missing aircraft
-
విమాన ప్రయాణం విషాదాంతం
ఖాట్మండు: నేపాల్‌లో తారా ఎయిర్ సంస్థకు చెందిన 43 ఏళ్లనాటి పాత విమానం ఆదివారం నేలకూలి మంటల్లో చిక్కుకుంది. శకలాలను గుర్తించారు. రెండు ఇంజన్లు గల ఈ చిన్నపాటి ప్యాసింజర్ విమానంలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు. సెంట్రల్ నేపాల్‌లో పర్యాటక నగరమైన పొఖారా నుంచి సరిగ్గా ఉదయం 10.15 గంటలకు బయలుదేరింది. పశ్చిమ నేపాల్‌లోని జోమ్సమ్ ఎయిర్‌పోర్టులో ఉదయం 10.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా, బయలుదేరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు తారా ఎయిర్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా చెప్పారు. ముస్తాంగ్ జిల్లాలోని కోవాంగ్ గ్రామం వద్ద మనపతీ హిమాల్ కొండచరియల కింద లామ్చే నది ఒడ్డున విమానం శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా పైలట్ ప్రభాకర్ ఘిమిరే మొబైల్ సిగ్నల్స్ ట్రాక్ చేసి, విమానం జాడ కనిపెట్టినట్లు నేపాల్ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అయితే, ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. ప్రయాణికుల్లో ముంబై సమీపంలోని థానేకు చెందిన ఆశోక్ కుమార్ త్రిపాఠి, ఆయన భార్య వైభవీ బండేకర్, వారి పిల్లలు ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠితోపాటు ఇద్దరు జర్మనీ పౌరులు, 13 మంది నేపాలీలు, ముగ్గురు నేపాల్ సిబ్బంది ఉన్నట్లు తారా ఎయిర్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా వెల్లడించారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేపాల్‌లో 2016లో తారా ఎయిర్‌కు చెందిన విమానం ఇదే పొఖారా–జోమ్సమ్ మార్గంలో కూలిపోయింది. విమానంలోని 23 మంది దుర్మరణం పాలయ్యారు. A Tara Air flight carrying 19 passengers from Pokhara to Jomsom has been reported to have lost contact with the control tower. Aircraft: De Havilland Canada DHC-6-300 Twin Otter Reg: 9N-AET@flightradar24 @KanakManiDixit @HArjyal pic.twitter.com/2H1KI3u1Oy — NepalLinks (@NepaliPodcasts) May 29, 2022 The flight manifest. Source: Devendra Dhakal FB pic.twitter.com/9bTCfvNIBQ — Kanak Mani Dixit (@KanakManiDixit) May 29, 2022 -
విమానం అదృశ్యం: 21 మంది ప్రయాణికులు సహా..
శాంటియాగో: చిలీ దేశానికి చెందిన సీ-130 మిలిటరీ విమానం అదృశ్యమైంది. అంటార్కిటికా ప్రాంతం గుండా వెళ్తున్న ఈ విమానం నుంచి ఎటువంటి సిగ్నల్ రాకపోవటంతో అదృశ్యం అయినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుందని.. ఈ విమానంలో 21 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మిలిటరీ సిబ్బంది.. విమానం ఆచూకి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై ఆ దేశ ఆధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా స్పందించారు. ‘రక్షణ శాఖ, విమానయాన శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన విషయాలను, గాలింపు చర్యలను పర్యవేక్షించాలి’ అని ఆయన ఆదేశించారు. కాగా సీ-130 విమానం సోమావారం సాయంత్రం 4:55 గంటలకు గగనతలంతోకి ప్రవేశించింది. రాజధాని శాంటియాగో నుంచి 3,000 కిలోమీటర్ల వరకు విమానానికి సంబంధించిన సమాచారం ఎయిర్‌పోర్టు అధికారుల పర్యవేక్షణలో ఉంది. కాని ఒక్కసారిగా 6:13 గంటలకు రాజధాని శాంటియాగోకు దక్షిణంగా ఉన్న పుంటా అరేనాస్ నగరం దగ్గర విమనానం సిగ్నల్ కోల్పోయిందని అధికారులు తెలిపారు. వాతావారణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన విమానానికి సంబంధించిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వైమానిక దళానికి చెందిన జనరల్ ఎడ్వర్డో మోస్క్వైరా తెలిపారు. ఈ విమాన పైలట్‌కి విస్తృతమైన అనుభవవం ఉందని ఆయన పేర్కొన్నారు. -
వారంతా అమరులయ్యారు
న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిపోయిన ఏఎన్–32 విమానంలో ఉన్న 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం ధ్రువీకరించింది. గురువారం దట్టమైన అటవీ ప్రాంతంలో విమాన శకలాల కోసం సహాయక బృందం గాలింపులో ఈ విషయం వెల్లడైంది. ‘జూన్ 3న జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన వైమానిక వీరులకు భారత వైమానిక దళం నివాళులు అర్పిస్తోంది. వారి ఆత్మ శాంతించాలి. వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’ అని వాయుసేన అధికార ప్రతినిధి ఒకరు గురువారం పేర్కొన్నారు. రష్యాలో తయారైన ఏఎన్–32 విమానం అస్సాంలోని జొహ్రాట్ ప్రాంతం నుంచి చైనా సరిహద్దులోని మెంచుకాకు జూన్ 3న బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి గాలించగా 8 రోజుల తర్వాత సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దులో మంగళవారం ఈ విమాన శకలాలు దొరికాయి. 13 మంది యుద్ధవీరులు అందించిన సేవలను దేశం ఎప్పుడూ మరిచిపోదని ట్విటర్లో కాంగ్రెస్ పేర్కొంది. వారి మృతిపట్ల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం పది విమానాలను భారత వాయుసేన కోల్పోయింది. కోల్పోయిన విమానాల్లో ఒక మిరాజ్, ఒక జాగ్వార్, ఒక ఎంఐ17వీ5 హెలికాప్టర్, రెండు హాక్ రకం విమానాలు, రెండు మిగ్ రకం విమానాలు ఉన్నాయి. -
మూడు రోజులైనా జాడ లేని విమానం
న్యూఢిల్లీ : గత మూడు రోజులుగా ఆచూకీ లభించని ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 13 మంది సభ్యులతో కూడిన ఏఎన్-32 విమానం అసోంలోని జోర్హాట్ నుంచి సోమవారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆచూకీ గల్లంతైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా బేస్‌లో విమానం ల్యాండ్ కాకపోవడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసినా ఇప్పటివరకూ విమానం జాడ పసిగట్టలేకపోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ సియోంగ్ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో పలు బృందాలు విమానం ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండటంతో పాటు ప్రతికూల వాతావరణం గాలింపు చర్యలకు అవరోధంగా మారాయి. హెలికాఫ్టర్లు, ఇస్రో శాటిలైట్లు, నేవీకి చెందిన పీ-8ఐ విమానం సహా పలు బృందాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
విమానం జాడలేదు.. నాన్న కాల్ రాలేదు!
న్యూఢిల్లీ: బంగళాఖాతం సముద్రంలో తప్పిపోయిన భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) ఏఎన్-32 యుద్ధం విమానం ఆచూకీ కోసం ముమ్మరంగా జరుగుతున్న గాలింపులు ఆదివారం నాటికి మూడోరోజుకు చేరుకున్నాయి. అయినా ఇప్పటివరకు ఈ విమానం జాడ లభించలేదు. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతైంది. ఈ విమానంలో నలుగురు అధికారులు సహా.. మొత్తం 29మంది సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో గల్లంతైన విమానంలోని తమ వారి భద్రతపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారు క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ‘విమానంలో ఉన్న మా నాన్న, ఇతర సిబ్బంది క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. విమానానికి ఏమైందోనన్న ఆందోళన మమ్మల్ని వేధిస్తోంది. అది ఎక్కడ ఉందన్న విషయమై ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం అందలేదు’ అని అశుతోష్ సింగ్ తెలిపారు. అశుతోష్ తండ్రి, ఐఏఎఫ్ అధికారి భూపత్ సింగ్ తప్పిపోయిన ఏఎన్ 32 యుద్ధవిమానంలో ఉన్నారు. ‘పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లగానే కాల్ చేస్తానని మా నాన్న చెప్పారు. కానీ ఆయన నుంచి ఎలాంటి కాల్ రాలేదు. ఆయన సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఆయనను మేం ఎంతగానో మిస్సవుతున్నాం’ అని అశుతోష్ చెప్పారు. విమానం మూడురోజులవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందకపోవడం తమను వేదనకు గురిచేస్తున్నదని తప్పిపోయిన విమానంలో ఉన్న మరో ఐఏఎఫ్ అధికారి భార్య సంగీత మీడియాకు తెలిపారు.