
ఫైల్ ఫోటో
శాంటియాగో: చిలీ దేశానికి చెందిన సీ-130 మిలిటరీ విమానం అదృశ్యమైంది. అంటార్కిటికా ప్రాంతం గుండా వెళ్తున్న ఈ విమానం నుంచి ఎటువంటి సిగ్నల్ రాకపోవటంతో అదృశ్యం అయినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుందని.. ఈ విమానంలో 21 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మిలిటరీ సిబ్బంది.. విమానం ఆచూకి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై ఆ దేశ ఆధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా స్పందించారు. ‘రక్షణ శాఖ, విమానయాన శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన విషయాలను, గాలింపు చర్యలను పర్యవేక్షించాలి’ అని ఆయన ఆదేశించారు.
కాగా సీ-130 విమానం సోమావారం సాయంత్రం 4:55 గంటలకు గగనతలంతోకి ప్రవేశించింది. రాజధాని శాంటియాగో నుంచి 3,000 కిలోమీటర్ల వరకు విమానానికి సంబంధించిన సమాచారం ఎయిర్‌పోర్టు అధికారుల పర్యవేక్షణలో ఉంది. కాని ఒక్కసారిగా 6:13 గంటలకు రాజధాని శాంటియాగోకు దక్షిణంగా ఉన్న పుంటా అరేనాస్ నగరం దగ్గర విమనానం సిగ్నల్ కోల్పోయిందని అధికారులు తెలిపారు. వాతావారణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన విమానానికి సంబంధించిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వైమానిక దళానికి చెందిన జనరల్ ఎడ్వర్డో మోస్క్వైరా తెలిపారు. ఈ విమాన పైలట్‌కి విస్తృతమైన అనుభవవం ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment