండయ్యింది. పైలట్ చనిపోయి ఉన్నా ఆ విమానం ఎలా ల్యాండ్ అయ్యిందనేది మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే’ అని చెప్పుకొచ్చారు. ఇది 1989, నవంబర్ 14.. ఉదయాన్నే ‘వీక్లి వరల్డ్ న్యూస్’ పత్రిక చదివిన వారిని విస్మయపరచిన వార్త. ఆ నోట ఈ నోట విస్తృతంగా ప్రచారమై.. ప్రపంచమూ విస్తుపోయేలా చేసింది. 35వ ఏళ్ల క్రితం మిస్ అయిన విమానం తిరిగి రావడమేంటీ? పైగా ఒక అస్థిపంజరం పైలెట్ స్థానంలో కూర్చుని, విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడమేంటీ? అనే ప్రశ్నలు.. బ్రెజిల్, జర్మనీ దేశాలతో పాటు యావత్ ప్రపంచాన్నీ అనుమానంలోకి నెట్టాయి. ఈ ఘటనపై ‘విమానాశ్రయ అధికారుల అలసత్వం సరికాదు’ అంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం నేర మని, ఆ విమానంలోని ప్రయాణికుల వివరాలు తెలుసుకుని.. ఆ సమాచారం వారి బంధువులకు పంపించండని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రజలు భయాందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వార్తను గోప్యంగా ఉంచుతోందనీ అనుకున్నారు. ఓ కట్టుకథ కొంతమంది మాత్రం.. ‘ఇదంతా ఓ కట్టుకథ, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు’ అని కొట్టిపారేశారు. ఐర్విన్ ఫిషర్ అనే విలేకరి రాసిన ఈ వార్త చుట్టూ భిన్నవాదనలు వెల్లువెత్తాయి. ప్రపంచ చరిత్రలో ఎయిర్‌క్రాఫ్ట్ లిస్ట్‌ను పరిశీలిస్తే.. 1856లో మొదటిసారి మిస్ అయిన హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర నుంచి.. 2019లో గల్లంతయిన ఎమ్బీబీ బీవో 105 హెలికాప్టర్ వరకూ చూసుకుంటే ‘శాంటియాగో నం. 513’ అనే ఫ్లైట్ మిస్ అయినట్లు కాదు కదా కనీసం రికార్డ్‌ల్లో కూడా ఆ పేరుతో ఒక్క ఫ్లైట్ కనిపించలేదు. దీంతో ఇదొక ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు అధికారులు. మరో విషయం ఏమిటంటే.. ‘వీక్లి వరల్డ్’ పత్రిక ఇలాంటి ఫిక్షన్ స్టోరీస్‌ని సృష్టించడంలో దిట్టని చాలా మంది నిరూపించారు. అయినా సరే కొందరు శాంటియాగో 513 టైమ్ ట్రావెల్లో చిక్కుకుందని.. ప్రభుత్వాలే నిజాన్ని దాచిపెడుతున్నాయని.. బలంగా నమ్మారు. దాంతో ఈ ఫ్లైట్ రిటర్న్స్ స్టోరీ మిస్టరీల సరసన చేరి కథలు కథలుగా ప్రచారమవుతోందిప్పటికీ! -సంహిత నిమ్మన చదవండి: USA Boy In The Box Mystery: నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టు.. పాపం చిన్నారి.. ఇంతకీ ఆ బాబు ఎవరు? -
చిలీ అధ్యక్షుడిగా గాబ్రియెల్
శాంటియాగో: వామపక్ష భావజాలమున్న గాబ్రియెల్ బొరిక్ చిలీ కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 36 ఏళ్ల బొరిక్ రాకతో ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ఆర్థికంగా సంపన్న దేశమైన చిలీలో అసమానతలు ఎక్కువగా ఉండడంతో తరచూ ఆందోళనలు జరుగుతుంటాయి. పదిహేడేళ్ల పాటు మిలటరీ నియంతృత్వం రాజ్యమేలి, రక్తపాతం జరిగిన చిలీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించి నాలుగేళ్లే అయింది. బొరిక్ తన కేబినెట్లో 14 మంది మహిళల్ని చేర్చుకొని తమది ఫెమినెస్ట్ కేబినెట్ అని చాటి చెప్పారు. మరో 10 మంది పురుషులు మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 56% ఓట్లతో కన్జర్వేటివ్ అయిన జాస్ ఆంటోనియా కాస్ట్‌పై గాబ్రియెల్ బొరిక్ విజయం సాధించారు. -
నిరుపేదల ఆశాకిరణం
విజయం ఊహించినదే అయినా, అనూహ్య మెజారిటీతో గెలుపు దక్కితే ఉండే ఉత్సాహం వేరు. చిలీ దేశపు రాజధాని శాంటియాగో వీధుల్లో ఆదివారం నాటి జనసందోహం, సంబరాలే అందుకు నిదర్శనం. చిలీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా యువ నేత గ్యాబ్రియెల్ బోరిక్ భారీ విజయంతో ఆ దక్షిణ అమెరికా దేశంలో నవ శకానికి నాందీ ప్రస్తావన జరిగింది. ప్రపంచంలోనే అసమానతలు అధికంగా ఉన్న దేశాల్లో ఒకటైన ఈ లాటిన్ అమెరికా దేశంలో మాజీ విద్యార్థి నేత∙35 ఏళ్ళ బోరిక్ ‘సంక్షేమ రాజ్య’ వాగ్దానంతో అధిక సంఖ్యాకుల మనసు దోచారు. చిలీ కమ్యూనిస్టు పార్టీ సహా కొన్ని ఇతర పార్టీల సంకీర్ణ అభ్యర్థిగా ఈ వామపక్ష వాది బరిలో నిలిచారు, గెలిచారు. ఓటర్లు రెండు వర్గాలుగా కేంద్రీకృతమైన వేళ, మితవాద ప్రత్యర్థి 55 ఏళ్ళ జోస్ ఆంటోనియో కస్ట్పై యువ బోరిక్ భారీ విజయం లాటిన్ అమెరికా దేశాల్లో వామపక్ష వాదానికి మరింత బలం చేకూర్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాది వివిధ లాటిన్ అమెరికన్ దేశాల్లో జరిగిన 5 అధ్యక్ష ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు ఇది నాలుగో గెలుపు. ఆ రకంగానూ తాజా చిలీ ఎన్నికలు ప్రత్యేకమే. నవంబర్ 21న జరిగిన మొదటి రౌండ్ ఎన్నికలలో సంప్రదాయవాద కస్ట్కు కాస్తంత ఎక్కువ పాయింట్లు వచ్చాయి. అయితే, డిసెంబర్ 19 ఆదివారం నాటి తుది రౌండ్లో విశేష జనాదరణతో బోరిక్ తిరుగులేని ఆధిక్యం కనబరిచారు. చివరకు పోల్ అయిన ఓట్లలో 44.1 శాతం కస్ట్కు వస్తే, ఏకంగా 55.9 శాతం ఓట్లతో బోరిక్ నెగ్గారు. అలా 1973 నాటి కుట్రలో ఆత్మహత్యకు పాల్పడిన చిలీ అధినేత అలెండి తర్వాత అత్యంత ఉదారవాద అధ్యక్షుడయ్యారు. స్వలింగ సంపర్కుల వివాహాలు, గర్భనిరోధం, గర్భస్రావం లాంటి వాటికి కస్ట్ వ్యతిరేకి. ఒక దశలో మహిళా వ్యవహారాల శాఖను సైతం రద్దు చేస్తానని, ఆనక వెనక్కి తగ్గిన చరిత్ర ఆయనది. తద్విరుద్ధంగా బోరిక్ ఉదారవాది. యువకులు, పట్టణ ప్రాంత ఓటర్లు ఆయనకు జై కొట్టింది అందుకే. చివరి రౌండ్లో గ్రామీణ ఓటర్లూ ఆయన వైపే మొగ్గడంతో భారీ గెలుపు సాధ్యమైంది. ఓటేయడం స్వచ్ఛందమైన 2012 నాటి నుంచి ఎన్నడూ లేనంతగా 56 శాతం పోలింగ్ నమోదైంది. అధిక భాగం లాటిన్ అమెరికా దేశాల్లో రాజకీయాలు, తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థ – రెండూ అస్థిరమే. కానీ, చిలీ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వంతో, నియంత జనరల్ పినోఛెట్ సైనిక పాలనలో పెట్టిన పాత కాలపు నిరంకుశ రాజ్యాంగానికే కట్టుబడింది. సామాజిక వ్యయం, సబ్సిడీల లాంటి ఊసే లేకుండా లాభసాటి వ్యాపార వాతావరణంతో సంపన్న వర్గాల స్వర్గమైంది. చివరకు 2019 అక్టోబర్ 18న మెట్రో టికెట్ రేట్లపై పన్నులు పెంచడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అలా మొదలై, చిలీలో అనేక నెలలుగా సాగుతున్న నిరసనలు ఆధునిక విప్లవానికి ప్రతీకలు. వెరసి, పాత రాజ్యాంగానికి పాతరేసి, సమాజంలోని విభిన్నతనూ, దశాబ్దాలుగా దూరం పెట్టబడిన అణగారిన వర్గాలనూ ప్రతిబింబించే కొత్త రాజ్యాంగం దిశగా అడుగులు పడ్డాయి. ఈ ఏడాది జూలైలో ‘చిలీ రాజ్యాంగ సభా కూటమి’ ఏర్పాటు అందులో ఓ మైలురాయి. తాజాగా దేశాధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బోరిక్ విజయం ప్రజలు కోరుకుంటున్న మార్పుకు పడ్డ రాజముద్ర. చరిత్ర చూస్తే, అలెండి తర్వాత 1973లో వచ్చిన నియంత పినోఛెట్ ప్రభుత్వ నిరంకుశ పాలన ప్రసిద్ధం. ఆపైన 1990లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలొచ్చినా, లాభం లేకపోయింది. రాగి ఉత్పత్తిలో ప్రపంచంలోకెల్లా ముందుండే రెండు కోట్ల జనాభా చిలీలో ధనిక, పేద తేడాలు పెచ్చరిల్లాయి. ఆ తేడా పోగొట్టి, పేదల అనుకూల కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని వామపక్ష సంకీర్ణ అభ్యర్థిగా బోరిక్ ప్రచారం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఆరాధించే కోటీశ్వరుడు కస్ట్ను బహుళ జాతి సంస్థలు, మీడియా, అమెరికా బలపరిచాయి. కానీ, రైతులు, కార్మిక సంఘాలు, నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు కలసికట్టుగా బోరిక్ వెంట నిలిచి, ప్రత్యర్థిని ఓడించాయి. కానీ, రెండేళ్ళ క్రితం జనాన్ని వీధుల్లోకి రప్పించిన అనేక అంతర్లీన సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆర్థిక అసమానతలు, మితిమీరిన విశ్వవిద్యాలయ ఫీజులు, నూటికి 80 మందికి నెలవారీ కనీస వేతనం (418 డాలర్ల) కన్నా తక్కువ పింఛను – ఇలా ఎన్నో. ఆర్థిక వ్యవస్థ ఆధారపడ్డ రాగి ఎగుమతులకు కొత్త రాజ్యాంగం పెట్టే కఠిన పర్యావరణ నిబంధనలతో ఇబ్బంది తలెత్తవచ్చు. కరోనా దెబ్బతో ఇప్పటికే కుటుంబాలు కుదేలయ్యాయి. వార్షిక ద్రవ్యోల్బణం ఏడేళ్ళ గరిష్ఠానికి చేరింది. అయితే, ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉంటూనే, దేశంలో సాంఘిక హక్కులను విస్తరిస్తామన్నది బోరిక్ మాట. అందుకే, వచ్చే మార్చిలో ఆయన పాలన చేపట్టాక, శ్రామిక వర్గాలకు తోడ్పడే మార్పులు వస్తాయని జనం భావిస్తున్నారు. వాగ్దాన పాలనకై యువతరం నుంచి ఒత్తిడీ తప్పదు. ఈ సమస్యలు అటుంచితే, మొత్తం మీద లాటిన్ అమెరికాలో రాజకీయాలు మలుపు తిరిగాయి. ఆ ప్రాంత ప్రజాస్వామ్యాలు రాజీ లేని భావాలతో ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. పెరూ, నికరాగ్వా, హోండూరస్, ఇప్పుడు చిలీ – నాలుగింటా వామపక్ష అభ్యర్థులే అధ్యక్షులయ్యారు. వచ్చే మేలో కొలంబియాలో, అక్టోబర్‌లో బ్రెజిల్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లోనూ లెఫ్ట్‌దే విజయమని సర్వేల అంచనా. వామపక్ష భావజాలానికి అక్కడి ప్రజల్లో సానుకూలత పెరుగుతున్నట్టు అర్థమవుతోంది. వెరసి, చిలీ సహా లాటిన్ అమెరికా ప్రాంతమంతా ఇప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే, ప్రగతిశీల ‘నూతన సహస్రాబ్ది వామపక్షవాద’ విజృంభణను వీక్షిస్తోంది. సాదరంగా స్వాగతిస్తోంది. -
చిలీ అధ్యక్షుడిగా బోరిక్
శాంటియాగో: చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం మాజీ నేత గాబ్రియెల్ బోరిక్(35) ఘన విజయం సాధించారు. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో బోరిక్ సునాయాసంగా రికార్డు స్థాయిలో 56% ఓట్లు గెలుచుకున్నారు. ప్రధాన ప్రత్యర్థి జోస్ ఆంటోనియో కాస్ట్ కంటే 10 పాయింట్లు ఎక్కువగా సాధించారు. దేశ పాలనపగ్గాలు చేపట్టిన ఆధునిక ప్రపంచ యువ నేతల్లో ఒకరిగా, అత్యంత పిన్న వయస్కుడైన చిలీ అధ్యక్షుడిగా బోరిక్ నిలిచారు. రాజధాని శాంటియాగోలో విజయోత్సవాల్లో భారీగా హాజరైన ప్రజలు, ముఖ్యంగా యువతనుద్దేశించి బోరిక్ స్థానిక మపుచె భాషలో ప్రసంగించారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రకటించారు. ప్రజలందరికీ సమానంగా న్యాయం అందిస్తానని వాగ్దానం చేశారు. చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, బోరిక్‌తో ఫోన్లో సంభాషించారు. మార్చిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ఆయనకు సహకారం అందిస్తానని చెప్పారు. -
వైరల్: అయ్యో.. ఇంటర్వ్యూ తీసుకోకుండా.. అలా పారిపోతున్నారేంటి!
వాషింగ్టన్(చిలి): దక్షిణ అమెరికాలో మాంసాహార సముద్ర జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి సీ లయన్స్ వలస బాట పట్టాయి. దాదాపు 300 సీ లయన్స్ టోమ్కు సమీపంలో చిలీ పట్టణంలోని బయో బయో ప్రాంతంలో సేద తీరుతున్నాయి. అయితే ఈ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఓ విలేకరి స్థానికంగా ఉండే మత్స్యకారుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సీ లయన్‌కి కోపం వచ్చిందో.. ఏమో గానీ.. గేటు తీసుకుని వారి పై దాడి చేయడానికి ప్రయత్నించిది. బయటకు వచ్చి వాళ్లని దూరంగా తరిమింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీని పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘నా(సీ లయన్) గురించి కావాలంటే నన్ను అడుగకుండా.. వేరెవరినో అడుగుతావా.. ఎంత ధైర్యం.’’ అంటూ చమత్కరించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ నా ఇంటర్వ్యూ కూడా తీసుకోండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటి?’’ అంటూ రాసుకొచ్చారు. A "plague of sea lions" has hit a town in the Bio Bio region of Chile, possibly fleeing predators like orcashttps://t.co/MUS0jahzyU RT @BBCWorld pic.twitter.com/3kpDh4yjqg — 🌎Animal Watch🌍 (@Animal_Watch) June 25, 2021 చదవండి: పారదర్శకంగా రాష్ట్రాలకు టీకా పంపిణీ -
చిలీ పర్యటన అజేయం..
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు చిలీ పర్యటనను అజేయంగా ముగించింది. సీనియర్ చిలీ జట్టుతో సాంటియాగోలో సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలుపొందింది. బ్యూటీ డుంగ్‌డుంగ్ (6వ ని.లో, 26వ ని.లో) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. చిలీ తరఫున 40వ నిమిషంలో ఫ్రాన్సిస్కా టాలా ఏకైక గోల్ సాధించింది. ఈ పర్యటనలో ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. మరోవైపు అర్జెంటీనా పర్యటనలో ఉన్న భారత సీనియర్ మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. అర్జెంటీనా ‘బి’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున సలీమా (6వ ని.లో), గుర్జీత్ కౌర్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు మరో గెలుపు
చిలీ సీనియర్ మహిళల జట్టుపై భారత జూనియర్ మహిళల హాకీ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. సాంటియాగోలో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఓటమి ఎరుగని భారత జూనియర్లు ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో 2–0 గోల్స్ తేడాతో చిలీ సీనియర్ జట్టుపై విజయం సాధించారు. తొలి 3 క్వార్టర్లలో హోరాహోరీ పోరాటం సాగగా... చివరిదైన నాలుగో క్వార్టర్లో భారత్ నేర్పుగా గోల్స్ చేసింది. తొలుత సంగీత కుమారి 48వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించింది. తర్వాత 56వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను సుష్మా కుమారి గోల్‌గా మలిచింది. ఈ మ్యాచ్‌లో చిలీ జట్టుకు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా భారత డిఫెన్స్ సమర్థంగా వాటిని నిలువరించింది. -
అంటార్కిటికాలో ల్యాండ్ అయిన కరోనా
శాంటియాగో: ఇప్పటి వరకు కరోనా దూరని ప్రదేశం, ప్రాంతం ఏదైనా ఉందా అంటే అంటార్కిటికాగా చెప్పేవాళ్లం. పూర్తిగా మంచుతో కప్పబడి.. సామాన్యులు ఎవరు నివసించని ఈ ఖండం కరోనా రహిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. కానీ ఇక మీదట ఇలా పిలవడానికి వీలు లేదు. అంటార్కిటికాలో చిలీకి చెందిన ఓ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న 36 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు చిలీ సైన్యం, ఆరోగ్య అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వీరందరిని ఇక్కడ నుంచి తరలించి.. క్వారంటైన్లో ఉంచినట్లు వెల్లడించారు. ఇక కరోనా సోకిన 36 మందిలో సైన్యానికి చెందిన వారు 26 మంది కాగా, మిగిలినవారు నిర్వహణ సిబ్బంది అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరినీ వెనక్కి రప్పించినట్టు సమాచారం. చిలీ సైన్యం అంటార్కిటికాలో శాశ్వత సిబ్బంది పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇది ఉత్తర అంటార్కిటికాలోని ఒక ద్వీపకల్పం కొన దగ్గర ఉంది. చిలీ పటాగోనియాలోని మాగల్లెన్స్లో ఆరోగ్య అధికారులు "కరోనా బారిన పడ్డవారిని ఇప్పటికే ఇక్కడి నుంచి తరలించి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం" అని తెలిపారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని.. ఎవరి పరిస్థితి విషమంగా లేదని వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అంటార్కిటికాకు పర్యాటకుల రాకను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. గత నెల 27న చిలీ నుంచి కొన్ని సామాన్లను అంటార్కిటికాకు చేరవేశారు. ఇక్కడ వైరస్ వెలుగు చూడడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అంతకంటే ముందు అక్కడి పర్యాటకులకు నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగటివ్ అనే తేలింది. అంటార్కిటికాలో చాలా దేశాలు తమ క్యాంపులు ఏర్పాటు చేసుకుని పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 38 క్యాంపుల్లో 1000మంది వరకు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఇప్పటికే సురక్షితంగా తరలించినట్లు బ్రిటీష్ అంటార్కిటికా సర్వే పరిశోధకులు తెలిపారు. (చదవండి: వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!) -
సరికొత్త బాటలో చిలీ
అందరూ అనుకున్నట్టే లాటిన్ అమెరికా దేశం చిలీ ప్రజాస్వామ్య సంస్కరణల దిశగా అడుగు ముందుకేసింది. ఆదివారం అక్కడ జరిగిన రిఫరెండం నూతన రాజ్యాంగ రచనకు అనుకూలంగా ఓటేసింది. సైనిక పాలకుల నీడలో రూపొందిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలంటూ 78 శాతంమంది ప్రజలు ముక్తకంఠంతో కోరారు. సరిగ్గా ఏడాదిక్రితం మెట్రో రైలు చార్జీల పెంపును నిరసిస్తూ రాజుకున్న నిరసన చూస్తుండగానే దావానలంలా వ్యాపించి, ఆ దేశం తలరాతను నిర్దేశించడం నడుస్తున్న చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఆ ఉద్యమ తీవ్రత అసాధారణమైనది. దాని ధాటికి చిలీ రాజధాని శాంటియాగోలో నిరుడు నవంబర్‌లో జరగాల్సిన ఆసియా, పసిఫిక్ దేశాల సహకార సంస్థ ఎపెక్ వార్షిక శిఖరాగ్ర సదస్సు రద్దయింది. అక్కడే జరగాల్సిన వాతావరణ శిఖరాగ్ర సదస్సు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు తరలిపోయింది. కర్ఫ్యూలు, కాల్పులు, అరెస్టులతో ప్రభుత్వం ఎంత బెదిరించినా సాధారణ పౌరుల ఆగ్రహావేశాలు చల్లారలేదు. లక్షమంది ప్రజానీకం చరిత్రాత్మక శాంటియాగో ప్లాజాను దాదాపు నెలరోజులపాటు ఆక్రమించి తమ డిమాండ్లకు తలొగ్గితే తప్ప అక్కడినుంచి కదిలేది లేదని హఠాయించారు. మహిళలే ముందుండి నడిపించిన ఆ ఉద్యమంలో పోలీసు కాల్పులకు 36మంది చనిపోగా, 2,000మంది గాయపడ్డారు. వేలాదిమందిని ఖైదు చేశారు. మెట్రో రైలు చార్జీలను తగ్గించేది లేదని మొదట్లో చెప్పిన ప్రభుత్వం చివరకు ఆ ఉద్యమ తీవ్రత ఏపాటిదో అవగాహన చేసుకుని వారి డిమాండ్‌కు తలొగ్గుతున్నామని ప్రకటించింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఉద్యమకారుల డిమాండ్లు పెరిగాయి. నీరు, భూమి కబ్జా పెట్టి సామా న్యులకు దక్కకుండా చేస్తున్న ప్రభుత్వ విధానాలు రద్దుకావాలంటూ కోరారు. ఆదివాసీ తెగలకు కనీస హక్కులు ఎందుకు లేవని ప్రశ్నించారు. అసలు సైనిక పాలకులు తీసుకొచ్చిన రాజ్యాంగమే కొనసాగరాదంటూ నినదించారు. వీటన్నిటికీ చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా అంగీకరించక తప్పలేదు. పర్యవసానంగా గత మార్చిలో రిఫరెండం జరగాల్సివుంది. కానీ కరోనా విరుచుకుపడ టంతో అది వాయిదా పడింది. ఏడు నెలలు ఆలస్యంగా జరుగుతున్న ఈ రిఫరెండంలో ప్రజలు మునుపట్లా ఆగ్రహావేశాలు ప్రదర్శించి మార్పులకు అనుకూలంగా ఓటేస్తారా లేక చప్పగా చల్లారి యధాతథ స్థితినే కొనసాగిస్తారా అన్న సందిగ్ధత చాలామందిలో లేకపోలేదు. కానీ రిఫరెండం ఫలితం చూస్తే వారి సంకల్పం ఏమాత్రం చెక్కుచెదరలేదని స్పష్టమైంది. చిలీ ఎన్నో సంక్షోభాలు చూసింది. 1973లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సాల్వెడార్ అలెండీని ఆయనే నియమించిన సైనిక దళాల చీఫ్ అగస్టో పినోచెట్ సైనిక కుట్రలో కూలదోశాడు. ఆ తర్వాత 17 ఏళ్లపాటు... అంటే 1990 వరకూ ఆ నియంత కొనసాగించిన చీకటి పాలన ఎన్నో విషాద ఉదంతాలకు కారణమైంది. దేశమంతా సైన్యం పదఘట్టనలతో అట్టుడికింది. పాలించిన పదిహేడేళ్లలో పినోచెట్ ప్రభుత్వం దాదాపు 3,200మందిని ఉరితీయగా, వేలాదిమంది గల్లంతయ్యారు. 80,000మంది జైలుపాల య్యారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినవారినల్లా లెఫ్టిస్టులు, సోషలిస్టులని ముద్రేశారు. దీనికి సమాంతరంగా దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరమయ్యాయి. వాటిని కీలకపదవుల్లోవుండేవారి బంధు, మిత్ర గణానికి కట్టబెట్టారు. అభి వృద్ధి పేరిట లక్షల ఎకరాల భూముల్ని ప్రజలనుంచి బలవంతంగా స్వాధీనం చేసుకుని కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టారు. దేశీయ పరిశ్రమల రక్షణ కోసంవున్న టారిఫ్‌లను ఏకపక్షంగా రద్దుచేశారు. పినోచెట్ ఆర్థిక సంస్కరణలు మొదట్లో మంచి ఆర్థిక ఫలితాలనిచ్చాయి. సంపద పెరిగింది. దేశం సుభిక్షంగా వున్నట్టే కనబడింది. 1982లో ద్రవ్య సంక్షోభం తలెత్తడంతో దేశ ఆర్థిక వ్యవస్థలోని అసమానతలు వెల్లడయ్యాయి. అయితే ఆ వెంటనే సంపన్న దేశాలు ముందుకొచ్చి దాన్ని ఆదు కున్నాయి. అది ఎపెక్ దేశాల కూటమిలో సభ్యత్వం సాధించాక మళ్లీ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కింది. ‘మనం బాగున్నాం...రేపు సైతం మరింత బాగుంటాం’ అనేది పినోచెట్ నినాదం. నిరుడు రద్దయిన ఎపెక్ శిఖరాగ్ర సదస్సుకు కొన్నిరోజుల ముందు ప్రస్తుత అధ్యక్షుడు పినోరాది కూడా అదే స్వోత్కర్ష. ‘పసిఫిక్ తీరంలో మాత్రమే కాదు...ప్రపంచంలోనే చిలీ ఇప్పుడు ఒక నీటి చెలమ. ఒక ఆశాకిరణం’ అంటూ ఆయన గొప్పలు పోయాడు. ఆసుపత్రుల ముందు వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షిం చాల్సి వస్తున్నదని జనం ఫిర్యాదు చేసినప్పుడు ‘కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవచ్చు కదా...’అంటూ ఆరోగ్యమంత్రి ఎద్దేవా చేశాడు. ‘మెట్రో రైలు చార్జీలు భరించలేకపోతే అవి తక్కువగా వున్న రోజుల్లో మాత్రమే ప్రయాణించండ’ని మరో మంత్రి సలహా ఇచ్చాడు. ఉద్యమకారులు దేశద్రోహులని, వారు యుద్ధం ప్రకటించారని పినోరా ఆరోపించారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. చిలీ ప్రజాస్వామ్య ఉద్యమం సాధించిన చరిత్రాత్మకమైన విజయం వెనక ఇంటా, బయటా నిత్యం అణచివేతనూ, హింసనూ చవిచూస్తున్న మహిళాశక్తి వుంది. పినోచెట్ కాలంనాటి సైన్యం ఆగడాలతో పెద్దగా పరిచయంలేని యువతరం వుంది. అందుకే ఈ ఉద్యమం నిలకడగా, దృఢంగా సాగింది. ఉచితంగా మంచినీరు, ఉచిత విద్య, పెన్షన్ విధానం, ఆరోగ్య సంరక్షణ, పౌరుల ఆస్తులకు రక్షణ కావాలని చిలీ ఉద్యమం కోరింది. వీటన్నిటికీ అనువైన ప్రజాతంత్ర రాజ్యాంగ రచనకోసం ఇప్పుడు 155మందితో రాజ్యాంగ నిర్ణాయక సభ ఏర్పడబోతోంది. దానికి వచ్చే ఏడాది ఎన్నిక లుంటాయి. అందులో సగంమంది మహిళా ప్రతినిధులుంటారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన ఆది వాసీ తెగ పౌరులకూ అందులో చోటిచ్చే అవకాశం వుంది. 2022లో ఆ రాజ్యాంగంపై రిఫరెండం నిర్వహిస్తారు. ఆ తర్వాతే చట్టసభలు ఆవిర్భవిస్తాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకొస్తుంది. ఒక కొత్త సమాజాన్ని కలగంటున్న క్షతగాత్రి చిలీ ఆ కృషిలో విజయం సాధిస్తే అది నియంతలపై పోరాడే ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకం అవుతుంది. -
వెంటాడుతున్న విషాదం: ‘ఒక్కరూ ప్రాణాలతో లేరు’
బీరూట్: లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుళ్లు సంభవించి నెల రోజులు దాటిపోయింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర భవనాలన్నీ ధ్వంసమైన ఆ భీతావహ ఘటన ప్రజలను ఇంకా వెంటాడుతోంది. సుమారుగా 191 మంది ప్రాణాలను బలి తీసుకున్న తీవ్ర విషాదం నుంచి వారు నేటికీ కోలుకోలేపోతున్నారు. ప్రమాదం సమయంలో మిస్సయిన ఏడుగురి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ‘లెబనాన్’గుండెను నిలువునా చీల్చిన ఆ చేదు ఘటన నిజం కాకపోయి ఉంటే బాగుండునని, శిథిలాల కింద పడి ఉన్న వాళ్లు కొన ఊపిరితోనైనా బతికి ఉంటారనే ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. అయితే చిలీ రక్షణ బృందాలు చెప్పిన విషయాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. సెన్సార్ రీడింగ్‌లో వెల్లడైనట్లుగా.. పేలుళ్లలో ధ్వంసమైన భవన శిథిలాల కింద ఓ ఒక్కరు ప్రాణాలతో మిగిలిలేరనే చేదు నిజాన్ని చెప్పాయి. (చదవండి: ‘అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది’) కాగా గత నెల 4న బీరూట్ పోర్టులో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ వలన భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 6 వేల భవనాలు నేలమట్టమయ్యాయి. గత ఏడాది కాలంగా లెబనాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి కారణంగా... పేదరికం తారస్థాయికి చేరింది. నిత్యావసరాల కోసం ప్రజలు చెత్తకుప్పలను ఆశ్రయించే దుస్థితి వచ్చింది. అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి. ఇలాంటి తరుణంలో రాజధానిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం లెబనియన్ల జీవితాలను మరింత గందరగోళంలోకి నెట్టాయి. కనీసం శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసే టెక్నాలజీ కూడా అందుబాటులో లేకపోవడంతో.. స్థానిక ప్రభుత్వం చిలీ, అమెరికా, ఫ్రాన్స్ నుంచి రక్షణ బృందాలను రప్పించగా నేటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హార్ట్‌బీట్ వినిపించింది.. ఈ క్రమంలో శిథిలమైన ఓ భవనం వద్ద మానవ హృదయ స్పందనను(హార్ట్‌బీట్) పోలిన శబ్దాలను హైటెక్ సెన్సార్లు గుర్తించడంతో రక్షణ బృందాలు అక్కడ గాలింపు ముమ్మరం చేయగా వారికి నిరాశే మిగిలింది. అక్కడ మనిషి ఆనవాలు కనిపించలేదని చిలీ రెస్క్యూ స్పెషలిస్టు ఫ్రాన్సిస్కో లెర్మాండా శనివారం మీడియాకు వెల్లడించారు. ‘‘ఆ భవనం కింద మనిషి బతికి ఉన్నాడనడానికి ఎలాంటి ఆనవాలు లభించలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. అక్కడ ఎవరూ సజీవంగా లేరు’’అని విచారం వ్యక్తం చేశారు. ఇక పోర్టు సమీపంలో ఓ జాగిలం సెంట్ వాసన పసిగట్టి పరుగులు తీయడంతో.. ఇద్దరు మహిళా వర్కర్లు అక్కడ గల టన్నెల్ చివరి వరకు వెళ్లి మృతుల జాడ కోసం వెదకగా.. ఎవరూ కనిపించలేదు. అయినప్పటికీ.. ‘‘పాక్షికంగా ధ్వంసమైన భవనాలు కూలిపోతాయనే భయం వెంటాడినా సరే అణువణువూ గాలిస్తాం. బాధితులను వెలికితీసేందుకు మా వంతు ప్రయత్నం కొనసాగిస్తాం’’అని సివిల్ డిఫెన్స్ అధికారి ఖాసీం ఖటార్ వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు అన్నిచోట్లా శిథిలాలను తొలగించే ప్రక్రియ పూర్తై పోవచ్చిందని తెలిపారు. అద్భుతం జరిగితే తప్ప.. అయితే లెబనీస్ అధికారులు మాత్రం.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ ఘోర ప్రమాదం నుంచి తేరుకుని బతికే ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్థానిక ఫిల్మ్ మేకర్ సలీం మురాద్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతం జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ ప్లీజ్ దేవుడా.. బీరూట్ మిరాకిల్‌కు వేదిక కాగల ఆశీర్వాదాలు అందించూ’’అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక మృతులను వెలికితీసేందుకు ప్రాణాలు పణంగా పెట్టి శ్రమిస్తున్న చిలీ రక్షణ బృందాలపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిని నిజమైన హీరోలుగా వర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెబుతున్నారు. బీరూట్ పేలుళ్ల ఘటనకు నెల రోజులు పూర్తైన సందర్భంగా మృతులకు నివాళిగా శుక్రవారం దేశ ప్రజలంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. కాగా ఈ ఘోర విషాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని హసన్ దియాబ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు..
ఎన్నో కలలతో మరెన్నో ఆకాంక్షలతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టబోతున్నాం. గ్రాండ్‌గా న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పబోతున్నాం. కొత్త ఏడాదంటేనే కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్తేజం. అంత జోష్‌లోనూ కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వివిధ దేశాల ప్రజలు పాటించే ఆ సంప్రదాయాలు ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం. స్పెయిన్ డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మేల్కొని గడియారం ముల్లు సరిగ్గా 12 మీదకి రాగానే స్పెయిన్ దేశస్తులు 12 ద్రాక్షపళ్లు తింటారు. అలా తింటే అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం. ఈక్వెడార్ ఈక్వెడార్‌లో డిసెంబర్ 31 రాత్రి ఎవరూ ఇళ్లల్లో ఉండరు. అందరూ రోడ్లపైనే గడుపుతారు. ప్రధాన కూడళ్లలో మంటలు రాజేసి రాజకీయ నాయకుల దిష్టి బొమ్మలను తగుల బెడతారు. ఈ చర్యతో గత ఏడాది కాలంలో జరిగిన చెడు అంతా పోయినట్టుగా భావిస్తారు. ఈ సంప్రదాయం 1895 నుంచి వస్తోంది. గ్రీస్ గ్రీస్‌లో జనవరి 1న చర్చికి వెళ్లి వచ్చిన వాళ్లందరికీ అక్కడ ఉల్లిపాయలు పంచుతారు. వాటిని తీసుకువచ్చి దండలా తయారు చేసి ఇంటి గుమ్మానికి వేళ్లాడతీస్తారు. ఉల్లిపాయలు అంటే ఆరోగ్యానికి, సంతానం వృద్ధికి, ఆయుఃప్రమాణాలు పెంచడానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కొత్త సంవత్సరం ఉల్లిపాయల దండ గుమ్మానికి వేళ్లాడదీయడం శుభ పరిణామంగా విశ్వసిస్తారు. చెక్ రిపబ్లిక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్లో యాపిల్ కట్ చేస్తారు. అదీ కొత్త ఏడాది తమ అదృష్టం ఎంతో తెలుసుకోవడం కోసం. యాపిల్‌ను మధ్యకి కోస్తారు. యాపిల్ మధ్య భాగంలో విత్తనాలు ఉన్న చోట స్టార్ వస్తే కొత్త ఏడాదంతా మంచే జరుగుతుందని, అదే క్రాస్ వస్తే చెడు జరుగుతుందని వారి నమ్మకం. జపాన్ జపాన్‌లో కొత్త సంవత్సరం అంటే అర్ధరాత్రి గంటల్ని గణగణమని మోగిస్తారు. రాత్రి 12 అవగానే 108 సార్లు గంటలు మోగుతాయి. అలా చేస్తేనే తమ జీవితం ఆనందంగా సాగుతుందని అంటారు. ఇటలీ ఇటలీలో కొత్త సంవత్సరం కాస్త వినూత్నంగా ఉంటుంది. చెత్త సామాను వదిలించుకోవడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చెత్త సామానంతటినీ బయట పడేస్తారు. అంటే మనసుల్లో ఉన్న చెడు జ్ఞాపకాల్ని వదిలించుకోవడం అన్నమాట. దక్షిణాఫ్రికావంటి దేశాలూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. చిలీ కొత్త ఏడాది ఉత్సవాల్ని వివిధ దేశాల ప్రజలు చర్చిల్లో జరుపుకుంటే చిలీ వాసులు తమ రూటే సెపరేటు అంటున్నారు. తమకు అత్యంత ప్రియమైన వారి సమాధుల వద్ద ఈ సంబరాలు నిర్వహిస్తారు. సమాధుల్ని పూల తో అలంకరించి, దీపాలు ఉంచుతారు. ఈ లోకంలో లేకపోయినా సరే కొత్త సంవత్సరం ప్రియమైన వారిని తలచుకోవడం కంటే మించినదేదీ ఉండదని చిలీ వాసులు 1995 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. డెన్మార్క్ డెన్మార్క్‌లో రకరకాల పింగాణి పాత్రలు (క్రాకరీ)ని బద్దలు కొడతారు. ప్లేట్లు, కప్పులు, స్పూన్లు లాంటివన్నీ డిసెంబర్ 31 అర్ధరాత్రే విరగ్గొట్టేస్తారు. అప్పుడే అదృష్టం తమకి కలిసివస్తుందని వారి నమ్మకం. -
చిలీలో విమానం గల్లంతు
శాంటియాగో : చిలీకి సంబంధించిన మిలటరీ విమానం ఒకటి సుమారు 38 మంది ప్రయాణీకులతో గల్లంతయ్యింది. దేశానికి దక్షిణాన ఉన్న ఓ స్థావరం నుంచి అంటార్కిటికా వెళ్లేందుకు టేకాఫ్ తీసుకున్న విమానం కూలిపోయి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 4.55 గంటలకు సీ–130 విమానం పుంటా ఎరీనా నుంచి టేకాఫ్ తీసుకుందని, 6.13 గంటలకు సంబంధాలు తెగిపోయాయని చిలీ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఎమర్జెన్సీ పొజిషనింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ అది పనిచేస్తున్నట్లుగా లేదని వాయుసేన అధికారి ఎడ్యురాడో మోస్కూయిరా తెలిపారు. -
విమానం అదృశ్యం: 21 మంది ప్రయాణికులు సహా..
శాంటియాగో: చిలీ దేశానికి చెందిన సీ-130 మిలిటరీ విమానం అదృశ్యమైంది. అంటార్కిటికా ప్రాంతం గుండా వెళ్తున్న ఈ విమానం నుంచి ఎటువంటి సిగ్నల్ రాకపోవటంతో అదృశ్యం అయినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుందని.. ఈ విమానంలో 21 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మిలిటరీ సిబ్బంది.. విమానం ఆచూకి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై ఆ దేశ ఆధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా స్పందించారు. ‘రక్షణ శాఖ, విమానయాన శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన విషయాలను, గాలింపు చర్యలను పర్యవేక్షించాలి’ అని ఆయన ఆదేశించారు. కాగా సీ-130 విమానం సోమావారం సాయంత్రం 4:55 గంటలకు గగనతలంతోకి ప్రవేశించింది. రాజధాని శాంటియాగో నుంచి 3,000 కిలోమీటర్ల వరకు విమానానికి సంబంధించిన సమాచారం ఎయిర్‌పోర్టు అధికారుల పర్యవేక్షణలో ఉంది. కాని ఒక్కసారిగా 6:13 గంటలకు రాజధాని శాంటియాగోకు దక్షిణంగా ఉన్న పుంటా అరేనాస్ నగరం దగ్గర విమనానం సిగ్నల్ కోల్పోయిందని అధికారులు తెలిపారు. వాతావారణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన విమానానికి సంబంధించిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వైమానిక దళానికి చెందిన జనరల్ ఎడ్వర్డో మోస్క్వైరా తెలిపారు. ఈ విమాన పైలట్‌కి విస్తృతమైన అనుభవవం ఉందని ఆయన పేర్కొన్నారు. -
పెల్లుబికిన నిరసనలు.. మెట్రో స్టేషన్లకు నిప్పు
శాంటియాగో : చిలీలో ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం రోజున మొదలైన నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో పలువురు మరణించగా.. ఆందోళన చేపడుతున్న వందలాది మందిని అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. మెట్రో చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు చిలీ రాజధాని శాంటియాగోలో ఆందోళనలకు దిగారు. రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు మాస్క్‌లు ధరించి బీభత్సం సృష్టించారు. పలు చోట్ల బస్సులకు, మెట్రో స్టేషన్లకు, బ్యాంకులకు నిప్పు పెట్టారు. శాంటియాగోలో ఎక్కడ చూసిన మంటలు, దట్టమైన పొగలతో నిండిపోయింది. పలుచోట్ల నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అలాగే బారీగా భద్రతా బలగాలను మోహరించారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించడమే కాకుండా.. 15 రోజులపాలు ఎమర్జెన్సీ ప్రకటించింది. కాగా, చిలీలో నియంతృత్వ పాలన ముగిసిన తర్వాత ఇలాంటి హింసాత్మక ఆందోళన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. More subways trains are burning tonight in Chile; you don’t see police or firefighters in the video, oddly; @BorisvanderSpek reports the country’s President “announced he will not increase metro fares IF violent protests stop.” pic.twitter.com/cqNxK7aPZX — David Begnaud (@DavidBegnaud) October 19, 2019 -
ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ బెర్త్ సొంతం
హిరోషిమా: ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ టోర్నీకి భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించింది. హిరోషిమాలో జరుగుతోన్న మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో చిలీపై విజయం సాధించి క్వాలిఫయర్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4–2 గోల్స్ తేడాతో విజ యం సాధించింది. భారత్ తరపున గుర్జిత్ కౌర్(22, 37వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్(31వ నిమిషంలో), రాణి రాంపాల్(57వ నిమిషంలో)లు గోల్స్ సాధించగా... చిలీ తరపున కరోలినా గార్సియా(18వ నిమి షంలో), మాన్యుల ఉరోజ్ (43వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఆట 18వ నిమిషంలో కరోలినా గార్సియా గోల్‌తో చిలీ ఖాతా తెరిచింది. అయితే షాక్ నుంచి త్వరగానే తేరుకున్న భారత్ 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ పోస్ట్‌లోకి నెట్టి గుర్జిత్ కౌర్ స్కోరును సమం చేసింది. తర్వాత మరింత దూకుడును పెంచిన భారత్ ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి దాడులను ముమ్మరం చేసింది. ఆట 31వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేసిన నవ్‌నీత్ కౌర్ భారత్‌కు 2–1 ఆధిక్యాన్నిచ్చింది. 37వ నిమిషంలో మరో గోల్ సాధించిన గుర్జీత్ కౌర్ భారత్ స్కోర్‌ను 3–1కు తీసుకెళ్లింది. చిలీ తరపున మాన్యుల ఉరోజ్ 43వ నిమిషంలో గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని 3–2కు తగ్గించింది. 4వ క్వార్టర్లో భారత్ తరపున గోల్ సాధించిన రాణి రాంపాల్ భారత విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్‌లో భారత్ 2 గ్రీన్ కార్డులను పొందగా, చిలీ 1 గ్రీన్ కార్డును పొందింది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ 3–1తో పెనాల్టీ షూటౌట్లో రష్యాపై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్కో గోల్ చేయడంతో షూటౌట్ అనివార్యమైంది. ఆదివారం భారత్, జపాన్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. -
ఐరాస మానవహక్కుల చీఫ్‌గా బ్యాష్లే
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ నూతన చీఫ్‌గా చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బ్యాష్లే ఎన్నికయ్యారు. జొర్డాన్ దౌత్యవేత్త జీద్ రాద్ అల్–హుసేన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. యూఎన్ మానవ హక్కుల సంస్థ హైకమిషనర్ పదవికి బ్యాష్లే పేరును ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ ప్రతిపాదించారు. 193 సభ్య దేశాల సాధారణ అసెంబ్లీ శుక్రవారం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 1993లో ఏర్పాటైన యూఎన్ మానవ హక్కుల సంస్థకు బ్యాష్లే ఏడో హైకమిషనర్ కానున్నారు. ఈనెల 31న జీద్ రాద్ పదవీకాలం ముగియనుంది. -
భారీ భూపాతం.. ధ్వంసమైన గ్రామం
చిలీ : భారీ భూపాతం ధాటికి దక్షిణ చిలీలోని ఓ కుగ్రామం నాశనమైంది. కొర్కొవాడో జాతీయ పార్క్‌కు చేరువలో ఉన్న విల్లా శాంటా లూసియా గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం అర్థరాత్రి వరకూ భారీగా వర్షం కురవడంతో భూపాతం సంభవించినట్లు తెలుస్తోంది. భూపాతం ధాటికి గ్రామంలోని రోడ్లు, పాఠశాల, ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. కొన్ని ఇళ్లైతే పూర్తిగా నాశనమయ్యాయి. లూసియా గ్రామాన్ని ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
చిలీలో భూ ప్రకంపనలు
చిలీ: చిలీలోని శాన్ పెడ్రోలో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. శాన్‌పెడ్రో నగరానికి దాదాపు 67 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. -
మన అమ్మాయిలకే పట్టం
► మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్–2 టోర్నీ విజేత భారత్ ► ఫైనల్లో చిలీపై విజయం ► ‘బెస్ట్ గోల్‌కీపర్’గా సవిత వెస్ట్ వాంకోవర్ (కెనడా): బరిలో ఉన్న అన్ని జట్లకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న భారత్ స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణించింది. మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్–2 టోర్నమెంట్లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ భారత్ ‘షూటౌట్’లో 3–1 గోల్స్ తేడాతో ప్రపంచ 19వ ర్యాంకర్ చిలీ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1–1తో సమఉజ్జీగా నిలిచాయి. ఆట ఐదో నిమిషంలో మరియా మల్డొనాడో చేసిన గోల్‌తో చిలీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 41వ నిమిషంలో అనూపా బార్లా గోల్‌తో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. అనంతరం రెండు జట్లు మరో గోల్ చేయడంలో సఫలం కాలేదు. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్ సవిత అడ్డుగోడలా నిలబడి చిలీకి చెందిన మూడు షాట్లను నిలువరించింది. కిమ్ జాకబ్ (తొలి షాట్), జోసెఫా విలాలాబిటియా (రెండో షాట్), కాటలీనా యానెజ్ (నాలుగో షాట్) గోల్ ప్రయత్నాలను సవిత అడ్డుకోగా...కరోలినా గార్సియా (మూడో షాట్) సఫలమైంది. మరోవైపు భారత్ తరఫున రాణి రాంపాల్, మోనిక, దీపిక వరుసగా మూడు షాట్లను గోల్స్‌గా మలిచారు. ఫలితం తేలిపోవడంతో భారత్ మిగతా రెండు షాట్లను తీసుకోలేదు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన సవిత ‘బెస్ట్ గోల్‌కీపర్’ పురస్కారం దక్కించుకుంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరడంద్వారా భారత్ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. లీగ్ దశలో ఉరుగ్వే, బెలారస్లను ఓడించిన భారత్... సెమీస్‌లో మరోసారి బెలారస్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో బరిలోకి దిగడంద్వారా భారత క్రీడాకారిణి దీపిక తన కెరీర్లో 200 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. 2003లో భారత్‌కు తొలిసారి ఆడిన ఈ హరియాణా క్రీడాకారిణి గతేడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాపై కీలక గోల్ సాధించి భారత్‌కు టైటిల్ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించింది. ‘ఫైనల్ పోటాపోటీగా సాగింది. ఆరంభంలో వెనుకబడినా ఒత్తిడికి లోనుకాకుండా ఆడి స్కోరును సమం చేశాం. టోర్నీ మొత్తం ప్రతికూల వాతావరణంలో జరిగినా అన్ని సవాళ్లను అధిగమించి విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉంది’ అని భారత కెప్టెన్ రాణి రాంపాల్ వ్యాఖ్యానించింది. -
ఆ పట్టణం తగులబడి బొగ్గయింది
చిలీ: దావానలం చిలీని తగులబెడుతోంది. మధ్య చిలీ ప్రాంతాలు మొత్తం ఇప్పటికే సర్వనాశనం అవుతుండటంతోపాటు దానికి సమీపంగా ఉన్న ప్రాంతాలవారు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. అనూహ్యంగా రేగిన కార్చిచ్చు ఎంతకీ అదుపులోకి రాకపోగా విసురుగా వీస్తున్న పెనుగాలులు తోడవడంతో మరింత విధ్వంసం జరుగుతోంది. ఆధునిక చరిత్రలో ఇదే అతి పెద్ద కార్చిచ్చుగా అధికారులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే మధ్య చిలీలోని ప్రజలంతా ఆ ప్రాంతాలను విడిచి దూరంగా కదిలారు. కట్టుబట్టలు తప్ప వారి వద్ద ఏం లేకుండా పోయాయి. పలు ఇళ్ల నేలమట్టాయి. విపరీతంగా వస్తున్న వేడగాలులు, చుట్టేసిన నల్లటి పొగ కారణంతో తమ ప్రాంతానికి సమీపంలో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం రష్యా కూడా రంగంలోకి దిగింది. టన్నుల నీటిని నిల్వచేసుకునే సామర్థ్యంగల సూపర్ ట్యాంకర్ విమానాన్ని పంపించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా సంభవించిన కార్చిచ్చు కారణంగా మరింత సంక్షోభంలోకి వెళ్లినట్లయింది. -
మంచినీటికి మంచి మార్గం
శాంటియాగో: భూగర్భంలో జల వనరులు తరగిపోయినప్పుడు వర్షాల కోసం ఆకాశంవైపు దిక్కులు చూడడం తప్పా చేసేదేమీ లేదనుకుంటే పొరపాటు. అలా దిక్కులు చూడడం నుంచి కూడా జల వనరుల సమీకరణకు కొత్త దిక్కు కనిపిస్తుందని చిలీ రాజధాని శాంటియాగో నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనా బ్లాంకా అనే ఓ చిన్న గ్రామం ప్రజలు నిరూపించారు. ఈ గ్రామం ప్రజలంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వర్షాలు లేవు. పర్యవసానంగా భూగర్భంలో జలవనరులు అడుగంటి పోయాయి. అంత లోపలి వరకు బోరింగ్లు వేసే స్థోమత కూడా ఈ గ్రామం ప్రజలకు లేదు. మరి ఏం చేయాలి? ఈ గ్రామంలో పొగ మంచు ఎప్పుడూ కనిపిస్తుంటోంది. బలమైన గాలులు కూడా వీస్తుంటాయి. ఆ కారణంగా సూర్యరశ్మి కూడా ఎక్కువగా ఉండదు. ఆ పొగమంచులోని నీటిని ఒడిసిపట్టుకుంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన గ్రామ పెద్దలకు కలిగింది. ఎలా ఒడిసి పట్టుకోవడం ? గ్రామ పెద్దలు చదువుకున్న తమ పిల్లలను అడిగారు. పొగమంచు వచ్చే దిశగా తాళ్లతో అల్లిన జాలీలు కడితే పొగమంచులోని నీటిని తాళ్లు లాగేసుకుంటాయని, తాళ్ల తెర అడుగు భాగాన ఓ గొట్టాన్ని ఏర్పాటుచేసి నీటిని డ్రమ్ముల్లోకి నింపవచ్చని ఎవరో ఐడియా ఇచ్చారు. అంతే! ఆరోజు నుంచి గ్రామం నీటి కష్టాలు తీరిపోయాయి. విద్యుత్ కూడా అవసరం లేకుండా స్వచ్ఛమైన నీటిని వాతావరణం నుంచే ఒడిసి పట్టుకునే విద్యను వారు నేర్చుకున్నారు. వారు గ్రామం పొలిమేరలో 140 చదరపు మీటర్ల జాలి తెరలను ఏర్పాటు చేయడం ద్వారా రోజుకు 840 లీటర్ల స్వచ్ఛమైన నీటిని సేకరిస్తున్నారు. దీంతో వారి తాగునీటి అవసరాలు, వ్యవసాయ అవసరాలు తీరిపోతున్నాయి. వాస్తవానికి చిలీలో ఇలా నీటిని ఒడిసిపట్టుకునే విధానం 1950 దశకంలోనే అమల్లో ఉంది. సరైన ప్రోత్సాహం లేక అది కాలగర్భంలో కలసి పోయింది. మళ్లీ ఈ విధానానికి ఇప్పుడు ప్రోత్సాహం లభిస్తోంది. మొరొక్కోలో ఇప్పుడు ‘దార్ సి హమద్’ ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద ఎత్తున మంచుపొగ నుంచి నీటిని సేకరిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ జమీలా బర్గాచ్ 2016 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి నుంచి అవార్డు కూడా అందుకున్నారు. నీటి వనరులు అతి తక్కువగా ఉండే సహారా ఎడారిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నీటి తెరలను ఏర్పాటు చేసి ఎడారిలో కూడా చెట్లను పెంచుతున్నారు. -
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
-
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
భారీ భూకంపం చిలీని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దక్షిణ చిలీలోని ప్యూర్టో మాంట్ నగరానికి 225 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే భూకంపం వల్ల సంభవించిన నష్టం వివరాలు మాత్రం ఇంతవరకు అందలేదు. దక్షిణ చిలీలోని తారాహుయిన్లో భూకంప దాటికి పాడైన రోడ్డు -
కోపా అమెరికా కప్ లో చిలీ విజయం
-
చిలీ సంచలన విజయం
గ్లెండేల్ (అమెరికా): కోపా అమెరికా కప్‌లో చిలీ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఫేవరేట్ అర్జెంటీనా మరో సారి రన్నరప్ తో సరిపెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్ సమరంలో చిలీ పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై సంచలన విజయం సాధించింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా నిర్ణీత సమయంలోపు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. పెనాల్టీ షూటౌట్లో చిలీ నాలుగు గోల్స్ చేయగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రెండు గోల్స్ మాత్రమే చేయలగలిగింది. విజేత చిలీకి 25.37 కోట్ల రూపాయలు, రన్నరప్ అర్జెంటీనాకు 19 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. గతేడాది కూడా కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ పెనాల్టీ షూటౌట్లోనే అర్జెంటీనాను ఓడించింది. -
ప్రతీకారం తీర్చుకుంటారా!
న్యూయార్క్:శతవసంతాల కోపా అమెరికా ఫుట్ బాల్ కప్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. వందేళ్ల సుదీర్ఘ చరిత్రలో భాగంగా ఈ ఏడాది నిర్వహించిన కోపా అమెరికా కప్ రేపటితో ముగియనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అర్జెంటీనా-చిలీ జట్లు జరిగే తుది పోరులో తమ అదృష్టాన్నిపరీక్షించుకోనున్నాయి. భారత కాలమానప్రకారం సోమవారం ఉదయం గం.5.30 ని.లకు ఈస్ట్ రూథర్ఫర్డ్లోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీఫైనల్లో కొలంబియాపై 2-0తో విజయం సాధించి చిలీ ఫైనల్ కు చేరగా, అర్జెంటీనా 4-0 తేడాతో అమెరికాపై గెలిచి తుది పోరుకు సిద్ధమైంది. గతేడాది ఇదే టోర్నీలో ఈ రెండు జట్లే ఫైనల్ కు చేరగా చిలీ విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి కోపా అమెరికా కప్ ను అందుకుంది. అయితే మరోసారి టైటిల్ ను సాధించాలని చిలీ పట్టుదలగా ఉంది. ఫైనల్ కు చేరే క్రమంలో మేటి జట్లను సైతం మట్టికరిపించి ఫైనల్ కు చేరిన చిలీ మరో అడుగును దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, గతేడాది ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అర్జెంటీనా భావిస్తోంది. ఇప్పటివరకూ 14 సార్లు కోపా అమెరికా ట్రోఫీని అందుకున్న అర్జెంటీనా.. ఈసారి కోప్ కప్ ను గెలుచుకుని 23 ఏళ్ల నిరీక్షణకు తెరదించడానికి సమాయత్తమవుతోంది. 1921లో తొలి టైటిల్ ను అందుకున్న అర్జెంటీనా.. 1993 లో చివరిసారి కోపా టైటిల్ ను సాధించింది. అయితే గత కొంతకాలంగా ప్రధాన టోర్నీల్లో మెస్సీ అండ్ గ్యాంగ్ చతికిలబడటం ఆ జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. 2014లో వరల్డ్ కప్ ఫైనల్లో జర్మనీ చేతిలో పరాజయం చెందిన అర్జెంటీనా.. 2015 కోపా అమెరికా కప్ లో కూడా ఫైనల్ ఫోబియోను అధిగమించలేకపోయింది. మరోవైపు అర్జెంటీనా జట్టు నాయకత్వంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. అర్జెంటీనా జట్టులో పోస్టర్ తరహా పాత్రను పోషిస్తూ ఫీల్డ్‌లో ఒక గొప్ప నాయకుడిగా మెస్సీ మన్ననలు అందుకుంటున్నాడంటూ మారడోనా మండిపడ్డాడు.. అతను తన క్యారెక్టర్‌ను కోల్పోయి జట్టుకు నాయకుడిగా మారాడని ధ్వజమెత్తాడు. అయితే అర్జెంటీనా ఫైనల్ కు చేరినా మారడోనా మాత్రం మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆదివారం నాటి పోరులో అర్జెంటీనా విజేతగా నిలిచి పరువు నిలుపుకోవాలన్నాడు. ఒకవేళ విజయం సాధించని పక్షంలో ఇప్పుడు వరకూ సాధించింది ఏమీ ఉండదంటూ మెస్సీ సేనకు హితబోధ చేశాడు. ఈ నేపథ్యంలో విజయంతోనే ఇంటా, బయటా సమాధానం చెప్పడానికి ఆ జట్టు సిద్ధమవుతోంది. దీంతో సుమారు ఎనభైవేల మంది ప్రేక్షక్షుల హాజరయ్యే తుది సమరం ఆసక్తికరంగా సాగి అవకాశం ఉంది. -
అర్జెంటీనాకు చిలీ సవాల్
షికాగో: డిఫెండింగ్ చాంపియన్ చిలీ కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో కొలంబియాపై 2-0తో విజయం సాధించింది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ ఆరంభం నుంచి చిలీ పూర్తి ఆధిప్యతం కనబరిచింది. చిలీ ఆటగాళ్లు చార్లెస్ అరాంగ్విజ్, జోస్, ఫుంజాలిండా గోల్స్ సాధించారు. ఆదివారం జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో చిలీ తలపడుతుంది. గతేడాది కూడా ఈ రెండు జట్టే ఫైనల్ కు వచ్చాయి. అర్జెంటీనాను 4-1తో ఓడించి తొలిసారిగా చిలీ కోపా కప్ ను ఎగరేసుకుపోయింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోవడంతో పెనాల్టీ షూటవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. పెనాల్టీ షూటవుట్ లో చిలీ గోల్స్ చేయగా, అర్జెంటీనా ఒక గోల్ మాత్రమే చేసింది. ఈసారి చిలీని ఓడించి గతేడాది ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని మెస్సీ సేన భావిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ హోదా నిలబెట్టుకోవాలని చిలీ ప్రయత్నిస్తోంది. -
చిలీ 'సూపర్' షో
శాంతా క్లారా(యూఎస్): కోపా అమెరికా ఫుట్ బాల్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ చిలీ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిలీ 7-0 తేడాతో మెక్సికోను కంగుతినిపించి సెమీస్‌లోకి ప్రవేశించింది. చిలీ ఆటగాడు వార్గాస్ నాలుగు గోల్స్ చేసి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆట 16వ నిమిషంలో ఎడ్సన్ పచ్ తొలి గోల్‌ను అందించి చిలీని ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం 13 నిమిషాల వ్యవధిలో చిలీ ఆటగాడు వార్గాస్ హ్యాట్రిక్ గోల్స్ అదరగొట్టాడు. 44, 52, 57వ నిమిషాల్లో వార్గాస్ మూడు గోల్స్ సాధించాడు. ఆపై 74వ నిమిషంలో వార్గాస్ ఖాతాలో మరో గోల్ నమోదు చేశాడు. చిలీ మిగతా ఆటగాళ్లలో సాంచెజ్(49వ నిమిషం), ఎడ్సన్ పచ్(87వ నిమిషంలో) గోల్స్ నమోదు చేసి జట్టుకు 7-0 తేడాతో సంపూర్ణ విజయాన్ని అందించారు. దీంతో చారిత్రాత్మక విజయం చిలీ ఖాతాలో చేరగా, ఒక ప్రధాన టోర్నమెంట్లో దారుణమైన ఓటమిని మెక్సికో తొలిసారి మూటగట్టుకుంది.. అంతకుముందు 1978 వరల్డ్ కప్ లో వెస్ట్ జర్మనీ చేతిలో 6-0తేడాతో మెక్సికో ఓటమి పాలైన తరువాత ఆ జట్టుకు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన కావడం గమనార్హం. -
చిలీపై అర్జెంటీనా పైచేయి
* డిఫెండింగ్ చాంపియన్‌పై నెగ్గిన నంబర్‌వన్ జట్టు * మెస్సీ లేకున్నా రాణించిన నిరుటి రన్నరప్ * కోపా అమెరికా కప్ సాంటా క్లారా (అమెరికా): గాయం కారణంగా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అందుబాటులో లేకున్నా... అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ చిలీ జట్టుపై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో గతేడాది జరిగిన ‘కోపా’ ఫైనల్లో చిలీ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. అర్జెంటీనా తరఫున 51వ నిమిషంలో ఏంజెల్ డిమారియా, 59వ నిమిషంలో ఎవర్ బనెగా ఒక్కో గోల్ చేయగా... చిలీ జట్టుకు 93వ నిమిషంలో (ఇంజ్యూరీ టైమ్) జోస్ పెడ్రో ఫ్యుయెన్జలీదా ఏకైక గోల్ అందించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న అర్జెంటీనా... ఐదో ర్యాంక్‌లో ఉన్న చిలీ జట్టు తొలి అర్ధభాగంలో ఆద్యంతం దూకుడుగా ఆడినా ఇరు జట్లూ ఖాతా తెరవలేకపోయాయి. రెండో అర్ధభాగం మొదలైన ఆరు నిమిషాలకే అర్జెంటీనా ఖాతాలో తొలి గోల్ చేరింది. మిడ్ ఫీల్డ్ నుంచి బనెగా ముందుకు వచ్చి తన ఎడమ వైపు ఉన్న డిమారియాకు పాస్ ఇవ్వగా... అతను బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఎనిమిది నిమిషాల తర్వాత అర్జెంటీనా రెండో గోల్‌ను సాధించింది. ఈసారి డిమారియా ఇచ్చిన పాస్‌ను బనెగా లక్ష్యానికి చేర్చాడు. రెండు గోల్స్ చేసిన తర్వాత కూడా అర్జెంటీనా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరి నిమిషాల్లో చిలీకి జోస్ పెడ్రో గోల్ అందించినప్పటికీ డిఫెండింగ్ చాంపియన్‌కు ఓటమి తప్పలేదు. పనామా గెలుపు: ‘డి’ గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో పనామా జట్టు 2-1తో బొలీవి యాను ఓడించింది. పనామా తరఫున బ్లాస్ పెరెజ్ (11వ, 87వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... బొలీవియాకు కార్లోస్ గోల్ అందించాడు. బాధలో ఉన్నా... ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయంలో ముఖ్యపాత్ర పోషించిన డిమారియాకు మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలముందు చేదు వార్త తెలిసింది. తనెంతగానో అభిమానించే అమ్మమ్మ మరణించిందని సమాచారం అందడంతో అతను తీవ్ర వేదనతోనే బరిలోకి దిగాడు. గోల్ చేసిన వెంటనే ‘గ్రాండ్మా... ఐ విల్ మిస్ యు సో మచ్’ అని రాసిన టీ షర్ట్‌ను ప్రదర్శించి డిమారియా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘అమ్మమ్మ మృతి చెందిన విషయం తెలిసినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ఆడాలనుకున్నాను. నేను జాతీయ జట్టుకు ఆడినందుకు ఆమె ఎంతో గర్వపడింది’ అని డిమారియా మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. -
చిలీకి అర్జెంటీనా షాక్
శాంతా క్లారా(కాలిఫోర్నియా): కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనా శుభారంభం చేసింది. గ్రూప్-డిలో భాగంగా మంగళవారం(భారత కాలమాన ప్రకారం) జరిగిన పోరులో అర్జెంటీనా 2-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చిలీకి షాకిచ్చింది. గతేడాది జరిగిన ఫైనల్లో పోరులో చిలీ చేతిలో ఓటమి పాలైన అర్జెంటీనా అందుకు బదులు తీర్చుకుంది. ఆట రెండో అర్థభాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసి చిలీకి షాకిచ్చింది. ఆట 54వ నిమిషంలో ఏంజెల్ డి మారియా, 59వ నిమిషంలో బనేగా తలో గోల్ చేసి అర్జెంటీనా విజయానికి సహకరించారు. కాగా ఆట చివరిలో చిలీ గోల్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం వరల్డ్ టాప్ ర్యాంకులో ఉన్న అర్జెంటీనా కోపా అమెరికా కప్‌ను 14 సార్లు గెలవగా, 2015లో సొంత గడ్డపై జరిగిన ఈ టోర్నమెంట్లో మాత్రమే చిలీ విజేతగా నిలిచింది. -
చిలీలో భూకంపం
శాండియాగో: చిలీ రాజధాని శాండియాగోలో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఈ భూకంప ధాటికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. పశ్చిమ ఓవల్లేకు 40 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న దేశం కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సునామీ వచ్చే అవకాశాలను అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు చెబుతున్నారు. -
చిలీలో భూకంపం..
సాంటియాగో: నాలుగు రోజుల కిందట పక్కదేశం పెరూలో సంభవించిన ప్రకంపనలకు వణికిపోయిన చిలీలో మళ్లీ భారీ భూకంపం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.2గా నమోదయింది. తాల్తాల్ నగరానికి ఉత్తర దిశలో 69 కిలోమీటర్ల వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియాలజికల్ సర్వే సంస్థ తెలిపింది. మంగళవారం పెరూలో 7.5 తీవ్రతగా నమోదయిన భూకంపం పొరుగుదేశాలు చిలీ, అర్జెంటీనాలను వణికించిన సంగతి తెలిసిందే. కాగా భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిదీ లేనిదీ తెలియాల్సిఉంది. దక్షిణ అమెరికా ఖండంలో తరచూ భూకంపాలు చోటుచేసుకునే చిలీలో గత సెప్టెంబర్ లో సంభవించిన భూకంపం కారణంగా ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. 2010లో 8.8 తీవ్రత సంభవించిన భూకంపం ఆ దేశ చరిత్రలోనే అతిభారీ భూకంపం. నాటి దుర్ఘటనలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. -
సునామీ ఎందుకు వస్తుంది..?
జపాన్ తీర ప్రాంత గ్రామాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని సూచించారు. గురువారం చిలీలో 8.3 తీవ్రతతో భూకంపం సంభవించి 11 మంది మృత్యువాత పడ్డారు. చిలీ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 'సునామీ' పై క్విక్ రివ్యూ... సునామీ అంటే? Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సునామీ ఎప్పుడు వస్తుంది? భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా సముద్ర గర్భంలో సునామీలు రావడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఎక్కువగా భూకంపాల వల్ల 75 శాతం, అగ్ని పర్వతాల వల్ల 5 శాతం, సముద్రంలో భూతాపం వల్ల 8-10 శాతం, ఇతర కారణాల వల్ల 10 శాతం, వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల వల్ల 2 శాతం సునామీలు సంభవిస్తున్నాయి. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. సునామీ నీటి కెరటమా? సాధారణంగా సునామీలు అలలలాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. సముద్రంలో కనిపించే గాలి కెరటాలు అంత లోతైనవి కావు. ఈ కెరటాలు తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. సునామీలు అధిక వేగం కలిగి ఉండి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల భవనాలు, పడవలు, భారీ నిర్మాణాలు కూడా ధ్వంసమయ్యాయి. -
చిలీలో భారీ భూకంపం
-
చిలీ భూకంపంలో తొలి మరణం
శాండియాగో: చిలీలో భారీ భూకంపంవల్ల తొలి మరణాన్ని అధికారులు ధృవీకరించారు. తీరం వెంబడి ఉన్న రాజధాని ప్రాంతంలో పలు భవనాలు భూకంపం వల్ల తలెత్తిన సునామీ బారిన పడ్డాయని, ప్రస్తుతానికి స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభవించినట్లు అధికారులు తెలియజేశారు. ప్రకంపనలు మాత్రం వెన్నులో వణుకుపుట్టించాయని, పక్క దేశాలైన బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనాలకు కూడా వాటి ప్రభావం కనిపించిందని చెప్పారు. ప్రస్తుతానికి వరదలు పోటెత్తాయని, వీధుల్లో కూడా పారుతున్నాయని వివరించారు. 2010లో వచ్చిన సునామీ తర్వాత అంతటి భారీ స్థాయి సునామీ వస్తుందని ఒక్కసారిగా భయపడినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఐదుగురు వరకు మరణించి ఉండొచ్చని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. -
న్యూజిలాండ్‌లోనూ సునామీ హెచ్చరికలు
వెల్లింగ్టన్: చిలీలో భారీ భూకంపం సంభవించిన తర్వాత దాని చుట్టుపక్కల దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ దాని పక్కనే ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైంది. చిలీ భూకంపం వల్ల న్యూజిలాండ్‌లో ఉన్న సముద్ర తీరంలో కూడా రాకాసి అలలు ఎగిసి పడుతుండటంతో ముందుగానే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత వాసులు తమ నివాసాలను వదిలి దూరంగా వెళ్లాలని, వారిని సురక్షిత ప్రాంతాల తరలింపు చర్యలకు దిగాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. నదులపక్కకు, జల పాతల వద్దకు ఎవరూ వెళ్లకూడదని, పడవ ప్రయాణాలు, బోటింగ్ వంటివాటిని పూర్తిగా నిషేధించాలని పకడ్బందీ అదేశాలు జారీ చేసింది. చిలీలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.3గా నమోదైన ఈ భూకంప కేంద్ర సముద్రంలో కేంద్రీకృతమవ్వడంతో పసిఫిక్ తీరమంతటా సముద్ర అలలు ఎగిసి పడుతున్నాయి. ముఖ్యంగా వాల్పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో సునామీ సైరన్ మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. -
చిలీలో భారీ భూకంపం
-
చిలీలో భారీ భూకంపం
శాండియాగో: చిలీలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.3గా నమోదైంది. సముద్రంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమవ్వడంతో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రాజధాని శాండియాగోకు వాయువ్యం దిశలో 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. వాల్పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో సునామీ సైరన్ మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. 3 మీటర్ల కన్నా ఎత్తైన అలలతో కూడిన సునామీ చీలీ తీర ప్రాంతాన్నితాకే ప్రమాదముందని సునామీ హెచ్చరికల జారీ కేంద్రం హెచ్చరించింది. దీంతో తీర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
నిజంగా ఆ 'కిక్' అద్భుతం!
శాంటింగో:కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ- 2015లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన ఫైనల్ పోరులో చిలీ ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు కోచ్ జార్జ్ సాంపౌలీ ఆనందంలో మునిగితేలుతున్నాడు. పెనాల్టీ షూటౌట్ లో చిలీ విజయం కైవశం చేసుకోవడంతో తమ చిరకాల కోరిక నెరవేరిందన్నాడు. ఆ షూటౌట్ విజయం నిజంగా అద్భుతమైనది అభివర్ణించాడు. పెనాల్టీ షూటౌట్ లో అలెక్సిస్ శాంచెజ్ అద్భుతం చేసి తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే, నమ్మశక్యం కాని ఆనందాన్నిచ్చాడన్నాడు. 'ఆ పెనాల్టీ విజయం నాకు మరిచిపోలేని జ్ఞాపికను అందించింది. జట్టు సమిష్టిగా రాణించి అర్జెంటీనాను కంగుతినిపించింది. మా ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాం. బలమైన అర్జెంటీనాను మట్టికరిపించాలంటే బంతిని ఎక్కువ సమయం తమ అధీనంలోనే ఉంచుకోవాలనే మా వ్యూహం విజయవంతమైంది. ఈ ఆనంద క్షణాల్ని ఆటగాళ్లతో కలిసి పంచుకోవాలనుకుంటున్నా' అని సాంపౌలీ తెలిపాడు. శాండియాగోలో ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్స్‌లో ఆతిథ్య చిలీ.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 4-1 తేడాతో మట్టికరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ నిర్ణీత సమయానికి గోల్ సాధించకపోవడంతో ఎక్స్ట్రా టైమ్ ఆడాల్సి వచ్చింది. అదికూడా డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూట్ అవుటే శరణ్యమైంది. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ- 2015లో చిలీ విజేతగా నిలవడంతో వారి 99 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. శాండియాగోలో ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్స్‌లో ఆతిథ్య చిలీ.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 4-1 తేడాతో మట్టికరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ నిర్ణీత సమయానికి గోల్ సాధించకపోవడంతో ఎక్స్ట్రా టైమ్ ఆడాల్సి వచ్చింది. అదికూడా డ్రాగా ముగియడంతో షూట్ అవుటే శరణ్యమైంది. చిలీ గోల్ కీపర్ క్లౌడియో బ్రావో సమయ స్పూర్తితో ఒక గోల్ తప్పించడం, అర్జెంటీనా ఆటగాళ్లుకూడా బంతిని గోల్ పోస్టులోకి పంపడంలో రెండు దఫాలు విఫలం కావడంతో 4-1 తేడాతో చిలీ విజయం సాధించింది. -
'కోపా' కప్ విజేత చిలీ
-
మెస్సీ కుటుంబంపై చిలీ అభిమానుల దాడి
శాండియాగో: అభిమానం అదుపుతప్పింది. క్రీడాస్ఫూర్తి మంటకలిసింది. ఇరు జట్ల అభిమానులు పరస్పరం దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆటగాళ్లకు చెందిన కుటుంబసభ్యులపై దాడులకు తెగబడ్డారు. ఇదీ.. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా శాండియాగోలోని ఎస్టాడియో నేషనల్ స్టేడియంలో చోటుచేసుకున్న పరిస్థితి. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరుజట్లూ అద్భుతంగా ఆడటంతో ఒక్క గోల్ కూడా నమోదుకాలేదు. చివరికి షూట్ అవుట్ ద్వారా ఆతిథ్య చిలీ జట్టు 4-1 తేడాతో విజేతగా నిలిచిందిది. కాగా, ఫస్ట్‌హాఫ్ విరామంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ కుటుంబసభ్యులను ఉద్దేశించి కొందరు చిలీ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోపోద్రిక్తుడైన మెస్సీ సోదరుడు రొడ్రిగో ఘాటుగా ప్రతిస్పందించాడు. దీంతో ఇరు బృందాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఒక దశలో మెస్సీ కుటుంబసభ్యులను చిలీ అభిమానులు తోసివేసినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు మెస్సీ సోదరుణ్ని టీవీ క్యాబిన్‌కు తరలించారు. మిగతా మ్యాచ్ ను అక్కడినుంచే వీక్షించాలని, గ్యాలరీలోకి వెళ్లొద్దని రొడ్రిగోను పోలీసులు అభ్యర్థించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిసింది. -
'కోపా' కప్ విజేత చిలీ
శాండియాగో: 99 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ- 2015లో చిలీ విజేతగా నిలిచింది. శాండియాగోలో ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్స్‌లో ఆతిథ్య చిలీ.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 4-1 తేడాతో మట్టికరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ నిర్ణీత సమయానికి గోల్ సాధించకపోవడంతో ఎక్స్ట్రా టైమ్ ఆడాల్సి వచ్చింది. అదికూడా డ్రాగా ముగియడంతో షూట్ అవుటే శరణ్యమైంది. చిలీ గోల్ కీపర్ క్లౌడియో బ్రావో సమయ స్పూర్తితో ఒక గోల్ తప్పించడం, అర్జెంటీనా ఆటగాళ్లుకూడా బంతిని గోల్ పోస్టులోకి పంపడంలో రెండు దఫాలు విఫలం కావడంతో 4-1 తేడాతో చిలీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఫైనల్స్ లో దురదృష్టం మెస్సీ సేన వెన్నంటే ఉంటుందని రుజువైంది. గత ఏడాది ఫిఫా వరల్డ్ కప్ లోనూ ఫైనల్స్ వరకు వెళ్లిన మెస్సీ సేన జర్మనీ చేతిలో 1-0 తేడాతో పరాజయంపాలైన సంగతి తెలిసిందే. -
కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ
-
అర్జెంటీనా వర్సెస్ చిలీ
కొన్సెప్స్జన్ (చిలీ): చారిత్రక కోపా అమెరికా- 2015 ఫుట్‌బాల్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) కొన్సెప్స్జన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్స్‌లో పరాగ్వేను 1- 6 గోల్స్ తేడాతో మట్టికరిపించిన అర్జెంటీనా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మొదటి సెమీస్‌లో చిలీ 2- 1 తేడాతో పెరూపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ట్రోఫీ కోసం అర్జెంటీనా, చిలీల మధ్య జరిగే ఫైనల్స్‌కు శాంటియాగోలోని ఎస్టాడియో నేషనల్ స్టేడియం వేదికకానుంది. శనివారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తుది సమయం ప్రారంభంకానుంది. చివరిసారిగా 1993లో కోపా అమెరికా విజేతగా నిలిచిన అర్జెంటీనాకు ఆ టోర్నీల్లో ఇది 14వ ఫైనల్స్ కాగా ఆతిధ్య చిలీ 28 ఏళ్ల తర్వాత ఫైనల్స్‌కు చేరింది. -
‘కోపా’ సెమీస్‌లో చిలీ
క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 1-0తో గెలుపు సాంటియాగో: మ్యాచ్ చివరి దశలో అమోఘమైన ఆటతీరుతో చెలరేగిన చిలీ... కోపా అమెరికా కప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో 1-0తో డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వేపై విజయం సాధించింది. దీంతో తొలిసారి కోపా కప్‌ను గెలవాలన్న కలకు చిలీ మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. డిఫెండర్ మురిసియో ఇస్లా (81వ ని.) చిలీ తరఫున ఏకైక గోల్ సాధించాడు. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
చిలీలో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 6.4గా నమోదు
శాంటియాగో: దక్షిణ చిలీలోని తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వీస్ శనివారం వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ జరగలేదని తెలిపింది. సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రకటించింది. రాజధాని శాంటియాగోకు 88 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ భూకంపం శుక్రవారం రాత్రి సంభవించిందని తెలిపింది. -
అగ్నిపర్వతం ప్రళయం
-
42 ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్ని పర్వతం
శాంటిగో: చిలీలో మరో అగ్ని పర్వతం బద్ధలైంది. దాదాపు 42 సంవత్సరాల తర్వాత కాల్బుకో అనే అగ్ని పర్వతం గతంలో లేనంత స్థాయిలో విస్ఫోటనం చెందింది. దీంతో, దాదాపు 1,500 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఇందులో నుంచి దట్టమైన పొగలు మాత్రమే రావడం తప్ప పెద్దగా లావాలుగానీ, అగ్ని జ్వాలలుకానీ రాకపోవడంతో అక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్తతో అప్రమత్తత ప్రకటించారు. అసలు తాము కాల్బుకో అగ్ని పర్వతం తమ దృష్టిలో లేదని, అది పేలుతుందన్న ఆలోచన కూడా తమకు రాలేదని అక్కడి భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. 1972లో ఒకసారి కాల్పుకో బద్ధలైంది. చిలీలో మొత్తం 90 అగ్ని పర్వతాలు ఉండగా అందులోని అత్యంత ప్రమాదమైన మూడు అగ్ని పర్వతాల్లో ఇదొకటి. -
అక్కడ మనుషులపైకి సింహాలు వదులుతారు!
మృగరాజు సింహం మీద వస్తుంటే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి. కానీ చిలీలో ఓ జంతు ప్రదర్శనశాలలో సింహాలకు ఏకంగా మనుషుల మీదకే వదులుతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సాధారణంగా జంతు ప్రదర్శనశాలలో క్రూర మృగాలను బోనుల్లో బందిస్తారు. కానీ చిలీలోని పాక్వీ సఫారీ జూలో సింహాలను స్వేచ్ఛగా వదిలేస్తారు. సందర్శకులను మాత్రం బోనులో పెడతారు. ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాల్లో సందర్శకులను సింహాల మధ్యకు తీసుకెళతారు. సింహాలను బోనుల్లోంచి దగ్గర చూసే అవకాశం ఇక్కడ కల్పిస్తారు. మృగరాజులు మనుషులపైకి దూకాలన్నా సాధ్యం కాదు కాబట్టి అక్కడే కాసేపు తచ్చాడి నిరాశగా వెనుదిరుగుతాయి. క్రూరమృగాలకు దగ్గరగా చూడాలనుకునే సాహసికులకు పాక్వీ జూ సరైన స్థలం. సర్కస్ లలో హింసకు గురైన అడవి జంతువులను ఇక్కడవుంచి సంరక్షిస్తున్నారు. సింహాలతో పాటు ఎలుగుబంటులు, కోతులు, ఏనుగు, జిరాఫీలు ఇక్కడ ఉన్నాయి.