శాండియాగో: చిలీ రాజధాని శాండియాగోలో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఈ భూకంప ధాటికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. పశ్చిమ ఓవల్లేకు 40 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న దేశం కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సునామీ వచ్చే అవకాశాలను అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు చెబుతున్నారు.