చిలీ సముద్ర తీరం మీద మరోసారి భూకంపం విరుచుకుపడింది. బుధవారం 8.3 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరోసారి 7.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా తెలిపింది.
ఈ భూకంపం సముద్ర తీరంలో రావడంతో భూకంపకేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉన్నట్లు సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. బుధవారం వచ్చిన భూకంపం వల్ల కూడా సునామీ రావచ్చని పేర్కొన్నా.. ఆ ప్రమాదం మాత్రం రాలేదు. అయినా, ముందుజాగ్రత్త చర్యగా తీరప్రాంతాల్లోని వారిని ప్రభుత్వం ఖాళీ చేయించింది.
చిలీ సముద్రతీరంలో మరో భూకంపం
Published Thu, Apr 3 2014 10:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
Advertisement
Advertisement